సాక్షి,గుంటూరు: ఎల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం(జనవరి6) అంబటి మీడియాతో మాట్లాడారు. ‘పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం.మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేం మీలా కక్ష సాధింపులకు పాల్పడం.
గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు. చనిపోయిన వారికి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్‌చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు.
సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరివల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు.రోడ్డుబాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని అంబటి రాంబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment