dasari passes away
-
మా కులపెద్ద కన్నుమూత తీరని లోటు
కథాబలంతోనే సినిమాలు నడవాలి తప్ప నటీనటుల బలంతో కాదని నిరూపించిన మహా దర్శకుడు దాసరి నారాయణరావు అని పలువురు సినీ ప్రముఖులు ప్రస్తుతించారు. తమ దర్శకులందరికీ పెద్ద, దర్శకుల స్థాయి పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి మరణం తమ దర్శకులకు మాత్రమే కాక.. తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద దెబ్బ అని ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా గమనానికి సరికొత్త దారి చూపిన దాసరి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని, ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నానని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. దాసరి నారాయణరావు తెలుగు సినీరంగంలో దిగ్గజ దర్శకునిగా, నటునిగా, రచయితగా ఎన్నో హిట్ చిత్రాలను అందించారని, తెలుగు సినీ పరిశ్రమకు దాసరి ఎనలేని సేవలు అందించారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. దాసరి మృతికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిదని, దివంగత బాలచందర్ కూడా ఆయను ఆరాధించేవారని చెప్పారు. తాను దాసరి నారాయణరావుతో, సంజీవ్‌కుమార్‌తో గడిపిన రోజులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటానని ట్వీట్ చేశారు. My sympathy and condolences to the family of Daasari NaryaNa rao.His loss is truly a big loss for Telugu cinema. Late K.B. sir admired him — Kamal Haasan (@ikamalhaasan) 30 May 2017 I remember the days spent with Narayan rao gaaru and Mr. Sanjeev kumar ji. Yaadgaar. He was a great fan of Mr.KB. I belong to a great family — Kamal Haasan (@ikamalhaasan) 30 May 2017 -
సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతి
-
సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతి
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపట్ల సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు, సినిమా విమర్శకులు, సినీ రచయితలు కూడా ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ప్రతి విషయంలో ఆయన ప్రత్యేకత కనబరిచేవారని, ఆయన చనిపోవడం సినీ పరిశ్రమతో పాటు యావత్ రాష్ట్రానికి తీరని లోటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హీరో సుధీర్ బాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇంకా పలువురు ప్రముఖులు దాసరి మృతిపట్ల తమ సంతాపం తెలిపారు. Legendary Dir #DasariNarayanarao is no more.. May his soul RIP! pic.twitter.com/tYTGhS5jWL — Ramesh Bala (@rameshlaus) 30 May 2017 Sad to hear the demise of #DasariNarayanaRao garu... RIP sir. — Sudheer Babu (@isudheerbabu) 30 May 2017 Big blow to Telugu filmdom. Veteran filmmaker Dasari Narayana Rao, who has over 120 films to his credit, is no more. Tragic. — Haricharan Pudipeddi (@pudiharicharan) 30 May 2017 RIP #Dasarinarayanarao garu!! U shall always be remembered ! #legend — Rakul Preet (@Rakulpreet) 30 May 2017 Our industry has lost a guiding light. RIP Dasari Narayana Rao garu. pic.twitter.com/kNIbfinrwA — Allari Naresh (@allarinaresh) 30 May 2017 Rest in Peace Dr Dasari Narayana Rao Garu. A huge loss to the Telugu Film Industry. Praying for strength to the family — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 30 May 2017 Deeply shocked by the sudden demise of Dr. Dasari Narayana Rao. The Telugu community & film industry have lost a pillar today. — N Chandrababu Naidu (@ncbn) 30 May 2017 #DasariNarayanaRao garu's death is a huge loss to the Telugu Film Industry. My deepest condolences to his family. — Lokesh Nara (@naralokesh) 30 May 2017 తెలుగు చిత్ర కళామ్మతల్లి కన్న ఒక దిగ్గజం ఇక లేదు . మరువదు ఈ పరిశ్రమ మీ సేవలను. RIP Dr Dasari Narayana Rao garu — Jr NTR (@tarak9999) 30 May 2017 #RIP #DasariNarayanaRao ji pic.twitter.com/RHwRcgfLsl — Rajinikanth (@superstarrajini) 30 May 2017 An era came to an end but LEGENDS will live forever #dasari pic.twitter.com/Rxfyu06beN — PURI JAGAN (@purijagan) 30 May 2017 His death leaves a void that can never be filled. Prayers and strength with the whole family. — Mahesh Babu (@urstrulyMahesh) 30 May 2017 Shocked and saddened by the news of Dasari Narayana Rao Garu's passing away. May his soul rest in peace. — Mahesh Babu (@urstrulyMahesh) 30 May 2017 -
కాపు ఉద్యమంలో కీలకపాత్ర
