Kapu Reservation Agitation
-
కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం బాసట
కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా 2016లో కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన కాపు ఉద్యమకారుడు చీకట్ల వెంకట రమణమూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో చంద్రబాబు హయాంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి కేంద్రంగా కాపు ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో తునిలో రైలు దహనం ఘటన మరునాడు వెంకట రమణమూర్తి కలెక్టరేట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కాపులను ఇబ్బంది పెడుతోందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వెంకట రమణమూర్తి రాసిన లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. లారీ డీజిల్ మెకానిక్‌గా పనిచేసే అతడి ఆత్మహత్యతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య పార్వతి, కుమారుడు రాజేష్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం సహాయ నిధి నుంచి చీకట్ల పార్వతి పేరిట రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కును రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదివారం వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి, కుమారుడు రాజేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వెంకట రమణమూర్తి కుటుంబ పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి రూ.5 లక్షల ఆరి్థక సహాయం పంపించి ఆదుకున్నారని చెప్పారు. వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి కాకినాడ 3వ డివిజన్లో వలంటీర్‌గా పని చేస్తోందన్నారు. -
త్వరలోనే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా: ముద్రగడ
సాక్షి, కాకినాడ: తన భవిష్యత్ రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ప్రజలకు రాసిన మూడు పేజీల బహిరంగ లేఖను కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాకు విడుదల చేశారు. 2016 జనవరి 31న తునిలో కాపుగర్జన సభ జరిగిన మరునాడు తనను తీహార్ జైలుకు తీసుకెళ్లటానికి హెలికాప్టర్ సిద్ధంగా పెట్టారని, వెంటనే బెయిల్ తెచ్చుకోవాలని.. లేదంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోవాలని పలువురు సలహా ఇచ్చారని గుర్తు చేశారు. అప్పట్లో అలా చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యేదని ముద్రగడ అన్నారు. తుని సమావేశంలో ఎక్కువగా భయపడింది, బాధపడింది తనతో ఉన్న సామాన్యుల కోసమేనని పేర్కొన్నారు. అందుకే.. సభకు వచి్చన వారిని బాధ పెట్టొద్దని, సభ పెట్టడానికి తానే కారకుడనని, అన్ని కేసులు తనపై పెట్టుకోవాలని ఆనాడే ప్రభుత్వానికి చెప్పానన్నారు. ఈ కేసులో ఉరిశిక్ష వేసినా పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లకూడదని నిశ్చయించుకున్నానని తెలిపారు. ‘ప్రత్తిపాడు రాజకీయ భిక్ష పెట్టింది’ ప్రత్తిపాడు నియోజకవర్గం తనకు రాజకీయ భిక్ష పెట్టిందని, తన తాత పద్మనాభం మున్సబుగా, తండ్రి వీరరాఘవరావు స్వతంత్ర ఎమ్మెల్యేగా తమ కుటుంబానికి విలువ తెచ్చారని ముద్రగడ పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా ఉంటూ ఎవరికీ అన్యాయం చేయకూడదని వారు చెప్పారని, తన ఊపిరి ఉన్నంత కాలం ఆ మాటలు గుర్తుంటాయన్నారు. వారి బాటలో నడిచే తాను జాతిని అమ్మకం, తాకట్టు పెట్టలేదన్నారు. ఉద్యమాలు, రాజకీయాల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు. కాపు జాతి రిజర్వేషన్ల కోసం ప్రయతి్నంచి జోకర్ కార్డు మాదిరిగా అయినందుకు బాధపడుతున్నానని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, గౌతు స్వామి, గణేశుల రాంబాబు తదితరులు ఉన్నారు. చదవండి: బిల్డప్ బాబూ బిల్డప్..! ఆ విషయం చెప్పే దైర్యం చంద్రబాబుకు ఉందా? -
తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు
సాక్షి, విజయవాడ: తుని రైలు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ సరిగా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు ఎందుకు సాగతీశారని ప్రశ్నించింది. బాధ్యులైన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చారు రైల్వే పోలీసులు. ఈ కేసులో ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. మొత్తం 24 మంది సాక్ష్యులలో 20 మంది విచారణకు హాజరయ్యారు. 20 మందిలో ఐదుగురు తమకు ఏమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. విచారణ పూర్తి కావడంతో తుదితీర్పు వెల్లడించింది. అయితే తుని ఘటన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. కానీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. చదవండి: బీటెక్ రవి దౌర్జన్యకాండ: బెదిరింపులు.. పచ్చబ్యాచ్‌తో కలిసి మారణాయుధాలతో.. -
కాపు ఉద్యమం నుంచి పూర్తిగా తప్పుకున్నా
హనుమాన్ జంక్షన్ రూరల్: క్రియాశీల రాజకీయాలు, కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తాను పూర్తిగా తప్పుకున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వెళ్తూ ఆయన మంగళవారం మార్గమధ్యంలో బాపులపాడు మండలం బొమ్ములూరులోని ఓ రెస్టారెంట్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక కాపు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. రాజకీయాలకు, కాపు రిజర్వేషన్ ఉద్యమానికి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. -
తుని రైలు ఘటన: మరో 17 కేసులు ఉపసంహరణ
సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని రైలు ఘటనలో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు తెలిపారు. మొత్తం నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. -
కాపు ఉద్యమానికి ఇక సెలవ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు చేపట్టిన ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. సోషల్ మీడియాలో తనపై పెడుతున్న పోస్టింగ్‌లకు కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి సోమవారం సుదీర్ఘ లేఖ రాశారు. ‘ఈ మధ్య పెద్దవారు చాలామంది మన సోదరులతో నేను మానసికంగా కుంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి కారణం.. చంద్రబాబే. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీ అమలు కోసం ఉద్యమ బాట పట్టాను. ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలని ఏనాడూ అనుకోలేదు.’ అని లేఖలో పేర్కొన్నారు. -
ఏ నివేదికల ఆధారంగా కాపులను బీసీల్లో చేర్చారు..
సాక్షి, హైదరాబాద్: ఏ నివేదికలను ఆధారంగా చేసుకుని కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారో ఆ నివేదికలను సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో జస్టిస్ మంజునాథ్ ఇచ్చిన నివేదికను, బీసీ కమిషన్ సభ్యులు ముగ్గురు ఇచ్చిన నివేదికను స.హ. చట్టం కింద న్యాయవాది కొండల్రావుకు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారో వాటిని బహిర్గతం చేయాలంటూ స.హ. చట్టం కింద పెట్టుకున్న దరఖాస్తును బీసీ సంక్షేమశాఖ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.కొండల్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కాపు, తెలగ, బలిజ, ఒంటిరి కులాలను బీసీల్లో చేర్చే విషయంలో బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో జస్టిస్ మంజునాథ్ ఓ నివేదికను, కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు మరో నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం జస్టిస్ మంజునాథ్ నివేదికను కాకుండా ముగ్గురు సభ్యులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే కాపులను బీసీల్లో చేర్చడంపై పిటిషనర్‌కు పలు అభ్యంతరాలున్నాయని, వీటన్నింటినీ ఆయన బీసీ కమిషన్ ముందు వ్యక్తం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో సదరు నివేదికలను ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ స.హ. చట్టం కింద బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత అధికారి తిరస్కరించారని తెలిపారు. అంతేకాక ఈ నివేదికలను బయటపెడితే సమస్యలు వస్తాయని, అందువల్ల కోరిన సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారని ఆయన కోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్ కోరిన సమాచారాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
కాపులకు రిజర్వేషన్లు కొత్తగా ఇచ్చేదేమీ కాదు
కంభం: బ్రిటిష్ కాలంలో 1915లోనే కాపు, తెలగ, బలిజ, కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయని, ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేదేమీ లేదని గవర్నర్ సంతకంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేయవచ్చని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా ఈ జాతి రిజర్వేషన్లు అనుభవించిందన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా కంభంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కాపులకు రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ప్రధాని అనుమతితో రాష్ట్రపతి ఆమోదం అవసరమని, రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు గవర్నర్ సంతకంతోనే అమలు చేయవచ్చన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపురిజర్వేషన్లు ఖాయమన్న ముఖ్యమంత్రి నాలుగేళ్లు గడుస్తున్నా మంజునాథ కమిషన్ పేరిట కాలయాపన చేశారన్నారు. మార్చి 31లోగా రిజర్వేషన్ల ఆంశం పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాపు నాయకులతో చర్చించి ఉద్యమిస్తామన్నారు. -
అంబేడ్కర్‌ను దళితవాడలకే పరిమితం చేయకండి
కిర్లంపూడి (జగ్గంపేట): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను దళితవాడలకే పరిమితం చేయరాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి ఏనుగు వీధి సెంటర్ కాపుల వీధిలో ముద్రగడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని.. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాపుల వీధుల్లో అంబేడ్కర్ విగ్రహాలను పెట్టే ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ను ఒక్క కులానికే ఆపాదించకుండా అందరివాడిగా చూడాలన్నదే తన కోరికన్నారు. -
మా పోరాటం తుమ్మకర్ర మంట
అయినవిల్లి (పి.గన్నవరం): కాపు ఉద్యమం తాటాకు మంటలా అప్పుడే ఆరిపోయేది కాదని, తుమ్మకర్ర మంటలా ఎప్పుడూ రగులుతూనే ఉంటుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో ఆదివారం జరిగిన కాపు వనసమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కాపుల కోసం ప్రత్యేక రాజ్యాంగం రాశారేమో! కాపులంతా కలిసి ఒకచోట ఆత్మీయ పలకరింపు సభ ఏర్పాటు చేసుకున్నా ప్రభుత్వ అనుమతి కావాలంటారు. పాదయాత్ర చేస్తామన్నా అనుమతి తప్పనిసరి అంటారు. ఏదో అన్యాయం జరిగినట్లు పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తారు. ఇదేం రాక్షస పాలన?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అంబేడ్కర్ వర్ధంతి అయిన డిసెంబర్ 6లోగా నెరవేర్చాలన్నారు. -
'2050 వరకూ మమ్మల్ని ఏలుతారా?'
సాక్షి, కిర్లంపూడి: పాదయాత్రను అడ్డుకుని తమను బందెలదొడ్లో పశువుల్లా ఒకే చోట కట్టేశారని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డకున్నారు. అనంతరం ఆయన కిర్లంపూడిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాదయాత్రకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి అందించి, రూట్ మ్యాప్ కూడా పంపామని చెప్పారు. అయినా కూడా అడ్డుకోవడం దారుణమని అన్నారు. 'నేనేం పాపం చేశానో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి. సీఎం గారి మీద దండయాత్ర చేసేంత ధైర్యం, దమ్మూ మాకు లేదు. అనవసరంగా పాదయాత్రపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలీడం లేదు. పోలీసులు కూడా సీఎంకు వంత పాడటం సిగ్గుచేటు. నేను ఎందుకు నడవకూడదో.. ఎవరూ చెప్పడం లేదు. ఇక్కడేమైనా బ్రిటిష్ పాలన సాగుతోందా?. ఏంటి నిర్భందం. ఎంతకాలం ఇలా. నాకు సమాధానం కావాలి. సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాపులకు ఏం చేసిందని అన్నారు. అధికారంలో ఉన్న మీరు, మీ మావయ్య గారు 1995లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. మీరు చేయాల్సింది ఎందుకు చేయలేదో చెప్తే మిగతావి ఎందుకు చేయలోదో నేను చెప్తా. మీరు మాకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతున్నారు. మా జాతిని చులకనగా చూస్తున్నారు. నంద్యాల, కాకినాడలో కులాల పేరుతో మీరు చేసిందేంటి. మీ ఓట్ల కోసం, అధికారం కోసం కులాలను అడ్డుపెట్టుకుని.. లేనిపోని ఆశలు కల్పిస్తున్నారే. సరే ఆ ఆశలను తీర్చాలని అడిగితే అణచివేస్తున్నారే. కులాల వాళ్లు రోడ్డు మీదకు రావడానికి కారణం మీరే ముఖ్యమంత్రి గారు. ఎక్కడ లేని కోపం మీకు ఎందుకు వస్తుంది?. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని హామీలు అమలు చేయమని అడిగే హక్కు లేదా?. మీరు, మీ కుమారులు, మీ మనవడు 2050 వరకూ పదవుల్లో సాగాలా?. మేం మీ పాద సేవ చేయాలా? మీకు బానిసల్లా ఉండాలా?. పోలీసులను పంపి మమ్మల్ని భయభ్రాంతులను చేయాలని చూస్తున్నారు. పోలీసులతో పాలన చేయాలని చూసిన ప్రభుత్వాలు ఏవీ కూడా మనుగడ సాగించలేవు. ఎంతో కాలం నుంచి వేచి చూశాం. మా జీవితాలు ఇలానే విసిగి వేశారి పోవాలా?. మీరు కుల మీటింగ్‌లు పెట్టొచ్చు. ఇతర కులాలు మాత్రం సమిష్టిగా రోడ్ల మీదకు రాకూడదు. దేశానికి, దేశంలోని అన్ని కులాలకు స్వతంత్రం వచ్చింది. కానీ మా జాతికి ఇంకా స్వతంత్రం రాలేదని మేం భావిస్తున్నాం. మేం వేరే దేశం నుంచి వచ్చామని ఓ కాగితం ఇవ్వండి. రోడ్ల మీదకు రాము. మా బతుకులు మేం బతుకుతాం. ఈ అణచి వేత ధోరణి మానుకోవాలని తెలియజేస్తున్నాను.' -
‘కాపులను బీసీల్లో చేర్చితే యుద్ధమే’
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చొద్దని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ చర్యతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చుతామని, విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ఆచరణలో అమలు కాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, లబ్ధికోసం రిజర్వేషన్లు నిర్ణయించవద్దని, అలాచేస్తే బీసీ కులాలన్నీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాయన్నారు. సమావేశంలో బీసీ సంఘం నేతలు ర్యాగ అరుణ్, సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా?
ముద్రగడ మండిపాటు కిర్లంపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు మరోసారి బ్రేక్ వేశారు. జేఎసీ, కాపు నాయకులతో కలసి ముద్రగడ ఆదివారం ఉదయం కిర్లంపూడిలోని తమ ఇంటి నుంచి పాదయాత్రకు బయలుదేరారు. వారు గేటు దాటిన వెంటనే పోలీసులు అడ్డుకుని పాదయాత్రకు అనుమతులు లేవని తెలిపారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ ‘ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా? నియంతృత్వ పాలనలో ఉన్నామా?’ అని పోలీసులను ప్రశ్నించారు. గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తానంటే పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు. అనంతరం ముద్రగడతో పాటు జేఏసీ, కాపు నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
కాపులపై అరాచకశక్తుల ముద్ర
-
కాపులపై అరాచకశక్తుల ముద్ర: నారాయణ
సాక్షి, అమరావతి: తుని ఘటనతో కాపులంటే అరాచకశక్తులుగా ముద్రపడిం దని రాష్ట్ర మంత్రి పి.నారాయణ అన్నారు. ముద్రగడ పాదయాత్ర విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. ముద్రగడ ‘చలో అమరావతి’ పాదయాత్ర సందర్భంగా అల్లర్లకు అరాచకశక్తులు యత్నిస్తున్నట్టు నిఘా సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అప్రమత్తమైందని, పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని, మూడు లేదా ఆరు నెలల్లో నివేదిక అందుతుందని చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం 35 ఏళ్లు ఆగినవాళ్లు కొద్ది నెలలు ఆగలేరా? అని ప్రశ్నించారు. -
‘కాపులకు బాబు తీరని ద్రోహం’
చిలకలూరిపేట టౌన్: సీఎం చంద్రబాబు నాయుడు కాపులకు తీరని ద్రోహం చేశారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి గోవిందు శంకర్ శ్రీనివాసన్ ఆరోపించారు. పట్టణంలోని కాపు సంక్షేమ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ.1000 కోట్లు చొప్పున సంక్షేమానికి నిధులు కేటాయిస్తానని ఎన్నికల ముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే కాపులను అణగదొక్కే కుట్రలకు తెరతీశారని ధ్వజమెత్తారు. హక్కుల సాధన కోసం పోరాడుతుంటే అక్రమ కేసులు బనాయించి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ కింద అర్హులైన ఒక్కరికి కూడా రుణాలు మంజూరు చేయలేదని ఆరోపించారు. తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యలో ఈ నెల 7న కాకినాడలో భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. సమావేశంలో కాపు జేఏసీ కో కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, పాశం రామారావు, శనివారపు సాంబశివరావు పాల్గొన్నారు. -
తొలగిన ఆంక్షలు
గృహ నిర్బంధాల ఎత్తివేత విశాఖ తీరానికి బలగాల తరలింపు జిల్లాలో పలుచోట్ల నిరసనలు.. బంద్‌లు అమలాపురం టౌన్, జగ్గంపేట : కాపు నేతలపై గృహ నిర్బంధ ఆంక్షలను ఎట్టకేలకు ఎత్తివేశారు. విశాఖ తీరంలో గురువారం జరగనున్న ప్రత్యేక హోదా నిరసన సభను అణిచివేసేందుకు ఇక్కడి పోలీసు బలగాలను విశాఖకు తరలించారు. కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద మాత్రం గృహ నిర్బంధం, పోలీసు బందోబస్తును పాక్షికంగా తొలుత సడలించి రాత్రి ఏడు గంటల తరువాత పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. కోనసీమలోని అమలాపురంతోపాటు మండల కేంద్రాల్లోని కాపు నేతలను గృహ నిర్బంధాల నుంచి విముక్తి చేసి ఆ ఇళ్ల వద్ద ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించారు. అమలాపురంలో కాపు రిజర్వేష¯Œ¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ జాయింట్ కన్వీనర్లు కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒSSకుమార్ల ఇళ్ల వద్ద ఉన్న పోలీసు పికెట్లను ఉపసంహరించారు. రావులపాలెం మండలం గోపాలపురంలో రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్లు ఆకుల రామకృష్ణ, కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో వాసిరెడ్డి ఏసుదాసు గృహ నిర్బంధాన్ని ఎత్తివేశారు. బంద్‌లు.. నిరసనల హోరు ఉదయం నుంచి కాపు నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతుండగా బుధవారం సాయంత్రం వరకూ జిల్లాలో పలుచోట్ల కాపుల ఆధ్వర్యంలో బంద్‌లు.. నిరసనలు కొనసాగాయి. కిర్లంపూడిలో బుధవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. రావులపాలెం మండలం గోపాలపురంలో కాపులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. కాపులను బీసీల్లో చేర్చటంలో కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావులపాలెం బంద్ పాక్షికంగా సాగింది. అమలాపురంలో గాంధీనగర్ వద్ద కాపు మహిళలు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అమలాపురంలో కాపు ఉద్యమ నేత కల్వకొలను తాతాజీ గృహ నిర్బంధంలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన మహిళలు తరలివచ్చి అక్రమ గృహ నిర్బంధాలను నిరసిస్తూ నినాదాలు చేసి వారికి మద్దతు తెలిపారు. సాయంత్రం నుంచి గృహ నిర్బంధాలు ఎత్తివేత అనంతరం కాపు ఉద్యమ నేతలు నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్ కుమార్‌లు ఊరేగింపుగా గండువీధికి వెళ్లి అక్కడ ఉన్న కాపు ఉద్యమ నేత దివంగత నల్లా సూర్య చంద్రరావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కాపుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వ తీరును తూర్పారబెట్టారు. కాపులు తమ నోళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీతో పాటు పీసీసీ కార్యదర్శులు పాల్గొని కాపుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇక అంబాజీపేట, పి.గన్నవరం తదితర ప్రాంతాల్లో కూడా కాపులు నిరసనలు తెలిపారు. -
బీసీ నేతలతో ముద్రగడ భేటీ
బీసీల నోటి వద్ద ముద్దను కాజేసే ఉద్దేశం లేదని వెల్లడి సాక్షి ప్రతినిధి, ఏలూరు/కొత్తపేట: కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమానికి బీసీలు, ఆ సంఘాల నేతలు సహకరించాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేవారు. శనివారం పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించిన ముద్రగడ భీమవరంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ నివాసంలో వెనుకబడిన తరగతులకు చెందిన వివిధ కుల సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల డిమాండ్ విషయంలో బీసీ నాయకులు వారి అభ్యంతరాలు, అపోహలను వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ముద్రగడ స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా.. ఆపైన ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తేనే తీసుకుంటామని వెల్లడించారు. బీసీల నోటికాడ ముద్దను కాజేసే ఆలోచన తమకు లేదన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ మేకా శేషుబాబును కలిసి కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబుకు ఉత్తరం రాయాలని కోరారు. సాయంత్రం కొత్తపేటలో ముద్రగడ మాట్లాడుతూ.. బీసీలు వారి డిమాండ్ల కోసం రోడ్డెక్కితే మద్దతు ఇస్తానన్నారు. -
కాపులను బీసీల్లో చేరిస్తే సహించం
– మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉద్యమాలు – ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ కర్నూలు(అర్బన్): అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న కాపులను బీసీ జాబితాలో చేరిస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డేరంగుల మాట్లాడుతూ కాపులు బలహీన వర్గాలు కాదని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉన్నతాధికారులుగా వారు ఉన్నారన్నారు. ఏపీలో రాజకీయ పరంగా కూడా వారు అభివృద్ధిచెందారన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి, నలుగురు మంత్రులతో పాటు 22 మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు. సినిమా రంగాన్ని సైతం నడిపిస్తున్నది కాపు సామాజిక వర్గానికి చెందిన వారే నని చెపా్పరు. వ్యవసాయరంగంలో, పరిశ్రమల ఏర్పాటులో కూడా కాపులే ముందున్నారని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బలహీన వర్గాలుగా చూపించేందుకు మంజునాథ కమిషన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని డేరంగుల హెచ్చరించారు. ఏపీబీసీ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. బీసీ కులాలను వెలుగులోకి తెస్తాం ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి అరు దశాబ్దాలు గడుస్తున్నా అనేక బీసీ కులాలు చట్టసభల మెట్లు కూడా ఎక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాలకు కూడా రాజకీయ ప్రాధాన్యత లభించేందుకు సంఘం తీవ్రంగా కృషి చేయనుందని చెప్పారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఈ సురేష్‌గౌడ్, కార్యదర్శి వలీబాషా,, జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు కాపు జాతి గుండె చప్పుడు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సాక్షి ప్రతినిధి, కాకినాడ/తాడేపల్లి గూడెం: రిజర్వేషన్ల సాధన కాపు జాతి గుండె చప్పుడని, దానికోసం అలుపెరగని పోరాటం చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మ నాభం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతున్న కాపులు ఆకలికేకలు పేరుతో ఆదివారం కంచాలు మోగిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమాలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు దద్దరిల్లాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు, పెరవలిల్లో ఈ నిరసనలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపు జాతికి మేలు చేస్తారని చంద్రబాబునాయుడిని గద్దెనెక్కిస్తే.. ఆయన కాపులను మోసగించారని విమర్శించారు. ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు రెండున్నరేళ్లు దాటినా మాట నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. అనంతరం కాపులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని కంచాలపై గరిటెతో శబ్దం చేసి నిరసన తెలిపారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు, వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లోని ముఖ్య కూడళ్లలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. -
13 జిల్లాల్లోనూ పాదయాత్రలు
కాపు ఉద్యమనేత ముద్రగడ వెల్లడి అమలాపురం టౌన్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో దశల వారీగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ పాదయాత్రలు నిర్వహిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ముందస్తు కార్యాచరణ ప్రకారం ఈ నెల 18 నుంచి దశల వారీ పోరాటాలు చేస్తూ 2017 జనవరి 25 న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమలాపురంలోని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు నల్లా విష్ణుమూర్తి స్వగృహంలో శుక్రవారం కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా పవన్‌కుమార్, మిండగుదటి మోహన్, ఆర్వీ సుబ్బారావులతో కలిసి ముద్రగడ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. -
దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
కాపు జేఏసీ సమావేశంలో ముద్రగడ కిర్లంపూడి: ఈ నెల 18 నుంచి జనవరి 25 వరకు నిర్వహించ తలపెట్టిన దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాపు నేతలకు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో 13 జిల్లాల జేఏసీ నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించారు. 18న నల్ల రిబ్బన్లు ధరించి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట వరకు కంచాలపై శబ్ధం చేస్తూ ఆకలి కేక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. 30న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు అందించాలన్నారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని, జనవరి 25న యథాతథంగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. -
ముద్రగడ గొప్పపోరాట యోధుడు
⇒ సినీ నటుడు మంచు మోహన్‌బాబు కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గొప్ప పోరాట యోధుడని, ఆయన చేపట్టిన ఉద్యమం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ సినీ హీరో మంచు మోహన్‌బాబు అన్నారు. భార్యతో కలిసి ఆదివారం కిర్లంపూడి వచ్చిన ఆయన ముద్రగడను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముద్రగడ అంటే తనకు మొదటి నుంచీ చాలా ఇష్టమని, ఆయనను కలిసేందుకు స్వయంగా తానే ఫోన్ చేసి వచ్చానని చెప్పారు. లక్షలాది మంది కాపుల కోసం నిస్వార్థంగా పోరాడుతున్న ముద్రగడ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. లక్ష్మీప్రసన్న కూడా రావాల్సి ఉందని, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోరుుందన్నారు. ముద్రగడ తన కుటుంబ సభ్యులను, కాపు జేఏసీ నాయకులను మోహన్‌బాబుకు పరిచయం చేశారు. అనంతరం ముద్రగడ ఇచ్చిన విందులో మోహన్‌బాబు దంపతులు పాల్గొన్నారు. -
కాపుల యాత్రపై పోలీసుల డేగ కన్ను
12 డ్రోన్లతో చిత్రీకరణ 16న రావులపాలేనికి కాపులు రాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు 8 వజ్ర వాహనాలు, వాటర్, గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో సన్నద్ధం 13 జిల్లాల నుంచి ఆరు వేల మంది పోలీసుల మోహరింపు కోనసీమ చరిత్రలో తొలిసారిగా అత్యాధునిక భారీ బందోబస్తు అమలాపురం టౌన్ : కాపు సత్యగ్రహ పాదయాత్రపై పోలీసులు డేగ కన్ను వేస్తున్నారు. కాపుల పాద యాత్రను ఆకాశం నుంచి చిత్రీకరించేందుకు ముఖ్య ప్రదేశాల్లో 12 డ్రోన్లు సిద్ధం చేశారు. వీటిలో రావులపాలెంలో రెండు, అమలాపురంలో రెండు ఉండేలా...మిగిలిన ఎనిమిది కొత్తపేట, రాజోలు, మలికిపురం, తాటిపాక, అయినవిల్లి, అంతర్వేది తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. శాటిలైట్...చిప్ ఆధారంగా పనిచేసే వీటి కోసం అమలాపురం పోలీసులు 12 ఫో¯ŒS నంబర్లతో కొత్త సిమ్‌లు సిద్ధం చేశారు. ఇప్పటికే రాయలసీమ, కోస్తా, ప్రకాశం, నెల్లూరు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి దాదాపు మూడు వేల మందికి పైగా పోలీసులను కోనసీమకు తరలించారు. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో మూడు వేల మంది పోలీసులను బరిలోకి దింపుతున్నారు. వీరిలో సీఆర్పీఎఫ్, ఏఎ¯ŒSఎస్ తదితర స్పెషల్ ఫోర్సులు కూడా ఉన్నాయి. డీఐజీ, ఎస్పీతోపాటు నలుగురు ఏఏస్పీలు, 25 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు, 500 మంది ఎస్సైలను పాదయాత్ర బందోబస్తు విధుల్లో భాగస్వామ్యులను చేస్తున్నారు. అత్యాధునిక వాహనాలు సిద్ధం... కాపుల పాద యాత్రను అడ్డుకునే సమయంలో ఆందోళనకారులను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ అత్యాధునిక వాహనాలను రంగంలోకి దింపింది. ఎంత జన సమూహాన్నైనా అదుపు చేసేందుకు ఎనిమిది వజ్ర వాహనాలను రప్పించారు. మల్టీ ప్రొటెక్ష¯ŒSతో ఉండే ఈ వాహనంలో వాటర్ కే¯Œ్స, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు వంటివి ఉంటాయి. ముళ్ల కంచెల రోల్స్, రైట్ గేర్ కిట్స్ అంటే బుల్లెట్ ప్రూఫ్, స్టో¯Œ్స ప్రూఫ్ జాకెట్లు కూడా సిద్ధం చేశా>రు. ఎలాంటి వాహనాలనైనా చిటికెలో ఛేజ్ చేసే 4 రాఫిడ్ ఇంటర్వెష¯Œ్స వెహికల్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటే వారిని తక్షణమే అక్కడి నుంచి తరలించేందుకు కేంపర్స్ వాహనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ యాత్రకు ముందు..వెనుక ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా రావులపాలేనికి రెండు వేల మంది...అమలాపురానికి రెండు వేల మంది...యాత్ర సాగే ముఖ్య ప్రాంతాల్లో రెండు వేల మంది పోలీసులను ప్రస్తుతానికి సర్ధుబాటు చేశారు. ఈ యాత్రకు బందోబస్తుపరంగా ప్రత్యేక అధికారిగా నియమితులైన అడిషనల్ ఎస్పీ ఏఎస్ దామోదర్ నాలుగు రోజులుగా కోనసీమలోనే మకాం చేసి బందోబస్తు ప్యూహాలను రూపాందిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యే రావులపాలేనికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులు రాకుండా పోలీసు చెక్ పోస్టులలో నిలువరించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. చెక్‌పోస్టులు ఏర్పాటు.. జొన్నాడ వంతెనలపైనే కాకుండా రావులపాలం వచ్చేందకు అంతర్గత రోడ్లలో పోలీసు చెక్ పోస్ట్‌లు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే దిండి– చించునాడ వంతెన, బోడసకుర్ుర– పాశర్లపూడి వంతెన, యానాం–ఎదుర్లంక వంతెనతోపాటు సఖినేటిపల్లి, కోటిపల్లి ఫెర్?రల వద్ద కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ముద్రగడ పాదయాత్ర విజయవంతానికి పూజలు కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు నిర్వహించనున్న పాదయాత్ర జయప్రదం కావాలని కిర్లంపూడి శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి అభిషేకాలు జరిపారు. కాళ్ల సత్యనారాయణ, సరకణం భద్రం, కరణం వెంకటేశ్వరరావు, గంధం నల్లయ్య, దొంగబాబు అధిక సంఖ్యలో ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లతోనే కాపుల సర్వతోముఖాభివృద్ధి
16 నుంచి సత్యాగ్రహ పాదయాత్ర ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ కిర్లంపూడి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో కాపులకు ఇచ్చిన రిజర్వేషను హామీ సాధించుకుంటేనే జాతి అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తుందని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం గోకివాడ గ్రామం నుంచి భారీ సంఖ్యలో కాపు నాయకులు, యువకులు ముద్రగడ నివాసానికి తరలివచ్చి ఆయన చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ బ్రిటిషు కాలంలో కాపులకు రిజర్వేషనులు కొనసాగేవని, అనంతరం కొన్ని పరిణామాల వలన తొలగించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషను అమలు చేయడమే కాకుండా ఏటా వెయ్యి కోట్లు ఇచ్చి కాపులను ఆర్థికంగా బలోపేతం చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ఉద్యమం అనంతరం తాను చేసిన దీక్ష సమయంలో ప్రభుత్వ పెద్దలను పంపించి ఏడు నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తానని దీక్షను విరమింపజేశారన్నారు. ఏడు నెలలు దాటినా ఇంత వరకూ ఇచ్చిన హామీ ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కమిషను పేరుతో కాలయాపన చేసి కాపులను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రిజర్వేషను సాధనలో భాగంగా వచ్చే నెల 16 నుంచి ఐదు రోజుల పాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, సంగిశెట్టి వెంకటేశ్వరరావు, గోకివాడ కాపు నాయకులు గరగ స్వామి, గరగ వీరబాబు, గరగ మహేశ్వరరావు, గోకివాడ బుజ్జి, నామా వెంకట్రావు, కీర్తి హరనాథబాబు, నామా పెద్దిరాజు, కొత్తెం బుజ్జి, నామా బుజ్జి వెంకట్రావు, కొత్తెం బాబూరావు, నామా కృష్ణ, విశ్వనాథుల సుబ్బారావు, అమలకంటి దొరబాబు పాల్గొన్నారు. -
మంజునాథ్ గోబ్యాక్
–కాపులను బీసీలో చేర్చొద్దంటూ ప్రజా సంఘాల ఆందోళన - బీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసా – సంఘాలు సహకరించకపోవడంతో విచారణ వాయిదా కర్నూలు(హాస్పిటల్): కాపు, బలిజలను బీసీ కేటగిరిలో చేర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్చే నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసాగా మారింది. సోమవారం బీసీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో కార్యక్రమం ప్రారంభం కాకుండా సంఘాల నాయకులు అడ్డుతగిలారు. బీసీ కమిషన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అరుపులు, కేకల మధ్య విచారణ కొనసాగించలేనని కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అన్యాయం చేసే బహిరంగ విచారణ తమకు వద్దంటూ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా యాదవ కులంలో గ్రూపులను మార్చాలంటూ వచ్చిన అభ్యంతరాలపై విచారణ ప్రారంభిస్తానని కమిషన్ చైర్మన్ చెప్పగానే చిన్నహాలులో 150 బీసీ కులాలకు సంబంధించి విచారణ చేపట్టి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హాలు బయట ఇంకా 2వేల మంది దాకా ఉన్నారని, వారందరి సమక్షంలో విచారణ జరిపితే న్యాయం జరుగుతుందన్నారు. ఇందుకోసం హాలు బయట కూడా మైకులు ఏర్పాటు చేశామని కమిషన్ చెప్పినా సంఘాల నాయకులు శాంతించలేదు. కమిషన్ ఎప్పటికీ బీసీలకు వ్యతిరేకం కాదని చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రశాంత వాతావరణం లేకపోతే బహిరంగ విచారణ చేయడం కుదరదని, సంఘాల నాయకులు సహకరించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతిలో బీసీల రిజర్వేషన్‌పై విచారణ చేస్తామన్నారు. ఇదే సందర్భంగా సంచార జాతులకు చెందిన సుంకులమ్మ కులం వారు వచ్చి డోలు వాయిస్తూ, కొరడాలతో నాట్యం చేస్తూ నిరసన తెలిపారు. గంగిరెద్దు ఆడించేవారు సైతం హాలులోకి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సంఘాల నాయకులు, సభ్యుల నినాదాల మధ్య కమిషన్ చైర్మన్ బహిరంగ విచారణను వాయిదా వేశారు. వినూత్న నిరసన కాపులను, బలిజలను బీసీ జాబితాలో చేర్చితే సహించేది లేదని పేర్కొంటూ బీసీ సంఘాల జేఏసీ నాయకులు మెడకు ఉరితాళ్లు కట్టుకుని అంబేడ్కర్ భవన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గేట్లను తోసుకుని బహిరంగ విచారణ జరిగే హాలులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ, బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, కులాల ఐక్య వేదిక మహిళా నాయకురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చితే ఇప్పుడున్న బీసీలకు ఉరితాళ్లే గతవుతాయన్నారు. అన్ని రంగాల్లో కాపులు అభివృద్ధి చెందారని, కాపులు బీసీలే కాదని గతంలో ఏర్పాటు చేసిన అన్ని కమిషన్లు, హైకోర్టు తేల్చి చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసేందుకు మంజునాథ్ కమిషన్ వేశారన్నారు. ఈ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అగ్రకులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బహిరంగ విచారణ వాయిదా వేసి, కాపు కులాల అభ్యర్థనలను ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాపు, బలిజ కులాలకు చెందిన నాయకులు, సభ్యులు ప్రతినినాదాలు చేశారు. కమిషన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కమిషన్ విచారణ వాయిదా వేసింది. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షులు భరత్‌కుమార్, బీసీ జనసభ నాయకులు టి.శేషఫణి, మాకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆరే కటిక కులాన్ని బీసీ–డీ నుంచి ఎస్సీలో చేర్చాలని కోరుతూ జిల్లా ఆరే కటిక సమాజ్ నాయకులు కృష్ణాజిరావు, నాగేశ్వరరావు, చలపతిరావు తదితరులు డిమాండ్ చేశారు. సంచార జాతులైన బుడగ జంగాలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంచార జాతుల వేదిక కమిటీ అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ కోరారు. భావసార క్షత్రియులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని భావసార క్షత్రియ మండలి జిల్లా నాయకులు ధర్నా చేశారు. సంఘాలు సహకరించకపోవడంతోనే విచారణ వాయిదా బీసీ సంఘాలు సహకరించకపోవడం వల్లే బహిరంగ విచారణ వాయిదా వేశామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. విచారణ వాయిదా అనంతరం ఆయన ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు సంబంధించి ఏ కులం వారైనా అభ్యర్థనలను విజయవాడలోని బీసీ కమిషన్ కార్యాలయానికి వచ్చి అందజేయవచ్చన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదన్నారు. 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్ జిల్లాల్లో పర్యటిస్తోందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవనవిదానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సూర్యనారాయణ, కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
కాపు జాబ్‌మేళాలో తిరుగుబాటు
-
కాపు జాబ్‌మేళాలో తిరుగుబాటు
- సీఎం మీటింగ్ కోసం ఇంటర్వ్యూలు నిలిపివేసిన కంపెనీలు - నిరుద్యోగుల నినాదాలు.. లాఠీలతో తరిమికొట్టిన పోలీసులు సాక్షి, అమరావతి: కాపు విద్యార్థుల జాబ్‌మేళాలో విద్యార్థులు, నిరుద్యోగులు తిరగబడ్డారు. కాపు విద్యార్థులకు ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజీలో నిర్వహిస్తున్న కాపు జాబ్‌మేళాలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరి గింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విద్యార్థులను, నిరుద్యోగులను కాపు కార్పొరేషన్.. కాలేజీకి పిలిపించింది. ఆ తర్వాత సీఎం సభ ఉందంటూ ఇంటర్వ్యూలను ఆపేసింది. దీంతో సాయంత్రం మూడున్నర గంటలకు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాలేజీ లోపలి నుంచి ముఖ్యమంత్రి వేదిక వద్దకు వచ్చారు. ‘ఉయ్‌వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం సభ ముగిసిన తరువాత మళ్ళీ ఇంటర్వ్యూలు జరుపుతామని కంపెనీల వారు హామీ ఇచ్చినా నిరుద్యోగులు ఆందోళన విరమించలేదు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు నిరుద్యోగులను చొక్కాలు పట్టుకొని పోలీసులు ఈడ్చుకుపోయారు. మరికొందరిపై లాఠీ ఝుళిపించారు. ఈ సమయంలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ నిరుద్యోగుల మధ్యలోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మీ పార్టీ కోసం ఉద్యోగాల పేరుతో మమ్మల్ని ఇక్కడకు రప్పించి ఇంటర్వ్యూలు కూడా చేయకుండా ఇబ్బం దులు పెడతారా? అంటూ రామానుజయను నిలదీసేందుకు నిరుద్యోగులు చుట్టుముట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, కాపు విద్యార్థినీవిద్యార్థుల జాబ్‌మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 1300 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటించగా.. 500 మందికి మాత్రమే వచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారు. మరోవైపు కానూరులో అన్నే కల్యాణమండపంలో బూరగడ్డ వేదవ్యాస్‌తోపాటు పలువురు టీడీపీలో చేరారు. -
కాపు విద్యార్థుల జాబ్ మేళా గందరగోళం..
-
కాపు విద్యార్థుల జాబ్ మేళా గందరగోళం..
► మొహం చాటేసిన ప్రముఖ కంపెనీలు ► ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.6 వేలు జీతం ప్రతిపాదన ► కాపు కార్పొరేషన్ చైర్మన్ నిలదీత ► ఆందోళనకు దిగిన విద్యార్థులు ► పోలీసుల అదుపులో విద్యార్థులు...విడుదల విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాపు విద్యార్థుల జాబ్ మేళా తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో చివరి రోజు ఉద్రిక్త నెలకొంది. ముందుగా ప్రకటించిన ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాకు రాలేదంటూ విద్యార్థులు వాపోయారు. దీనికి తోడు జాబ్ మేళా నిర్వహించిన కంపెనీలు ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.6 వేలు జీతంగా ప్రతిపాదించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయను విద్యార్థులు నిలదీశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఆరుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కొద్ది సేపటి తర్వాత విద్యార్థులను పోలీసులు వదిలేశారు. (చదవండి : కాపు జాబ్‌మేళా ప్రారంభం ) ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలు పడి జాబ్ మేళాకు వస్తే ప్రభుత్వం తమను మోసం చేసిందని విద్యార్థులు ధ్వజమెత్తారు. కాపు జాబ్‌మేళాను మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. చివరికి ఈ జాబ్ మేళా అభాసుపాలుకావడంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. -
1994 కాపు ఉద్యమ కేసులపై ఆరా
నవంబర్ 16 ముద్రగడ పాదయాత్రపై ముందస్తు విశ్లేషణl నివేదికలపై జిల్లా పోలీసు శాఖ కసరత్తు అమలాపురం టౌన్: వచ్చే నవంబర్ 16వ తేదీ నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహిస్తారన్న ప్రకటన ప్రభుత్వంలో కదలిక తీసుకుని వచ్చింది. 1994లో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ సైకిల్ యాత్ర నిర్వహించినప్పుడు కాపుల నుంచి అనూహ్య స్పందన రావటమే కాకుండా జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ దారి పొడవునా ఆందోళనలు, కొన్ని విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పోలీసులు కాపులపై అనేక కేసులు నమోదు చేశారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ముద్రగడ పాదయాత్రకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం నాటి యాత్ర ప్రభావాలు, పరిస్థితులపై ఆరా తీస్తూ ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు శనివారం అత్యవసర ఆదేశాలు వచ్చాయి. 1994లో ముద్రగడ సైకిల్ యాత్ర నిర్వహించినప్పుడు ఏఏ పోలీసు స్టేషన్లలో... ఏఏ కేసులు నమోదయ్యాయి. ఉద్యమ తీవ్రత, ఏయే సెక్షన్లపై నమోదు చేశారు వంటి వివరాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో శనివారం రాత్రి వరకూ జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో నాడు నమోదైన కేసుల వివరాలను పంపారు. నాడు ముద్రగడతో పాటు రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు దివంగత నల్లా సూర్యచంద్రరావు, ఆయన సోదరుడు ప్రస్తుత ఆ సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, నాటిæ ఉద్యమ నేతలు దివంగత సలాది స్వామినాయుడు, నేటి రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ తదితరులు నాటి సైకిల్‌యాత్రలో కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ సాగారు. అప్పట్లో కాపుల జన సాంద్రత ఎక్కువగా ఉండే కోనసీమలోని పలు పోలీసు స్టేషన్లలో దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. రావులపాలెంలో ఐదు కేసులతో పాటు సామర్లకోటలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా కేసుల ప్రభావం, నివేదికలు ప్రస్తుత త్వరలో జరగనున్న పాదయాత్రపై ఎలా ఉంటాయనేది విశ్లేషిస్తున్నారు. పాదయాత్రపై పోలీసుల స్పందన ఎంత వరకూ ఉండాలి. పాదయాత్ర సమయంలో కాపులు ఏదైనా ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడే పరిస్థితులు ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై పోలీసు శాఖ ఇప్పటి నుంచే అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. -
ఏపీ కాపు సంరక్షణ సంఘం ప్రారంభం
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా ఏపీ కాపు సంరక్షణ సంఘం ప్రారంభం ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం): కాపు కులస్థులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమకార్యక్రమాలు చేపడుతున్నామని, కాపులను బీసీల్లో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు చెప్పారు. అలా చేర్చని పక్షంలో ఏ పార్టీకైనా పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కాపు సంరక్షణ (కాపు,తెలగ,బలిజ) సంఘం ప్రారంభోత్సవం శనివారం స్థానిక గౌతమఘాట్‌లోని బొమ్మన రామచంద్రరావు చాంబర్ ఆఫ్ కామర్స్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న యర్రా సంఘం లోగోను ఆవిష్కరించారు. కాపు కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలకు బ్యాంకర్లు సహకరించకపోవడం వలన ఈ పథకం విషయంలో విఫలమవుతున్నామన్నారు. కాపుల అభ్యున్నతికి నూతన సంఘం ఇచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సంఘం అధ్యక్షుడు వడ్డి మల్లిఖార్జున్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా రాష్ట్రంలోని విద్యావంతులతో ఏర్పాటైన సంఘం ద్వారా కాపు జాతిని చైతన్యపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం కాపులకు 20 ఏళ్ళ వరకు ఉచిత విద్యను అందించాలని, కాపు విద్యార్థి, యువతీ,యువకులకు వ్యవసాయ, వృత్తి, సేవా కార్యక్రమాలలో శిక్షణ ఇప్పించాలని,కాపురుణాలను బ్యాంకులతో ముడిపెట్టకుండా కాపు కార్పొరేషన్ ద్వారా నేరుగా అందించాలని డిమాండ్ చేశారు. కాపునేత వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ వంగవీటి రంగా మృతి అనంతరం కాపులను ఒక తాటిపైకి తీసుకువచ్చే నాయకుడే కరువయ్యాడన్నారు. కాపుల సంఘాలను, నాయకులను ఒక తాటిపైకి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. సంఘం కార్యదర్శి అనుకుల రమేష్ మాట్లాడుతూ తుని కేసులో యావత్తు కాపుజాతిని నిందించాల్సిన పనిలేదని, కాపు కార్పొరేషన్‌కు కేటాయించే రూ.1,000 కోట్లలో ఆరోజు కలిగిన నష్టం ఆరుకోట్లను తీసుకుని, కాపులపై అన్యాయంగా పెడుతున్న కేసులను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు, నవోదయంపార్టీ అధ్యక్షుడు నల్లకవిజయరాజు, జిల్లా చాంబర్ కామర్స్ అధ్యక్షుడు, నగర కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నందెపు శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్ మంచాల బాబ్జీ, సంఘం సెక్రటరీ తాడికొండ విజయలక్ష్మి, రాష్ట్రయూత్ ప్రెసిడెంట్ వెలిశెట్టి శ్రీహరిరావు(రాయులు), ప్రధానకార్యదర్శి రాయవరపు పెదబాబు, హజరయ్యలు మాట్లాడుతూ కాపులు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం వడ్డి మల్లిఖార్జున్ రచించిన ‘కాపు ప్రస్థానం’ పుస్తకాన్ని ముఖ్యఅతిథి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు, కాపునేతలు మారిశెట్టి రామారావు, అర్లపల్లి బోస్, జిల్లా యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్, కొల్లిమళ్ళ రఘు, వడ్డిమురళి, ప్రకాష్, ముద్దాల అను, పడాలశ్రీనివాస్, దొండపాటి సత్యంబాబు, రాయవరపు చినబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 11న కాపు ఉద్యమ కార్యాచరణపై సమావేశం
- హాజరుకానున్న 13 జిల్లాల ప్రతినిధులు - రెండో దఫా హైదరాబాద్‌లో సమావేశం: జేఏసీ నేతలు సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా) కాపులను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ గడువు ఆగస్టు 30తో ముగిసినా ఇప్పటి వరకు కమిషన్ నివేదిక ఇవ్వలేదని కాపు రిజర్వేషన్ల ఐక్య కార్యాచరణ సమితి నేతలు మండిపడ్డారు. తొమ్మిది నెలల సమయంలో ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ కమిషన్ పర్యటించలేదని, ముద్రగడ పద్మనాభం దీక్ష సమయంలో టీడీపీ మంత్రులు, నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 11న ఉదయం తొమ్మిది గంటలకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బార్లపూడి కల్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి 13 జిల్లాల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రతినిధులు హాజరవుతున్నారని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్టుమూర్తి తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. సమావేశంలో ఇప్పటి వరకు వచ్చిన ఉద్యమ ఫలితాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు ఆచరణలోకి వచ్చాయన్న అంశంపై చర్చించనున్నామని తెలిపారు. అనంతరం టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల సాధనకు ప్రతినిధులు సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ఈ అంశాలను రెండో దఫా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే సమావేశంలో దాసరి నారాయణ రావు, చిరంజీవి తదితర ముఖ్యనేతలతో చర్చించి తుది కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఉద్యమానికి పవన్ కల్యాణ్ మద్దతు కోరతామని చెప్పారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపిన వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం సరికాదని హితవు పలికారు. 11న జరిగే సమావేశానికి వచ్చే కాపు నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో బెదిరిస్తోందని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో కాపు నేతలు ఆకుల వీర్రాజు, రామినీడు మురళీ, నందెపు శ్రీనివాస్, అల్లు శేషునారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
కాపుగల్లు క్వారీలో పేలుళ్లు
– ముగ్గురికి తీవ్రగాయాలు కోదాడ: అనుభవం లేని కార్మికులతో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను అమర్చగా అవి ప్రమాదవశాత్తు పేలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు శివారులో చోటు చేసుకుంది. పేలుళ్ల సంఘటనను పక్కదారి పట్టించేందుకు క్వారీ యజమానులు దానిని ట్రాక్టర్ ప్రమాదంగా చిత్రీకరించారు. ఇదే ప్రాథమిక సమాచారాన్ని పత్రికలకు ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కాపుగల్లు శివారులో విజయలక్ష్మిస్టోన్ క్రషర్ ఉంది. దీనికి రాళ్లను సరఫరా చేసేందుకు పక్కనే ఉన్న బండను లీజుకు తీసుకున్నారు. దానిని పేల్చడానికి నకిరేకల్ మండలం గోరెంకలపల్లికి చెందిన ముగ్గురు కార్మికులు ఆదివారం రాత్రి 5 బాంబులను(జిలెటిన్‌స్టిక్స్) అమర్చారు. అందులో మూడు పేలాయి. మరో రెండు పేలలేదు. సోమవారం ఉదయం అందులో పేలుడు పనులను చూస్తున్న సంపంగి బాబు, ఎ.రామకష్ణ, బాలరాజులు పేలని జిలెటిన్ స్టిక్స్‌ను బయటకు తీస్తుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో వీరు ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. క్వారీ నిర్వాహకులు, తోటి కార్మికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితులు దూర ప్రాంతానికి చెందిన వారు కావడంతో, వారి తరఫున మాట్లావారు ఎవ్వరూ లేక పోవడంతో క్వారీ నిర్వాహకులు పేలుళ్ల సంఘటనను కప్పిపుచ్చారు. ట్రాక్టర్ బోల్తాపడడం వల్ల గాయాలయ్యాయని చెప్పారు. తోటి కార్మికులకు కూడా అలాగే చెప్పాలని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కోదాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. చిన్నప్రమాదమే.. ప్రమాదవశాత్తు క్వారీలో చిన్న సంఘటన జరిగిందని క్వారీ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్మికులకు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని, కాని వారి క్షేమం కోసం మెరుగైన చికిత్సకు హై దాబాద్ తీసుకెళ్లామని, గాయపడిన కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. -
'ఉద్యమాన్ని అణిచేందుకే పవన్ తెరపైకి'
హైదరాబాద్: కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకే జననేత అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై స్పందించని పవన్ ఇంతకాలం ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పవన్‌కు తెలియదా అని అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్.. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌ను తిట్టినా, కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినా ఊరుకోమని వీహెచ్ హెచ్చరించారు. -
దాసరితో ముద్రగడ పద్మనాభం భేటీ
-
దాసరితో ముద్రగడ పద్మనాభం భేటీ
కాపు ఉద్యమం మళ్లీ ఊపందుకుంటోంది. కాపులను బీసీలలో చేర్చాలంటూ గతంలో తాను చేసిన ఆమరణ దీక్షకు మద్దతు ఇచ్చినవారందరినీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వరుసగా కలుస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావును ఆయన ఇంట్లో కలిశారు. తన దీక్ష సందర్భంగా సంఘీభావం తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముద్రగడతో పాటు కాపు నేతలు అంబటి రాంబాబు తదితరులు కూడా ఉన్నారు. దాసరితో భేటీ అనంతరం చిరంజీవిని కూడా ముద్రగడ పద్మనాభం కలవనున్నారు. ఇక మంగళవారం నాడు దాసరి నారాయణరావు నివాసంలో కాపు నేతలు అధికారికంగా భేటీ కానున్నారు. -
కాపు విద్యార్థులకు టైం ఉచిత శిక్షణ
మురళీనగర్: కాపు విద్యార్థులకు(ఓసీ) పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామని టైమ్ కోఆర్డినేటర్ మేడిది రాజశేఖర్ చెప్పారు. కాపు వెల్ఫేర్ కార్పొరేషన్‌తో ఒప్పందం మేరకు ఈ శిక్షణ తరగతులు మూడు నెలలపాటు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో ఎస్ఎస్సి, బ్యాంకు, జీఆర్ఈ, గేట్, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణనివ్వడమే కాకుండా మెటీరియల్ కూడా సరఫరా చేస్తామన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన యువతీ యువకులు (18–30 ఏళ్లలోపు వయసు) దరఖాస్తు చేసుకోవాలన్నారు. నగరంలోని ఎన్ఏడీ, గాజువాక, రాజేంద్రనగర్, మధురవాడలోని టైమ్ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని సూచించారు. వీరు కులం ధ్రువీకరణ (ఓసీ), పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమోతోపాటు ఇతర సర్టిఫికెట్లు, మూడు ఫొటోలు, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలను సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వివరాలకు 9246670639 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. వీరికి శిక్షణతోపాటు ఉపకార వేతనం కూడా ఇస్తారని చెప్పారు. -
కాపులకు మరో షాక్!
కాపులందరికీ రుణాలిస్తామని హామీ ఇచ్చి అనంతరం కోతలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సబ్సిడీ విషయంలోనూ కొర్రీలు వేసింది. సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసే సమయంలో కాకుండా యూనిట్ స్థాపించి రెండేళ్లు నడిపిన తర్వాతే ఇవ్వాలని (బ్యాక్ ఎండ్ సబ్సిడీ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్నూలు: కాపులందరికీ రుణాలిస్తామని హామీ ఇచ్చి అనంతరం కోత పెట్టిన ప్రభుత్వం.. తాజాగా సబ్సిడీ విషయంలోనూ కొర్రీలు వేసింది. సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసే సమయంలో కాకుండా యూనిట్ స్థాపించి రెండేళ్లు నడిపిన తర్వాతే ఇవ్వాలని(బ్యాక్ ఎండ్ సబ్సిడీ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 14న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన అన్ని జిల్లాల బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ)లకు కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) ఆర్.అమరేంద్రకుమార్ లేఖలు రాశారు. యూనిట్లు పెట్టుకునేందుకు ఇది దోహదపడుతుందని భావించే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా రుణం, సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న కాపులకు నిరాశే ఎదురుకానుంది. రిజర్వేషన్ల పేరుతో కాపులను మోసం చేసిన ప్రభుత్వం.. రుణాల విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ రుణాల తరహాలోనే.. మార్చి 19న ఎస్సీ కార్పొరేషన్‌కు జారీ చేసిన జీఓ నంబర్ 32ను కాపు కార్పొరేషన్‌కూ వర్తింప చేస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఇదే ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 16ను సవరిస్తూ అన్ని జిల్లాల బీసీ కార్పొరేషన్లకు లేఖలు రాయడం కాపుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో కాపు లబ్ధిదారులకు దీనిని వర్తింపజేయనున్నారు. దీని ప్రకారం లబ్ధిదారులకు ముందస్తుగా బ్యాంకు రుణం నగదుగా అందజేస్తే, దాని ఆధారంగా యూనిట్‌ను ప్రారంభించాలి. ఈ యూనిట్‌ను బీసీ కార్పొరేషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వారు తనిఖీ చేసిన సమయంలో యూనిట్ సక్రమంగా నడుస్తుందా? లేదా? అనే విషయాలను గుర్తించి జీయో ట్యాగింగ్ ద్వారా ఉన్నతాధికారులకు ఫొటోలను పంపిస్తారు. యూనిట్ సక్రమంగా కొనసాగుతుంటే.. రెండు సంవత్సరాల తర్వాత సబ్సిడీని విడుదల చేయనున్నారు. ఈ నిబంధన వల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చేది లేదు.. తాము యూనిట్లు ప్రారంభించేది లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. ఊరించి.. ఉసూరుమనిపించారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1.05 లక్షల మంది కాపులకు రుణాలు అందించాలన్న లక్ష్యం ఆర్థిక సంవత్సరం ముగిసినా నేరవేరలేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 3,53,479 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 30,822 మంది దరఖాస్తులను మాత్రమే ఎంపిక చేశారు. తీరా వీరిలో సగం మందికి కూడా ఇంకా సబ్సిడీ విడుదల కాలేదు. కాపు కార్పొరేషన్లో అమలు చేయనున్న బ్యాక్ అండ్ సబ్సిడీ సెగ ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన (స్పిల్ ఓవర్) రుణాలకు తగలనుంది. ఇప్పటి వరకు మంజూరైన రుణాలను మినహాయిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరయ్యే రుణాలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతా నంబర్లు సమర్పించడంలో, కవరింగ్ లెటర్, ఈ పేమెంట్ సెక్షన్లో పెండింగ్‌లో ఉన్న వాటికి కూడా ఈ విధానం అమలు కానుంది. -
కడదాకా ఉద్యమిస్తా
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ - నమ్ముకున్న జాతి కోసం పనిచేస్తా - ప్రభుత్వం నన్ను ప్రపంచ ఉగ్రవాదిలా చిత్రీకరించింది సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేసినా ఉద్యమం నుంచి వెనకడుగు వేయబోనని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకూ ఉద్యమిస్తానని చెప్పారు. తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం కక్షకట్టి వేధింపులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో ఆమరణ దీక్ష విరమించిన అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘‘తుని ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన తరువాత అరెస్టులు చేస్తామన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని మరచి అరెస్టులు మొదలు పెట్టారు. ఈ నెల 7న అమలాపురం వెళ్లి నన్ను అరెస్టు చేయమని కోరాను. కేసులు లేవన్నారు. 9వ తేదీ వచ్చేసరికి 69 కేసులు పెట్టారని, నాపై సెల్‌ఫోన్ దొంగతనం కేసు కూడా పెట్టారని తెలిసింది. 9వ తేదీన ఉదయం అరెస్టు చేయడానికి వచ్చామని ఎస్పీ, ఓఎస్డీ చెప్పారు. సమయం ఇవ్వాలని అడిగినా వినలేదు. మీడియాను బయటకు పంపించి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. ఇది కక్ష సాధింపు కాక మరేమిటి? నన్నయితే గౌరవంగానే తీసుకెళ్లారు. నా భార్యను బండబూతులు తిట్టుకుంటూ ఎత్తి బస్సులో కుదేశారు. నా భార్య పేషెంట్. నా కోడలిని కూడా అదే పదజాలంతో తిట్టి లాక్కెళ్లారు. నా కొడుకును కొట్టుకుంటూ తీసుకెళ్లారు. నా బావమరిదిని, ఆయన భార్యను కూడా వదలలేదు. ఇదేం పాలన? నా శరీరంలో సెలైన్ బాటిళ్లున్నాయి మాపట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని కోరను, వారి కర్మ వారే అనుభవిస్తారు. భగవంతుడు చూస్తాడు. నా కుటుంబానికి జరిగిన అవమానం బహుశా ఏ రాజకీయ నాయకుడికీ జరగకపోవచ్చు. మమ్మల్ని అవమానించిన వారికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడని ఎదురు చూస్తున్నాను. బాధ్యులకు భగవంతుడు వేసే శిక్ష పడే వరకూ మా ఇంట్లో సంక్రాంతి, ఉగాది, వినాయకచవితి, నవమి, దశమి... ఇలా ఏ పండుగా చేసుకోం. ఇప్పుడు నా శరీరంలో రక్తం లేదు. సెలైన్ బాటిళ్లున్నాయి. ఆస్పత్రిలో పత్రిక కూడా ఇవ్వలేదు పోరాడే శక్తిని కోల్పోయినా ఉద్యమం నుం చి వెనక్కిపోను. నన్ను నమ్ముకున్న జాతి, ఇతర కులాల కోసం పనిచేస్తాను. జేఏసీని ముందు పెట్టి వారి వెనకాల నేను నడ వాల ని, ఉద్యమాన్ని వదలకూడదని నిర్ణరుుంచుకున్నాను. కాపులను బీసీల్లో చేరుస్తామం టూ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రాణమున్నంత వరకూ పోరాడుతా. అలా అడిగినందుకే ప్రపంచ ఉగ్రవాది మాదిరిగా చిత్రీకరించి మీడియాకు, ప్రజలకు తెలియకుండా 14 రోజులు ఆస్పత్రిలో బంధించారు. సెంట్రల్ జైలులో ఉన్నవారికి వార్తా పత్రిక ఇస్తారు. నాకు అది కూడా ఇవ్వకుండా అవమానించారు. నాకు సంఘీభావం ప్రకటించిన వారందరికీ ే పాదాభివందనం చేసుకుంటున్నాను. అన్నం పెట్టిన చేతులనే నరికేశారు మా ఇంట్లో ఎంతో మంది అధికారులకు భోజనం పెట్టాను. పోలీసు స్టేషన్లో ఫంక్షన్ అయితే వారికి కావల్సినవి సమకూర్చాం. ఊరిలో ఫంక్షన్లకు అన్ని ఆఫీసులతోపాటు పోలీసు స్టేషన్లలో సిబ్బందిని కూడా పిలిచాం. అలా అన్నం పెట్టిన నా చేతులను నరికేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇలానే ఉందని సరిపెట్టుకుంటాను’’ అని ముద్రగడ పద్మనాభం చెప్పారు. అండగా వైఎస్సార్సీపీ కాపుల ఉద్యమం, ముద్రగడ దీక్షకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తొలినుంచీ అండగా నిలిచారు. ప్రభుత్వ దమనకాండపై నిప్పులు చెరిగారు. కాపుల పోరాటాన్ని విచ్ఛిన్నానికి సర్కారు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో సైతం కాపు ఉద్యమానికి మద్దతుగా తీర్మానాన్ని ఆమోదించారు. ముద్రగడ ఆమరణ దీక్ష విరమణ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 14 రోజుల తర్వాత బుధవారం ఆమరణ దీక్ష విరమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి నుంచి బుధవారం కిర్లంపూడిలోని స్వగృహానికి చేరుకున్న ముద్రగడకు, ఆయన భార్య పద్మావతికి కాపు ఉద్యమ నాయకులు, జేఏసీ నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాపు నేతలు, అభిమానులు తరలిరావడంతో ముద్రగడ నివాసం కోలాహలంగా మారింది. రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడి వరకు దారిపొడవునా కాపు సామాజికవర్గం ముద్రగడకు ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, కాపు ఉద్యమాన్ని ప్రసారం చేయని టీవీ చానళ్లు, పత్రికలకు వ్యతిరేకంగా కాపు యువకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నిష్పక్షపాతంగా ప్రసారాలు చేసిన సాక్షి టీవీ, వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ జిందాబాద్ అంటూ నినదించారు. తునిలో కాపు ఐక్యగర్జనలో చోటుచేసుకున్న ఘటనల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ కిర్లంపూడిలో ఈ నెల 9నుంచి కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష చేపట్టారు. అదే రోజు సాయంత్రం పోలీసులు ఆయనను బలవంతంగా రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.ఆరు పదుల వయస్సులో ఆరోగ్య సమస్యలున్నా లెక్క చేయకుండా ముద్రగడ 14 రోజులపాటు దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తుని ఘటనల్లో అరెస్టు చేసిన 13 మందిని బెయిల్‌పై విడుదల చేసింది. దీంతో దీక్ష విరమించారు. -
సడలని దీక్ష
కొనసాగుతున్న కాపునేత ముద్రగడ దీక్ష.. సాక్షిప్రతినిధి, కాకినాడ/ రాజమహేంద్రవరం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష కొనసాగుతోంది. చంద్రబాబు సర్కార్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తుని కాపు ఐక్య గర్జనలో చోటుచేసుకున్న ఘటనల్లో అక్రమంగా అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయక తప్పింది కాదు. అయితే మంగళవారం సాయంత్రం విడుదలైన కాపు జేఏసీ నేతలు ముద్రగడను కలిసేందుకు పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన 13 మంది కాపు నేతలు విడుదలై తన వద్దకు వచ్చిన తర్వాతే దీక్ష విరమిస్తానని జేఏసీ నేతలతో విశాఖ డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు జరిపిన చర్చల సందర్భంగా ముద్రగడ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దానికి వారు కూడా అంగీకరించారు. ఆ మేరకు సీఐడీ అరెస్ట్ చేసిన 13 మందిలో 10 మందికి బెయిల్ శనివారం లభించింది. కానీ వారిలో ఎనిమిది మంది విడుదలవగా, మిగిలిన ఇద్దరు కూరాకుల పుల్లయ్య, లగుడు శ్రీనివాస్ సోమవారం రాత్రి, మిగిలిన ముగ్గురు కాపు నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసుకు సోమవారం బెయిల్ మంజూరైనా మంగళవారం రాత్రి విడుదలయ్యూరు. వారు ముద్రగడతో దీక్ష విరమింపజేయడానికి ఆస్పత్రికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. చర్చల సందర్భంగా ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చడం తగదని జేఏసీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగినా ఫలితం లేకుండాపోరుుంది. దీంతో ముద్రగడ వద్దకు పంపేవరకూ తాము కదలబోమని వారు జైలు వద్దే బైఠారుుంచారు. ముద్రగడ ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ప్రభుత్వం ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తోందని జేఏసీ నేతలు మండిపడ్డారు. జైలు వద్ద వారు విలేకర్లతో మాట్లాడుతూ.. చర్చల సమయం లో ఒకలా ఇప్పడు మరోలా మాట్లాడుతూ ప్రభుత్వం తమను రెచ్చగొట్టేందుకు యత్నిం స్తోందని విమర్శించారు. తాము వెళ్లేవరకూ దీక్ష విరమించనని ముద్రగడ చెప్పిన విష యం, అందుకు ప్రభుత్వం అంగీకారం అన్ని పత్రికల్లో వచ్చిందని గుర్తు చేశారు. ముద్రగడ ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వారు మండిపడ్డారు. -
కక్ష సాధింపా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కాపు నాయకులపైనే కాదు కాపు సామాజిక వర్గ అధికారులపైనా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గ అధికారులను అకారణంగా బదిలీ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. కాపు ఉద్యమానికి అంతర్గతంగా మద్దతిస్తున్నారని, ఆ నేతలతో సత్సంబంధాలు నెరుపుతున్నారని ప్రభుత్వానికి కన్ను కుట్టినట్టు ఉంది. తమ చేతిలో ఉన్న బదిలీ అస్త్రాన్ని ప్రయోగించి అక్కసు వెళ్లగక్కుతోంది. ఇందుకు ఎక్సైజ్ శాఖ విజయనగరం డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి బదిలీనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడికొచ్చిన ఎనిమిది నెలల్లోనే అర్ధంతరంగా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసేసింది. విజయనగరం డిప్యూటీ కమిషనర్‌గా ఇక్కడకు వచ్చిన దగ్గరనుంచి ఆదర్శంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ సైకిల్‌పైనే కార్యాలయానికి వస్తూ వెళ్తుంటారు. తన ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. తన కార్యాలయంలో ఏసీలు వినియోగించరు. అదే కాకుండా జాతీయ నాయకుల జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నారు. సారా నియంత్రణ కోసం నిర్వహిస్తున్న నవోదయం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇంతవరకు ఆయనపై ఎటువంటి ఏసీబీ కేసుల్లేవు. శాఖా పరమైన చర్యలు కూడా లేవు. కానీ కాపు జాతి కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. అందువల్లే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆయనకు బదిలీ ఉత్తర్వులొచ్చేశాయి. ప్రభుత్వానికి రిపోర్టు కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తననెందుకు బదిలీచేశారో తెలీదని, తనపై ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ఇప్పటికే తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాననీ, ఇంతలోనే బదిలీ విషయం తెలుసుకుని షాక్ అయ్యానని చెప్పారు. -
సీఎం చంద్రబాబు, మంత్రి రావెలలు రాహుకేతువులు
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు పట్నంబజారు:- రాష్ట్రానికి రాహుకేతువుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి రావెల కిషోర్‌బాబులు దాపురించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు, చవాకులు పేలుతున్న మంత్రి రావెలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గుణపాఠం చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రావెలే పెద్ద శనీశ్వరుడన్న విషయాన్ని ఆయన గుర్తించాలని హితవుపలికారు. రావెల ఒక మానసిక రోగిలా వ్యవహరిస్తూ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాపు ఉద్యమంపై మాట్లాడే హక్కులేదు కాపు ఉద్యమం గురించి మాట్లాడే హక్కు రావెలకు ఏమాత్రం లేదన్నారు. రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టని రావెల దళిత జాతి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న జగన్‌పై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. -
మోసకారి ముఖ్యమంత్రిని నమ్మకండి
► పూతలపట్టు ఎమ్మెల్యేసునీల్ కుమార్ ► కాపునాయకుల దీక్షకు మద్దతు యాదమరి: ‘మోసకారి ముఖ్యమంత్రిని నమ్మకండి, పద వి కావాలంటే ఒక మాట, ప దవి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతారు, ఆయ న పదవి కోసం మిమ్మల్నే కా దు, సొంత మనుషులను సై తం నట్టేట ముంచేస్తారు’ అని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ధ్వజమెత్తారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు సంఘీభావంగా శనివారం మండల కేంద్రంలో కాపు సం ఘం మండల నాయకులు దీక్ష చేశారు. వారికి ఎమ్మెల్యే తో పాటు మండల వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలి పారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు నా ల్కల ధోరణలో వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు, అధి కారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని మండి పడ్డారు. గుడిపాల మండల కాపు సంఘం నాయకుడు మ దురాయల్, కాంగ్రెస్ చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కి, యాదమరి ఎంపీపీ రాధమ్మ, వై ఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ధనంజయరెడ్డి, సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు మనోహర్రెడ్ది, నాయకులు మనోహర్, గోవిందనాయుడు, మా ర్కొండనాయుడు తదితరు లు పాల్గొన్నారు. -
ముద్రగడ దీక్ష విరమణలో ప్రతిష్టంభన
- తుని ఘటనలో అరెస్ట్ చేసిన 13 మంది విడుదలలో జాప్యం - సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది మంది విడుదల - అందరూ విడుదలైతేనే దీక్ష విరమణ అంటున్న ముద్రగడ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష విరమణపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఆయన ఆరోగ్యం అపాయకర పరిస్థితికి చేరినప్పటికీ దీక్ష విరమింపజేసే విషయంలో సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కాపు ఐక్యగర్జన సందర్భంగా తునిలో చోటుచేసుకున్న ఘటనలో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ, చేపట్టిన ఆమరణ దీక్ష శనివారానికి పదవరోజుకు చేరుకుంది. మాటతప్పిన ప్రభుత్వం...: ప్రభుత్వం ఇచ్చినమాట ప్రకారం శనివారం 13 మంది విడుద లవుతారు.. ముద్రగడ దీక్ష విరమిస్తారని భావించారు. కానీ బెయిల్ మంజూరైన పదిమందిలో 8మందే విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు సమర్పించకపోవడంతో కూరాకుల పుల్లయ్యను విడుదల చేయలేదు. మరోవైపు కోటనందూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లగుడు శ్రీనుకు బెయిల్ లభించినా సీఐడీ పోలీసులు తమ కస్టడీకి తీసుకోవడం గమనార్హం. మొత్తం 13 మంది విడుదలకు అన్నిచర్యలూ తీసుకుంటామని ఇచ్చినమాటను సర్కారు తప్పింది. ఆహారం తీసుకోకుంటే ప్రమాదమే ముద్రగడ బలవంతంమీద ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు.ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టు కాదని, ఆహారం తీసుకోకుంటే ప్రమాదమని అంటున్నారు. ముద్రగడ భార్య పద్మావతి కడుపునొప్పితో బాధపడుతున్నారు. పరీక్షలు చేస్తే ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. బలప్రయోగం.. నిరసనలు ఒకపక్క ముద్రగడ దీక్ష విరమణను కొలిక్కితెస్తున్నట్టు ప్రభుత్వం చెబుతూనే మరోపక్క కాపు ఉద్యమాన్ని పోలీసు బలప్రయోగంతో అణచివేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న కాపు యువకులపై పోలీసులు లాఠీచార్జి చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించేశారు. ముద్రగడ కుమారుడు, కోడలు దీక్ష విరమణ కంబాలచెరువు: ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి, కోడలు సిరి ఆరోగ్యం విషమంగా ఉండడంతో శనివారం రాత్రి 11 గంటలకు దీక్ష విరమించారు. వారిని సొంత వాహనాల్లో వైద్య చికిత్సకోసం విశాఖపట్నం తీసుకెళ్లారు. -
‘ముద్రగడ’ను హేళన చేస్తున్న మంత్రులు
► తాలూకా కాపు జన సంఘం అధ్యక్షుడు శివయ్య ► సత్తెనపల్లిలో రంగా విగ్రహానికి క్షీరాభిషేకం సత్తెనపల్లి : కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమాన్ని హేళన చేసే మంత్రులకు పుట్టగతులు ఉండవని సత్తెనపల్లి తాలూకా కాపు జన సంఘం అధ్యక్షుడు ఆకుల శివయ్య అన్నారు. పట్టణంలోని నాగార్జున నగర్లో రంగా విగ్రహానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ ముద్రగడ నిజాయితీగా చేస్తున్న ఉద్యమాన్ని కాపు మంత్రులు హేళనగా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తానని, గద్దెనెక్కి రెండేళ్లైనా పట్టించుకోలేదని, ముద్రగడ దిక్షకు దిగగానే రూ.వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించారని చెప్పారు. ఈ కేటాయింపు కాపు మంత్రుల వల్ల కాదన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. కాంట్రాక్టర్ల కోసం పోరాడే కాపు మంత్రులు, కాపు జాతి కోసం పోరాడే ముద్రగడను అవమానించడం సబబు కాదని తెలిపారు. కాపులు ఓట్లు వేస్తేనే గెలిచి మంత్రులు అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు కె.అర్జునరావు, మాదంశెట్టి వేదాద్రి, కొత్తా భాస్కర్, బగ్గి నరహారావు, ఆవుల వెంకటేశ్వర్లు, అంచుల సాంబశివరావు, బి.వేణు, వల్లెం నరసింహారావు, కోటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, నరేంద్ర, తవిటి భావన్నారాయణ, ఆకుల హనుమంతరావు, పి.వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు, ఆకుల సుబ్బారావు, ఎ.వెంకట మల్లేశ్వరరావు, చంటి తదితరులు ఉన్నారు. -
వారిని విడుదల చేస్తేనే విరమణ
- అరెస్టయిన 13 మందిని విడుదల చేయాల్సిందే - అలా కాకుంటే 30 రోజులైనా దీక్షను కొనసాగిస్తా - కాపు ఉద్యమ నేత ముద్రగడ స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘నాకు హామీలు కాదు.. చెప్పిన మాటలు ఆచరణలో పెట్టండి.. నాకేమైనా ఫర్వాలేదు.. ఆ 13 మందిని బయటకు తీసుకొచ్చి అప్పగించండి.. అలా కాకుంటే మూడ్రోజులు కాదు.. జాతికోసం 30 రోజులైనా ఆమరణ దీక్ష చేస్తా..’ ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాటలివి. బుధవారం చర్చల సందర్భంగా మాట్లాడుతూనే మగతలోకి వెళ్లిపోతున్న ముద్రగడను చేతులతో పట్టుకుని పైకిలేపి కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితిని చూసి కాపు జేఏసీ నేతలు తీవ్రంగా చలించిపోయి కంటతడి పెట్టారు. వైద్య పరీక్షలు చేరుుంచుకోవాలని పదేపదే బతిమలాడడంతో తొలుత రక్త పరీక్షలకు ముద్రగడ అంగీకరించారు.దీంతో సెలైన్ కూడా పెట్టారు. అయినా ఆమరణ దీక్షను మాత్రం విరమించేది లేదని, ఆయన తేల్చి చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు. తుని ఘటనలో అక్రమంగా అరెస్టు చేసిన 13 మందిని విడుదలచేసి తన వద్దకు తీసుకువచ్చిన తరువాతే దీక్ష విరమిస్తానని ముద్రగడ స్పష్టం చేయడంతో ప్రభుత్వం నుంచి చర్చలకు వచ్చిన డీఐజీ శ్రీకాంత్, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ రవిప్రకాశ్, జేసీ సత్యనారాయణ సానుకూలత వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జేఏసీ నేతలు, ముద్రగడ తనయుడు బాలు బుధవారం రాత్రి వేర్వేరుగా విలేకర్ల సమావేశాల్లో ధ్రువీకరించారు. రిమాండ్‌లో ఉన్న వారిని రప్పించి.. ముద్రగడ దీక్ష బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. మంగళవారం ప్రారంభమైన చర్చల ప్రక్రియ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగింది. వైద్యానికి సహకరించాలన్న అధికారుల ప్రతిపాదనకు ముద్రగడ ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న కాపు ఉద్యమనేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వీవై దాసు, గణేషుల రాంబాబును ఆస్పత్రికి తీసుకువచ్చి దీక్ష విరమింపచేసేలా ముద్రగడతో మాట్లాడించారని సమాచారం. కానీ డీఐజీ, ఇతర పోలీసు అధికారులు మాత్రం రిమాండ్‌లో ఉన్నవారికి వైద్యం కోసమే ఆస్పత్రికి తెచ్చామని చెప్పుకొచ్చారు. చర్చల్లో ఉత్కంఠ..:కేసులు ఎత్తివేయడమనే అంశంపై చర్చల్లో కొన్ని గంటలపాటు ప్రతిష్టంభన కొనసాగింది. కాపు జేఏసీ నేతలు అడపా నాగేంద్ర, మిండగుదిటి మోహన్, గుండా వెంకటరమణ, చినమిల్లి వెంకటరాయుడు, యాళ్ల దొరబాబు, ఆరేటి ప్రకాష్ తదితరులు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంట్లో సమావేశమై అరెస్టు చేసిన వారి విడుదల, ఇక ముందు అరెస్టులు జరపకూడదనే డిమాండ్లు ప్రభుత్వం ముందుంచాలని నిర్ణయించారు. వీటికి అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. తుని ఘటనలో లోతైన విచారణ నిర్వహించాక తదనంతర చర్యలు, అరెస్టయిన 13 మందిని ఒకటి, రెండు రోజుల్లో బెయిల్‌పై విడుదల చేయిస్తామని డీఐజీ శ్రీకాంత్ హామీ ఇచ్చి చర్చలను కొలిక్కి తెచ్చారు. -
కాపు జేఏసీతో చర్చలు విఫలం
- డిమాండ్లు అంగీకరిస్తేనే దీక్ష విరమణ అన్న ముద్రగడ - కొనసాగుతున్న దీక్ష, విషమిస్తున్న కాపునేత ఆరోగ్యం - ముద్రగడ భార్య, కోడలికి వైద్యం సాక్షి ప్రతినిధి కాకినాడ: తన డిమాండ్లు అంగీకరిస్తేగానీ నిరాహార దీక్ష విరమించేదిలేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ముద్రగడ తరుఫున కాపు జేఏసీ, ప్రభుత్వం మధ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తుని ఘటనలో అరెస్టయినవారి విడుదల, ఇకపై అరెస్టుల నిలుపుదల డిమాండ్లు అంగీకరించే వరకూ దీక్ష విరమించబోనని ముద్రగడ తేల్చి చెప్పారు. డిమాండ్లపై జేఏసీ నేతలు రెండో దఫా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో చర్చించారు. ప్రభుత్వం తరుఫున ఈ చర్చలకు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ హాజరయ్యారు. అయినా చర్చలు కొలిక్కిరాలేదు. తుని ఘటనలో నమోదైన కేసుల పునర్విచారణ, అరెస్టుల నిలుపుదల అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని జేఏసీ నేతలకు జాయింట్ కలెక్టర్ వివరించారు. దీంతో చర్చలు బుధవారం నాటికి వాయిదా పడ్డాయి. వైద్యం పేరుతో చర్చలకు సర్కార్... ముద్రగడ, కుటుంబ సభ్యులు ఆమరణ దీక్ష చేస్తున్న రాజమంహేద్రవరం జిల్లా ఆస్పత్రికి మంగళవారం మధ్యాహ్నం డీఐజీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాశ్ వచ్చి వైద్యం చేయించుకోవాలని వారికి సూచించారు. బాగా నీరసించిన ముద్రగడ భార్య పద్మావతి, కోడలు సిరిలకు బలవంతంగా వైద్యం ప్రారంభించారు. ముద్రగడ మాత్రం వైద్యానికి నిరాకరించారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ముఖ్య నేతలతో సీఎం మంతనాలు సాక్షి, విజయవాడ బ్యూరో: ముద్రగడ దీక్ష విషయంలో ఏం చేయాలనేదానిపై మూడురోజుల నుంచి తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నారు. పార్టీకి చెందిన కాపు మంత్రులు, ముఖ్య నేతలతో విజయవాడలోని తన నివాసంలో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ముద్రగడపై ఆత్మహత్యాయత్నం కేసు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): ముద్రగడ, ఆయన భార్య పద్మావతి, కుమారుడు, కోడలిపై మంగళవారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాకినాడ జీజీహెచ్‌కు చెందిన డాక్టర్ సౌభాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు సాక్షి, హైదరాబాద్: ముద్రగడను హైదరాబాద్‌లో అన్ని వసతులున్న నిమ్స్‌కు గానీ, ఏదైనా సూపర్ స్పెషాలటీ ఆసుపత్రికి గానీ తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి శ్రీధర్ లక్ష్మణ్ దాఖలు చేశారు. -
కాపుల ఆందోళనతో ఎమ్మెల్యే కార్యక్రమం రద్దు
తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంఎల్లంశెట్టివారి పాళెం గ్రామంలో కాపులు ఆందోళనకు దిగడంతో ఆగ్రామంలో జరగాల్సిన పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. గ్రామంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే నారాయణమూర్తి మంగళవారం ఉదయం ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ముద్రగడకు మద్దతుగా గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో భయపడిన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. -
దీక్ష విరమణ ప్రసక్తే లేదు
- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ - ఐదో రోజుకు చేరిన ఆమరణ దీక్ష సాక్షిప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: కాపులకు బీసీ జాబితాలో చేరుస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష సోమవారం ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని, హామీలను నెరవేర్చే వరకూ దీక్ష విరమించేది లేదని ఆయన తాజాగా తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం పట్ల కాపులు మండిపడుతున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషమిస్తోందనే విషయం తెలియడంతో ఆందోళనకు గురైన అమలాపురానికి చెందిన సాధనాల బాలాజీ(30) గుండెపోటుతో మృతిచెందాడు. హెల్త్ బులెటిన్లలో గందరగోళం: ముద్రగడను కిర్లంపూడి నుంచి రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువచ్చిన దగ్గర నుంచి వైద్యులు రోజుకో రకమైన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. ఆదివారం వరకు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెబుతూ వచ్చిన వైద్యులు సోమవారం నిలకడగా ఉందని వెల్లడించారు. ముద్రగడ లేచి తిరుగుతున్నారని, చాలా హుషారుగా ఉన్నారని సోమవారం హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకోకుండా, ఎలాంటి వైద్యం పొందకుండా దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం ఒకరోజు ఆందోళనకరంగా, మరుసటి రోజు నిలకడగా ఎలా ఉంటుందని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. చర్చల ప్రసక్తే లేదు: ప్రభుత్వంతో చర్చలకు ముద్రగడ సానుకూలంగా ఉన్నారంటూ పత్రికల్లో (‘సాక్షి’లో కాదు) వచ్చిన వార్తలను ఆయన పెద్ద కుమారుడు బాలు ఖండించారు. తన తండ్రి నుంచి చర్చల ప్రస్తావన రాలేదని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరూ దీక్ష విరమించే ప్రసక్తే లేదని తన తండ్రి తేల్చి చెప్పారని వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ముద్రగడ పద్మనాభం అరెస్టు విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిందని న్యాయవాదులు, కాపు సద్భావన సంఘం నేతలు కె.రామజోగేశ్వర్రావు, సాయికుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చేరుకున్న వారు ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన హెచ్చార్సీ కేసు పరిశీలనకు మంగళవారానికి వాయిదా వేసింది. ముద్రగడ అరెస్టుపై కాపుల ఆందోళన: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్టును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో కాపులు ఆందోళన చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బైఠాయించారు. అధికారులకు వినపత్రాలు సమర్పించారు. ముద్రగడ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. -
కాపు నేతలపై నిఘా రెట్టింపు
రెండు జిల్లాల్లో ముఖ్య నేతలపై పోలీస్ కన్ను కీలక ప్రాంతాల్లో పహారా నిరసనలు నిర్వహించకుండా ముందస్తు కట్టడి యత్నాలు నేతలపై బైండోవర్ కేసులు ముద్రగడ దీక్ష నేపథ్యంలో చర్యలు విజయవాడ : కాపు ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో ఆ సామాజిక వర్గ నేతలపై పోలీసు నిఘా మరింత పెరిగింది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగానే కట్టడి వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో ముఖ్య కాపు నేతలు, కాపు సంఘాల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగానే అదుపులోకి... ముద్రగడ ఉద్యమం తీవ్రమైన నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో గత వారం రోజుల నుంచే పూర్తిస్థాయి నిఘా కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షి స్తూ పోలీస్ కమిషనర్‌కు నివేదిస్తున్నారు. ముద్రగడ ఆస్పత్రిలోనే ఉండి దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించటానికి యత్నించే కాపు నేతల్ని ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. విజయవాడలో కాపులు అధికంగా నివసించే కృష్ణలంక, భవానీపురం, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో పికెటింగ్‌లు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బెంజ్‌సర్కిల్, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ పహరా కొనసాగుతోంది. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమం నిర్వహించినా చర్యలు తప్పవని స్థానిక స్టేషన్ల సీఐల ద్వారా కాపు నాయకులకు సమాచారం పంపారు. దీంతో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించకుండా ముందుగా కట్టడి చేశారు. మరోవైపు గుంటూరు నగరంలోనూ నిరసన కార్యక్రమాల కట్టడికి నిఘా పెట్టారు. తెలగ, బలిజ, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రామును ముందస్తు విచారణ పేరుతో రెండు రోజుల పాటు లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి పంపటం, మళ్లీ ఉదయం స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెట్టడం చేస్తున్నారు. గుంటూరు, పెదకాకాని, రేపల్లె, పొన్నూరుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. బైండోవర్ హడావుడితో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కాపు నేతలు విమర్శిస్తున్నారు. ఉద్యమంపై ఉక్కుపాదం... రాష్ట్ర ప్రభుత్వం కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపే దిశగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రెండు జిల్లాల్లో ఉద్యమం జరగకుండా ముందస్తు చర్యలతో పాటు కాపు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీస్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతల కదలికలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అవసరమైతే వినియోగించటానికి వీలుగా స్పెషల్ పార్టీ పోలీసులను సిద్ధంగా ఉంచారు. -
విషమించిన ముద్రగడ ఆరోగ్యం
- పూర్తిగా విషమించిన ముద్రగడ ఆరోగ్యం - నాలుగో రోజుకు ఆమరణ దీక్ష - వైద్య పరీక్షలు, చికిత్సకు నిరాకరిస్తున్న పద్మనాభం - నేడు ‘చలో రాజమహేంద్రవరం’ పిలుపునిచ్చిన కాపునాడు సాక్షిప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాలుగో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందన్న సమాచారంతో కాపు వర్గీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాపుల పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. మహిళలు, విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోమవారం ‘చలో రాజమహేంద్రవరం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు నాడు ప్రకటించింది. ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలు, యువకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఖాళీ కంచాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. కాగా సాక్షి సహా పలు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని సోషల్ మీడియాలో పలువురు ఎండగడుతున్నారు. ముద్రగడ ఆరోగ్యంపై బులెటిన్ ఆమరణ దీక్ష చేపట్టి నాలుగు రోజులైనా వైద్య పరీక్షలకు, వైద్యానికి ముద్రగడ నిరాకరిస్తుండటంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఆదివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే గాని ముద్రగడ ఆరోగ్యం ఎంతవరకు క్షీణించిందనేది చెప్పలేమని రాజమహేంద్రవరం వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ చెప్పారు. ముద్రగడ సతీమణి, కోడలికి బలంవంతంగా ఫ్లూరుుడ్స్ పెట్టగా, చిన్న కుమారుడు గిరి ఆమరణ దీక్షలోనే ఉన్నారు. టీడీపీకి కాపుల రాజీనామాలు ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం చంద్రబాబుకు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ఉన్న కాపులు గట్టి షాక్ ఇచ్చారు. ప లు గ్రామాల్లో టీడీపీకి కాపు నేతలు రాజీనా మా చేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ ము ద్రగడను కలిసేందుకు రాజమహేంద్రవరం రాగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి తిప్పి పంపేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆందోళనతో అభిమాని మృతి కొత్తపల్లి: ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందనే విషయం తెలుసుకున్న మేడిశెట్టి నూకరాజు అనే అభిమాని ఆదివారం రాత్రి మృతిచెందాడు. గుండెపోటుతో ముద్రగడ బంధువు కూడా... కిర్లంపూడి: ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించిన దృశ్యాలను టీవీలో వీక్షించిన ఆయన సమీప బంధువు, కిర్లంపూడి రిటైర్డ్ వీఆర్ఓ తూము మానీయలు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించారు. మా నాన్న ఉగ్రవాదా? ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు ఆవేదన సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ప్రభుత్వం మా నాన్నను ఉగ్రవాదిలా చూస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని దీక్ష చేస్తుండగా వందలాది మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అమ్మ వెన్నెముక సమస్యతో బాధపడుతున్నా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు. తమ్ముడిని దుస్తులు చించివేసి కొట్టారు. అయినా మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా దీక్ష కొనసాగుతుంది’’అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి ఎదుట విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఆందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తమను కొట్టడం అన్ని టీవీ చానళ్లలో ప్రసారమైందని, అయినా అలా జరగలేదని హోంమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. -
ఐఏఎస్‌గా పనిచేశా.. ఈ పరిపాలన చూడలేదు!
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): తాను ఐఏఎస్‌గా పనిచేశానని, తానెప్పుడూ ఇటువంటి పరిపాలన చూడలేదని తిరుపతి ఎంపీ వరప్రసాద్ పోలీసులపై మండిపడ్డారు. ఆదివారం ఆయనను రాజమండ్రిలో పోలీసులు అడ్డుకున్నారు. కాపుల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమండ్రి వెళ్లారు. పోలీసులు ఆయనను చూసేందుకు అనుమతి నిరాకరించడంతో వెనుదిరిగారు. రాజమండ్రిలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎంపీ వరప్రసాద్‌కు తెలిపారు. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను ఐఏఎస్ పనిచేశానని, తానెప్పుడూ ఇటువంటి పరిపాలన చూడలేదని అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ తాము నలుగురురైదుగురు కలిసి గుమిగూడ కూడటం లేదు కదా అన్నారు. అనుమతి నిరాకరించడంతో ఎంపీ వరప్రసాద్ వెనుదిరిగారు. -
'మున్నూరుకాపు భవన్‌కు ప్రభుత్వం స్థలం ఇవ్వాలి'
హైదరాబాద్‌సిటీ: తెలంగాణలో అత్యధిక జనాభా కల్గిన మున్నూరు కాపుల సంక్షేమం కోసం మున్నూరుకాపు భవన్ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మ్యాడం జనార్దన్‌రావు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మున్నూరుకాపు మెడికల్ అండ్ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు ప్రతి ఆదివారం ఉచిత వైద్యసేవలు అందించడానికి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మున్నూరుకాపు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా కుల సంఘం ప్రతినిధులు జనార్దన్‌రావును అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గంప చంద్రమోహన్, ప్రొ.వెంకట్రావు, చామకూర ప్రదీప్, హజారి రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కాపుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్టుకు నిరసనగా కంచాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. కాపు సామాజికవర్గానికి చెందినవారు ఆదివారం ఉదయం కంచాలు చేతపట్టుకుని నిరసనవ్యక్తంచేస్తూ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు-ప్రదర్శనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. -
కాపు నిరసన భగ్నం
కర్నూలు(అర్బన్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్ట్‌ను నిరసిస్తు కర్నూలు నగరంలో కాపు, బలిజ సంఘం తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన నేతలను అరెస్ట్ చేసి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముద్రగడకు మద్దతుగా జిల్లా కాపు, బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం వరకు నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల ప్రాంతంలో నేతలు ఒక్కొక్కరు శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగానే పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాపు సంఘం నేతలు, పోలీసుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తాము శాంతియుతంగా చేపట్టిన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని, కాపు సంఘం నేతలు ప్రశ్నిస్తున్న సమయంలోనే పోలీసులు వారిని వ్యాన్ ఎక్కించి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సంఘం అధ్యక్షుడు యైశెట్టి నారాయణరెడ్డి, జీవీ విజయభాస్కర్, వీవీ ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణ, నల్లగట్ల పవన్, శోభన్‌బాబు, నరసింహరావు, రవి, చంద్రమోహన్, రంగస్వామి, శ్రీనివాసులు, కొండా విజయ్ ఉన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అరెస్టులో ఉద్యమాలను ఆపలేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. -
కొనసాగుతున్న ముద్రగడ దీక్ష
- వైద్యానికి నిరాకరణ - పలు దఫాలుగా అధికారుల చర్చలు.. విఫలం సాక్షి, రాజమహేంద్రవరం: కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన అమాయకులను విడుదల చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోనూ సతీమణి పద్మావతితో కలసి ఆయన మంచి నీరు కూడా తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యం పొందడానికి సహకరించాలని పలు దఫాలుగా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లు నెరవేర్చే దాకా దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. ఒకానొక దశలో అధికారులు బలవంతంగా ఆయనకు ప్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ప్రతిఘటించారు. తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని, తలను గోడకేసి కొట్టుకుంటానని హెచ్చరించారు. ఆ మాటలు వినకుండా దగ్గరకు వస్తుండగా పక్కనే ఉన్న గోడకు తల కొట్టుకోవడంతో తలకు స్పల్ప గాయమైంది. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదన్న ఆరోపణలున్నాయి. హెల్త్ బులెటిన్లేవీ అధికారికంగా విడుదల చేయకపోవడంతో ముద్రగడ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు రాష్ట్ర బంద్‌కు కాపునాడు పిలుపు సాక్షి, హైదరాబాద్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను అమానుషంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర బంద్‌కు ఏపీ కాపునాడు పిలుపునిచ్చింది. -
కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కుట్ర
► ముద్రగడకు సంఘీభావంగా ► కాపు నాయకుల దీక్ష నెల్లూరు(సెంట్రల్): కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని బలిజ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, కాపు ఉద్యమ నేత తేలపల్లి రాఘవయ్య సతీమణి శోభ ఆరోపించారు. కాపు ఉద్యమ రాష్ట్రనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు సంఘీభావంగా నగరంలోని కేవీఆర్ పెట్రోలు బంక్ సమీపంలోని ఆమె నివాసంలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కార్య క్రమంలో కాపు ఉద్యమ నేతలు ఆర్.నాగేశ్వరరావు, ఇసకా మోహన్‌రావు, ఉప్పా ప్రసన్న, దుద్దుకూరు శ్రీనివాసులు, నారాయణ, దుద్దుకూరు రఘురామయ్య, భూపతి రాఘవయ్య, కిషోర్‌బాబు తది తరులు పాల్గొన్నారు. పోలీసుల అడ్డగింపు తన నివాసంలో దీక్ష చేస్తున్న కాపు నాయకురాలు శోభ ఇంటి వద్దకు కాపు నాయకులను ఎవరినీ రానీయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడే మా నాయకుడు నెల్లూరు(బృందావనం): రాష్ట్రంలో బలిజ, తెలగ, కాపు కులస్తుల సంక్షేమ కోసం పార్టీల కతీతంగా సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభమే తమ నాయకుడని ఆయన వెంటే తామంతా నడుస్తామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల చంద్రమోహన్, ఆ సంఘం నాయకులు వెలిశెట్టి శ్రీహరిరాయల్, ఎర్రబోలు రాజగోపాల్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. తునిలో చోటుచేసుకున్న ఘటననకు బాధ్యులుగా అమాయకులైన కాపు యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తామంతా ముద్రగడ దీక్షకు మద్దతు పలుకుతున్నామన్నారు. కాపుల మద్దతుతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి బూటకపు మాటలతో మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. చినరాజప్ప, నారాయణకేం తెలుసు రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏనాడు స్పందించని రాష్ట్రహోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. కాపుల గురించి వారికి ఏం తెలుసని నాయకులు ప్రశ్నించారు. ఇకనైనా ఆచరణాత్మకంగా వ్యవహరించాలన్నారు. -
ముద్రగడ దీక్ష ఎందుకోసమో?
చంద్రబాబు మా దేవుడు మంత్రి పరిటాల సునీత అనంతపురం టౌన్ : కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం అనంతపురంలోని మునిసిపల్ గెస్ట్ హౌస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా దీక్ష చేసి రైలు తగులబెట్టారని, దాని కారణంగా ఎంతో మంది అమాయకులు జైలుకు పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆయన వెనుక ఎవరున్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని ధర్నాలు చేయడం మంచిది కాదన్నారు. కాపులకు ఇచ్చిన హామీల అమలు కోసం చంద్రబాబు కృషి చేస్తుంటే.. ముద్రగడ ఇలాంటి చర్యలకు దిగడం సబబు కాదన్నారు. రోడ్లెక్కి జనాలను ఇబ్బందులకు గురిచేయొద్దని హితవు పలికారు. పరిటాల రవి హత్య విషయం చంద్రబాబుకు ముందే తెలుసన్న ముద్రగడ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘మీ రాజకీయాలు ఉంటే చేసుకోండి. కానీ నా భర్త పేరును రోడ్డుమీదకు లాగొద్దు. చంద్రబాబు దేవుడు. మేమీ స్థాయిలో ఉన్నామంటే దానికి ఆయనే కారణం’ అని అన్నారు. -
నేడు జిల్లా బంద్
కాపు సద్భావనా సంఘం పిలుపు ముద్రగడ అరెస్టుకు నిరసన కాకినాడ సిటీ / అమలాపురం : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు నిరసనగా కాపు సద్భావనా సంఘం శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు, రైళ్ళు నిలుపుదల చేసి ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి బసవా ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ నిర్వహణలో కాపు నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా కోనసీమ వ్యాప్తంగా జరిగే ఈ బంద్‌కు వ్యాపార సంఘాలు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోనసీమ కాపు సంఘం అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ కోరారు. కోనసీమ అంతటా దుకాణాలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని 16 మండలాల తెలగ బలిజ కాపు (టీబీకే) సంఘాల ప్రతినిధులు బంద్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్ వైఫల్యానికి పోలీసుల యత్నం కాగా బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 144, 30 సెక్షన్లు అమలులో ఉండటం వల్ల దుకాణాలు బంద్ చేయించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు స్వేచ్ఛగా దుకాణాలు తెరుచుకోవచ్చని, పోలీసులు రక్షణగా ఉంటారని, ప్రజలు కూడా మార్కెట్ అవసరాలకు రావచ్చని అమలాపురం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. బంద్ పిలుపుతో పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో కూడా పోలీసు బలగాలను మోహరించారు. -
దహనకాండను ప్రేరేపించింది మీరు కాదా?
సీఎం చంద్రబాబుపై ముద్రగడ ధ్వజం జగ్గంపేట/ప్రత్తిపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ధ్వజమెత్తారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘1984లో ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు రామకృష్ణా థియేటర్లో కూర్చొని ఫోన్ల ద్వారా విధ్వంసం చేసేందుకు పిలుపునిచ్చారు. అలాగే పరిటాల రవి హత్య రోజున అన్ని జిల్లాల్లోనూ పార్టీ సమావేశాలు పెట్టి తగలబెట్టండని దహనకాండను ప్రేరేపించింది మీరు కాదా?’ అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం పుష్కరాలకు రాష్ట్రంలోని పోలీసులను తరలించి గదిలో పెట్టి సొంత ఇమేజ్ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్న బాబూ.. దీనిపై ఎందుకు కేసులు లేవు.. ఎవరిని అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. కాపు కులాలైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను విభజించి తమ జాతిని దగా చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తా.. తుని సంఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు అరెస్టులు ప్రారంభించడంతో ముద్రగడ ఘాటుగా స్పందించారు. బుధవారం సాయంత్రం లోగా కేసులు ఉపసంహరించుకోకపోతే ఈనెల 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. తుని సమావేశానికి వచ్చిన వారిని అరాచక శక్తులుగా చూపించి కేసులు పెట్టారన్నారు. తూర్పుగోదావరిలో ఉద్రిక్తత.. కనీస సమాచారం ఇవ్వకుండా తన ముఖ్య అనుచరులతో కలిసి మంగళవారం ఉదయం అమలాపురం చేరుకున్న ముద్రగడ పద్మనాభం.. తనను స్వచ్ఛందంగా అరెస్టు చేయాలని టౌన్ స్టేషన్‌కు వెళ్లారు. ఎవరూ ఊహించని ఈ పరిణామంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురంలో మొదలైన ఆందోళన.. సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడ దీక్షకు దిగుతానని డిమాండ్ వరకూ కొనసాగింది. తనను అరెస్టు చేయాలని ముద్రగడ పట్టుబట్టడం.. ఇది తమ పరిధిలోని విషయం కాదని పోలీసులు ముద్రగడను బస్సులో అటూఇటూ తిప్పుతూ కిర్లంపూడి తరలించడం వంటి ఘటనతో హైడ్రామా నడించింది. -
పోలీసుల అదుపులో ముద్రగడ పద్మనాభం
అమలాపురం : కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడ నుంచి రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించారు. దీంతో కాపు కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ముద్రగడను తరలిస్తున్న బస్సుకు అడ్డుగా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముద్రగడను తీసుకువెళుతున్న వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాగా తుని ఘటనలో అరెస్ట్ అయినవారిని వదిలిపెట్టాలంటూ ముద్రగడ పద్మనాభం ఈరోజు ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. -
మాట తప్పితే బాబును గద్దె దించుతాం
కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి: బీసీ రిజర్వేషన్ సాధన కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబును గద్దె దించేందుకు కాపు జాతి వెనుకాడబోదని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో అక్రమంగా ఎవరిని అరెస్టు చేసినా, వారికి మద్దతుగా యావత్ కాపు జాతి స్వచ్ఛందంగా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆదివారం ఆయన పలు జిల్లాల కాపు ముఖ్య నాయకులతో పాటు, ఐక్యగర్జనలో కేసులు నమోదైన వారితో సమావేశమయ్యారు. కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కొంత మంది కాపులపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. కాపులను విభజించి పాలించడంతో పాటు కాపు జాతి నాయకులతో చంద్రబాబు ఎదురు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జాతిలోని నిరుపేదల కోసం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు తన పోరాటం ఆగదన్నారు. గడువులోగా కమిషన్ రిపోర్టు తెప్పించుకుని బీసీ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేదంటే ఆయన్ను కుర్చీ నుంచి దించుతామన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల కాపు నాయకులు పాల్గొన్నారు. -
అరెస్టులకు బెదిరిపోం
నలుగురు కాదు.. 4 లక్షలమంది వస్తాం: ముద్రగడ ఆకివీడు : కాపు ఉద్యమంలో జరిగిన హింసాకాండపై త్వరలోనే అరెస్టులు చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, తాము అరెస్టులకు బెదిరిపోయి పారిపోయే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో(సాక్షి కాదు) వచ్చిన వార్తలు కాపులను కలవరపెట్టేలా ఉన్నాయన్నారు. కాపు జాతి ఎప్పుడూ బెదిరిపోదని, అరెస్టులకు నలుగురు కాదు, నలభై మంది కాదు, నాలుగు లక్షల మందిని రమ్మన్నా వస్తామన్నారు. కాపులను మరోమారు రోడ్డు ఎక్కించే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కమిషన్‌కు కాపుల పరిస్థితిని తెలియజేసేందుకు ఫార్మెట్ రూపొందించామన్నారు. జిల్లాల వారీగా పేద కాపులు ఎంత మంది ఉన్నారు అనే అంశంపై సర్వే చేయిస్తున్నామని, గ్రామ, మండల, జిల్లా పరిధిలోని సమాచారాన్ని సేకరించి నివేదికను కమిషన్‌కు అందజేస్తానని ముద్రగడ చెప్పారు. -
జూన్‌లో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక
కాపు ఉద్యమ నేత ముద్రగడ వెల్లడి పొన్నూరు/అవనిగడ్డ: తాను రెండో విడత దీక్షను విరమించడానికి పెద్దల సూచనలే కారణమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. జూన్ నెలలో 13 జిల్లాల నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తామని ఆయన ప్రకటించారు. తాము ఏ పార్టీకి, ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు. రిజర్వేషన్ పొందేవరకు నిద్రపోవద్దు : రిజర్వేషన్ ఫలాలు అందేవరకూ కాపులెవరూ నిద్రపోవద్దని ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాలలో అవనిగడ్డ కాపు యువ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ముద్రగడతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తమ పోరాటంలో మిగిలిన కులాలను కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. -
కాపు ఉద్యమం చల్లబడలేదు
► చంద్రబాబు ఎన్నికల హామీలను తక్షణం అమలు చేయాలి ► కాపు కులస్తుల ఆర్థిక స్థితిగతులను త్వరలోనే కమిటీకి నివేదిస్తాం ► తుని ఘటనపై పారదర్శక విచారణ జరపాలి ► కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ విజయవాడ (గుణదల): ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాపుజాతికి ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తోనే తాము ఉద్యమిస్తున్నామని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చే వరకు తన ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగిన అమరావతి సర్వకాపు సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి కృషి చే స్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం, వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంలో రాజ్యాంగపరంగా ఉన్న వెసులుబాటును మాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. 1966 వరకు కాపులకు అమల్లో ఉన్న రిజర్వేషన్లను ప్రభుత్వం అకారణంగా రద్దు చేసిందని ఆరోపించారు. కాపు ఉద్యమం తీవ్రతను గమనించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలతో వీధినాటకాలాడించి ఉద్యమం చల్లారిందనే ప్రచారం చేస్తోందని, కానీ ఉద్యమం ఏ మాత్రం చల్లబడలేదని, తన దీక్ష సమయంలోప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మళ్లీ వెంటనే ఉద్యమిస్తానని ప్రకటించారు. కాపుల ఆర్థికస్థితిగతులపై ఓ నమూనాను రూపొందించామని, కాపు సంఘం రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు గ్రామస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి తనకు అందజేస్తే కాపు రిజర్వేషన్లపై ఏర్పాటైన రామనాథం కమిటీకి ఇస్తామని తెలిపారు. తుని ఘటనను అవకాశంగా తీసుకుని ప్రభుత్వం కాపులను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. ఆ ఘటనపై విచారణ పారదర్శకంగా జరగటం లేదని, సంబంధం లేని వారిని కూడా కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శక ంగా జరపకపోతే తాను మరోమారు రోడ్డుపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. కాపుల ఉపాధికల్పనకు కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 కోట్లు ఇంతవరకు విడుదల కాలేదని, దీనికి జన్మభూమి కమిటీ అడ్డుపడుతోందని చెప్పారు. ఇటీవల మచిలీపట్నంలో రంగా విగ్రహాన్ని ఎవరు కూల్చారో అందరికీ తెలుసని, అలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు కేవలం విగ్రహాలను మాత్రమే కూలగలరు తప్ప మా గుండెల్లో రంగాకి కట్టుకున్న గుడిని ఎవరూ కూల్చలేరని తెలిపారు. రంగా హత్యనంతరం కాపుజాతి విచ్ఛిన్నమైందని, తిరిగి అంద రూ సంఘటితమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. అంతకుముందు ముద్రగడను అమరావతి సర్వకాపు సమ్మేళనం నిర్వాహకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు ఉద్యమనాయకులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముద్రగడకు ఘన స్వాగతం సీతానగరం (తాడేపల్లిరూరల్): కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు ప్రకాశం బ్యారేజి వద్ద తాడేపల్లి కాపు సంఘంనేతలు ఆదివారం రాత్రి ఘన స్వాగతం పలికారు. ఆదివారం విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముద్రగడ మంగళగిరిలో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వె ళుతున్నారన్న విషయం తెలుసుకున్న కాపు సంఘం నేతలు ప్రకాశం బ్యారే జి వద్దకు చేరుకుని ఆయనకు పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాపుసంఘం నేతలు తోట సాంబశివరావు, వైఎస్సార్సీపీ పట్టణగౌరవ అధ్యక్షుడు కేళి వెంకటేశ్వరరావు, అంబటి తిరుపతిరావు, ర మణ, పూనపు భాస్కరరావు, బండా రు కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శంకరరావు తదితరులు ఉన్నారు. -
కాపు ఉద్యమంలో చీలికకు ప్రభుత్వం కుట్ర
రాష్ట్ర కాపు సంఘాల సమన్వయ కమిటీ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత కాపులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం కుట్రపన్ని ఉద్యమంలో చీలికకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర కాపు సంఘాల సమన్వయ కమిటీ ధ్వజమెత్తింది. ఉద్యమాలను నీరుగార్చడంలో ఆరితేరిన చంద్రబాబు కుయుక్తులకు తలొగ్గితే కాపులకు భవిష్యత్ ఉండదని పేర్కొంది. ఈ మేరకు కాపు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ కఠారి అప్పారావు శనివారమిక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడూ, రైలు దగ్ధం కేసులో అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నప్పుడూ కనిపించని కొందరు ‘కుహానా మేధావులు, స్వయం ప్రకటిత నేతలు’ ఇప్పుడు తెరపైకి వచ్చి చంద్రబాబు మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా నేతల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ పెద్దలు కొందరు ఇటీవల విజయవాడలో 13 జిల్లాల కాపు నేతల సమావేశమంటూ నిర్వహించి ముఖ్యమంత్రికి శాలువాలు కప్పి సన్మానాలు చేయించారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే జుగుప్స కలుగుతోందని, నిస్సిగ్గుగా చంద్రబాబుకు భజన చేసేందుకే ఇలాంటి మీటింగులు పెడుతున్నారని విమర్శించారు. కాపు ఉద్యమాన్ని అమ్మేద్దామనుకుంటున్నారా? ‘అసలు ఈ దొంగ కాపు నాయకులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు. కాపు ఉద్యమాన్ని ప్రభుత్వానికి అమ్మేద్దామనుకుంటున్నారా? ముద్రగడ నిరాహార దీక్ష విరమించే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన 500 కోట్ల మాటేమైంది? విజయవాడ సమావేశానికి వచ్చిన ఏ ఒక్క కాపు నాయకుడూ దీనిపై ఎందుకు నోరువిప్పలేదు’ అని కఠారి ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతుదారులుగా ఉన్న ఈ ముఠాకు కాపు రిజర్వేషన్లు ఇప్పటిదాకా ఎందుకు గుర్తుకురాలేదని మండిపడ్డారు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని మరచి ప్రభుత్వాన్నీ, చంద్రబాబును కీర్తిస్తారా? అని దుయ్యబట్టారు. కాపులందరూ ప్రభుత్వంపై సమర శంఖారావం పూరిస్తే ఈ నాయకులు బాబు చంకలో దూరి జాతికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లసలు కాపు పుటక పుట్టారా? వీరిలో కాపు పౌరుషం ఉందా? ఇలాంటి కాపు వ్యతిరేక కార్యక్రమాలకు ఎందుకు పాల్పడుతున్నారని కఠారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తరహా కుట్రల్ని భగ్నం చేసేందుకు కాపు సంఘాల సమన్వయ వేదిక త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. -
పాత జిత్తులు ఇక చెల్లవు
ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని కాపులు మరచిపోతారనో లేక వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు ప్రకటిస్తే మళ్లీ కాపులు తమకే ఓటు వేస్తారనో చంద్రబాబు వారి రిజర్వేషన్ల సంగతిని గత రెండేళ్లుగా పట్టించుకోలేదు. కాపులకు, బీసీ కులాలకు మధ్య ఘర్షణను రేకెత్తించడం వల్ల స్వల్పకాలికమైన కొంత లబ్ధి కలుగుతుందేమో. కానీ, దీర్ఘకాలంలో జనాభాలో 22% ఉన్న కాపులు గెలవలేకపోవచ్చు కానీ ఎవరినైనా ఓడించగలరు. కాబట్టి పాత జిత్తులు, వ్యూహాలు ఇక పారవని గుర్తించడం మంచిది. కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలంటూ ఇటీవల బద్ధలైన ఉద్యమ వెల్లువ కొత్తదేమీ కాదు. పలు దశాబ్దాలుగా అలాంటి ఉద్యమాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాపులు వ్యవసాయంపై ఆధారపడినవారు. కుటుంబ విభజన క్రమంలో కాపు రైతుల కమతాలు చిన్నవైపోయి, పేదవారయ్యారు. కమ్మ, రెడ్డి, రాజు, వెలమ వంటి ఇతర వ్యవసాయ కులాల వారితో కూడిన నూతన కాంట్రాక్టర్లు, వ్యాపార వర్గాల పాలక వర్గంలో కాపులు భాగంగా లేరు. పైగా వారిలో కులపరమైన పొందిక లేదు. దీంతో వ్యాపారాలను లేదా వ్యాపార నైపుణ్యాలను పెంపొందింపజేసుకోడానికి తగినన్నినిధులు కూడా వారికి లేవు. పైగా రాజకీయాలంటేనే సంపదను, కాంట్రాక్టులను చేజిక్కించుకునే మహదావకాశంగా మారాయి. కాపులు మాత్రం రెండో శ్రేణివారుగానే లేదా పెద్ద నేతల అనుచరులుగానే మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు కాపులు, కమ్మవారికి వ్యతిరేకంగా పనిచేస్తారని భావించారు. కానీ ఎన్టీఆర్ తెలివిగా యర్రం నారాయణ స్వామి వంటి కాపు నేతలు పలువురుని కాంగ్రెస్‌లోంచి తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రాంతీయ కులాలతో జాగ్రత్తగా వ్యవహరించలేక పోయింది. దీంతో కాపులు తమను ఏ పార్టీ పట్టించుకుంటే దానివైపే ఎన్నికల్లో మొగ్గు చూపుతూ వచ్చారు. చిరంజీవి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు వారంతా ఆయన పార్టీ వెంటే నిలిచారు. 2014లో టీడీపీ జాగ్రత్తగా కాపు నేతలను ఆహ్వానించి వారికి కొన్ని టికెట్లు ఇచ్చింది. దీనికి తోడు అది బీజేపీ, మోదీలతో కలవడంతో కాపులలో అధిక సంఖ్యాకులు టీడీపీ-బీజేపీ కూటమి వైపు మొగ్గారు. పైగా చంద్రబాబు నాయుడు సైతం కాపులను బీసీలలో చేరుస్తామనే అంశాన్ని మొట్టమొదటిసారిగా టీడీపీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. గోదావరుల నుంచి ఉత్తరాంధ్ర వరకు అసంతృప్తి విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కాపులు అతి పెద్ద కుల సామాజిక వర్గం (జనాభాలో 22% పైగా). అయినా నేటి ప్రభుత్వ అధికారం మాత్రం జనాభాలోని అతి చిన్న భాగం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అధికారం తిరిగి తమ చేజారిపోయిందని వారు భావించారు. మరోవంక ఇటు పశ్చిమ గోదావరి నుంచి అటు శ్రీకాకుళం వరకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం అసంతృప్తిని రేకెత్తించే పలు అంశాలు పేరుకుపోతూ వచ్చాయి. చాలా ఇతర కులాలలాగే కాపులు కూడా ఒకే ఒక్క కులం ప్రభుత్వాన్ని శాసిస్తోందని భావించడం వీటిలో ప్రధానమైనది. పేరుకు చంద్రబాబు కొందరు కాపులను మంత్రులను చేసినా, ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం కట్టబెట్టినా వారిలో ఆ భావన చెదరలేదు. ఇకపోతే, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తుండగా ఇతర ప్రాంతాలకు ఏమీ దక్కకపోవడం మరింత ఆగ్రహాన్ని రేకెత్తించసాగింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూమి విలువ ఎకరా కోట్లలో పలుకుతుంటే మిగతా వారికి లభించింది ఏమీ లేదు. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల కోసం గోదావరి జలాలను తరలించడం కోసం పట్టిసీమ ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారో మిగతా ప్రజలు చూశారు. గోదావరి జిల్లాల అత్యంత విలువైన సహజ వనరైన నీటిని తరలించుకుపోతూ ఆ జిల్లాల కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఒకవంక గుంటూరు జిల్లా రైతుల భూములకు కోట్లు లభిస్తుండగా, పైడిపాక, పోలవరం, అంగలూరు, దేవీపట్నం మండలాలలోని అత్యంత సారవంతమైన భూములకు సైతం ఎకరాకు లక్ష రూపాయలకు మించి లభించడం లేదు. కేంద్ర ప్రాజెక్టయిన పోలవరం నిర్వాసితులకు, నష్టపోయినవారికి 2013 భూసేకరణ చట్టం వర్తించకుండా అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడటాన్ని ప్రజలు గమనించారు. పోలవరం రిజర్వాయరు వల్ల గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 5 లక్షల మంది ప్రజలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని కాపులు మరచిపోతారనో లేక వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు ప్రకటిస్తే మళ్లీ కాపులు తమకే ఓటు వేస్తారనో చంద్రబాబు వారి రిజర్వేషన్ల సంగతిని గత రెండేళ్లుగా పట్టించుకోలేదు. ఇది ఆయన ఎదుర్కొనే మొదటి అడ్డంకి. ఆయన ప్రభుత్వం హడావుడిగా కాపులకు బీసీ హోదాను ఇవ్వడం తక్షణమే ప్రతిపాదనలు అందించాలంటూ ఒక కమిషన్‌ను నియమించింది. 2014 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం జాట్లకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఆయనకు ఇచ్చిన తీర్పు మరో ప్రధాన సమస్యగా అడ్డు నిలుస్తుంది. ‘‘పాత ఫార్ములా ప్రకారం ఇక మరిన్ని కుల రిజర్వేషన్లు లేవు’’ అని ఆ తీర్పు స్పష్టం చేసింది. జాట్లతోపాటూ, ముస్లింలకు, మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన రిజర్వేషన్లను కూడా రద్దు చేసేసింది. 2015 మార్చి 17 నాటి ఆ తీర్పును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఏం చేస్తారు? కాంగ్రెస్ జాట్లకు రిజర్వేషన్లిచ్చాక, సుప్రీం కోర్టు వాటిని రద్దు చేసినట్టే కాపుల విషయంలోనూ జరిగాక ‘‘ఏం చేయమంటారు? సుప్రీం కోర్టు మీకు బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి అంగీకరించడం లేదు’’ అని అమాయకంగా అంటారా? కాపులకు అమరావతి ప్రాంత అభివృద్ధిలో ఎలాంటి ఆసక్తి లేదు. కాబట్టి ఉభయ గోదావరులు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కాపులు సహా ఇతర కులాలకు ఆగ్రహం కలగకుండా చూడటానికి ఆయన చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. 1. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నేతలను కొందరు కాపు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీల చేత దూషింపజేసే పనిని వెంటనే కట్టిపెట్టాలి. 2. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు (ఆధిపత్య కులాలకు చెందినవారు) గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇతర నేతలందరినీ దూషిస్తున్నారు. ఏ విలువా లేని ఈ మంత్రుల తీరు ఫలితంగా కులాల మధ్య సంఘర్షణ రేగుతోంది. ఇతర కులాలను తిట్టిపోయడం కోసం వారిలా పర్యటనలు చేపట్టకుండా చేయాలి. 3. టీడీపీకి చెందిన కాపు, తదితర ఆధిపత్యేతర కులాల ఎమ్మెల్యేలు, ఎంపీలలో అత్యధికులు వ్యాపార వేత్తలే. అలాంటి వారైతేనే రాజకీయంగా వారి ప్రతిష్ట పెరగకుండా ఉంటుందని వారికి సీట్లిచ్చారు. టీడీపీ-బీజేపీ గాలి వల్ల, ధన బలం వల్ల్ల ఎలాంటి ప్రజాపునాది లేని అలాంటి వారు చాలా మందే గెలిచారు. వారు తమకు అందుబాటులో ఉండే బాపతు కాదని ప్రజలకు బాగా తెలుసు. సదరు ప్రజా ప్రతినిధులపై వారిలో అసంతృప్తి, ద్వేషం పెరగడం ఖాయం. 4. మూడు జిల్లాలకు, కాంట్రాక్టర్లకు మేలు చేస్తూ, తమ నీటిని దొంగిలించే ప్రాజెక్టులను చేపట్టింది వారి మంచి కోసమేననే వంచనాత్మక ప్రచారాన్ని కట్టిపెట్టడం మంచిది. ప్రజలు తెలివైనవారు. వారికంతా తెలుసు. ఈ ప్రచారం ద్వారా వారిని అవమానించినట్టవుతుంది. ఉత్తుత్తి మాటలు, పదవులు చాలిక ఇటీవల ఓ కాపు మంత్రి, ముద్రగడ పద్మనాభాన్ని, కాపుల ఆందోళనను నేరుగా విమర్శిస్తూ చంద్రబాబు ఒక కాపును ఉప ముఖ్యమంత్రిని చేశారని ఘనంగా చెప్పారు. ఎవరైనా ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ఎవరైనా నాయకుడు కాలేరు. ముద్రగడ పద్మనాభం నాయకుడు. అందరూ ఉపముఖ్యమంత్రులు లేదా మంత్రులు, నాయకులు కారు. కాపుల జనాభా 3% మాత్రమే అయితే చంద్రబాబు ఒక కాపును ఉప ముఖ్యమంత్రిని చేసే వారా? ఏపీలో ఆధిపత్య కులాలు అల్ప సంఖ్యాకులు కావడం రాష్ట్ర విభజన పర్యవసానం. కాపులు, ఇతర బీసీ కులాల సంఖ్యాబలం పెరిగింది. కాపు లకు, బీసీ కులాలకు మధ్య ఘర్షణను రేకెత్తించడం వల్ల స్వల్పకాలికమైన కొంత లబ్ధి కలుగుతుందేమో. కానీ దీర్ఘకాలంలో జనాభాలో 22% ఉన్న కాపు లు గెలవలేకపోవచ్చు కానీ ఎవరినైనా ఓడించగలరు. ఉత్తరప్రదేశ్‌లో మాయా వతి, బ్రాహ్మణ మద్దతుతో (15%) అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల తర్వాత వారే ఆమెను ఓడించారు. అక్కడ బ్రాహ్మణుల మద్దతులేనిదే ఎవరూ ముఖ్య మంత్రి కాలేరు. అలాగే ఏపీలో ఒక కులానికి వ్యతిరేకంగా మరో కులాన్ని పోరాడేలా చేసే ఆ పాత ఆటలు ఇక సాగవు. కాబట్టి చంద్రబాబు సుప్రీం కోర్టు తీర్పును అధిగమించి కాపులకు రిజర్వేషన్లను కల్పించే మార్గాన్ని అన్వేషించడం కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల సలహాలను తీసుకోవాలి. జాట్లు సహా పలు సామాజిక వర్గాలను కొత్తగా బీసీలలో చేర్చ డాన్ని రద్దు చేసిన తీర్పే ‘‘రిజర్వేషన్లను కల్పించడానికి ప్రభుత్వం కొత్త బృం దాలను అన్వేషించాలి’’ అని కూడా చెప్పింది. అంటే ప్రభుత్వం భారీ సంఖ్య లో ఉన్న కాపు వ్యవసాయ కూలీలను, రిక్షాలు లాగేవారిని, విద్య, ఆస్తులు వగైరా లేనివారిని గుర్తించి రిజర్వేషన్ల కోసం సూచించాల్సి ఉంటుంది. కావు రిజర్వేషన్లపై బీజేపీ మౌనం ఆసక్తికరం. అదే మౌనాన్ని వారు కొనసాగిస్తే వారు 2004 నాటి తమ 2% ఓట్లకు తిరిగి రాక తప్పదు. 22%గా ఉన్న కాపులు ఏపీలో భారీ జనాభా. వారికి అమరావతి, సింగపూర్, స్విట్జర్లాండ్ లలో ఆసక్తి లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల కోసం తమ జిల్లాలకు లేకుండా గోదావరి నీళ్లను తోడేసుకుంటున్నారనే భావనే వారిలో ద్వేషానికి కారణమవు తోంది. కాబట్టి పాత జిత్తులు, వ్యూహాలు ఇక పారవని గుర్తించడం మంచిది. - వ్యాసకర్త రాజకీయ విశ్లేకులు drpullarao@yahoo.co.in -
అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తునిలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలను పాత ఇనుముగా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈ టెండర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పిలిచారు. మొత్తం 17 బోగీలను వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఖరారు చేస్తామని విజయవాడ డివిజన్ అధికారులు చెబుతున్నారు. జనవరి 30న తునిలో కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన విషయం విదితమే. ఘటన జరిగిన తర్వాత ఈ బోగీలను తుని స్టేషన్‌కు తరలించి ఇటీవలే విజయవాడ తీసుకొచ్చి వేలం నిర్వహిస్తున్నారు. -
త్వరలో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు
రాజమహేంద్రవరం: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఇస్తున్నట్లే కాపు విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్‌లు మంజూరు చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. స్కాలర్షిప్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేస్తామని చెప్పారు. కాపుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్లు మంజూరు చేయాలనుకుంటున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ వివరించారు. -
కాపులను బీసీల్లో చేరిస్తే ఊరుకోం..
భారతీయ యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ విజయనగరం క్రైం : కాపులను బీసీల్లో చేర్చే చర్యలను అడ్డుకోవాలని భారతీయ యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మయూర హోటల్లో జరిగిన యాదవ మహాసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 14 శాతం జనాభా కలిగి సామాజికంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న యాదవుల అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను.. మం జూనాథ కమిషన్‌ను అడ్డుకోవాలన్నారు. ఈ సందర్భంగా యాద శంఖరావం మాసపత్రికను విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు భరణికాన రామారావు, కార్యదర్శి అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి రామ్మోహన్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంప అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా మన్యాలకృష్ణ యాదవ్ ఎన్నిక.. భారతీయ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా మన్యాలకృష్ణ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.రామలింగస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రసాదుల రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొయ్యాన సన్యాసిరావులు నియమించినట్లు వెంగళరావు యాదవ్ ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో గదుల సత్యలత, చీసపు పార్వతి, గువ్వల తిరుపతి, ఇసరపు శేఖర్, గార సత్యనారాయణ, పల్లా అప్పలస్వామి, ఇప్పిలి కొండలకు చోటు కల్పించినట్లు చెప్పారు. -
'నేను మొదటి ముద్దాయిని'
కసింకోట: గత నెలలో తూర్పుగోదావరి జిల్లా తుని కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో తానే మొదటి ముద్దాయినని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. నాటి ఘటనలకు సంబంధించిన కేసుల్లో తన తర్వాతే ఎవరైనా వస్తారని, భయపడాల్సిన పనిలేదన్నారు. కాపు వర్గానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు శనివారం విశాఖ జిల్లా కసింకోటకు వచ్చిన ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. కాపు గర్జనలో పాల్గొన్న వారిపై కాకుండా ప్రమేయం లేని వారిపై ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. తమది ఆకలి కేకే కానీ, వినోదం కోసం చేసింది కాదన్నారు. తుని గర్జనలో పాల్గొన్నవారు, సహకరించిన వారు, రవాణా సదుపాయాలు కల్పించిన వారి పేర్లతో సీఎం, డీజీఎంలకు ఇప్పటికే లేఖలు కూడా రాశానని చెప్పారు. -
హామీలు అమలయ్యేదాకా విశ్రమించను
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ జగ్గంపేట / కిర్లంపూడి: ‘‘జాతి కోసం పోరాటం సాగించాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ విశ్రమించను’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఆయన బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమం ద్వారా 20 శాతం విజయం సాధించామని, మిగిలిన 80 శాతం విజయం కోసం ఏడు నెలలు కష్టపడతామని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా కమిషన్ నివేదిక అందేలా చూస్తామని, కార్పొరేషన్‌కు తక్షణం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారని వెల్లడించారు. -
నా చావుతోనైనా కాపులను బీసీల్లో చేర్చాలి
పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న రమణయ్య సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సీఎస్‌పురం: బలిజ కులంలో పుట్టించావు, కూటికి పేదను చేశావు, పేరుకు పెద్ద ఓసీ కులం. నాకు ఉండటానికి ఇల్లు లేదు. తింటానికి తిండి లేదు. నేను వైరింగు (ఎలక్ట్రీషియన్) చేసి బతుకుతున్నాను. నా కులాన్ని బీసీల్లో చేరిస్తే నా పిల్లలు, వారి పిల్లలైనా బతుకుతారనుకున్నాను. కానీ మమ్మల్ని బీసీలో చేరుస్తారని నమ్మకం కలగడం లేదు. నా చావుతో అయినా మా కులాన్ని బీసీల్లో చేరుస్తారని నేను చనిపోతున్నాను’ ఇదీ కాపులను బీసీల్లో చేర్చాలంటూ తాటి రమణయ్య అనే వ్యక్తి పురుగుమందు తాగి చనిపోతూ రాసిన సూసైడ్ నోటు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం కనిగిరి నియోజకవర్గం చంద్రశేఖరపురం(సీఎస్ పురం)లో చోటు చేసుకుంది. గ్రామంలోని సందుగడ్డ వీధికి చెందిన తాటి రమణయ్య ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహార దీక్షపై ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణితో ఇక బీసీల్లో చేరుస్తారన్న నమ్మకం కోల్పోయాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటానని ఉదయం నుంచి పలువురికి చెప్పాడు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రమణయ్య పురుగుమందు తాగాడు. నీళ్లు తేవడానికి ట్యాంకు వద్దకు వెళ్లిన భార్య రాములమ్మ తిరిగి వచ్చేసరికి రమణయ్య నురగలు కక్కుకుంటూ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కనే పురుగుల మందు డబ్బా పడి ఉంది. దీంతో ఆమె ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే రమణయ్య మృతి చెందాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, మృతుని జేబులోని సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. గుండెపోటుతో ఇద్దరి మృతి పి.గన్నవరం/ బిట్రగుంట: కాపు ఉద్యమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, రిజర్వేషన్లు రావన్న భయంతో గుండెపోటుతో ఇద్దరు మరణించారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి రాజీవ్ కాలనీకి చెందిన కాపు నాయకుడు బొరుసు వీరవెంకట సత్యనారాయణ (60) వ్యవసాయ కూలీగా . ముద్రగడ ఆమరణ దీక్షకు మద్దతుగా గ్రామంలో జరిగిన రిలే దీక్షల్లో పాల్గొన్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ముద్రగడ దీక్షను టీవీలో చూస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. రిజర్వేషన్లు రావన్న బెంగతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాళ్లూరుకు చెందిన యువకాపునాడు మండల అధ్యక్షుడు లక్కాకుల పద్మానాయుడు(43) గుండెపోటుతో కన్నుమూశాడు. కాపు ఉద్యమంలో భాగంగా పద్మానాయుడు నిరసనల్లో పాల్గొన్నాడు. -
కాపు ఉద్యమాన్ని అడ్డుకోలేరు
దోమలగూడ: పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో కాపు ఉద్యమాన్ని అడ్డుకోలేరని, ఆమరణ దీక్ష జరుపుతున్న ముద్రగడ దంపతులకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు హెచ్చరించారు. ముద్రగడ దంపతుల ఆమరణ నిరాహారదీక్షకు సంఘీబావంగా జంటనగరాల కాపు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం కాపుల రిలే నిరాహారదీక్ష లు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఓబీసీ ఎం పీల ఫోరం కన్వీనర్ అయినప్పటికీ కాపుల డిమాండ్ న్యాయసమ్మతమైనది కాబట్టే మద్దతు ఇస్తున్నానన్నారు. కాపు సంఘాల జేఏసీ ఛైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్రావు, నాయకులు శేషాద్రినాయుడు, బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. -
రేపటి నుంచి పట్టాలెక్కనున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
తూర్పు గోదావరి: రేపటి (సోమవారం) నుంచి విజయవాడ-విశాఖపట్నం 'రత్నాచల్ ఎక్స్‌ప్రెస్' పట్టాలెక్కనున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలకు ఆహుతి అయిన సంగతి తెలిసిందే. గత ఆదివారం తుని మండలం వెలమ కొత్తూరు సమీపంలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఆందోళనకారులు ఈ రైలును తగులబెట్టారు. ఈ ఘటనతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్పటి నుంచి విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. -
'చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. దేశ సరిహద్దుల్లో కూడా లేనంతగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిషేధాజ్ఞలు విధించారని మండిపడ్డారు. ముద్రగడను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారని వాపోయారు. దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తునా పోలీసులను మోహరించారని ధ్వజమెత్తారు. అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే విధానం మంచిది కాదన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించవచ్చు అని సూచించారు. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది కాబట్టి చంద్రబాబు సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని రఘువీరా కోరారు. -
'కాపు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలి'
రాజమండ్రి: కాపు ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన తనను అరెస్ట్ చేయడం దారుణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చారు. ఈ సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. కాపు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఒత్తిడి పెంచాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. -
'జన్మభూమి కమిటీల అక్రమాలపై పార్లమెంట్ లో పోరాడుతాం'
ఒంగోలు: జన్మభూమి కమిటీల ఏర్పాటు, నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జన్మభూమి కమిటీల వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని.. ఆ కమిటీల అరాచకాలపై పార్లమెంట్లో పోరాడతామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు జన్మభూమి కమిటీ బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. నిఘా వ్యవస్థ నిద్రపోవడం వల్లే తూర్పుగోదావరి జిల్లా తుని కాపు గర్జనలో దుర్ఘటన చోటుచేసుకుందని.. రైలు తగలబెట్టడం అంటే గడ్డి వాములు తగలబెట్టడం కాదని.. రిజర్వేషన్ల కోసం కాపులు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి ఉందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఒంగోలు ఎంపీ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టుపై జాప్యం చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించారు. పోలవరానికి తక్షణమే రూ.2 వేల కోట్లు మంజూరు చేయాల్సిందిగా సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా ప్యానెల్ ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. పోలవరం అథారిటీని ఏర్పాటుచేయాలని ప్యానెల్‌ను కోరినట్లు సుబ్బారెడ్డి వివరించారు. -
ప్రభుత్వం ఒక్కమెట్టు కూడా దిగదంటా: ముద్రగడ
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో శనివారం జరిపిన చర్చలు విఫలమైనట్టు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. చర్చల అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. తన దీక్షను యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కమెట్టు కూడా దిగదంటా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆరోగ్య పరీక్షలు అవసరం లేదని తేల్చి చెప్పారు. మా జాతి కోసం పోరాడతా' అంటూ ముద్రగడ స్పష్టం చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజుకు చేరిన సంగతి తెలిసిందే. -
'ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోంది'
హైదరాబాద్: నగరంలోని రాజ్‌భవన్‌లో శనివారం కాపు న్యాయవాదులు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తోందంటూ గవర్నర్ నరసింహన్‌కు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. కాపు యువకులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు. కాపుల భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు హరిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హక్కులు కాపాడాలని గవర్నర్‌కు కాపు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది. -
టెన్షన్.. టెన్షన్!
- నేటి నుంచి కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష - తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసు నిషేధాజ్ఞలు - టీడీపీ నేతల చర్చలు విఫలం - గురువారం అర్ధరాత్రి వరకూ భేటీ..డిమాండ్లపై లభించని హామీలు కాకినాడ : ముద్రగడ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దీక్ష చేయడం ఖాయమని తేలిపోయింది. జనవరి 31వ తేదీన కాపు ఐక్యగర్జన సందర్భంగా విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోవడం, గతంలో ముద్రగడ దీక్షల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తదితర అంశాలను పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కేంద్రం కాకినాడ సహా కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, తుని, అమలాపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను సిద్ధం చేశారు. ఏ క్షణంలో ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా పోలీసులను సన్నద్ధం చేశారు. మరోవైపు పోలీసు ఆంక్షలు విధించడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నిషేధాజ్ఞలు ప్రస్తుతం ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా మొత్తం మీద సీఆర్పీసీ 144 సెక్షన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. జనం గుంపులు గుంపులుగా తిరగడం, సమావేశం కావడం నిషేధం. పోలీసుచట్టం సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నా ముందుగా పోలీసుశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ముద్రగడ పద్మనాభం శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు విధిస్తున్నట్టు ఎస్పీ ఎం.రవిప్రకాశ్ వెల్లడించారు. జనవరి 31న జరిగిన తుని విధ్వంసకాండ దృష్ట్యా బయటి ప్రాంతాల నుంచి ఎవరూ తూర్పు గోదావరి జిల్లాకు రావద్దని, ముఖ్యంగా యువకులు పోలీసు నిషేధాజ్ఞలను గమనంలోకి తీసుకోవాలని సూచించారు. అయితే సాధారణ ప్రజలు, పర్యాటకుల రాకపోకలకు ఇబ్బంది ఉండదని ఎస్పీ భరోసా ఇచ్చారు. సాధ్యమైనంత వరకూ కిర్లంపూడి రాకుండా ఉండటమే శ్రేయస్కరమని ప్రజలకు హితవు పలికారు. అయితే గ్రామాల్లో శాంతియుతంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. ప్రదర్శనల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. గత సంఘటనల నేపథ్యంలోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఎస్పీ వెల్లడించారు. భారీగా బలగాల మోహరింపు.. కాపులను బీసీల్లో చేర్చడం, కాపు కార్పొరేషన్‌కు రూ.1900 కోట్లు విడుదల చేయడం, ‘గర్జన’ నేపథ్యంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పద్మనాభం నిరాహార దీక్ష దృష్ట్యా జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన ఆంక్షలు అమలు చేయబోతున్నామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. సంఘ విద్రోహశక్తులను ఎక్కడికక్కడ గుర్తించి అడ్డుకొనేందుకు జిల్లావ్యాప్తంగా 39 చెక్‌పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. కాపుగర్జన సభ తదుపరి విధ్వంసానికి పెట్రోల్, మారణాయుధాలు తెచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు 10 కంపెనీల సీఆర్పీఎఫ్, ఐటీబీఎఫ్ బలగాలు జిల్లాకు వచ్చాయి. నాలుగు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పోలీసుశాఖ నుంచి 5 వేల మంది సిబ్బందిని అదనంగా జిల్లాకు రప్పిస్తున్నారు. జిల్లాకు వచ్చే యాత్రికులు, సాధారణ ప్రజల వద్దనున్న గుర్తింపుకార్డుల ద్వారా అనుమతి ఇస్తామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఐజీ, డీఐజీ కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌ను ఐజీ కుమార్ విశ్వజిత్, డీఐజీ హరికుమార్ గురువారం ఉదయం సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు పోలీసులతో మాట్లాడి వివరాలను ఆరా తీసినట్టు తెలిసింది. -
కాపుకాద్దాం..!
ముద్రగడకు మద్దతుగా రేపటి నుంచి గుంటూరులో దీక్షలు గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆవిర్భావం కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ముందుకు... అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న జేఏసీ నేతలు కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను బలపర్చాలని వినతి గుంటూరు : కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా ఈనెల 6 నుంచి గుంటూరు నగరంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ నిర్ణయించింది. అన్ని పార్టీల నాయకులను ఒక తాటిపైకి చేర్చి గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీగా ఏర్పడింది. జెండాలను పక్కన పెట్టి కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ఉద్యమించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి కాపు జాతికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ముందుగా గుంటూరు అర్బన్‌జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసిన జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు, కిలారి రోశయ్య, మాదా రాధాకృష్ణమూర్తి, కె.కె, ఊరిబండి శ్రీకాంత్‌లతోపాటు మరో వంద మంది రిలే నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా దీక్షలు కొనసాగిస్తామని ఎస్పీకి తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు మాట్లాడుతూ కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడకు మద్దతుగా గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభిస్తున్నామన్నారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ కాపుల్లో వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయన్నారు. గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితమే కాపులు బీసీల్లో ఉండేవారన్నారు. అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి... దీక్షలకు మద్దతు తెలపాలని కోరుతూ తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందించారు. పార్టీ నేతలంతా సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకులు తెలిపారు. -
ఆయనకు తోడుండడమే ఆమె దీక్ష
ముద్రగడ! ఇప్పుడు మార్మోగుతున్న పేరు! కాపులు, రిజర్వేషన్లు, ఉద్యమాలు అంటూ క్షణం తీరిక లేకుండా ఊపిరి సలపని కార్యాచరణలో ఉన్నారు ముద్రగడ పద్మనాభం! ఆయనతో పాటే ఆయన జీవన సహచరి పద్మావతి. తన పద్దెనిమిదో ఏట పద్మనాభంతో కలసి ఏడు అడుగులు వేసిన ఆమె... నాలుగు దశాబ్దాలుగా ఆయన ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నారు. సహధర్మచారిణిగా పేరులోనే కాదు, ఆయన చేపట్టిన ఉద్యమాల్లోనూ భాగస్వామ్యం స్వీకరించారు. కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రేపు భర్తతో కలసి నిరాహార దీక్షకూ దిగనున్నారు. ఇలా ఆమె దీక్ష చేయడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ పద్మావతిని పలకరించింది. ప్రతిదీ నాకు చెబుతారు ‘ఆయన ప్రజల మనిషి. సహాయం కోసం ఇంటికి వచ్చేవారెవరైనా సరే అసంతృప్తితో వెళ్లకూడదు. అదే ఆయన అభిమతం. నమ్ముకున్నవారికి అండగా ఉండడమే ఆయనకు తెలిసిన రాజకీయం. వేళకు వండి పెట్టడం, ఆయన కోసం వచ్చినవాళ్ల మంచీచెడ్డ కనుక్కోవడం వరకే నాకు తెలుసు. రాజకీయాలపై నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఆయన చేసే ప్రతి పనీ నాకు చెబుతారు. ఒక్కోసారి చెప్పకున్నా నా సమ్మతం ఉన్నట్లే. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా అందులో మంచి ఉంటుంది’ అని చెప్పారు ముద్రగడ పద్మావతి. పద్మావతి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని పెద్దలాపల్లి. ఆమె తల్లిదండ్రులు గొల్లపల్లి చెల్లారావు, రామయ్యమ్మ. సాధారణ రైతు కుటుంబం. అప్పటికే ముద్రగడ పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు ఎమ్మెల్యే. ‘పద్మనాభం గారితో పెళ్లి సంబంధం (1974లో) అనగానే మాకు చాలా గొప్ప అయింది. ఆయన మాటతీరు, నడత అన్నీ మా వాళ్లకు బాగా నచ్చాయి’ అంటూ చిరునవ్వుతో గుర్తు చేసుకున్నారు పద్మావతి. వంటలు... ఒత్తిళ్లు... ‘పద్మనాభం గారు చిన్నప్పటి నుంచి మంచి భోజనప్రియులు. ఎక్కడైనా ఏదైనా కొత్త వంటకం రుచి చూస్తే చాలు... ఇంటికొచ్చి చెబుతారు. రెండుమూడు సార్లు ప్రయత్నించైనా సరే వంటకం రుచిగా వచ్చే వరకూ వదిలిపెట్టనివ్వరు. ఒకసారి ఢిల్లీలో ప్రధానమంత్రి విందులో బాదం సూప్ ఇచ్చారట. అదెలా తయారుచేయాలో చెఫ్‌తో మాట్లాడి మరీ తెలుసుకొని వచ్చారు. హైదరాబాద్‌లో దొరికే కుబానీ స్వీట్ తయారీ గురించి కూడా అలాగే తెలుసుకొని ఇంట్లో చేయించారు. నేను కూడా ఆయన అభిరుచికి తగ్గట్లుగానే వంటలు చేస్తుంటాను. అంతేకాదు, ఇంటికొచ్చే అతిథులకు ఏ మెనూ తయారు చేయాలో చెప్పేస్తారు. ఆయనకు నచ్చే స్వీట్ సగ్గుబియ్యం హల్వా కూడా తరచుగా చేస్తుంటాను’ అని భర్త భోజన ప్రియత్వం గురించి చెప్పారు పద్మావతి. అయితే ఇలా హోటళ్లలో వంటకాల గురించి చెప్పినా రాజకీయాల్లో ఎదురయ్యే ఒత్తిళ్ల గురించి ఏనాడూ ఇంట్లో తన వద్ద ప్రస్తావించరని ఆమె అన్నారు. సివిల్స్‌కి అనుకున్నాం ‘మాకు ముగ్గురు పిల్లలు. పెద్దవాడు బాలుకి మా మామ వీరరాఘవరావు పేరు, రెండో అబ్బాయి గిరికి మా నాన్న చెల్లారావు పేరు పెట్టాం. అమ్మాయి క్రాంతి అసలు పేరు సత్యవతి. అంటే మా అత్తగారి పేరు. పద్మనాభంగారు కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తారో ప్రజల కోసం అంతకన్నా ఎక్కువ తపనతో ఉంటారు’ అని పద్మావతి చెప్పారు. పక్కనే ఉన్న ముద్రగడ మాట్లాడుతూ... ‘మా పిల్లల్ని రాజకీయాల్లో కాకుండా సివిల్ సర్వీసు అధికారులుగా చూడాలని తపించేవాళ్లం. కానీ బాలు బాల్‌బాడ్మింటన్ ఆడుతూ ప్రమాదానికి గురై ఫిజికల్లీ చాలెంజ్డ్ అయ్యాడు. అప్పటికే ఇంగ్లండ్‌లో ఎంఎస్ చేసి వచ్చిన గిరి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అన్నకు అలా జరగడంతో ఇంటికి వచ్చేశాడు. అలా ఇద్దరి సివిల్స్ లక్ష్యం నెరవేరలేదు’ అని భావోద్వేగంతో చెప్పారు. ఇక మనవరాలు (గిరి కుమార్తె) భాగ్యశ్రీ. ఇప్పుడు ప్రీస్కూల్ చదువుతోంది. ముద్రగడ దంపతులకు ఈ చిన్నారి అంటే ప్రాణం. మామ చెప్పినట్లే... ‘మా మామగారు 1977 జూలైలో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో బెడ్‌పై ఉండి ఆయన చెప్పిన చివరి మాటలే నా భర్త మనసులో చెరగని ముద్ర వేశాయి. వీలైనంత వరకూ తోటివారికి సాయం చేయాలనేది ఆయన ఆశయం. ఆ స్ఫూర్తితోనే పద్మనాభం గారు కూడా పనిచేస్తున్నారు. రాజకీయాల కోసం ఉద్యమాలు చేస్తున్నారని ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఆయన మనసు ఏమిటో నాకు తెలుసు’ అని చెప్పారు పద్మావతి. తండ్రి వీరరాఘవరావు ఆకస్మిక మరణంతో 1977లో రాజకీయాల్లో అడుగుపెట్టిన పద్మనాభం 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1983లో ఆవిర్భవించిన టీడీపీకి అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1985 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు. 1988లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఎమ్మెల్యే అయ్యారు. రవాణా, జౌళి శాఖలను మంత్రిగా పర్యవేక్షించినా, ఎక్సైజ్ మంత్రిగానే ఆ శాఖతో అనుబంధాన్ని పెనవేసుకున్నానని చెప్పారు ముద్రగడ పద్మనాభం. ‘ఏ పదవిలో ఉన్నా, తర్వాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజాసేవలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు. మా మామగారు చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు’ అని పద్మావతి చెప్పారు. ఉద్యమంలోనూ వెంటే ‘1997లో పద్మనాభం గారు కాపునాడు ఉద్యమం చేశారు. ఆయనతో పాటే నేనూ దీక్షకు దిగాను. రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఆయన నిరాహార దీక్షకు దిగారంటే అందులో న్యాయం ఉండే ఉంటుంది. అయినా ఆయన భోజనం చేయకుండా నేను ఎప్పుడూ చేయలేదు. అందులోనూ ఒక మంచి పని కోసం దీక్ష చేస్తున్నప్పుడు నా వంతు చేసే సహాయం తోడు ఉండటమే’ అని చెప్పారు పద్మావతి. రేపటి నుంచి స్వగ్రామం కిర్లంపూడిలో ముద్రగడ తలపెట్టిన నిరాహార దీక్షలోనూ పాల్గొనడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా దీక్షలో ఆయన వెంటే ఉంటానని చెప్పారు పద్మావతి. మీ పాత దీక్ష అనుభవాలు? గతంలో దీక్ష చేసినప్పుడూ మా ఆరోగ్యంపై ఎలాంటి భయం పెట్టుకోలేదు. నా భర్త వెంట నడవటమే నా ధర్మం. ఆయన మాటే నాకు శిరోధార్యం. భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అలాంటి ఆలోచనే లేదు. ఆశయం కోసం పోరాటం మీ భర్తపై ఇన్ని కేసులు పెట్టారు కదా? అందోళనగా లేదా? ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఆయనకు ఏమైనా అవుతుందన్న భయం ఉందా? నా భర్తకు దీక్షకు దిగడం కొత్తకాదు. ఆయన ఒక ఆశయం కోసం పోరాడుతున్నారు. అలాంటప్పుడు భయపడాల్సిందేముంటుంది? - అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఫొటోలు: గరగ ప్రసాద్ -
'పోలీస్ స్టేషన్లపైనా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం'
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో గత నెల 31న కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా జరిగిన ఆందోళనలో ప్రభుత్వ ఆస్తుల నష్టం, పోలీసులపై, పోలీసు స్టేషన్‌పై దాడుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. గత నెల 30న నెల్లూరులో పోలీస్ స్టేషన్, ఎస్పీ, ఇతర పోలీసులపై దాడుల ఘటనలను తాము ఖండిస్తున్నామని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం తమ హక్కులకు భంగం కలిగిందని భావించినప్పుడు నిరసనలు చేయడానికి, ఉద్యమాలు నడపడానికి చట్టపరిధిలో అవకాశాలు ఉన్నాయి. అయితే నిరసలు, ఉద్యమాలు నిర్వహించేటప్పుడు బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని సూచించింది. అంతేగాని ప్రజల క్షేమం కోసం నియమించబడ్డ పోలీసులు, పోలీస్ స్టేషన్లపైనా దాడులు చేస్తే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై శాంతి భద్రతలు క్షీణిస్తాయని హెచ్చరించింది. చట్టాన్ని ఎవరూ తమ చేతులలోకి తీసుకోరాదని సూచించింది. ప్రభుత్వ ఆస్తుల నష్టం, పోలీసులపైనా, పోలీస్ స్టేషన్లపైనా దాడులు చేసినా వారిపై కఠినమైన చట్టబద్ధ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
27మంది కాపు నేతలపై కేసులు
తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సభకు హాజరైన 27 మంది నేతలపై పోలీసులు నమోదు చేశారు. సభకు నేతృత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులపై కేసు పెట్టారు. 1.ముద్రగడ పద్మనాభం- ఏ1 2. పళ్లం రాజు (కేంద్ర మాజీ మంత్రి) 3.బొత్స సత్యనారాయణ (మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత) 4. కన్నా లక్ష్మీనారాయణ (మాజీమంత్రి, బీజేపీ నేత) 5. వట్టి వసంత్ కుమార్ (మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత) 6. ఆకుల రామకృష్ణ 7. వాసిరెడ్డి యేసుదాసు 8.జక్కంపూడి విజయలక్ష్మి (వైఎస్ఆర్ సీపీ) 9. కే.వీ.సీహెచ్. మోహన్ రావు (మాజీమంత్రి) 10. వి.హనుమంతరావు (కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రం) 11. అంబటి రాంబాబు (మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి) 12. జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే 13.వరుపుల సుబ్బరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే 14. దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే 15. గంగా భవానీ (మాజీ ఎమ్మెల్సీ) 16.జీవీ సుధాకర్, సినీ నటుడు 17. అడపా నాగేంద్ర, బీజేపీ నేత, విజయవాడ 18. నల్లా విష్ణు (అమలాపురం) 19. నల్లా పవన్ (బీజేపీ, అమలాపురం) 20.కె.తాతాజీ (కాంగ్రెస్, అమలాపురం) 21. బండారు శ్రీనివాసరావు (వేదపాలెం, టీడీపీ) 22. ముత్యాల వీరభద్రరావు (వైఎస్ఆర్ సీపీ, కొత్తపేట) 23. ఎంఎస్ఆర్ నాయుడు (నెం.1 చానల్ ఎండీ) 24.దూలిపూడి చక్రం (పసుపులంక, వైఎస్ఆర్ సీపీ) 25. యెల్లా దొరబాబు (బీజేపీ, ఏఎల్డీఏ చైర్మన్) 26. ఆలేటి ప్రకాష్ 27. జామితేనె లంకల (వైఎస్ఆర్ సీపీ, ముమ్మడివరం మండలం) -
విధ్వంసానికి జగన్ బాధ్యుడంటే ఎలా ?
అనంతపురం న్యూటౌన్ : కాపు గర్జనలో జరిగిన విధ్వంసానికి ప్రతిపక్ష నేత జగన్ బాధ్యుడనడం సీఎం చంద్రబాబు నాయుడు చేతకానితనమని కాపు నాయకులు విమర్శించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కేటీబీ (కాపు, తెలగ, బలిజ) కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీబీ రాష్ట్ర నాయకుడు జంగటి అమర్నాథ్ మాట్లాడుతూ తునిలో రైలును కాల్చిన సంఘటన దురదృష్టకరమని, అయితే ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పిదమేనన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మునిరత్నం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షనేత జగన్‌పైకి తోసేయడం చంద్రబాబుకు రివాజుగా మారిందన్నారు. కాపులను, బీసీలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్న ప్రభుత్వ పెద్దలు త్వరలో గుణపాఠం నేర్చుకోకతప్పదన్నారు. బీసీ సంఘం నేతలతో కాపులపై విమర్శలు చేయిస్తుండడం సీఎం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాపులను బీసీలలోకి చేర్చేదాకా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాపు సంఘం నేతలు భగవాన్ సునీల్, చైతన్య, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కాపు రిజర్వేషన్ల కోసం, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఆత్మత్యాగం చేసిన బలిజ యువకుడు సీవీ రమణమూర్తికి ఆత్మశాంతి కలగాలని కొద్ది నిముషాల పాటు మౌనం పాటించారు. -
ముఖ్యమంత్రి నీచ రాజకీయాలు మానుకోవాలి
మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే రెంటచింతల: కాపు గర్జనపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రెంటచింతలలోని వైఎస్సార్సీపీ నాయకులు గాలి ప్రతాప్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి కోసం చంద్రబాబు హామీల మీద హామీలు ఇచ్చారని, ఇప్పుడు హామీల అమలు కోసం ఉద్యమిస్తుంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై బురద చల్లేందుకు త నతోపాటు మంత్రుల చేత కూడా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఆత్మ విమర్శ చేసుకుని వాస్తవాలను ప్రకటించేందుకు చంద్రబాబు ముందుకు రావాలన్నారు.అధికారం శాశ్వితం కాదనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తుంచుకొని మాట్లాడాలన్నారు. సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీపై చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజులలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యులు మోర్తల ఉమామహేశ్వరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు పశర్లపాడు బ్రహ్మరెడ్డి, పోట్ల ముత్తయ్య, సర్పంచ్ వెన్నాలింగారెడ్డి, బుడసైదా తదితరులున్నారు. ఇప్పటికైనా నిర్ణయాన్ని ప్రకటించండి.. మాచర్ల: కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్తం తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కాపులను రెచ్చగొట్టి పలు సాకులతో అవాంతరాలు సృష్టించి తీరా గొడవలు జరిగితే దానికి సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్షాన్ని విమర్శించటం అత్యంత హేయమైన చర్య అన్నారు. తునిలో కాపుల సభలో జరిగిన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ముందుగానే కాపుల గురించి చర్యలు తీసుకొని వారికి ఇచ్చిన హామీల ప్రకారం నిర్ణయం తీసుకొని ఉంటే సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ జగన్, వైఎస్సార్సీపీలపై విమర్శలు చేయటం సమంజసం కాదన్నారు. ఇష్టానుసారంగా విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. -
'కాపులకు రిజర్వేషన్లు ఇస్తే మాకు సమ్మతమే'
పశ్చిమగోదావరి జిల్లా: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పదవి లేనప్పుడు ఉద్యమం చేసి.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఆయనకు అలవాటు అని ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు సమ్మతమేనని చెప్పారు. రాజకీయ రిజర్వేషన్లలో స్పష్టత ఉండాలన్నారు. తమకు మాత్రం అన్యాయం జరగకూడదని అంగర రామ్మోహన్ కోరారు. -
ఒక కులం కోసం పార్టీ పెట్టలేదు
♦ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టీకరణ ♦ ప్రజల తరపున పోరాడతా.. దేశ సమగ్రతే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా ♦ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి ♦ రిజర్వేషన్లు దక్కవనే ఆందోళన కాపుల్లో ఉంది ♦ కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం సాక్షి, హైదరాబాద్: తాను ఒక కులం కోసం రాజకీ య పార్టీ పెట్టలేదని సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక కులం కోసం పోరాడనని, ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. దేశ సమగ్రతే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమో కాదో ప్రభుత్వం ప్రకటించాలన్నారు. సాధ్యమైతే ఎలా సాధ్యం, కాకపోతే ఎలా అసాధ్యమో వివరిస్తే తరువాత ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అప్పుడు చూసుకోవచ్చన్నారు. రిజర్వేషన్లు తమకు దక్కవనే ఆం దోళన, తమను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే అసంతృప్తి కాపు సామాజికవర్గంలో ఉందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ కల్యాణ్ సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో స్పందించారు. ఎవరి ప్రోద్బలం ఉందో చెప్పలేను ‘‘తునిలో రైలు దగ్ధం ఘటనలో అసాంఘిక శక్తుల పాత్ర ఉంది. 12 బోగీలున్న రైలు ఒక్క అగ్గిపుల్ల గీసేస్తే కాలిపోయేది కాదు. ఎవరో ప్రొఫెషనల్స్ ఈ పని చేశారు. ఘటనకు పాల్పడిన వారిని వీడియో కెమెరాల సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలి. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో నేను చెప్పలేను. తునిలో పెద్ద సభ జరుగుతున్నపుడు ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో కుల రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా జరిగిన సంఘటనలను గమనించి ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేది. మేము ఆడియో విడుదల ఫంక్షన్లు నిర్వహించినపుడు అన్ని అనుమతులు ఉన్నాయా అని లక్షా తొంభై వివరాలు అడిగే పోలీసులు ఇప్పుడు అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం. ఏ ఉద్యమం అయినా శాంతియుతంగా నిర్వహిస్తే విజయవంతం అవుతుంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కమిషన్లపై కాపుల్లో నమ్మకం పోయింది ‘‘కాపులకు రిజర్వేషన్లు అనే డిమాండ్ ఇప్పటిది కాదు. గతంలో కొనసాగించి మధ్యలో ఆపివేశారు. కాపులకు రిజర్వేషన్ల వల్ల కలిగే లబ్ధి ఏమిటో నాకు తెలియదు. రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని పార్టీలూ కాపులకు హామీనిస్తున్నాయి. అలానే 2014 ఎన్నికల్లో టీడీపీ కూడా హామీ ఇచ్చింది. రిజర్వేషన్లు వస్తాయో లేదోననే అనుమానం కాపుల్లో ఉంది. గతంలో జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ వేసినా నివేదిక ఇవ్వలేదు. వీటిపై కాపుల్లో నమ్మకం పోయింది. ఏదైనా సమస్యకు సామరస్యపూర్వకంగా పరిష్కారం వెతకాలి’’ అని పవన్ సూచించారు. తునిలో ఏం జరిగిందో నాకు తెలియదు ప్రస్తుతం రిజర్వేషన్లను అనుభవిస్తున్న బీసీలకు ఎలాంటి నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేసినపుడే వారికి న్యాయం చేసినట్లు అవుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు.తుని ఘటనలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కారణమని సీఎంతో సహా మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తుండడాన్ని ఒక విలేకరి ప్రస్తావించగా... వారికి ఉన్న సమాచారం ఏమిటో తనకు తెలియదని చెప్పారు. అక్కడేం జరిగిందో తనకు తెలియదన్నారు. మీరు కాపులకు ప్రతినిధా? ఏపీకి ప్రతినిధా? అని ప్రశ్నించగా... నన్ను ఏపీ ప్రతినిధి అని ఎలా అంటారు, ఎవరి ప్రతినిధి అని ఎలా అడుగుతారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేస్తేనే కాపులకు రిజర్వేషన్లు సాధ్యమని చెప్పకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. కాపుల ఉద్యమానికి మీ మద్దతు ఉందా? లేదా? మీరు అనే విషయాల్లో సీఎం చంద్రబాబుకు ఆపద్బాంధవుడిలా వ్యవహరిస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా... పవన్ కల్యాణ్ స్పందించలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం తనను బాధించిందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉందని చెప్పారు. -
250 మంది నిందితులు గుర్తింపు
పథకం ప్రకారమే విధ్వంసం: అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడి సాక్షి, తుని/పాయకరావుపేట: తునిలో కాపు గర్జన సందర్భంగా పక్కా పథకం ప్రకారమే అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయని లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన తుని రూరల్ పోలీస్ స్టేషన్, అక్కడ దగ్ధమైన వాహనాలను ఆయన సోమవారం పరిశీలించారు. తుని పట్టణ పోలీస్ స్టేషన్లో ఉత్తర కోస్తా ఐజీ కుమార్ విశ్వజిత్, నాలుగు జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు గర్జన సభ నిర్వహించేందుకు అనుమతులు లేవని, సభలో నుంచి ఒక్కసారిగా జనం బయటకు వచ్చి రైలు ఆపి విధ్వంసం సృష్టించారని తెలిపారు. విధ్వంసకారులు పోలీసులను టార్గెట్ చేశారని, పోలీసులు సంయమనం పాటించారని చెప్పారు. దాడుల్లో పోలీసులు 15 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ఐదు వేలమంది పోలీసులను రంగంలోకి దించామని, తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని వివరించారు. కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసంలో ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసినట్టు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. వీడియో పుటేజ్‌ల ద్వారా గుర్తించిన మేరకు ప్రాథమికంగా కేసులు నమోదైనట్టు ఆయన వివరించారు. ఆందోళనకారుల దాడుల్లో రైల్వే, పోలీస్, పబ్లిక్ తదితర ఆస్తులకు సంబంధించి సుమారు రూ.103 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు సుమారు 250 మంది నిందితులను గుర్తించినట్టు సమాచారం. -
5 నుంచి ఆమరణ దీక్ష
♦ భార్యతో కలిసి నిరాహార దీక్ష.. ♦ మీడియా సమావేశంలో ముద్రగడ ♦ నా పిలుపునకు ముందే టీడీపీ మూకలు పట్టాలపైకి.. ♦ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు విధ్వంసం సృష్టించారు ♦ ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఆదేశాలతోనే జరిగింది ♦ కాపు ఐక్య గర్జన వెనుక ఎవరూ లేరు ♦ కాణిపాకం వినాయకాలయంలో ప్రమాణానికి సవాల్ సాక్షి, కాకినాడ: ‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. మా జాతి ఆకలి పోరాటం కోసం నేను, నా భార్య ఈ నెల ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి నా స్వగృహంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నాం. ప్రాణం పోయేవరకు నా జాతి సంక్షేమం కోసం పోరాడతాను’’ అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శపథం చేశారు. తానెక్కడికీ పారిపోనని, నిన్నటి ఘటనలతో తనను అరెస్టు చేస్తే బెయిల్ తెచ్చుకోనని చెప్పారు. ‘‘ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినా భయపడను. నా గ్రామంలో నా ఇంట్లోనే ఉంటాను. నాతోపాటు నడిచిన వారిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తే అందరం కలసి జైలుకు వెళ్తాం. అక్కడ కూడా నా దీక్షను కొనసాగిస్తాను. ఆడవాళ్ల జైలులో నా భార్య... మగవాళ్ల జైలులో నేను ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. నాకు సంఘీభావంగా ఎవరూ ఇక్కడకు రానవసరం లేదు. మీ గ్రామంలోనే మధ్యాహ్నం భోజనం మానేసి, ఆ తినే కంచంపై కొడుతూ సెంటర్లో నిరసన తెలపండి. నా నిరాహార దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రభుత్వానికి నా చావే కావాలనుకుంటే దానికి సిద్ధమే. నా చావు తరువాతైనా సరే మా జాతిని బీసీల్లో చేరుస్తూ జీవో ఇచ్చి తీరాల్సిందే’’ అని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగ్రహంలో ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ఆదేశాలతోనే విధ్వంసం... తునిలో జరిగిన హింసాత్మక ఘటనలన్నీ పథకం ప్రకారం చంద్రబాబు ఆదేశాలమేరకే జరిగాయని ముద్రగడ ఆరోపించారు. ‘‘కాపు ఐక్యగర్జన జనవరి 31వ తేదీన చేయాలని చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఇవ్వక పోవడం, స్కూల్ బస్సులిచ్చే వారిని బెదిరించడం, చివరకు అన్నం వండుకోవాలని స్థలం అడిగితే ఆ స్థల యజమానులను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఐక్య గర్జనను అణచివేసేందుకు సర్కారు ప్రయత్నించింది. అధికార పార్టీ నేతలు అసాంఘిక శక్తులతో సమావేశాలు పెట్టుకుని విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారు. నిన్నటి హింసాత్మక ఘటనలన్నీ వారి పథకం ప్రకారమే జరిగాయి. తొలుత మీటింగ్ తర్వాత వారం పది రోజులు గడువు ఇచ్చి రోడ్డు మీద గాని, రైలు పట్టాల మీద గాని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించాం. కానీ గడువు ఇస్తే మా సామాజిక వర్గీయులపై దాడులు జరుగుతాయన్న ఆలోచనతో... అప్పటికప్పుడు శాంతియుతంగా రాస్తారోకో, రైల్‌రోకోకు పిలుపు ఇవ్వడం జరిగింది. రైల్‌రోకో, రాస్తారోకోకు పిలుపునిస్తానని ఏ ఒక్కరికీ తెలియదు. కానీ నేను ఇంకా పిలుపు ఇవ్వకుండానే అధికార పార్టీకి చెందిన అసాంఘిక శక్తులు రైలుపట్టాలపైకి చేరుకుని రైల్‌రోకోకు దిగాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టాయి. అంతటితో ఆగకుండా మా కార్యకర్తలతో కలిసిపోయి పోలీసులపై రాళ్లు రువ్వడం.. వారి జీపులను తగులబెట్టడం.. రూరల్ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టడం చేశారు. పైగా పెట్రోల్ బాంబులతో ఇష్టమొచ్చినట్టుగా విధ్వంసానికి పాల్పడి ఉద్యమాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. మరింత విధ్వంసానికి పాల్పడి ఎక్కడ మా జాతికి చెడ్డపేరు తీసుకొస్తారేమోననే భయంతో సోమవారం సాయంత్రం వరకు సర్కారుకు గడువునిస్తూ ఆందోళనలను స్వచ్ఛందంగానే విరమింపచేశాను. ఎన్నో ఉద్యమాలు చేశాను.. ఏనాడూ మావాళ్లు ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదు. అలాంటి దుష్ట సంప్రదాయం నాకు, మా జాతికి లేదు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ నేతల ప్రోద్బలంతో జరిగిందే. ఈ హింసాత్మక ఘటనలకు పూర్తిగా చంద్రబాబే బాధ్యత వహించాలి. అన్ని వేలమంది పోలీసులు ఉన్నప్పుడు ఈ అసాంఘిక శక్తులను ఎందుకు అదుపు చేయలేక పోయారో చూస్తుంటే.. అధికార పార్టీ ఆదేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఈరోజు రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి. 144 సెక్షన్ పెట్టారని, మా గ్రామంలో రెక్కీ చేశారని, అమాయకులను కేసుల్లో ఇరికించారని, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని ఉద్యమానికి రాకపోయినా సరే వారి పేర్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. ఉద్యమానికి నాయకత్వం వహించింది నేనే... పొరపాట్లు జరిగితే నేను బాధ్యుడ్ని’’ అని చెప్పారు. కానీ అసాంఘిక శక్తులకు నాయకత్వం వహించింది టీడీపీ నేతలు కాబట్టి జరిగిన విధ్వంసానికి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాపు ఐక్య గర్జన వెనుక జగన్ లేరు కాపు ఐక్యగర్జన వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారన్న చంద్రబాబు ఆరోపణలను ముద్రగడ ఖండించారు. ‘‘ఒక్క పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మినహా రాష్ర్టంలో మరే ఇతర రాజకీయ పార్టీ అధినేతలు మాకు మద్దతు పలకలేదు. వైఎస్సార్సీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు మద్దతు పలికారు. బీజేపీలో ద్వితీయ శ్రేణి నేతలతోపాటు, టీడీపీలోని కాపు సామాజిక వర్గ క్యాడర్ పూర్తిగా తరలివచ్చింది. అంతేకానీ నా గర్జన వెనుక జగన్ ఉన్నారని ఆరోపించడం తగదు. ఈ గర్జనకు మద్దతుగా జగన్ ఎప్పుడూ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను ఎప్పుడూ జగన్‌ను కలవలేదు... కనీసం మాట్లాడనూ లేదు. కానీ ఈ గర్జన వెనుక జగన్ ఉన్నట్టుగా నీవు పచ్చి అబద్ధాలాడుతున్నావ్. ఈ విషయంలో కాణిపాకం వినాయక ఆలయంలో నేను ప్రమాణం చేస్తాను. నీవు ప్రమాణం చేయగలవా?’’ అని చంద్రబాబుకు సవాలు విసిరారు. చావో రేవో తేల్చుకుంటాం... చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారని, అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని ముద్రగడ ధ్వజమెత్తారు. ‘‘రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. బంగారు వస్తువులు మీ మెడలోకి వచ్చేస్తాయన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చాలంటే బాబు రావాలన్నారు. కాపుల సంక్షేమంకోసం ఏడాదికి రూ.1000 కోట్లు ఇస్తామని హామీలిచ్చారు. మాజాతి ఓట్లతో గద్దెనెక్కి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు.. అవీ ఇవీ అని చెబుతున్నారు. అపారమైన అనుభవం ఉన్న మీకు అప్పుడు ఇవన్నీ తెలియదా? మీరు ఆ రోజు చెప్పి ఉండకపోతే ఈరోజు రోడ్డెక్కి ఉండేవారం కాదు. నేను జూలై 31న ముఖ్యమంత్రికి లేఖ రాశాను. ‘పద్మనాభం కమిషన్ వేశాను. నెలరోజుల్లో రిపోర్టు వస్తుంది. మీ జాతికి న్యాయం చేస్తానని’ చెప్పి ఉంటే ఇలా ఆందోళన చేసి ఉండేవారం కాదు. కానీ చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం నుంచి తప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అబద్ధాలు.. మోసాలతో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికైనా మాకు జీవో ఇవ్వండి. గత రెండేళ్లుగా ఎమర్జెన్సీ కంటే భయానక రోజులు కనిపిస్తున్నాయి. 2011లో సోషియా ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ చేశారు. మా జాతకాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మా పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది. మా జాతిలో చాలామంది నిరుపేదలున్నారు. వారు కనీసం తినడానికి తిండిలేక పిల్లల్ని మధ్యాహ్న భోజనం కోసం బడులకు పంపిస్తున్నారు. మాది ఆకలి పోరాటం.. చావోరే వో తేల్చుకుంటాం’’ అని స్పష్టంచేశారు. -
కాపుగాస్తామంటూనే..కక్షసాధింపు
సాక్షి, విజయవాడ : కాపు సామాజిక వర్గం సమస్యలను పరిష్కరిస్తామంటూనే రాష్ట్ర ప్రభుత్వం వారిపై కక్షసాధింపు చర్యలకు సన్నద్ధమవుతోంది. ఒకపక్క కాపు గర్జనకు సారథ్యం వహించిన నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూనే.. మరోపక్క ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాపు గర్జనకు జిల్లా నుంచి వెళ్లిన, జన సమీకరణ చేసిన వారి వివరాలను నిఘా వర్గాలు రహస్యంగా సేకరిస్తున్నాయి. అదే సమయంలో అక్కడ ఆందోళనలోను, రైలు దగ్ధం ఘటనలోను పాల్గొన్న వారిలో ఎవరెవరు ఉన్నారనే వివరాలు తెలుసుకునేందుకు ఫొటోలు, వీడియోలను సేకరించి పరిశీలించే యత్నాల్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై కాపు సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు విజయవాడ నుంచి 1500 మంది... కాపు గర్జనకు విజయవాడ నగరం నుంచి 1500 మంది వరకు వెళ్లినట్లు నిఘా విభాగాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. దీనికి రెండు మూడు రెట్లు ఎక్కువ మంది జిల్లా నుంచి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. జిల్లాలోనూ అవనిగడ్డ, గుడివాడ, బందరు, పెడన, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది యువకులు, కాపు సంఘాలకు చెందిన ప్రతినిధులు తుని బయలుదేరి వెళ్లినట్లు ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసుకున్నట్లు సమాచారం. తుని వెళ్లిన వారిలోనూ ఆవేశంగా ఉండేవారు, గతంలో కేసులు ఉన్నవారి వివరాలు, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలుగా చలామణి అవుతున్నవారి వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్, వాహనాలు, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టినవారు జిల్లాలో ఎవరైనా ఉన్నారా అని అక్కడికి వెళ్లివచ్చిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ నేతలే టార్గెట్...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసేవారు, పార్టీ సానుభూతిపరులు ఆదివారం ఎక్కడెక్కడ ఉన్నారో సేకరించే పనిలో పోలీసు శాఖలోని ఒక వర్గం ఉన్నట్లు సమాచారం. వారు ఆందోళనలో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే తక్షణం విచారించి కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. జిల్లాలోని వైఎస్సార్ సీపీకి చెందిన ముఖ్య నేతల అనుచరులు, కాపు నేతల అనుచరుల గురించి వాకబు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో తమకు ఇబ్బంది కలిగించే వైఎస్సార్ సీపీ నేతలు ఆదివారం ఎక్కడ ఉన్నది తెలుగుదేశం నేతలు సేకరించి పోలీసులకు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో తుని దుర్ఘటనకు సంబంధించి ఎంతమందిపై కేసులు నమోదు చేస్తారోనన్న అనుమానం కాపు సంఘాల నేతల్లో వ్యక్తమవుతోంది. అక్కడ చర్చలు... ఇక్కడ కేసులా? ఉద్యమాన్ని చల్లార్చేందుకు కాపు నేతలతో ఒకవైపు చర్చలు జరుపుతూ.. మరోవైపు ఇక్కడ నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని కేసులు నమోదు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడటం చాలా దారుణమని, ఈ విషయంలోనూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్నే పాటిస్తున్నారంటూ నగరానికి చెందిన ఒక కాపు నేత వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు సాధించటమే లక్ష్యమని, తాము చంద్రబాబు పెట్టే కేసులకు ఏ మాత్రం భయపడబోమని చెప్పారు. -
'కాపు రిజర్వేషన్'పై మాట దాటేసిన పవన్
హైదరాబాద్: తుని ఘటనపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 'కాపు గర్జన' ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రవేశించడం వల్లే ఉద్యమం హింసాత్మకంగా మారిందన్నారు. చౌరీ చోరీ ఘటన మూలంగా దేశ స్వాతంత్ర్య ఉద్యమం పాతకేళ్ల పాటు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కాపులను బీసీలో చేర్చాలన్న డిమాండ్ ను మీరు సమర్ధిస్తారా అన్న ప్రశ్నకు మాత్రం పవన్ సూటిగా సమాధానం చెప్పలేదు. కులం కోసం కాదు ప్రజల కోసం ఉద్యమిస్తానంటూ సమాధానాన్ని దాట వేశారు. ఈ సమస్యను రాజకీయం చేయడం తనకిష్టం లేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు కాపులలో ఏదో భయం పట్టుకుందని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. దేశంలో ఎన్ని కుల ఉద్యమాలు జరిగినా ఇంత హింస చెలరేగలేదని పవన్ ఆ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమ నాయకులు బాధ్యతతో వహించాలని హితవు పలకడం విశేషం. మనుషుల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యవహరించకూడని, తుని ఉద్యమం హింసాత్మకంగా పరిణమించడం దురదృష్టకరమన్నారు. కాపుల డిమాండ్ ఇప్పటిదికాదని.. అనేక దశాబ్దాలుగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కాపుగర్జన సందర్బంగా ప్రభుత్వం సరైన ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, ఇప్పటికైనా కాపు నేతలతో సంప్రదింపులు జరిపి పరిస్థితి చేయి దాటకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఎప్పటిలాగే.. ఎదురుదాడి
తుని ఘటనల నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం కాపులకు రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనా చేయని వైనం అసలు విషయాన్ని పక్కనబెట్టి విమర్శల పర్వం తన వైఫల్యాలను ఇతర పార్టీలపైకి నెట్టే యత్నం ఎన్నికల్లో హామీ ఇచ్చింది బాబే.. ఇప్పుడు మాట తప్పిందీ ఆయనే హైదరాబాద్ తుని సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో స్పందించిన తీరు ఎప్పటిలాగే ఆయన చేసిన ఎదురుదాడికి నిదర్శనం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఆయన వ్యవహార శైలి ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయాలను పక్క దారి పట్టించడంలో తాను సిద్ధహస్తుడనని చంద్రబాబు అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. తాజాగా కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. తానే స్వయంగా హామీ ఇచ్చి, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచినకాపులకు రిజర్వేషన్ల అంశంపై లక్షలాది మంది కాపులు తునిలో చేరి గళమెత్తితే.. ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించినప్పుడు ఏదైనా ఆశాజనకమైన ప్రకటన వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాత్రం వారి డిమాండ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అనవసరమైన అనేక విషయాలను మాట్లాడారనే భావన మేధావులు, విజ్ఞుల్లో సైతం వ్యక్తం అవుతోంది. అధికారంలోకి రాగానే కాపులను బీసీలో చేర్చుతానని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న టీడీపీ అధినేత అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఆ విషయం పూర్తిగా విస్మరించారు. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏడాదికి రూ.1,000 కోట్లు ఇస్తామనిపకటించి, ఇప్పటివరకు రూ.100 కోట్లకు మించనివ్వలేదు. తాజాగా రిజర్వేషన్ల హామీలను నెరవేర్చడంలో తన వైఫల్యాన్ని ఇతరులపై నెట్టేందుకు, బురద జల్లేందుకు బాబు విఫలయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో సైతం ఏ విధంగా అయితే ప్రతిపక్షంపై ఎదురుదాడికి పూనుకుని సమస్యలు చర్చకు రాకుండా చంద్రబాబు పక్కదోవ పట్టించారో, ఇప్పుడు కాపుల అంశంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. అప్పటికప్పుడు చోటు చేసుకున్న సంఘటనలను అసలు ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి ఆపాదించడంతో పాటు, రాజకీయం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏది జరిగినా ప్రతిపక్షంపై నిందలేనా..?! రాష్ట్రంలో ఏది జరిగినా ప్రతిపక్షాలపై ఆ నిందలు వేయడం విచక్షణ ఉన్న పాలకుడు చేసే పని ఎంత మాత్రం కాదని మేధావులు అంటున్నారు. అసలు సమస్యకు మూలమేంటో గ్రహించినా పట్టించుకోని విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి ఒక నిర్ణీత కాల వ్యవధిలోపుగా రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. ఏటా రూ.1,000 కోట్లు కాపుల సంక్షేమానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ముద్రగడ ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తుని సభలో కాపులు అడిగింది కూడా అదే. కానీ చంద్రబాబు తుని సంఘటనలపై స్పందించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ రెండు ప్రధాన డిమాండ్లపై కాపులకు సంతృప్తి కలిగించే విధంగా ప్రకటన చేయకపోగా పూర్తి రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ పోయారు. కాపుల సమస్యలతో సంబంధంలేని కాల్‌మనీ వ్యవహారాన్ని ముడిపెడుతూ మాట్లాడారు. అంతే కాదు, రాజధానికి అడ్డుపడుతున్నారని, శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ హూంకరించారు. చివరకు విలేకరులు అడిగిన ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకుండా దబాయించే యత్నం చేయడం స్పష్టంగా కన్పించింది. చిత్తశుద్ధి లేదని తేలిపోయింది.. అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయిన తరుణంలో కూడా రిజర్వేషన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నానని, అధ్యయనం కోసం కమిషన్ వేశామని చెప్పడం.. చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ధి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కమిషన్ పేరిట కాలయాపనకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనేది సుస్పష్టం. వాస్తవానికి ఇప్పటికే కులగణన ఆధారంగా కాపులు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక జీవన స్థితిగతులపై వివరాలుండగా ఇంకా జాప్యం చేయడం ఏమిటని రాజకీయవేత్తల్లో ఉత్పన్నం అవుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇప్పుడు ఇన్ని కారణాలు చెబుతున్న చంద్రబాబుకు.. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేటపుడు అవి గుర్తుకురాలేదా? ఎలాంటి ఆలోచనలు చేయకుండానే హామీ ఇచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తానే అడ్డుకుంటూ.. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడం అసలు సమస్యను పూర్తిగా తప్పుదోవ పట్టించడానికేనని కూడా అంటున్నారు. బీసీ నేత ఆర్.కృష్ణయ్య టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పటికే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ దృష్ట్యా తన పార్టీలోనే ఉన్న బీసీ నేత కృష్ణయ్యకు చంద్రబాబు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించకుండా ఇంకా ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని మాట్లాడ్డం కూడా అర్థరహితంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణయ్యను చంద్రబాబు ఎందుకు కట్టడి చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరో అడ్డుకుంటున్నారని, ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు.. రాజకీయాలకు అతీతంగా తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం గర్జన చేస్తున్నామని కాపు నేతలు చెప్పినా.. తెలుగుదేశం పార్టీకి చెందినవారెవరూ అటువైపు వెళ్లవద్దని ఎందుకు అడ్డుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది పారిశ్రామికవేత్తలు, మేధావులు, సినీ ప్రముఖులు గర్జనకు మద్దతు పలికినా.. దాన్ని విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. గర్జనకు వాహనాలు ఇవ్వద్దంటూ ఆంక్షలు విధించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తప్పులన్నీ తానే చేసి.. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది చంద్రబాబు. ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదీ చంద్రబాబే. ఇలా తప్పులన్నీ తానే చేసిన చంద్రబాబు ఇప్పుడు నెపం ఇతరులపై నెట్టడాన్ని అన్ని వర్గాలూ ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా వైఎస్సార్సీపీ వల్లనే భవిష్యత్తులో బాబుకు ఇబ్బంది. అందుకనే ఏ విషయమైనా సరే.. సంబంధం ఉన్నా లేకున్నా అభాండాలు వేయడం బాబుకు పరిపాటిగా మారింది. బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ కూడా తన అనుచరులతో కలిసి గర్జనకు హాజరయ్యారు. మరి ఆ పార్టీ గురించి బాబెందుకు మాట్లాడరు? బీజేపీతో స్నేహం ఉన్నందుకేనా? అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. -
రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడే..
సాక్షి, నెట్వర్క్: కాపు ఐక్యగర్జన సందర్భంగా తునిలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో విశాఖ మార్గంలో వెళ్లే రైళ్లు, బస్సులకు ఎక్కడికక్కడ బ్రేక్‌లు పడ్డాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే విభాగం.. ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాఖ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖ, కాకినాడ వైపునకు వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని మార్గమధ్యంలోనే నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిలిచిన రైళ్ల వివరాలు..: విశాఖ నుంచి బయల్దేరే విశాఖ-కాకినాడ, విశాఖ-రాజమండ్రి, విశాఖ-విజయవాడ ప్యాసింజర్ రైళ్లు, విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ-సికింద్రాబాద్ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, విశాఖ-సికింద్రాబాద్ దురంతో, విశాఖ సికింద్రాబాద్ గరీబ్థ్,్ర విశాఖ-విజయవాడ ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు. విశాఖ మీదుగా వెళ్లే విశాఖ-తిరుపతి తిరుమలను తునిలో నిలిపేశారు. భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి) ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ జిల్లా గుల్లిపాడులోను, హౌరా-చెన్నై మెయిల్‌ను నర్సీపట్నం రోడ్డులోనూ, గుంటూరు-విశాఖ(సింహాద్రి) ఎక్స్‌ప్రెస్‌ను హంసవరంలో నిలిపేశారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను పిఠాపురం వద్ద నిలిపేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ బయల్దేరిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట స్టేషన్ వరకే పరిమితమైంది. హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ పెద్ద అవుతపల్లి స్టేషన్లో నిలిచిపోయింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కొవ్వూరులో, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏలూరులో, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను తాడేపల్లిగూడెంలో నిలిపేశారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు సిటీ రైలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ మార్గంలో వెళ్లే 15 రైళ్లను విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర ప్రాంతాల్లో నిలిపేసినట్లు రైల్వే డీఆర్ఎం అశోక్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఉదంతం దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విశాఖ,కాకినాడ వైపునకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆదివారం అప్పటికప్పుడు రద్దు చేశారు. రైళ్ల రద్దు సంగతి తెలియకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు చేరుకొన్న ప్రయాణికులు చివరి క్షణంలో రైళ్లు రద్దయినట్లు తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు: రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు సమాచారమిచ్చేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. విశాఖ: 8500358230, 8106053051, 0891-2575083, విజయవాడ: 0866-2575038, రాజమండ్రి: 0883-2420451, 0883-2420543, తుని: 08854-252172 కదలని బస్సులు..: మరోవైపు విశాఖ నుంచి తుని మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. విశాఖ ఆర్టీసీ రీజియన్‌లో హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, నర్సాపూర్ వంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 175 బస్సులను రద్దు చేశారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే 10 బస్సులను విజయవాడలోనే నిలిపివేశారు. -
కాపు ఐక్యగర్జనకు కరెంట్ కట్
సెల్ సిగ్నళ్లు, కేబుల్ ప్రసారాల నిలిపివేత పిఠాపురం/తొండంగి: తుని వద్ద ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన బహిరంగసభకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. బహిరంగ సభ ప్రారంభం నుంచి సభ జరిగే ప్రాంతంతో పాటు సమీప గ్రామాలకూ విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనికి తోడు ‘జామర్లు’ ఏర్పాటు చేసినట్టుగా అన్ని కంపెనీల సెల్ సిగ్నళ్లూ పనిచేయలేదు. టీవీ చానళ్లు, కేబుల్ టీవీ ప్రసారాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సభకు అడ్డంకులు కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి అవాంతరాలు సృష్టించారని సభకు వచ్చిన కాపు నాయకులు మండిపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరా, సెల్ సిగ్నల్స్ లేకపోవడం, ప్రసార మాధ్యమాలు పనిచేయకపోవడంతో సభకు వచ్చిన వారితో పాటు సమీప గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులు పడ్డారు. ప్రశాంతంగా ప్రారంభమై.. తుని రూరల్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ ఉదయం ప్రశాంతంగానే ప్రారంభమైంది. ముద్రగడ పిలుపు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తంగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వివిధ జిల్లాలకు చెందిన కాపులు సభాప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారు. అప్పటినుంచి చూస్తే.. 10.10 గంటలకు ముద్రగడ పద్మనాభం తన మనవరాలు భాగ్యశ్రీతో కలసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 10.45 గంటలకు జామర్ల ఏర్పాటుతో సభా ప్రాంగణంలో సెల్ సిగ్నల్స్ స్తంభించి పోయాయి. 12.45 గంటల సమయంలో వేదిక, ప్రెస్ గ్యాలరీలు కూడా సభికులతో నిండిపోయాయి. 1.30 గంటలకు వేదికపై నాయకులు ఆశీనులయ్యారు. 1.45 గంటలకు అభిమానుల హర్షధ్వానాల మధ్య ముద్రగడ వేదికనెక్కి అందరికీ అభివాదం చేశారు. 2.37 గంటల నుంచి 2.54 గంటల వరకు ముద్రగడ ప్రసంగించారు. అనంతరం వేదికనుంచి దిగిన ముద్రగడ హైవేపై ధర్నాకు దిగారు. అభిమానులు అనుసరించగా అక్కడ ప్రసంగం చేశారు. 3.00 గంటలకు ఆందోళనకారులు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు. 3.15 గంటల సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. వేగం తగ్గించిన డ్రైవర్ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంలోనే డ్రైవర్లకు, కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైలును నిలిపివేసిన డ్రైవర్లు రైలు వదిలి పరుగులు తీశారు. ప్రయాణికులు తమ తమ లగేజీలతో రైలు దిగిపోయారు. 4.40 గంటల సమయంలో కొందరు రత్నాచల్‌కు నిప్పు అంటించారు. అడ్డుకోబోరుున నలుగురు ఆర్పీఎఫ్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. 5.00 గంటలకు హైవేపై టైర్లకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. -
నిఘా విభాగం నిద్దర!
సాక్షి, హైదరాబాద్: భారీ స్థాయిలో రాజకీయ సభలు, లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేందుకు అవకాశం ఉన్న ‘గర్జన’ల వంటి కార్యక్రమాలు, నిరసన ప్రదర్శన వంటివి జరుగుతున్నప్పుడు పోలీసులు, నిఘా వర్గాల ప్రాథమిక దృష్టి ప్రధానంగా మాబ్ కౌంటింగ్ (హాజరయ్యేవారి లెక్కింపు), మాబ్ నిర్వహణలపై ఉండాలి. లక్షలాదిమందికి సంబంధించిన, సెంటిమెంట్‌తో కూడిన, సున్నితమైన అంశాల్లో వీటిపై మరింతగా శ్రద్ధ పెట్టాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. అప్పుడే ఎలాంటి అపశ్రుతులనైనా, అవాంఛనీయ సంఘటనలనైనా నివారించేందుకు అవకాశం ఉంటుంది. కానీ కాపు ఐక్య గర్జన విషయంలో ఇవేవీ జరగలేదు. నిఘా వర్గాల వైఫల్యం చాలా స్పష్టంగా కన్పిస్తోంది. మాబ్ కౌంటింగ్, మాబ్ నిర్వహణ వంటి అంశాలను పోలీసులు పూర్తిగా విస్మరించిన నేపథ్యంలోనే రైలుకు నిప్పు నుంచి పోలీసుస్టేషన్ల దగ్ధం వరకు ఒకదాని తర్వాత మరొకటిగా ఘటనలు చోటు చేసుకున్నాయన్నది నిర్వివాదాంశం. సరైన అంచనాలతో సమర్థ నిర్వహణ సభా వేదిక అయిన తుని సమీపంలోని వి.కొత్తూరుకు ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, సమీపంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం ద్వారా మాబ్ కౌంటింగ్ చేయాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఆ ప్రాంత చుట్టుపక్కల ఉన్న టోల్గేట్ సిబ్బందితోనూ సంప్రదింపులు జరుపుతూ ఎన్ని వాహనాలు తుని వైపు వచ్చాయి? తదితర అంశాలను ఎప్పటిప్పుడు సమీక్షించాలి. అలాగే రైళ్ళు, ఆర్టీసీ బస్సుల్లో ఎంతమంది వచ్చారనే దానిపై కూడా ఓ అవగాహన ఉండాలి. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చేవారి మూడ్ ఏరకంగా ఉంది? వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయి? అనేవి అంచనా వేయడానికి స్పెషల్ బ్రాంచ్, ఐడీ పార్టీలను వినియోగిస్తుంటారు. సభకు హాజరయ్యే వారు ఎక్కడైఆన ఒకచోట గుమిగూడకుండా చూడటం, వచ్చిన వారిని వచ్చినట్లు సభాస్థలి వైపు నడిపించడం తదితర చర్యలన్నీ వ్యూహంలో భాగంగా తీసుకుంటారు. సభాస్థలికి పరిమితికి మించిన జనం వచ్చినప్పుడు మాత్రమే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీప ప్రాంతాలతో పాటు అధికారిక పార్కింగ్ లాట్స్‌లో అవసరమైన ఏర్పాట్లు చేసి రద్దీని ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిలువరిస్తారు. అయితే ఆదివారం భారీ సంఖ్యలో సభకు వచ్చినవారు తుని రైల్వేస్టేషన్లోనే ఆగుతున్నా పోలీసు విభాగం పట్టించుకోలేదు. వారి మూడ్, భావోద్వేగాలను అంచనా వేయడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలమైంది. ఓ ఘటన జరిగిన తర్వాత కూడా... తుని రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకు నిప్పు ఘటన తర్వాత కూడా పోలీసు విభాగం సరైన రీతిలో స్పందించలేదు. కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా చేసిన ప్రకటనలు, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు సంయమనం కోల్పోయి తీసుకున్న చర్యలు.. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం కల్పించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా?
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: కాపు గర్జన ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో అవాక్కయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కోపాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలపై చూపించారు. కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా అని పార్టీ నేతలను ప్రశ్నించి.. దాన్ని పసిగట్టలేకపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం నుంచి గర్జన పరిణామాలను ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ వచ్చారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ ఏంజరుగుతుందో తెలుసుకోలేకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహించినట్లు సమాచారం. సమావేశం జరుగుతుందని మాత్రమే అంచనా వేశామని, అప్పటికప్పుడు ముద్రగడ ఆందోళనకు పిలుపునిస్తారని ఊహించలేదని అధికారులు వివరణ ఇచ్చినా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోవడం, కనీసం అక్కడ ఏంజరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాపు గర్జనకు అనూహ్య స్పందన రావడానికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరే కారణమని ఆ పార్టీలోని కాపు నేతలు అంటున్నారు. సీఎం అయిన తరువాత కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని పట్టించుకోకపోవడం, కాపు నాయకుల్ని ఎదగనీయకుండా తొక్కిపెట్టడం వంటివాటి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కట్టడి చేయడం వల్లే.. ‘కాపు నాయకులు ఎవరూ సభకు వెళ్లవద్దని టెలి కాన్ఫరెన్సుల్లో మా అధినేత ఆదేశించడం వల్లే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. పార్టీలోని కాపు ఎమ్మెల్యేలను వెళ్లనిచ్చి ఉంటే సమస్యే ఉండేది కాదు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. నెరవేర్చకపోవడం వల్ల యువతలో అసహనం పెరిగింది. బాబుపై నమ్మకం లేకపోవడం వల్లే ఉద్యమించి సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. కాపు కార్పొరేషన్ జీవో జారీచేసి ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు రూ.వంద కోట్లే ఇవ్వడంతో యువతలో కోపం పెరిగింది. ఇవన్నీ కాపు ఉద్యమం వైపు జనాన్ని నడిపించాయి. ఇందుకు పార్టీ అధినేత చంద్రబాబే బాధ్యుడు. కాపు గర్జనలో బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నా.. వైఎస్సార్ సీపీని టార్గెట్ చేయడం కూడా తప్పే. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తారు. ఇది పార్టీకే నష్టం..’ అని టీడీపీలోని కాపు నాయకులు పేర్కొన్నారు. -
జీఓ 30 అమలు అసాధ్యం
* కాపు నాయకులే దాన్ని ఇవ్వొద్దన్నారు * కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారు * కమిషన్ సిఫారసు చేయకపోతే మేమేం చేయలేం * ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ * ఖద్దరు బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజం సాక్షి, విజయవాడ బ్యూరో: కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నంబర్ 30ను అమలు చేయడం అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టు తీర్పులున్నాయని చెప్పారు. తునిలో జరిగిన ఘటనలు కాపులకే నష్టదాయకమని వ్యాఖ్యానించారు. కాపు ఐక్య గర్జన పరిణామాలపై ఆయన ఆదివారం రాత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు కావాలని ఇదంతా చేశాయని ఆరోపించారు. తునిలో జరిగిన ఆందోళనలో 25 వాహనాలు, ఒక రైలు కాలిపోయాయని, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారని చెప్పారు. వారిలో ఒక సీఐ, కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెండు పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయన్నారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో 40 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు, అమరావతిని ఇలాగే అడ్డుకున్నారని, రాయలసీమలోనూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని ఆరోపించారు. జీఓ ఇచ్చినా చెల్లదు కాపులను బీసీల్లో కలపాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారని ఉద్ఘాటించారు. బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎలా చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. కాపుల రిజర్వేషన్లపై సిఫారసుల కోసం కమిషన్‌ను నియమించామని తెలిపారు. జీఓ నంబర్ 30ని అమలు చేయడం ఎలా సాధ్యమని కాపు నేతలను ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఒక కమిషన్ వేసి, దాని సిఫారసుల ఆధారంగా చేయమని ఈ జీఓలో పేర్కొన్నారని, దానిపైకొందరు కోర్టుకెళ్లారని పేర్కొన్నారు. బలవంతంగానో, శాంతిభద్రతల సమస్య కారణంగానో దీనిపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఒక కమిషన్ వేసి వాళ్ల నివేదిక ప్రకారం చేయాలని సూచించిందని గుర్తుచేశారు. కమిషన్ సిఫారసు చేయకపోతే తాము చేయడానికి ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం చేయకపోతే ఈ రిజర్వేషన్లపై జీఓ ఇచ్చినా చెల్లదన్నారు. దానిపై తాను తూర్పుగోదావరి జిల్లాలో కాపు నేతలతో మాట్లాడానని, జీఓ ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారమే చేయాలని వారు కోరారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్లపై ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. గర్జనలో కాపులు 10 శాతం మందే వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ వాళ్లే ఇదంతా చేయించారని, వాళ్లకు సంబంధించిన ఆరు, ఏడు వాహనాలను ముందే పంపించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఒక కుట్ర ప్రకారం ఇదంతా జరిగిందన్నారు. రైళ్లు తగులబెట్టడం, పోలీసులను కొట్టడం దారుణమన్నారు. ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులు ఫోజులు కొడుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ప్రభుత్వం అంటే అంత చులకనైపోయిందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే తాను రేపే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, జీఓ ఇస్తానని అది నిలవకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. కాపుల ఐక్య గర్జనకు ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువ మంది వెళ్లారని, కాపులు ఐదు, పది శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇకపై సమావేశాలు జరిగితే ఆధార్ కార్డులు చూపిస్తే కానీ లోనికి పంపని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. -
నేడు మీడియా ముందుకు పవన్
సాక్షి, హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన ‘కాపు గర్జన’ కార్యక్రమం సందర్భంగా జరిగిన పరిమాణాలపై స్పందించడానికి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ సోమవారం మీడియా ముందుకు రానున్నారు. కేరళలో సినిమా షూటింగ్లో ఉన్న పవన్‌కల్యాణ్ సంఘటన వివరాలు తెలిసిన వెంటనే హైదరాబాద్‌కు పయనమయ్యారని జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
కాలి బూడిదైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కాపు ఐక్యగర్జన రత్నాచల్‌పై రాళ్ల వర్షం, ఇంజన్ ధ్వంసం, బోగీలకు నిప్పు సాక్షి, తుని: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో జాతీయ రహదారి-16 సమీపంలో తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామం వద్ద ఆదివారం జరిగిన కాపు ఐక్యగర్జన తీవ్ర పరిణామాలకు దారితీసింది. సభకు హాజరైన లక్షలాదిమంది కాపు సామాజిక వర్గీయులు.. ఐక్యగర్జన సారథి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపుతో రాకపోకలను దిగ్బంధం చేయడానికి జాతీయ రహదారిపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే కొందరు రైల్‌రోకో చేసేందుకు తుని రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపైకి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆగకుండా ముందుకు దూసుకురావడంతో రాళ్ల వర్షం కురిపించారు. ఇంజన్‌ను ధ్వంసం చేశారు. ప్రయాణికులను కిందకు దింపేసి రైలుకు నిప్పు పెట్టారు. మరో పక్క అనేక పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ భవనంతో పాటు ఇంకా ప్రారంభానికి నోచుకోని డిగ్రీ కళాశాల భవనానికి నిప్పు పెట్టారు. పోలీసులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. మీడియా సిబ్బందిపై దాడికి దిగి వారి చేతుల్లో ఉన్న కెమెరాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు రోడ్‌పై బైఠాయించడంతో జాతీయ రహదారి-16కు ఇరువైపులా కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచి పోయింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకొని రాళ్ల వర్షం కురిపించారు. ఈ హఠాత్పరిణామంతో ైరైలులో ఉన్న ప్రయాణికులు ఎవరికి వారు ట్రైన్లో నుంచి దూకేసి భయాందోళనలతో పరుగులు తీశారు. సుమారు రెండుగంటల పాటు రత్నాచల్‌ను అడ్డగించిన ఆందోళనకారులు ఊహించని రీతిలో ట్రైన్‌కు నిప్పుపెట్టారు. కొద్దిసమయంలో బోగీలన్నీ అంటుకుని మంటలు చెలరేగాయి. అప్పటి వరకు కొద్ది దూరంలో వేచి ఉన్న ప్రయాణికులు ట్రైన్‌కు నిప్పు పెట్టడంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పిల్లాపాపలతో రోడ్లపైకి పరుగులు తీశారు. రైలు నుంచి ఉవ్వెత్తున ఎగసిన పొగ జాతీయ రహదారిపై, పక్కనే ఉన వెలమకొత్తూరు గ్రామంపై నల్లగా కమ్మేసింది. పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలపై ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారు. దీంతో వారు చేసేది లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. జాతీయ రహదారిపై టైర్లకు నిప్పులు పెట్టిన ఆందోళనకారులు కళాశాల గ్రౌండ్స్‌లో ఉన్న పోలీసులను తరిమికొట్టారు. వారిలో కొందరు పక్కనే ఉన్న కళాశాల భవనంలోకి చేరుకోగా తలుపులకు తాళాలు వేసి కళాశాల ప్రాంగణంలో ఉన్న సుమారు 30కి పోలీసు జీపులు, వ్యాన్లకు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా జాతీయ రహదారి పక్కనే ఉన్న తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జీపులతో సహా పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. రూరల్ స్టేషన్లో ఉన్న 100కు పైగా ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. దగ్ధమవుతున్న వాహనాల నుంచి టైర్లు, ట్యాంకర్లు పేలుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. వెలమకొత్తూరు వాసులు గ్రామం పూర్తిగా ఖాళీ చేసి చేతికి దొరికిన వస్తువులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. జాతీయ రహదారిపై కూడా ఎక్కడికక్కడ టైర్లు, ఇతర పనికిరాని వస్తువులకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బంది బంక్‌ను మూసేసి పరుగులు తీశారు. ఆందోళనకారుల దాడుల్లో పోలీస్ ఉన్నతాధికారులతో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గర్జన ప్రాంగణం నుంచి తుని పట్టణంలోకి వచ్చిన ఆందోళనకారులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పు పెట్టారు. కానిస్టేబుళ్లకు గాయాలు రైల్వే, పోలీస్ స్టేషన్లపై దాడి సందర్భంలో పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారులు పోలీసులను పరుగులు తీరుుంచి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో కాకినాడకు చెందిన ప్రసాద్, కె.లోవరాజు, జడ్డంగికి చెందిన కానిస్టేబుల్ వరహాలు, మరో ఐదుగురు రైల్వే కానిస్టేబుళ్లు గాయపడ్డారు. కాకినాడ, జడ్డంగికి చెందిన కానిస్టేబుళ్లు ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కాగా ఆందోళనకారుల దాడిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందినట్టు వదంతి వ్యాపించింది. అరుుతే దానిపై స్పష్టత ఇవ్వడానికి పోలీసు అధికారులు అందుబాటులో లేరు. ఇద్దరు విలేకరులు గాయాల పాలయ్యారు. హైవేపై రాకపోకలను అడ్డుకునేందుకు ఆందోళనకారుల ఇనుపచట్రాలను అడ్డుగా వేశారు. -
తుని ఘటన: విజయవాడలో 144 సెక్షన్
విజయవాడ/తుని: తునిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే విజయవాడలో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మంగళగిరి నుంచి అదనపు బలగాలు చేరుకున్నట్టు సమాచారం. అయితే కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపుగర్జన కార్యకర్తలు ఆయనను అనుసరించి రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించారు. దీంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆందోళన చేస్తుండగా, అదే సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ఇంజిన్ ధ్వంసమైంది. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరు ఆగదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం: చంద్రబాబు
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో తునిలో ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆదివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుని ఘటన చాలా బాధాకరమని చెప్పారు. ఈ రోజు ఘటనల వల్ల కాపులకే నష్టమన్నారు. కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతామని స్పష్టం చేశారు. అకారణంగా రాజకీయ దురద్దేశాలతో ఈ పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఇబ్బందులు కలిగించాలని కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని అన్నారు. అందులో భాగంగానే తుని ఘటనలు జరిగినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. వారి స్వార్థం కోసం విధ్వంసానికి దిగుతున్నాయని విమర్శించారు. మీటింగ్ కు అడ్డంకులు కలిగించారంటూ తనపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. తుని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఆందోళనలో దాదాపు 25 వాహనాలు దగ్ధమైనట్టు చెప్పారు. ఒక రైలు పూర్తిగా మంటల్లో దగ్ధమైనట్టు తెలిపారు. మీటింగ్‌లో ఎలాంటి శక్తులున్నాయో తెలియదన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, 8 మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. రెండు పోలీస్ స్టేషన్లు కూడా ఆహుతయ్యాయని చంద్రబాబు అన్నారు. ఈ ఘటన విషయంలో చాలా ఓపిక పట్టామని.. అందరికీ ఓపిగ్గా ఉండమని చెప్పామని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనల వల్ల వేరే కులాల్లో రియాక్షన్ వస్తే.. అసలే ముప్పు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. రిజర్వేషన్ల విషయంలో నేనేం చేయాలి' అంటూ మీడియా ప్రతినిధులను చంద్రబాబు ప్రశ్నించారు. జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆయన అన్నారు. కేంద్రం నుంచి రావాల్సినవి నిదులు రావడం లేదని చెప్పారు. డబ్బులు లేక కాపులకు 100 కోట్ల రూపాయలు మాత్రమ ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. -
కాపుల ఆందోళన హింసాత్మకం
-
'అందుకే తునిలో ఉద్రిక్త పరిస్థితులు'
హైదరాబాద్/తుని: టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలో చేర్చాల్సిందేనని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వద్ద అన్ని గణంకాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చడానికి 18 నెలలు ఎందుకు ? అని సూటిగా ప్రశ్నించారు. ఎవరినైనా మోసం చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ అంశంలో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అంశంలో యువతను మోసం చేశారని ఆరోపించారు. తమను బీసీల్లో చేర్చకపోవడంపై కాపుల్లో అలజడి, అశాంతి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తునిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనని సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
'పోలీసులే రెచ్చగొట్టారు'
తుని: పోలీసుల వల్లే తమ కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. రాస్తారోకో చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని చెప్పారు. తర్వాత తమపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారని తెలిపారు. ఈ కవ్వింపు చర్యల వల్లే చాలా మంది రెచ్చిపోయారని ఆందోళనకారులు వెల్లడించారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పై ఆందోళన కారులు దాడి చేశారు. స్టేషన్ ప్రాంగణంలో 8 వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు కాపుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో తునికి అదనంగా పోలీసు బలగాలు తరలిస్తున్నారు. ఆందోళనకారులు భారీ సంఖ్యలో బైఠాయించడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవరించారని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. -
'దాడులు చేస్తున్నా.. సంయమనం పాటిస్తున్నారు'
తుని: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని డీజీపీ రాముడు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేస్తున్నా.. పోలీసులు సంయమనం పాటిస్తున్నారని ఆయన అన్నారు. తునిలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నామని డీజీపీ రాముడు వెల్లడించారు. -
హింసాత్మకంగా మారిన కాపుల ఆందోళన
తుని: కాపుల ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు తుని రూరల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిప్పు పెట్టారు. పలు వాహనాలు దగ్ధమవుతుండడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారంది. అంతకుముందు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో ఐదు బోగీలకు మంటలు వ్యాపించాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ, గోదావరి, వోకా ఎక్స్ ప్రెస్ రైళ్లు విశాఖపట్నంలోనే ఆపేశారు. విశాఖ-విజయవాడ మధ్యలో పలు రైళ్లు నిలిపివేశారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కొవ్వూరులో నిలిచిపోయింది. విశాఖ నుంచి వెళ్లాల్సిన రాజమండ్రి, కాకినాడ ప్యాసింజర్లు రద్దు చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి ఆందోళనకారులు జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. యలమంచిలి, కొక్కరాపల్లి వద్ద హైవేపై లారీలను పోలీసులు నిలిపివేశారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులను ఆపేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. -
కాసేపట్లో చంద్రబాబు అత్యవసర సమావేశం
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు భేటీకానున్నారు. తునిలో కాపుగర్జన సభలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రైలు, రాస్తా రోకోలకు పిలుపునివ్వడంతో కోల్‌కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో రైళ్లను ఆపివేశారు. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు, తుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. కాపు గర్జన తీవ్ర రూపం దాలుస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను పంపిస్తున్నారు. -
అది రాజకీయ గర్జన: మంత్రి గంటా శ్రీనివాసరావు
తునిలో ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా రాజకీయ గర్జనగా మంత్రి గంటా పేర్కొన్నారు. కాపుల ప్రయోజనాలను రాజకీయ పార్టీలు దెబ్బతీయొద్దన్నారు. ముద్రగడ గర్జనకు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు భుజాన వేసుకుంటున్నాయని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లపై బీసీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా కాపులను బీసీల్లో చేర్చడానికి సీఎం కట్టుబడి ఉన్నారని, చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, కాపు కార్పొరేషన్, మంజునాథ కమిషన్ ఏర్పాటు ఇందులో భాగమేనన్నారు. 9 నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చాక శాస్త్రీయంగా కాపులను బీసీలో చేర్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. -
తునిలో ఉద్రిక్తత; రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు
తుని: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తుని రైల్వే స్టేషన్లో ఆగిపోయిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. బోగీలన్ని మంటల్లో కాలిపోయాయి. అంతకుముందు రాళ్లు రువ్వడంతో ఇంజిన్ ధ్వంసమైంది. ఆదివారం తునిలో ప్రారంభమైన కాపుగర్జనలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాస్తా, రైల్ రోకోలకు పిలుపునివ్వడంతో కోల్‌కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విజయవాడ-విశాఖపట్నం మధ్య రైళ్లు ఆగిపోయాయి. -
ఉద్యమరూపం దాల్చిన కాపుగర్జన
తుని: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపుగర్జన కార్యకర్తలు ఆయనను అనుసరించి రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించారు. దీంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆందోళన చేస్తుండగా, అదే సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ఇంజిన్ ధ్వంసమైంది. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరు ఆగదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ముద్రగడ చెప్పారు. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఈ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చే విషయాన్ని విస్మరించారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేరుస్తున్నట్టు జీవో ఇచ్చే వరకు రైలు పట్టాలు, రోడ్లపై నుంచి వెళ్లేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు. -
ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిస్తున్నా?: ముద్రగడ
తుని: కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. వి. కొత్తూరు వద్ద నిర్వహిస్తున్న కాపు ఐక్య గర్జనలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సాధన కోసం కాపులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తమ ఉద్యమానికి ఇతర కులాలవారు కూడా మద్దతు తెలిపారని వెల్లడించారు. టీడీపీ నేతలు రాకపోయినా, కేడర్ వచ్చారని తెలిపారు. బ్రిటీష్ కాలంలో కాపు, బలిజ, తెలగ కులస్తులు రిజర్వేషన్లు అనుభవించారని గుర్తు చేశారు. 1993లో విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 30 నంబరు జీవో ఇచ్చారని, తర్వాత ఏడాది ఆయన ఓడిపోవడంతో ఈ జీవో అమలు కాలేదని వివరించారు. హైకోర్టులో పిటిషన్ వేయించి చంద్రబాబు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో జీవో 30 అమల్లోకి రాకుండా పోయిందన్నారు. కాపులకు ఎంతో చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కోర్టులో పిటిషన్ వేసి రిజర్వేషన్లు అమలు కాకుండా ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఏం చేశావని చంద్రబాబు తనను అడుగుతున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాలుపంచుకున్న చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ముద్రగడ ప్రశ్నించారు. -
నేడే కాపు ఐక్య గర్జన
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం నిర్వహించనున్న కాపు ఐక్య గర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యూరుు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరగనున్న ఈ భారీ సభకు రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు, ఒంటరి సామాజిక వర్గీయులు, ప్రముఖులు సుమారు పది లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. వి.కొత్తూరు వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పక్కనే ఉన్న 110 ఎకరాల సువిశాల కొబ్బరితోటలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభమవుతుంది. జాతీయ రహదారికి అభిముఖంగా ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. సాంస్కతిక కళారూపాల కోసం మరో ప్రత్యేక వేదిక తయారైంది. సభా ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. ముద్రగడ పద్మనాభం ఒక్కరే ఎక్కువ సేపు మాట్లాడతారని భావిస్తున్నారు. వాహనాలకోసం 11 చోట్ల 160 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. తిరుగుప్రయాణంలో ఇబ్బంది లేకుండా మూడు లక్షల మందికి భోజనం అందిస్తారు. ప్రాథమిక వైద్యసేవలకోసం మూడు బృందాలను ఏర్పా టు చేశారు. మందులను, రెండు అంబులెన్సులను ఉంచుతున్నారు. -
ఆ వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగినవా?
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగే కాపు ఐక్య గర్జన ...రాజకీయ సభ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్ తరాల భద్రత, ప్రయోజనాల కోసమే కాపు గర్జన సభ జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో అసహనం వ్యక్తం చేశారని.. కాపు గర్జన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ తమ పార్టీ పేరు పెట్టి అన్నందునే దానిపై తాము స్పందించాల్సిన వచ్చిందన్నారు. కాపుల సంక్షేమం, రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెబుతూ దాన్ని చెడగొట్టే ధోరణిలో వైఎస్ఆర్ సీపీ వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు అనడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను ఉమ్మారెడ్డి ఖండించారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న కాపు గర్జనపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాపులను కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కాపులను రెచ్చగొడుతోందని సీఎం కార్యాలయం చేసిన ప్రకటన దుర్మార్గమన్నారు. ఆ వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగని విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. కాపుల్లో చిచ్చుపెట్టడానికి టీడీపీ యత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
'కాపులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు'
గుంటూరు : కాపు గర్జనను విఫలం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన శనివారం గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసం నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ఉంటే...కాపు గర్జనను ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. పార్టీలోని కాపు నేతలెవరూ ...కాపు గర్జనకు వెళ్లకూడదని ఆదేశాలు ఇవ్వడం దుర్భుద్దితో కూడిన చర్య అని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు ఆ సభను విఫలం చేయడానికి ఒక సంకేతాన్ని పంపించడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాపులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీనే అమలు చేయమంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. పై పెచ్చు ఇతర పార్టీలపై చంద్రబాబు నాయుడు బురద జల్లడం సరికాదని ఆయన హితవు పలికారు. కాపు గర్జనకు మాజీ మంత్రి, కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారని, ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. సభను విఫలం చేయాలని చూస్తే కాపుల ఆగ్రహానికి గురి కాక తప్పదని అంబటి హెచ్చరించారు. కాగా కాపుల రిజర్వేషన్ల సాధనకు ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తునిలో నిర్వహించ తలపెట్టిన కాపు గర్జనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
'కాపు ఐక్య గర్జనకు పార్టీలకు అతీతంగా పాల్గొనాలి'
గుంటూరు: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభకు పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపు నిచ్చారు. ఆదివారం అంబటి గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. కాపులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు సర్కార్ మర్చిపోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పిడుగురాళ్లలో అక్రమ మైనింగ్ జరుగుతోందని దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్‌ను అధికారులు పట్టించుకోవడం లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. -
'కాపుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు'
కాకినాడ: ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తునిలో కాపు గర్జన వేదిక వద్ద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... కాపులు చేస్తున్న పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. చంద్రబాబు అధికారం చేపట్టి 20 నెలలు దాటుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాకుండా.... కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 31న తునిలో కాపు గర్జన సభ తలపెట్టిన విషయం తెలిసిందే. -
'కాపు గర్జన ఆపాలని చూస్తే ఊరుకోం'
తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 31న తలపెట్టిన కాపు గర్జనను ఆపాలని చూస్తే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అంబటి హెచ్చరించారు. -
'కాపు ఐక్య గర్జనతో దడ పుట్టిద్దాం'
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభను విజయవంతం చేసేందుకు కాపు రిజర్వేషన్ల పోరాటసంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన వివిధ కాపు సంఘాలు హైదరాబాద్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లపై అవగాహన ఉన్న ప్రముఖులు, మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, ఉన్న రిజర్వేషన్లు ఎందుకు పోయాయో ప్రముఖ యూనివర్సిటీలు, న్యాయకోవిదులు, మాజీ ఐఏఎస్‌లతో తమ సభ్యులకు తరగతులు చెప్పిస్తున్నాయి. అలాగే 150కి పైగా కాపు సంఘాలు సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాకు ఒక్కో గ్రూపును ఏర్పాటు చేసుకుని సందేశాలు పంపుతున్నాయి. ప్రతి జిల్లా నుంచి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారు కనీసం 50 వేల మంది రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. పాలకులను హడలెత్తిస్తాం: ఆరేటీ ప్రకాశ్ తునిలో జరిగే గర్జనతో పాలకులను హడలెత్తిస్తామని, తమ సమస్య పరిష్కారమయ్యే వరకూ పోరాటం కొనసాగుతుంద ని రాష్ట్ర కాపు రిజర్వేషన్ నాయకుడు ఆరేటీ ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ మహాసభ ఎవ్వరికీ వ్యతి రేకం కాదని, కాపుల ఐక్యత నిరూపించుకోవడానికేనని తెలి పారు. సీఎం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలన్నారు. మహాసభను జయప్రదం చేయడం, ముద్రగడ నాయకత్వాన్ని బలపరచడమే తమ లక్ష్యమన్నారు. రిజర్వేషన్లు లేనందున కాపుల్లో ఆర్థికంగా వెనుకబడినవారు ప్రభుత్వ ఉద్యోగాలకు, అధికారంలో వాటాకు దూరమయ్యారని కాపునేతలంటున్నారు. 50 ఏళ్ల కాలంలో 25 లక్షల ఉద్యోగాలు పోయాయని రాష్ట్ర కాపుసంఘాల నేతలు కఠారి అప్పారావు, గాళ్ల సుబ్రమణ్యంనాయుడు అన్నారు. ఈ పరిస్థితుల్లో కాపులకు బీసీ హోదా అవసరమని, అందుకే రాష్ట్రంలోని వివిధ కాపుసంఘాల్ని సమన్వయం చేస్తున్నామన్నారు. కాపు రిజర్వేషన్ల చరిత్ర ఇదీ.. 1915 నుంచి 1956 వరకు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు రిజర్వేషన్లు కొనసాగాయి. తెలగకు ఉపకులాలుగా ఉన్న కోస్తా కాపు, బలిజ, ఒంటరి కులాలు బీసీ జాబితాలో ఉన్నా యి. ఏపీ ఏర్పడిన తర్వాత తెలగ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించారు. 14-10-1961లో అప్పటి సీఎం దామోదరం సంజీవయ్య కాపుల్ని తిరిగి బీసీ జాబితాలో చేరుస్తూ జీవో జారీ చేశారు. అయితే నీలం సంజీవరెడ్డి సీఎం అయ్యాక 1966లో కాపుల బీసీ హోదా రద్దయింది. -
'కాపునాడు సదస్సును అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర'
తుని(తూ.గో): త్వరలో జిల్లాలో జరిగే కాపునాడు సదస్సను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విమర్శించారు. తునిలో జరిగే కాపునాడు సదస్సుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పలువురు కాపునాడు నాయకులు జ్యోతుల నెహ్రును కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాపునాడు ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పూర్తి మద్దుతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
కాపు ఉద్యమ పాటల సీడీ విడుదల
-
'చంద్రబాబు కాకమ్మ కబుర్లు ఆపండి'
-
'చంద్రబాబు కాకమ్మ కబుర్లు ఆపండి'
రాజమండ్రి: మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ఆయన శనివారం చంద్రబాబుకు మళ్లీ లేఖాస్త్రం సంధించారు. 'ముఖ్యమంత్రి గారు పిచ్చి పిచ్చిగా మామీద దాడి చేయిస్తే తోక ముడిచి పారిపోతామనుకుంటున్నారేమో..బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుంది. అలాగే మా జాతి తిరగబడడానికి భయపడదు. తప్పుడు పాలన మార్చుకోండి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. పిల్లనిచ్చిన మామగారిని చెప్పులతో కొట్టిస్తే పదవి వదిలి వెళ్లిపోయారు... అలాగే ఎదురు దాడులు చేయిస్తే పారిపోతామనుకుంటున్నారేమో ఈ కాపు కులం పారిపోయే జాతి కాదు. ఇచ్చిన హామీలు తెచ్చుకునే వరకు నిద్రపోము. మా జాతి ఎవరి రక్తమో ఎక్కించుకోలేదు. ఆ అవసరం కూడా లేదు. అందుచేతనే పౌరుషంగా తిరగబడతారు. మీ నుండి మీ నాయకుల వరకు తరచు సభలు సమావేశాలలో కాపులను బీసీల్లో చేరుస్తాము అని కొంగ జపాలు చేస్తున్నారు. జపాలు ఆపి హామీలు ఆచరణలో పెట్టే ఆలోచన చేయండి. రాత్రులు అమ్మకు ఇల్లు కట్టిస్తాం ఉదయం మరచిపోతాం అనే సామెత గుర్తు తెచ్చుకోండి. అయ్యా మీ కాకమ్మ కబుర్లు మాని కార్యాచరణ చెయ్యమని డిమాండ్ చేస్తున్నాము' అంటూ ఘాటుగా లేఖ రాశారు. -
కాపులకు టోపి పెట్టిన చంద్రబాబు
-
'కాపులను విస్మరిస్తున్న టీడీపీ'
కర్నూలు: తెలుగుదేశం పార్టీ కాపులను విస్మరిస్తోందని కాపునాడు జాతీయ కన్వీనర్ వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని, వారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చలేదన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో కాపు కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, సినీహీరో పవన్‌కల్యాణ్‌ను వేదికపైకి పిలువకుండా అవమానించారని వెంకటేశ్వర్లు అన్నారు. ఇచ్చిన హామీలను వచ్చే డిసెంబర్ నాటికి నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు రమేశ్ నాయుడు, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. -
కాపుల సమస్యల పరిష్కారానికి కృషి
కాపునాడు నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. కాపునాడు-ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలసి పలు అంశాలు తెలియజేయడంతో పాటు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. 2014 ఎన్నికల సమయంలో గెలుపు కోసం కాపులకు టీడీపీ అనేక హామీలిచ్చి ఆ తరువాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని వారు ప్రధానంగా జగన్ దృష్టికి తెచ్చారు. కాపులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చేలా తాను ప్రయత్నిస్తానని జగన్ వారికి చెప్పారు. రాష్ట్రంలో జనాభాలో అధికంగా ఉన్న కాపు కులానికి న్యాయం జరిగేలా, తమ సమస్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా కృషి చేయాలని వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. -
జనగామలో ‘కప్యూల్ పిరమిడ్స్’!
రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో వెలుగు చూస్తున్న కొత్త చరిత్ర జనగామ : వరంగల్ జిల్లా జనగామ చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది. గురువారం పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ఈ ప్రాంతంలోని చరిత్ర విశేషాలు వెల్లడించారు. జనగామ డివిజన్లో గతంలోనే నిలువు రాళ్లు, గృహ సమాధులు, చరిత్ర కలిగిన శిలలు వెలికితీసినట్లు తెలిపారు. జనగామ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో పరుపు బండపై అనేక కప్యూల్ పిరమిడ్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. పిరమిడ్ రాక్ ఎత్తు 12 సెంటీమీటర్లు, వైశాల్యం 59 చదరపు సెంటీమీటర్లు ఉండగా, 3,072 సెంటీ మీటర్ల చుట్టూ కొలత ఉందని వివరించారు. దీనిపైనే నవీన శిలాయుగంలో కప్యూల్స్ చెక్కినట్లు కనిపించాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిశోధనలు ఎక్కువగా జరగక పోవడంతో ఇంతటి చరిత్ర బయటకు రాలేదన్నారు. రేఖా గ ణితాన్ని కప్యూల్స్పై చూపించారని ప్రపంచ పరిశోధకులు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు పిల్లవాడు జన్మించగానే లెక్కల కోసం అని కూడా ప్రచారంలో ఉందని చెప్పారు. గ్రహాలు, రాశులు మొదలైన నక్షత్ర మండలాన్ని సంకేత రూపంతోపాటు మానవుని ప్రయాణ సంకేతాల కోసం కావచ్చని ఊహిస్తున్నారు. గుండ్రని రాళ్లపై ఒకే చోట 8,490 దెబ్బలను 72 నిమిషాలపాటు కొడితే 1.9 మిల్లీమీటర్ల కప్యూల్స్ ఏర్పడుతుందని పురావస్తుశాఖకు చెందిన జి.కుమార్ కనిపెట్టారని తెలిపారు. జనగామలో 55 మానవ నిర్మిత కప్యూల్స్ జనగామలో పిరమిడ్ రాక్‌పై 55 వరకు మానవ నిర్మిత కప్యూల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. వీటి తయారు చేసేందుకు ఐదు లక్షల దెబ్బలు అవసరమన్నారు. దీంతో బలమైన విశ్వాసాలు ఆనాటి మానవ సమాజంలో ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆది మానవుల రేఖాగణిత ప్రజ్ఞను ఆయన ప్రశంసించారు. జనగామలోని పిరమిడ్స్ బేసి సంఖ్యలో ఉండడం విశేషమన్నారు. ప్రతి దిక్కున ఒక్కొక్క కప్యూల్స్ని సుద్దముక్కతో కలపగా పిరమిడ్, రాంబస్, వృత్తం ఆకారాలు ఏర్పడుతున్నాయని వివరించారు. పిరమిడ్ శిఖరాల లోపల వర్షపు నీరు నిండిన కొలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. బయ్యన్న కంచెలో వెలుగు చూసిన చారిత్రక ఆధారాలను భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రత్నాకర్‌రెడ్డి కోరారు. జనగామ డివిజన్లోని చరిత్ర సంపదను ఒక్కచోటకు చేర్చి మ్యూజియం ఏర్పాటు చేయూలన్నారు. కాగా, ఈ పరిశోధనలో విద్యార్థులు శ్రీనివాస్, సఫి, ఇమ్రాన్ పాల్గొన్నారని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. -
కాపుగాసిన నాయకుడు
మిరియాల వెంకటరావు అనగానే ఈయన కాపు నాయకుడు అంటారు కొందరు. కొం దరైతే కాపు గాసిన మా నాయకుడు మిరియాల అంటారు. కానీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగునాట ఎందరో కుల నాయకులున్నా పర కుల ద్వేషంతో కాక స్వకుల మిత్రత్వంతో మన స్సులు గెలివాలి అభివృద్ధి చెందాలి అని చెప్పిన విభిన్న నాయకుడు ఈయన. ఆయన ఇల్లు అన్ని కులాల, అన్ని వర్గాలవారి రాకతో నిత్యం కోలాహలంగా ఉండేది. దళిత, బీసీ నేతలు, విద్యార్థి నాయకులు ఇలా అందరూ సలహాలు, సూచనల కోసం ఆయన్ని కలిసేవారు. 1939, డిసెంబర్ 25న రాజమండ్రిలో వెం కటరావు జన్మించారు. పూర్వీకులు ప్రకాశం జిల్లాకు చెందినా, ఆయన జీవితంలో అధిక భాగం విజయవాడతోనే ముడిపడింది. విద్యార్థి దశనుంచే సామ్యవాద భావాలను కలిగి, ప్రతి సామాజిక అంశాన్ని విశ్లేషించుకుని భవిష్యత్ ను నిర్మించుకున్నారు. తరువాత అదే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపింది. ట్రేడ్ యూని యన్ నాయకుణ్ణి చేసింది. రిక్షా కార్మిక సంఘం మొదలుకుని ఫ్యాక్టరీ వర్కర్ల సంఘాల వరకు ఆయన నాయకత్వంలో పని చేశాయి. జక్కం పూడి, ఉండవల్లి, గొల్లపల్లి సూర్యారావు, హర్ష కుమార్ వంటి నాయకులు ఆయన అనుచరులుగా ఉన్నారు. ఇక జై ఆం ధ్రా ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద జైలుక్కూడా వెళ్లారు. ఒక ఉద్యమ నేతగా సమస్యలు ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించుకోవడం అన్నది స్వయంగా, అనుభవ పూర్వకంగా ఆయన నేర్చుకున్నారు. సాహిత్య, నాటక, కళారంగాలంటే ఎన లేని అభిమానం. అలనాటి అందాల నాయ కుడు హరనాథ్, ఏడిద నాగేశ్వరరావులు వెంక టరావుతో చాలా సన్నిహితంగా మెలిగే వారు. రావుగోపాలరావు, నూతన్‌ప్రసాద్, నాటక కృష్ణుడు గుమ్మడి గోపాలకృష్ణలతో బాల్యం నుంచి సాన్నిహిత్యం ఉంది. వివిధ రంగాల వారితో ఆయనకున్న స్నేహం భవిష్యత్‌లో వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సమ తుల్యతకు దోహదపడింది. బీసీ, దళితనేతలు తరచుగా ఆయన్ని కలిసేవారు. 1988లో జరి గిన కాపునాడు సభ తన ఉద్యమాలకు స్ఫూర్తి అని మంద కృష్ణ అన్న సందర్భాలు ఎన్నో. దీర్ఘకాలంగా దోపిడీకి గురవుతున్న కాపు కుల ప్రతినిధిగా ఆలోచనలు మొదల య్యాక, జనాభాలో 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారంలో 2 శాతం కూడా దక్కడంలేదని గ్రహించారు. ఆలోచనలు చిగురించాక కాపు మహా సభను 1982లో ప్రారంభించారు. తక్కువ జనాభా కలిగిన కులాల వారు ఎక్కువ జనాభా ఉన్న కాపు లను అణగదొక్కడాన్ని మిరియాల సహించలేక పోయారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు యాత్ర చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులందరినీ సమీ కరించారు. అందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు. కృష్ణానదీ తీరంలో లక్షలాది మంది కాపులతో జరిపిన కాపునాడు మహాసభ తెలు గునాట ప్రభుత్వాలనే మార్చేసింది. అదే ఏడా దిలో జరిగిన వంగవీటి రంగ హత్యోదంతం కాపుల రక్తాన్ని మరిగించింది. కాపులు చాచి కొట్టిన దెబ్బకు అప్పటి ప్రభుత్వం చావు దెబ్బ తింది. ఈ ఉద్యమం అంతిమలక్ష్యం రాజ్యాధి కారమే అన్న భావన కాపుల్లో నింపడంలో మిరి యాల వెంకటరావు విజయం సాధించారు. ఆ విత్తనమే చెట్టయి నేటి ప్రభుత్వంలో కాపు స్థానాన్ని పదిలపర్చిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కాపుల అక్షరాస్యత తగినంతగా లేదన్న విష యం ఆయన్ని ఎప్పుడూ బాధించేది. కుల పెద్ద లతో అనేక వందల మందికి స్కాలర్షిప్లు ఇప్పించేవారు. చదువులకు ఆర్థికసాయం చేసే లా ప్రోత్సహించేవారు. అనేక కల్యాణ మండ పాలు వీరి నేతృత్వంలో రూపుదిద్దుకున్నాయి. కార్తీక వన సమారాధనల నిర్వహణతో వెనుక బడిన కులాల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించారు. కాపు ప్రజాప్రతినిధులకు సన్మాన సభలను ఏర్పాటుచేసి, మీ వెనుక మేమున్నామని వారిలో ధైర్యాన్ని నింపారు. కోరి వచ్చిన పదవులను తోసిపుచ్చారు. పాలక వర్గాల కుట్రలతో కాపు ఉద్యమం తన కళ్లముం దే కాంక్షల సంఘాలుగా విడిపోతుంటే మౌనం గా చూస్తుండిపోయారు. అనారోగ్యంతో ఇం టికే పరిమితమైనా అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఆపత్కాలంలో సూచనలిస్తూ చివరివరకు కాపు కులం కోసం పనిచేసిన మార్గ దర్శకుడాయన. కాపుల సుదీర్ఘ చరిత్రలో మిరి యాల వెంకటరావు కాపు ఉద్యమం ఓ ప్రత్యేక అధ్యాయం. ఓ సువర్ణ అధ్యాయం. - పండలనేని గాయత్రి ఫ్రీలాన్స్ జర్నలిస్టు -
కాపునాడు నేత మిరియాల ఇకలేరు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు(75) ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మృతి చెందారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు, కాలేయం, కిడ్నీ పనితీరు మందగించడం తదితర సమస్యలకు ఈ నెల మూడో తేదీ నుంచి ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఎం. శేషగిరిబాబు, ఐఏఎస్ అధికారి. ఈపీడీసీఎల్ చైర్మన్‌అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. వెంకట్రావును ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఆదివారం ఉదయం పరామర్శించారు. మిరియాల వెంకట్రావు పూర్వీకులు ప్రకాశం జిల్లా వారైనప్పటికీ వ్యాపార రీత్యా కృష్ణా జిల్లా బందరుకు, అక్కడి నుంచి రాజమండ్రికి వెళ్లారు. మిరియాల శేషయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1939 డిసెంబర్ 25న ఆయన రాజమండ్రిలో జన్మించారు. విద్యార్థి దశలోనే సోషలిస్టు పార్టీ ప్రభావానికి గురయ్యారు. మిరియాల వెంకట్రావు, సినీనటుడు రావుగోపాలరావు, కొండపల్లి భాస్కరరావులు స్నేహితులు. తొలుత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ముత్యాలు, పగడాల వ్యాపారం చేసేవారు. ఆ తరువాత అటవీ కాంట్రాక్టులు చేశారు. కుల చైతన్యం నుంచి సమైక్యత పుడుతుంది.. సమైక్యత సాధికారిక పాలనకు దారి తీస్తుంది. సంఘీభావమే బలం.. సంఘమే రాజ్యం.. రాజ్యమే విజయం... విజయమే నిజమంటూ వెంకట్రావు పదేపదే చెప్పేవారు. కాపు మహాసభగా, తెలగ అభ్యుదయ సంఘంగా, కాపు తెలగ, బలిజ సంక్షేమ సంఘాలన్నింటినీ ఏకం చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. దాంతో 1988లో విజయవాడలో కాపునాడు ఆవిర్భవించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ యాత్ర చేసి కాపు, తెలగ, బలిజ వర్గాల్లో చైతన్యం కలిగించారు. రాష్ట్ర హస్త కళల సంఘం చైర్మన్‌గా, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. సోషలిస్టు, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. కాపుల్లో చైతన్యం తీసుకొచ్చారు: సీఎం వెంకట్రావు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతా పం తెలిపారు. బలమైన సామాజికవర్గానికి విశేష సేవలందించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రముఖ కాపు నాయకుడు మిరియాల వెంకటరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరావు కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. -
కాపులకు చినరాజప్పే సీఎం
పవన్ వల్లే టీడీపీకి అధికారం కాపునాడు సభలో నేతలు ఏలూరు: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం అండలేకుండా ఏ రాజకీయపార్టీ అధికారంలోకి రాలేదని.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబే అయినా.. కాపులకు మాత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పే ముఖ్యమంత్రి అని కాపుసంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ నరసింహరావు అన్నారు. ఏలూరు నగర కాపునాడు ఆధ్వర్యంలో కాపు సామాజిక మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆదివారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహరావు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా వీలైనంత త్వరగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సినీనటుడు పవన్‌కళ్యాణ్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఏడాదిన్నరలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపులు పనిచేయకముందే రిజర్వేషన్లు ప్రకటించాలని పాలకొల్లు మునిసిపల్ చైర్మన్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పదవి కాపుగా ఉన్నందుకే వచ్చిందని, కులం కారణంగానే ఈ పదవిలో ఉన్నానని చిన రాజప్ప చెప్పారు. -
కాపులను బీసీలో చేర్చేలా సర్కారుపై ఒత్తిడి తెండి
విజయమ్మకు కాపు జేఏసీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల జాబితాలో చేరుస్తూ 1994లో జారీ అయిన జీవో (నంబర్ 30) నేటికీ అమలు కావట్లేదని..ఈ జీవోను ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తెలగ, బలిజ, కాపు జేఏసీ నేతలు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని వినతిపత్రం సమర్పించింది. ఈ డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్ నుంచి తమ సంఘాలన్నీ 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నాయని ప్రతినిధి బృందం తెలిపింది. ఈ విషయంలో తప్పకుండా కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. విజయమ్మను కలిసిన వారిలో కాపు సద్భావనా సంఘం(తూ.గో) నాయకుడు వాసిరెడ్డి ఏసుదాస్, బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షుడు (కర్నూలు) సింగంశెట్టి సోమశేఖర్, శ్రీనివాస్, స్వరూప్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్‌టీఎఫ్ డైరీ ఆవిష్కరణ ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ డైరీ (2014)ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం ఆవిష్కరించారు. ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి, కమిటీ సభ్యులు కె.జాలిరెడ్డి, పి.రామసుబ్బారావు, అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన 11 సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. -
‘కాపులను బీసీల్లో చేర్చుకోవడానికి వ్యతిరేకం’
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీలు ఆ వర్గం ప్రజలకు దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికే రెండు సార్లు తిరస్కరించిన ఈ ప్రతిపాదనను బీసీలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తారని చెప్పారు. ఈ ప్రతిపాదన ఎట్టిపరిస్థితుల్లో తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘంలోకి శ్రీరాముల శ్రీనివాస్: మావోయిస్టు మాజీ నేత శ్రీరాముల శ్రీనివాస్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంలో చేరారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి కృషిచేయాలని తాను బీసీ సంక్షేమ సంఘంలో చేరుతున్నట్లు తెలిపారు.