భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్స్ ప్రారభించేసాయి. ఈ తరుణంలో స్వదేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వీఐపీ, కస్టమర్‌ల కోసం 2024 సెప్టెంబర్ 26 నుంచి ముందస్తు యాక్సెస్‌తో 2024 బిగ్ బిలియన్ డేస్ 11వ ఎడిషన్‌ను సెప్టెంబర్ 27న ప్రారంభించింది.
2024 బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన (యాక్సెస్ ప్రారంభించిన రోజు, మొదటి రోజు) సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో ఫ్లిప్‌కార్ట్‌ను ఏకంగా 33కోట్ల మంది సందర్శించారు. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో పండుగ ఉత్సాహం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది.
పండుగ సీజన్‌లో ప్రారంభమైన బిగ్ బిలియన్ డేస్ రోజు.. ఎక్కువగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ప్రొడక్ట్స్ వంటి వాటిని ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి అగ్ర మెట్రో నగర వాసులు మొదటి 24 గంటల్లో ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించారు. మొత్తం మీద మొదటిరోజు బిగ్ బిలియన్ డేస్ ప్రారంభ యాక్సెస్, 1వ రోజులో అధిక డిమాండ్‌ను చూసింది.
కస్టమర్‌లు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి వాటికి సంబంధించిన సరికొత్త ఆఫర్‌లను గురించి కూడా ఎక్కుగా సెర్చ్ చేసారు. ట్రెండింగ్ ఉత్పత్తులను కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. జనరేషన్ జెడ్ ప్రేక్షకులు బ్యాగీ బాటమ్స్, జీన్స్, బ్లాక్ ప్రింట్ కుర్తాలు, డెమూర్ డ్రెస్‌లు, రెట్రో రన్నర్స్, యుటిలిటీ కార్గోస్, మల్టీ పాకెట్డ్ షర్ట్స్, కో-ఆర్డ్ సెట్, జపనీస్ స్టైల్ టీ-షర్టులు సెర్చ్ చేశారు.
ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?
ప్రీ-ఫెస్టివ్ సీజన్‌తో పోల్చితే.. ఈ సీజన్‌లో కస్టమర్లు 70 శాతం ఎక్కువ సందర్శించినట్లు తెలిసింది. లైఫ్ స్టైల్, హోమ్ & కిచెన్ వంటివి రెండు రెట్లు, బ్యూటీ పర్సనల్ కేర్ వంటివి మూడురెట్లు వృద్ధిని సాధించింది. మొత్తం మీద లావాదేవీలు 2.8 రెట్లు పెరిగింది. బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన మొదటి 12 గంటల్లో అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, డెస్క్‌టాప్ వంటివి అమ్ముడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment