
సైకోను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న స్థానికులు
సాక్షి, మాచర్ల: ఓ సైకో వీరంగం సృష్టించిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన జానీ పాషాకు గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేదు. గుంటూరుకు తీసుకెళ్లి పాషా తండ్రి అతడికి చికిత్స చేయించాడు.
బుధవారం ఉదయం కుమారుడిని గ్రామానికి తీసుకొస్తుండగా ఒక్కసారిగా తండ్రిపై దాడి చేసి పాషా పరారయ్యాడు. అనంతరం మాచర్లలోని స్థానిక మసీదులోకి చొరబడిన పాషా ప్రార్థనలు చేస్తున్నవారిపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. సైకో దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment