నగరంలోని పార్క్ హయాత్లో సోమవారం కాపు ప్రముఖులు సమావేశమైయ్యారు.
హైదరాబాద్: నగరంలోని పార్క్ హయాత్లో సోమవారం కాపు ప్రముఖులు సమావేశమైయ్యారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష, కాపు రిజర్వేషన్లు, భవిష్యత్ కార్యాచరణపై కాపు ప్రముఖులంతా చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో రాజకీయ కాపు నేతలు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, పల్లంరాజు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కన్నబాబు, తోట చంద్రశేఖర్, చలమశెట్టి సునీల్, అద్దేపల్లి శ్రీధర్, సినీప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవి, వివిధ రంగాల కాపు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, రాజమండ్రిలో ముద్రగడ దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో కాపు ప్రముఖులంతా సమావేశం కావడం చర్చనీయాంశమైంది.