vedadri
-
‘వైఎస్సార్ వేదాద్రి’
-
ఫిబ్రవరికి ‘వైఎస్సార్ వేదాద్రి’
సాక్షి, అమరావతి/ పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంత కృష్ణా నదిపై రూ.490 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోని కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితి. ఐదేళ్లపాటు అధికారంలో ఉండీ కూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎత్తిపోతల పథకానికి క్యాంపు కార్యాలయంలో వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్ – మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. – ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీవీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నీరు అందిస్తాం. – దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. పెళ్లి రోజున చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వేదాద్రిలో ఎత్తిపోతల ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అనిల్‌కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ విప్ ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు రైతు బాంధవుడిగా నిలిచారు – వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు బాంధవుడిగా నిలిచారని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. – ‘ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. వేదాద్రి వద్ద కృష్ణా నది నుంచి 26 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నాగార్జునసాగర్ కాలువల్లోకి నీటిని విడుదల చేస్తారు. మంగొల్లు, గండ్రాడు, భీమవరం మీదుగా శనగపాడు వరకు ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు అందుతుంది. నాడు ఇదే ప్రాంతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి మేలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ పెళ్లి రోజు కానుకగా వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత రైతాంగానికి గొప్ప వరం. తద్వారా ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.10 లక్షలు విలువ పెరిగింది’ అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. – ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే పైలాన్ వద్ద సీఎం తన కార్యాలయంలో రిమోట్ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. – వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. – క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతం రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘వైఎస్సార్-వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం
సాక్షి, జగ్గయ్యపేట: కృష్ణానదిపై జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో నిర్మించనున్న ‘వైఎస్సార్- వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్‌లో రిమోట్ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించారు. (చదవండి: ప్రతి రంగంలోనూ విజన్) ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో సమస్యలను పట్టించుకోలేదన్నారు.14 నెలల కాలంలోనే వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, 2021 ఫిబ్రవరి కల్లా వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.491 కోట్ల వ్యయంతో 2.7 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వేదాద్రి గ్రామంలో ఎత్తిపోతల పథకానికి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను స్వాగతం పలికారు. ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. జగ్గయ్యపేట మండలంలో 8 గ్రామాలు, వత్సవాయి మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాల్లో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుంది. -
‘వేదాద్రి’ మృతులకు 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భూభాగంలోనే ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి : వేదాద్రి ఘటన : ఎక్స్‌గ్రేషియా ప్రకటన) కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. (చదవండి : మద్యం మత్తు మృత్యువైంది) -
వేదాద్రి ఘటన : ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, ఖమ్మం : ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పువ్వాడకు సూచించారు. ఎపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 12 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు. (చదవండి : మద్యం మత్తు మృత్యువైంది) కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
మద్యం మత్తు మృత్యువైంది
వేదాద్రి (జగ్గయ్యపేట): మద్యం మత్తు మృత్యు రూపం దాల్చింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న రెండు రైతు కుటుంబాలకు చెందిన 12 మందిని కాటేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో లారీ డ్రైవర్ సహా మరో 12 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఏటా వ్యవసాయ పనులు చేపట్టే ముందు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా జమలాపురం, కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామాలకు చెందిన బంధువుల్ని నాలుగు రోజుల క్రితం గోపిరెడ్డి తన ఇంటికి ఆహ్వానించాడు. మొక్కు తీర్చుకునేందుకు 25 మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్టర్‌పై పెద్ద గోపవరం నుంచి బయలుదేరి మధిర మీదుగా వత్సవాయి మండలం తాళ్లూరు చెక్‌పోస్టు, పెనుగంచిప్రోలు మండలం మీదుగా వేదాద్రికి రాత్రి 10 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ రాత్రి ఆలయ పరిసరాల్లో బసచేసి బుధవారం ఉదయం కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో అంతా కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోనే వండుకుని భోజనాలు చేశారు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అదే ట్రాక్టర్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ప్రమాద స్థలంలో మృతదేహాలను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, తదితరులు ఆ లారీ మృత్యు శకటమై.. వారంతా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ సరిగ్గా ఆలయం నుంచి అర కిలోమీటర్ దూరం ప్రయాణించే సరికి ఎదురుగా హేమాద్రి సిమెంట్స్ కర్మాగారం నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ట్రాక్టర్ ఇంజన్‌ను ఢీకొట్టి దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ట్రక్కులో ఉన్నవారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా.. పెద్దగోపవరానికి చెందిన వేమిరెడ్డి ఉదయశ్రీ (7), వేమిరెడ్డి పుల్లారెడ్డి (75), వేమిరెడ్డి పద్మావతి (50), వేమిరెడ్డి రాజేశ్వరి (27), జమలాపురానికి చెందిన వెదురు అప్పమ్మ (60), కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జయంతికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి (65), గూడూరు ఉపేంద్రరెడ్డి (14) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలిస్తుండగా.. వేమిరెడ్డి భారతమ్మ (65), లక్కిరెడ్డి తిరుపతమ్మ (70), గూడూరు రమణమ్మ (60) మార్గమధ్యంలో మరణించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దగోపరానికి చెందిన వేమిరెడ్డి కల్యాణి (16), వేమిరెడ్డి లక్ష్మి (9) మృత్యువాతపడ్డారు. గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి వేదాద్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులంతా బంధువులే.. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన బంధువులే. రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుమార్తె ఉదయశ్రీ,, అతడి తాత పుల్లారెడ్డి, బామ్మ భారతమ్మ, నాయనమ్మ పద్మావతి మృత్యువాత పడగా.. మరో రైతు కుటుంబానికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి, రమణమ్మ భార్యాభర్తలు. మృతుల్లో వారి మనుమడు ఉపేంద్రరెడ్డి కూడా ఉన్నాడు. మిగిలిన ఐదుగురూ ఈ రెండు కుటుంబాల వారికి బంధువులు. క్షతగాత్రుల వివరాలివీ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో గూడూరు శివనాగిరెడ్డి, అరుణ, నరసింహారెడ్డి, భార్గవి, వేమిరెడ్డి లావణ్య, భానుశ్రీ, శీలం లక్ష్మి, లక్కిరెడ్డి రవీంద్రారెడ్డి, ధనలక్ష్మి, ప్రియాంక, కాలపాని వీర్రాజు, ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ శివసుబ్రమణి ఉన్నారు. వీరిని 108, పోలీస్ వాహనాల్లో జగ్గయ్యపేట, ఖమ్మం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ట్రాక్టర్ నడిపిన రైతు గోపిరెడ్డి, గూడూరు తిరుమలరెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. మద్యం మత్తులో లారీ నడపడం వల్లే.. లారీ డ్రైవర్ శివసుబ్రమణి అతిగా మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హేమాద్రి సిమెంట్స్ కర్మాగారానికి బొగ్గును లారీలో తీసుకొచ్చిన అతడు.. కర్మాగారంలో సగం బొగ్గును అన్లోడ్ చేసిన తరువాత మిగిలిన బొగ్గుతో మద్యం మత్తులో లారీ నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. లారీని అడ్డదిడ్డంగా నడుపుతూ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడని తెలిపారు. ప్రమాదం అనంతరం లారీ సమీపంలోని కాలువలోకి దూసుకెళ్లి గోతిలో దిగబడిపోగా.. డ్రైవర్ రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇలా జరిగింది.. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ట్రాక్టర్ ఇంజన్‌ను ఢీకొట్టి.. దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ఆ తరువాత రోడ్డు పక్కన గల కాలువలోకి దూసుకెళ్లి గుంతలో దిగబడింది. ఎప్పుడు.. ఎక్కడ.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యవసానం డ్రైవర్ పూటుగా మద్యం తాగి తానెటు వెళ్తున్నానో తెలియని స్థితిలో లారీ నడపటం వల్ల దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ సహా మరో 12 మంది గాయపడ్డారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి
సాక్షి, కృష్ణా : జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతులను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్రామం నుంచి దాదాపు 30 మంది మంగళవారం ట్రాక్టర్లో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వెళ్లారు. రాత్రి ఆలయంలోనే బస చేశారు. బుధవారం ఉదయం మొక్కులు చెల్లించుకొని ఇంటికి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి కృష్ణాజిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వాసులు దుర్మరణం చెందడం పట్ల తెలంగాణముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు. ఏపీ గవర్నర్ సంతాపం వేదాద్రి రోడ్డు ప్రమాద సంఘటనలో 13 మంది మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
అడవివూరులో ఆ సాయంత్రం...
కోనాయపాలెంకు కొంచెం దూరంగా పడమటి భాగంలో అడవి ఉండేది. అందులో బిలుడు చెట్లూ, జాన చెట్లూ, కలేచెట్లూ, తునికిచెట్లూ, చంద్రచెట్లూ, మోదుగుచెట్లూ...మొదలైన చెట్లుండేవి. ఆ అడవిలో పెద్దపులులు లేవుకాని చిరుత పులులు ఉన్నట్లు వాడుక. ఒకోరోజూ రాత్రిపూట ఆ చిరుత పులులు కోనాయపాలెం ప్రవేశించి గాడిదలనో, కుక్కలనో చంపి తిని పోతుండేవి. ఉదయాన్నే చెప్పుకొనేవాళ్లు, రాత్రి చిరుతపులి వచ్చి కుక్కనో, గాడిదనో లేక రెంటినో తినిపోయిందని.ఆ ఊరుకు ఆంధ్రదేశ దివ్యక్షేత్రాలలో ఒకటైన వేదాద్రి ఆరుమైళ్లు మాత్రమే ఉంటుంది. అడవిలో గుండా, గుట్టల మీదుగా కురవలు దాటిపోవాలి వేదాద్రికి!మేమంతా ఒకరోజు ఎద్దులబండి మీద వేదాద్రి అనే నెపంతో అడవి చూడడానికి బయలుదేరాం. రోడ్డు లేదు సరికదా డొంక దారి కూడా లేదు. దారి నిండా రాళ్లూ, బండలూ. బండిలో కూర్చున్నవాళ్లు ఆ దడదడలకు ఎగిరిపడుతున్నారు. గ్రామంలో ఇళ్లుంటాయి, మనుష్యులుంటారు. చెట్లుంటాయి. మరి అడవిలో ఇళ్లుండవు. మనుషులుండరు. చెట్లు మాత్రమే ఉంటాయి. ఎంత దూరం చూసినా చెట్లేచెట్లు! చిన్న చెట్లు, పెద్దచెట్లు, కుంటిచెట్లు,పూలులేనిచెట్లు, పూలున్నచెట్లు, చచ్చిన చెట్లు... అయితే అడవిలో కూడా అక్కడక్కడ ఇళ్లూ, మనుషులూ ఉండకపోరు. అటువంటప్పుడు, ఆ ప్రదేశాన్ని ›గ్రామమే అంటారు కాని అడవి అనరు. అయితే దాన్ని అడవివూరు అనవచ్చు. లంబాడీలు పశువులను మేపుతూ అడవిలో అక్కడక్కడ కనబడసాగారు. కొంతదూరంలో కృష్ణానది గోచరిస్తుంది. సాయం సమయం కావస్తుంది. అది వసంతరుతువు. మోదుగుచెట్లు చాలా కనిపించినాయి.ఎర్రటిపూలతో అరణ్యం మంటలతో మండిపోతున్నట్టు కనిపించింది. అందుకే వీటిని ఇంగ్లీష్‌లో ‘ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్’ అంటారు. సంస్కృతంలో దీన్ని ‘కంశుకం’ అని, ‘పలాశం’ అనీ అంటారు.దీని పుష్పం ప్రజ్వలిస్తున్న అగ్నికణంలాగా ఎంతో రమ్యంగా ఉంటుంది. కాని ఏమి లాభం? దీనికి వాసనే ఉండదు. రూపం బాగుండి గుణం లేని మనిషిని అందుకే మోదుగుపువ్వుతో పోలుస్తారు. సంస్కృంతలో ఒక శ్లోకం ఉంది. ‘రూపయవ్వన సంపన్నా విశాలకుల సంభవాః విద్యాహీన విశోభంతే విర్గంధా ఇవకింశుకాః’రూపము, యవ్వనము, కులీనతా, సంపద... ఇన్ని ఉండి విద్య గనుక లేనిచో ఆ వ్యక్తులు మోదుగుపూలతో సమానమని.మా దారికంటే క్రిందుగా మోదుగుచెట్లున్నాయి. వాటి జ్వలంత రక్తకుసుమాల మీదుగా కృష్ణానదిలోని నీలహరిత నీటిపాయలు కనిపిస్తున్నాయి. మోదుగుపూల చూచి మండేకన్ను ఆవలకు చూస్తే కృష్ణాజలాల నీలహరితంతో చల్లబడుతుంది. అడివిని చూడడం, దగ్గరగా కొండలనూ, లోయలను చూడడం కూడా జీవితంలో అదే మొదలు.దూరాన్నుంచి కనిపించే నునుపూ, నీలము కూడా దగ్గరలో చూచినప్పుడు కొండలలో కనిపించకపోవడం చూచి ఆశ్చర్యపోయాను. హిమాలయపర్వతాల గురించి, ఆ ప్రాంతపు మహారణ్యాలను గురించి పుస్తకాలలో చదవడం జరిగింది. మేము ఇప్పుడు చూస్తున్నకొండలు హిమాలయాలంత ఎత్తు కొండలు కావని, ఈ అరణ్యం హిమాలయ ప్రాంతపు మహారణ్యంలాంటి గొప్ప అరణ్యం కాదని తరువాత తెలుసుకున్నాను.మిత్రులం అందరం బండి దిగి నడవసాగాము. చదరమైన భూమి నుంచి ఏటవాలుగా క్రమేణ ఎత్తుగా లేచి ఉన్న పర్వత సానువులను చూస్తుంటే ఏదో మధురానుభూతి కలిగేది.మేము నడిచే బాటకు ఒకవైపు ఎత్తు ప్రదేశం, మరోవైపు లోతులు గోచరించాయి.సంధ్యలోని రక్తారుణకాంతులు ముదిరి నలుపులోకి మారి చీకట్లు కమ్ముతున్న సమయానికి వేదాద్రి చేరుకున్నాం. ఆ రాత్రికి దేవాలయంలోని పులిహోర తిని కృష్ణలోని నీరుత్రాగి పడుకున్నాం. తెల్లవారిన తరువాత లేచిచూస్తే వేదాద్రి చాలా రమ్యంగా కనిపించింది. దేవాలయం దగ్గర నుంచి కృష్ణలోకి చాలా లోతు దిగి వెళ్లాలి. సోపానాల మీదుగా పై నుంచి కృష్ణలోకి క్రిందికి చూచినా, కృష్ణలో నుంచి దేవాలయం వైపుకు చూచినా, ఈ రెండు చోట్ల నుంచి ప్రక్కలకు చూచినా–ఎటుచూసినా ప్రదేశం రమ్యంగా తట్టసాగింది. – సంజీవదేవ్ ‘తెగిన జ్ఞాపకాలు’ పుస్తకం నుంచి. -
నరసింహుని సేవలో మంత్రి మాణిక్యాలరావు
వేదాద్రి (పెనుగంచిప్రోలు) : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పి.మాణిక్యాలరావు స్థానిక కృష్ణా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతర పుష్కర ఘాట్లను సందర్శించి భక్తులతో సౌకర్యాలపై ప్రశ్నించారు. బీజేపీ నాయకులు నోముల రఘు, మన్నే శ్రీనివాసరావు, కీసర రాంబాబు పాల్గొన్నారు.