
సాక్షి, తూర్పుగోదావరి : బొకారో ఎక్స్ప్రెస్లో దారుణం చోటుచేసుకుంది. రైలులోని ఓ బోగిలో ప్యాసింజర్లపై ఉన్మాది వీరంగం సృష్టించాడు. అతడిని అడ్డుకుని సముదాయించిన హోమ్ గార్డుపై దాడి చేసి రైల్లోంచి తోసేశాడు. తుని రూరల్ వద్ద హోంగార్డు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందాడు. తుని రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే ఉన్మాదిని పట్టుకుని ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. మృతుడు కోటనందూరు హోంగార్డు రెడ్డి వెంకటశివగా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ మృతదేహాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment