కాపు ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన తనను అరెస్ట్ చేయడం దారుణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు.
రాజమండ్రి: కాపు ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన తనను అరెస్ట్ చేయడం దారుణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చారు.
ఈ సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. కాపు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఒత్తిడి పెంచాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే.