చంద్రబాబు నెరవేర్చేవరకు నిద్రపోను: ముద్రగడ | mudragada once again tkes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నెరవేర్చేవరకు నిద్రపోను: ముద్రగడ

Published Sun, May 7 2017 6:13 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM

చంద్రబాబు నెరవేర్చేవరకు నిద్రపోను: ముద్రగడ - Sakshi

చంద్రబాబు నెరవేర్చేవరకు నిద్రపోను: ముద్రగడ

కాకినాడ: కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. త్వరలోనే తాను అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేపడతానని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై గత కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్న కాపు నాయకులు ఆదివారం కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన మరోసారి భేటీ అయ్యారు.

దీనికి ముద్రగడతోపాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు, 13 జిల్లాల కాపు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లపై మరోసారి తీవ్రంగా చర్చించారు. అనంతరం ఈ నెలలో జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి చంద్రబాబు కేంద్రానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తాను నిద్రపోనని అన్నారు. కాపుల రిజర్వేషన్లకోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement