
'పుష్కరాల తర్వాత చర్యలు'
పశ్చిమగోదావరి: గోదావరి పుష్కరాల్లో అపశృతి చేసుకున్న నేపథ్యంలో కొవ్వూరులోని స్నాన ఘట్టాలను దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. బుధవారం అక్కడికి వెళ్లిన ఆయన రాజమండ్రి సంఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. పుష్కరాల అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పుష్కర కమిటీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విషయం పూర్తిగా అవాస్తవం అని మాణిక్యాలరావు చెప్పారు.