( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: తుని రైలు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ సరిగా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు ఎందుకు సాగతీశారని ప్రశ్నించింది. బాధ్యులైన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చారు రైల్వే పోలీసులు. ఈ కేసులో ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు.
మొత్తం 24 మంది సాక్ష్యులలో 20 మంది విచారణకు హాజరయ్యారు. 20 మందిలో ఐదుగురు తమకు ఏమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. విచారణ పూర్తి కావడంతో తుదితీర్పు వెల్లడించింది. అయితే తుని ఘటన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. కానీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది.
చదవండి: బీటెక్ రవి దౌర్జన్యకాండ: బెదిరింపులు.. పచ్చబ్యాచ్‌తో కలిసి మారణాయుధాలతో..
Comments
Please login to add a commentAdd a comment