
ఆలయాల వద్ద బాణ సంచాపై నిషేధం
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి
కోరుమిల్లి (కపిలేశ్వరపురం): కేరళ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఆలయాల వద్ద బాణసంచా వాడకాన్ని నిషేధించినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో సోమవారం సోమేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేరళ దుర్ఘటనను తీవ్రంగా పరిగణించి, రాష్ట్రంలో ఆలయాల వద్ద మందుగుండు సామగ్రి వినియోగించడాన్ని నిషేధించామన్నారు. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.