‘వేదాద్రి’ మృతులకు 5 లక్షల పరిహారం | Yadadri Road Accident : CM Jagan Announced RS Lakhs Ex Gratia | Sakshi
Sakshi News home page

‘వేదాద్రి’ మృతులకు రూ.5లక్షల పరిహారం: సీఎం జగన్‌

Published Thu, Jun 18 2020 12:11 PM | Last Updated on Thu, Jun 18 2020 3:01 PM

Yadadri Road Accident : CM Jagan Announced RS Lakhs Ex Gratia - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భూభాగంలోనే ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి : వేదాద్రి ఘటన : ఎక్స్‌గ్రేషియా ప్రకటన)

కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. (చదవండి : మద్యం మత్తు మృత్యువైంది)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement