దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
రాజంపేటటౌన్: దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఆయన తిరుపతి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో వైఎస్సార్‌జిల్లా రాజంపేట వద్ద ఆయనకు అనారోగ్యానికి గురి కావడంతో స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆగిపోయారు. స్థానిక వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం మంత్రి మాణిక్యాలరావు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు.