మా కులపెద్ద కన్నుమూత తీరని లోటు | tollywood expresses deep grief over demise of dasari narayana rao | Sakshi
Sakshi News home page

మా కులపెద్ద కన్నుమూత తీరని లోటు

Published Tue, May 30 2017 8:38 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

మా కులపెద్ద కన్నుమూత తీరని లోటు - Sakshi

మా కులపెద్ద కన్నుమూత తీరని లోటు

కథాబలంతోనే సినిమాలు నడవాలి తప్ప నటీనటుల బలంతో కాదని నిరూపించిన మహా దర్శకుడు దాసరి నారాయణరావు అని పలువురు సినీ ప్రముఖులు ప్రస్తుతించారు. తమ దర్శకులందరికీ పెద్ద, దర్శకుల స్థాయి పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి మరణం తమ దర్శకులకు మాత్రమే కాక.. తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద దెబ్బ అని ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.

తెలుగు సినిమా గమనానికి సరికొత్త దారి చూపిన దాసరి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని, ఆయన మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నానని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ  చెప్పారు.

దాసరి నారాయణరావు తెలుగు సినీరంగంలో దిగ్గజ దర్శకునిగా, నటునిగా, రచయితగా ఎన్నో హిట్ చిత్రాలను అందించారని, తెలుగు సినీ పరిశ్రమకు దాసరి ఎనలేని సేవలు అందించారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు.

దాసరి మృతికి ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిదని, దివంగత బాలచందర్ కూడా ఆయను ఆరాధించేవారని చెప్పారు. తాను దాసరి నారాయణరావుతో, సంజీవ్‌కుమార్‌తో గడిపిన రోజులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటానని ట్వీట్ చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement