notebook
-
ఏంటో నా జీవితం... పిచ్చిలేస్తోంది
శామీర్‌పేట్: ‘నాకు ఏమీ రావు.. ఏంటో నా జీవితం.. పిచ్చిలేస్తుంది.. అసలు లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా.. నాకు చనిపోవాలనిపిస్తుంది’ అంటూ స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగ వెంకటరమణ–లక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం తుర్కపల్లికి వలస వచ్చి ఉమాశంకర్ రైస్‌మిల్‌లో కారి్మకులుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురు తేజస్విని సాయిదుర్గాలక్ష్మి (16) గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 3న తలనొప్పిగా ఉందని తేజస్విని స్కూల్‌కు వెళ్లలేదు. రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేసి నిద్రించారు. శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తల్లి లక్ష్మి బాత్ రూంకు వెళ్లగా తేజస్విని బాత్రూంలో చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో స్కూల్ నోట్ బుక్‌లో సూసైడ్ నోట్ గుర్తించారు. కాగా తేజస్విని అతిగా నిద్రించేదని, తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
కన్నీటి వీలునామా
సెప్టెంబర్ 30న గాజాలో ఒక ఇంటి మీద ఇజ్రాయిల్ బాంబు వేసింది. ఆ ఇంటిలోని 10 ఏళ్ల పాప, ఆమె 11 ఏళ్ల సోదరుడు మరణించారు. తల్లిదండ్రులు వారిని అంతిమంగా సాగనంపి పాప నోట్‌బుక్ తెరిస్తే ఈ మరణాన్ని, ఇలాంటి మరణాన్ని ఊహించి, గాజాలో కొంతకాలంగా మరణించిన16,700 మంది పిల్లలతో పాటు తానూ చేరక తప్పదని తెలిసి ఆ పాప నోట్‌బుక్‌లో వీలునామా రాసి వెళ్లింది. ఆ వీలునామాలో తొలి వాక్యం ‘నేను చనిపోతే ఏడ్వొద్దు’ అని.గాజా పసిపిల్లలు జీవించి ఉన్నారంటే వారు చిరంజీవులయ్యారని కాదు. వారి ఊపిరి కాలం పొడిగింప బడిందనే అర్థం. ఇక్కడ చూడండి... జూన్ 10న గాజాలోని ఒక ఇంటి మీద బాంబు జారవిడిచింది ఇజ్రాయిల్. ఆ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఇరుగూ పొరుగూ కలిసి లోపల ఉన్న భార్యాభర్తల్ని వారి కుమారుడు 11 ఏళ్ల అహ్మద్‌ని కూతురు 10 ఏళ్ల రాషాను బయటకు తీసుకొచ్చారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఇజ్రాయిల్ ఆ ఇంటి మీద బాంబు ఎందుకు వేసింది? కారణం ఏమీ లేదు. మొన్నటి సెప్టెంబర్ 30 వరకూ కూడా ఆ కుటుంబం ఆకలిదప్పులతో వేదనలతో బతికింది. అయితే ఇజ్రాయిల్ తిరిగి సెప్టెంబర్ 30న మరో బాంబు అదే ఇంటి మీద వేసింది. కారణం ఏమిటి? ఏమీ లేదు. కాని దురదృష్టం.. ఈసారి రాషా, ఆమె సోదరుడు అహ్మద్ మృతి చెందారు. (ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు)తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో వారిని సాగనంపి తిరిగి వచ్చాక రాషా నోట్ పుస్తకంలో రాసిన తన వీలునామా కనిపించింది. అప్పటి వరకూ వారికి ఆ చిన్నారి అలాంటి వీలునామా రాసి ఉంటుందని తెలియదు. ఆ పాప అప్పటికే ఎందరో చిన్నపిల్లల మరణాలని చూసింది గాజాలో. మాట్లాడుకుంటుంటే వినింది. కనుక తాను కూడా చనిపోతానని భావించిందో ఏమో నోట్‌బుక్‌లో వీలునామా ఇలా రాసింది.రాషా రాసిన ఈ వీలునామాను ఆమె మేనమామ అసిమ్ అలనబి లోకానికి చూపించాడు. రాషా ఎందుకనో తాను మరణించి తన సోదరుడు బతుకుతాడని ఆశించింది. ఆమె సోదరుడు అహ్మద్ గడుగ్గాయి. అల్లరి చేసినా అందరూ వాణ్ణి ప్రేమించేవారట. గదమాయిస్తూనే దగ్గరికి తీసుకునేవారట. కాని ఆమెతో పాటు ఆ ముద్దుల సోదరుడు కూడా మరణించాడు. గాజాలో రోజూ వందలాది మంది పిల్లలు చనిపోతున్నారు. గాజాలో పిల్లల గుండెల్లో ఎన్ని మూగబాధలు చెలరేగుతున్నాయో దూరంగా నిశ్చింతగా ఉంటూ తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు.ఏ యుద్ధమైనా, ఎటువంటి ద్వేషమైనా, ఏ విషబీజాలైనా, ఎటువంటి వివక్ష అయినా అంతిమంగా ముందు పిల్లల్ని బాధిస్తుంది. పిల్లల్లో ఉండే కరుణను పెద్దలు ఎప్పటికైనా అందుకోగలరా?‘నేను చనిపోతే నా కోసం ఎవరూ ఏడ్వద్దు. ఎందుకంటే మీ కన్నీళ్లు నాకు నొప్పి కలిగిస్తాయి. నా దుస్తులు అవసరమైనవారికి ఇస్తారని భావిస్తాను. నా అలంకార వస్తువులు రాహా, సరా, జూడీ, బతుల్, లానాల మధ్య సమానంగా పంచాలి. నా పూసల పెట్టె ఇకపై పూర్తిగా అహ్మద్, రాహల సొంతం. నాకు నెలవారీ అలవెన్సుగా వచ్చే 50 షెకెల్స్ (ఒక షెకెల్ 22 రూపాయలకు సమానం) సగం రాహాకు, సగం అహ్మద్‌కు ఇవ్వండి. నా కథలు, నోట్ పుస్తకాలు రాహావి. నా బొమ్మలు బతూల్వి. మరోటి, మా అన్న అహ్మద్‌ను గదమాయించొద్దు. ఈ కోరికలు నెరవేర్చండి’... -
టెక్...టాక్
వివో వి27 ప్రో సైజ్: 6.78 అంగుళాలు బరువు: 182 గ్రా. మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్ 256జీబి 8జీబి ర్యామ్ 256జీబి 12జీబి ర్యామ్ డిస్ప్లే: 1080“2400 పిక్సెల్స్ ఫీచర్స్: డ్యూయల్–ఎల్ఈడీ ఫ్లాష్ వోఎస్: ఆండ్రాయిడ్ 13, ఫన్‌టచ్ 13 కలర్స్: బ్లాక్, మింట్ రీయూజబుల్ నోట్‌బుక్ పేపర్ వృథా కాకుండా రూపొందించిన ఎకో–ఫ్రెండ్లీ రీయూజబుల్ నోట్‌బుక్ ఇది. బ్రాండ్: రాకెట్ సైజ్: 8.5“9.5 పేజీలు: 82 ► పైలట్ ఫ్రిక్సియన్ పెన్ డెస్క్‌టాప్ వాక్యూమ్ క్లీనర్ బ్రాండ్: రెమ ఎక్స్ఎక్స్ ఫిల్టర్టైప్: ఫోమ్ ► మల్టీపుల్: డెస్క్‌టాప్, లాప్టాప్...మొదలైనవి. ►హైస్పీడ్ సెంట్రెఫిగల్ ఫ్యాన్ ► ఫామ్ ఫ్యాక్టర్: హ్యాండ్ హెల్డ్ -
హానర్ తొలి ల్యాప్‌టాప్ వచ్చేసింది
సాక్షి, ముంబై: కరోనా కాలంలో ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో హానర్ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. హానర్ మ్యాజిక్ బుక్ 15 పేరుతో శుక్రవారం తన తొలి ల్యాపటాప్ను భారత దేశంలో లాంచ్ చేసింది. విండోస్ ముందే ఇన్స్టాల్ చేసిన ఈ ల్యాపటాప్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఏఎంబీ రైజెన్ 3000 సిరీస్ సీపీయూలు, వేగా గ్రాఫిక్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ కలర్ వేరియంట్లో లభ్యం. ఇది ఆగస్టు మొదటి వారం నుంచి సేల్కు అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ గా రాయితీ ధరను హానర్ ప్రకటించింది. ధర, లభ్యత హానర్ మ్యాజిక్ బుక్ 15 ధర 42,990 రూపాయలు. మిస్టిక్ సిల్వర్ కలర్లో ఆగస్టు 6న ఉదయం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌గా 3000 తగ్గింపుతో రూ. 39,990 రూపాయలకే లభ్యం. గ్లోబల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరిలో లాచ్ అయిన సంగతి తెలిసిందే. హానర్ మ్యాజిక్ బుక్15 స్పెసిఫికేషన్లు విండోస్ 10 హోమ్ (ప్రీ లోడెడ్‌గా) 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే 1920x1080 పిక్సెల్స్ 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, యూటీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ 8 జీబీ ర్యామ్ 256జీబీస్టోరేజ్ టైప్-సీ పోర్ట్, 65 వాట్స్ చార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం రీచార్జ్ అవుతుందనీ, వీడియోలను నిరంతరం చూసినా బ్యాటరీ సమయం 6.3 గంటలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. సెక్యూరిటీ కోసం టూ-ఇన్-వన్ ఫింగర్ ప్రింట్ పవర్ బటన్ పాప్-అప్ వెబ్ క్యామ్‌ను కూడా జోడించింది. ఇంకా వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సి, యుఎస్బి 2.0, యుఎస్బి 3.0, హెచ్డిఎంఐ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది. -
‘కస్తూరిబా’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మధ్యలో చదువు మానేసిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా పాఠశాలలు ఆచరణలో చతికిలపడుతున్నాయి. పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థినుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు ప్రత్యేకాధికారులు మెనూ పాటించకుండా డబ్బులు నొక్కేసి నాసిరకం భోజనం పెడుతున్న దాఖలాలున్నాయి. చాలాచోట్ల విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించిన నోట్ బుక్‌లు, ట్రంకు పెట్టెలతోపాటు యూనిఫాంలు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుప్పట్లు లేకపోవడంతో రాత్రి వేళ దోమలతో ఇబ్బందులు పడడమేకాదు చలికి వణికిపోతున్నారు. ఈ ఇక్కట్లపై ‘సాక్షి’ విజిట్ చేయగా పాఠశాలల డొల్లతనం బట్టబయలైంది. చినగంజాంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో మొత్తం 200 మంది బాలికలున్నారు. పాఠశాల చుట్టూ గోడ లేకపోవడంతో వారికి రక్షణ కరువైంది. మర్రిపూడి మండలం రావిళ్లవారిపాలెం శివారులోని పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు మథనపడుతున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట పాఠశాల పక్కనే శ్మశానవాటిక ఉండటంతో విద్యార్థినులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. శవాలను తీసుకెళ్లేటప్పుడు పాఠశాల ముందు భాగంలో శవాన్ని దింపే కార్యక్రమం నిర్వహిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పొన్నలూరు మండలం కె.అగ్రహారంలోని కస్తూరిబా పాఠశాలలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పాఠశాలను పెద్ద గోడౌన్లో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు సామాన్లు పెట్టుకోవడంతోపాటు పాఠాలు కూడా అక్కడే వినాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం 104 మంది ఉండగా మరుగుదొడ్లు రెండు మాత్రమే ఉన్నాయి. పీసీపల్లి కస్తూరిబా పాఠశాలకు ప్రహరీ లేక బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెలిగండ్ల పాఠశాలలో లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగక రాత్రి పూట అనేక ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల బాలికలకు బోరింగ్ నీరే దిక్కు. బోర్లలోని ఫ్లోరైడ్ నీరు తాగలేక నానా అవస్థలు పడుతున్నారు. హనుమంతునిపాడు కస్తూరిబాలో బోరింగ్ నీరు తాగుతుండటంతో ఇటీవల కొందరు దురద, ఇతర చర్మవ్యాధులతో ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని ఆట స్థలం కొండలు, గుట్టలతో నిండిపోయింది. తరగతి గదుల్లోనే రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. = తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు విద్యార్థినులకు ఫ్లోరైడ్ నీరే దిక్కు. పాఠశాల చుట్టూ ముళ్లపొదలు, చెత్తచెదారం ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బాలికలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఊరికి దూరంగా బీడు భూముల్లో పాఠశాల ఉండటం, ప్రహరీ మధ్యలో ఆగిపోవడంతో రాత్రి పూట బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిబా పాఠశాలలో ఉడికీ ఉడకని అన్నంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లూరు, కురిచేడు, దొనకొండ పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో తరచూ విష సర్పాలు లోపలికి వస్తున్నాయి. తాళ్లూరు పాఠశాలలో సరిపడినన్ని బెంచీలు లేకపోవడంతో బాలికలు నేలపై కూర్చొంటున్నారు. డార్మేటరీ పూర్తి కాకపోవడంతో డైనింగ్ హాల్, పెట్టెల మధ్యనే నిద్రిస్తున్నారు. కురిచేడు విద్యాలయానికి కంప్యూటర్లు అందజేసిన అధికారులు ఇన్స్ట్ట్రక్టర్ను నియమించకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగావున్నాయి. రాచర్లలో అసంపూర్తిగా నిలిచిన భవనంలో విద్యార్థినులు ఆరు బయట నిద్రించాల్సి వస్తోంది. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కస్తూర్బా పాఠశాలల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
పెన్సిల్, పుస్తకం ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
పుస్తకాలు, పెన్సిల్ లాంటి చిన్న చిన్న వస్తువులు కొనేందుకు కూడా వెంటనే డబ్బులు ఇవ్వలేని తల్లిదండ్రుల నిస్సహాయత.. ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. రోజుకూలీగా పనిచేసే తండ్రి బిజోయ్ నాయక్.. ఇటీవల పక్షవాతం రావడంతో పనిలోకి వెళ్లలేకపోగా, మందుల ఖర్చు మరింతగా ఆ కుటుంబంపై పడింది. కుటుంబానికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడానికి తల్లి ఈశ్వరి నాలుగు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. ఒడిషాలోని గంజాం జిల్లా ఆస్కా పట్టణానికి చెందిన ఈ పేద కుటుంబంలోని పెద్ద కుమార్తె జయంతి (14) ఇటీవలే ఏడో తరగతిలోకి వచ్చింది. తనకు పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామగ్రి కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. అయితే, తమవద్ద ప్రస్తుతం అంత డబ్బు లేదని, కొన్నాళ్లు ఆగితే కొనిస్తామని వారు చెప్పారు. దీంతో ఏమీ లేకుండా స్కూలుకు వెళ్లడం అవమానంగా భావించిన ఆ చిన్నారి.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు ఆమె కేకలు విని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే 50 శాతానికి పైగా కాలిన గాయాలైన ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది.