
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలంటూ హితువు పలికారు. అసలు కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తామని చెప్పి మోసం చేసింది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ప్రశ్నించినందుకు ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు వేధించారని తెలిపారు.
'ఆయన కుటుంబ సభ్యులను కూడా ఎలా వేధించారో చూశాం. మరి ఆనాడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు హయాంలో కాపులు ఉద్యమం చేస్తే పవన్ మద్దతు తెలపరు. అదే జగన్ ప్రభుత్వంలో ఉద్యమం చేస్తే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు. ఈ వైఖరిని కాపు సోదరులు అర్థం చేసుకోవాలి' అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
చదవండి: (ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జీవీఎల్)
Comments
Please login to add a commentAdd a comment