kapu reservations
-
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV -
పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలి: మంత్రి అంబటి
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలంటూ హితువు పలికారు. అసలు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ప్రశ్నించినందుకు ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు వేధించారని తెలిపారు. 'ఆయన కుటుంబ సభ్యులను కూడా ఎలా వేధించారో చూశాం. మరి ఆనాడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు హయాంలో కాపులు ఉద్యమం చేస్తే పవన్ మద్దతు తెలపరు. అదే జగన్ ప్రభుత్వంలో ఉద్యమం చేస్తే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు. ఈ వైఖరిని కాపు సోదరులు అర్థం చేసుకోవాలి' అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చదవండి: (ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జీవీఎల్) -
‘కాపులను అడ్డుపెట్టి కుట్ర రాజకీయాలు’
సాక్షి, అమరావతి: కాపులను అడ్డుపెట్టుకుని మరోసారి కుట్ర రాజకీయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాపులను మోసం చేసిన చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాపులను మళ్లీ రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి, వారిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. చంద్రబాబు కుట్రలకు పవన్ తోడ్పాటునందిస్తున్నారని ఆరోపించారు. రంగాను టీడీపీ వాళ్లే హత్య చేయించారని తన పుస్తకంలో రాసిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఇప్పుడు కాపు జాతిని రెచ్చగొట్టేలా దీక్షకు దిగడం బాధాకరమన్నారు. 87 ఏళ్ల జోగయ్యతో పథకం ప్రకారం దీక్ష చేయిస్తున్నది ఎవరని అనుమానం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం చేసినప్పుడు పవన్, జోగయ్య, జీవీఎల్ ఎక్కడున్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం తన చేతిలో లేని పని అని, వారికి ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సాహం అందిస్తానని కిర్లంపూడి సభలో ప్రకటించిన సీఎం వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు కట్టుబడి కాపుల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కాపుల సంక్షేమానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తే సీఎం వైఎస్ జగన్ మూడున్నరేళ్లలోనే రూ.1,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. బాబు పాలనలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తే పథకాలు అందేవని, సీఎం వైఎస్ జగన్ కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరిలో కాపులకు నిజమైన మేలు చేసింది ఎవరో బహిరంగ చర్చలకు తాను సిద్ధమని అడపా శేషు సవాల్ విసిరారు. -
కాపులకు రిజర్వేషన్ అమలుకు కృషిచేయాలి
కిర్లంపూడి: కాపు జాతికి రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి జాతులు కోల్పోయిన రిజర్వేషన్ విషయమై గతంలో రాసిన లేఖ సారాంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్‌పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సోషల్ జస్టిస్ మంత్రి స్పందిస్తూ రాజ్యాంగ సవరణలు 103, 105–2019, 2021 యాక్ట్స్‌ను అనుసరించి ఆర్టికల్ 342ఎ(3) ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చని చెప్పారని తెలిపారు. తదనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు దృష్టి పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, తమ సామాజికవర్గానికి కూడా రిజర్వేషన్ కల్పించి వెలుగు నింపాలని ముద్రగడ తన లేఖలో కోరారు. -
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు
-
బాబుతో దోస్తీ.. కాపులకు న్యాయమేది? పవన్‌ను ప్రశ్నించిన కాపు ఐక్యవేదిక
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): జనవాణి కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ వైఖరినే ప్రశ్నిస్తూ కాపు ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది. కాపు రిజర్వేషన్ల అంశం సహా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని అందులో డిమాండ్ చేసింది. 2014లో చంద్రబాబును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన పవన్.. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని, అప్పట్లో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 నెలల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయలేదని ఐక్యవేదిక గుర్తుచేసింది. కాపు యువతకు టీడీపీ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయించలేకపోయావంటూ కూడా తప్పుపట్టింది. వినతిపత్రం అందజేసిన తర్వాత కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. చదవండి👇 మా ఫ్లెక్సీలు తొలగిస్తావా? మళ్లీ కూసిన గువ్వ -
నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
-
కాపుల అభివృద్ధికి కృషి చేస్తా
సాక్షి, అమరావతి: కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు దైవమని, ఆయన తర్వాత తమ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌తోనే ఎప్పటికీ నడుస్తానని స్పష్టం చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రాజా ఆదివారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తమను వైఎస్ జగన్ ఆదుకున్నారన్నారు. కాపు రిజర్వేషన్లను చంద్రబాబు మంట కలిపారని, కాపులను అయోమయానికి గురి చేస్తూ రాజకీయ లబ్ధి కోసం నాటకాలాడారని ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కాపులను చంద్రబాబు మోసం చేశారు గతంలో తాను కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఐదేళ్లలో రూ.రెండు వేల కోట్లు కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని మంత్రి కన్నబాబు విమర్శించారు. బాబును కాపులు నమ్మరని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తేల్చిచెప్పారు. కాపులంతా ఆరాధించే నేత జగన్ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపులను వాడుకొని వదిలేసిందని మంత్రి బొత్స సత్యనారాVయణ ధ్వజమెత్తారు. జగన్‌కు కాపులంతా వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. కాపులను ఏ రంగంలోనూ ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. కాపుల అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ బాటలు వేశారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంజునాథ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో.. కమిషన్ సభ్యుల రిపోర్టు కేంద్రానికి ఇచ్చేలా చంద్రబాబు చేశారని మండిపడ్డారు. రెండు రిపోర్టులపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీత, బాలశౌరి, సినీ దర్శకుడు వి.వి.వినాయక్, పలువురు కాపు సంఘం నేతలు మాట్లాడారు. -
కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపుల పట్ల చంద్రబాబు నాయుడు మొదటి నుంచీ మోసపూరిత వైఖరే అనుసరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈబీసీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రానికి హడావుడిగా బిల్లును పంపారని, రాజకీయ లబ్ధి కోసం కేవలం ఎన్నికల ముందు కాపులను మభ్య పెట్టడానికే ఇలా చేశారని ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్ల అంశంపై తాజా పరిణామాలను వివరించేందుకు కాపు సామాజికవర్గం మంత్రులు, వైఎస్సార్సీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వారితో మాట్లాడుతూ... కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని చూస్తోందని చెప్పారు. కాపులను టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటోందన్నారు. చంద్రబాబు చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న ప్రశ్న తలెత్తిందని పేర్కొన్నారు. కాపు ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘కాపు రిజర్వేషన్ల విషయంలో మంజునాథ కమిషన్ నివేదికపై చైర్మన్ సంతకం లేకుండానే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలో పెట్టి, తీర్మానం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో కేంద్రానికి ఒక బిల్లును పంపారు. ఆ తరువాత కేంద్రం ఈబీసీలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ మరో బిల్లు పంపారు. కాపులను బీసీల్లో చేరుస్తూ ఇంతకు ముందు పంపిన బిల్లుకు కట్టుబడి ఉన్నారా? లేక ఉపసంహరించుకుంటారా? దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే దానికి చంద్రబాబు సమాధానం ఇవ్వకుండా నాన్చారు. ఈ అంశంపై కేంద్రం 2019 ఏప్రిల్ 4న లేఖ రాస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సమాధానం పంపనే లేదు. కాపుల వ్యవహారంలో చంద్రబాబుది తొలి నుంచీ అవకాశవాద ధోరణే అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన(ఈబీసీ) వారికి కల్పించిన రిజర్వేషన్లలో కులాల వారీగా విభజించే అవకాశం ఉండదని తెలిసి కూడా చంద్రబాబు ఎన్నికల ముందు కాపులను మభ్య పెడుతూ అందులో 5 శాతం రిజర్వేషన్లను వారికి ఇస్తున్నట్లు నటించారు. పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లోని పేదలకు ఈ 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం ఇచ్చింది. ఇందులో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదు. అసలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇస్తారు? చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తూ చేసిన తీర్మానంపై, ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాల్లో కేసులున్నాయి. వీటిని కోర్టులు కొట్టేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో అడుగు ముందుకు వేస్తే ఈ కోటా కింద సీట్లు, ఉద్యోగాలు పొందిన వారి గతి ఏమవుతుంది? కాపులకు ఈబీసీ కోటా నుంచి 5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు ఇవ్వడం వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య పీజీ సీట్ల భర్తీలో దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చింది. దీనికి విరుద్ధంగా అడుగులు వేయగలమా? కాపుల ఆశలపై నీళ్లు చల్లారు ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన వారం రోజుల్లోపే కేంద్రం దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం ఏప్రిల్ 11న ఎన్నికలు అయితే మే 6న మార్గదర్శకాల కోసం కమిటీ వేశారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన కోటాలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తామనడం ద్వారా బీసీల్లో చేరుస్తామంటూ గతంలో వారికి కల్పించిన ఆశలపై కూడా చంద్రబాబు నీళ్లు చల్లారు. కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ తొలినుంచీ ఒకే వైఖరితో ఉంది. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా, బీసీల ప్రయోజనాలకు నష్టం జరగకుండా, వారి హక్కులకు భంగం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే మేము మొదటి నుంచీ చెబుతున్న విధానం. కాపుల రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. వారి రిజర్వేషన్లకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. మంజునాథ కమిషన్ నివేదికను పరిశీలించండి ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా కాపుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ.2,000 కోట్లు కేటాయిస్తాం. ప్రస్తుత బడ్జెట్లో రూ.2,000 కోట్లు కేటాయించాం. కాపుల ప్రగతి కోసం ఏటా రూ.1,000 కోట్ల చొప్పున ఇస్తానన్న చంద్రబాబు గత ఐదేళ్లలో కేవలం రూ.1,340 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదికను చూడకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పారు. అందుకే కమిషన్ నివేదికను పరిశీలించాలని మంత్రి కన్నబాబు, శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబును ముఖ్యమంత్రి ఆదేశించారు. -
‘సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులకి రిజర్వేషన్లు ఎత్తి వేశారని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అంబటి రాంబాబు టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కాపుల రిజర్వేషన్‌పై గత టీడీపీ ప్రభుత్వం మంజునాథ కమిషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను కాపులకు ఇచ్చానని ప్రగల్బాలు పలికారని ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని అంబటి స్పష్టం చేశారు. అబద్దాన్ని నిజం చేస్తున్నారు బందర్ పోర్ట్ తెలంగాణకు అప్పగిస్తున్నారనే వార్తలపై కూడా అంబటి స్పందించారు. ‘ చంద్రబాబు పని ఎలా ఉంది అంటే దున్నపోతు ఈనింది అంటే కట్టేయమని చెప్పండి అన్నట్లుగా ఉంది. బందర్ పోర్టు తెలంగాణకి కట్టబెడుతున్నారు అన్న ట్వీట్లు చేస్తున్నారు. బందర్ పోర్టు తెలంగాణకి అప్పగిస్తున్నామని అన్న విషయానికి అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు. ఒక అబధ్దాన్ని నిజం అన్నట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి అని తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్నాం, బందరు పోర్టు విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స్నేహపూర్వక మాటలని వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవి మానుకోవాలి. ఏదో పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు’అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. (చదవండి: కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది) -
కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది: సీఎం జగన్
-
సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ కాపు ప్రజా ప్రతినిధులు (మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సోమవారం ముఖ్యమంత్రిని అసెంబ్లీ ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల అంశంపై తాజా పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ మాట్లాడుతూ.. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సిందిగా పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబుకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘ కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ పంపారు. తర్వాత ఈబీసీల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరొక లేఖ రాశారు. అసలు కాపులను బీసీల్లో చేరుస్తూ ఇంతుకు ముందు పంపిన బిల్లు పరిశీలనలో ఉంచదలచుకున్నారా? దానికి కట్టుబడి ఉన్నారా? లేక ఉపసంహరించాలనుకుంటున్నారా? దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని చంద్రబాబు సర్కార్‌ను కేంద్రం కోరింది. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 4న కేంద్రం రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం పంపలేదు. పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లో పేదలకు ఈ పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాంట్లో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదు. కులాల పరంగా విభజించే హక్కులేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇచ్చారు?. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడంపైనా, ఈసీబీల్లో ఇచ్చిన 5శాతం కోటాలపైనా న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడుగు ముందుకు వస్తే ఈ కోట కింద సీట్లు, ఉద్యోగాలు పొందినవారి పరిస్థితి ఏమవుతుంది?. ఈబీసీ కోటాలో కాపులకు తాను ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య, పీజీ సీట్లలో చంద్రబాబు సర్కార్ ఎందుకు అమలు చేయలేదు?. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా ఇదే పేర్కొన్నారు కదా?. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైతే ఎవరు బాధ్యత వహిస్తారు?. ఓబీసీ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే...అందులో కాపుల జనాభా యాభైశాతం కన్నా ఎక్కువే ఉంది కదా?. అలాంటప్పుడు దాన్ని 5శాతానికే కట్టడి చేస్తే వారికి అన్యాయం జరగదా?. ఈబీసీల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. దానికి విరుద్ధంగా అడుగులు వేయగలమా?. కేంద్రం ఈబీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన వారంలోపే మార్గదర్శకాలు ఇచ్చేసింది, కానీ చంద్రబాబు మాత్రం 2019, ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే.. మే 6న మార్గదర్శకాల కోసం కమిటీ వేశారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తాననడం ద్వారా, ఇంతకు ముందు బీసీల్లో చేర్చే అవకాశం ఉందన్న కాపులకు కల్పించిన ఆశలమీద కూడా చంద్రబాబే నీళ్లు జల్లారు. కాపుల రిజర్వేషన్ల విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎప్పుడూ మార్పులేదు. మొదటి నుంచి మేం చెబుతున్నట్లే బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు మనం వ్యతిరేకం కాదు. కాపు రిజర్వేషన్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుంది, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నాం. ఈ బడ్జెట్లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించాం. కానీ చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.1340 కోట్లే’ అని తెలిపారు. -
అవే కథలు.. అదే వంచన
‘‘ఈడబ్ల్యూఎస్‌కు ఉన్న 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు టీడీపీ సర్కారు కల్పించింది నిజమే అయితే మార్చిలో జరిగిన మెడికల్ పీజీ సీట్ల భర్తీలో కాపులకు ఈ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. 5 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది కాపులకు ఉద్యోగాలు ఇచ్చారో? ఎంతమందికి ఉన్నత విద్యలో సీట్లు ఇప్పించారో బాబు చెప్పాలి. ఒక్క మెడికల్ పీజీ సీటైనా ఈ 5 శాతం రిజర్వేషన్ల ద్వారా కాపులకు ఇచ్చి ఉంటే చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా ప్రకటించాలి’’ అని కాపులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాలనలో కాపులను నిలువునా వంచించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్లపాటు ఆ సంగతే మర్చిపోయారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతరూపం దాల్చడం, కాపుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో విధి లేని పరిస్థితుల్లో తూతూమంత్రంగా మంజునాథ కమిషన్‌ను నియమించారు. చివరకు ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే హడావుడిగా నివేదికను తెప్పించుకుని, కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారు. 2019లో రాజకీయ లబ్ధి కోసం మరోసారి బూటకపు ప్రకటనకు తెరలేపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తామన్నారు. అది ఆచరణ సాధ్యం కాదని తెలిసినా మాయమాటలతో మోసం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. కాపులను బీసీల్లో తానే చేర్చానని ఒకసారి, కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించానని మరోసారి ప్రకటించి, అసలు కాపులు బీసీలా, ఓసీలా అనే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేయడానికి చంద్రబాబు కారకుడయ్యాడే తప్ప ఆ దిశగా చిత్తశుద్ధితో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అధికారం ఉందా? ఇప్పటి వరకూ రిజర్వేషన్లు వర్తించని వారికి (అగ్రవర్ణాలకు) పేదరికమే కొలబద్ధగా, కులాలతో సంబంధం లేకుండా విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేస్తే దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని అందరికీ తెలుసు. ఇక్కడ పేదరికమే ప్రామాణికం తప్ప కులాల వారీగా రిజర్వేషన్లను విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈ సంగతి తెలుసు. అయినా ఈ 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నట్లు 2019 ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పుడేమో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్లను తాను కాపులకు ఇస్తే వైఎస్సార్సీపీ సర్కారు కాపులకు రిజర్వేషన్లు లేకుండా చేసిందని చంద్రబాబు అండ్ కో తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు. కోర్టు కొట్టేస్తే పిల్లల భవిష్యత్తు ఏమిటి? పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఈడబ్ల్యూఎస్‌కు లభించిన 10 శాతం రిజర్వేషన్లలో చంద్రబాబు అన్నట్లు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానాలు కొట్టేస్తే పరిస్థితి ఏమిటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఇది తెలిసి కూడా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చి, ఇప్పుడు ఆ వర్గం వారికి ఉన్నత విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తే దాన్ని కోర్టు కొట్టేస్తే పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడేసినట్లు అవుతుంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని కాపు సామాజికవర్గం నిలదీస్తోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇంతగా దిగజారడం దారుణమని మండిపడుతోంది. కాపులతో సహా ఓసీల్లోని పేదలందరూ ఈ 10 శాతం రిజర్వేషన్లు పొందడానికి అర్హులే. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కాపులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. జనాభా ప్రకారం ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 50 శాతానికి పైగా దక్కే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కేంద్రం ప్రశ్నకు జవాబు ఏదీ? ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం మీరు కాపులకు ఇస్తామన్నారు. మరి 2017లో కాపులను బీసీల్లో చేర్చుతూ అసెంబ్లీలో బిల్లు చేసి పంపించారు. మరి కాపులను బీసీల్లో చేర్చాలన్న బిల్లును మీరు ఉపసంహరించుకుంటారా?’’ అని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2019 ఏప్రిల్ 4న కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. దానికి చంద్రబాబు సమాధానం చెప్పలేదు. దీన్నిబట్టి కాపుల సంక్షేమం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు మోసకారి ‘‘చంద్రబాబు కాపులను ఓటు బ్యాంకు మాదిరిగానే వాడుకున్నాడు. 2014 ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు. మంజునాథ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి, తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అది అతీగతీ లేకుండా పోయింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి కాపులకు ఈబీసీ కోటా అన్నాడు. కేంద్రం ఇస్తామన్న 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం ఇస్తామన్నాడు. అది సాధ్యం కాదని తెలిసినా కాపులను దగా చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే కాపులకు బీసీ రిజర్వేషన్లు కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే కోటాకు వారిని పరిమితం చేసేలా కుట్ర పన్నాడు. కాపులకు రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు చేసిన తీర్మానాలు సరికాదని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈబీసీ కోటా సంగతిని త్వరగా తేల్చకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులు నష్టపోతున్నారని ఏపీ హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం ఇచ్చిన ఈబీసీ కోటా, చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానాలపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పే శిరోధార్యమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈలోపు విద్యార్థులు నష్టపోకుండా, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 10 శాతం ఈబీసీ కోటాలో సూపర్ న్యూమరరీ విధానంలో మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు పెంచుకుని, భర్తీ చేయాలని హైకోర్టు ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ కోటాను అమలు చేయక తప్పలేదు. లేకపోతే కోర్టు ధిక్కార నేరం అవుతుంది’’ – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్, వైఎస్సార్సీపీ -
‘కాపు’ కాస్తాం
మోసం, అబద్ధం నాకు అలవాటు లేవు. చంద్రబాబుకు నాకు చాలా తేడా ఉంది. ఏదైనా నిజాయతీగా చెబుతాను. రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాను. కాపుల సంక్షేమానికి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాం. అది చూసే ప్రజలు మాకు ఓటేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2వేల కోట్లు చొప్పున కేటాయించి 5ఏళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామన్నాం. చెప్పిన విధంగానే మొదటి బడ్జెట్లోనే రూ.2వేల కోట్లు కేటాయించాం. దాన్ని పూర్తిగా ఖర్చు చేస్తాం. కాపులకు అండగా ఉంటాం. కాపులకు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరిలో మార్పు ఉండబోదు. మనం సినిమాకు వెళ్తే అందులో ఓ విలన్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా కెమెరా ఏంగిల్ను అసెంబ్లీలోకి ఫోకస్ చేస్తే ఇక్కడా మనకు ఓ విలన్ కనిపిస్తారు. చంద్రబాబే ఆ విలన్ క్యారెక్టర్. ఆయన కాపులను అడ్డగోలుగా మోసగించారు. ఆయన చేసిన మోసంపై ప్రశ్నిస్తే.. 2004లో ఏం జరిగింది.. 1983లో ఏం జరిగింది.. అంటూ చర్చను పక్కదారి పట్టిస్తారు. అవన్నీ ఎందుకు? అక్కడ మీరు ఉన్నారు.. ఇక్కడ నేను ఉన్నాను. మీరేం చెప్పారు.. ఏం చేశారు? నేను ఏం చెప్పాను.. ఏం చేశాను.. అన్నది చర్చిద్దాం రండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కాపులకు అన్ని విధాలుగా ఎప్పుడూ అండగా ఉంటామని, ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మాదిరిగానే కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి పూర్తిగా ఖర్చు చేస్తామని చెప్పారు. అందుకే ఈ ఏడాది తొలి బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించామని, ఆ మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేస్తామన్నారు. విపక్ష నేత చంద్రబాబు మాదిరిగా అబద్ధపు హామీలు ఇచ్చి కాపులను మోసం చేసే అలవాటు తనకు లేదని సీఎం స్పష్టం చేశారు. తాను ఏదైనా నేరుగా మాట్లాడతానని, అమలు చేయగలిగే హామీలే ఇస్తానని చెబుతూ మనస్సాక్షి చంపుకుని రాజకీయాలు చేయనని విస్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజు మంగళవారం కాపు రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చంద్రబాబు చెబుతూ అవి అమలు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ కాపుల సంక్షేమానికి తాము నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చంద్రబాబు కాపులను ఏ విధంగా మోసం చేసిందీ సాదోహరణంగా వివరించారు. ఈ చర్చలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఇలా సాగింది. చంద్రబాబు విలన్ క్యారెక్టర్ ‘చంద్రబాబు నిజాలు ఎప్పుడూ మాట్లాడరు. ఆయనది విలన్ క్యారెక్టర్. కాపులను అడుగడుగునా అడ్డగోలుగా మోసం చేశారు. కాపు, తెలగ, బలిజ కులాలను ఆదుకోవడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన ఏం చేశారో ఓ సారి చూద్దాం... 2014–15లో రూ.50 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2015–16లో రూ.100 కోట్లు కేటాయించారు. రూ.96 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 2016–17లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. కానీ రూ.490 కోట్లే ఖర్చు చేశారు. 2017–18లో కూడా రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.891 కోట్లు ఖర్చు చేశారు. చివరికి ఎన్నికల ఏడాది 2018–19లో రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.525 కోట్లే ఖర్చు చేశారు. అంటే ఏ స్థాయిలో కాపులను చంద్రబాబు మోసం చేశారో అర్థమవుతోంది. అందుకే కాపులు చంద్రబాబును ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బాబు నిర్వాకం వల్లే కాపులకు నష్టం కాపు రిజర్వేషన్లపై ఎలా మోసం చేశారన్నది చంద్రబాబు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, చంద్రబాబు అందులో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అసలు కాపులు బీసీలా? ఓసీలా? ఏదో చెప్పలేని అద్వానపు స్థితిలో చంద్రబాబు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అందులో ఏ కులానికి పడితే ఆ కులానికి వేరేగా రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. ఫార్వర్డ్ కులాలన్నింటిలోని ఈబీసీలందరికీ ఆ 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అంతేగానీ అందులో ఓ కులానికి 5 శాతమో మరెంతో వేరేగా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. కోర్టులో ఎవరైనా చాలెంజ్ చేస్తే అది అమలు కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. చంద్రబాబు నిర్వాకం వల్ల కాపులకు నష్టం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్లో ఈబీసీలకు సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మనస్సాక్షి చంపుకోను మోసం, అబద్ధం నాకు అలవాటు లేవు. ఏదైనా నేరుగా చెబుతాను. చంద్రబాబుకు నాకు చాలా తేడా ఉంది. ఏదైనా నిజాయతీగా చెబుతాను. రెండు పేజీల మ్యానిఫెస్టో ఇచ్చాను. (మ్యానిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను చదివి వినిపించారు). కాపుల సంక్షేమానికి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాం. అది చూసే ప్రజలు మాకు ఓటేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2 వేల కోట్లు చొప్పున కేటాయించి 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నాం. చెప్పిన విధంగానే మొదటి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్లు కేటాయించాం. దాన్ని పూర్తిగా ఖర్చు చేస్తాం. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి పూర్తిగా ఖర్చు చేస్తాం. కాపులకు అండగా ఉంటాం. కాపులకు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు పచ్చి మోసం... మంజునాథ కమిషన్ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారు. మంజునాథ కమిషన్ వేశారు. కానీ కమిషన్ నివేదిక మీద చైర్మన్ మంజునాథ సంతకమే లేదు. చైర్మన్ సంతకం లేకుండానే మిగిలిన సభ్యుల సంతకాలతో నివేదికను విడుదల చేశారు. అలా ఎవరైనా చేస్తారా? చేస్తే ఆ నివేదికకు పవిత్రత, విలువ ఉంటాయా? ఎవరైనా కోర్టుకు వెళితే ఆ నివేదిక నిలుస్తుందా? అది తెలిసి కూడా చంద్రబాబు కాపులను మోసం చేశారు. అందుకే ప్రజలు ఆయన్ను ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆయన తీరు మారడం లేదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మా మేనిఫెస్టోలో ఇలా చెప్పాం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కాపు సోదరులు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్న పరిస్థితి మనం గమనిస్తునే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసి కూడా టీడీపీ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చింది. మన పరిధిలో లేని విషయంలో మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం గానీ అంతకుమించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టే చర్యే అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే. మొదటి నుంచీ మేము చెబుతున్నట్టుగానే బీసీ హక్కులకు భంగం కలుగకుండా వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఈ ఐదేళ్లలో కేవలం రూ.1,340 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో మేము అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.2 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. ఖర్చు చేస్తాం. వివిధ కులాల వారిని మోసం చేయడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ అలాగే మోసం చేశారు. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించారు. ఎస్సీ వర్గీకరణ నిలవదని, న్యాయస్థానం కొట్టి వేస్తుందని తెలిసీ చేశారు. అనుకున్నట్టే కోర్టు కొట్టేసింది. రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే చంద్రబాబు చూస్తారు తప్ప అది సాధ్యమా కాదా అన్నది పట్టించుకోరు. ఆయనకు ఏ విషయంలో ఏనాడూ చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ చంద్రబాబులో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లోఇప్పుడు ఉన్న 23 సీట్లు కూడా రావు. ఏ 13 సీట్లో ఇంకా తక్కువో వస్తాయి. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి. వయసుతోపాటు మానవత్వం, మంచితనం కూడా పెంచుకోవాలి. -
చంద్రబాబు తీరు ఇంకా మారలేదు
సాక్షి, అమరావతి : కాపులపై కపటనాటకాలు ఆడిన చంద్రబాబుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, అయినా ఆయన తీరుమారలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజాలు ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. అందుకే కాపులు చంద్రబాబుకు బుద్ది చేప్పారని ఎద్దేవా చేశారు. కాపుల రిజర్వేషన్‌పై ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ్ కమిటీ తన సంతకం లేకుండానే నివేదిక సమర్పించినా.. దానిని అప్పటీ సీఎం చంద్రబాబు ఆమోదించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కాపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నమ్ముతున్నారని, ఆయన కాపులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. -
వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కాపుల రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో తాము ఏ విషయం అయితే చెప్పామో.. దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నో కులాలు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తున్నాయని, కానీ సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని సీఎం వివరించారు. రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం అన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రెండు వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. దానికి అనుగుణంగానే తొలి బడ్జెట్లోనే వారి సంక్షేమం కోసం రెండువేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు వైఎస్ జగన్ చెప్పారు. మంగళవారం బడ్జెట్‌పై చర్చలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కాపుల సంక్షేమంపై మీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నకు సీఎం వివరంగా జవాబిచ్చారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ల కాలంలో కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు చేసింది శూన్యమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులను బీసీల్లో కలుపుతామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక హామీలను ఇచ్చారని.. వాటిలో ఏఒక్కటి కూడా అమలు చేయలేదని సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపు, తెలగ, బలిజ కులాలకు ఐదేళ్లలో ఐదువేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు గత ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ ఏ బడ్జెట్లో కూడా పూర్తి నిధులను ఖర్చు చేయలేదని గుర్తుచేశారు. నిధుల కేటాయింపు విషయంలో కాపులను ఏవిధంగా మోసం చేశారో.. రిజర్వేషన్లలో కూడా అదే విధంగా మోసం చేశారని మండిపడ్డారు. కాపులను నిర్లక్ష్యానికి గురి చేశారు కనుకే చంద్రబాబు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారని, టీడీపీ బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయో ఒక్కసారి పరిశీలించుకోవాలని సీఎం అన్నారు. ఐదేళ్ల కాలంలో కాపులకు ఏం చేశారో కూడా చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. -
‘కాపులను దశలవారీగా మోసం చేశారు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సాధ్యం కాదని తెలిసికూడా కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రిజర్వేషన్లపై పోరాడినవారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తుని ఘటనలో తమపై అక్రమంగా కేసులు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా విచారించలేదని తెలిపారు. తుని ఘటనపై విచారణ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కోరారు. ‘కేంద్రం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే... అందులో 5 శాతం కాపులకు ఇచ్చామంటూ బాబు చెప్పుకున్నారు. కాపులను దశలవారీగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాద్ వదిలి ఆగమేఘాలపై ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికినందుకేనా. అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌజ్‌లో ఎందుకు నివాసముటున్నారు’అని అంబటి ప్రశ్నించారు. -
10% కోటాపై కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై ఈ నెల 26లోపు సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆర్.కృష్ణయ తన పిటిషన్లో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా అమలు చేస్తారో తెలిపాలని కోరారు. కాగా ఈబీసీ రిజర్వేషన్లపై గతంలోనూ వ్యాపారవేత్త తెహసిన్ పూనావాలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై న్యాయస్థానం స్టే నిరాకరించింది కూడా. ఇక కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. -
ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా?
హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కర్నూరు జిల్లా నంద్యాలలో న్యాయవాది అనిల్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... హోదా కోసం ఎవరూ సూసైడ్ చేసుకోవద్దని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ..అధికారం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ధర్మపోరాటం యాత్ర చేయాలనే ఆలోచన చంద్రబాబుకు నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మొదటి నుంచి పోరాడుతుందన్నారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు అధికారులకు టార్గెట్లు పెట్టారన్నారు. నాడు హోదా అని ఉద్యమిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతానని హెచ్చరించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ డబ్బుతో దుబారా దీక్ష చేయబోతున్నారని విమర్శించారు. కాపులు ఓసీలా? బీసీలా? కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీలో పెట్టిన బిల్లు చూస్తే ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని తేలిపోతుందని ఉమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కాపులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 2014కు ముందు కాపులను బీసీలలో చేరుస్తానికి తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు...2017 డిసెంబర్ 1న మంజునాథ కమిషన్ వేశారని ఆయన గుర్తు చేశారు. ఆరు నెలల్లో నివేదిక కావాలని చెప్పి పలుమార్లు పొడిగింపు ఇచ్చి...చివరికి బలవంతంగా చైర్మన్ సంతకం లేకుండానే ఇద్దరు సభ్యుల నుంచి నివేదిక తీసుకున్నారన్నారు. మరి కాపులు ఓసీలా? బీసీలా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. అసెంబ్లీలో ఆ నివేదకను పెట్టి కాపులను బీసీలలో చేరుస్తున్నామని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన చంద్రబాబు...కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో కాపులకు సగం ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు బిల్లు పెట్టడం కాపులను మోసం చేయడమే అని అన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కాపులను బీసీలలో చేర్చాలనే ప్రతిపాదన ఏదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్రం తేల్చి చెప్పిందని ఉమ్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల ముందు జిమ్మికులు చేయడం బాబుకు అలవాటేనని అన్నారు. అయిదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇవ్వడానికి రాష్ట్రానికి అధికారం లేదన్నారు. కాపులను అటు బీసీలకు, ఇటు ఓసీలకు దూరం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక వెనకబాటుతనం మీద మాత్రమే 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, కాపులకు 5శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తేగలరా అంటూ ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా సవాల్ చేశారు. -
ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా?
-
వైఎస్ జగన్ పేరు స్మరిస్తున్న సీఎం
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాళా తీసిందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు. 2 లక్షల 50 వేల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టారని ధ్వజమెత్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి చంద్రబాబు.. వైఎస్ జగన్ నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష కోసం టీడీపీ ప్రభుత్వం రైల్వేకు కోటి 38 లక్షల రూపాయల ప్రజాధనం చెల్లించిందని వెల్లడించారు. చంద్రబాబు సర్కారు తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్ల బిల్లు మోసపూరితంగా ఉందన్నారు. పేద అగ్రవర్ణాల రిజర్వేషన్‌ను ఒక కులానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాపులకు ఐదు శాతం కాదు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు జరిగిన శాసనసభ సభ సమావేశాల్లో తనను తాను పొడుగుకోవడానికే చంద్రబాబు సమయన్నాంతా వెచ్చించారని విమర్శించారు. టీడీపీని వ్యతిరేకించే సభ్యులను బెదిరించడానికి అసెంబ్లీని వేదికగా వాడుకున్నారని దుయ్యబట్టారు. తన రాజకీయ జీవితంలో ఇంత పొగరుగా ప్రవర్తించే సీఎంను చూడలేదన్నారు. అసెంబ్లీ ఔన్నత్యాన్ని చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టరాదని చెప్పిన చంద్రబాబు మరి ఏపీలో ఎలా పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. -
చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాళా తీసింది
-
కాపులకు బీసీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్ధితి ఉందా?
-
కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారు?
సాక్షి, కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ టక్కుటమార విద్యలు మొదలు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు కన్నబాబు విమర్శించారు. బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ కోసం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశంపై గతంలో ముంజునాథ కమిషన్‌ను ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈబీసీ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకావశం ఉందా అని నిలదీశారు. అగ్రవర్ణ పేదలంతా కాపులకు వ్యతిరేకమవ్వాలనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాపు నేతలపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టు తిరిగేలా చేశారని అన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అయితే చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని తెలిపారు. ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపై రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
కాపులంటే చంద్రబాబుకు ఎందుకింత అలుసు?
-
జనం మాట: బాబు మారోసారి కాపులను మభ్యపెట్టే ప్రయత్నం
-
‘ఆ నిర్ణయాధికారం ఎవరికీ లేదు’
-
‘ఆ నిర్ణయాధికారం ఎవరికీ లేదు’
సాక్షి, వైఎస్సార్ కడప : అగ్రవర్ణాలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఏ కులానికి ఎంత అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.రామచంద్రయ్య అన్నారు. అసలు కేంద్రం ఇచ్చిన రిజర్వేన్ల అంశం ఎంత వరకు నిలబడుతుందో తెలియని పరిస్థితుల్లో.. అందులోనుంచే కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు కులాల కుంపటి రాజేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లు ఇంకా చేరనేలేదని వెల్లడించారు. ‘2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏమేరకు అమలు చేశాడో ప్రజలు గమనించాలి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైఎస్ జగన్ చెప్పిన ‘నవరత్నాలు’లోంచి ఒక్కొక్కటి వదులుతున్నాడు. నాలుగున్నరేళ్లుగా అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం గురించి తెగ ఆలోచిస్తున్నారు. మీకు సంక్షేమం అంటే ఏంటో తెలుసా బాబూ’ అని రామచంద్రయ్య ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పంచె కట్టిన వాళ్లంటేనే బాబుకు పడదని.. అలాంటిది రైతులను ఆదుకుంటానని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు చెప్పినదానికల్లా తలలూపుతూ మంత్రులు తమ ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోద్దని హితవు పలికారు. అత్యధిక ఆదాయం వచ్చే గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేక విమానాల్లో తిరగడం లేదని.. కానీ స్వప్రయోజనాల కోసం ప్రత్యేక విమనాల్లో పర్యటిస్తూ ప్రజాధనం వృధా చేయడంలో బాబుకెవరూ సాటిరారని చురకలంటించారు. -
ప్రజల కష్టాన్ని తగలబెట్టింది చంద్రబాబు కాదా?
సాక్షి, కాకినాడ : తెలంగాణలో ప్రజలు తరిమికొట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చేస్తారని భయంతో చంద్రబాబును ఎదురు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కాపురిజర్వేషన్ పోరాటసమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలు పొగొట్టుకున్న రిజర్వేషన్లు తిరిగి రావాలంటే తనపాలన రావాలని చంద్రబాబు గత ఎన్నిక సమయంలో ఉపన్యాసాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిని అమలు చేయాలని అడిగితే అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరాఠీలకు ఇచ్చినహామీ చూసైనా నేర్చుకోవాలన్నారు. 'రాష్ట్ర ఆదాయాన్ని, వనరులను దోచుకున్నది మీరు కాదా? ప్రజల కష్టాన్ని మీ సొంత ఖర్చులకు, విహారయాత్రలకు తగలబెట్టింది మీరు కాదా? మీ జీవితంలో ఒక్కసారైనా నిజం మాట్లాడి ఉంటే దయ చేసి చెప్పండి' అంటూ చంద్రబాబు నాయుడుపై ముద్రగడ నిప్పులు చెరిగారు. రాష్ట్ర సంక్షేమం కోరేవారైతే హోదా కోసం మీరు, మీ కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీకు అండగా అందరం ఉంటాం అని లేఖ రాస్తే నోరు విప్పలేదని తూర్పారబట్టారు. 'ఏం ఘనకార్యం చేశారని మీకు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలి. అసలు గజదొంగ మీరా లేక ఇతర పార్టీ నాయకులా? అమాయక ప్రజలకు హామీలు కురిపించి మరోసారి అధికార దాహం తీర్చుకోవడం కోసం ఈ తహతహ కాదా? ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ముందు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్, రేపు మళ్లీ బీజేపీ అధికారంలోకొస్తే వారికి జై కొట్టడం అలవాటుగా మారిపోయింది. మీ ఆరాటం చూస్తుంటే మీ కుటుంబ ఆస్తి కాపాడుకోవడం కోసం, అధికారం కావాలి అన్నది నగ్న సత్యం కాదా?' అని చంద్రబాబుపై ముద్రగడ ధ్వజమెత్తారు. -
కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారు
-
జగన్ నిజమే చెప్పారు
అంబాజీపేట: సాధ్యం కాని పనిని చేస్తానంటూ హామీ ఇచ్చి కాపులను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులా కాకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాపులకు న్యాయం చేస్తారని పలు కాపు నాయకులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని క్యాంపు కార్యాలయం వద్ద వివిధ జిల్లాల కాపు సంఘ నాయకులు జననేత జగన్‌ను కలిసి దుశ్శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ మాట్లాడుతూ కాపు ఉద్యమం ప్రారంభం నాటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించి కాపులపై చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. కాపు రిజర్వేషన్ పోరాటానికి ఎప్పటికప్పుడు సహకారం అందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో జగన్ ముందున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ఆదరాబాదరగా కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని జగన్ చెప్పడం తప్పుగా ఎల్లో మీడియా, చంద్రబాబు వక్రీకరించి తప్పు చేసేవాడిగా చిత్రీకరిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి గుర్తుకురాని కాపులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాపులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు, తన ఎల్లో మీడియా సిద్ధపడుతోందని, ఈ విషయంలో కాపులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైఎస్సార్ సీపీ వెంటే 80 శాతం మంది కాపులున్నారని, రాబోయే రోజుల్లో జగన్‌కే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన కాపు నాయకులు చేగొండి శ్రీనివాసరావు, మెడికల్ బాబు, జి.నరసింహరావు, కె.ఎన్.రావు తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
కాపులకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీపై హర్షం
-
యూటర్న్ తీసుకోవడం ఆయన అలవాటు
-
యూటర్న్ తీసుకోవడం ఆయన అలవాటు
సాక్షి, తిరుపతి: కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే కాపుల ఆర్థికాభివృద్ధికి వైఎస్ జగన్ పదివేల కోట్లు ఇస్తానని చెప్పడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై తమ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. కాపులకే మేలు జరగాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలోనిది కావున ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ అధ్యక్షుడు మాట్లాడారని బొత్స వెల్లడించారు. తరుచుగా యూటర్న్ తీసుకునేది చంద్రబాబేనని.. గత చరిత్ర చూస్తే అర్థమవుతుందని విమర్శించారు. వైఎస్ జగన్ మోసం చేయడని, అబద్దాలు చెప్పడని, ఇప్పటివరకు ఏ విషయంలోనూ వైఎస్ జగన్ యూటర్న్ తీసుకోలేదని బొత్స వివరించారు. -
జగన్ అన్నకు కాపుల జేజేలు
-
వైఎస్ జగన్‌ను సన్మానించిన కాపు మహిళలు
-
నిలువెత్తు మోసంపై నిందల ముసుగు
సాక్షి, అమరావతి: కాపు సామాజికవర్గంతోపాటు అన్ని కులాలకు ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు గుప్పించిన చంద్రబాబునాయుడు ఆదినుంచి మోసపూరిత ఎత్తుగడలతోనే ముందుకు సాగుతున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా తన అనుకూల ఎల్లో మీడియా సహాయంతో వక్రీకరణలు చేస్తూ మభ్యపెడు తున్నారు. మోసాల నుంచి బయట పడేందుకు, ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గాన్ని మరోసారి వంచించేందుకు కొత్త డ్రామాలకు తెర తీశారు. ఇన్నేళ్లుగా కాపు సామాజిక వర్గాన్ని మభ్యపెట్టిన చంద్రబాబు కొందరు నేతలతో తనకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకుంటూ ఎన్నికల గండం గట్టెక్కేందుకు ఎత్తులు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలే ఇందుకు తార్కా ణంగా నిలుస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయకపోగా ఇతరులపై నెట్టేసేలా తెరవెనుక కుట్రలు చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి నిబంధనల ప్రకారం వెనకబాటు తనంపై అధికా రిక గణాంకాలు, సరైన నివేదికలతో తీర్మానాన్ని పంపించకుండా ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. మోసం బాబుది.. నెపం ఇతరులపైనా? ఏ వర్గానికైనా అత్యంత వెనకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తారు. గత ఎన్నికలకు ముందు ఆర్నెళ్లలోగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రిజర్వేషన్ల కోసం దీర్ఘకాలం వేచి చూసిన కాపు సామాజిక వర్గం ఆందోళనకు దిగడంతో చంద్రబాబు హడావుడిగా జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేశారే తప్ప.. ఆ కమిషన్ ద్వారా కాపుల వెనకబాటుతనానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు అనువైన పరిస్థితులను కల్పించలేదు. కమిషన్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించకుండా పలు ఆటంకాలు సృష్టించారు. కమిషన్ గడువును పదేపదే పొడిగిస్తూ కాలయాపన చేశారు. చివరకు కమిషన్ చైర్మన్ ఎలాంటి నివేదిక ఇవ్వకుండానే హడావుడిగా సభ్యులతో తూతూమంత్రంగా ఒక నివేదికను సిద్ధం చేసి దాన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి తీర్మానం పంపి చేతులు దులుపుకొన్నారు. ఇక తన పని అయిపోయిందని, కేంద్రమే కాపుల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని చేతులెత్తేశారు. కేవలం అసెంబ్లీలో తీర్మానం చేశారే తప్ప ఆ తీర్మానాన్నిబలపరిచే గణాంకాలు, నివేదికను కేంద్రానికి అందించకుండా తన మోసపూరిత వైఖరిని చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. ఒకేమాటపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్లపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచి ఒకటే మాట చెబుతున్నారు. కాపుల డిమాండ్ న్యాయబద్ధమైనదని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పలుమార్లు గట్టిగా చెప్పారు. బీసీల రిజర్వేషన్ కోటాకు ఇబ్బంది లేకుండా, వారి హక్కులకు భంగం కలుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని పలుమార్లు జగన్ స్పష్టం చేశారు. దీనికి తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని అనేక సందర్భాల్లో చెప్పారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని, అందువల్ల కేంద్రం ఈ అంశంలో చర్యలు చేపట్టాల్సి ఉంటుందని కూడా ఆయన వివరిస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని ఇటీవల జగ్గంపేటలో ప్రకటించారు. అయితే దీన్ని టీడీపీ నేతలు వక్రీకరించి దుష్ప్రచారానికి దిగారు. వైఎస్సార్ సీపీ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నట్లుగా తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. కాపుల రిజర్వేషన్ల డిమాండ్ న్యాయబద్ధమైనదని, బీసీ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా వారికి ఆ ప్రయోజనం కల్పించాల్సి ఉంటుందని, దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవలసి ఉంటుంది కనుక ఆ మేరకు తాము అధికారంలోకి రాగా>నే ప్రయత్నిస్తామని జగన్ మరోసారి పిఠాపురం సభలో స్పష్టం చేశారు. అయినా కూడా చంద్రబాబునాయుడు, పచ్చమీడియా, కొందరు నేతలు వైఎస్సార్ సీపీపై తెరవెనుక కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఏది? కాపులకు రిజర్వేషన్లపై చంద్రబాబుకు మొదటినుంచి చిత్తశుద్ధి లేదు. కాపు సామాజిక వర్గానికి ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన టీడీపీ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పటివరకు ఇచ్చింది రూ.వెయ్యికోట్లకు మించలేదు. తన మోసాలను కప్పిపుచ్చుకోవడానికి తాజాగా కాపు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్లో కేంద్రంతో గొడవపడాలంటూ తన పార్టీ ఎంపీలను ఆదేశించినట్లు పచ్చ మీడియాలో వార్తలు వండివార్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇవ్వడం తెలిసిందే. దీనిపై చాలాకాలం ఓపికతో ఎదురుచూసిన కాపు సామాజికవర్గం గత్యంతరం లేక కాపు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పేరుతో ఉద్యమాలు చేపట్టింది. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు నానా ప్రయత్నాలు చేశారు. కాపు జేఏసీ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో తునిలో జరిగిన అవాంఛనీయ ఘటనల వెనక ప్రభుత్వ కుట్ర దాగినట్లు ఆరోపణలున్నాయి. హడావుడిగా అసెంబ్లీలో బిల్లు పోలవరం పనుల్లో అక్రమాలు బహిర్గతం కావడం, ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. టీడీపీ సర్కారు అవినీతి వ్యవహారాలు కేంద్రం రాసిన లేఖతో బట్టబయలు కావడంతో రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా కాపు రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కమిషన్ చైర్మన్ అప్పటికి ఇంకా నివేదిక ఇవ్వకున్నా, ఆయనతో సంబంధం లేకుండా ఇతర సభ్యులతో ఇప్పించుకున్న నివేదికనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి తూతూమంత్రంగా తీర్మానం చేసి కాపులకు రిజర్వేషన్లను కల్పించాలంటూ కేంద్రానికి తీరా>్మనం పంపారు. తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, సభ్యులు నివేదిక ఇచ్చిన సంగతి తనకు తెలియదని అప్పట్లోనే కమిటీ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఖండించారు. దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం తప్పదోవ పట్టిస్తూ కాపు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపైకి నెట్టేసింది. గణాంకాలు పంపకుండా వంచన వాస్తవానికి కమిషన్ నివేదికపై ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా కులానికి రిజర్వేషన్లు కల్పించాలంటే సామాజిక, ఆర్థిక తదితర అంశాల్లో వెనుకబాటుతనానికి సంబంధించి సవివర నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అలా చేర్చాలంటే ఆయా కులాలకు వెనుకబాటుతనానికి సంబంధించి సమగ్ర సమాచారం జత చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇన్ని నిబంధనలు పాటించాల్సి ఉన్నా చంద్రబాబు ఏ ఒక్కటీ పట్టించుకోలేదు. అసలు చైర్మన్ సంతకం లేకుండానే మంజునాథ్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే చంద్రబాబు మోసపూరిత వైఖరిని రుజువు చేస్తోంది. కీలకమైన వెనుకబాటుతనానికి సంబంధించిన గణాంకాల నివేదికను జత చేయకుండానే తీర్మానాన్ని పంపడంపై కేంద్ర న్యాయశాఖ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఇన్ని రకాలుగా తప్పులు, మోసాలతో చంద్రబాబు కాపు సామాజికవర్గాన్ని వంచించారు. ఇప్పడు ఆయనే కేంద్రంపై పోరాడాలంటూ తన ఎంపీలను ఉద్బోధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కాపులను మభ్యపెడుతూ డ్రామాలాడుతున్నారు
-
కాపులకు రూ.10 వేల కోట్లు
చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా.. అని ఎల్లో మీడియాను, చంద్రబాబుని, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆరాట పడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను. ఇదే బాబు కాపులకు అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే. ఇది మోసం కాదా? ఈ పెద్దమనిషి ఇలా మోసం చేస్తే, నేను.. జగన్ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 వేల కోట్లను రూ.10 వేల కోట్లకు పెంచుతానని చెప్పడం మోసమా? మధ్యాహ్న భోజన పథకానికి 5 నెలలుగా సరుకుల బిల్లులు, సిబ్బంది జీతాలు ఇవ్వడం లేదు. ఇలాగైతే వారు భోజనం ఎలా పెడతారు? విద్యార్థులు ఏమి తింటారు? ఈ పథకంలో పని చేస్తున్న 85 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చేది నెలకు ముష్టి వేసినట్లు రూ.5 వేలు. అదీ 5 నెలలుగా పెండింగ్. ఇప్పడు వీరిని తీసేసి మ««ధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు ఇవ్వబోతున్నాడు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందనుకున్నారు. ఈరోజు ఈ చిన్నపాటి ఉపాధిని ఎప్పుడు ఊడగొడతాడో అన్న ఆందోళనతో ఈ 85 వేల మంది ఉన్నారు. విశాఖలో వారు తమ బాధను చెప్పుకుందామని వెళ్తే దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. మీరంతా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు మీకు హీరో నచ్చుతాడా.. విలన్ నచ్చుతాడా? హీరో నచ్చుతాడు అన్నప్పుడు ఆ హీరో మీకు ఎందుకు నచ్చుతారు? కారణం.. హీరో అబద్ధాలు ఆడడు. మోసం చేయడు. హీరో హీరోగా ఉండి తొలుత కష్టాలు పడ్డా.. తుదకు అతనిదే పైచేయి అవుతుంది కాబట్టి నచ్చుతాడు. హీరోకు విలన్‌కు తేడా అది. అలాగే జగన్ అనే వ్యక్తి మోసం చేయడు, అబద్ధాలు చెప్పడు. చేయలేనివి చేస్తానని జగన్ నోట్లో నుంచి రాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. – వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు కాపులకు ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, తాము అధికారంలోకి రాగానే ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. మాట తప్పడం, మడమ తిప్పడం (యూటర్న్) తమ ఇంటా వంటా లేదని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై తన మాటల్ని దారుణంగా వక్రీకరించారని, కాపులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. మోసం చేసే వాడే ఎదుటి వాడిపై నేరం మోపినట్టుగా చంద్రబాబు తీరు ఉందని మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం 225వ రోజు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాపు రిజర్వేషన్లపై తన మాటల్ని వక్రీకరించిన చంద్రబాబును, ఆయనకు తాబేదార్లుగా వ్యవహరిస్తున్న ఎల్లో మీడియాను, టీడీపీకి మద్దతు పలకాలని ఉవ్విళ్లూరుతున్న కొందరు పెద్దల్ని ఏకిపారేశారు. పిఠాపురం ఎమ్మెల్యే అరాచకాలు మొదలు జన్మభూమి కమిటీల దురాగతాల వరకు ఆయన ప్రతి అంశాన్నీ తనదైన శైలిలో వివరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే.. నా మాటల్ని వక్రీకరిస్తారా? నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అడుగడుగునా మోసాలు చేశాడు. అబద్ధాలాడాడు. ప్రతి రోజూ ఒక డ్రామా, సినిమా చూపిస్తాడు. ‘ఎన్నికలకు ఆరునెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అంటూ రోజుకొక సినిమా చూపిస్తాడు. ఈనాడు పేపర్ చూస్తే చంద్రబాబు కొత్త డ్రామా కనిపిస్తుంది. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్ చూశా. ఈనాడంటే చంద్రబాబు పేపరే.. అది ఆయన పాంప్లెట్ పేపర్. ఈనాడులో కనిపించిందేమిటో తెలుసా? చంద్రబాబు కాపుల రిజర్వేషన్ కోసం కేంద్రంతో గొడవ పడండని తన ఎంపీలకు చెప్పాడంట. నిజంగా ఈ డ్రామాలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. రెండు మూడు రోజులుగా మీరంతా చూస్తూనే ఉన్నారు. మొన్న జగ్గంపేటలో నేను మాట్లాడా.. ఆక్కడ నేను మాట్లాడిన మాటల్ని ఎంత దారుణంగా వక్రీకరించారో చూశాం. ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు.. ఇతని పార్టీకి మద్దతు పలకాలని ఆరాట పడుతున్న కొందరు పెద్దలు, వారికి బాకా ఊదుతున్న చంద్రబాబు ఎల్లో మీడియా పేపర్లు, టీవీలు చూసినప్పుడు, హేయమైన, స్వార్థపూరిత రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఈ స్థాయికి కూడా దిగజారిపోగలుగుతాయా? అనిపించింది. నిజంగా నాకే రాజకీయాలంటే ‘ఛ’ అని అనిపించే పరిస్థితిలోకి ఈ రాజకీయాలు దిగజారాయి. నిజంగా ఒక మోసగాడు తానే మోసం చేసి.. ఆ నేరాన్ని ఎదుటి వారి మీద మోపుతూ.. మోసం చేసిన వాడే మోసం మోసం అని నిందమోపేలా రాజకీయాలు ఉన్నాయి. పిల్లల చదువులు పెనుభారం చంద్రబాబు హయాంలో పిల్లలను బడికి పంపిస్తే ఒక యావరేజ్ స్కూలుకు కూడా అక్షరాలా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఫీజు అవుతోంది. ఆ ఫీజులు కూడా ప్రతి ఏటా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెరుగుతూనే ఉన్నాయి. ఇంటర్మీడియెట్ చదివించాలంటే భయపడే పరిస్థితి. ఫీజు రూ.65 వేలకు పెరిగిపోయింది. చివరకు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొంటూ అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు ఏప్రిల్‌లో పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి. ఆగస్టు వస్తున్నా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మొదటి క్వార్టర్ పరీక్షలు ప్రారంభం కావాలి. కానీ ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు కాకుండా ప్రయివేటు స్కూళ్లు నారాయణ, చైతన్యలకు వెళ్లేలా చేస్తున్నారు.. ఆ స్కూళ్లు చంద్రబాబు బినామీ. అందుకే రేషనలైజేషన్ పేరిట దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను మూసి వేయిస్తున్నారు. స్కూళ్లకు నాసిరకం యూనిఫాం కూడా ఇవ్వని పరిస్థితి. ప్రభుత్వ స్కూళ్లలో 20 వేల ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక అవస్థలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు నీరుగార్చారు. ఇక్కడే ఉన్న సూరంపాలెంలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి వికాస్ ఉదయం నా వద్దకు వచ్చాడు. ఆ కాలేజీలో ఫీజు రూ.95 వేలట. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.30 వేలు, రూ.35 వేలు ఇస్తున్నారు. గత ఏడాది ఫీజులు ఇంతవరకు ఇవ్వలేదు. మిగిలిన రూ.65 వేలు తల్లిదండ్రులు కట్టలేరని విద్యార్థి రుణం తీసుకున్నాడు. రూ.1.80 లక్షలు రుణం తీసుకున్నానని చెప్పాడు. వడ్డీ కింద విద్యార్థి తండ్రి నెల నెలా రూ.2500 కడుతున్నాడు. ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ రుణం తీçర్చుకోవడానికి మిగిలిన ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని ఆ విద్యార్థి నాతో వాపోయాడు. ఆరోగ్యశ్రీ నాలుగేళ్లలో పడకేసింది. చిన్న చిన్న రోగాల నుంచి పెద్ద రోగాల వరకు వైద్యం అందే పరిస్థితి లేక పేదలు అప్పులు పాలయ్యే పరిస్థితి తీసుకువచ్చాడు. 108కు ఫోన్ చేస్తే వస్తుందన్న నమ్మకం లేదు. డీజిల్ లేదని, మూడు నెలలుగా డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇళ్లు లేవు. ఇళ్ల స్థలాలు లేవు. రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. మినరల్ వాటర్ కనిపించకపోయినా మందు షాపులు లేని గ్రామాలు లేవు. పెన్షన్, రేషన్, మరుగుదొడ్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఏది ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీల మాఫియాకు లంచం లేనిదే పని జరగడం లేదు. ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టిస్తున్నారని చెబుతున్నారు.. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతుంటే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు.. అన్నా.. నాలుగున్నరేళ్ల టీడీపీ ప్రభుత్వం మాకు మంచి చేయక పోయినా ఫర్వాలేదు. హాని చేయకపోతే అదే చాలు అంటున్నారు. అన్నా.. ఇక్కడి ఎమ్మెల్యే మా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని, ఆ ఫొటోలను.. ఫ్లెక్సీలుగా చేసి ఊరూరా పెట్టి ఓట్లు వేయించుకున్నారన్నా.. ఇçప్పుడు నాలుగేళ్లుగా ఆ ఎమ్మెల్యే మాతో కన్నీళ్లు పెట్టిస్తున్నారన్నా.. అని చెబుతున్నారు. అన్నా.. నీరు–చెట్టు పథకం కింద కుమారపురం, తమ్మాయి చెరువు, రాయవరం, రాపర్తి, కడవలడిదొడ్డి తదితర గ్రామాల్లో దాదాపు 25 చెరువులను తవ్వేశారు. ఏ చెరువు చూసినా తాటిచెట్టంత లోతు తవ్వారని చెబుతున్నారు. చెరువులు తవ్వినందుకు బిల్లులు తీసుకోవడమే కాక, మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ఈ నియోజకవర్గంలోనే రూ.100 కోట్లు దోచేశారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరైనా అధికారి బదిలీ కావాలంటే అంతో ఇంతో లంచాలు ఇవ్వాల్సిందేనట. చివరికి ఇక్కడి ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఎంపీడీవో గుండెపోటుతో చనిపోయారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఏస్థాయిలో ఉన్నాయంటే.. పిఠాపురం పట్టణంలో శ్రీపాద వల్లభస్వామికి చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను స్థానిక ఎమ్మెల్యే కొట్టేసేందుకు చేయని ప్రయత్నం లేదని చెబుతున్నారు. ఏరియా ఆసుపత్రిలో చిన్న పిల్లలకు భవనం కట్టాలని ట్రస్ట్ ప్రయత్నం చేస్తే.. ఆ పనులు దక్కలేదని ఇక్కడి ఎమ్మెల్యే ఆ భవనం పనులను అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ చాలా అవసరం. అటువంటి పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లతో మొదలుపెట్టారు. ఆ మహానేత చనిపోవడంతో ఆ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదు. నిజంగా రైతులపై ఈ పాలకులకు ఎంత చిన్నచూపు ఉందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. ధవళేశ్వరం నుంచి తొండంగి వరకు ఉన్న పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద 47 వేల ఎకరాలకు నీరు అందించేలా కెనాల్ అభివృద్ధికి వైఎస్సార్ రూ.25 కోట్లు కేటాయించినా పనులు సాగడం లేదు. సెజ్ భూములు ఎందుకు ఇవ్వలేదు బాబూ? కాకినాడ సెజ్ (ఎస్ఈజెడ్) భూ నిర్వాసితులు నా వద్దకు వచ్చారు. అన్నా.. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు. పనయ్యాక మరో మాట మాట్లాడుతున్నారన్నా అని చెప్పారు. ఆ రోజు కాకినాడ ఎస్ఈజెడ్ భూములు తిరిగి ఇప్పిస్తానని చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు చెప్పారన్నా.. కానీ ఇంతవరకు ఇవ్వలేదన్నా.. కాకినాడ ఎస్ఈజెడ్ భూములు జగన్‌కు సంబంధించినవని ఆ రోజు ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు ఆరోపించారు. రైతుల అవస్థలు చూసి నేనే సవాల్ చేశాను. అయ్యా చంద్రబాబూ.. ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వండని చెబితే ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు సీఎం అయ్యాక రైతులు తమ భూముల కోసం ఆందోళన చేస్తుంటే తిరిగి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితి ఏర్పడింది. ఏ విషయంపైన అయినా ఇతరులపై బురద వేయడం, భ్రష్టు పట్టించడం చంద్రబాబు నైజం. యూ.కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్ సమీపంలో ఉప్పుటేరు వద్ద షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అది వచ్చిందా? ఎన్నికలు అయిపోయాక మోసం చేశారు. చంద్రబాబు ఊరికి పది ఇళ్లు కూడా కట్టించలేదు. ఎక్కడా పేదవారికి సెంట్ స్థలం ఇవ్వడం లేదని, మహానేత ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కుంటున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో 15 వేల ఇళ్లు కట్టించారని చెబుతుంటే నిజంగా సంతోషమనిపించింది. ఇళ్ల స్థలాల కోసం పిఠాపురం నియోజకవర్గంలో పేదలకు దాదాపుగా 93 ఎకరాల స్థలాలు పంపిణీ చేస్తే నాన్నగారు చనిపోయాక ఆ స్థలాలను ఈ ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటుంటే వైఎస్సార్సీపీ తోడుగా నిలబడిందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గం ఉప్పాడ చీరలకు, చేనేత చీరలకు ప్రఖ్యాతి గాంచింది. ఒక్క చీర నేయడానికి మూడు రోజులు పడుతుంది. గతంలో ఒక్క చీరకు రూ.1500 వచ్చేదని, ఇప్పుడు రూ.1000 కూడా రావడం లేదని చెబుతున్నారు. సంఘాల ద్వారా ఆర్డర్లు రావడం లేదని చేనేతలు వాపోతున్నారు. ఉన్న సబ్సిడీలు కూడా ఊడబెరకారని చెబుతున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో చేనేత రంగం ఉంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. మోసం చేసింది ఎవరు బాబూ? ఎవరు మోసం చేశారని చంద్రబాబును నిలదీసి అడుగుతున్నా.. ఎవరయ్యా మోసం చేసింది? ఎవరు మోసం చేశారో కాపు సామాజిక వర్గంలోని ప్రతి సోదరుడికి తెలుసు. ఎన్నికలకు ముందు మోసం చేసింది నీవు కాదా? ఎన్నికలకు ముందు ఫలానాది చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చేయకపోవడాన్ని మోసం అంటారా? కాదా? చంద్రబాబు మోసం ఏ స్థాయిలో ఉందనడానికి నిదర్శనమే నిన్న జరిగిన ఘటన. జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు.. ఇలాంటి వారంతా ఆయా రాష్ట్రాల్లో కులాల రిజర్వేషన్లు కావాలని అడుతున్నారు. మన రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నా సోదరులు అదే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఇది మన అందరికీ కనిపిస్తున్న చిక్కుముడి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిమాండ్లపై దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపని పరిస్థితి కళ్ల ముందు ఉంది. దశాబ్దాలుగా పరిష్కారం రాని ఇలాంటి జఠిలమైన సమస్య మీద చంద్రబాబు తాను చేసేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం మోసం కాదా? మీ అందరి సమక్షంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబును అడుగుతున్నా. అయ్యా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలిసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పిసానని చెప్పడం మోసం కాదా? ఆ మాటను నిలబెట్టుకోవాలన్న కాపులను అణచివేసేందుకు వారిని వేధిస్తున్నప్పుడు వారికి తోడుగా నేనున్నానని అన్న జగన్ మోసగాడా? కాపుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేంత వరకు చంద్రబాబునాయుడుకు కమిషన్ వేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు. కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నప్పుడు హడావుడిగా కమిషన్ వేశాడు. ఆ కమిషన్ పరిస్థితి ఏమిటో తెలుసా? కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే నివేదికను అసెంబ్లీలో పెట్టి తూతూమంత్రంగా తీర్మానించి కేంద్రానికి పంపడం మోసం కాదా? ఇదే చంద్రబాబు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో నాలుగున్నరేళ్లు అధికారం పంచుకుని సంసారం చేశారు. ఇద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేశారు. సంసారం చేసినప్పుడు ఇదే చంద్రబాబునాయుడు చెప్పిన మాట.. మేనిఫెస్టోలో పెట్టిన మాట.. నిలబెట్టుకోకపోవడం మోసం కాదా? మేము అధికారంలోకి రాగానే కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నా. ఈ పెద్దమనిషిని క్షమించొద్దు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. పొరపాటున ఇలాంటి వ్యక్తులను క్షమిస్తే రేప్పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఈ పెద్దమనిషి చంద్రబాబు మీ అందరి దగ్గరకు వచ్చి మీచెవుల్లో పువ్వు ఉందా.. లేదా? అని చూస్తాడు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేసేశానని మీ చెవుల్లో కాలిఫ్లవర్ పెడతాడు. అది మీరు నమ్మరని ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. అదీ నమ్మరని ప్రతి ఇంటికి మహిళా సాధికార మిత్రలను పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతాడు. రూ.5 వేలు ఇవ్వాలని అడగండి. ఆ సొమ్మంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరిలో ఆనందం చూడాలని నవరత్నాలు ప్రకటించాం. అందులో భాగంగా పేద పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిదే. నెల్లూరులో గోపాల్ అనే వ్యక్తి వచ్చి తన పరిస్థితి వినిపించినప్పుడు కడుపు తరుక్కుపోయింది. తన తండ్రి ఫీజు కట్టలేడేమోనని ఇంజినీరింగ్ చదివే ఆయన కుమారుడు ఉరి వేసుకున్నాడు. అందుకే మన ప్రభుత్వం రాగానే ఇంజనీరింగ్, డాక్టర్.. ఇంకా ఏం చదివిస్తారో మీ ఇష్టం. నేను చదివిస్తా. అంతేకాకుండా విద్యార్థుల హాస్టల్ ఖర్చు కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాను. పెద్ద చదువులకు పునాది చిన్నప్పుడే పడాలి. అందుకే పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తాం. మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే నా మాటల్ని వక్రీకరిస్తున్న ఈ పెద్దలందరికీ చెబుతున్నా.. యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంటా వంటా లేదు. కాపుల రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే. బీసీలకు అన్యాయం జరగకుండా, బీసీల హక్కులను కాపాడుతూ కాపుల రిజర్వేషన్లకు మద్దతు అని చెబుతూనే ఉన్నాం. ఈ విషయంలో చిత్తశుద్ధితో మీరు సలహాలు ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మరోసారి ఉద్ఘాటిస్తున్నా. ఇలాంటి దారుణ మోసాలు, అబద్ధాలు చూస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసీ కూడా ఎన్నికలప్పడు చేస్తామని చెప్పడం మోసం కాదా అని ప్రశ్నిస్తే.. ఆ మోసం బాబు చేసింది కాక, ఎల్లో మీడియా ఉందని.. తనకు మద్దతు పలికేవారు ఉన్నారని.. జగన్ మోసం చేస్తున్నాడని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం రాజకీయం అంటారా? ఛ.. ఇవి రాజకీయాలంటారా? అని అడుగుతున్నా. ఇవాళ మీ అందరికీ చెబుతున్నా. ఇంతకు ముందు చెప్పిన అన్ని విషయాలతో పాటు చంద్రబాబు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించాడు. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానన్నాడు. మత్స్యకారులు వెళ్లి గట్టిగా నిలదీస్తే మీ తాట తీస్తానని బెదిరించిన పరిస్థితులు చూశాం. రజకులు, కురుమలను ఎస్సీల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తానన్నాడు. ప్రతి కులాన్ని, మతాన్ని వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబుది. ఈరోజు కులాల రిజర్వేషన్లకు సంబంధించి.. కొన్ని నా చేతుల్లో ఉంటాయి. కొన్ని నా చేతుల్లో లేని అంశాలు ఉంటాయి. కులాలకు సంబంధించి ప్రతి విషయంలోనూ నేను చెప్పగలిగింది ఏమిటంటే.. వాటి విషయంలో ప్రయత్నం చేయగలుగుతామని చెబుతాం కానీ అంతకన్నా సాధిస్తాం, తీసుకువస్తామని ఎవరైనా చెబితే దయచేసి నమ్మవద్దని పిలుపునిస్తున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలి. నిజం చెప్పేవాడు, న్యాయంగా ఉన్నవాడే ఎప్పుడైనా రాజకీయాల్లో పైకి వస్తాడు.. వారినే ప్రజలు, దేవుడు దీవిస్తాడనే సంకేతం కచ్చితంగా ప్రజల్లోకి పోవాలని కోరుతున్నాను. పొరపాటున ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మార్పు రాకపోతే మన పిల్లలు ఈ రాజకీయాలు చూస్తే ఛ... వీరా మన రాజకీయనాయకులు.. అని అనుకొనే çపరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ వ్యవస్థ మారాలి అంటే జగన్ ఒక్కరి వల్లే సాధ్యమయ్యేది కాదు. మీ అందరి తోడు కావాలి. మీ దీవెనలు కావాలి. అబ»ద్ధాలు చెప్పేవారిని, మోసం చేసే వారిని పొరపాటున కూడా క్షమించొద్దని కోరుతున్నాను. సరుకులు ఎక్కడి నుంచి తేవాలయ్యా? మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వండిపెట్టడం భారంగా మారిందయ్యా.. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. బతిమాలుకుని అప్పులు చేసి సరుకులు తెచ్చి వండి పెట్టాల్సి వస్తోంది. విరవాడ జెడ్పీ పాఠశాలలో 550 మంది పిల్లలుంటే సుమారు 400 మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. పదేళ్లుగా నిర్వాహకులుగా పని చేస్తున్నా మాకు మిగిలిందేమీ లేదు. రైతులకు సాయం అందడం లేదన్నా.. అన్నా.. సన్న, చిన్నకారు రైతులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చెరకు, వరి, అరటి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమైంది. ధాన్యం ధర ఈ ఏడాది బస్తాకు రూ.200 తగ్గింది. అరటి పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నా ఈ సర్కారు ఆదుకోవడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతులందరినీ ఆదుకోవాలి. – వైఎస్ జగన్‌తో జి.మహేశ్ వ్యవసాయ పనిముట్లు కొందరికే వ్యవసాయ పనిముట్లు, ప్రభుత్వ రాయితీలు సామాన్య రైతులకు అందడం లేదయ్యా.. పవర్ టిల్లర్, పురుగు మందుల స్ప్రేలు, ఛార్జింగ్ స్ప్రేలు కావాలని మండల వ్యవసాయాధికారులను కోరితే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని చెబుతున్నారు. ఎమ్మెల్యే వద్దకు వెళితే జన్మభూమి కమిటీ వద్దకు పంపుతున్నారు. వారు టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే సిఫార్సు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆదర్శ రైతుల ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చూశారు. మీరు ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుంది. – వైఎస్ జగన్‌తో పి.పద్మావతి -
కాపులకు టోపీ పెట్టారు
-
మేం వెనకడుగు వేయం
-
బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్‌కు మద్దతు: వైఎస్ జగన్
సాక్షి, పిఠాపురం : బీసీలకు అన్యాయం జరగకుండా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కాపులకు మొదటినుంచి అండగా నిలుస్తోంది వైఎస్సార్ సీపీయేననీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్‌కు రూ. 10వేల కోట్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఎల్లో మీడియా మద్దతు ఉందని చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాపులను వేధించిన చంద్రబాబు మోసగాడా? లేక కాపులకు అండగా ఉన్న వైఎస్ జగన్ మోసగాడా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కాపులకు హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేయలేదా? అని నిలదీశారు. ‘కొత్తగా చంద్రబాబు మరో డ్రామా మొదలుపెట్టారు. కాపు రిజర్వేషన్లపై పార్లమెంటులో గొడవ పడాలని చంద్రబాబు తన ఎంపీలకు చెప్పాడట. చంద్రబాబు డ్రామాలు ఎలా ఉన్నాయో అందరూ గమనించాల’ని సూచించారు. 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేమని తెలిసినా.. రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి.. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కాపులకు రూ. 5వేల కోట్ల నిధులిస్తామని చెప్పి చంద్రబాబు గత నాలుగేళ్లలో కేవలం రూ. 1340 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ‘జగన్ అనే నేను.. కాపు కార్పొరేషన్‌కు రూ. 10వేల కోట్లు ఇస్తాన’ని ప్రమాణస్ఫూర్తిగా చెప్పారు. యూటర్న్ తీసుకునే అలవాటు తనకు లేదనీ, రిజర్వేషన్ల విషయంలో సలహాలు ఇస్తే వైఎస్సార్సీపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతీ కులాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. అప్పుడు ఏడ్చాడు.. ఇప్పుడు ఏడ్పిస్తున్నాడు.. ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చి.. ఫెక్సీలు పెట్టి.. ఓట్లు వేయించుకున్న పిఠాపురం ఎమ్మెల్యే, గెలుపొందిన తర్వాత ప్రజలకు కనీళ్లు పెట్టిస్తున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. మంచి చేస్తానని ఎన్నికల్లో నమ్మబలికి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరి పోయాయని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో 25 చెరువుల్ని తాటిచెట్టు లోతు తవ్వి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారనీ, కాంట్రాక్టుల్లో మోసాలకు పాల్పడి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు. ట్రస్టు ఆస్తులకు ఎసరు.. నియోజకవర్గంలో అవినీతి ఎంతలా పేరుకుపోయిందంటే.. అధికారులు బదిలీ కావాలన్నా లంచం ఇవ్వక తప్పదు. బదిలీ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వేధించడంతో పిఠాపురం నియోజక వర్గంలో ఒక ఎంఈవో గుండెపోటుతో మరణించారు. శ్రీపాదవల్లభ స్వామి ట్రస్టుకు చెందిన 100 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేయడానికి టీడీపీ నేతలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పేదల కోసం ట్రస్టు ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలనుకుంది. కానీ, దాని కాంట్రాక్టులు టీడీపీ నేతలకు రాలేదని భవన నిర్మాణాన్ని అడ్డుకున్నారని వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు. ఉప్పుటేరు ఫిషింగ్ హార్బర్ ఏమైంది..! ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తయితే రైతన్నలకు ఎంతో మేలు జరిగేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 103 కోట్లతో ఆధునికీకరణ పనులు ప్రారంభమైతే.. చంద్రబాబు పాలనలో ఇంకా ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టు పనులు 40 శాతం కూడా పూర్తికాలేదని వెల్లడించారు. యూ.కొత్తపల్లి మండలం ఉప్పుటేరు వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని బాబు ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పిఠాపురంలో వైఎస్సార్ 15 వేల ఇళ్లు కట్టించి ఇచ్చారు. కానీ, చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో పది ఇళ్లు కూడా కట్టివ్వలేదని ఎద్దేవా చేశారు. ఉప్పాడ ప్రాంతం చీరలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని నేతన్నలు చీరలకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైస్సార్ పాలనలో ఒక్కో చీరకు 1600 రూపాయలు గిట్టుబాటు కాగా, బాబు హయాంలో 800 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కాకినాడ సెజ్ భూములతో జగన్‌కు సంబంధం ఉందని చెప్పి.. ఆ భూముల్లో ఏరువాక చేపట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే భూములను తిరిగిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. -
కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక కులాన్ని బీసీ జాబితాలో చేర్చే విషయం ఉమ్మడి జాబితాలోని అంశమన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై తమ పరిధిలో చేయాల్సిందంతా పక్కాగా చేశామని చెప్పారు. ‘‘ఈ విషయంలో రాష్ట్రం చేయాల్సింది చేశాం. చట్టం చేసి కేంద్రానికి పంపాం. మా పరిధిలో ఉండేది అది. తరువాత రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలనేది కేంద్రం పరిధిలోని అంశం’’ అని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ రాష్ట్రం పరిధిలోని అంశం కాదని, అది కేంద్రం మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘రాజ్యాంగంలో క్లియర్‌గా ఉంది. ఈ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సి ఉంది. ఈ పని పార్లమెంటు మాత్రమే చేయాలి. అందుకోసం కేంద్రం ప్రతిపాదించాల్సి ఉంటుంది’’ అని అన్నారు. ‘‘ప్రస్తుతం మరాఠాలు, పటేళ్లు రిజర్వేషన్లుకోసం పట్టుపడుతున్నారు. అలాగే యూపీలోనూ, హర్యానాలోనూ, ఇంకా పలు రాష్ట్రాలలో ఇదే తరహా డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరిపి చేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటరాదనేది వాస్తవమే. కానీ ఈ లిమిటేషన్లు తీసేసే అధికారం కేంద్రానికుంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం కేంద్రానికుంది. కేంద్రం అనుకుంటే చేయవచ్చు. అన్ని రాష్ట్రాలను సంప్రదించి చేయాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఎందుకు చేయడం లేదు? కనీసం అవునా, కాదా అనేది కూడా ఎందుకు చెప్పడం లేదు?’’ అని యనమల ప్రశ్నించారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా వారు ప్రశ్నించరు.. కాపు రిజర్వేషన్లపై జగన్ ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని యనమల ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్లపై గతంలో జగన్ అనుకూలంగా.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని కేంద్రాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావట్లేదని యనమల విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. పదో షెడ్యూల్లోని ఆస్తుల పంపిణీని పట్టించుకోవట్లేదు విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని నేతలు సుప్రీంకోర్టును, పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నారని యనమల ఈ సందర్భంగా విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ప్రకారం కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదని తప్పుపట్టారు. ఉన్నత విద్యాసంస్థల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏడాదిలోపు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని, ఏడాది దాటితే కేంద్రం కలుగజేసుకుని పరిష్కరించాల్సి ఉందని, కానీ కేంద్రం ఇంతవరకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 9వ షెడ్యూల్లోని అంశాలను కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. పదవ షెడ్యూల్లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల విలువ లెక్కించి జనాభా ప్రాతిపదికన ఏపీకి 58%, తెలంగాణకు 42% ప్రకారం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రం స్పందించట్లేదన్నారు. పంపిణీ చేయాల్సిన అవసరం లేదంటూ అఫిడవిట్లో పేర్కొనడం దారుణమన్నారు. -
రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమే
-
కాపు రిజర్వేషన్లపై జగన్ మాటలను వక్రీకరిస్తున్నారు
యర్రగొండపాలెం (ప్రకాశం): జగ్గంపేట సభలో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, కొందరు నాయకులు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించి జగన్ వ్యాఖ్యల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సోమవారం వేర్వేరు ప్రకటనలో ప్రకటనల్లో మండిపడ్డారు. జగన్‌పై బురదజల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కాపులతో సహా ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వారి డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవన్నీ తెలిసి తనకు ఓట్లు వేస్తే ఆరు నెలల్లో రిజర్వేషన్ కల్పిస్తామని కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చి నిలువునా మోసం చేశారన్నారు. మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండా నివేదిక స్వీకరించి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే న్యాయపరమైన అడ్డంకులు లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరచుకునేలా చంద్రబాబు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారని జంకె వెంకటరెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉండి, చంద్రబాబు 9వ షెడ్యూల్లో రిజర్వేషన్లు పెట్టించి ఉంటే ఈ పరిస్థితి రాదన్నారు. తమిళనాడు, కర్నాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా, ఏ మాత్రం నష్టం జరగకుండా 50 శాతానికి మించి కాపులకు రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబులా తాను గాలి మాటలు చెప్పలేనని, బూటకపు హామీలు ఇవ్వలేనని జగ్గంపేట సభలో జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారన్నారు. తుని ఘటనకు స్పందనగా కాపుల రిజర్వేషన్లపై ఆ రోజు తమ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలకు పార్టీ కట్టుబడి ఉందని, తాము ఎప్పుడూ మాట మార్చలేదని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. కాపుల్లో ఆర్థికాభివృద్ధికి ఐదేళ్లలో 5 వేల కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చారని, చంద్రబాబు ఇస్తానన్న రూ.5 వేల కోట్లకు రెట్టింపు స్థాయిలో అంటే రూ.10 వేల కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు. కాపుల మీద ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా కాపు రిజర్వేషన్ల విషయంలో సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ–బీజేపీ ఇచ్చిన హామీలకు నాదీ బాధ్యత అని చెప్పిన పవన్‌కల్యాణ్ వారిని ప్రశ్నించకుండా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీని ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో వైఎస్సార్ సీపీపై, జగన్‌పై అభాండాలు వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ కృష్ణయ్య!
సాక్షి, హైదరాబాద్ : రిజర్వేషన్ల విషయంలో అమలుకాని హామీలు ఇవ్వలేనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య స్పందించారు. వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే వాస్తవికవాదిగా మాట్లాడారని ఆయన అన్నారు. రిజర్వేషన్ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, రిజర్వేషన్లు ఒక పరిమితి మించి ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ అవసరవుతుందని ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. -
నాడు వైఎస్ఆర్.. నేడు జగన్
-
వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారు
-
‘కాపు రిజర్వేషన్లకు బాబు వ్యతిరేకి’
-
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ కృష్ణయ్య!
-
వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
సాక్షి, హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా లబ్ది పొందాలని కొన్ని శక్తులు కుట్ర పన్నాయన్నారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మాత్రమే తమ అధినేత వైఎస్ జగన్ చెప్పారని, కాపురిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హామీ ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని, కాపు రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తునే ఉంటామన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు బాధాకరమని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. 6 నెలల్లో బీసీ కమిషన్ వేసి కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, మరి ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఈ రోజు వరకు కాపు రిజర్వేషన్ల అంశం ఎందుకు పెండింగ్‌లో ఉందన్నారు. ముద్రగడ ఉద్యమం తర్వాతే చంద్రబాబుకు కాపులు గుర్తొచ్చారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కమిషన్ వేసి రిపోర్ట్‌ను పరిశీలంచకుండా హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. కాపురిజర్వేషన్లపై బీసీ కమిషన్ ఛైర్మన్ నివేదిక ఇవ్వలేదని, విడివిడిగా నివేదికలు ఇచ్చే అధికారం ఎవ్వరికి లేదని ఛైర్మనే చెప్పారని అంబటి గుర్తుచేశారు. ఈ అంశంపై కేవలం ముగ్గురు సభ్యులు ఇచ్చిన రిపోర్టునే కేంద్రానికి పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న నిధులనే కాపులకు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. ముద్రగడ ఆమరణ దీక్షకు దిగితే తలుపులు పగలగొట్టి ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు కొట్టుకుంటు లాక్కెళ్లారని, ఆ సమయంలో ఆయనకు అండగా నిలబడిన వ్యక్తి వైఎస్ జగనే అని గుర్తుచేశారు. తుని ఘటనలో ముద్రగడ, బొత్స సత్యనారయణ, భూమన కరుణాకర్ రెడ్డి, తనపై కేసులు పెట్టారని, కాపు రిజర్వేషన్ల కోసం దివంగత నేత దాసరి నారాయణ రావు నేతృత్వంలో తమంతా పోరాడామన్నారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైఎస్సార్సీపీనే అని, ఈ అంశం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. -
‘కాపు రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకం’
సాక్షి, విజయవాడ: కాపు రిజర్వేషన్లపై మాట తప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం మాట తప్పారని మండిపడ్డారు. బీసీ నాయకులను చంద్రబాబు రెచ్చగొట్టి కాపులపై దాడుల చేయించారని ధ్వజమెత్తారు. కేవలం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారన్నారు. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే బాబు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఉద్యమం చేసిన కాపులను, ముద్రగడ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. తుని ఘటనలో కాపులపై టీడీపీ ప్రభుత్వం అనేక తప్పుడు కేసుల పెట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్‌పై చంద్రబాబు నాలుగున్నర ఏళ్లుగా కాలయాపన చేశారన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రయత్నిస్తోందని కన్నా తెలిపారు. రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రానికి పంపి బాబు చేతుల దులుపుకోవాలనుకున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సిగ్గుందా? కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని టీడీపీ వర్గానికి చెందిన ఓ మీడియా రాయడం సరైనది కాదని కన్నా లక్ష్మీనారయణ పేర్కొన్నారు. రైల్వే జోన్ ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు ఒంగోలు వెళ్లి ధర్మ పోరాట దీక్ష పెట్టడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం అవినీతి చేయడానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. హోదాపై అనేక సార్లు మాట మార్చిన బాబుకు పరిపక్వత లేదని ఎద్దేవ చేశారు. రాష్ట్ర అభివృద్దిపై చర్చ చేయడానికి మోడీ అవసరం లేదని.. చంద్రబాబు స్థాయికి తాను సరిపోతానని కన్నా పేర్కొన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. హిందుత్వంపై చంద్రబాబు దాడికి దిగుతున్నారని అందుకే శివస్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారిన మండిపడ్డారు. -
‘నాడు వైఎస్ఆర్.. నేడు జగన్’
గుంటూరు : కాపు రిజర్వేషన్లను వైఎస్సార్సీపీ వ్యతిరేకించట్లేదని, ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మాత్రమే జగన్ చెప్పారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాల్ పురం రాముతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ మాత్రమే కాపులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను టీడీపీ ప్రభుత్వం గృహ నిర్భదం చేసినప్పుడు, వారి కుటుంబ సభ్యులకు జగన్ అండగా నిలిచిన విషయం ముద్రగడ మర్చిపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే కాపులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ముద్రగడ వెనుకున్న టీడీపీ నేతలు ఆయనతో అలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. -
చంద్రబాబు దగా చేశారు...
-
రాజకీయ స్వార్థం కోసం జగన్ వ్యాఖ్యల వక్రీకరణ
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, మరికొందరు నేతలు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఇతర నేతలతో కలసి ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు సంబంధించి అక్కడ ఎదురైన సందర్భాన్ని పక్కనపెట్టి కాపు రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమనే ధోరణిలో వక్రభాష్యం చెబుతున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టుకుని కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరి చెప్పాలని కోరిన సందర్భంలో జగన్ అనేక వాస్తవ విషయాలను తన ప్రసంగంలో వివరించారని ఆయన తెలిపారు. చంద్రబాబు దగా చేశారు... రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని జగన్ విశదీకరించారన్నారు. ఈ వాస్తవం తెలిసినా టీడీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇచ్చేస్తానంటూ కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. న్యాయపరమైన అడ్డంకుల్లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచేలా చూడాల్సిన చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. కేంద్రంలో మంత్రి పదవులు పంచుకుని అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు సర్కారు ఆరోజే కాపు రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఉంటే.. కర్ణాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా ఇక్కడ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ చంద్రబాబులా గాలి మాటలు తాను చెప్పలేనని, బూటకపు హామీలు ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారన్నారు. కాపులను మభ్యపెట్టే క్రమంలో మంజునాథన్ కమిషన్ వేసి దాని నివేదిక పూర్తికాకుండా, చైర్పర్సన్ సంతకం కూడా లేకుండా ఓ నివేదికను కేంద్రానికి పంపి చంద్రబాబు చేతులు దులుపుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించలేకపోగా, వాస్తవాలను మాట్లాడుతున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై మాత్రం అర్థంలేని విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా చంద్రబాబు ఒక్కసారైనా కాపు రిజర్వేషన్ల అంశాన్ని అక్కడ అడగలేకపోయారని కన్నబాబు విమర్శించారు. ఢిల్లీ పర్యటనల్లో పోలవరం ప్రాజెక్టు పనులను సొంత మనుషులకు కట్టబెట్టుకోవడం, లాలూచీ వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారే తప్ప ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బాబు తప్పు కనిపించట్లేదు కానీ.. జగన్ మాటల్ని వక్రీకరిస్తారా? కాపు రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తమ పార్టీ చెప్పిన మాటలకు ఎప్పటికీ కట్టుబడే ఉంటుందని కన్నబాబు తెలిపారు. కాపుల ఆర్థికాభివృద్ధికి ఐదేళ్లలో రూ.ఐదువేల కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని ఆయన గుర్తు చేస్తూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తామని చెప్పిన జగన్ మాటల్లోని చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలు మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయకపోయినా ప్రశ్నించకపోవడం, ప్రశ్నించడానికే పార్టీ అన్న పవన్‌కల్యాణ్ స్పందించకపోయినా మాట్లాడని నేతలు, జగన్ వ్యాఖ్యలను వక్రీకరించడంలో మాత్రం ముందుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని అభ్యర్థినని మోదీ, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న తనను మళ్లీ గెలిపించాలని చంద్రబాబు కోరితే తప్పుగా కనిపించట్లేదని, తమకు అధికారమిస్తే ప్రజలకు మంచి చేస్తానన్న జగన్ మాటలను మాత్రం అడుగడుగునా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ హామీలు అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా సరిపోదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై కన్నబాబు మండిపడ్డారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్‌పైనా, గృహ నిర్మాణాల పథకాలపైనా ఇలాంటి విమర్శలే చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆచరణలో వాటిని వైఎస్ అమలు చేసి చూపించారన్నారు. దేశవ్యాప్తంగా 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, ఒక్క ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ 48 లక్షల ఇళ్లను నిర్మించారని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు హయత్ హోటళ్లకు, విదేశీ, స్వదేశీ పర్యటనల్లో వాడే విమాన చార్జీలకు చేసే దుబారాను తగ్గించుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చునన్నారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసినా జగన్ వ్యాఖ్యల్లోని సారాంశాన్ని కాపు కులస్తులు అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ముద్రగడపై రాజా ఫైర్.. తన కుటుంబంపై జగన్ చూపించిన ప్రేమలో మొసలికన్నీరు కనిపిస్తుందంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్ వ్యాఖ్యలు చేదుగానూ కనిపిస్తున్నాయా? అని నిలదీశారు. ముద్రగడ ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో తన ఉనికిని కాపాడుకునేందుకు తమ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. జగన్‌పై యనమల చేస్తోన్న వ్యాఖ్యలపైనా రాజా విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు 50సార్లు రాజ్యాంగ సవరణ జరిగిందంటూ యనమల మాట్లాడారని, వాస్తవానికి 101సార్లు రాజ్యాంగ సవరణ జరిగిన విషయం కూడా ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లపై న్యాయం జరుగుతుందన్న యనమల వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ నాలుగేళ్లుగా ఏ గుడ్డిగాడిదకు పళ్లు తోముతున్నావని నిలదీశారు. కాపుల్లో జగన్‌పై విశ్వాసం: జక్కంపూడి జగన్ వల్ల తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కాపు సామాజికవర్గంలో ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మాట ఇస్తే కట్టుబడే వ్యక్తిత్వం, నమ్ముకున్నవారికి న్యాయం చేసే తత్వం జగన్‌కు ఉందన్నారు. చంద్రబాబు రెండునాల్కల ధోరణితో ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ముద్రగడ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. గతంలో ఉద్యమ సమయంలో జగన్ అనుమతితోనే తామంతా ముద్రగడ వెంట నడిచిన విషయాన్ని మరువరాదన్నారు. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా గోదావరి వంతెనపై అశేష జనవాహినితో కనిపించిన స్పందనకు బాబు పునాదులే కదిలాయని, అందుకే జగన్ మాట్లాడే ప్రతిమాటను వక్రీకరిస్తూ తమకు అనువుగా మలుచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్సీపీ పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు కోఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావు నాయుడు, పర్వత ప్రసాద్, మాజీమంత్రి కొప్పన మోహనరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పని అయిపోయిందని తప్పుకోవద్దు : ముద్రగడ
సాక్షి, కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కాపులకు తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ చంద్రబాబుకు శనివారం లేఖ రాశారాయన. లేఖలో.. గవర్నర్ ఆమోదంతో బీసీ రిజర్వేషన్లు అమలు చేయోచ్చని మేథావులు, న్యాయవాదులు సలహా ఇస్తున్నారని పేర్కొన్నారు. బిల్లు కేంద్రానికి పంపేశాను.. నా పని అయిపోయిందని తప్పుకోవద్దని సూచించారు. చంద్రబాబు ఆలోచన బస్సు, రైలు వెళ్లిపోయాక స్టేషన్‌కు వచ్చినట్లుందని ఎద్దేవాచేశారు. అలా ఆలోచించకూడదని ముద్రగడ పద్మనాభం అన్నారు. -
చంద్రబాబును ఓడించడమే మా లక్ష్యం
-
‘పవన్.. అది చాలా ప్రమాదకరం’
విజయనగరం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావ్ మండిపడ్డారు. రాజకీయం తెలియనటువంటి వాళ్లు ప్రాంతాలు, మతాలను రెచ్చగొట్టడం చేస్తున్నారు. వాళ్లలో విష బీజాలు నాటేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందలేదు. వీటి కారణంగా రాబోయే తరాలు ఎంత బాధపడతారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలంటే ప్రాంతాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టేవి కాదు. ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం ఉందంటున్నారు. అయితే దానిపై నీ పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుంది. జనసేన అంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ. అది కూడా కాదు కేవలం వన్ మ్యాన్ షో అనొచ్చు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సహా మిగతా పెద్దలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టి సేవ చేస్తామని వచ్చారు. కానీ విద్వేష రాజకీయాలు చేయడం మంచిది కాదు. ప్రజలను రెచ్చగొట్టటంతో అందరికీ ప్రమాదమే. కాపుల రిజర్వేషన్లపై పవన్ మాట్లాడుతున్నారు. పవన్.. మీ స్నేహితులు బీజేపీ వాళ్ల దగ్గర ఉన్న రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పాస్ చేయించాలి. అయితే ఇలా చేసి ఓ సామాజిక వర్గానికి సాయం చేయడం మానేసి ప్రాంతాలు, కులాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టడం తగదు. జనసేనది అనేది స్వరూపం లేని పార్టీ. మీ పార్టీ పాలసీ ఏంటి, స్వరూపం ఏంటో చెప్పడం నాయకుల లక్షణం. తెల్లవారితే సీఎం చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్‌పై, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడం తగదని’ పవన్ కల్యాణ్‌కు కళా వెంకట్రావ్ సూచించారు. -
పవన్‌ను హెచ్చరించిన కళా వెంకట్రావ్
-
కాపులను చంద్రబాబు తిడుతున్నారు : ముద్రగడ
సాక్షి, శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తున్నారని, రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో పాటు తమను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపు బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారని, అందులో సరైన సమాచారం లేదని కేంద్రం వెనక్కి పంపడం నిజం కాదా అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో తగాదా వచ్చాక మా బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాజస్తాన్, గుజరాత్, హరియాణా తరహాలో కాకుండా గతంలో ఉన్న రిజర్వేషన్లనే కాపులు అడుగుతున్నారని ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత గుర్తుచేశారు. ‘1910వ సంవత్సరం (బ్రిటీష్ కాలం) నుంచి మా జాతికి రిజర్వేషన్ ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా మాకు రిజర్వేషన్ కల్పించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య హయాంలోనూ రిజర్వేషన్ ఉంది. కానీ బీసీలుగా ఉద్యోగాలు పొంది, ఓసీలుగా కాపులు పదవీ విరమణ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తుగా ఓడించాలి. 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు మా రిజర్వేషన్లపై సృష్టత ఎవరు యిస్తారో, అప్పుడు మా కాపు జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల పెద్దలతో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని’ ముద్రగడ పేర్కొన్నారు. -
‘విస్తరాకు పరిచారు కానీ ఏం వడ్డించలేదు’
కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మరో లేఖ సంధించారు. కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి గుర్తుచేశారు. తమ జాతికి విస్తరాకులు మాత్రమే వేశారు కానీ విస్తరాకులో ఏం వడ్డించలేదని వ్యంగ్యాత్మకంగా విమర్శించారు. ‘కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు. తమరు తీర్మానం చేసి పంపిన బిల్లును కేంద్రం నుంచి తిరిగి వచ్చిన సంగతి మీకు తెలియలేదా? ఇవాల్టికీ తహశీల్దారు కార్యాలయంలో మా జాతి బీసీ-ఎఫ్ ధృవీకరణ పత్రం పొందలేని పరిస్ధితి నెలకొంది. ఈ విషయాలు పక్కన పెట్టి అసెంబ్లీలో తమరు పచ్చి అబద్ధాలు చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. మీరు కష్టపడటం వల్ల రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సుఖశాంతులతో ఉన్నారని డబ్బా వాయిస్తున్నార’ని లేఖ ద్వారా ధ్వజమెత్తారు. ‘ఎవరూ, ఎక్కడా, ఏ జాతి సుఖంగా ఉందో చెప్పగలరా..?. తమ సహకారం ఉన్న కుటుంబాలు మాత్రమే సుఖంగా ఉన్నాయి. మాకు తెలిసీ తమ కుటుంబం, తమ సామాజిక వర్గంలో కొందరు తరతరాలుగా తరగని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా తమరికి వ్యతిరేకంగా మాట్లాడితే.. అతడు అమ్ముడు పోయాడని తమరి బృందం, మీడియాతో చెప్పిస్తార’ని విమర్శించారు. అసెంబ్లీని మీ డబ్బా కొట్టుకోవాడానికి ఉపయోగించుకోకండి, అసెంబ్లీని దేవాలయంలా చూడండని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. తమరి పాలన చివరికి వచ్చింది కాబట్టి... మా జాతికి, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీతో పాటు మిగతా హామీలను అమలు చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు. -
‘ఆ రెండు కులాల మధ్య వైరం సృష్టించారు’
-
‘కాపులు, బీసీల మధ్య వైరం సృష్టించారు’
సాక్షి, అమరావతి: కాపులు, బీసీలకు మధ్య వైరాన్ని సృష్టించారని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం అన్ని కులాలను వంచించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాపులకు కంటితుడుపుగా రిజర్వేషన్లు ఇచ్చి చేయి దులుపుకున్నారన్నారు. ఢిల్లీకి పంపిన కాపు రిజర్వేషన్లపై తాజా స్టేటస్ ఇవ్వాలని ఆయన కోరారు. ఏ వ్యవస్థలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సక్రమంగా పనిచేయలేదని విమర్శించారు. కాపులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాపులకు అన్యాయం చేస్తే ఊరుకోం
నంద్యాల అర్బన్: ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. బలిజల ఆత్మీయ కలయికలో భాగంగా శనివారం నంద్యాల పట్టణం త్రినేత్ర గెస్ట్లైన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కాపులకు బీసీ ఎఫ్ కోటాలో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మార్చి 31లోగా కాపులకు బీసీ ఎఫ్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలన్నారు. కాపుల బీసీ జాబితా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సిన అవసరం లేదన్నారు. రిజర్వేషన్లు ఇస్తున్నామని రెకమెండ్ చేయాలని మాత్రమే చెప్పవచ్చన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం అన్యాయమన్నారు. ‘‘అధికారం ఇవ్వండి.. మీ జాతికి రిజర్వేషన్లు కల్పిస్తామం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యమాలు చేస్తుంటే అణగదొక్కాలని చూడటం దారుణమన్నారు. డబ్బు, పదవుల కోసం తాను పోరాటం చేయలేదన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం గ్రామ గ్రామానా తిరిగి ఆత్మీయ బంధువులను కలవాలని ఉందని అన్నారు. బలిజ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ కాపు జాతి కోసం దివంగత నేత వంగవీటి మోహన్‌రంగ తర్వాత ముద్రగడ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ ఇంత వరకు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేశామని, ఇప్పుడు అమలు కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం బలిజ సంఘీయులంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని నల్ల విష్ణు అన్నారు. కాపులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ సిద్దం శివరాం అన్నారు. అడ్వకేట్ శ్రీనివాసులు, జగన్‌ప్రసాద్, ఓబులపతి, సుబ్బారెడ్డి, గోపాల్, కైలాసనాథ్ పాల్గొన్నారు. చిత్తశుద్ధి కనపడటం లేదు.. కాపులను బీసీలో చేర్చే రిజర్వేషన్ల జాబితాపై చంద్రబాబుకు చిత్తశుద్థి కనపడటం లేదని కాపునేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆత్మీయ సమ్మేళనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీ ఎఫ్ జాబితాలో చేర్చే విషయం రాష్ట్రస్థాయిలో ఉన్నా కేంద్రానికి పంపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. -
'రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు జిమ్మిక్కులు'
-
సీఎం చిత్తశుద్ధిపై సందేహం వస్తోంది: ముద్రగడ
తూర్పుగోదావరి జిల్లా : ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురువారం లేఖ రాశారు. లేఖ సారాంశం.. పత్రికలలో వస్తున్న కథనాలతో కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు నాయుడి చిత్తశుద్దిపై సందేహం వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లను గవర్నర్ సంతకంతో రాష్ర్ట పరిధిలో అమలు చేయవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారని, అయితే తమరు రాష్ర్ట పరిధిలో అమలు చేయకుండా రాష్ర్టపతి అనుమతికి పంపించడంతో మీ(చంద్రబాబు) చిత్తశుద్ధిని, నిబద్ధతను అనుమానించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు. కాపు జాతిని మోసపుచ్చి మరింత నష్టపెట్టే చర్యలు చేపట్టవద్దని సీఎంను కోరారు. తమరు ప్రకటించిన రిజర్వేషన్లు తక్షణం అమలు చేయకుండా మమ్మల్ని మోసపుచ్చాలని చూస్తే తాము కూడా అదే విధంగా మోసం చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. -
చంద్రబాబు వల్లే కాపులకు అన్యాయం
సాక్షి, కాకినాడ : కాపు రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు వల్లే కాపులకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. కాగాకాపు రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లపై ఇందుకు డీఓపీటీ ...కేంద్ర హోంశాఖకు రాసిన లేఖే ఉదాహరణ అని అన్నారు. చంద్రబాబు చేసిన తీర్మానంలో పసలేదని డీవోపీటీ చెప్పిందని, మంజునాథ కమిషన్ తన నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు హడావుడిగా కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. అందుకే ఆ తీర్మానంపై డీవోపీటీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. చంద్రబాబు మరోసారి కాపులకు ద్రోహం చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో కాపులకు బీసీ రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. -
‘మార్చి 31 తర్వాత సిద్ధంగా ఉండండి’
చిత్తూరు : ఇచ్చిన మాటను మార్చి 31లోపల నెరవేర్చాలని లేదంటే ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలని కాపులకు కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాటనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. కాపు జాతికి ఎన్నికల సమయంలో ఇస్తామన్న రిజర్వేషన్ హామీ నెరవేర్చలేదని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గర్జన చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.హమీ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరినందుకే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. గోదావరి జిల్లాల్లో కాపు సోదరులను టీడీపీ నాయకులు, పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టారని వ్యాఖ్యానించారు. ‘ఏ కోరిక తాము కోరకపోయినా హామీలు ఇచ్చింది మీరు...ఇచ్చిన హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్ కాకుండా 10 శాతం ఇవ్వాలని కోరుతున్నాం’ అని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని, గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని కోరారు. -
అందుకు పవన్ నాయకత్వం సరిపోదు
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు పవన్ కల్యాణ్ నాయకత్వం సరిపోదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం తిరుపతిలో జరిగిన బలిజల ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎంపీలు, కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి ప్రత్యేక హోదా సాధనకు పోరాడాలని సూచించారు. ఇందుకోసం తమ జాతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముద్రగడ అన్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి బీసీ సర్టిఫికేట్ పొందినప్పుడే కాపులకు పండుగని అన్నారు. చంద్రబాబు జాప్యం వహించడం వల్లే కాపులంతా రోడ్లపైకి వచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి త్రికరణ శుద్ధితో అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో జరగబోయే నియామకాల్లో బీసీ ఎఫ్ ద్వారా తమ జాతికి న్యాయం చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఎలా ఆకలి తీర్చుకోవాలో తమకు తెలుసునన్నారు. సరైన సమయంలో ఉద్యమించి ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాపులను మోసం చేయాలని భావిస్తే,, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఎలా మోసం చేయాలో నిర్ణయిస్తామన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో సీఎం వెనకడుగు వేయరని భావిస్తున్నామని ముద్రగడ తెలిపారు. -
చేతలు అలా... మాటలు ఇలా..
జిల్లాలో బుధవారం జరిగిన పలు జన్మభూమి సభల్లో నిరసన గళాలు వినిపించాయి. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం క్రిష్ణవరం గ్రామంలో అధికార పక్షానికి చెందిన సర్పంచి, ఎంపీటీసీ వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని దాడి చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో కొత్తపల్లి, కుతుకుడుపల్లి గ్రామాలకు సంబంధించిన గ్రామసభలో అధికారులను నిలదీశారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నివేశన స్థలాలు, సమస్యలు పరిష్కరించడం లేదని సీపీఐ (లిబరేషన్) పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. ఒకే రోజు... ఒకే సమయం... విభిన్న అభిప్రాయాలు ... జన్మభూమి సభల్లో నిలదీతలు ... కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆందోళనలు... సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలివీ. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన ‘జన్మభూమి–మా వూరు’ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం రాకను జిల్లా బీసీ సంఘాల నేతలు ‘బ్లాక్ డే’గా ప్రకటించాయి. సభా ప్రాంగణంలో నిరసనలు తెలపాలని భావించాయి. ముందస్తు హౌస్ అరెస్టులతో పోలీసులు భయోత్పాతం సృష్టించడంతో ఆయా సంఘాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన జన్మభూమి సభల్లో జనం కన్నెర్ర చేసి నిలదీతల పరంపర కొనసాగించారు. సీఎం వచ్చి, వెళ్లేంత వరకూ ఇదే వేడి కొనసాగింది. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి ‘జన్మభూమి–మా ఊరు’ సభకు బుధవారం వచ్చిన సీఎం చంద్రబాబు సభలో నిరసన తెలియజేయాలన్న బీసీల వ్యూహాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేశారు. బీసీ నేతలను గృహ నిర్బంధాలు,... ముందుస్తు అరెస్టులతో ఇళ్లకే పరిమితం చేశారు. సాక్షి, రాజమహేంద్రవరం/ముమ్మిడివరం: కాపు కార్పొరేషన్ ద్వారా 2016 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 286 మందికి రుణాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో సూర్యనారాయణ అనే వ్యక్తితో అసత్యాలు చెప్పించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం చంద్రబాబు సభకు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు బీసీ, కాపు కార్పొరేషన్ లబ్ధిదారులతో సభలో మాట్లాడించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ నుంచి రెండు లక్షల రుణం తీసుకున్నానని, తనకు రుణం ఎలా వచ్చిందన్న విషయం సూర్యనారాయణ అనే వ్యక్తి వివరించారు. సీఎం చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 34 వేల మంది కాపులకు రుణాలు ఇప్పించారని పేర్కొన్నారు. అంతకు కొద్ది నిమిషాల ముందు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో 40 ఏళ్లుగా తాను నీతి, నిజాయతీలతో ఉన్నానని చెప్పిన తర్వాతే ప్రభుత్వం సూర్యనారాయణతో కాపు కార్పొరేషన్ ద్వారా 34 వేల మందికి రుణాలు ఇచ్చినట్లు చెప్పించడంతో సభకు వచ్చిన అధికారులు అవాక్కయ్యారు. ముమ్మిడివరంపై వరాల జల్లు ముమ్మిడివరం నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న ఆరు ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకాల మరమ్మతుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఐ.పోలవరం మండలం జి.ములపొలం–గొల్లగరువులో నిలిచిపోయిన వంతెన పనులకు సంబంధించి రూ. 60 కోట్లతో తిరిగి అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. గుజరాత్ పెట్రోలియం సంస్థ నుంచి మత్స్యకారులకు రావాల్సిన 12 నెలల నష్టపరిహరం ఇపించేందుకు చర్యలు తీసుకుంటామని çహామీ ఇచ్చారు. సభకు కాలేజీ బస్సులు.. విద్యార్థులకు అవస్థలు... జన్మభూమి–మా ఊరు సభకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో కోనసీమలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు పంపించారు. ఆయా బస్సులలో డ్వాక్రా మహిళలు, రైతులు, పింఛన్ లబ్ధిదారులు వచ్చేలా డీఆర్డీఏ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఆయా అధికారులు వారిని తీసుకురావడానికి, సీఎం ప్రసంగం పూర్తయ్యేవరకు ఉంచటానికి పడరాని పాట్లు పడ్డారు. సీఎం మాట్లాడుతుండగానే సభ నుంచి మహిళలు వెళ్లిపోవడంతో సభ పేలవంగా మారింది. డ్వాక్రా మహిళలు వెళ్లిపోతుండగా డీఆర్డీఏ అధికారులు బలవంతంగా వారిని సభలో కూర్చోబెట్టారు. పలు పనులకు శంకుస్థాపనలు... ముందుగా సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీఆర్డీఏ స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం రూ.35 కోట్లతో నిర్మించే ఐ.పోలవరం మండలం సలాది వారిపాలెం–పశువుల్లంక గోదావరిపాయపై వంతెన నిర్మాణ పనులకు, ముమ్మిడివరంలో రూ.45 కోట్లతో నిర్మించే 133 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, రూ. 25 కోట్లతో నిర్మించే మహిపాల చెరువు–పల్లంకర్రు ఆర్అండ్బీ రోడ్డు పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యుత్‌శాఖ మం త్రి కిమిడి కళా వెంకటరావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు: ముద్రగడ
సాక్షి, వెంకటగిరి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు పరిచయం లేదని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పర్యటించిన ముద్రగడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల కోసం కలిసి రాని వారిని బలవంతపెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి మార్చి 31 వరకూ గడువిస్తున్నామని, ఆలోపు రిజర్వేషన్లు అమలు చేయకపోతే తమ పోరాటం మళ్లీ కొనసాగిస్తామన్నారు. వెంకటగిరికి చెందిన ప్రముఖ వైద్యుడు వై.కమలాకర్సాయి, ప్రముఖ న్యాయవాది బీరం రామదాసులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలంలోనే కాపు, ఒంటరి కులస్తులకు రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తు చేశారు. వాటిని పునరుద్ధరించమని మాత్రమే తాము కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రంలో అమలు చేయాలంటే రాష్ట్రపతి సంతకం అవసరమని, రాష్ట్రంలో గవర్నర్ అనుమతితో కాపు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారని తెలియజేశారు. అనంతరం రాజా కుటుంబీకులు డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట కాపు సంఘం నాయకులు ఉన్నారు. -
రిజర్వేషన్లు 12 శాతానికి పెంచాలి: ముద్రగడ
కిర్లంపూడి (జగ్గంపేట): కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం.. భోజనానికి పిలిచి టిఫిన్ పెట్టినట్లుగా ఉందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సంఖ్యా బలానికి అనుగుణంగా కాపులకు రిజర్వేషన్లు 10 నుంచి 12 శాతానికి పెంచాలని ఆయన శుక్రవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో ఆయన విడుదల చేశారు. -
తన వైఖరి స్పష్టం చేసిన కాపు ఉద్యమనేత
సాక్షి, కాకినాడ : కాపు రిజర్వేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎదురుచూస్తామని.. అప్పటికీ కాపు రిజర్వేషన్లు అమలుకాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏపీ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పదర్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన కాపు జేఏసీ కార్యాచరణ సదస్సుకు 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు, ఉద్యమనేత ముద్రగడ పాల్గొన్నారు. కాపు జేఏసీ సదస్సులో ముద్రగడ పలు అంశాలను ప్రస్తావించారు. 'పేద వారికి రిజర్వేషన్లు కావాలన్నది నా ఆశ. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందాలంటే రిజర్వేషన్నది కచ్చితంగా ఉండాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గించకూడదని మనవి చేస్తున్నాను. బీసీలకు రిజర్వేషన్ తగ్గించకుండానే కాపు రిజర్వేషన్లు అమలుచేయాలన్నది ప్రధాన డిమాండ్. ఏళ్ల తరబడి కోరుతున్నా కాపు రిజర్వేషన్లపై ముందడుగు పడటం లేదు. ఉద్యోగ, ఇతర రంగాలతో పాటు, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలి. అలా జరిగితే అందరికీ సమాన అవకాశాలుంటాయని' కాపు నేత ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు. -
బీసీ రిజర్వేషన్‌పై స్పందించిన మంత్రి పితాని
సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. వెనుకబడిన వర్గాలకు నష్టం కలిగించే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించారని, బీసీల మనోభావాలు, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా చర్చిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం పితాని సత్యనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పితాని మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల్లో నెలకొన్న ఆందోళన నెలకొందని, తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే బీసీ సంఘ ప్రతినిధులతో కూడా చర్చించేందుకు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రభుత్వం ముందుగాని, నిర్ణయం వెల్లడించిన తరువాత గానీ వెనుకబడిన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేదికాదని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని, ఈ విషయంలో తాను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు మంత్రి పితాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలకు నష్టం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించరని, తమకు కూడా బీసీల ప్రయోజనమే ముఖ్యమని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై వెనుకబడిన వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని, సమస్య జఠిలం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం హర్షణీయమని, దీనివల్ల వారి స్థితిగతులు మారతాయన్నారు. -
కాపు రిజర్వేషన్లపై టీడీపీ నేతల్లో అనుమానాలు
-
రగిలిన చిచ్చు
కాకినాడ రూరల్: కాపులను బీసీల్లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయంతో చిచ్చు రగిలింది. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడిన బీసీలు ఉద్యమ పథంలో కదం తొక్కారు. కాపు రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బీసీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త్తతకు దారి తీసింది. వందలాదిగా కలెక్టరేట్‌కు తరలివచ్చిన బీసీలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. టైర్లు తగులబెట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని కాజులూరు మండలం కోలంకకు చెందిన యువకుడు మేడిశెట్టి ఇజ్రాయిల్ ఆత్మహత్యా యత్నం చేశాడు. అక్కడే ఉన్న బీసీ నాయకులు స్పందించి నీరు పోయడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కలెక్టరేట్‌వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తోందంటూ పలువురు బీసీలు మండిపడ్డారు. జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ ఏం చెప్పిందో తేల్చకుండా కాపులకు అశాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం తగదన్నారు. కేవలం కమిషన్ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాపులకు, బీసీలకు మధ్య గొడవలు సృష్టించడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లు తేవడానికి ప్రయత్నించినట్టుందంటూ మండిపడ్డారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో కలుపుతూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి.. ఆందోళనలో పాల్గొన్న పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రాష్ట్రంలోని బీసీ నాయకులంతా సమావేశమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగజేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని వ్యతిరేకిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనో, మంత్రి పదవులు రావనో అనుకునేవారికి ఎమ్మెల్యే అవకుండానే బీసీలంతా బుద్ధి చెబుతారన్నారు. కాపుల ఓట్లతోనే ఎమ్మెల్యేలుగా గెలుస్తామని అనుకుంటే ఏవిధంగా చేయాలో బీసీలందరూ నిర్ణయిస్తారని అన్నారు. చంద్రబాబు ప్రకటిస్తే అయిపోయేది కాదని, దీనిని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సహితం ఖాతరు చేయనివారికి సరైన గుణపాఠం చెబుతామని మల్లాడి స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి సహకరించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు, బీసీ ఆందోళనకు సహకరించని ప్రజాప్రతినిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చడానికి తాను పూర్తిగా వ్యతిరేకినని అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. దేశంలో ఎవరు ఉన్నత పదవుల్లో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని గుర్తు చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం ఉన్నవారు మాత్రమే రిజర్వేషన్లకు అనుకూలమని రాజ్యాంగం చెబుతోందని వివరించారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగానికి లోబడే ఉన్నాయన్నారు. ఈ ఆందోళనలో రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, మాకినీడి భాస్కర్, పంపన రామకృష్ణ, కడలి ఈశ్వరి, గుబ్బల వెంకటేశ్వరరావు, కుండల సాయికుమార్, ఎ.శ్రీనివాసరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, గరికిన అప్పన్న తదితరులు కూడా పాల్గొన్నారు. -
కాపులకు రిజర్వేషన్లపై బీసీల కన్నెర్ర
అమలాపురం టౌన్: కాపులను బీసీల్లో చేర్చుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై అమలాపురంలో బీసీలు కన్నెర చేశారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు. బీసీల రిజర్వేషన్లను హరించేందుకు కుట్ర పన్నిన ముఖ్యమంత్రి చంద్రబాబు శవ యాత్ర నిర్వహించారు. చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం చేశారు. బీసీలను సామాజికంగా అణిచి వేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిం దని రాష్ట్ర బీసీ నాయకులు ధ్వజమెత్తారు. తొలుత సూర్యనగర్‌లోని బీసీ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం ఆవరణలో కోనసీమ బీసీ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర బీసీ సంఘాల కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంజునాథ కమిషన్ అధ్యక్షుడైన మంజునాథ్ లేకుండా కొంతమంది సభ్యులతో ఆదరాబాదరగా కేబినెట్ టేబుల్ నోట్ కింద అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ఓ పథకం ప్రకారం చేశారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా గ్రామ గ్రామాన బీసీలు ధర్నాలు, రాస్తారోకోలతో తమ ఆవేదన, ఆగ్రహాన్ని తెలపాలని సమావేశం పిలుపునిచ్చింది. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, గడియారం స్తంభం సెంటరుకు చేరుకుని, దిష్టిబొమ్మను దహనం చేశారు. వివిధ బీసీ కులాలు, సంఘాల నాయకులు మట్టపర్తి మురళీకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వాసంశెట్టి సత్యం, పేట వెంకటేశ్వరరావు, కుడుపూడి త్రినాథ్, తాళాబత్తుల లక్ష్మణరావు, ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కాళే వెంకటేశ్వరరావు, కుడుపూడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి సుభాష్, ఐవీ సత్యనారాయణ, కుంజే సుబ్బరాజు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు ధర్నా, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి రాజోలు: కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్న సమయంలో కనీసం మాట్లాడలేని బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తాటిపాకలోని రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘ భవనం ఎదుట 216 జాతీయ రహదారిపై శనివారం బీసీ సంఘ నాయకులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటన్నారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అసెంబ్లీలో కాపు మహిళలు జీడిపప్పు వలుస్తూ కష్టాలు పడిపోతున్నారని మాట్లాడారని, బీసీ కులాల్లో ఉన్న మహిళలు కల్లు అమ్మడం, బట్టలు ఉతకడం, కూలి పనులకు వెళ్లడం కనిపించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సూర్యారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ నాయకులు గుబ్బల బాబ్జి, చెల్లుబోయిన రాంబాబు, గుబ్బల శ్రీను, కంబాల చంద్రరావు, గుబ్బల నరేంద్రకుమార్, యనమదల సీతారామరాజు, మట్టపర్తి రెడ్డి, మామిడిశెట్టి మనోహర్, చెల్లుబోయిన శ్రీను, బొమ్మిడి వెంకటేష్, గుబ్బల రమేష్, చింతా రామకృష్ణ, గెద్దాడ రాంబాబు, వెలుగొట్ల శ్రీను, మొల్లేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మరో మోసమా?
సాక్షి, అమరావతి : కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ బిల్లు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెరతీశారని కాపు నేతలు మండిపడుతున్నారు. ఎలాంటి శాస్త్రీయతా లేని ఈ బిల్లుతో కాపులను మరోసారి మోసం చేస్తున్నట్లు కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. మూడున్నరేళ్లపాటు తాత్సారం చేసి చివరకు మంజునాథ కమిషన్ చైర్మన్ నివేదిక సమర్పించకుండానే, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరిరోజున హడావిడిగా ఈ తంతు నడపాల్సిన అవసరమేమిటని కాపు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఈ బిల్లు, తీర్మానం చేయించిందా? లేక ఎన్నికల సంవత్సరం దగ్గరపడుతున్నది కనుక తూతూమంత్రంగా చేతులు దులుపుకోవడానికి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందా? అన్న అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారన్న విశ్లేషణలు రాజకీయవర్గాల్లో సాగుతున్నాయి. చడీచప్పుడు లేకుండా హఠాత్తుగా జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలోని బీసీ కమిషన్ సభ్యులనుంచి నివేదికలు రప్పించి ఒకరోజు ముందు కేబినెట్ సమావేశంలో వాటిని ఆమోదించి ఆ వెనువెంటనే అసెంబ్లీ, మండలిలో ఆమోదింపచేయడం వెనుక అనేక ఎత్తుగడలు దాగి ఉన్నాయని కాపు నేతలు అంచనా వేస్తున్నారు. దీనిపై కేంద్రానికి నివేదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం ద్వారా కాపు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకొనే ఎత్తుగడగా వారు భావిస్తున్నారు. పోలవరంపై నుంచి దృష్టి మళ్లించేందుకే.. పోలవరంలో వరుస తప్పులు క్రమంగా వెలుగులోకి వస్తుండటంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంపై వ్యాఖ్యలు చేసిన మరునాడే మాట మార్చారు. ఒకపక్క జగన్ పాదయాత్ర ప్రభావం, పోలవరంపై తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ పట్ల వ్యతిరేకతకు దారితీస్తుండడం, కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చేలా ఉండడంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా కాపు రిజర్వేషన్లపై బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని విశ్లేషకులంటున్నారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి దాన్ని పట్టించుకోకపోవడంతో ముద్రగడతో పాటు కాపు నాయకులు ఉద్యమాన్ని చేపట్టారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు సంబంధించిన అన్ని వివరాలున్నా మంజునాథ్ కమిషన్‌ను ప్రకటించినా కాలయాపన జరుగుతుందనే అనుమానాలు కాపు సామాజికవర్గంలో నెలకొన్నాయి. ముద్రగడ ఉద్యమం వివిధ దశలను దాటుకుని డిసెంబరు ఆరో తేదీ నుంచి ఉధృతం కాబోతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో చంద్రబాబు సర్కారు ఆలోచనలో పడింది. మరోవైపు ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ఇంకా జాప్యం చేయడమంటే కాపు వర్గాల్లో మరింత వ్యతిరేకత పెంచుతుందని భావించడంతో కేంద్రంపై నెట్టేయడానికి వ్యూహం రచించినట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. కాపులను బీసీల్లోని చేర్చి రిజర్వేషన్లను తానే కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపైకి నెట్టేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపై తెలుగుదేశం పార్టీలోని కాపు నాయకులు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏమాత్రం ఉన్నా ముందుగానే కేంద్రంతో సంప్రదింపులు జరిపి సానుకూలత సాధించుకునే వారని, కానీ అలాంటి కనీస ప్రయత్నం కూడా చేయకుండానే చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమంటే చేతులు దులిపేసుకోవడమేనని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే కేంద్రం పరిధిలో గుజ్జర్లు, పటేళ్లు, జాట్ల రిజర్వేషన్ సమస్య కొన్నేళ్లుగా నలుగుతూనే ఉందని, ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆ జాబితాలోకి చేర్చడం మినహా మరొకటి కాదని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకోవడమే.. ఎన్నికల ముందు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ నెరవేర్చకపోవడంపై కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నాలుగేళ్లు గడిచిపోయాయి. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో ఈ అంశం మరింత జఠిలంగా మారుతుందన్న అభిప్రాయం బాబులో ఏర్పడిందంటున్నారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల తరువాత మళ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రమే ఉన్నాయి. పార్లమెంటుకూ ఇదేరకమైన సమావేశాల షెడ్యూల్ ఉంటుంది. బడ్జెట్ తరువాత ఎన్నికల సీజనే. ఆ సమయం దగ్గరపడితే కాపులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు తలెత్తుతాయి. కనుకనే ఈ సమావేశాల్లోనే కాపు రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ చేర్చాలంటూ కేంద్రానికి పంపేస్తే అది కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతుందని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవలసి ఉందని చెప్పడం ద్వారా తప్పించుకొనే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందన్న భావనతో బాబు హడావుడిగా కాపు రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెచ్చారంటున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కాపు రిజర్వేషన్లపై తమ సభ్యులతో కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా ఆ సామాజికవర్గం నుంచి సానుకూలత పొందడానికి వీలుంటుందని, కేంద్రంపై నెట్టేయడం ద్వారా తాను రాజకీయంగా క్షేమంగా ఉండవచ్చన్న ఎత్తుగడ ఇందులో దాగి ఉందని చెబుతున్నారు. కమిషన్ నివేదిక చెల్లుబాటుపై పలు సందేహాలు ఇలా ఉండగా కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం కమిషన్ రిపోర్టంటూ తెప్పించిన నివేదికల చెల్లుబాటుపై పలురకాల సందేహాలు టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ మంజునాథ్ ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిషన్ నివేదిక ఇంకా ఇవ్వలేదు. ప్రభుత్వం రెండురోజుల ముందు ఆ కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల నుంచి వేర్వేరుగా నివేదికలు తీసుకుంది. అయితే ఇలా వేర్వేరుగా, వ్యక్తిగతంగా సభ్యుల నుంచి తీసుకున్న నివేదికలు కమిషన్ రిపోర్టుగా పరిగణించడానికి వీల్లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం సమాచారాన్ని కమిషన్‌లోని సభ్యులందరి అభిప్రాయాలతో ఛైర్మన్ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి ఆ తరువాత ప్రభుత్వానికి సమర్పిస్తేనే అది కమిషన్ రిపోర్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చిన నివేదికల ఆధారంగా రూపొందించిన బిల్లు, దాని ఆధారంగా అసెంబ్లీలో చేసే చట్టంపై న్యాయ వివాదాలు తలెత్తే అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు. మరోపక్క 50 శాతం దాటి అదనంగా కల్పించే రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చాల్సిఉంటుంది. ఇలా చేర్చడానికి సరైన కారణాలను చూపించాలి. ఒకవేళ అలాంటి సరైన కారణాలు లేకపోతే అది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్లో స్పష్టంచేసింది. కమిషన్ నివేదిక రాకుండానే సభ్యుల వ్యక్తిగత రిపోర్టులతో అసెంబ్లీలో చట్టం చేసినా వాటి ఆధారంగా 9వ షెడ్యూల్ చేర్చేందుకు మాత్రం వీలుండదని పేర్కొంటున్నారు. కమిషన్ నివేదిక లేకుండా బిల్లు పెట్టినా సాంకేతికంగా 9వ షెడ్యూల్లో చేర్చేందుకు వీలైన పరిస్థితులు లేక కాపు సామాజికవర్గానికి మళ్లీ అన్యాయమే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మంజునాథ్ ప్రకటనతో ఇరకాటంలో ప్రభుత్వం ఇలా ఉండగా కమిషన్ రిపోర్టు అంటూ ప్రభుత్వం చెబుతున్న నివేదికలపై ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. ప్రభుత్వానికి కమిషన్ నివేదికను అందించలేదని, త్వరలోనే దాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తామని బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ శనివారం చేసిన ప్రకటన ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. సభ్యుల నివేదికలనే కమిషన్ రిపోర్టుగా పరిగణిస్తూ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇవ్వలేదని మంజునాథ్ పేర్కొనడం కాపులలో తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. కేవలం మభ్యపెట్టడానికి ప్రభుత్వం ఈ హడావుడిని సృష్టించిందా? కమిషన్ నివేదిక లేకుండా రూపొందించిన బిల్లు చెల్లుబాటు అవుతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం కమిషన్ ఛైర్మన్‌తో సంబంధం లేకుండా సభ్యుల నుంచి వేర్వేరుగా నివేదికలు తీసుకున్నా అది కమిషన్ నివేదిక కిందకే వస్తుందని పేర్కొంటున్నాయి. ఒక కమిషన్‌ను వేశాక ఆ కమిషన్ ఏకమొత్తంగా, సమగ్రంగా అందించే నివేదిక మాత్రమే చెల్లుబాటు కిందకు వస్తుందని, సభ్యులు వేర్వేరుగా ఇస్తే అది వారి వ్యక్తిగతమే తప్ప కమిషన్ నివేదిక కిందకు రావని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అటు కాపు సామాజికవర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తే ప్రభుత్వానికి ఇరకాటంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
నివేదిక ఇవ్వకుండానే 9వ షెడ్యూల్‌లోనా?
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ, శాసనమండలిలో చేసిన ఈ రెండు ప్రకటనలను చదివిన వారికి ఏం అర్థమవుతుంది? త్వరలో కమిషన్ నివేదిక వస్తుందని, సమగ్రంగా చర్చించిన అనంతరం చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారని భావిస్తాం. కీలకమైన బీసీ కమిషన్ నివేదికను ఇంకా ఇంతవరకు ప్రభుత్వానికి ఇవ్వలేదని సాక్షాత్తు ఆ కమిషన్ ఛైర్మనే చెబుతున్నా అసెంబ్లీలో బిల్లు పెట్టేసి కేంద్రంపై తోసేస్తే కాపులకు నిజంగానే రిజర్వేషన్లు వస్తాయా?.. కాదనే కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటే కమిషన్ నివేదిక కచ్చితంగా ఉండాలి. ఏదైనా రాష్ట్రం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వదలచుకుంటే ఆ నిర్ణయాన్ని సమర్థించుకునేలా సరైన గణాంక సమాచారం ఉండాలని సుప్రీంకోర్టు 1992లో ఇంద్రా సహానీ కేసులో తీర్పు ఇచ్చింది. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక ఇచ్చినట్లు చైర్మన్‌కే తెలియదు! సమగ్ర సమాచారం కోసం బీసీ కమిషన్‌ను నియమించామని, అది వచ్చేంత వరకు ఆగాలని చెప్పిన చంద్రబాబే హడావిడిగా అసెంబ్లీలో బిల్లు పెట్టడంలో ఆంతర్యమేమిటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చిత్రమేమిటంటే ఏ కాపుల కోసం కమిషన్ వేశారో ఆ కమిషన్ ఛైర్మనే తమ సభ్యులు నివేదిక ఇచ్చారన్న సంగతి తనకు తెలియదనడం దేనికి సంకేతం? నిజంగా చంద్రబాబుకు కాపుల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? అన్న అనుమానాలు ఎవరికైనా రాకమానవు. న్యాయసమీక్షకు లోబడే... రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినప్పటికీ అది అత్యున్నత న్యాయస్థానాల న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమగ్ర సమాచారం ఉండాలి. అందుకు ప్రాతిపదికలు కమిషన్ నివేదికలు మాత్రమే. కానీ అటువంటిదేమీ లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్లపై తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి పంపింది. హడావుడిగా తీర్మానం... కాపుల రిజర్వేషన్ల కల సాకారం కావాలంటే సమగ్ర సమాచారం ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధీ అంతే అవసరం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అధికారాన్ని అనుభవిస్తున్న టీడీపీ ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ సేకరించిన సమగ్ర సమాచారం ఆధారంగా కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో చేర్చకుండా.. అసలు కమిషన్ నివేదికనే తెప్పించకుండా హడావుడిగా తీర్మానం చేయించిన తీరు కాపుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. కమిషన్ పని తీరు ఎలా ఉంటుందో తెలియకుండానే మెజారిటీ సభ్యులు కాపు రిజర్వేషన్ల కోసం సిఫార్సు చేశారని శనివారం రాత్రి ఓ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని కాపునేతలే విస్మయం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఏమిటో? అందులో ఏముందో తెలియకుండానే చట్టాలు చేస్తే అవి ఎలా చెల్లుబాటవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల కంటి తుడుపు కోసం ప్రభుత్వం ఈ పని చేసినట్టు అనిపిస్తోందని వాపోవడం గమనార్హం. రెండు నాల్కలు- రెండు మాటలు కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న మా ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నాం. అందుకే బీసీ కమిషన్‌ను నియమించాం. శాస్త్రీయంగా, పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం చేయాలన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు ఆలస్యమైంది... (శనివారం శాసన మండలిలో చంద్రబాబు) బీసీ కమిషన్‌లో మెజారిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక ప్రాతిపదికనే సభలో బిల్లు ప్రవేశపెడుతున్నాం. దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయం చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపుతున్నాం. కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. కాపుల్ని బీసీల్లో చేర్చే విషయమై రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై అన్ని పార్టీలూ ఒత్తిడి చేయాలి... (శాసనసభలో చంద్రబాబు) -
కాపులు రాజకీయంగా ముందున్నారు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా మని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా కాపులు ముందున్నారని ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించా మన్నారు. టీడీపీకి వెన్నెముకలా నిలుస్తున్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ(ఎఫ్)లో చేర్చుతామన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇప్పటికే 50 శాతానికి చేరిన నేపథ్యంలో రాజ్యాంగాన్ని సవరించి తొమ్మిదో షెడ్యూలులో కాపు రిజర్వేషన్లు చేరుస్తూ రూపొందించిన బిల్లును ఆమో దించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాపు రిజర్వేషన్ల బిల్లు–2017 పై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బ్రిటీషు ప్రభుత్వం ఉన్నప్పుడే... స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు అమలు చేసిందని చంద్రబాబు చెప్పా రు. అనంతరం రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాలకు రిజర్వేషన్లు తొలగించి అన్యాయం చేశారనే బాధ ఆ వర్గాల్లో ఉందన్నారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తనను ఎవరూ అడగలేద న్నారు.పాదయాత్ర సమయంలో కాపుల కష్టాలను చూసి రిజర్వేషన్లు కల్పిస్తామని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో హామీ ఇచ్చామన్నారు. జస్టిస్ మంజునాథ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి కాపులు వెనుకబడినట్లు తేల్చిందన్నారు. కాపుల్లో 66.25%, తెలగల్లో 60.49%, బలిజల్లో 58.63%, ఒంటరిల్లో 70% దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారన్నారు. కుల సంఘాల లెక్కలు బోగస్: రాష్ట్రంలో ప్రజా సాధికార సర్వే, ఆధార్ ఖాతాల ఆధారంగా 4.35 కోట్ల జనాభా ఉందని చంద్రబాబు చెప్పారు. కొంద రు కుల సంఘాల నేతలు చెబుతున్న లెక్కలు చూస్తే రాష్ట్ర జనాభా డబుల్ ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాపులు 38,09,362 (8.72%), తెలగలు 4,81,321 (1.11%), బలిజలు 7,51,031 (1.73%), ఒంటరిలు 13,058 (0.03%) మంది ఉన్నారని జనాభాలో ఆ వర్గాల శాతం 11.65 శాతమ ని చెప్పారు. వీటిని బట్టి చూస్తే కుల సంఘాలు చెబుతున్న లెక్కలన్నీ బోగస్ అని విమర్శించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు శాస నసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఏకగీవ్రంగా ఆమోదిం చాలని సీఎం చంద్రబాబు కోరారు. అనంతరం కాపు రిజర్వేషన్ల బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. -
ఆమోదం తర్వాతే నిజమైన దీపావళి
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింపజేసి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి స్థాయిలో చేసినప్పుడే తమ జాతికి నిజమైన దీపావళని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లోని తన నివాసంలో శనివారం రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం విలేకర్ల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. ఇచ్చిన హామీ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు కు సుమారు నాలుగేళ్లు పట్టిందని, ఇప్పటికైనా చెయ్యాలనే ఆలోచన కలిగినందుకు సంతోషమ ని అన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని ఉద్యమించిన తమ సోదరులను పోలీసుల చేత కొట్టించడం, తిట్టించడం వంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమ న్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటు వంటి ఆందోళనా చేయకుండానే ఇచ్చిన హామీలు అమలు చేశారని, అలా పొందలేకపోతున్నందుకు బాధ పడుతున్నామని అన్నారు. టిఫిన్‌తో సరిపెట్టారు... ఎన్నికల సమయంలో కాపులకు అన్నం పెడతా నని చెప్పి, టిఫిన్‌తో సరిపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాపు జనాభా కోటి పైనే ఉండగా జనాభా శాతం తక్కువ చూపించి 5శాతం రిజర్వేషన్‌తో సరిపెట్టార న్నారు. రిజర్వేషన్ శాతం రెట్టింపు చేసి తమ జాతికి అన్నం పెడితే బాగుండేదన్నారు. రిజర్వేషన్ల అమలుకు సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మాటిమాటికీ తన వెంట జగన్ ఉన్నారు, మోదీ ఉన్నారంటూ టీడీపీ నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని, 1994లో ఉద్యమించినప్పుడు చంద్రబాబు నా వెనుక ఉండి ఉద్యమం నడిపించారా? నిధులు సమకూర్చారా? అని ప్రశ్నించారు. తన క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలిసి కూడా ఆరోపణలు చేయించడం మంచిది కాదన్నారు. ‘తప్పుడు ఆరోపణలు చేయించకండి. ధైర్యంగా ఢీకోండి. దీటుగా సమాధానం చెబుతా’అని చంద్రబాబునుద్దేశించి అన్నారు. ‘మీరిచ్చిన హామీల స్ఫూర్తితోనే రోడ్డెక్కాం. ఆఖరి దశలో మా జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉద్యమం చేపట్టాను తప్ప వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు. ఇప్పటికైనా అబద్ధాలు మానండి ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేశారు. అబద్ధాలు మానండి. ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయండి. 2018 మార్చి ఆఖరు నాటికి ఇచ్చిన హామీలు పూర్తి చేయండి. అంతవరకూ ఉద్యమానికి తాత్కాలిక వాయిదా మాత్రమే. హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం తప్పదు’ అని ముద్రగడ అన్నారు. ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి మూడేళ్లకు రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేశారని, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి కాపు జాతిని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న కాపులకు కార్పొరేషన్ రుణాలు మంజూరు కాలేదని, రాజకీయాలు పక్కన పెట్టి అర్హులం దరికీ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 6న అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న యావత్తు కాపు జాతి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
మంజునాథ కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : కాపులను బీసీల్లో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదికపై ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చే నివేదికే కమిటీ నివేదిక అని, కమిషన్ నివేదిక సెప్టెంబరులోనే పూర్తయిందని...ఈ నివేదిక ఏపీలో అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. శనివారం మంజునాథ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...కమిషన్ నివేదికను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆ నివేదిక ఇవ్వడానికి తాను వెళ్లడం లేదని, కమిషన్ కార్యదర్శి కృష్ణమోహన్ వెళతారన్నారు. కమిషన్‌లోని మిగిలిన ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తనను అడగవద్దని, ఆ విషయాన్ని వాళ్లనే అడగాలని మంజునాథ్ అన్నారు. ఇప్పటివరకూ బీసీ కమిషన్ తరపున ఏపీ ప్రభుత్వానికి తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. బీసీ కమిషన్ నిబంధనల ప్రకారం నివేదిక పూర్తైన తర్వాత సభ్యులందరు కలిసి నివేదికపై తీర్మానం చేసిన తర్వాతనే ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కమిషన్ సభ్యులందరి సంతకాలు లేకుంటే చట్టపరంగా అది బీసీ కమిషన్ నివేదిక కాదన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశానని, బీసీ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందచేస్తామన్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తమ నివేదికను ప్రధాన కార్యదర్శి లేదా బీసీ సంక్షేమ కార్యదర్శికి అందచేస్తామని తెలిపారు. కాగా కాపు రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ సర్కార్ ...నిన్న సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. -
నేను ఇచ్చే నివేదికే ఫైనల్: మంజునాథ
-
కాపులకు న్యాయం జరుగుతుందా?
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు నాయుడు... కాపు రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శాస్త్రీయత లేని నివేదికలను ఆధారంగా చేసుకొని తీర్మానాలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కాపులను మోసం చేస్తుందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘కాపులను బీసీల్లో చేర్చే చిత్తశుద్ధి బాబులో కనిపించలేదు. కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని బాబు మూడున్నరేళ్లు కాలయాపన చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి దిగటంతో గత్యంతరం లేక 19 నెలల తర్వాత మంజునాథ కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక రాకుండానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. శాస్త్రీయత లేని నివేదిక ఆధారంగా బిల్లు పాస్‌చేస్తే... కాపులకు న్యాయం జరుగుతుందా?. అశాస్త్రీయ విధానం ద్వారా రిజర్వేషన్లు ఇస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. తన బాధ్యతను ప్రధాని మోదీ నెత్తిన పెట్టి కాపులను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలంటే సమగ్ర అధ్యయనం చేయాలని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ...చంద్రబాబు సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మంజునాథ నివేదిక రాకుండానే తీర్మానం పేరుతో కాపులను మోసం చేయాలని చూస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత తొందరపాటు ఎందుకు?.శాస్త్రీయంగా నివేదిక వచ్చిన తర్వాత బిల్లు పాస్ చేయొచ్చు కదా?. ఏ లెక్క ప్రకారం అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. శాస్త్రీయ పద్ధతి లేకుండా మోసపూరితంగా వ్యవహరించడం దురదృష్టకరం. హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు జోక్యం చేసుకుని కొట్టివేసే ప్రమాదం ఉంది. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నది కూడా అలాంటి దుర్మార్గపు చర్యే. ఇప్పటికైనా పునరాలోచించి మంజునాథ కమిషన్ నివేదిక బహిర్గతం చేయండి. లేకుంటే చంద్రబాబును కాపులు క్షమించరు. ప్రభుత్వానికి మంజునాథ్ కమిషన్ రిపోర్టు చేసిన దాఖలాలు లేవు. మంజునాథ కమిషన్ నివేదిక ఎందుకు వెలుగులోకి రాలేదు. మెజార్టీ సభ్యులు ఇచ్చిన ప్రతిపాదననే పరిగణనలోకి తీసుకున్నారు. మంజునాథ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు?. అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసి... కాపులంతా సంతోషంగా ఉన్నారనే భ్రమను చంద్రబాబు సర్కార్ చేస్తోంది. మంజునాథ్ కమిషన్ తీర్మానాలను చర్చించకుండా బిల్లును ఆసెంబ్లీలో ఆమోదించారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ బిల్లును సభలో తీర్మానం చేసి, కేంద్రం నెత్తిన పడేసే యత్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ మీద నీలినీడలు మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఆ దృష్టిని మరల్చేందుకే మంజునాథ కమిషన్ రిపోర్టును తెరమీదకి తెచ్చారు. మరోసారి కాపులను మోసం చేసే యత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేతులు దులుపుకుని ఓట్ల కోసం చంద్రబాబు చేసిన యత్నమే ఇది.’ అని మండిపడ్డారు. -
5 కాదు..10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
-
కాపులకు న్యాయం జరుగుతుందా?
-
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
సాక్షి, కాకినాడ : కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. టైర్లకు నిప్పు అంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్ వైపు నుంచి వెళ్తున్న రవాణా వ్యవస్థను స్తంభించింది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల టైర్లలో గాలి తీసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి. బీసీల మెరుపు ముట్టడితో కలెక్టరేట్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంఘాలు భారీ ఎత్తున పాల్గొన్నాయి. -
కాపుల రిజర్వేషన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు
-
అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ బిల్లు - 2017కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కారణాలు చెప్పకుండా రిజర్వేషన్లు తీసేశారన్నారు. 2016లో కాపుల రిజర్వేషన్‌పై మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో పర్యటించిన కమిషన్ సభ్యులు కాపుల స్థితిగతులను అధ్యాయనం చేసినట్లు చెప్పారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని తనను ఎవరనూ అడగలేదని అన్నారు. పాదయాత్ర చేసిన సమయంలో కాపుల కష్టాలను చూసి.. తానే రిజర్వేషన్ ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మంజునాథ కమిషన్ కాపుల రిజర్వేషన్‌పై నివేదిక అందజేసినట్లు వెల్లడించారు. కాపులు రాజకీయ రిజర్వేషన్లను కోరుకోవడం లేదని అందుకే సామాజిక, ఆర్థిక, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్‌ను కల్పిస్తున్నట్లు వివరించారు. కాపులకు రిజర్వేషన్ల ఇవ్వడం వల్ల వెనుకబడిన తరగతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. కాపుల(కాపు, తెలగ, బలిజ, ఒంటరి)ను బీసీ(ఎఫ్) కేటగిరీలో చేరుస్తున్నట్లు తెలిపారు. కాపుల రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. బీసీ(ఎఫ్) కేటగిరీలోని వారందరికీ 5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని వివరించారు. వాల్మీకీలు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. -
కాపు రిజర్వేషన్లు.. బాబు వ్యూహం ఇదేనా?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు అనూహ్యంగా కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్ విషయమై ఏర్పాటైన మంజునాథ కమిషన్ సిఫారసులను ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లో ఎఫ్ కేటగిరిని సృష్టించి.. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ మేరకు కాపు రిజర్వేషన్లపై చర్చించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శనివారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ కాపు రిజర్వేషన్ అంశంపై చర్చ జరిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిపి.. కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అదేసమయంలో ప్రస్తుతం కుదుపుతున్న పోలవరం ప్రాజెక్టు వివాదాన్ని కూడా ఈ అంశంతో పక్కదోవ పట్టించవచ్చునని బాబు అండ్ కో భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్న చంద్రబాబు మాటలను కాపు నేతలెవరూ నమ్మడం లేదు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు శనివారం తన అనుచరులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సమావేశమవుతున్నారు. కేంద్రం ఆమోదానికి తీర్మానం చేసి పంపడటమంటే.. కోల్డ్స్టోరేజీకి పంపడమేనని ముద్రగడ అనుమానిస్తున్నారు. ఈ విషయమై సమగ్రంగా చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. మరోసారి చంద్రబాబు మోసం! రిజర్వేషన్ల విషయమై కాపులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని కాపు జేఏసీ ప్రధాన కార్యదర్శి కటారి అప్పారావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. రిజర్వేషన్లపై తీర్మానాన్ని కేంద్రానికి పంపడమంటే ఈ అంశాన్ని కోల్డ్‌స్టోరేజీలో పెట్టడమేనని విమర్శించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమబాట పడతామని, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు వెనుకకు తగ్గబోమని కటారి అప్పారావు స్పష్టం చేశారు. -
ఆర్ కృష్ణయ్య అలా మాట్లాడటం సరికాదు!
సాక్షి, విజయవాడ: కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ కేబినెట్ శనివారం మరోసారి సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంజునాథ కమిషన్ నివేదికపై మరోసారి చర్చించారు. కాపుల కోసం బీసీ (ఎఫ్) కేటగిరి కోటాను సృష్టించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది. నిరుద్యోగ భృతి విధివిధానాలపై కూడా ఏపీ కేబినెట్ చర్చించింది. సభలో తీర్మానం..! ఏపీ అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. శనివారం సభలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం సభలో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి అచ్చెన్నాయుడు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కాపు రిజర్వేషన్ అంశంపై సభలో చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంజునాథ కమిషన్ 20 నెలలు పర్యటించిందని తెలిపారు. రాష్ట్రంలో 8.7శాతం కాపులు ఉన్నారని చెప్పారు. రాజకీయంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించడం లేదని అన్నారు. కాపు రిజర్వేషేన్లపై బీసీలు పోరాడాలని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అంటున్నారని, ఆయన అలా మాట్లాడటం సరికాదని అచ్చెన్నాయడు అన్నారు. -
ముఖ్యమంత్రికి ముద్రగడ పద్మనాభం లేఖ
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. కాపులకు బీసీ రిజర్వేషన్‌ను రెండు నెలల్లో అమలుచేస్తామని కాకినాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మీడియాకు తెలిపారని, ఈ మేరకు డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తీపికబురు చెప్పాలని ఆయన గుర్తుచేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే రోజు వస్తుంది కనుకనే బీసీ నేతలతో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారని, తమకు రిజర్వేషన్ ఇస్తే బీసీలు రాజకీయంగా నష్టపోతారని వారితో చంద్రబాబు చెప్పిస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. అన్ని వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మిలిగిన 51శాతంలో తమ జనాభాను బట్టి కొంత శాతం, అది పేదవారికి రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో తగదాలు రాకుండా తమకు కల్పించే రిజర్వేషన్లో ఏబీసీడీ వర్గీకరణ ఉండాలని పేర్కొన్నారు. -
నెల రోజులే గడువు
ఆలమూరు (కొత్తపేట): కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చేందుకు నెల రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే, శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకృష్ణదేవరాయ కాపు అభ్యుదయం సంఘం ఆలమూరులో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తిక వనసమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వచ్చే నెల ఆరున జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి లోపు కాపులను బీసీల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాపు సామాజికవర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భవిష్యత్తు వ్యూహం రూపొందించుకుంటామన్నారు. ఎస్ఎంఎస్లు, ఉత్తరాలు, సామాజిక ప్రచార మాధ్యమాల ద్వారా కాపు మేధావులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, యువత, మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. ఇప్పటికే చాలమంది కాపు నేతలు తమ అభిప్రాయాలు తెలిపారని, రానున్న నెల రోజుల్లో మరిన్ని అభిప్రాయాలు సేకరించి, దానికనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ముద్రగడ చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ సీఎం తన మంత్రివర్గ సభ్యులతో పలికిస్తున్న చిలక పలుకులను కాపు సామాజికవర్గం నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కొద్ది రోజుల క్రితం కొంతమంది కాపు నేతలను అమరావతి తీసుకువెళితే ఏదో ఒక శుభవార్త వింటామని ఎదురుచూసిన కాపు జాతికి నిరాశే మిగిలిందన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి కాపు రిజర్వేషన్ల అమలుపై కప్పదాటు వైఖరి ప్రదర్శించి, కాపు నేతల చెవిలో క్యాబేజీ పూలు పెట్టారని ఎద్దేవా చేశారు. అందువల్లనే చివరిగా వచ్చే నెల నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టి రిజర్వేషన్లు సాధించేవరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు తరలిరావాలి ఈ నెల 12న కిర్లంపూడిలో కాపు నేతల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు దళితులు, కాపు నేతలు అధిక సంఖ్యలో తరలిరావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌కు లక్షలాది విగ్రహాలు ఏర్పాటు చేసినా విధించని నిబంధనలు కిర్లంపూడిలో మాత్రమే విధించడంపై ఆయన మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డగోలు నిబంధనలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. పోలీసుల పడగ నీడలో జీవితాలను గడపాల్సిన దారుణమైన పరిస్థితులను కల్పించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వై.ఏసుదాసు, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, నయనాల హరిశ్చంద్రప్రసాద్, దున్నాబత్తుల నరేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వానికి డిసెంబర్ 6వ తేదీ డెడ్‌లైన్’
-
‘ప్రభుత్వానికి డిసెంబర్ 6వ తేదీ డెడ్‌లైన్’
విశాఖ సిటీ: కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వానికి డిసెం బర్ 6న డెడ్‌లైన్ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈలోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంకు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన బాబు.. ఇప్పుడు కపట నాటకమాడుతున్నారని మండిప డ్డారు. ఏళ్లు గడుస్తున్నా మంజునాథ గతంలో ఉండే రిజర్వేషన్లే కల్పించమని తాము కోరుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 49 శాతం రిజర్వేషన్లలో కాపులకు వాటా అవసరం లేదని మిగిలిన 51 శాతంలో రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. -
కిర్లంపూడిలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, కాకినాడ: కిర్లంపూడిలో మళ్లీ ఉద్రికత్త నెలకొంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ఆదివారం నుంచి రెండురోజుల కోనసీమ పర్యటనకు ముద్రగడ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకు.. కిర్లంపూడిలో బలగాలు మోహరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మీయ పలకరింపు పేరిట ఈ నెల 8,9 తేదీల్లో కోనసీమలో పర్యటించనున్నట్టు ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపు ఉద్యమానికి మద్దతు పలికిన పి. గన్నవరం నియోజకవర్గంలో అభిమానులను ఆత్మీయంగా పలుకరించనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, ఆయన పర్యటనను అడ్డుకునేందుకే పోలీసులు కిర్లంపూడిలో మోహరించినట్టు తెలుస్తోంది. ముద్రగడ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా.. తప్పకుండా పోలీసులు అనుమతి తీసుకోవాల్సిందే అన్న తరహాలో పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయనను జీవితాంతం గృహనిర్బంధం చేస్తారా? వ్యక్తిగత హోదాలో పర్యటించడానికి కూడా అవకాశం ఇస్తారా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఆయన వ్యక్తిగత పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో పేర్కొన్నారు. అయినా, ముద్రగడ ఇంటి నుంచి కదలకుండా ఆయన నివాసం చుట్టూ తాజాగా పోలీసులు మోహరించడం ఉద్రిక్తత రేపుతోంది. కాపు రిజర్వేషన్లో 'ఛలో అమరావతి' పేరిట ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను భగ్నం చేసి.. ఆయనను చాలకాలంపాటు పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. -
బ్రేకింగ్: కిర్లంపూడిలో మళ్లీ ఉద్రిక్తత
-
డిసెంబర్ 6 వరకు గడువు: ముద్రగడ
అమలాపురం టౌన్: రాష్ట్రంలో కాపు ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వ స్పందన ఆధారంగా ఉద్యమం కొనసాగింపునకు పక్కా ప్రణాళికతో ఉన్నామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. ‘డిసెంబర్ ఆరో తేదీ వరకూ గడువు విధించుకున్నాం. అప్పటికి మా జేఏసీ రెండు ఆప్షన్లు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన ఉంటే సరేసరి. మళ్లీ మొండిచేయి చూపిస్తే ఆ రెండు ఆప్షన్లలో ఒకటి ఎంచుకుంటాం’ అని ఆయన స్పష్టంచేశారు. అయితే, ఆ రెండు ఆప్షన్లు ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి నివాసంలో శుక్రవారం మీడియాతో ముద్రగడ మాట్లాడారు. ‘మా కాపు జాతి లక్ష్యం ఒక్కటే.. రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల్లో చేర్చాలి. ఉద్యమంపై ఎన్ని ఉక్కుపాదాలు మోపినా మడమ తిప్పకుండా పోరాడతాం’ అని ప్రకటించారు. -
డిసెంబర్ 6లోగా హామీ అమలు చేయండి
కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి ముద్రగడ లేఖ కిర్లంపూడి: ‘బ్రిటిష్ పాలనలో మా జాతికి ఉన్న బీసీ రిజర్వేషన్లు తీసేయాలని అనుకున్నప్పటికీ, లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాపులకు రిజర్వేషన్లు కొనసాగించా లంటూ ఆ సదుపాయాన్ని కాపాడిన మహానుభావుడు అంబేడ్కర్. ఆయన వర్ధంతి రోజైన డిసెంబర్ 6 నాటికి కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని అమలు చేయాలి’ అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు. దాని ప్రతులను కిర్లంపూడిలో విలేకర్లకు విడుదల చేశారు. డిసెంబర్ 6లోగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే తమవద్ద రెండు ఆప్షన్లున్నాయని, సీఎం నిర్ణయాన్నిబట్టి ఏదో ఒకటి అమలు చేస్తామన్నారు. -
ప్రజాభీష్టం మీద ఎందుకీ పగ?
విశ్లేషణ అమెరికన్ తత్వవేత్త నామ్ చోమ్స్కీ ప్రభుత్వానుకూలమైన వార్తలను ప్రజలు నమ్మే విధంగా రూపొందించే విధానాన్ని ‘మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్’గా అభివర్ణించారు. రాష్ట్రంలో కూడా కొందరు తమ స్వార్థం కోసం మాన్యుఫాక్చరింగ్ ఉద్యమాలను లేవదీసి లబ్ధి పొందారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల, తగిన వ్యవధి లేకపోవడం వల్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేరు. అందుకే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకే అధికారం అప్పగించారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా; సొంత ఎజెండాలతో పాలించే ప్రభుత్వాలను దారిలోకి తేవడానికి ప్రజలు ఉపయోగించే ఆయుధం ‘ఉద్యమం’. సాధారణంగా ప్రజానీకం ఓపికతోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలను మౌనంగా భరిస్తుంది. ప్రజలు ఉద్యమబాట పట్టారంటే అర్థం– వారి సహనం నశించినట్టే. ఇక ఉద్యమాల వెనుక ఉన్న ఆకాంక్షలను గుర్తించకుండా, వాటిని అణచివేయడమంటే ప్రభుత్వం తన వేలితో తన కన్ను పొడుచుకోవడమే. ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. రెండేళ్ల పాటు ప్రజలు ఓపికగా భరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్షణాలేవీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలలో కనపడడం లేదని గ్రహించిన తరువాత హక్కుల సాధనకు ఇప్పుడు ఉద్యమబాట పట్టారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ, మద్యపాన వ్యతిరేకోద్యమం (ఇది రూపుదిద్దుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు), ప్రత్యేక హోదా ఉద్యమం– ఇలా అనేక ఉద్యమాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు ఉద్యమిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తమ పాలనలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఎందుకు రోడ్ల పైకి వచ్చి ఉద్యమిస్తున్నారో, ఆ అసంతృప్తి ఎందుకో ప్రభుత్వం అర్థం చేసుకోవలసి ఉంది. తదనుగుణంగా ఆ పార్టీ ప్రభుత్వం తన విధానాలను సవరించుకునే బాధ్యతను కలిగి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఉద్యమాలను అణచివేయడానికీ, నిర్బంధకాండతో కృత్రిమమైన కౌంటర్ ఉద్యమాలను (మాన్యుఫ్యాక్చరింగ్ యాజిటేషన్స్) తానే నడిపిస్తున్నది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నవారిగా చిత్రీకరిస్తున్నది. అమెరికన్ తత్వవేత్త నామ్ చోమ్స్కీ ప్రభుత్వానుకూలమైన వార్తలను ప్రజలు నమ్మే విధంగా రూపొందించే విధానాన్ని ‘మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్’గా అభివర్ణించారు. రాష్ట్రంలో కూడా కొందరు తమ స్వార్థం కోసం మాన్యుఫాక్చరింగ్ ఉద్యమాలను లేవదీసి లబ్ధి పొందారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల, తగిన వ్యవధి లేకపోవడం వల్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేరు. అందుకే తెలం గాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకే అధికారం అప్పగించారు. అయితే అన్ని సందర్భాలలో కౌంటర్ ఉద్యమాలతో లబ్ధి పొందగలమన్న నమ్మకంతో చంద్రబాబు ప్రస్తుతం అన్ని ఉద్యమాలను అణచివేయడానికి అదే ఆయుధాన్ని ఉపయోగించాలని భావిస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా తెలుగుదేశం సాగిస్తున్న కౌంటర్ ఉద్యమాల తీరుతెన్నులను సమగ్రంగా విశ్లేషించుకోవాలి. ఎస్సీ వర్గీకరణ– చంద్రబాబు ద్వంద్వ వైఖరి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. వర్గీకరణకు అనుకూలంగా అసెం బ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. అక్కడ నుంచి అనుమతి రాక ముందే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ ఫలాలను ప్రభుత్వ పరంగా ఆయా వర్గాలకు అందించారు కూడా. తరువాత జరిగిన పరిణామాలలో న్యాయస్థానం ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతో సమస్య మొదటికొచ్చింది. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, ఆయన పార్టీ ఈ మూడున్నరేళ్లుగా ఏనాడూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు. పైగా కృష్ణమాదిగ మంగళగిరిలో కురుక్షేత్ర సభ ఏర్పాటు చేసుకుంటే అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి వ్యతిరేకంగా కొందరితో కౌంటర్ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టించారు. ఈ కౌంటర్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఒకరిద్దరు నాయకులకు తరువాత రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కూడా దక్కాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమం తెలుగుదేశం తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం మేరకు కాపులను బీసీలలో చేర్చకుండా జరుగుతున్న జాప్యానికి నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కాలంగా నిర్బంధ కాండను కొనసాగిస్తున్నది. ముద్రగడకు వ్యతిరేకంగా కాపు, బలిజనేతలను కొందరిని సమీకరించి కౌంటర్ ఉద్యమాన్ని కూడా సాగిస్తున్నారు. ఒకవైపు కాపులను బీసీలలో చేర్చాలన్న తమ విధానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతూనే, మరోవైపు లోపాయికారీగా బీసీ నేతలతో వ్యతిరేక ప్రకటనలు చేయిస్తున్నారు. వారితో లోపాయికారీగా కౌంటర్ ఉద్యమాన్ని ప్రారంభించేటట్టు చేసి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. తునిలో జరిగిన రైలు దహనం సంఘటనకు ముద్రగడను బాధ్యుడిని చేయడంతో పాటు, ఆయనను ఏనాడూ కాపు, బలిజల హక్కుల కోసం పాటుపడని స్వార్థపరునిగా చిత్రించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి ప్రత్యేక ప్యాకేజీకి రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. ఈ అంశంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ, తక్షణం ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ ఒక దశలో టీడీపీ, బీజేపీయేతర పార్టీలన్నీ ఉద్యమం చేశాయి. దీనితోనే ఆ అంశం ప్రజలలో సెంటిమెంట్‌గా బలపడింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నలుగురు వ్యక్తులు ఆత్మార్పణ చేసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్రమత్తమై తాను కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించబోతున్నట్టు ప్రజ లందర్నీ నమ్మిస్తూ వచ్చి చివరకు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీయే మేలు అని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదంటూ ప్లేట్ ఫిరాయించారు. రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’రాకపోవడానికి బీజేపీయే కారణమంటూ పరోక్ష ప్రచారాన్ని నిర్వహించారు. ‘మద్యపాన వ్యతిరేక ఉద్యమం’రాకుండా కౌంటర్ ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన ‘దశలవారీ మద్యపాన నిషేధం’ హామీ, బెల్ట్ షాపులను రద్దు చేస్తూ ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి చేసిన ‘తొలి సంతకం’ హామీలు మూడున్నర సంవత్సరాలుగా ఆచరణకు నోచుకోలేదు. ఇంకా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నూతన మద్య విధానం’లో భాగంగా అన్ని పట్టణాల్లో జనావాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు అవుతున్నాయి. దీని మీద మహిళల ఆగ్రహాన్ని గ్రహించిన బాబు దానికీ ఓ కౌంటర్ వదిలారు. ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు ఉండేందుకు వీల్లేదు’ అంటూ మౌఖికమైన ఆదేశాలు జారీ చేశారు. దానికి బ్రహ్మాండమైన ప్రచారం కల్పిం చారు. సీఎం ఆదేశాలు అమలు జరిగినట్లు, బెల్ట్ షాపులు తొలగిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపుల్ని తొలగించి ఉంటే మద్యం అమ్మకాలు తగ్గి ఉండాలి. కానీ ‘సీఎం కోర్‌డాష్ బోర్డు’లోని వివరాల ప్రకారం 2016 ఆగస్టు మాసంలో మద్యం అమ్మకాల విలువ రూ. 1,019.78 కోట్లు ఉండగా, 2017 ఆగస్టు మాసానికి ఆ మొత్తం 1,195.59 కోట్లు. అంటే ఆదాయంలో వృద్ధిరేటు 17.24 శాతం. సీఎం ఆదేశాలు అమలు జరిగి రాష్ట్రంలో బెల్ట్ షాపు ఒక్కటీ లేనట్లయితే అమ్మకాలు తగ్గాలి కదా? మరి ఎలా పెరిగినట్లు? పోలవరాన్ని అడ్డుకుంటున్నదెవరు? పోలవరం ప్రాజెక్టును 2018 నాటికల్లా పూర్తి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చంద్రబాబునాయుడు పలు వేదికల నుంచి చెప్పారు. ఎప్పుడైతే తమ కాంట్రాక్టర్ ఆ పనుల్ని సకాలంలో చేయలేకపోతున్నారని గ్రహించారో.. కాంట్రాక్టర్‌పై వేటు వేయకుండా పనులన్నీ విభజించి నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పి.. 2018 నాటికి తొలి దశæ నిర్మాణం పూర్తి కాబోతున్నదని మాట మార్చారు. తాజాగా, ప్రాజెక్టు తొలిదశ కూడా 2018 నాటికి పూర్తి కావడం సాధ్యం కాదని తేలిపోవడంతో ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో సహా ప్రతిపక్షాలు ఎత్తిచూపుతూ, బహిరంగ చర్చకు రావాలని సవాలు చేస్తుంటే ఆత్మ రక్షణలో పడిన ప్రభుత్వం ఎలా సమర్థించుకోవాలో తెలియక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని కౌంటర్ ఎటాక్ చేస్తున్నది. పాఠాలు నేర్చుకోని ‘బాబు’ 1995–2004 మధ్య చంద్రబాబు ప్రజల ఆకాంక్షలు, ఆక్రందనలు గుర్తించకుండా, సహచర పార్టీ నేతల సలహాలు, హితవులు పాటించకుండా ప్రపంచ బ్యాంక్ ఎజెండాను అమలు చేసుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసి అవి ఉద్యమాలుగా రూపుదిద్దుకుంటే వాటిపట్ల సానుకూల వైఖరితో విధానాలను సమీక్షించుకొని అనుగుణ్యమైన సవరణలు చేసుకోకుండా సాచివేత విధానాలను అమలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఎగసిన ఉద్యమంపై బషీర్‌బాగ్ సాక్షిగా పోలీసు తూటాలను ప్రయోగించారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుందని కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందంటూ ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. తన హయాంలోనే తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధించిందంటూ హైదరాబాద్‌లోని సైబ రాబాద్ అభివృద్ధిని తన ఖాతాలో చూపించాలని విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు అలిపిరిలో తనపై నక్సలైట్లు దాడి చేసినప్పుడు దానిని ప్రభుత్వ వైఫల్యంగా అంగీకరించకుండా ఏకంగా అసెంబ్లీని రద్దు చేసి నక్సలిజానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు అంటూ దానిని ప్రధాన ఎన్నికల అస్త్రంగా మార్చి భంగపడ్డారు. చరిత్ర పునరావృతమైనట్లుగా, సీఎం బాబు ప్రస్తుతం రాష్ట్రంలో ఎగసిపడుతున్న పలు ప్రజా ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న సంఘాలలో చీలికలు తెస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలలో చీలి కలు తెచ్చిన తెలుగుదేశం పార్టీ చివరకు జర్నలిస్ట్ సంఘాలలో సైతం పార్టీ పరంగా చీలికలు తేవడం గమనార్హం. తాజాగా, డబ్బుతో అధికార దుర్వినియోగంతో లభించిన నంద్యాల గెలుపును సీఎం చంద్రబాబు తన విధానాలకు, అభివృద్ధి నమూనాకు ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించుకుంటూ ప్రజాస్వామ్యానికి ఊపిరి అయిన ప్రజా ఉద్యమాలను మరింతగా అణచివేసే ప్రమాదం కనబడుతున్నది. కౌంటర్ ఉద్యమాలవల్ల తాత్కాలిక విజయాలు దక్కవచ్చు. అంతిమంగా ప్రజా చైతన్యం ముందు తలవంచాల్సిందే. వ్యాసకర్త సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ మొబైల్ : 81069 15555 -
కాపు రిజర్వేషన్లపై స్పందించిన పవన్ కల్యాణ్
►కాపులకు రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ వాగ్దానం చేసింది ►రిజర్వేషన్ హామీ...ప్రత్యేక హోదా హామీలాంటిదే.. ►అన్ని కులాల కోసం పని చేస్తా ►అంబేద్కర్ రిజర్వేషన్ల లేని సమాజం కోరుకున్నారు.. ►మా అమ్మ కులాన్ని పెట్టుకుంటే మాకు రిజర్వేషన్ వచ్చేది ►ఏపీ నాయకులు వ్యక్తిగత అవసరాలకు రాజీ పడ్డారు సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్... కాపు రిజర్వేషన్లపై స్పందించారు. ఆయన శనివారం సోషల్ మీడియా బృందంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ వాగ్దానం చేసింది. ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కాపు రిజర్వేషన్ హామీ ...ప్రత్యేక హోదా హామీ లాంటిదే. కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వలేమని చెప్పండి. మభ్యపెడితే అశాంతికి కారణం అవుతుంది. ఆలస్యం చేయకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఒక కులం కోసం నేను పని చేయను. ప్రతి కులాన్ని గౌరవిస్తా. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఆపే హక్కు పోలీసులు, ప్రభుత్వానికి లేదు. ఆయనను అడ్డుకోవడం శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తోంది. అంబేద్కర్ రిజర్వేషన్లు లేని సమాజం కోరుకున్నారు. మా అమ్మ బీసీ (బలిజ)... మా నాన్న అగ్రకులం. మా అమ్మ కులాన్ని పెట్టుకుంటే మాకు రిజర్వేషన్ వచ్చేది. క్రిమీలేయర్ విధానాన్ని పెట్టాలి. రాజకీయ నాయకులు, చదువుకోనోళ్లు.. అందుకే విద్యకు ప్రాధాన్యం ఇవ్వరు. ఓ ఐపీఎస్ అధికారి సహాయంతో పూర్ణ ఎవరెస్ట్ ఎక్కగలిగింది. అవసరమైతే పాఠాలు ఉన్నాయి కానీ... పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే పాఠ్యాంశాలు లేవు. నాణ్యమైన విద్య కావాలంటే టీచర్లకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. మద్యం మీద కంటే విద్య మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. తెలంగాణ నాయకులు సమిష్టిగా పోరాడితే.. ఏపీ నాయకులు వ్యక్తిగత అవసరాల కోసం రాజీపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేశారనడం కాదు. రాష్ట్రానికి కావాల్సిన వాటిపై మీరేం చేశారో ప్రశ్నించుకోండి. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసేముందు మనం ఏం చేశామో ఆలోచించుకోండి.’ అని వ్యాఖ్యానించారు. -
పాదయాత్రతో సత్తా చూపించాం
- నంద్యాల ఉప ఎన్నికలో ధనప్రవాహం - మీడియా సమావేశంలో కాపు ఉద్యమనేత ముద్రగడ జగ్గంపేట : ‘పాదయాత్ర ద్వారా కాపుల సత్తా చూపాం. మీ సవాల్‌కు పాదయాత్రతో కనువిప్పు కలిగించా’మని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రపై హేళన చేశారని, దీనిపై సర్కార్‌కు బొప్పి కట్టేలా ఐదారు కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టి సత్తా చాటామన్నారు. ఇంటెలిజెన్స్ బాస్‌దే వైఫల్యం : పాదయాత్ర చేపట్టడంతో డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బలిపశువులను చేయాలని చూస్తున్నారని, వారి వైఫల్యం లేదని, మొత్తం మీ ఇంటెలిజెన్స్ బాస్ వైఫల్యమేనన్నారు. కాగా, పాదయాత్ర తదుపరి కార్యాచరణపై ఈనెల 30న కాపు జేఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామన్నారు. ఇందుకోసం పాదయాత్రకు తాత్కాలికంగా రెండు రోజులు విరామం ప్రకటించామన్నారు. నంద్యాల ఉపఎన్నికపై మాట్లాడుతూ... అక్కడ విచ్చలవిడిగా నోట్లు పంచారని, అధికార దుర్వినియోగం బాగా జరిగిందన్నారు. ఉప ఎన్నిక ప్రభావం 2019 సాధారణ ఎన్నికల్లో ఉండదన్నారు. కాగా, ఆదివారం నాటి ఘటనతో పోలీసులు కిర్లంపూడిలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. -
‘సీఎం ఏమైనా హిట్లరా?, ఎంతకైనా తెగిస్తాం’
సాక్షి, కిర్లంపూడి : ఈ నెల 30న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై, పాదయాత్రతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన సోమవారం కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చమని అడగటం తప్పా?. మేం ఓట్లు వేసింది కొట్టించుకోవాడానికా?. మేము ఏమైనా ఉగ్రవాదులమా?, హామీలను అమలు చేయాలని అడగొద్దా?. ముఖ్యమంత్రి ఏమైనా హిట్లరా?. ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుందా?. ఎవరి అనుమతి తీసుకుని చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు?. సొల్లు ఉపన్యాసాలతో చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవా?. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారా?. మాకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా చూస్తూ ఊరుకోవాలా?. కమీషన్లు తప్ప, ప్రజా సమస్యలు పట్టవా?. మా జాతి ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తాం. రిజర్వేషన్లు సాధించేవరకూ పోరాటం కొనసాగిస్తాం.’ అని ముద్రగడ స్పష్టం చేశారు. ఎవరికీ లేని ఆంక్షలు తన పాదయాత్రకే ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక గెలుపుపై ముద్రగడ మాట్లాడుతూ.. అభివృద్ధితో కాదని, అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీతో టీడీపీ గెలిచిందన్నారు. -
‘సీఎం ఏమైనా హిట్లరా? ఎంతకైనా తెగిస్తాం’
-
సర్కారుకు ముద్రగడ షాక్
-
సర్కారుకు ముద్రగడ షాక్
అనూహ్యంగా ‘చలో అమరావతి’ పాదయాత్రను చేపట్టిన కాపు ఉద్యమనేత జగ్గంపేట: కాపులకిచ్చిన హామీల్ని నెరవేర్చా లని తలపెట్టిన ‘చలో అమరావతి’ పాద యాత్రను నెల రోజులుగా అడ్డుకుంటున్న రాష్ట్రప్రభుత్వానికి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్య రీతిలో షాకిచ్చారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా వంటావార్పూ పిలుపుతో భారీగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి తరలివచ్చిన కాపు నేతలు, కాపులతో కలసి ఆయన ఆదివారం ఉదయం 11.20 గంటలకు తన నివాసం నుంచి ఒక్కసారిగా పాదయాత్రను చేపట్టారు. కంగు తిన్న పోలీసులు యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులను తోసుకుంటూ కిలోమీటర్ దూరంపాటు పాదయాత్ర కొన సాగింది. అనంతరం పోలీసులు అప్రమత్తమై యాత్రను నిలువరించారు. దీంతో అక్కడే బైఠాయించిన ముద్రగడ నిరసన తెలిపారు. చివరకు సాయంత్రం 4.30 గంటలకు వీరవరం వద్ద ముద్రగడను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిర్లంపూడికి తరలిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆయన్ను వీరవరం, రామచంద్రపురం, తామరాడ, పాలెం, జగ్గంపేట మండలం రామవరం మీదుగా జాతీయరహదారి వైపు తరలిం చారు. ఈ క్రమంలో అభిమానులు, కాపులు అడుగడుగునా అడ్డగించారు. దీంతో రాత్రి పదిగంటలకు ఆ వాహనం రామవరం చేరుకోగా ముద్రగడ అభిమానులు, కాపులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతైనా ఇవ్వండి లేదా అరెస్ట్ చేయండంటూ ముద్రగడ బీష్మించారు. చివరికి రాత్రి 11.45 గంటలకు ముద్రగడను కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లక్ష్యం నెరవేరేదాకా పోరు ఆగదు లక్ష్యం నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తుపాకులతో కాల్చినా, లాఠీలతో కొట్టినా ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని, ఎన్ని కేసులు పెట్టినా బాధపడమని అన్నారు. పాదయాత్రను అడ్డుకుని నెలరోజులైన నేపథ్యంలో ఆదివారం ఉదయం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాలతో సిగ్గూలజ్జా లేకుండా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరిని ఓడించాలో, ఎవరిని నెగ్గించాలో కాపు జాతికి చెప్పనక్కర్లేదన్నారు. కాపు ఉద్యమం ఉధృతం విజయవాడలో సమావేశమైన కాపు నాయకులు సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విజయవాడలో ఆదివారం సమావేశమైన కాపు ప్రతినిధులు హెచ్చరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో తెలగ, బలిజ, కాపు అడహక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి సత్యనారాయణ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ముద్రగడతో కలసి పనిచేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే కొత్తగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీతోపాటు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటవుతాయన్నారు. బలిజ, తెలగ, కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారన్నారు. త్వరలోనే తమ పాలసీని ప్రకటిస్తామని వివరించారు. -
కిర్లంపూడిలో టెన్షన్..టెన్షన్..
-
కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠ
-
ముద్రగడకు పెరుగుతున్న మద్దతు
జగ్గంపేట : కాపు రిజర్వేషన్ల పోరుబాటతో వార్తల్లోకెక్కిన కిర్లంపూడికి జనం పోటెత్తుతున్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపడుతున్న పాదయాత్రను నెల రోజులుగా ప్రభుత్వం నిలువరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద శిబిరంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ముద్రగడకు రాష్ట్రం నలుమూలల నుంచి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు భారీగా తరలివచ్చి మద్దతు తెలియజేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్యెల్యే కంబాల జోగులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపారు. ఆయన చేపడుతున్న ఉద్యమం న్యాయసమ్మతంగా ఉందని ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలన్నారు. కొత్తపేట నియోజకవర్గం వానపాలెం గ్రామానికి చెందిన కాపులు ముద్రగడను కలిసి మద్దతు ప్రకటించారు. జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అక్కడ నుంచి వచ్చిన బండారు సూర్యనారాయణ, వెంకట సుబ్బారావు, పిండి సత్తిబాబు, తదితరులను పరిచయం చేశారు. కాకినాడ అడ్వకేట్ జేఏసీ నాయకులు పేపకాయల రామకృష్ణ, తుమ్మలపల్లి ప్రసాద్, తుమ్మలపల్లి చంద్రశేఖర్, చక్కపల్లి చంటిబాబు తదితరులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపారు. అలాగే ఏలూరు నుంచి బస్సులో వచ్చిన కాపు సంఘం నాయకులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపి కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం తీరును విమర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా ముద్రగడను కలిసేందుకు తరలివచ్చారు. నిరసనలో కాపు జేఏసీ నేతలు కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గోపు అచ్యుతరామయ్య, రౌతు స్వామి, తుమ్మలపల్లి రమేష్, ఆరేటి ప్రకాష్, జీవీ రమణ, చక్కపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు సర్కారు అబద్ధాల మేడ'
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వమే అబద్ధాల మేడ అని కాపు సంఘం నేత కటారి అప్పారావు ధ్వజమెత్తారు. తమకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కాపులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నారని, ముద్రగడ పద్మనాభం పిలుపుమేరకు తుని సభకు లక్షలమంది తరలివచ్చారని గుర్తుచేశారు. తుని సభ నాటి నుంచి కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష సవాల్‌పై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు కాపు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో కాపులంతా చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కటారి అప్పారావు కోరారు. -
ముద్రగడపై నిర్బంధం ఎత్తివేయాలి
-
ముద్రగడపై నిర్బంధం ఎత్తివేయాలి: రఘువీరా
విజయవాడ: కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబుది మోసపూరిత విధానమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలు, ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో కాపులను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం మరో వంచనకు దిగిందని ఆయన ధ్వజమెత్తారు. మంజునాథ్ కమిషన్ నివేదిక ఏమైంది..? కమిషన్ ఎటువంటి సిపార్సులు చేసిందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏ ప్రతిపాదికన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు. మంజునాధ్ కమిషన్ నివేదిక రాకుండానే కాపులకు విద్య, ఉద్యోగాలల్లో రిజర్వేషన్ అని చంద్రబాబు చెప్పడం కాపులను మరోసారి మోసం చేయడమేనని మండిపడ్డారు. మంజునాథ్ కమిషన్ నివేదిక ఎప్పటిలోగా పూర్తి అవుతుందో సృష్టం చేయాలని కోరారు. కాపుల రిజర్వేషన్ అంశంపై బీజేపీ, ఎన్డీఏ తన అభిప్రాయం సృష్టం చేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏమీలేదన్నారు. ముద్రగడ్డ పద్మనాభంపై నిర్బంధం ఎత్తివేయాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. -
ఇక మరాఠా మంత్రం!
కాపు ఉద్యమ వ్యూహం మారనుందా? మరాఠాల ర్యాలీ నేపథ్యంలో మంతనాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేతలు వ్యూహాన్ని మార్చనున్నారా? తమ సత్తా ఏమిటో ప్రభుత్వానికి మరోమారు చూపాలనుకుంటున్నారా? ఇందుకు అవుననే అంటున్నారు కాపునాడు నాయకులు, వ్యూహకర్తలు. మరాఠాలు ముంబయి మహానగరంలో మిలియన్ మార్చ్ నిర్వహించి డిమాండ్లను సాధించుకున్న నేపథ్యంలో తాము కూడా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కాపు నేతలు తాజాగా చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా మిలియన్ మార్చ్ తరహాలో అమరావతిలో శాంతియుతంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తే బావుంటుందని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దిశగా కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బృందంతో చర్చలు జరపాలని నిర్ణయించారు. కాపు రిజర్వేషన్ల సమస్యపై గతంలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు 2016 ఆగస్టులోగా సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రులు, మధ్యవర్తులుగా హాజరైన పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది గడిచినా ఎలాంటి ఫలితం లేని నేపథ్యంలో బల ప్రదర్శన చేయాలని కాపు ఉద్యమ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో రైలు దగ్ధం సంఘటనను సాకుగా చూపుతూ ఛలో అమరావతి పేరిట తలపెట్టిన ముద్రగడ బృందం పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. గత నెల 26 నుంచి ఇప్పటి వరకు ఆయన్ను అధికారికంగా కొంత కాలం, అనధికారికంగా మరికొంత కాలం గృహ నిర్బంధంలో ఉంచింది. నిత్యం ముద్రగడ బృందం కిర్లంపూడిలో ఇంటి నుంచి గేటు దాకా రావడం, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం 15 రోజులుగా పరిపాటిగా మారింది. ముద్రగడ పాదయాత్రను ప్రభుత్వం సాగనిచ్చే అవకాశం లేనందున తాత్కాలిక సచివాలయం ఉన్న వెలగపూడి ప్రాంతంలో భారీ బహిరంగ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదననూ కాపు నేతలు పరిశీలిస్తున్నారు. దీనిపై ఈ నెల 15 తర్వాత ముద్రగడ బృందంతో చర్చించనున్నట్టు తెలిసింది. -
కాపులు బాబుకు బుద్ధి చెప్పాలి: ముద్రగడ
-
కాపులు బాబుకు బుద్ధి చెప్పాలి: ముద్రగడ
జగ్గంపేట/కిర్లంపూడి (జగ్గంపేట): ‘రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం ఆఖరి దశకు చేరుకుంది.. చావో రేవో తేల్చుకుందాం.. ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని కోరుతుంటే అణగదొక్కేందుకు చూస్తున్నారు.. తాటాకు మంటలా కాకుండా తుమ్మ కర్రలా ఉద్యమ సెగ సీఎం కుర్చీకి తగలాలి.. ఆ సెగకు కుర్చీలో కూర్చోలేక ఇదేంటి కాపు గోల అంటూ ఉక్కిరిబిక్కిరవుతూ ఇచ్చిన హామీ గుర్తుకు రావాలి.. నంద్యాల అసెంబ్లీ, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపులు తమ సత్తా చాటి చంద్రబాబుకు బుద్ధి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో గురువారం 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు 300 మంది సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రిజర్వేషన్ల సాధన దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. -
‘చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’
కాకినాడ: నియంతృత్వ పోకడలకు పోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నంద్యాల సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమర్ధించారు. వైఎస్ జగన్ ప్రజల బాధను వ్యక్త పరిచారని, బాబుపై ఆయన చేసిన వ్యాఖ్యల్లోని భావం ముఖ్యమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సునీల్ తదితరులు సోమవారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఈ మేరకు ఆయన తలపెట్టిన పాదయాత్రకు వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజమండ్రిలో చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి వంచించారన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు గొప్ప కోసం 29 మంది అమాయకులు ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. ఆ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా ప్రజలు మరిచిపోలేదని, రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం వేసిన విచారణలో ఏం తేలిందని బొత్స ఈ సందర్భంగా నిలదీశారు. చంద్రబాబు ఇంటింటికి తిరిగి కాపులను బీసీ జాబితాలో చేర్చుతామన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీనే ముద్రగడ అడుగుతున్నారని, చంద్రబాబు చేస్తున్న పని కాపు జాతికి అవమానకరమన్నారు. ఇచ్చిన హామీ కోసం ముద్రగడ పాదయాత్ర చేస్తామంటే ఇంటికో పోలీసును పెట్టి ఉద్యమాన్ని అణచివేస్తారా? అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్నారు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు ఆదివారం మళ్లీ అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి 6వ రోజైన ఆదివారం కూడా బయటకు రానీయకుండా చేశారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు పాదయాత్రకు అనుమతులు లేవని పోలీసలు మద్రగడను అడ్డుకున్నారు. ముద్రగడ, కాపు జేఏసీ కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శనివారం కూడా ఆయన పాదయాత్రను అడ్డుకున్నారు. ఎన్నిరోజులు పాదయాత్రను ఆపుతారు. 24 గంటల్లో పాదయాత్రకైనా అనుమతి ఇవ్వండి లేదా మమ్మల్ని జైల్లోనైనా పెట్టండి అని ముద్రగడ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి 5వ రోజైన శనివారం కూడా బయటకు రానీయకుండా చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పాదయాత్రకు అనుమతులు లేవని ఓఎస్డీ రవిశంకరరెడ్డి ముద్రగడకు తెలిపారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ.. ‘‘ఎన్ని రోజులు పాదయాత్రను ఆపుతారు. 24 గంటల్లో పాదయాత్రకైనా అనుమతి ఇవ్వండి లేదా మమ్మల్ని జైల్లోనైనా పెట్టండి’’ అని డిమాండ్ చేశారు. అనంతరం చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వం వైఖరికి నిరసన తెలిపారు. ఆయన ఇంటి గేటు వద్ద కాపు జేఏసీ నాయకులు కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సతీమణి పద్మావతి, కుమారుడు గిరి, కోడలు సిరి, మనువరాలు భాగ్యలక్ష్మితో పాటు కాపు జేఏసీ నాయకులతో కలసి ముద్రగడ తన ఇంటి వద్ద కంచాల మోత కార్యక్రమాన్ని నిర్వహించారు. -
చెవిలో పూలతో ముద్రగడ నిరసన
- పాదయాత్ర ప్రారంభం కాకుండా మూడోరోజూ అడ్డుకున్న పోలీసులు కిర్లంపూడి: ‘చలో అమరావతి’ పాదయాత్రకు సిద్ధమైన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు శనివారం కూడా అడ్డుకున్నారు. దీంతో మండిపడ్డ ఉద్యమనేత.. 24 గంటల్లోగా ఉన్నతాధికారులతో మాట్లాడి పాదయాత్రకు అనుమతించాలని లేదంటే అరెస్టు చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్కారు తీరును నిరసిస్తూ ముద్రగడ సహా కాపు నేతలంతా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గడిచిన మూడు రోజులుగా ముద్రగడ పాదయాత్రకు బయలుదేరడం, అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను ఇంటి గేటు వద్దే అడ్డుకోవడం జరుగుతోంది. ఐపీసీ సెక్షన్, 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతించబోమని పోలీసులు చెబుతుండగా, అంతే ఘాటుగా స్పందించిన ముద్రగడ.. పోలీసుల నోటీసులపై తాను కోర్టుకు వెళ్లనని, స్టేలు, బెయిల్ తెచ్చుకోబోనని తేల్చిచెప్పారు. -
'మంత్రి పదవికి రాజీనామా చేస్తా'
విజయవాడ: బీసీలకు అన్యాయం జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానాని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల కాపు రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని.. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్ ఉండదు.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారన్నారు. -
కాపు రిజర్వేషన్లు అమలు చేయాలి
తూర్పు గోదావరి: కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ ఆధ్వర్యంలో ఆకలి కేకలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, మరికొంత మంది కాపు నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు. -
కాపు రిజర్వేషన్లు దీర్ఘకాల సమస్య
కాకినాడ: కాపు రిజర్వేషన్లు దీర్ఘకాల అపరిష్కృత సమస్య అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. కాపుల సమస్యలను లౌక్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికనిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఏం జరుగుతుందో కేంద్రం దృష్టిలో ఉందని ఆయన అన్నారు. -
నడుస్తానో లేదో వదిలిపెట్టి చూడండి
సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం సవాల్ సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ముద్రగడ పద్మనాభంకు నడిచే ఉద్దేశం లేకనే అనుమతి కోసం దరఖాస్తు చేయడం లేదని ఓ పెద్దాయనతో సీఎం చంద్రబాబు చెప్పిం చారు. నన్ను స్వేచ్ఛగా వదలండి. నేను నడుస్తానో లేదో చూడండి. నేను నడిస్తే ఆ పెద్దాయన పదవికి రాజీనామా చేయాలి. నడవకపోతే నేను ఉద్యమాన్ని వదిలేస్తా’’ అని కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. తనను గృహ నిర్బంధంలో ఉంచారనే భావిస్తున్నానని చెప్పారు. ప్రాణాలు పోతున్నా తాను, తన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లబోమన్నారు. తన పాదయాత్ర రూట్ మ్యాప్ సీఎం చంద్రబాబుకు పంపానని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు చేసిన పాదయాత్ర అనుమతి దరఖాస్తు నమూనాను ఇప్పిస్తే తాను కూడా అదే విధంగా దరఖాస్తు చేస్తానని తెలిపారు. చంద్రబాబుకో చట్టం... తమకో చట్టమా? అని నిలదీశారు. ముద్రగడ ఇంకా ఏం చెప్పారంటే... బాబులాగా స్టేలు, బెయిళ్లు తెచ్చుకోను ‘‘నన్ను బెదిరిస్తున్నారు. అండర్‌గ్రౌండ్‌కు వెళ్లాలని, లేదంటే తీహార్ జైలుకు పంపుతా రని కబురు పంపిస్తున్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే అరెస్టు చేయండి. ఈ నెల 14న 69 కేసుల్లో చార్జిషీట్ వేస్తున్నాం, 49 కేసుల్లో ముద్రగడే ముద్దాయి అన్నారు. ఏమైంది.. ఎందుకు తోక ముడిచారు. నా జాతి కోసం దేనికైనా సిద్ధం. ఉరిశిక్ష వేసినా అప్పీల్ కూడా చేసుకోను. మీలాగా స్టేలు, బెయిళ్లు తెచ్చుకోను’’. అని ముద్రగడ అన్నారు. -
మాట నిలబెట్టుకోమని అడిగితే అరెస్టులా..?
-
‘చలో అమరావతి’పై ఉక్కుపాదం
-
అతడే ఒక సైన్యం
♦ పద్మనాభం.. ఉద్యమ నినాదం ♦ కాపు జాతి రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం ♦ హామీలు అమలు చేయాలని రెండేళ్లుగా సర్కారుపై పోరుబాట కిర్లంపూడి (జగ్గంపేట) : దీక్ష.. నిరసన.. ఆందోళన.. పేరు ఏదైనా ఆయనది ఉద్యమపథమే. తన జాతి కోసం.. జాతికిచ్చిన హామీల అమలు కోసం ఆయన అహర్నిశలు పోరాడుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా కాపులకు హామీలిచ్చి.. ఆ తర్వాత వాటిపై నోరుమెదపని చంద్రబాబును నిద్రలేపేందుకు నిత్యం ఉద్యమిస్తూనే ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసినా.. కేసులతో బెదిరించినా.. కుటుంబసభ్యులను ఇబ్బందిపెట్టినా ఉద్యమమే ఊపిరిగా సాగిపోతున్నారు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఆయన కాపుల కోసం ఉద్యమం చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో ఆయన కాపు జాతి కోసం పోరాడుతున్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ‘‘మా పార్టీ అధికారంలోకి వస్తే ఆరునెలల్లోపు కాపులను బీసీల్లోకి చేరుస్తాం..ఏటా రూ.వెయ్యికోట్లు కేటాయించి కాపుల అభివృద్ధికి కట్టుబడతాం.. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం.’’ : ఇవీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఎలాగైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆరునెలలు గడిచాయి. ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలపై నోరుమెదప లేదు. ఏడాదైంది.. అయినా కాపులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. పట్టించుకోలేఖనే.. జూలై 26 2015 : కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించలేదు. ఆగస్టు 25, 2015 : ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖ రాశారు. ఆ తర్వాత మరో 2,3 లేఖలు రాసినా ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. నవంబర్ 2015 : తుని ఐక్య గర్జనకు ముద్రగడ పిలుపునిచ్చారు. జనవరి 31న తేదీని ఖరారు చేశారు. జనవరి 31, 2016 : ముద్రగడ పిలుపుతో తునిలో ఏర్పాటు చేసిన కాపు ఐక్యగర్జనకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది కాపులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ సమయంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడంతో రైలు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ముద్రగడతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 4 2016 : ముద్రగడ పద్మనాభం తన స్వగృహంలో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 8 2016 : టీడీపీ పెద్దలు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు కిర్లంపూడి వచ్చి ఆరు నెలల్లోపు మంజునాథ కమిషన్ రిపోర్టు తెప్పించుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రానికి పంపిస్తామని హామీ ఇచ్చి ముద్రగడ దీక్షను విరమింపజేశారు. జూన్ 8, 2016 : తుని రైలు ప్రమాద ఘటనలో అమలాపురంలో కాపు యువకులను విచారణకు పిలవగా విషయం తెలుసుకున్న ముద్రగడ అమలాపురం వెళ్లగా పోలీసులు ఆయనను వాహనంలో ఎక్కించుకుని కిర్లంపూడిలో దించారు. జూన్ 11, 2016 : జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి యేసుదాసుతోపాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేసి రాజమహేంద్రవరం సబ్‌జైలుకు తరలించారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అదేరోజు పోలీసులు ముద్రగడ, ఆయన సతీమణి, కుమారుడు, కోడలు ఇలా పలువురిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జేఏసీ నాయకులను విడుదల చేసే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ బీష్మించారు. ఎట్టకేలకు జేఏసీ నాయకులు విడుదల కావడంతో 14 రోజుల తరువాత ముద్రగడ ఆసుపత్రి నుంచి కిర్లంపూడికి చేరుకుని ఇంటి వద్ద దీక్ష విరమించారు. నవంబర్ 9, 2016 : రాజమహేంద్రవరంలో రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేశారు. అదే సమయంలో కిర్లంపూడి నుంచి రావులపాలెం మీదుగా అంతర్వేది వరకు పాదయాత్ర నిర్వహించతలపెట్టారు. అయితే పాదయాత్ర ప్రారంభించకుండానే కిర్లంపూడిలో వేలమంది పోలీసులను మోహరింపజేసి ముద్రగడను గృహనిర్బంధంచేశారు. దీంతో ముద్రగడ పాదయాత్రను వాయిదా వేశారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాదయాత్ర చేసి తీరుతానని త్వరలో తేదీని ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం సమావేశంలో ప్రకటించారు. జనవరి 25, 2017 : కిర్లంపూడి నుంచి రావులపాలెం వరకు అంతర్వేది వరకు పాదయాత్ర ప్రకటించారు. అయితే నాలుగు రోజుల ముందుగానే పోలీసు బలగాలు కిర్లంపూడికి చేరుకుని పాదయాత్రకు బయలుదేరుతున్న ముద్రగడను గృహనిర్బంధం చేశారు. అనంతరం కాకినాడలో మహిళా జేఏసీ, లాయర్ల జేఏసీ సమావేశాలతోపాటు పలు దఫాలుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. మే 25 : చావో రేవో చలో అమరావతి నిరవధిక పాదయాత్ర జూలై 26న నిర్వహించ తలపెడుతున్నట్టు ముద్రగడ ప్రకటించారు. అప్పటి నుంచి ముద్రగడకు సంఘీభావంగా కాపునాయకులు కిర్లంపూడి రావడం ప్రారంభించారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కాపు నేతలు ఆయనను కలిశారు. ఆయన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జూలై నెల సమీపించడం... చావో రేవో చలో అమరావతి పాదయాద్ర తేదీ దగ్గరపడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. కాపు నాయకులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. కొంతమందిని బైండోవర్ చేశారు. సెక్షన్ 30 అమలు చేశారు. మరోవైపు హోం మంత్రి చినరాజప్ప కూడా ముద్రగడ ఉద్యమంపై తీవ్రంగానే స్పందించారు. అలాగే డీజీపీ సాంబశివరావు కూడా ముద్రగడపద్మనాభం చేపట్టబోయే పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదన్నారు. దీనిపైనా ముద్రగడ తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి తీసుకునే పాదయాత్రలు చేపట్టారా? నేనెందుకు తీసుకోవాలంటూ మండిపడ్డారు. కిర్లంపూడిలో భారీ పోలీసు బలగాలు.. జూలై 26 సమీపిస్తుండడంతో కిర్లంపూడికి పోలీసు బలగాలు భారీగా చేరాయి. జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో గతంలో లాగే ముద్రగడను గృహనిర్బంధం చేస్తారా?, పాదయాత్రను చేయనిస్తారా? అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. -
ముట్టడిలో కిర్లంపూడి
‘చలో అమరావతి’పై ఉక్కుపాదం - ఇటు హక్కుల పోరు.. - అటు అణచివేత హోరు - కిర్లంపూడి దారులన్నీ బంద్.. సాయుధ బలగాల కవాతు -‘తూర్పు’ దిగ్బంధం.. పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తనిఖీలు - పాదయాత్ర చేసి తీరతామంటున్న ముద్రగడ.. సర్వత్రా ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి అమరావతి: గజానికో పోలీసు చెక్‌పోస్టు.. కిలోమీటర్‌కో బారికేడ్... అడుగడుగునా నిఘా.. వీధివీధినా ఖాకీల బూట్ల చప్పుళ్లు.. తుపాకులతో సాయుధ దళాల కవాతు.. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే నిఘా నేత్రాలు.. నోటీసులు, అరెస్టులు, బైండోవర్ కేసులు.. ఇదీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పరిస్థితి. కాపు రిజర్వేషన్ల పోరాట సమితి కార్యక్షేత్రం కిర్లంపూడి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. కిర్లంపూడిలో సాయుధ బలగాల కవాతు చూసి జనం విస్తుపోతు న్నారు. ‘కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను బలహీన వర్గాల జాబితాలో చేర్చుతామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనే కదా వారు అడుగుతున్నారు. అందుకోసమే కదా ‘చలో అమరావతి’ పాదయాత్ర చేస్తున్నారు. దానిపై ఇలా ఉక్కుపాదం మోపడమేమిటా’ అని జనం ఆశ్చర్యపోతున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడి నుంచి బుధవారం ‘ఛలో అమరావతి’ పాదయాత్రకు సమాయత్తం అవుతున్నారు. ఆయన ఇలా పాదయాత్రకు పూనుకోవడం ఇది మూడోసారి. పాదయా త్రను అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం, చేసి తీరుతామని కాపు నేతలు భీష్మించడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం కిర్లంపూడిలో ఏమి జరుగనున్నదన్న ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ సహా కాపు నేతలు ఆకుల రామకృష్ణ, ఏసుదాసు, నల్లా విష్ణు, ఆరేటి ప్రకాశ్ వంటి ప్రముఖులందర్నీ ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. వేలాది మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా పోలీసుల వలయంలో చిక్కుకుంది. ఏడు వేలకుపైగా బలగాలతో జిల్లాను దిగ్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 చెక్‌పోస్టులు, 116 పికెట్లు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలు సహా వివిధ ప్రాంతాల్లో సెక్షన్ 144, 30ని ప్రకటించారు. నలుగురికి మించి గుమికూడకుండా, కలిసి నడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. సచివాలయానికి వెళ్లే దారిలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం పాదయాత్ర ప్రారంభమయ్యే కిర్లంపూడి గ్రామం పోలీసుల దిగ్బంధంలో ఉంది. భారీ ప్రత్యేక బలగాలతోపాటు ర్యాపిడ్ ఫోర్స్, తదితర బలగాలు ఎక్కడికక్కడ మాటు వేసి ఉన్నాయి. కిర్లంపూడికొచ్చే దారులన్నీ దాదాపు మూసేస్తున్నారు. ఏదో ఒక ఐడీ కార్డు చూపిస్తే తప్ప ఆ గ్రామస్తులను కిర్లంపూడిలోకి రానివ్వడం లేదు. అన్ని ఏర్పాట్లతో ముద్రగడ సన్నద్ధం షెడ్యూల్ ప్రకారం ‘చలో అమరావతి’ పాదయాత్రను బుధవారం ప్రారంభించేం దుకు ముద్రగడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద్యమానికి సహకరిస్తున్న వారందరికీ తమ వేగుల ద్వారా సమాచారం పంపించారు. అంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరదామని సంకేతాలు పంపించారు. పోలీసులు వ్యూహ ప్రతి వ్యూహాలకు, ఎత్తుకు పైఎత్తులను గమనిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే కాపునేతలెవరూ కిర్లంపూడి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా కాపు నేత కిర్లంపూడికి వస్తే ఆ డివిజన్ సూపరింటెండెంట్, సీఐ, ఎస్ఐలే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. నేటి కార్యక్రమం ఇలా... ముద్రగడ అనుచరుల కథనం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు ఆయన తన అనుచరులతో భేటీ అవుతారు. అల్పాహారం అనంతరం ఇంటి నుంచి బయటకు వస్తారు. కుటుంబ సభ్యులు వీడ్కోలు పలుకుతారు. 9.30 గంటలకు ఇంటి గేటు దాటుతారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే తన అనుచరులు పాదయాత్రను కొనసాగిస్తారు. అనుమతి లేదు: డీజీపీ ముద్రగడ యాత్రకు అనుమతి లేదని, ఆ యాత్రలో ఎవరూ పాల్గొనవద్దని డీజీపీ సాంబశివరావు మరోసారి హెచ్చరించారు. కిర్లంపూడిలోని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే యాత్రకు అనుమతి లేదని, లోనికి వెళ్లాలని కోరతామని, ఆయన ఇంటిలోనికి వెళ్లిపోతారని భావిస్తున్నామ న్నారు. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పద్మనాభం అసలు యాత్రకు అనుమతి కోరలేదని చెప్పారు. ఒక జిల్లా పరిధి దాటిన కార్యక్రమాలకు డీజీపీ అనుమతివ్వాల్సి వుంటుందని, కానీ తన వద్దకు ఎటువంటి దరఖాస్తు రాలేదన్నారు. -
ఖాకీ నిఘాలో కాపులు
►కాపు నేతలపై ఆంక్షల కత్తి ►వందలాది నేతలకు నోటీసులు.. కౌన్సెలింగ్ ►కాలు కదపనీయకుండా అడుగడుగునా అడ్డంకులు ►జిల్లాలో 11 చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు ►59 బైండోవర్ కేసులు ►ముద్రగడ పాదయాత్రను విఫలం చేసేందుకు యత్నం ఒంగోలు క్రైం : రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పిలుపినివ్వడం సర్కారుకు దడ పుట్టిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న పోలీసులు జిల్లాలోని కాపులు, కాపు నాయకుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రెండు రోజులుగా జిల్లా పోలీస్ యంత్రాంగం కాపు ముఖ్య నేతలకు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా ఏ ఒక్క కాపు నాయకుడు వెళ్లకుండా నిలువరించేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి ఏ ఒక్కరూ బయటకు పోకుండా గట్టి నిఘా పెట్టి వారి కదలికలపై దృష్టి సారించారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేరుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడూళ్ల పూర్తయినా ఆ హామీ అమలు చేయకపోవటంతో ‘చావో రేవో చలో అమరావతి’ పాదయాత్రకు పిలుపునిచ్చారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి పాదయాత్రకు పూనుకున్నారు. ఆ పాదయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందుకు పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పాదయాత్రను విఫలం చేయటానికి ఖాకీని రంగంలోకి దించింది. జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం ఆయన కనుసన్నల్లో కాపు నాయకులను, కార్యకర్తలను కట్టడి చేయటానికి చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. తొలుత నోటీసులు జారీ చేసిన పోలీసులు కాపులకు కౌన్సెలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఊరు వదిలి వెళ్లకూడదని, ముద్రగడ పాదయాత్రకు ఏ ఒక్కరూ మద్దతుగా బయలుదేరి వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. 11 చెక్ పోస్ట్‌లు... ముద్రగడ పాదయాత్రకు వెళ్లే వారిని అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాగం జిల్లా వ్యాప్తంగా 11 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. విజయవాడ–చెన్నైం 16వ నంబర్ జాతీయ రహదారిపై సింగరాయకొండ మండలం కనుమళ్ళ వద్ద ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్‌సెంటర్ వద్ద, మార్టురులోని రాజుపాలెం వద్ద మరో చెక్ పోస్ట్, పర్చూరు వై జంక్షన్లో, చీరాల రోట్లో ఈపూరుపాలెం వద్ద, అద్దంకి భవాని సెంటర్లో, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం జంక్షన్లో, ముండ్లమూరు పోలీస్ స్టేషన్ ఎదురు, పెద్దారవీడు కుంట జంక్షన్, బేస్తవారిపేట జంక్షన్లో, త్రిపురాంతకం పెట్రోల్‌బంక్ వద్ద చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి కాపులను జిల్లా దాటి వెళ్లనీయకుండా కట్టడి చేసేందుకు సన్నాహాలు చేశారు. 1,023 మంది కాపులకు కౌన్సెలింగ్.... పాదయాత్రకు వెళితే ఊరుకునేది లేదని కాపు నాయకులకు,కార్యకర్తలకు 1,023మందికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. 453 మందికి నోటీసులు జారీ చేశారు. 59 మంది ముఖ్య నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 373 మందిని సంబంధిత తహశీల్దార్ల ముందు హాజరు పరిచి వారి వద్ద నుంచి రూ.50 నుంచి రూ.లక్ష వరకు పూచి కత్తు తీసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో 98 ఏసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. 344 వాహన చోదకులకు, వాహన యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. -
పోలీసులకు దిమ్మతిరిగేలా ముద్రగడ ఏర్పాట్లు!
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఆయన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించగా.. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర కొనసాగించి తీరాలని ముద్రగడ భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. బుధవారం నుంచి పాదయాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న ముద్రగద పద్మనాభం పోలీసులకు దిమ్మతిరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కిర్లంపూడిలోని తన నివాసం చుట్టూ హైడెఫినేషన్ వర్చువల్ రియాలిటీ సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఈ ఏర్పాట్లు చేశారు. పోలీసులు హింసాత్మక చర్యలకు దిగితే రికార్డు చేసేందుకు ముందుజాగ్రత్తగా వీటిని నెలకొల్పారు. మరోవైపు ముద్రగడ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. అడుగడుగునా పహారా కాస్తున్నారు. దీంతో ముద్రగడ పాదయాత్రపై చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించడంతో కాపు నేతలు మండిపడుతున్నారు. -
పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్...
-
పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్...
విజయవాడ: చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి చేసుకోలేదని తెలిపారు. పాదయాత్రలో ఎవరు పాల్గొనకూడదని ఆయన సూచించారు. డీజీపీ మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేది లేదని, అలాగే వెనకడుగు వేసేది లేదన్నారు. కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని, ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. చట్టం గౌరవం లేకుంటే అందరికీ నష్టం జరుగుతుందన్నారు. ఇక ఏపీలో డ్రగ్స్ కంటే గంజాయి సమస్య ఎక్కువగా ఉందని, గంజాయి సరఫరా చాలావిధాలుగా జరుగుతుంనద్నారు. అలాగే బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టామని డీజీపీ పేర్కొన్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా కాపుల రిజర్వేషన్లపై ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి చలో అమరావతి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. -
కాపులపై ఆంక్షల కత్తి
►పోలీసుల ద్వారా బెదిరింపులు ►కాపు, బలిజ నేతలకు నోటీసులు ►ఇష్టాగోష్టుల పేరిట బుజ్జగించే యత్నాలు ►జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ నెల్లూరు సెంట్రల్/నెల్లూరు రూరల్ : రిజర్వేషన్ల సాధన కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లాలోని కాపు, బలిజ నేతలపై ఓ వైపు పోలీసులను ప్రయోగిస్తూ నోటీసులు, కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఇష్టాగోష్టుల పేరిట తెరవెనుక నుంచి మంత్రాంగాలు నడిపిస్తోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సోమవారం ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ‘చావో రేవో.. చలో అమరావతి’ పేరిట ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగానే ముద్రగడ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఎలాగైనాసరే పాదయాత్ర జరిపి తీరాలన్న కాపు నేతల వ్యూహాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులు వేడెక్కాయి. హీటెక్కుతోంది. గద్దెనెక్కిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. మూడేళ్లు దాటినా ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబుపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని, చేసిన మోసాన్ని తలచుకుంటున్న కాపు సామాజిక యువత, మహిళలు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తామన్న కాపులపై పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్న తీరుపై వారంతా మండిపడుతున్నారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులంటూ బెదిరింపులు ‘చావో రేవో.. చలో అమరావ తి’ కార్యక్రమానికి మద్దతుగా వెళ్లేందుకు సిద్ధమైన జిల్లాలో ని కాపు, బలిజ నేతలకు బెదిరింపులు తప్పటం లేదు. జిల్లా నుంచి ఏ ఒక్కరు వెళ్లినా నాన్–బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు కాపు నేతలకు నోటీసులు జారీ చేశారు. పాదయాత్రకు వెళ్లటానికి ప్రయత్నించినా.. జిల్లాలో ఎక్కడైనా ఆందోళనలు, నిరసనలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బలిజ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ తేలపల్లి రాఘవయ్య ఆధ్వర్యంలో 500 మంది పాదయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటిలిజెన్స్ విభాగం ద్వారా ఈ సమాచారం అందుకున్న పోలీసులు రాఘవయ్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులకూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొందరు నేతలపై బైండోవర్ కేసులు పెట్టిన పోలీసులు పాదయాత్రలో పాల్గొనడం చట్టరీత్యా నేరమంటూ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో హైటెన్షన్ ఎట్టిపరిస్థితుల్లో పాదయాత్రకు హాజరు కావాలని కాపు నేతలు నిశ్చయించుకోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్లతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించాయి. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాపు నేతలు, యువత ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు కాపులెవరూ ఈ ఉద్యమంలో పాల్గొనకుండా చూడాలంటూ అందిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సోమవారం జిల్లాలో పర్యటించారు. నగరంలోని ఓ లాడ్జిలో కాపు కార్పొరేషన్ సంక్షేమ, అభివృద్ధి పథకాల సాఫల్యత ఇష్టాగోష్టి పేరుతో కాపు నేతలతో ఆయన సమావేశమై సమాలోచనలు జరిపారు. ముద్రగడ ఉద్యమానికి మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఒకవేళ మద్దతు పలికితే కోర్టు కేసులు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. టీడీపీకి అండగా ఉంటే కాంట్రాక్ట్ పనులను ఇప్పిస్తామని ఆశ చూపారు. దీంతో జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహరావు తదితర నేతలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నిలదీసిన నేతలు కొంతమంది నాయకులు మాట్లాడుతూ జన్మభూమి కమిటీల పెత్తనం వల్ల రుణాల కోసం వేరే కులం వారి కాపులు వద్ద చేతులు కట్టుకోవాల్సి వస్తోందని వాపోయారు. కాపుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పి సగం నిధులైనా ఇవ్వలేదని.. మిగిలిన వారికి ఎప్పుడు రుణాలిస్తారని రామానుజయను నిలదీశారు. ముద్రగడతోపాటు ఉద్యమంలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, కేసులు నమోదు చేయడం భావ్యం కాదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. వారిని టీడీపీ సీనియర్ నేత దేశాయిశెట్టి హనుమంతరావు బుజ్జగించే ప్రయత్నం చేశారు. రామానుజయ మాట్లాడుతూ ఉద్యమానికి దూరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే.. సామాజిక వర్గానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. -
మీడియాను వదలని పోలీసులు
కిర్లంపూడి: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన 'చావోరేవో.. చలో అమరావతి' పాదయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెబుతున్నా...నిర్వహించి తీరుతామని కాపు జేఏసీ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ముద్రగడ సొంత జిల్లా తూర్పు గోదావరితోపాటు గుంటూరు జిల్లాలో పోలీసులు ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, తనిఖీలు, అరెస్టులు, నోటీసులు, హెచ్చరికలతో వాతావరణం వేడెక్కుతోంది. మీడియాను కూడా పోలీసులు వదిలి పెట్టడం లేదు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడికి వెళ్లే ప్రతి వాహనం నంబర్‌ను పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ముద్రగడ నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని నెరవేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాపు జేఏసీ నేతలు మాట్లాడుతూ అరెస్ట్‌లు, నిర్బంధాలు, కేసులతో చంద్రబాబు కాపు జాతిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. హామీ అమలు చేయమని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా?, ప్రభుత్వంలో ఉన్న కాపు పెద్దలకు అరెస్ట్‌లు కనబడటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్ని ఆంక్షలు విధించినా 26న ముద్రగడ పాదయాత్ర చేసి తీరుతారన్నారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, కొందరు మంత్రుల మాటలు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డుల్లా ఉన్నాయన్నారు. ఈసారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని కాపు జేఏసీ నేతలు తెలిపారు. అలాగే ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో గత నాలుగు రోజులుగా 50కి పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో ఐదు వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
‘చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలి’
విజయవాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మచ్చలేని నాయకుడని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ముద్రగడ కుటుంబాన్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలని కోరారు. కాపులపై అన్యాయంగా పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాపులు ఉభయగోదావరి జిల్లాల్లో సమావేశాలు పెట్టుకొనే అవకాశం లేకుండా చేస్తున్నారని, ఏపీలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు సాయంతో చంద్రబాబు పాలన చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాపులు అడుగుతున్నారని గుర్తు చేశారు. -
‘కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం’
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించి 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. నివేదిక తుది దశలో ఉందని, అయితే తాము సమర్పించే నివేదికపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదని, 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్ జిల్లాల్లో పర్యటించిందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవన విధానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు యత్నిస్తామని తెలిపారు. -
‘కులాల కుంపటిలో బాబు మాడి మసైపోతారు’
విజయవాడ: బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌ను శుక్రవారం కాపు, బీసీ సంఘాల నేతలు కలిశారు. కాపులను బీసీల్లో చేర్చాలని కాపు నేతలు, మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దని బీసీ నేతలు పోటాపోటీగా వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం కాపు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారని కాపు సంఘాల నేతలు నరహరిశెట్టి నరసింహరావు, ఆకుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు... కాపులను బీసీల్లో చేర్చవద్దని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌ను బీసీ సంఘాలు కోరాయి. వారిని బీసీల్లో చేర్చితే బీసీలు అన్ని విధాలుగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపులు ఆర్థికంగా ఎంతో ఉన్నతిలో ఉన్నారంటూ బీసీల స్థితిగతులపై మంజునాథ కమిషన్‌కు బీసీ సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు వై.కోటేశ్వరరావు, సాంబశివరావు మాట్లాడుతూ కాపు, బీసీల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్లు కోసమే కాపులను బీసీల్లో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. కులాల కుంపటిలో చంద్రబాబు మాడి మసైపోతారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్తామని తెలిపారు. -
‘తుని విధ్వంసానికి చంద్రబాబే కారణం’
విశాఖ : కేసుల పేరుతో ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఎన్నికుట్రలు చేసినా తన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తుని విధ్వంసానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. దమ్ముంటే వాయిదాలు లేకుండా తుని విధ్వంసం కేసును విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాను కేసులకు భయపడేది లేదని, తమ జాతి కోసం పోరాడుతానని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల కోసం అవసరం అయితే ప్రాణాలు అర్పిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తమ డిమాండ్‌లో న్యాయం ఉందని, నెరవేర్చతగ్గదే అని అన్నారు. తన నేర చరిత్ర ఏంటో చంద్రబాబు నిరూపించాలని ముద్రగడ సవాల్ విసిరారు. శాంతియుతంగా పోరాడుతున్న తమపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్ర తలపెట్టారు. అయితే యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది. పాదయాత్రకు అనుమితి ఇచ్చినా లేకున్నా, తమ యాత్ర కొనసాగుతుందని ముద్రగడ వెల్లడించారు. కాగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన విధ్వంసానికి దారితీసింది. సభకు వచ్చిన వేలాది మంది తునిలో రైల్‌రోకో, రాస్తారొకోలు నిర్వహించారు. పరిస్థితి అదుపుతప్పి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు, పోలీస్ వాహనాలు దగ్ధం వంటి తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. -
పాదయాత్రకు సంకెళ్లా!
-
యాత్రకు సంకెళ్లా!
► ముద్రగడ పాదయాత్రను అడ్డుకునేందుకు పాత కేసులు తెరపైకి తెస్తున్న ఏపీ సర్కారు నేడు కాకినాడ కోర్టులో ► ‘తుని ఘటన’పై 30 చార్జిషీట్లు సాక్షి, అమరావతి: మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ చంద్రబాబు సర్కారు ఉచ్చు బిగిస్తోంది. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ ముందస్తు కుట్రలు పన్నుతోందని ముద్రగడ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తుని ఘటనలో సీఐడీ నమోదు చేసిన కేసులతో సహా 30 చార్జిషీట్లు సిద్ధం చేసిందని తెలియవచ్చింది. ఈ కేసుల్లో ముద్రగడను ఏ–1గా చూపించి ఉద్యమంపై ఉక్కుపాదం మోపే కుట్రకు తెరతీసిందని కాపు సామాజికవర్గ నేతలు ఆరోపిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన విధ్వంసానికి దారితీసింది. సభకు వచ్చిన వేలాది మంది తునిలో రైల్‌రోకో, రాస్తారొకోలు నిర్వహించారు. పరిస్థితి అదుపుతప్పి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు, పోలీస్ వాహనాలు దగ్ధం వంటి తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కొందరు విధ్వంసకారులు వచ్చి ఈ పనులు చేశారని, కాపుజాతి ఇలాంటి ఘటనలకు పాల్పడదని అప్పట్లోనే ముద్రగడ స్పష్టం చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనలకు రాజకీయ రంగు పులిమి కాపులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను కూడా టార్గెట్ చేసింది. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు వందలాది మంది అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నించారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో 13 మందిని మాత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పలు కేసుల్లో ఏ–1గా ముద్రగడ తుని ఘటనకు సంబంధించి మొత్తం 69 కేసులకుగాను 30 చార్జిషీట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. మొదట అన్ని కేసులకు సంబంధించి ఒకే చార్జిషీటు వేయాలని పోలీసులు భావించినప్పటికీ చివరకు వేర్వేరుగా చార్జిషీటులు వేసి ముద్రగడపై ఒత్తిడి పెంచాలనే ఎత్తుగడ పన్నినట్టు తెలిసింది. వీటిలో ముద్రగడను ఏ–1గా పేర్కొన్నారు. వాటిని శుక్రవారం కాకినాడ కోర్టులో వేయనున్నారు. ఇదిలా ఉండగా కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్రగడ పాదయాత్ర చేస్తే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజికవర్గం పట్టుపెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పాదయాత్రకు అనుమతిలేదంటూ హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావులు ప్రకటనలు చేశారు. అయినా.. ముద్రగడ పాదయాత్రకు సిద్ధంకావడంతో ‘తుని’ కేసులను తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. హామీ అమలు చేయాలన్నందుకే.. బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని కాపులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోగా అందుకోసం శాంతియుతంగా ఉద్యమిస్తోన్న కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు సర్కార్ అణచివేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ సందర్భంగా అక్రమంగా పెట్టిన కేసుల్లో ముద్రగడను ఏ–1 నిందితుడిగా చూపించి కాపుల్లో ప్రభుత్వం ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు మండిపడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమానికి సిద్ధమవుతోన్న ప్రతి సారి సర్కార్ భారీగా పోలీసు బలగాలను వినియోగించి అడ్డగోలుగా ఉద్యమాన్ని నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు కల్పించకపోగా మంజునా«థ కమిషన్ వేసి రాష్ట్రమంతటా విచారణ నిర్వహించినా ఇంతవరకు ఆ నివేదికే వెలుగుచూడలేదు. -
‘పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారు’
అమరావతి: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవేళ ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి కోరితే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని చినరాజప్ప అన్నారు. మరోవైపు డీజీపీ సాంబశివరావు ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేని కార్యక్రమాలకు అందరూ దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 20 వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో సెక్షన్ 143,30 అమల్లో ఉంటుందన్నారు. అలాగే పాలకోడేరు మండలం గరగపర్రులో శాంతయుత వాతావరణం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. -
'జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను.. పాదయాత్ర ఆపను'
ఈ నెల 26 నుంచి పాదయాత్ర కొనసాగుతుంది చంద్రబాబుపై మండిపడిన ముద్రగడ పద్మనాభం కాకినాడ: కాపుల రిజర్వేషన్ కోసం ఈ నెల 26న తాను తలపెట్టిన పాదయాత్ర యథాతథంగా కొనసాగుతుందని కాపుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. పాదయాత్ర విషయంలో జైల్లో పెట్టినా వెనుకకు తగ్గబోనని, నిరవధికంగా పాదయాత్ర కొనసాగి తీరుతుందని ఆయన చెప్పారు. కాపులకు రిజర్వేషన్ అడుగటం తాను చేసిన నేరమా? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. 'చంద్రబాబు బాటలోనే నేను పాదయాత్ర చేస్తా. గతంలో చంద్రబాబు పాదయాత్రకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో.. ఆ ఫార్మాట్‌ను నాకు పంపించండి' అని ముద్రగడ విలేకరులతో అన్నారు. కాపుల రిజర్వేషన్లపై జీవో 30ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు.. తన ఉద్యమాన్ని అణిచేందుకు సెక్షన్ 30ఏను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంటి చుట్టూ, జిల్లా అంతటా పోలీసులను మోహరించారని తెలిపారు. 'చంద్రబాబు, మీ పాలనను చూసి సిగ్గుపడుతున్నాం. మీ పరిపాలనను చూసి మీరే సిగ్గుతో తలదించుకోవాలి' అని వ్యాఖ్యానించారు. తుని ఘటనకు సంబంధించి 69 కేసుల్లో 330 మందిని ముద్దాయిలను చేశారని విమర్శించారు. ఈ కేసులనే తమకు రిజర్వేషన్‌గా భావించమంటే సంతోషంగా భావిస్తామని అన్నారు. తుని సభకు వచ్చిన 15లక్షలమంది కాపులపై కేసులు నమోదుచేసి ఉరిశిక్ష వేసినా తాము భయపడబోమన్నారు. తన జాతి కోసం పోరాడుతుంటే ఎందుకు అడ్డుతలుగుతున్నారని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ రాక్షసపాలనలో ఇది భాగమా? అని అడిగారు. ముద్రగడ కంటతడి కాపుల రిజర్వేషన్ విషయంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నట్టు తెలిపారు. గతంలో తన భార్య, కోడలు, కొడుకుతో పోలీసులు వ్యవహరించిన తీరు తనను ఇప్పటికీ బాధిస్తోందన్నారు. అందుకే వారంలో రెండు రోజులు నేను ఏడుస్తున్నానని చెప్పారు. ఒక్కోసారి ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తోందని తెలిపారు. తన కుటుంబాన్ని అవమానించిన వారికి శిక్షలు పడేవరకు తానుండాలనే ఆలోచనతోనే బతుకుతున్నట్టు చెప్పారు. -
చలో అమరావతితో చావో రేవో
జూలై 26 నుంచి పాదయాత్ర..: ముద్రగడ జగ్గంపేట/కిర్లంపూడి: ఎన్నికల సమయంలో కాపు జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబుకు గుర్తు చేసేందుకు జూలై 26 నుంచి చావోరేవో చలో అమరావతి కార్యక్రమం చేపట్టినట్టు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. సోమవారం కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన చంద్ర బాబుకు రాసిన లేఖను, చలో అమరావతి రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు. కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతుం టే ఉద్యమ నాయకులను విడదీసే కార్య క్రమం చేపట్టడం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తగదన్నారు. తమ జాతి చంద్రబాబు వద్దకు వెళ్లి రిజర్వేషన్లు ఇమ్మని కోరలేదని, ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం ఆయనే హామీ ఇచ్చి ఓట్లేయించుకు న్నారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం మోసం కాదా అని ప్రశ్నించారు. హామీని అమలు చేయకుంటే జూలై 26వ తేదీ నుంచి పాదయాత్ర చేసి తీరతానని స్పష్టం చేశారు. ముద్రగడ పాదయాత్ర జూలై 26 కిర్లంపూడిలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమవు తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా మీదుగా అమరావతి వరకు 116 గ్రామాల మీదుగా సాగనుంది. కాగా, ముద్రగడ పాదయాత్ర చేసేందుకు అనుమ తి అడగరు. ఆయన అడకపోతే ప్రభుత్వం ముందుకు సాగనివ్వదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. -
చంద్రబాబుకు ముద్రగడ మరో లేఖ
కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖాస్త్రం సంధించారు. కాపు రిజర్వేషన్లపై ఈసారి చావో, రేవో తేల్చుకుంటామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిపి తీరుతామని ముద్రగడ అన్నారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ ఉండి ఉంటే చంద్రబాబు జైల్లో ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడితే అరెస్ట్ చేశారని, ఐవైఆర్ కృష్ణారావు, వైఎస్ జగన్ పై పోస్టింగ్‌లు పెడితే అరెస్ట్‌లు చేయరా అని ముద్రగడ సూటిగా ప్రశ్నించారు. వచ్చే నెల 26 నుంచి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ‘ఛలో అమరావతి’ పేరుతో సోమవారమిక్కడ రూట్ మ్యాప్ విడుదల చేశారు. కిర్లంపూడి నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా మీదగా పాదయాత్ర కొనసాగనుంది. ముద్రగడ లేఖ సారాంశం...‘ప్రజలతో, బీసీ నేతలతో చర్చించి 100 శాతం ఏకాభిప్రాయం తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని తమరు ఇటీవలే సెలవిచ్చారు. దేశమంతా పర్యటించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. ఈ చిలుక పలుకులు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినప్పుడు, పార్టీ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం పెట్టినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు?. బీసీల కోటాలో మా జాతికి వాటా ఇవ్వాలని అడగటం లేదు. ప్రత్యేక కేటగిరి కిందే రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ ఇస్తామని పదేపదే మాట్లాడుతున్నారు. మా మద్య తగవులు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం మీకు అలవాటైంది. మూడేళ్లుగా రిజర్వేషన్లను డీఫ్రిజ్‌లో పెట్టి 2019లో మళ్లీ మా వాళ్లతో ఓట్లు వేయించుకోవాలనే మీ కుట్రను తెలుసుకోలేనంత స్థితిలో మా జాతి లేదు. కాపు రిజర్వేషన్లపై ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఏకాభిప్రాయానికి రండి. అప్పుడు మీ ఖ్యాతి ఖండాంతరంగా విరాజిల్లుతుంది’ అని పేర్కొన్నారు. -
కాపు ఉద్యమంలో కీలకపాత్ర
సినిమాలకు దర్శకత్వం వహించడం, నిర్మించడం, రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించడంతో పాటు.. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో సైతం ఆయన అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తున్న తరుణంలో ఆయనను అరెస్టు చేసి బలవంతంగా రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినప్పుడు కూడా ఆయన దీటుగా స్పందించారు. ఆ తర్వాత కాపు ఉద్యమంలో పార్టీలకు అతీతంగా నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు.. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చిన ఘనత కూడా దాసరి నారాయణరావు సొంతం. గత సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన దాసరి నివాసంలో పలువురు కాపు ప్రముఖులతో పాటు ముద్రగడ పద్మనాభం కూడా సమావేశమయ్యారు. -
కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు కొత్త మెలిక
-
కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు కొత్త మెలిక
విశాఖపట్నం: కాపు రిజర్వేషన్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పిల్లిమొగ్గ వేశారు. ‘కాకులకు మందుపెట్టి కట్టమీద కూర్చున్న’ చందంగా రిజర్వేషన్ అంశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. మంజునాథన్ కమిటీ రిపోర్టు రాగానే కాపులను బీసీలో చేర్చుతామని గతంలో ప్రకటించిన ఆయన తాజాగా స్వరం మార్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు.. ‘త్వరలోనే మంజునాథన్ కమిటీ రిపోర్టు వస్తుంది. దానిపై తొలుత తెలుగుదేశం పార్టీలో చర్చ చేపడతాం. అటుపై ప్రజల్లోకి వెళతాం. ప్రతిస్పందనను బట్టి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం..’ అని ప్రకటించారు. సిద్ధాంతాలు లేవన్న బాబు తనను తాను రాజకీయ ధురంధరుడిగా చెప్పుకునే చంద్రబాబు రాజకీయ సిద్ధాంతాలపై ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో ఒకప్పుడు సిద్ధాంతాలు ఉండేవి. ఇప్పుడు లేవు. కాబట్టి సమయానుకూలంగా వాస్తవ రాజకీయాలనే నెరపాలి’ అని బాబు అన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఏ ఒక్కరు తప్పుచేసినా క్షమించబోనని పేర్కొన్నారు. -
చంద్రబాబు నెరవేర్చేవరకు నిద్రపోను: ముద్రగడ
కాకినాడ: కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. త్వరలోనే తాను అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేపడతానని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై గత కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్న కాపు నాయకులు ఆదివారం కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన మరోసారి భేటీ అయ్యారు. దీనికి ముద్రగడతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు, 13 జిల్లాల కాపు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లపై మరోసారి తీవ్రంగా చర్చించారు. అనంతరం ఈ నెలలో జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి చంద్రబాబు కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తాను నిద్రపోనని అన్నారు. కాపుల రిజర్వేషన్లకోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. -
సాయం పొందిన బీసీలు అండగా ఉండాలి..
అమరావతి : రాష్ట్రంలో బలహీనవర్గాల వారికి ప్రభుత్వం తరపున సాయం చేస్తానని, వారంతా పార్టీకి బలంగా ఉండాలని హక్కుతో అడుగుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని మంగళవారం కలిసి సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే స్వాగతించాలని మంత్రి వెల్లడించారు. గతేడాది బ్యాంకులు సహకరించకపోవడం వల్లే బీసీలకు తగినంతగా సబ్సీడీ రుణాలు అందించలేకపోయామన్నారు. ఈ ఏడాది ఆదరణ పథకం అమలులోకి తెచ్చి బీసీలకు అవసరమైన పరికరాలు అందిస్తామని చెప్పారు. కులవృత్తులు, చేతి వృత్తులకు ఉపకరించే అదునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు బీసీలకు ఇస్తామన్నారు. బీసీలకు 12 ఫెడరేషన్లు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఆయా కులాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వేసవి సెలవుల్లో బీసీ హాస్టళ్లు రిపేర్లు పూర్తి చేయిస్తామని, మెనూ చార్జీలు పెంచేందుకు సీఎం అంగీకరించారని మంత్రి చెప్పారు. -
మళ్లీ ఉద్యమం దిశగా ముద్రగడ
-
కాపులుగా ఎందుకు పుట్టామా అనిపిస్తోంది..
జగ్గంపేట(తూర్పుగోదావరి జిల్లా): చంద్రబాబునాయుడు పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని తక్షణమే అమలు చేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్లపై రెండు కమిషన్లు వేసి రిపోర్టు రప్పించుకుని కేబినెట్లో ఆమోదించి ఏ కులం నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అపార అనుభవం ఉందని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర అలాంటి నిర్ణయం పొందకపోవడం మా జాతి చేసుకున్న పాపమని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో కాపులుగా ఎందుకు పుట్టామా అని బాధగా ఉందన్నారు. రాష్ట్రంలో మంజునాథ కమిషన్ పర్యటన ముగిసినా రిపోర్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అమలు చేయమంటే లాఠీలతో కొట్టిస్తారా, పోలీసు బూట్లతో తన్నిస్తారా, కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 7న కాకినాడలో 13 జిల్లాల కాపు పెద్దలతో సమావేశమై ఉద్యమం ఉధృతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాలుపంచుకోండి..: అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో కాపుజాతి యావత్తూ పాలుపంచుకుని ఆయనకు నివాళులర్పించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపులకు ఉన్న రిజర్వేషన్లను అప్పటి బ్రిటిషు ప్రభుత్వంతో మాట్లాడి కాపులకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పారన్నారు. ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన జన్మదిన వేడుకల్లో అవకాశం ఉన్నచోట కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులు పాల్గొని నివాళులర్పించాలని కోరారు. అలాగే స్వాతంత్య్రం వచ్చాక తీసేసిన రిజర్వేషన్లను పునరుద్ధరించిన మరో దళిత మహానుభావుడు దామోదరం సంజీవయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.