సినిమాలకు దర్శకత్వం వహించడం, నిర్మించడం, రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించడంతో పాటు.. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో సైతం ఆయన అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తున్న తరుణంలో ఆయనను అరెస్టు చేసి బలవంతంగా రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినప్పుడు కూడా ఆయన దీటుగా స్పందించారు. ఆ తర్వాత కాపు ఉద్యమంలో పార్టీలకు అతీతంగా నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు.. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చిన ఘనత కూడా దాసరి నారాయణరావు సొంతం. గత సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన దాసరి నివాసంలో పలువురు కాపు ప్రముఖులతో పాటు ముద్రగడ పద్మనాభం కూడా సమావేశమయ్యారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి
సినీ ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగు సినిమా రంగంపై తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన దాసరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో ఉత్థాన పతనాలను చూసిన ఆయన పత్రికా ప్రపంచంలోకి అడుగుపెట్టి ‘ఉదయం’ పత్రికకు ఊపిరులూదారు. ఆ పత్రిక ద్వారా తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడికి బాటలు వేసిన ఆయన ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942, మే4న జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం. అదే ఆయనను సినిమాల వైపు నడిపించింది. ఆయన మద్రాస్ వెళ్లి ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేకశైలిని అలవర్చుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర శిష్యరికం చేసిన కె. విశ్వనాథ్, కె. బాలచందర్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు భిన్నంగా సినిమాలు తీశారు. అవినీతి, లింగవివక్ష, అణచివేత లాంటి సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా తీసుకొని ఆయన సినిమాలను సామాజిక మాధ్యమంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూపారు. తెలుగు, హిందీ భాషల్లో 151 సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా దాసరి నారాయణరావు ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ల్లోకి ఎక్కారు. 53 సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. మాటల రచయితగా, పాటల రచయితగా 250 సినిమాలకు పనిచేశారు. క్యారెక్టర్ నటుడిగా పలు చిత్రాలో నటించారు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కనాలి లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందారు. మేఘసందేశం చిత్రాన్ని కాన్స్, షికాగో, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. తాత మనవడు, స్వర్గం నరకం చిత్రాల ద్వారా తెలుగు చిత్ర రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎమ్మెల్యే ఏడుకొండలు లాంటి చిత్రాలతో సమకాలీన రాజకీయాలపై వ్యంగాస్త్రం సంధించారు. ఆశాజ్యోతి, ఆజ్ కా ఎమ్మెల్యే లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ప్రవేశించినా, ఆయన అక్కడ పెద్దగా రాణించలేకపోయారు. మేఘసందేశం, కంటే కూతుర్ని కనాలి చిత్రాలకు రెండు జాతీయ అవార్డులను, ఇతర చిత్రాలకు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు తొమ్మిది నంది అవార్దులను అందుకున్నారు. మోహన్ బాబు, ఆర్. నారాయణమూర్తి లాంటి నటులను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయనకు భార్య దాసరి పద్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
దాసరి నారాయణరావు కన్నుమూత
-
దాసరి నారాయణరావు కన్నుమూత
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు ప్రకటించడానికి ముందుగానే ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆస్పత్రి బయటకు వచ్చి, ''గురువు గారు ఇక లేరు, కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం'' అని కన్నీటి పర్యంతమై చెప్పారు. కళ్యాణ్ దాసరికి అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కావడంతో ఏం జరిగిందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. గతంలో ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజుల క్రితం దాసరి నారాయణరావు మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అన్నవాహికకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశామని, ఆ తర్వాత ఆయన మూత్రపిండాలలో సమస్య ఏర్పడిందని వైద్యులు తొలుత విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. రాత్రి 7 గంటలకు... రాత్రి 7 గంటలకు ఆయన గుండె పనిచేయడం మానేసిందని, దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని కిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన బులెటిన్‌ను బుధవారం విడుదల చేయగలమని అన్నారు. ముందుగా ఆయన కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేస్తామని, ఆ తర్వాత మాత్రమే బయటకు విడుదల చేయగలమని తెలిపారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)