కాపు ఉద్యమంలో కీలకపాత్ర
సినిమాలకు దర్శకత్వం వహించడం, నిర్మించడం, రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించడంతో పాటు.. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో సైతం ఆయన అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తున్న తరుణంలో ఆయనను అరెస్టు చేసి బలవంతంగా రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినప్పుడు కూడా ఆయన దీటుగా స్పందించారు.
ఆ తర్వాత కాపు ఉద్యమంలో పార్టీలకు అతీతంగా నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు.. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చిన ఘనత కూడా దాసరి నారాయణరావు సొంతం. గత సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన దాసరి నివాసంలో పలువురు కాపు ప్రముఖులతో పాటు ముద్రగడ పద్మనాభం కూడా సమావేశమయ్యారు.