నరసింహుని సేవలో మంత్రి మాణిక్యాలరావు
వేదాద్రి (పెనుగంచిప్రోలు) :
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పి.మాణిక్యాలరావు స్థానిక కృష్ణా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతర పుష్కర ఘాట్‌లను సందర్శించి భక్తులతో సౌకర్యాలపై ప్రశ్నించారు. బీజేపీ నాయకులు నోముల రఘు, మన్నే శ్రీనివాసరావు, కీసర రాంబాబు పాల్గొన్నారు.