
అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా మని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా కాపులు ముందున్నారని ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించా మన్నారు. టీడీపీకి వెన్నెముకలా నిలుస్తున్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ(ఎఫ్)లో చేర్చుతామన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇప్పటికే 50 శాతానికి చేరిన నేపథ్యంలో రాజ్యాంగాన్ని సవరించి తొమ్మిదో షెడ్యూలులో కాపు రిజర్వేషన్లు చేరుస్తూ రూపొందించిన బిల్లును ఆమో దించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాపు రిజర్వేషన్ల బిల్లు–2017 పై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
బ్రిటీషు ప్రభుత్వం ఉన్నప్పుడే...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు అమలు చేసిందని చంద్రబాబు చెప్పా రు. అనంతరం రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాలకు రిజర్వేషన్లు తొలగించి అన్యాయం చేశారనే బాధ ఆ వర్గాల్లో ఉందన్నారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తనను ఎవరూ అడగలేద న్నారు.పాదయాత్ర సమయంలో కాపుల కష్టాలను చూసి రిజర్వేషన్లు కల్పిస్తామని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో హామీ ఇచ్చామన్నారు. జస్టిస్ మంజునాథ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి కాపులు వెనుకబడినట్లు తేల్చిందన్నారు. కాపుల్లో 66.25%, తెలగల్లో 60.49%, బలిజల్లో 58.63%, ఒంటరిల్లో 70% దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారన్నారు.
కుల సంఘాల లెక్కలు బోగస్: రాష్ట్రంలో ప్రజా సాధికార సర్వే, ఆధార్ ఖాతాల ఆధారంగా 4.35 కోట్ల జనాభా ఉందని చంద్రబాబు చెప్పారు. కొంద రు కుల సంఘాల నేతలు చెబుతున్న లెక్కలు చూస్తే రాష్ట్ర జనాభా డబుల్ ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాపులు 38,09,362 (8.72%), తెలగలు 4,81,321 (1.11%), బలిజలు 7,51,031 (1.73%), ఒంటరిలు 13,058 (0.03%) మంది ఉన్నారని జనాభాలో ఆ వర్గాల శాతం 11.65 శాతమ ని చెప్పారు. వీటిని బట్టి చూస్తే కుల సంఘాలు చెబుతున్న లెక్కలన్నీ బోగస్ అని విమర్శించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు శాస నసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఏకగీవ్రంగా ఆమోదిం చాలని సీఎం చంద్రబాబు కోరారు. అనంతరం కాపు రిజర్వేషన్ల బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment