psycho attack
-
కారం చల్లి, గొడ్డలితో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. ఆయుధాన్ని బీరువా కింద దాచి..
సాక్షి, గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని జంగపల్లిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జక్కనపెల్లి ఆంజనేయులు, భారతి దంపతుల కుమారుడు అశోక్ హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం రాంహనుమాన్ నగర్‌కు చెందిన అతని తాత లింగయ్య(తల్లికి తండ్రి) ఇటీవల మృతి చెందాడు. గురువారం దినకర్మ ఉండటంతో అశోక్ బుధవారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి గురువారం ఉదయం రాంహనుమాన్ నగర్ వెళ్లాడు. మధ్యాహ్నం తండ్రితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. అశోక్ వంటింట్లో నిద్రిస్తుండగా, తండ్రి ఆంజనేయులు, నానమ్మ రాజవ్వ గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న మరో ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ ఉన్న ఇంట్లోకి గ్రామానికే చెందిన వెల్దిండి రవీందర్ ప్రవేశించాడు. అశోక్ ముఖంపై కారం చల్లి, గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో పారిపోయాడు. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి, అశోక్ తండ్రి బోరున విలపించారు. బాధితుడిని కరీంనగర్ ఆస్పపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తేల్చారు. వారి సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. నిందితుడు గొడ్డలిని బాధితుడి ఇంట్లో బీరువా కింద దాచాడు. అనంతరం పోలీస్‌స్టేషన్ లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై మామిడాల సురేందర్‌లు పరిశీలించారు. గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మద్యానికి బానిస నిందితుడు రవీందర్ కొన్నేళ్ల కిందట దుబాయి వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడని చెప్పారు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కనిపించినవారిని డబ్బులు డిమాండ్ చేస్తుంటాడని అన్నారు. కానీ అశోక్‌తో అతనికి పరిచయం లేదని, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు తేవని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. మద్యం, గంజాయి మత్తుకు మానిసై సైకోగా మారి, దాడి చేసి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. -
రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది?
సాక్షి, తూర్పుగోదావరి: సౌమ్యుడు, వివాద రహితుడు, అందరినీ నవ్వుతూ పలకరించే ఆ యువకుని పట్ల ‘విధి’ వక్రించింది. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి సూర్య వెంకటశివ (36) మరి కొద్ది నిమిషాలలో రైలు దిగి క్షేమంగా ఇంటి చేరుకునేవాడు. కానీ ఈలోపే రైలులోని ఓ ఉన్మాదితో వివాదం తలెత్తింది. ఆ ఉన్మాది శివను రైలులో నుంచి బయటకు తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడిపై ఆధారపడి జీవిస్తున్న తల్లి, భార్య దిక్కులేనివారయ్యారు. ఎప్పటికైనా ఉద్యోగంలో గొప్పవాడై అందరికీ ఆసరాగా ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిపోయారు. అందరితో కలుపుగోరుతనంగా ఉండే ఆ యువ హోంగార్డు ప్రాణాలు కోల్పోవడంతో మండల వ్యాప్తంగా ప్రజలు ఆవేదనకు గురయ్యారు. చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోటనందూరు పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న శివకు చెరకు క్రషింగు సీజన్ నేపథ్యంలో సామర్లకోట సెంటర్లో ట్రాఫిక్ డ్యూటీ వేశారు. 15 రోజులు డ్యూటీ టర్నలో భాగంగా ఆదివారం శివ డ్యూటీ ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం మధ్యాహం సామర్లకోటలో బొకారో ట్రైన్ ఎక్కాడు. రైలులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబీబ్ ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని శివ వారించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అబీబ్ అన్నవరం దాటిన తరువాత హంసవరం సమీపంలో ట్రైన్ నుంచి శివను బయటకు తోసేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుని రైల్వే పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. కొత్తకొట్టాంలో వెంకటశివ ఇంటి వద్ద శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, (అంతరచిత్రం) హోంగార్డు వెంకట శివ మృతదేహం కొత్త కొట్టాంలో విషాదం మండలంలోని కొత్తకొట్టాం గ్రామానికి చెందిన శివ కోటనందూరు పోలీసు స్టేషనులో హోమ్ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతడి తండ్రి ఆరేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి సత్యవతి, శివ కలిసి ఉంటున్నారు. శివకు నలుగురు అక్కలు, అన్నయ్య ఉన్నారు. నలుగురు అక్కలకు పెళ్లిళ్లు జరిగి ఎవరికి వారు జీవిస్తున్నారు. అన్నయ్య గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తూ అవకాశం వచ్చినప్పుడు బయట చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తుంటాడు. 10వ తరగతి చదువుకున్న శివ 2003లో కోటనందూరు పోలీసు స్టేషనులో హోంగార్డుగా చేరాడు. ఈ 16 ఏళ్లలో కోటనందూరు, తునిటౌన్, తునిరూరల్, అన్నవరం పోలీసు స్టేషన్లు, అన్నవరం కొండపై విధులు నిర్వహించాడు. క్రమశిక్షణతో, అందరితో కలివిడిగా మెలిగే శివ అంటే తోటి ఉద్యోగుల ఎంతో ఇష్టపడేవారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పరికరించే శివ దుర్మరణం పాలయ్యాడని తెలుసుకుని వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, చిక్కుడుపాలెం గ్రామానికి చెందిన దేవిని 2018 జూన్ 18న శివ వివాహం చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో మృత్యువు ఇలా ఉన్మాది రూపంలో వచ్చి శివను కడతేర్చింది. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు శివ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి, అక్కలు, అన్నయ్య రోదన అందరినీ కలచివేసింది. డ్యూటీ చేస్తున్నంత సమయం నవ్వుతూనే ఉండేవాడని, ఎప్పుడు ఎవరితోనూ గొడవ పడ్డ సందర్భాలు లేవని కోటనందూరు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. శివ ఎంతో మంచి వాడని, చెప్పిన పనిని వెంటనే ముగించేవాడని, అతని మరణం స్టేషన్‌కు తీరని లోటని ఎస్సై అశోక్ అన్నారు. తునిలో విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ నయీం అస్మి తుని: విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ నయీం అస్మి హుటాహుటిన తుని చేరుకున్నారు. హోంగార్డు శివ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. శివ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
రైలులో ఉన్మాది వీరంగం
తుని: తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ ఉన్మాది తోసివేయడంతో ఆదివారం హోంగార్డు దుర్మరణం పాలయ్యాడు. తుని జీఆర్పీ ఎస్ఐ అబ్దుల్ మారూఫ్ తెలిపిన వివరాలు.. అలెప్పీ నుంచి ధన్‌బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అబీబ్ ప్రయాణిస్తున్నాడు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ఎస్–7 బోగీలో సహచర ప్రయాణికులను అతడు ఇబ్బందులకు గురి చేశాడు. సామర్లకోటలో అదే రైలు ఎక్కిన హోంగార్డు రెడ్డి సూర్యవెంకటశివ (35) ఎస్–7 బోగీలోకి వచ్చాడు. అబీబ్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రయాణికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకిలా చేస్తున్నావంటూ అబీబ్‌ను నిలువరించేందుకు హోంగార్డు వెంకటశివ ప్రయత్నించాడు. తుని స్టేషన్ సమీపంలోకి రైలు వచ్చిన సమయంలో అబీబ్ అనూహ్యంగా నెట్టివేయడంతో హోంగార్డు రైలు నుంచి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బోగీలో ఉన్న ప్రయాణికులు తుని జీఆర్పీకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అబీబ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామానికి చెందిన వెంకటశివ కోటనందూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. సామర్లకోటలో ట్రాఫిక్ విధులు నిర్వహించి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగింది. శివకు ఏడాది క్రితమే వివాహమైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీంఅస్మి తుని చేరుకొని హోంగార్డు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. -
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం..!
సాక్షి, తూర్పుగోదావరి : బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటుచేసుకుంది. రైలులోని ఓ బోగిలో ప్యాసింజర్లపై ఉన్మాది వీరంగం సృష్టించాడు. అతడిని అడ్డుకుని సముదాయించిన హోమ్ గార్డుపై దాడి చేసి రైల్లోంచి తోసేశాడు. తుని రూరల్ వద్ద హోంగార్డు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందాడు. తుని రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే ఉన్మాదిని పట్టుకుని ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. మృతుడు కోటనందూరు హోంగార్డు రెడ్డి వెంకటశివగా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ మృతదేహాన్ని పరిశీలించారు. -
కానిస్టేబుల్ చేతి వేలును కొరికేశాడు..
సాక్షి, ఖమ్మం : తాగిన మైకంలో ఓ వికలాంగుడు నగరంలోని వన్‌టౌన్ స్టేషన్లో వాచర్ డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ చేతి వేలును కొరికేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేవతి థియేటర్ ప్రాంతానికి చెందిన వికలాంగుడు డుంగ్రోతు మస్తాన్ ఘర్షణపడి మరో ఇద్దరితో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో అరుస్తుండగా వాచర్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మన్సూర్ అలీ, ఇన్చార్జ్గా ఉన్న సత్యనారాయణ మందలించారు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న అతడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లను దూషిస్తుండగా వారు పక్కకు వెళ్లిపోయారు. అయితే ఒక్కసారిగా మస్తాన్.. మన్సూర్ అలీపైకి వచ్చి మొదట అతడి తొడ భాగంలో కొరికాడు. దీనిని అడ్డుకోవడంతో చేతి వేలును బలవంతంగా కొరకడంతో ఊడి కిందపడిపోయింది. దీంతో మన్సూర్ అలీ విలవిలలాడుతుండగా.. మస్తాన్ అక్కడి నుంచి పారిపోయాడు. హెచ్‌సీ సత్యానారాయణ సీఐ రమేష్‌కు సమాచారం అందించగా.. వారు మన్సూర్ అలీని ఆస్పత్రికి తరలించారు. కాగా.. మస్తాన్ సైకో మాదిరిగా ప్రవర్తిస్తాడని, గతంలో అతడిపై వన్‌టౌన్ స్టేషన్లో కేసు కూడా ఉందని సీఐ తెలిపారు. అతడిపై మళ్లీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా.. ఘటనపై సీపీ తఫ్సీర్ ఇక్బాల్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకట్రావు ఆరా తీశారు. -
గొడ్డలితో యువకుడి వీరంగం
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట మీద ఆవారాగా తిరిగే యువకుడు ఓ మహిళను చంపుతానంటూ గొడ్డలి పట్టుకొని శుక్రవారం రాత్రి వీరంగం వేశాడు. ఆమె 100కు డయల్ చేయడంతో, సమాచారం అందుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఘటన స్థలానికి వెళ్లారు. యువకుడు ఆయన పైకి గొడ్డలి విసిరేసి, అనంతరం దాడి చేశాడు. ఘటనపై కానిస్టేబుల్‌తో పాటు, సదరు మహిళ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిరిజాల సునీత ఎన్టీఆర్ కరకట్ట మీద నివాసం ఉంటోంది. కుటుంబ పోషణ నిమిత్తం దగ్గరలో ఉన్న అక్వేరియం షాపులో పని చేస్తోంది. దాని కింద నాగపోగు దయానందరాజు నివాసం ఉంటున్నాడు. సునీత భార్యకు తన మీద ఏదో చెప్పిందనే వంకతో చంపుతానంటూ గోల గోల చేస్తూ, ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. సునీత అక్కడ నుంచి పారిపోయి బకింగ్ హామ్ కెనాల్ వద్ద ఉన్న ముళ్లపొదల్లో దాక్కొని 100కు డయల్ చేసింది. ఉన్నతాధికారులు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యం.వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి వెళ్లారు. ద్విచక్ర వాహనం పార్కింగ్ చేస్తుండగానే, దయానంద రాజు చేతిలో ఉన్న గొడ్డలిని ఆయన పైకి విసిరేశాడు. అనంతరం పరిగెత్తుకుంటూ వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్ది రోడ్డు మీద ఉన్న ఓ పైప్‌తో దాడి చేశాడు. హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడని తెలియడంతో పోలీస్‌స్టేషన్ నుంచి ఘటన స్థలానికి నలుగురు పోలీసులు వెళ్లగా, వారిపై కూడా దురుసుగా ప్రయత్నించాడు. తనను కొడితే మిమ్మల్నేం చేయాలో తెలుసంటూ రోడ్డుపై పడుకున్నాడు. కానిస్టేబుల్స్ బలవంతంగా జీపులో ఎక్కించి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా, స్టేషన్ దగ్గర సైతం వీరంగం వేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో కూడా దయానందరాజు పక్క ఇంటి వారిపై దాడిచేసి, తండ్రి, కూతుళ్లను రాడ్డుతో తల పగలగొట్టాడు. దయానందరాజు ఎన్టీఆర్ కరకట్ట మీద రెండున్నర సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఆరుగురిపై దాడికి పాల్పడ్డాడు. అయినా ఒక్క కేసే నమోదవ్వడం విశేషం. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
మహిళపై సైకో దాడి
ఆత్మకూరు : పిల్లలను పాఠశాలలో వదిలి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఓ సైకో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలో శనివారం జరిగింది. ఈ ఘటన పట్టణంలో కలవరపరిచింది. బాధితురాలు, పోలీసుల సమాచారం మేరకు.. పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన దివానపు లక్ష్మీప్రసన్న తన ఇద్దరు పిల్లలను సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో వదిలి తిరిగి శివారులోని డొంక దారిలో ఇంటికి వస్తోంది. అప్పటికే ఆమెను అనుసరిస్తూ వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు కలిపి దాహంగా ఉంది, మంచి నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అడిగాడు. దూరంగా ఉన్న కాలనీ ఇళ్లలో అడిగి తాగాలని సూచించింది. అయినా అతను ఆమెనే అనుసరించి వస్తుండగా జనసంచారం లేని ప్రాంతంలో టవల్‌ను ఆమె మెడకు చుట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె గొంతుకు టవల్ బిగియకుండా పట్టుకుని పెనుగులాడింది. కింద పడిపోయిన ఆమె గట్టిగా విదుల్చుకుని టవల్‌ను తీసివేయడంతో అతను పరారయ్యాడు. ఆమె కిందపడి సమయంలో రాయి తగిలి తీవ్రంగా రక్త గాయమైంది. కొద్ది సేపటికి అటుగా వస్తున్న ఓ వ్యక్తి ఆమెను గమనించి, మరో ఇద్దరి సహాయంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై పీ నరేష్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను విచారించారు. ఎమ్మెల్యే పరామర్శ మహిళపై సైకో దాడి జరిగినట్లు సమాచార విషయం తెలియడంతో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఆయన ఎస్సైతో మాట్లాడుతూ సైకో దాడి మరొకటి జరగక ముందే చర్యలు చేపట్టాలని సూచించారు. -
గుంటూరులో సైకో వీరంగం..దేహశుద్ధి
-
గుంటూరులో సైకో వీరంగం..
సాక్షి, మాచర్ల: ఓ సైకో వీరంగం సృష్టించిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన జానీ పాషాకు గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేదు. గుంటూరుకు తీసుకెళ్లి పాషా తండ్రి అతడికి చికిత్స చేయించాడు. బుధవారం ఉదయం కుమారుడిని గ్రామానికి తీసుకొస్తుండగా ఒక్కసారిగా తండ్రిపై దాడి చేసి పాషా పరారయ్యాడు. అనంతరం మాచర్లలోని స్థానిక మసీదులోకి చొరబడిన పాషా ప్రార్థనలు చేస్తున్నవారిపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. సైకో దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
సైకోనా.. పాత నేరస్తుడా
కోవూరు ప్రజలకు సైకో భయం వీడటం లేదు. అనుమానాస్పదస్థితిలో ఎవరు కనిపించిన సైకో అంటూ హడలెత్తుతున్నారు. అటు వెళ్లాడు.. ఇటు వెళ్లాడంటూ చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం పోలీసులకు అందితే పరుగులు పెడుతున్నారు. కాగా పుకార్లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం: కోవూరులో సైకో కలకలం వీడలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా పోలీసులు గాలిస్తున్నా ప్రజల్లో భయం పోలేదు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున జలదంకి విజయమ్మ, ఒంటేరు అంకమ్మపై సైకోగా చెబుతున్న వ్యక్తి దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. అదే రోజు మరో ముగ్గురిపై దాడి చేయపోగా ప్రతిఘటించడంతో పారిపోయాడు. ఇదంతా దాడి చేసిన వ్యక్తిని కళ్లారా చూసిన వ్యక్తులు చెబుతున్న విషయమే. అయితే మరుసటిరోజు 3వ తేదీన రామాలయం వద్ద బిచ్చగాడిపై జరిగిన దాడిలో దాడి చేసిన వ్యక్తులను ఎవరూ చూడలేదు. ఆ రోజు నుంచి అనుమానంగా ఎవరు కనపడినా ప్రజలు భయపడుతున్నారు. సైకో వచ్చాడంటూ అంటున్నారు. దీంతో అందరూ ఉలిక్కిపడి కంగారు పడుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి పడుగుపాడు రైల్వేట్రాక్ పక్కన గుడిసెల వద్దకు సైకో వచ్చాడంటూ అక్కడి మహిళలు చెబుతున్నారు. బహిర్భూమికి వచ్చాడని అనుకున్నామని, ఒక్కసారిగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా భయపడి పరుగులు తీశామని అంటున్నారు. యువకులు స్పందించి పట్టుకునేందుకు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేశాడని తెలిపారు. అదే సమయంలో వేగూరులో కూడా సైకో వచ్చాడంటూ కలకలం రేగింది. అయితే పోలీసులు మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. పుకార్లను నమ్మవద్దని చెబుతున్నారు. సైకోనా.. దొంగా.. సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడిగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన మహిళలపై దాడి చేసింది వాస్తవమేనని, అయితే అతడు పాతనేరస్తుడని అంటున్నారు. గతంలో నెల్లూరు ఇరుగాళమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓ వ్యక్తి అక్కడి నుంచి వెంకటేశ్వరపురానికి మకాం మార్చాడు. మద్యం సేవిస్తే చిర్రెత్తి పోయే వ్యక్తి మహిళలపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడని సమాచారం. ఈ క్రమంలో 2వ తేదీ మహిళలపై దాడి చేసి గాయపరిచాడని, పోలీసుల దృష్టి పడడంతో పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం సదరు వ్యక్తిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ నిమిషమైనా ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈలోగా ప్రజల్లో ఉన్న భయాందోళనతో కలకలం రేగుతోంది. త్వరలోనే పట్టుకుంటాం సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడని అతడ్ని పట్టుకుంటామని సీఐ వెంకటేశ్వర్లురెడ్డి చెబుతున్నారు. గాయపడిన మహిళలను ఇటీవల సన్నపనేని రాజకుమారి పరామర్శించిన విషయం విదితమే. గాయపరచిన వ్యక్తిని త్వరలో పట్టుకోవాలని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను ఆమె కోరిన విషయం తెలిసిందే. ఎస్పీ రామకృష్ణ ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో గాయపరచిన వ్యక్తిని పట్టుకుంటామని సీఐ చెబుతున్నారు. -
సైకో వీరంగం
మర్రిపాలెం (విశాఖ ఉత్తరం) : మర్రిపాలెంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పూటుగా మద్యం తాగి ఉన్మాదిలా విరుచుకుపడ్డాడు. మద్యం సీసా పగులకొట్టి పొడిచేందుకు ప్రయత్నించాడు. దీంతో హడలిపోయిన ప్రజలు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పరారయ్యాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మర్రిపాలెం ప్రధాన రహదారిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. ఒడిశా భాషలో మాట్లాడుతూ బిగ్గరగా కేకలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా మద్యం సీసా పగులకొట్టాడు. ఆ దారిలో పాదచారుల మీద ప్రతాపం చూపించాడు. సీసాతో పొడిచేందుకు ముందుకు రావడంతో ప్రాణ భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ విషయాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో కొద్దిసేపటికి ఎయిర్పోర్ట్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. ఉన్మాదిలా ప్రవర్తించిన వ్యక్తి కోసం గాలించారు. అప్పటికే ఆ వ్యక్తి పరారయ్యాడు. మర్రిపాలెం పరిసర ప్రాంతాలలో గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఇదిలా ఉండగా గలాటా సృష్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, గాయాలతో ఉన్న అతనికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడని మరో కథనం వినిపిస్తోంది. అయితే ఎవరూ నేరుగా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి తమకు సమాచారం అందిన విషయం వాస్తవమని ఎయిర్పోర్ట్ సీఐ ఎన్.వి.ప్రభాకర్ స్పష్టం చేశారు. పోలీసులు Ððవెళ్లేసరికి ఆగంతకుడు కనిపించలేదని తెలిపారు. గాయపడినట్టు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలలో చాటుమాటుగా అమ్మకాలు జరగడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సైకో సీసాతో పొడిచి వుంటే ప్రాణ నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
హీరో శ్రీకాంత్ ఇంట్లో సైకో వీరంగం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌ను కలవాలంటూ ఓ యువకుడు దౌర్జన్యంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించడమే కాక శ్రీకాంత్‌పై దాడికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన బి.వెంకటేశ్(29) జూబ్లీహిల్స్ రోడ్‌నం. 10లో వ్యాక్స్బేకరీ సమీపంలో నివసిస్తున్నాడు. పదేళ్లుగా జూబ్లీహిల్స్‌లోని పలువురు ప్రముఖుల నివాసాల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. హీరో శ్రీకాంత్ అంటే వెంకటేశ్‌కు వల్లమాలిన అభిమానం. మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లోని శ్రీకాంత్ ఇంట్లో కూడా మూడు నెలల పాటు వంట మనిషిగా పనిచేశాడు. అయితే వెంకటేశ్ పనితీరు సరిగా లేకపోవడం.. సైకోలా ప్రవర్తిస్తుండటంతో అతనిని విధుల నుంచి తొలగించారు. అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లో ఓ రాజకీయ నాయకుని నివాసంలో పనికి కుదిరాడు. అయితే శ్రీకాంత్ తరచూ తనకు కలలో వస్తుంటాడని, కలవడానికి ఎన్నిసార్లు వెళ్లినా అనుమతించడం లేదని ఆరోపిస్తూ శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ ఇంటి వద్ద హల్చల్ చేశాడు. వెంకటేశ్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్మెన్ అడ్డుకోవడంతో అతనిని నెట్టేసి అక్కడే ఉన్న కర్రతో బీఎండబ్ల్యూ కారు(ఏపీ 10ఏఎస్ 0789), ఫోర్డ్ కారు(ఏపీ 09 సీఎల్ 9414) అద్దాలు ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి చొచ్చుకెళ్లాడు. అడ్డువచ్చిన డ్రైవర్ మోహన్‌ను నెట్టేసి శ్రీకాంత్ బెడ్రూమ్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మేడ మీద నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్.. ఎవరు నువ్వని ప్రశ్నిస్తుండగా మెట్ల మీద నుంచి ఆయనను తోసేశాడు. అయితే శ్రీకాంత్ అప్రమత్తంగా ఉండటంతో తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాంత్ సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే వారిని కూడా తోసేసి మళ్లీ లోనికి వెళ్లేందుకు వెంకటేశ్ ప్రయత్నించాడు. చివరికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటన జరిగిన సమయంలో శ్రీకాంత్ భార్య ఊహతో పాటు పిల్లలెవరూ ఇంట్లో లేరు. నాలో మరో వ్యక్తే చేశాడు.. మానసిక పరిస్థితి సరిగాలేక కొంత కాలంగా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుండటంతో చాలా మంది వెంకటేశ్‌ను విధుల్లో నుంచి తొలగించారు. అయితే శ్రీకాంత్‌పై మితిమీరిన అభిమానంతో ఎలాగైనా ఆయనను కలవాలని వెంకటేశ్ మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా తాను కలవడానికి వచ్చానని ఒకసారి, తనలోని మరో వ్యక్తిని శ్రీకాంత్ ఇక్కడికి రప్పించాడని పొంతన లేని జవాబులు ఇవ్వడంతో పోలీసులు తలపట్టుకున్నారు. తనలో అపరిచితుడు దాగి ఉన్నాడని, వాడే బయటకు వచ్చాడని, అసలు వెంకటేశ్ రాలేదంటూ మరో కట్టుకథ చెప్పాడు. శ్రీకాంత్ ఇంట్లో అరగంట పాటు హల్చల్ చేసి ఆయనను తోసేయడమే కాకుండా.. అడ్డువచ్చిన వాచ్మెన్, డ్రైవర్, వంటవారిపై దాడి చేసిన ఘటనలో వెంకటేశ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. -
చర్చిలో ఉన్మాది బీభత్సం
-
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైకో ఎందుకయ్యాడు?
* సివిల్స్‌లో ర్యాంకు రాలేదనే ఆవేదనతో సైకోలా మారిన బల్వీందర్‌సింగ్ * తల్లిదండ్రులు, అడ్డువచ్చిన వారిపై తల్వార్‌తో దాడి * ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి * ఉన్మాది దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలు.. అతడి తల్లి పరిస్థితి విషమం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: ఐసెట్‌లో ఆరో ర్యాంకు.. ఏడాదికి 18.5 లక్షల వేతనం.. కానీ సివిల్స్‌లో ర్యాంకు రాలేదనే ఆవేదనతో ఉన్మాదిగా మారాడు. సైకోలా మారి తల్వార్‌తో వీరంగం సృష్టించాడు. కన్న తల్లిదండ్రులను నరికేయబోయాడు. తప్పించుకోబోతే వెంటాడుతూ దాడి చేశాడు. ఆపబోయిన వారినీ వదల్లేదు, అడ్డువచ్చిన పోలీసులనూ వదల్లేదు. పోలీసుల వద్ద ఉన్న పిస్టల్‌నూ తీసుకుని కాల్చబోయాడు. చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఆ ఉన్మాది పేరు బల్వీందర్‌సింగ్. కరీంనగర్‌లోని లక్ష్మీనగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇతని దాడిలో తల్లిదండ్రులు, పోలీసులు సహా ఆరుగురికి గాయాలయ్యాయి. అతని తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన సర్దార్ బల్వీందర్‌సింగ్ (28) బెంగళూర్‌లోని ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బల్వీందర్ చదువులో ప్రతిభావంతుడు. ఐసెట్‌లో ఆరో ర్యాంకు సాధించాడు. వరంగల్ నిట్‌లో చదువుకున్నాడు. ఒరాకిల్ సంస్థ క్యాంపస్ సెలక్షన్లో ఎంపికయ్యాడు. ఏటా రూ. 18.5 లక్షల వేతనం లభిస్తోంది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్న బల్వీందర్ సింగ్ కొన్నాళ్ల కింద సివిల్స్ పరీక్షలు రాశాడు. కానీ మంచి ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 17న బెంగళూర్ నుంచి కరీంనగర్‌లోని తమ ఇంటికి వచ్చేశాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోని తల్వార్ తీసుకుని తల్లిదండ్రులపై దాడి చేశాడు. వారు భయంతో బయటకు పరుగెత్తినా వెంబడించాడు. రోడ్డుపై అడ్డువచ్చిన ఆటోడ్రైవర్ శ్రీమన్నారాయణతో పాటు మరో పది మందిపైనా దాడి చేసి గాయపరిచాడు. ఈ సమాచారం అందడంతో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. బల్వీందర్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ వారిపైనా బల్వీందర్ తల్వార్‌తో దాడికి దిగడంతో మీర్ ఆలీ అనే కానిస్టేబుల్‌కు రెండు చేతివేళ్లు తెగిపోయాయి. ఇదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య ఆధ్వర్యంలోని మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుని బల్వీందర్‌ను పట్టుకునే ప్రయత్నం చేసింది. సైకోలా చెలరేగిపోయిన బల్వీందర్ .. హెడ్ కానిస్టేబుల్‌పైనా తల్వార్‌తో దాడికి దిగాడు. ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ వద్ద ఉన్న పిస్టల్ కింద పడిపోయింది. ఆ పిస్టల్‌ను అందుకున్న బల్వీందర్.. హెడ్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కరీంనగర్ వన్‌టౌన్ సీఐ విజయసారథి వైపు పిస్టల్ గురి పెట్టాడు. దీంతో సీఐ ఆత్మరక్షణ కోసం తన వద్ద ఉన్న పిస్టల్‌తో బల్వీందర్‌పై కాల్పులు జరిపారు. పొట్టపై కుడివైపు పక్కటెముకల వద్ద బుల్లెట్ తగలడంతో బల్వీందర్ గట్టిగా కేకలు వేస్తూ కిందపడిపోయాడు. వెంటనే అతడిని పట్టుకున్న పోలీసులు తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బల్వీందర్ మృతి చెందాడు. బల్వీందర్ మృతదేహానికి నలుగురు ప్రభుత్వ వైద్యుల బృందం, కరీంనగర్ డివిజన్ మెజిస్ట్రేట్, ఆర్డీవో చంద్రశేఖర్ సమక్షంలో వీడియో రికార్డింగ్‌తో పోస్టుమార్టం చేశారు. తల్లి పరిస్థితి విషమం బల్వీందర్ దాడిలో అతని తల్లిదండ్రులు సర్దార్ అవతార్‌సింగ్(50), సత్వీందర్ కౌర్(45)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో సత్వీందర్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ మృతుడి తల్లిదండ్రులు, గాయపడిన వారిని పరామర్శించారు. మరోవైపు బల్వీందర్ బంధువులతోపాటు అతడి సామాజిక వర్గానికి చెందినవారు పోస్టుమార్టం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ఆందోళన చేశారు. బల్వీందర్ మానసిక పరిస్థితి బాగోలేదని వారు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై నిబంధనల ప్రకారం కాళ్లపై కాల్పులు జరపాల్సి ఉన్నా.. పోలీసులు కడుపులో కాల్చడమేమిటని ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
తల్వార్‌తో తెగబడిన సైకో
-
పోలీస్ తూటాలకు బలైన ఉన్మాది
-
వధూవరులపై సైకో దాడి
తిరుపతి: పెళ్లి వేడుకలో బంధువులందరూ సంబరాల్లో మునిగిపోయారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు పెద్దల నుంచి ఆశీస్సులు పొందారు. ఇంతలో ఊహించని దాడి జరిగింది. తిరుమలలోని ఓ కల్యాణ వేదిక వద్ద ఓ సైకో వధూవరులపై దాడి చేశాడు. వధువు మెడలో ఉన్న నగలను లాక్కోబోయాడు. బంధువలు అతణ్ని పట్టుకుని దే హశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. సైకోను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోనున్నారు. సైకోకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.