వెండితెరపై విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ దిగ్గజం మోహన్ బాబు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తన నటనతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు ఆయనే. తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు స్వయంకృషితోనే ఎదిగారు. పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి సినిమాలు మోహన్ బాబు స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే తాజాగా తాను నటించిన కోరికలే గుర్రాలైతే(1979) చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో యమధర్మరాజు పాత్రలో ఆయన కనిపించారు. ఈ సినిమాలో సీన్స్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులోని ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయిగా మిగిలిపోతుందని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
మోహన్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..'నా గురువు, లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీ జి జగదీష్ చంద్ర ప్రసాద్ ఆధ్వర్వంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్, మురళీ మోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమ ధర్మరాజు పాత్ర చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు మాత్రమే కాదు.. ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది.' అంటూ పోస్ట్ చేశారు.
Korikale Gurralaithe(1979): Directed by my guru, the legendary Sri. Dasari Narayana Rao garu, and produced by Sri. G. Jagadeesh Chandra Prasad garu, this scene was a special milestone in my career. Sharing the screen with Sri. Chandramohan garu and Sri. Murali Mohan garu made it… pic.twitter.com/sIsJIDRW5C
— Mohan Babu M (@themohanbabu) December 8, 2024
Comments
Please login to add a commentAdd a comment