
సాక్షి, విజయవాడ: కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ కేబినెట్ శనివారం మరోసారి సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంజునాథ కమిషన్ నివేదికపై మరోసారి చర్చించారు. కాపుల కోసం బీసీ (ఎఫ్) కేటగిరి కోటాను సృష్టించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది. నిరుద్యోగ భృతి విధివిధానాలపై కూడా ఏపీ కేబినెట్ చర్చించింది.
సభలో తీర్మానం..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. శనివారం సభలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం సభలో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి అచ్చెన్నాయుడు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
కాపు రిజర్వేషన్ అంశంపై సభలో చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంజునాథ కమిషన్ 20 నెలలు పర్యటించిందని తెలిపారు. రాష్ట్రంలో 8.7శాతం కాపులు ఉన్నారని చెప్పారు. రాజకీయంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించడం లేదని అన్నారు. కాపు రిజర్వేషేన్లపై బీసీలు పోరాడాలని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అంటున్నారని, ఆయన అలా మాట్లాడటం సరికాదని అచ్చెన్నాయడు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment