minister manikyala rao
-
ఆలయాల భూములివ్వం
అరసవిల్లి (శ్రీకాకుళం) : ఆలయాల నిర్వహణ, అభివృధ్ది కోసం భక్తులు ఎంతో ఉదారంగా ఎకరాల కొలది విలువైన భూములను అప్పట్లో దానం చేసారని, ఆ ఆలయ భూములను రాష్ట్రంలో అల్పాదాయ పేదలకు ఇవ్వడం కుదరదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పష్టం చేసారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల దేవాలయాల భూములు దాతలిచ్చినవని, ఇవి ప్రభుత్వ భూములు కావని తేల్చిచెప్పారు. ఆలయ భూములను భూమి లేని, ఇళ్లు లేని పేదలకు ఇచ్చేందుకు వీలు లేదని, దీనికి అనుగుణంగానే ఆ భూమలు అన్యాక్రాంతం,ఆక్రమణలు జరగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కన్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ఈ ఏడాది దివ్య దర్శనం పేరిట 1.30 లక్షల మందికి ఉచితంగా తిరుపతి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను సందర్శించేలా యాత్రలు నిర్వహించామని, దీనికి అనూహ్య స్పందన లభించిందన్నారు. వచ్చే ఏడాది ఈయాత్ర భక్తుల సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో టిటిడి, దేవాదాయ శాఖ సంయుక్తంగా 500 దేవాలయాల నిర్మాణాలకు సంకల్పించామని త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రంలో అన్నవరం, సింహాచలం, విజయవాడ, ద్వారకాతిరుమల తదితర దేవాలయాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసామని, వీటిలో మిగులు విద్యుత్‌ను చిన్న దేవాలయాలకు సరఫరా చేస్తామని వివరించారు. దేవాలయాల్లో రోజు వారీ ఆదాయం, లెక్కలు, పూజలు ఆర్జిత పేవలు అన్నదానం తదితర వివరాలన్నీ వచ్చే నెల (జూలై) నుంచి ఆన్లైన్లో భక్తులందరికి కన్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయాల్లో ప్రతి విషయం భక్తులకు తెలిసేలా పారదర్శకంగా ఉండాలని ఈ మేరకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని తెలియజేసారు. అంతకుముందు ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తర్వాత ఆలయ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి అభివృద్ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మపై పత్రికల్లో వచ్చిన పలు కథనాలపై ఆయన స్పందిస్తూ, పూర్తి విచారణ చేయించి తగు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇవో వి.శ్యామలాదేవి, ఆలయ అర్చకుడు ఇప్పిలి నగేష్ శర్మ తదితరులున్నారు. -
'దేవాదాయశాఖ గుడ్డిగా నడుస్తోంది'
విశాఖపట్టణం : రాష్ట్రంలో దేవాదాయశాఖ గుడ్డిగా నడుస్తోందని ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశం హాల్లో శనివారం నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల దేవాదాయ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శాఖలో పనిచేస్తున్న వారిలో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని మండిపడ్డారు. ఇక నుంచి సీరియస్‌గా పనిచేయకపోతే ఉద్యోగాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని మాణిక్యాలరావు హెచ్చరించారు. ఉప కమిషనర్, సహాయ కమిషనర్ కార్యాలయాల్లో తప్పనిసరిగా కంప్యూటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని ఆదేశించారు. దేవాదాయశాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఇక నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరగాలని సూచించారు. ఆన్లైన్ సిస్టమ్‌పై సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించి అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఏ ఆలయంలో ఎంత మంది దర్శనం చేసుకుంటున్నారు. ఆదాయం ఎంత వస్తోంది.. తదితర అంశాలను ఏ రోజుకారోజు మెయిల్ ద్వారా పంపాలని ఆదేశించారు. పెద్ద ఆలయాల ద్వారా విద్యాదాన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయ సేవ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, దేవుడి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులను విసుక్కోకుండా గౌరవించి పంపాలని, భక్తులపై కేకలు వేస్తే సహించేది లేదన్నారు. దేవాలయాల ఆస్తులు కోర్టు పరిధిలో ఉంటే ప్రభుత్వం వైపు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. కార్యనిర్వహణాధికారుల పనితీరు, గతంలో వారు పనిచేసిన ఆలయాల్లో ఆదాయం ఎంత వచ్చేది? ప్రస్తుతం ఎంత వస్తోంది? తదితర అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మెయిల్ చేయాలని, దేవాలయాల ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనురాధ, ఆర్జేడీ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ మూర్తి, ఉత్తరాంధ్ర జిల్లాల ఆలయాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. -
పోలీసుల పై మంత్రి చిందులు..!
-
'జ్యోతిర్లింగ క్షేత్రంగా శ్రీశైలం అభివృద్ధి'
అమరావతి: శ్రీశైల భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని ప్రసిద్ధ శక్తిపీఠం, జ్యోతిర్లింగ ఉమ్మడి క్షేత్రంగా అభివృద్ది చేయడానికి దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. రూ.1500 కోట్ల ఖర్చుతో ఆలయ విస్తరణకు ప్రణాళికను రూపొందించామన్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని ఆయన ఛాంబర్లో బుధవారం విధులను చేపట్టారు. అంతకు ముందు లక్ష్మీ గణపతి, వాస్తు పూజలతో హోమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీశైలంతో పాటు రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలను తిరుమల తరహాలో అభివృద్ది చేస్తామన్నారు. విజయవాడ దుర్గ గుడి వద్ద గతంలో ఇరుకుగా ఉండే రాజవీధిని 100 అడుగుల వెడల్పుగా విస్తరిస్తామని మాణిక్యాలరావు చెప్పారు. అన్నవరం, ద్వారక తిరుమల, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల అభివృద్దికి ప్రణాళిక తయారుచేస్తున్నామన్నారు. భక్తుడు ఇచ్చే కానుకలు, విరాళాలతోనే దేవాదాయ శాఖ నడుస్తోందని ఆయన అన్నారు. భక్తులు ఏ అంశంపై ప్రశ్నించినా జవాబు చెప్పేంతగా దేవాదాయ శాఖను పారదర్శకంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని మాణిక్యాలరావు చెప్పారు. -
నరసింహుని సేవలో మంత్రి మాణిక్యాలరావు
వేదాద్రి (పెనుగంచిప్రోలు) : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పి.మాణిక్యాలరావు స్థానిక కృష్ణా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతర పుష్కర ఘాట్లను సందర్శించి భక్తులతో సౌకర్యాలపై ప్రశ్నించారు. బీజేపీ నాయకులు నోముల రఘు, మన్నే శ్రీనివాసరావు, కీసర రాంబాబు పాల్గొన్నారు. -
సేవా సంస్థల సేవలు భేష్
దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అమరావతి (పెదకూరపాడు) : పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు చెప్పారు. అమరావతిలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత భోజన సౌకర్యాలను పరిశీలించి, అక్కడే భోజనం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక స్వచ్ఛంద సంస్థలు,ట్రస్ట్‌లు,స్థానిక సంస్థలు పుష్కర భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు.అన్నదానం చేయడం ఎంతో సంతోషమని అన్నారు. అమరావతి వారసత్వ నగరంగా ఎంపికైనప్పటి నుంచి అభివృద్ధి దిశగా అడుగు వేస్తోందన్నారు. -
సత్రం భూముల దోపిడీ నిజమే!
- వాస్తవ ధర తెలిసినా చౌకగా విక్రయం - వేలం ధర తగ్గింపుపై మౌనం - కీలక ప్రశ్నలకు వివరణ ఇవ్వని మంత్రి మాణిక్యాలరావు సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల విక్రయంలో భారీ దోపిడీ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ పత్రమే తేటతెల్లం చేస్తోంది. భూముల వాస్తవ ధర ఎంత ఉందో తెలిసినా 83.11 ఎకరాలను చౌకగా విక్రయించడానికి అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం అంగీకరించింది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న అత్యంత విలువైన సత్రం భూములను అధికార పార్టీ నేతలు వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ.1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు మంగళవారం విజయవాడలో వివరణ ఇచ్చారు. నోట్ కూడా విడుదల చేశారు. భూముల వేలానికి మార్చి 1వ తేదీన దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని... రెండు రోజుల్లో(3వ తేదీ)నే భూమి ధరకు సంబంధించి తమిళనాడులోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆరా తీసినట్లు మంత్రి తన వివరణలో పేర్కొన్నారు. మార్చి 3న ఆరా తీసినప్పుడు సత్రం భూములు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగు రూ.1,700 చొప్పున ఎకరాకు రూ.6 కోట్ల వరకు ధర ఉన్నట్లు తెలుసని అంగీకరించారు. భూముల ధర తగ్గించారెందుకు? ఎక రం ధర రూ.6 కోట్ల వరకు ఉందని తెలిసినా, సదావర్తి సత్రం భూములు ఆక్రమణలో ఉన్నాయన్న సాకుతో వేలం సమయంలో ఎకరా రూ.50 లక్షలు బేసిక్ ధరగా నిర్ణయించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ సమయంలో ఎకరం ధరను రూ.27 లక్షలకు ఎందుకు తగ్గించి అమ్మాల్సి వచ్చిందన్న దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. విజయవాడ దుర్గ గుడి వద్ద ఈ ఏడాది చెప్పుల షాపు నిర్వహణకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. గతేడాది కన్నా రూ.2 లక్షలు తక్కువకు పాట వచ్చిందని రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి అనుమతించి ంది.కానీ రూ.1,000 కోట్ల విలువైన భూముల వేలంలో ఈ జాగ్రత్తలు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్రంలో ఏ గుడి అధీనంలోని దుకాణాన్నైనా అద్దెకు ఇవ్వాలంటే దేవాదాయశాఖ ఈ-టెండర్ అమలు చేస్తోంది. అలా పిలవకుండా బహిరంగ వేలం నిర్వహించింది. దీని గురించి అధికార పార్టీ నేతలు మినహా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడింది.ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సర్కార్ చెప్పడం లేదు. వేలం తర్వాత అనుమతికీ తొందరే దేవాదాయ శాఖలో నాలుగైదు ఏళ్ల క్రితం వేలంలో భూములను దక్కించుకున్నా వాటిని వారు స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సత్రం భూముల విషయంలో మాత్రం మార్చి 28న వేలం జరగ్గా ఏప్రిల్ 24నే పాటదారుకు అప్పగించాలని నిర్ణయించింది. -
'హోదాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు'
చెన్నై: ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చట్టపరమైన ఇబ్బందులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుందని మాణిక్యాలరావు పేర్కొన్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బుధవారం రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు
- రూ.180 కోట్లతో 587 ఆలయాల్లో ఏర్పాట్లు - తిరుపతిలో అంతర్జాతీయ హిందూ సమ్మేళనం - విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) : ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం తరఫున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని 587 ఆలయాల్లో కృష్ణా పుష్కరాలను శోభాయమానంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే టీటీడీ సారథ్యంలో త్వరలో తిరుపతిలో అంతర్జాతీయ హిందూసమ్మేళనం నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింజేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దశ దిశలా వ్యాంపించే విధంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న వైష్ణవాలయాల్లో జరిగే ఉత్సవాలకు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, శైవాలయాలకు శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవస్థానాలనుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆలయాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఇక గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న అపశృతులను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన చర్యలు ముందస్తుగానే చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మంత్రి మాణిక్యాలరావుకు అస్వస్థత
రాజంపేటటౌన్: దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఆయన తిరుపతి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో వైఎస్సార్‌జిల్లా రాజంపేట వద్ద ఆయనకు అనారోగ్యానికి గురి కావడంతో స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆగిపోయారు. స్థానిక వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం మంత్రి మాణిక్యాలరావు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
ఆలయాల వద్ద బాణ సంచాపై నిషేధం
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి కోరుమిల్లి (కపిలేశ్వరపురం): కేరళ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఆలయాల వద్ద బాణసంచా వాడకాన్ని నిషేధించినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో సోమవారం సోమేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేరళ దుర్ఘటనను తీవ్రంగా పరిగణించి, రాష్ట్రంలో ఆలయాల వద్ద మందుగుండు సామగ్రి వినియోగించడాన్ని నిషేధించామన్నారు. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. -
అధికారంలో ఉన్నామో... లేమో....!
బీజేపీ కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదు: మంత్రి మాణిక్యాలరావు సాక్షి, చిత్తూరు: అధికారంలో ఉన్నా బీజేపీ కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం ఉదయం చిత్తూరుకు వచ్చిన మంత్రి స్థానిక బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు తమను ఖాతరు చేయడం లేదని, తాము ఏమి చెప్పినా పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి ముందు వాపోయారు. అందుకు స్పందించిన మంత్రి రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితే ఉందని, బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నామో.. లేమో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం సంధికాలంలో ఉన్నామని.. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు పలుకుతోందని విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. -
మంత్రికి తెలియకుండా మార్కెట్ కమిటీ నియామకం!
అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన మంత్రి మాణిక్యాలరావు సాక్షి, హైదరాబాద్: మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా, కనీసం సమాచారం సైతం ఇవ్వకుండా ఆయన సొంత నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ నియామకం జరిగిందట. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. పర్యటనలో అమిత్‌షా పార్టీ నేతలతో ప్రత్యేకంగా ఎలాంటి సమావేశం నిర్వహించకపోయినప్పటికీ.. స్వాగత, వీడ్కోలు కార్యక్రమంతో పాటు మధ్యాహ్న భోజన విరామ సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. టీడీపీతో కలసి రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్నా బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరిగే పరిస్థితులు లేవంటూ ఫిర్యాదుల చిట్టా విప్పారు. మంత్రి మాణిక్యాలరావుతో సహా పలువురు నాయకులు తమ తమ నియోజక వర్గాల్లో టీడీపీ నేతల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. మంత్రిగా ఉన్న తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేతలు నిత్యం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మాణిక్యాలరావు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. పైగా కొందరిపై తాను తప్పుడు కేసులు పెట్టిస్తున్నానంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దీనికి స్పందించిన అమిత్‌షా ‘రాష్ట్రంలో జరుగుతున్న చాలా విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. చూద్దాం..’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ‘గవర్నర్ ప్రసంగం’పై అమిత్‌షా ఆశ్చర్యం రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీనిలబెట్టుకోలేదంటూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించడంపై అమిత్‌షా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం రాజమహేంద్రవరంలో బహిరంగ సభకు ముందు అమిత్ షా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో షా వద్ద రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుడొకరు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పాఠంలో పేర్కొన్న అంశం పత్రికల్లో ప్రచురితం కావడాన్ని ప్రస్తావించారు. దీనిపై అమిత్‌షా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘నిజమేనా’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
'అభ్యంతరకర వ్యాఖ్యలెందుకు'
మంత్రిపై మునిసిపల్ చైర్మన్ బొలిశెట్ట వ్యాఖ్య తాడేపల్లి గూడెం: మంత్రి పైడికొండల మాణిక్యాలరావు టీడీపీ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని , మంత్రిపై ఎవరూ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రిపై టీడీపీ సమన్వయ కర్త ఈలి నాని ఎటువంటి ఫిర్యాదులు చేయలేదన్నారు. కావాలంటే వీడియో సీడీలు తమ వద్ద ఉన్నాయని వాటి ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా మంత్రి మాణిక్యాలరావు సవాల్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్పీ, డీఎస్పీ తదితర అధికారులతో మాట్లాడిన మంత్రి మిత్రపక్షమైన టీడీపీతో మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో కొందరు కార్యకర్తలు తమ ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలిపే సమయంలో వారిని వారించి తాము కూడా ఎన్నికల కేసులలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని అన్నారే తప్ప మంత్రి తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఎక్కడా అనలేదని వివరించారు. -
భేటీకి మాణిక్యాలరావు గైర్హాజరు?
కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ఇప్పటికే ఉలిక్కిపడుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి మరో పెద్ద ఝలక్ తగిలేలా ఉంది. ప్రధానంగా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర నేతలతో నిర్వహించాలని తలపెడుతున్న కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యే యోచనలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఉన్నారు. వాస్తవానికి మాణిక్యాలరావు రాజకీయ గురువు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇంతకుముందే కిర్లంపూడి వెళ్లి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. అంటే.. కాపు ఉద్యమానికి ఆయన మద్దతు ఉన్నట్లే భావించాలి. కాగా ఇప్పుడు మళ్లీ కాపులను ఎలాగోలా సమాధానపరిచేందుకు మంత్రులను ముందుంచి, తాను చెప్పదలచుకున్న విషయాన్ని వాళ్లతో చెప్పించేందుకు సీఎం ప్రయత్నిస్తుండటంతో.. మాణిక్యాలరావు అందుకు ససేమిరా అంటూ అసలు ఏకంగా కేబినెట్ సమావేశానికే గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
రాజధాని అఖండ జ్యోతి మళ్లీ కొండెక్కింది
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ సంకల్పానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంకల్ప జ్యోతి మంగళవారం మళ్లీ కొండెక్కింది. సంకల్ప జ్యోతి పుట్టు పూర్వోత్తరాలను పరిశీలిస్తే.. అమరావతి శంకుస్థాపనకు రెండు రోజుల ముందు గత ఏడాది అక్టోబరు 20వ తేదీన రాజధాని నిర్మాణ పనులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగాలని మంత్రి మాణిక్యాలరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు అమరావతిలోని అమరేశ్వరాలయంలో అఖండ దీపం వెలగించి, ఆ జ్యోతిని నవ్యాంధ్ర నూతన రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం తీసుకువచ్చారు. రాజధాని శంకుస్థాపన తరువాత సంకల్పజ్యోతి నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో అదే జ్యోతిని మళ్లీ క్రీడాకారులతో నవంబరు 21వ తేదీన అమరావతి అమరేశ్వరాలయానికి చేర్చారు. రాజధాని నిర్మాణం 50 శాతం పూర్తయ్యే వరకు ఈ సంకల్ప జ్యోతిని వెలిగించే ఉంచుతామని, అమరేశ్వరాలయంలో వచ్చే శివరాత్రి వరకు ఉంచి, తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి అలయంలో ఉంచుతామని అనాడు దేవాదాయశాఖ, క్రీడాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం వెలిగి ఉండాల్సిన అఖండ జ్యోతి గతంలో ఒకసారి కొండెక్కగా మళ్లీ ఇప్పుడు కొండెక్కడంలో దేవాలయ సిబ్బంది నిర్లక్ష్యం బయట పడింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాలయ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అంతా ఆర్భాటమే..
రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి మాణిక్యాలరావు హామీ నిలుపుకోని సర్కార్ నాలుగు నెలలైనా విడుదల కాని నిధులు ప్రతిపాదనలకే పరిమితమైన అభివృద్ధి పనులు రామతీర్ధం(నెల్లిమర్ల) : రాష్ట్రంలోనే అతిపెద్ద సీతారాముల ఆలయమైన రామతీర్థాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. దేవస్థానంలో ప్రతి ఏటా అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతేగాకుండా ఆలయంలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఇదీ ఈ ఏడాది మార్చిలో రామతీర్థం దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు స్వయంగా ఇచ్చిన హామీ. అయితే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. దీంతో దేవస్థానంలో అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వివరాల్లోకి వెలితే.. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ నిర్వహించాలనే విషయమై కడప జిల్లాలోని అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట, జిల్లాలోనే అతి పెద్దదైన రామతీర్థం దేవస్థానాల మధ్య అప్పట్లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే చివరకు ఒంటిమిట్టలోనే ఉత్సవాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన భక్తులు, సాధువులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో దిగొచ్చిన టీడీపీ ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్టతో పాటు రామతీర్థంలోనూ ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా అదే నెలలో జరిగిన ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు. ఆ సమయంలో దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఒంటిమిట్టతో సమానంగా రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీలు గుప్పించారు. ఆయన హామీ మేరకు ఆలయంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఏప్రిల్‌లో దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఆలయ ప్రధాన ద్వారంతో పాటు దక్షిణ గోపుర నిర్మాణం, తదితర పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి హామీలిచ్చి నాలుగు నెలైనా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఆ సమయంలో భక్తులను శాంతింపజేయాలనే ఉద్ధేశంతోనే మంత్రి అలా ప్రకటించారని పలువురు విమర్శిస్తున్నారు. ఓ వైపు ఒంటిమిట్టలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతుంటే ఆ ఆలయంతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన రామతీర్థాన్ని మాత్రం పట్టించుకోకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి రామతీర్థంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
'పుష్కరాల తర్వాత చర్యలు'
పశ్చిమగోదావరి: గోదావరి పుష్కరాల్లో అపశృతి చేసుకున్న నేపథ్యంలో కొవ్వూరులోని స్నాన ఘట్టాలను దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. బుధవారం అక్కడికి వెళ్లిన ఆయన రాజమండ్రి సంఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. పుష్కరాల అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పుష్కర కమిటీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విషయం పూర్తిగా అవాస్తవం అని మాణిక్యాలరావు చెప్పారు. -
పుష్కరాలకు ఉపరాష్ర్టపతికి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : గోదావరి పుష్కరాలకు రావాలని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ ఆహ్వానపత్రం అందజేశారు. మంత్రితోపాటు బీజేపీ నేత రఘురాం ఉన్నారు. -
జూలై 1 నుంచి గోదావరికి హారతి
* పుష్కరాల కోసం తూ.గోలో 151, ప.గోలో 89 ఘాట్లు * మంత్రి మాణిక్యాలరావు సాక్షి, హైదరాబాద్: గంగా నది తరహాలో గోదావరి నదికీ హరతి ఇచ్చే కార్యక్రమాన్ని జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆరంభించనుంది. పుష్కరాలు ముగిసిన తరువాత కూడా నిత్యం ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. హారతి ప్రారంభ కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పుష్కర ఏర్పాట్లపై ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. పుష్కరాలకు సంబంధించిన పనులు జూలై ఐదో లోగా పూర్తవుతాయని చెప్పారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతో పాటు మొత్తం పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 1,650 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 151, పశ్చిమ గోదావరి 89 ఘాట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పుష్కరాలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు ఈ నెల 29న ఢిల్లీకి వెళుతున్నట్టు చెప్పారు. పార్లమెంట్ సభ్యులందరితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు ఆహ్వానప్రతాలు అందిస్తున్నట్లు తెలిపారు. పిండప్రదాన పూజలకు ఏర్పాటు పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన పూజ కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. పుష్కరాలకు పటిష్ట బందోబస్తు జూలై 14 నుంచి 25 వరకూ జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా ‘4 జీ’ టెక్నాలజీతో పని చేసే సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లు వంటి ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. పుష్కర ఘాట్‌వద్ద తిరుమలేశుని దర్శనం తిరుమల: గోదావరి పుష్కర భక్తులకు వేంకటేశ్వర స్వామివారిని కనులారా దర్శించుకునే భాగ్యం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయంతోపాటు, నమూనా విగ్రహాన్ని నిర్మిస్తోంది. జూలై 14 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాల్లో ఈ ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలను తిరుమల తరహాలోనే నిర్వహించనున్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం మొదలు రాత్రి 10 గంటల వరకు మూలమూర్తికి నిర్వహించే అన్ని పూజలు, కైంకర్యాలు, ఆర్జిత సేవలన్నీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. -
శ్రుతిహాసన్ని నేనేమి అనలేదు : మంత్రి
-
శ్రుతి హాసన్‌ను నేనేమీ అనలేదు: మంత్రి
శ్రుతిహాసన్‌ను తాను ఏమీ అనలేదని, అనాల్సిన అవసరం కూడా లేదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. హైదరాబాద్ - తిరుపతి విమానంలో వివాదం సందర్భంగా శ్రుతి హాసన్ ఏడ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, అందుకు ఓ బీజేపీ మంత్రి కారణమని కూడా రావడంతో ఈ విషయమై ఆయన 'సాక్షి టీవీ'కి వివరణ ఇచ్చారు. తిరుపతి వెళ్లే విమానంలో శ్రుతి తన ముందు సీటులో ప్రయాణిస్తోందని మాణిక్యాలరావు చెప్పారు. ఆ సమయంలో తనకు అర్జంటుగా ఓ ఎస్ఎంఎస్ రావడంతో.. ఓ డాక్టర్‌కు ముఖ్యమైన కాల్ చేయాల్సి వచ్చిందన్నారు. తాను మాట్లాడుతుండగా శ్రుతి వారించిందని, విమానం వెళ్లేటప్పుడు మాట్లాడొద్దని సూచించిందని ఆయన అన్నారు. దాంతో తాను మాట్లాడుతున్నది అతి ముఖ్యమైన విషయమని మాత్రమే ఆమెకు చెప్పాను తప్ప.. అంతకు మించి ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. కాల్ గురించి కూడా ఎయిర్‌హోస్టెస్ తోనే మాట్లాడానన్నారు. సోషల్ మీడియాలో మాత్రం తానేదో అన్నట్లు, శ్రుతి కన్నీళ్లు పెట్టినట్లు వచ్చిందని.. అదంతా తప్పని మాణిక్యాలరావు చెప్పారు. -
దేవాలయాల్లో చెల్లుబాటుకాని మంత్రి మాట