tuni railway station
-
తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు
సాక్షి, విజయవాడ: తుని రైలు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ సరిగా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు ఎందుకు సాగతీశారని ప్రశ్నించింది. బాధ్యులైన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చారు రైల్వే పోలీసులు. ఈ కేసులో ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. మొత్తం 24 మంది సాక్ష్యులలో 20 మంది విచారణకు హాజరయ్యారు. 20 మందిలో ఐదుగురు తమకు ఏమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. విచారణ పూర్తి కావడంతో తుదితీర్పు వెల్లడించింది. అయితే తుని ఘటన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. కానీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. చదవండి: బీటెక్ రవి దౌర్జన్యకాండ: బెదిరింపులు.. పచ్చబ్యాచ్‌తో కలిసి మారణాయుధాలతో.. -
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం..!
సాక్షి, తూర్పుగోదావరి : బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటుచేసుకుంది. రైలులోని ఓ బోగిలో ప్యాసింజర్లపై ఉన్మాది వీరంగం సృష్టించాడు. అతడిని అడ్డుకుని సముదాయించిన హోమ్ గార్డుపై దాడి చేసి రైల్లోంచి తోసేశాడు. తుని రూరల్ వద్ద హోంగార్డు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందాడు. తుని రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే ఉన్మాదిని పట్టుకుని ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. మృతుడు కోటనందూరు హోంగార్డు రెడ్డి వెంకటశివగా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ మృతదేహాన్ని పరిశీలించారు. -
సంచిలో మహిళ మృతదేహం
-
తుని రైల్వే స్టేషన్లో కలకలం
-
తుని-కొత్తవలస రైల్వేలైన్ సర్వే పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : తుని నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మీదుగా కొత్తవలస వరకు సింగిల్ లైన్ బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం నిర్మాణం కోసం సర్వే పనులు పూర్తయినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రాజెన్ గొహైన్ శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. తుని నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మీదుగా రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే పనులను 2016-17లో రైల్వే శాఖ మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 3771.21 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మొత్తంపై వచ్చే రాబడి (రేట్ ఆఫ్ రిటర్న్) మైనస్ 4.14 శాతంగా తేలింది. సర్వే నివేదిక ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు కోసం బృహత్తర ప్రణాళికలు రైతుల ఆదాయం 2022 నాటికల్లా రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధన కోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ రాజ్య సభలో ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతోందని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఈ దిశగా సాగిస్తున్న ప్రయత్నాలు, ప్రణాళికలను సోదాహరణంగా వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఇందుకోసం ఒక వ్యూహాన్ని రూపొందించడానికి ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లోనే నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా సీఈవో అధ్యక్షతన మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ దఫదఫాలుగా ఇప్పటి వరకు తొమ్మిది నివేదికలను సమర్పించిందని, ఆ నివేదికల ఆధారంగా ఇప్పటికే పలు చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్య సాధన దిశగా తీసుకుంటున్న అనేక చర్యలను మంత్రి వివరించారు. అందులో వ్యవసాయోత్పత్తులకు గిరాకీతోపాటు గిట్టుబాటు ధర లభించే వాతావరణం కల్పించేందుకు సమగ్రమైన స్టేట్ మార్కెట్ చట్టం తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే సీజన్‌కు ముందే రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకునేలా ఒక మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు మంత్రి చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, డిమాండ్‌ను ముందుగానే పసిగట్టే విధంగా టెక్నాలజీని వ్యవస్థను రూపుదిద్దడానికి డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్, ఇన్‌స్పెక్షన్‌ను పునఃవ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. అయిదేళ్ళలో ఏటా 24 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పాదన లక్ష్యం సాధించేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం. నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కూడా సమగ్రమైన ప్రణాళికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు మంత్రి వివరించారు. వ్యవసాయ, వ్యవసాయ సంబంధింత రంగాల కార్యకలాపాలను, రైతుల సంక్షేమాన్ని సమగ్రంగా సమీక్షించేందకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సంస్థాగతమైన వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నాం. వచ్చే మూడేళ్ళ కాలంలో దేశంలోని అన్ని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను కంప్యూటరీకరణ చేయడానికి బడ్జెట్లో తగిన కేటాయింపులు. రైతులు తమ ఉత్పాదనలను నేరుగా విక్రయాలు జరుపుకోవడానికి వీలుగా వచ్చే మూడేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా 22 వేల గ్రామీణ సంతలను దశల వారీగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి ప్రాధాన్యత నుంచి ఆదాయం సమకూర్చే వనరుగా మార్పులు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరువు నుంచి ఉపశమనం కోసం ఐఫాడ్‌తో ఏపీ ఒప్పందం కరువు నుంచి ఉపశమనం కోసం ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ (ఐఫాడ్)తో ఒప్పంద కుదుర్చుకున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్య సభలో వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక జవాబిస్తూ, 2017 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు అయిదేళ్ళపాటు ఈ ప్రాజెక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర కరువు, వర్షాభావంతో తల్లడిల్లే అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుందని చెప్పారు. ఆయా జిల్లాల్లోని ఒక లక్షా 65 వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాల ఆదాయ వనరులను మెరుగుపరుస్తూ, కరువు పరిస్థితులను దీటుగా ఎదుర్కోగల సామర్ధ్యం వారిలో కలిగించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం అయ్యే మొత్తం వ్యయం 1042 కోట్ల రూపాయల నిధులను ఐఫాడ్‌తోపాటు, నాబార్డ్ ఆధ్వర్యంలోని గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన నుంచి సమకూర్చడం జరుగుతుందని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఐఫాడ్ ఒక్కటే 528 కోట్ల రూపాయలు భరిస్తుంది. ఆర్ఐడీఎఫ్ 43.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 96.9 కోట్లు, ఉపాధి హామీ పథకం, కృషి వికాస్ యోజన నుంచి 311.53 కోట్లు, లబ్దిదారుల వాటాగా 61.47 కోట్ల రూపాయల చొప్పున నిధుల సమీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలు తీరును గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. -
ముద్రగడపై రైల్వే పోలీసుల కేసు
విజయవాడ: తుని రైల్వేస్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం కేసులో కాపు ఐక్య గర్జన నిర్వాహకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై తుని గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ దుర్ఘటనలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 24 బోగీలు దహనమైన విషయం విదితమే. రైల్వే ట్రాక్‌పైకి రావడంతోపాటు రైలును అడ్డగించడం, రైలును దహనం చే సినందుకు గాను ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్‌తో పాటు రైల్వే యాక్ట్ సెక్షన్లు 161, 162, 163, 164 కింద కేసు కేసు నమోదు చేశారు. రైలు దహనం ఘటనలో ముద్రగడతోపాటు మరికొంతమంది (ముద్రగడ పద్మనాభం అండ్ అదర్స్)పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు అధికారులు చెప్పారు. కాపు నేతల్లో ఆగ్రహం కాపు ఐక్య గర్జనకు తాను బాధ్యుడినని, రైలు దహనంతోపాటు జరిగిన దుర్ఘటనలకు రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యతని ముద్రగడ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయనపైనే కేసు నమోదు చేయడం కాపు సామాజిక వర్గం నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. -
హౌరా సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు
హౌరా-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ - 1 బోగీలో శనివారం ఉదయం ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దాంతో బోగీలోని ప్రయాణికులు వెంటనే స్పందించారు. వెంటనే రైల్వే అధికారులను సమాచారం అందించారు. దాంతో హౌరా - మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును తుని రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. బోగీలో పొగకు గల కారణాలను అన్వేషించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బీ-1 బోగీలోని ప్రయాణికులను అధికారులు తుని ఫ్లాట్‌ఫారంపైకి దింపేశారు. -
తుని రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
తుని(తునిరూరల్), న్యూస్‌లైన్ : తుని రైల్వేస్టేషన్లో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. పుట్టిన కవలలు పురిట్లోనే చనిపోవడంతో విషాదం నెలకొంది. తుని ఆశ్రమ వీధికి చెందిన రాయిపాటి ఏసమ్మ అనే ఆరు నెలల గర్భిణి బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి వైద్యపరీక్షలకు వచ్చింది. ఆమెకు రక్తం లేకపోవడాన్ని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విష్ణువర్థని గుర్తించారు. వెంటనే కాకినాడ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కాకినాడ వెళ్లేందుకు ఏసమ్మ రైలుకోసం స్థానిక స్టేషన్‌కు వెళ్లింది. అంతలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. గమనించిన ప్రయాణికులు రైల్వే ఆస్పత్రి వర్గాలకు ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఎవ్వరూ స్పందించకపోవడంతో సమీపంలో ఉన్న కోటనందూరు పీహెచ్సీ సూపర్వైజర్ సరోజని సహాయంతో చీరలతో గదిని ఏర్పాటు చేశారు. ఏసమ్మ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే జన్మించేసరికే ఇద్దరు పిల్లలు చనిపోయారు. అనంతరం 108లో బాలింతను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏసమ్మకు ‘ఓ’ నెగిటివ్ రక్తం అవసరమని, నెలలు నిండకుండా ప్రసవం కావడంతో బిడ్డలు మృతి చెందారని సూపరింటెండెంట్ విష్ణువర్థని, డాక్టర్ రవిచంద్రలు తెలిపారు.