
సాక్షి, ఖమ్మం : ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పువ్వాడకు సూచించారు. ఎపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 12 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు.
(చదవండి : మద్యం మత్తు మృత్యువైంది)
కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment