సాక్షి,గుంటూరు : ‘వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి ‘నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని చెప్పుకుంటున్నాడు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపాలి’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.
ముద్రగడ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేశారు. ముద్రగడ ఇంటి గేటును ట్రాక్టర్‌లో ఢీకొట్టి.. పోర్టికోలో ఉన్న కారును ఢీకొట్టారు. ముద్రగడ, ఆయన కుమారుడి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు.
‘‘ఆ వ్యక్తి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేకి సరికాదు. తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు. నివాసాలపైకి వెళ్లి దాడులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం’ అని అంబటి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment