భేటీకి మాణిక్యాలరావు గైర్హాజరు? | manikyala rao likely to give a miss to cabinet meet | Sakshi
Sakshi News home page

భేటీకి మాణిక్యాలరావు గైర్హాజరు?

Published Mon, Feb 1 2016 12:20 PM | Last Updated on Mon, Jul 30 2018 6:25 PM

భేటీకి మాణిక్యాలరావు గైర్హాజరు? - Sakshi

భేటీకి మాణిక్యాలరావు గైర్హాజరు?

కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ఇప్పటికే ఉలిక్కిపడుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి మరో పెద్ద ఝలక్ తగిలేలా ఉంది. ప్రధానంగా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర నేతలతో నిర్వహించాలని తలపెడుతున్న కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యే యోచనలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఉన్నారు.

వాస్తవానికి మాణిక్యాలరావు రాజకీయ గురువు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇంతకుముందే కిర్లంపూడి వెళ్లి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. అంటే.. కాపు ఉద్యమానికి ఆయన మద్దతు ఉన్నట్లే భావించాలి. కాగా ఇప్పుడు మళ్లీ కాపులను ఎలాగోలా సమాధానపరిచేందుకు మంత్రులను ముందుంచి, తాను చెప్పదలచుకున్న విషయాన్ని వాళ్లతో చెప్పించేందుకు సీఎం ప్రయత్నిస్తుండటంతో.. మాణిక్యాలరావు అందుకు ససేమిరా అంటూ అసలు ఏకంగా కేబినెట్ సమావేశానికే గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement