
దాసరితో ముద్రగడ పద్మనాభం భేటీ
కాపు ఉద్యమం మళ్లీ ఊపందుకుంటోంది. కాపులను బీసీలలో చేర్చాలంటూ గతంలో తాను చేసిన ఆమరణ దీక్షకు మద్దతు ఇచ్చినవారందరినీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వరుసగా కలుస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావును ఆయన ఇంట్లో కలిశారు. తన దీక్ష సందర్భంగా సంఘీభావం తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముద్రగడతో పాటు కాపు నేతలు అంబటి రాంబాబు తదితరులు కూడా ఉన్నారు. దాసరితో భేటీ అనంతరం చిరంజీవిని కూడా ముద్రగడ పద్మనాభం కలవనున్నారు. ఇక మంగళవారం నాడు దాసరి నారాయణరావు నివాసంలో కాపు నేతలు అధికారికంగా భేటీ కానున్నారు.