
విశాఖ సిటీ: కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వానికి డిసెం బర్ 6న డెడ్‌లైన్ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈలోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంకు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన బాబు.. ఇప్పుడు కపట నాటకమాడుతున్నారని మండిప డ్డారు.
ఏళ్లు గడుస్తున్నా మంజునాథ గతంలో ఉండే రిజర్వేషన్లే కల్పించమని తాము కోరుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 49 శాతం రిజర్వేషన్లలో కాపులకు వాటా అవసరం లేదని మిగిలిన 51 శాతంలో రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.