అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు.
బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్‌బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు.
కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్‌ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు.
మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు
మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు.
రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు.
ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment