కాపు ఉద్యమానికి ఇక సెలవ్ | Mudragada Padmanabham quits Kapu reservation movement | Sakshi
Sakshi News home page

కాపు ఉద్యమానికి ఇక సెలవ్

Published Tue, Jul 14 2020 5:24 AM | Last Updated on Tue, Jul 14 2020 5:24 AM

Mudragada Padmanabham quits Kapu reservation movement - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు చేపట్టిన ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. సోషల్‌ మీడియాలో తనపై పెడుతున్న పోస్టింగ్‌లకు కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి సోమవారం సుదీర్ఘ లేఖ రాశారు.

‘ఈ మధ్య పెద్దవారు చాలామంది మన సోదరులతో నేను మానసికంగా కుంగిపోయే విధంగా సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు.  నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి కారణం.. చంద్రబాబే. మన జాతికి బీసీ రిజర్వేషన్‌ ఇస్తానన్న హామీ అమలు కోసం ఉద్యమ బాట పట్టాను. ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలని ఏనాడూ అనుకోలేదు.’ అని లేఖలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement