macherla
-
మాచర్ల గొర్రె .. ఇక స్పెషలే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పల్నాడు ప్రాంతంలో బాగా పెరిగే ‘మాచర్ల గొర్రె’కు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీకి చెందిన ఒంగోలు గిత్త, అశీల్ రకం కోడి వంటివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్బీఏజీఆర్ (నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్) ఈ గొర్రెను ఉత్తమ రకం పశువుగా నమోదు చేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాచర్ల రకం గొర్రెలు ఉన్నాయి. దేశంలోని ఇతర రకాల గొర్రెలు, పొట్టేళ్లతో పోలిస్తే మాచర్ల గొర్రెలు విభిన్నంగా ఉన్నట్టు ఎన్బీఏజీఆర్ పేర్కొంది. దీనిపై ప్రత్యేక పరిశోధన చేసిన అనంతరం తాజా గా ఆ సంస్థ వీటిని ఉత్తమ రకం పశువులుగా గుర్తించింది. ఈ పరిశోధనలో కర్నాల్‌లోని ఎన్బీఏజీఆర్, గన్నవరంలోని ఎనీ్టఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి.స్థానిక పరిస్థితులకు అనుకూలంగా.. మాచర్ల గొర్రెలనే గుక్కల జాల అని, గుంటూరు లోకల్ గొర్రె అని కూడా పిలుస్తారు. ఏపీలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మాచర్ల గొర్రెల జాతి చక్కగా ఇమిడిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. వీటి మాంసం మిగతా వాటితో పోలిస్తే రుచికరంగా ఉంటుందని వెల్లడించారు.శరీర బరువు ఏడాదిలో 30 నుంచి 45 కేజీల వరకూ పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖం, కాళ్లపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఉంటాయి. కొన్ని గొర్రెలు ముదురు గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి. మాచర్ల గొర్రెల పోషణ లాభదాయకంగా ఉండటంతో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు దీన్నే వృత్తిగా చేసుకుంటున్నారని వెల్లడించారు. రెండో స్థానంలో ఏపీ» గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పశు సంపద భారీగా పెరిగినట్టు ఎన్బీఏజీఆర్వెల్లడించింది.» ప్రపంచంలో 13.8 % వాటా పశువులతో దేశం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో 23.74% వాటాతో అంటే 17.63 మిలియన్ గొర్రెలతో దేశంలోనేఏపీ రెండో స్థానంలోఉన్నట్టు స్పష్టం చేసింది.» వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం లాభసాటిగాఉండటంతో ఎక్కువ మంది రైతులు దీనినే వృత్తిగా ఎంచుకుంటున్నారు. పైగా మాంసం ధర ఎక్కువగా ఉండటం వల్ల మంచి గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. -
పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు. .. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్‌లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు. -
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి, గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు, పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగగా.. పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించాడు. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి, రిగ్గింగ్ చేశారని, ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్‌కు తాను వెళ్లానని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు రాగా.. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల వైఎస్సార్సిపి క్యాడర్‌పై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. పలువురు కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి మిన్నకుండిపోయిన పోలీసులు.. టిడిపి నేతల ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని వైఎస్సార్సిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవ్వాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రాగానే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. -
మాచర్లలో ఉనికి కోసం చంద్రబాబు పాకులాట.. బయటపడ్డ బాబు నిజస్వరూపం
-
అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి
సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్ధి అనిల్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవకాశాలున్నాయని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమృకోటలో రిగ్గింగ్ జరుగుతోందని తానే ఫోన్ చేసి ఎస్పీకి తెలియచేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియమించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి
-
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది? -
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
-
సినిమా సీన్ తరహాలో టీడీపీ దౌర్జన్యం
-
మాచర్లలో మరో టెన్షన్.. సీఈవో కీలక ప్రకటన
ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉మాచర్లకు టీడీపీ నేతలు.. మంచిది కాదు: సీఈవో ముకేష్ కుమార్ మీనాపిన్నెల్లి వీడియోపై సీ ఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాందర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీ ఓ, ఏపీ ఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందిబయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను 👉టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. -
మాచర్ల టార్గెట్‌గా ’దేశం‘ ఆపరేషన్ దమనకాండ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాచర్లలో జెండా పాతడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఆపరేషన్‌కు పోలీసు ఉన్నతాధికారులు, సర్కిల్ అధికారులు అండగా నిలిచారు. పోలింగ్ రోజు, తదనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా డీఐజీ గానీ, అప్పటి ఎస్పీ గానీ, కలెక్టర్‌గానీ స్పందించకపోవడం దీన్ని బలపరుస్తోంది. తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా రిగ్గింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది. చివరి నిముషంలో అదే సామాజిక వర్గానికి చెందిన అధికారినీ తీసుకురావడంతో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత కూడా మాచర్ల రణరంగంగాన్ని తలపించింది. టీడీపీ కుట్రలు, కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బృందం సోమవారం ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధినేత వినీత్ బ్రిజ్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది. ఫ్యాక్షన్ జూలు విదిల్చిన జూలకంటి జూలకంటి బ్రహా్మనందరెడ్డిని టీడీపీ మాచర్ల ఇన్చార్జ్గా ప్రకటించినప్పటి నుంచి అక్కడ మళ్లీ ఫ్యాక్షన్ ఊపిరి పోసుకుంది. ఎప్పుడైతే ఆయనను టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిందో అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు. మాచర్లను కైవసం చేసుకోవాలంటే పల్నాడు జిల్లాలో అప్పుడు ఉన్న ఐజీ, ఎస్పీ ఇతర అధికారులు ఉంటే సాధ్యం కాదని జూలకంటి, టీడీపీ అధినాయకులు గుర్తించారు. దీంతో వారు ఆ ఎస్పీని టార్గెట్‌గా చేసుకున్నారు. ఆయన ఉంటే బూత్ క్యాప్చర్, ఓటర్లను భయపెట్టడం కుదరని అభిప్రాయపడ్డారు. అప్పుడే పొత్తు పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా పావులు కదిపారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ అధికారులు ఉంటే తమ పన్నాగం పారదని, వారిని మార్చాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఐజీ పాల్‌రాజ్‌ను బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక అధికారికి సన్నిహితంగా ఉండే అధికారిని తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించారు. పల్నాడు ఎస్పీగా గతంలో సెబ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బింధుమాదవ్ను తీసుకువచ్చారు. వారు వచ్చిన తర్వాత కిందిస్థాయి సిబ్బందికి తెలుగుదేశం నాయకులను టచ్ చేయ వద్దంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.పేట్రేగిపోయిన పచ్చమూకలు 11న రెంటచింతలకు వెళ్లిన సీఐ నారాయణ స్వామి తెలుగుదేశం నేతలకు మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నిక నిర్వహించుకోండని చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అదేరోజున కారంపూడి మండలం వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేసి బెదిరించారు. వేపకంపల్లిలో తెలుగుదేశం నేతలు మహేష్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేసి అతనిపై దాడి చేస్తే తొలుత ఒక హెడ్ కానిస్టేబుల్‌ను పంపారు. ఆ తర్వాత సీఐ వెళ్లి మహేష్ ను కరెంట్ స్తంభానికి కట్టేయించి అవమానించారు. 12న రెంటచింతలలో నారాయణస్వామి ఉండగానే తెలుగుదేశం నేతలు మోర్తాల ఉమా మహేశ్వరరెడ్డిపై దాడి చేశారు. రెంటచింతల మండలం పాల్వయిగేట్ పోలింగ్ స్టేషన్ 201, 202 వద్ద టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఏజెంట్లనూ అనుమతించలేదు. తొమ్మిది గంటల ప్రాంతంలో ఐజీ శ్రీకాంత్ జోక్యంతో ఏజెంట్లను అనుమతించారు. జెట్టిపాలెంలో 214, 217 పోలింగ్ బూత్‌లలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అనుమతించలేదు. దీనిపై గ్రామస్తులు ప్రశ్నించినప్పుడు సీఐ నారాయణస్వామి వచ్చి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపారని గ్రామస్తులు చెబుతున్నారు. తుమృకోటలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈవీఎంలూ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొత్త ఈవీఎంలు పెట్టి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక కొనసాగించారు. వెల్దుర్తిలోని 137, 138, 139, 140, 141 పోలింగ్ స్టేషన్లలో రాత్రి ఏడు గంటల తర్వాత వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేశారు. దీనిపై ఎస్పీకి ఫిరాదు చేసినా స్పందించలేదు. ఒప్పిచర్లలో 250, 251, 252, 256 పోలింగ్ స్టేషన్లలో ఇతర సామాజిక వర్గాల వారు ఓటు వేసుకోలేని పరిస్థితి నెలకొంది.‘నారా’యణస్వామి భక్తి కారంపూడి సర్కిల్లో కారంపూడి, రెంటచింతల, దుర్గి పోలీసుస్టేషన్లు ఉన్నాయి ఇక్కడ బీసీ వర్గానికి చెందిన సీఐ చినమల్లయ్య సమర్థంగా విధులు నిర్వహించారు. ఆయనను అర్ధంతరంగా ఎన్నికల ముందు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని తెలుగుదేశం నాయకులు తీసుకువచ్చి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఆయన వచ్చీ రాగానే తన సామాజిక వర్గ నాయకులకు పగ్గాలు ఇచ్చేశారు. ఎన్నికల్లో మీరు ఎలాగైనా పనిచేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీలోని నాయకులకు అభయం ఇచ్చేశారు. ఆయన ఫోన్ కాల్, వాట్సప్, ఫేస్‌టైమ్ డేటాను పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పని చేసింది అర్థమవుతుందని వైఎస్సార్ సీపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.వెల్దుర్తి పరిధిలో కొందరు టీడీపీ నేతలు పోలీసు కానిస్టేబుళ్ల మీద చేయి చేసుకున్నట్లు ఫిర్యాదు రిజిస్టర్ అయినా దాడి చేసిన వారిని కనీసం స్టేషన్‌కు కూడా పిలవలేదు. ఎన్నికల ముందు బైండోవర్ కూడా చేయలేదు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య శిరిగిరిపాడు గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడి చేశారు. బందోబస్తుగా వచ్చిన ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బందిపై కూడా తెలుగుదేశం నేతలు దాడి చేశారు. దీనిపై రెండు ఫిర్యాదులు వచ్చినా దాడి చేసిన వారిని ఎవరినీ పోలీసుస్టేషన్‌కు పిలవలేదు. పైగా బాధితుడైన ఎస్ఐతోపాటు కారంపూడి, మాచర్ల టౌన్ సీఐలను బదిలీ చేశారు. దీంతో పోలీసుల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో రెచ్చిపోయారు. రెంటచింతలలో సుమారు రెండు లక్షల హోలోగ్రామ్ ఉన్న ఓటర్ స్లిప్‌లను స్వాధీనం చేసుకుంటే కలెక్టర్ చర్యలు తీసుకోకపోగా బస్‌ను కూడా సీజ్ చేయకుండా వదిలేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీ బిందుమాధవ్తోపాటు కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా.. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన మరికొందరు అధికారులను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్‌లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్‌లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్‌లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది. -
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
-
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
-
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
-
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంటికి టీడీపీ నేతలు తెలుగుదేశం జెండా కట్టారు. టీడీపీ జెండా తీసేయాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కోరగా.. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌తో వాదనకు దిగారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి రాళ్లు రువ్వారు. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. -
జననేతకు మాచర్ల ప్రజానీకం ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)
-
చంద్రబాబును నమ్మగలమా?: సీఎం జగన్
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం క్రింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి... ఇవాళ పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని వివరిస్తూనే.. గత పాలకుడు చంద్రబాబు నాయుడి అవినీతిని ఎండగట్టారు. ‘‘మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు ఇంతటి చిక్కటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, చిరునవ్వుల మధ్య దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’’.. దశాబ్దాల నీటి ఎద్దడికి నివారణ– వరికపూడిశెల. ఈ మాచర్ల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కూడా సాగునీటికి, తాగునీటికి దశాబ్దాలుగా ఎద్దడి మన కళ్లెదుటనే కనిపిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు పుట్టిన బిడ్డకు అందని తల్లిపాలమాదిరిగానే సముద్రంలో ప్రయాణిస్తున్నవారికి దక్కని గుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాలు పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నది నీరు దక్కని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. దశాబ్ధాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ మారుస్తూ.. ఈ ప్రాంతానికి సంబంధించిన రూపురేఖలన్నింటినీ కూడా మార్చాలన్న తపన, తాపత్రయంతో ఇవాళ రూ.340 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుందని గర్వంగా చెబుతున్నాను. గతంలో టెంకాయ కొట్టి మోసం... గతంలో మీరు గమనించే ఉంటారు. ఇదే పథకానికి గతంలో ఎన్నికలకు కేవలం నెల ముందు... గత పాలకులు 2019 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా.. ఈప్రాజెక్టుకు సంబంధించిన భూమి... ఏమాత్రం ప్రొక్యూర్ చేయకుండానే, మనందరినీ మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని చెప్పి మనందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయండి. నేడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభం... ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావడం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి కూడా ఈ ఏదాది మే నెలలో అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మన హయాంలోనే ప్రొక్యూర్ చేశాం. అవన్నీ లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అనుమతులు లేకుండానే.. భూమి ప్రొక్యూర్ చేయకుండానే మరి ఏ రకంగా 2019 ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు గత పాలకులు, ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడకువచ్చి టెంకాయ కొట్టారు అని మీ అందరి తరపును నేను అడుగుతున్నాను. ఏ కార్యక్రమం చేసినా అందులో చిత్తశుద్ధి ఉండాలి. నోటిలో నుంచి మాట వస్తే అందులో నిజాయితీ ఉండాలి. ప్రజలను, రైతులను, అక్కచెల్లెమ్మలను, చదవుకుంటున్న పిల్లలను మోసం చేయాలని... మోసం తోనే అడుగులు వేస్తే... ఏం జరగబోతుందన్నది ప్రజలే 2019లోనే గట్టిగా చెప్పారు. 175 నియోజకవర్గాలను గానూ.. గతంలో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని కేవలం 23 స్ధానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చారు. అబద్దాలను నమ్మం, మోసాలకు ఓటు వేయం అని ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్తితులను మనం చూశాం. వరికపూడిశెల– 25 వేల ఎకరాలకు సాగు, తాగునీరు.. ఈ రోజు అందుకు భిన్నంగా.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత పనులను ప్రారంభిస్తున్నాం. ఈ లిఫ్ట్‌ను నాలుగు పంపులతో నాగార్జున సాగర్‌కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్నాం. వరికెపూడిశెల వాగునుంచి రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొదటిదశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లిఫ్ట్ ద్వారా 20వేల మంది జనాభాకు తాగునీరందించే మంచి జరుగుతుంది. దాదాపు రూ.340 కోట్ల వ్యయంతో ఈప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. పల్నాడు గుండె చప్పుడు విన్న వ్యక్తిగా... ఇంకా కొన్ని విషయాలు ఈ అందరితో పంచుకుంటున్నాను. ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ఔషధమో పూర్తిగా తెలిసిన వ్యక్తులలో నేను ఒకరిని. మీ అందరి గుండె చప్పుడు విన్న వ్యక్తులలో నేను ఒకరిని. కాబట్టి ఈ ప్రాజెక్టును దశలవారీగా మాచర్ల నియోజకవర్గం ఆ తర్వాత వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఆ తర్వాత ఎర్రగొండపాలెం వరకు తీసుకునిపోయే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన అటవీ, పర్యావరణశాఖ అనుతులన్నీ కూడా ఇఫ్పటికే తీసుకునిరాగలిగామని సంతోషంగా చెబుతున్నాను. దేవుడి దయతో దశలవారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే దశలవారీగా పూర్తవుతుందో... 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమం పూర్తవుతుంది. దాదాపుగా 1లక్ష మందికి తాగునీరు అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. పౌరషాల గడ్డ నుంచి అభివృద్ధి గడ్డగా... ఈ రోజు ఈ ప్రాజెక్టే కాకుండా..ఈ పల్నాడను, ఈ పౌరుషాల గడ్డను, అభివృద్ధి గడ్డగా మార్చడానికి, స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్ధాలుగా ఎవరూ సాహసం కూడా చేయని విధంగా... ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి మీద మీ బిడ్డ ప్రభుత్వం గత 53 నెలలుగా ప్రతి అడుగు వేస్తూ వచ్చాం. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా.... ఇక్కడ ఈ ప్రాంతానికి వేగంగా ఇప్పటికే పనులు జరుగుతున్న మెడికల్ కాలేజీని కూడా మన ప్రభుత్వమే తీసుకువచ్చింది. ఒక్క పల్నాడే కాదు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ప్రధానంగా పేద వర్గాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి 53 నెలలుగా మనందరి ప్రభుత్వం ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేసింది. అత్యధిక ప్రాధాన్యతను పేద వర్గాల సాధికారతకు ఇచ్చాం కాబట్టే... మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా రూ. 2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేదు. ఇక నాన్ డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ లాంటి కార్యక్రమాల ద్వారా రూ. 1.70 లక్షల కోట్లు.. వెరసి మొత్తం 53 నెలల కాలంలో అక్షరాలా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.4.10 లక్షల కోట్ల పైచిలుకు మేలు చేసింది. లంచాలు అడిగేవాడు లేడు. ఎక్కడా వివక్ష చూపే కార్యక్రమం జరగడం లేదు. ప్రతి అక్కచెల్లమ్మల కుటుంబాల వద్దకు వచ్చి... నీకు ఏం అవసరం ఉందని ప్రతి ఇంటికి వచ్చి అడిగి మరీ తెలుసుకుని మంచి చేసే కార్యక్రమం మీ బిడ్డ పాలనేలో జరుగుతుంది. కోవిడ్ ఉన్నా ఆగని సంక్షేమం.... మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. వరుసగా రెండేళ్లు మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు. కోవిడ్ సమస్యులున్నా... ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, ఆదాయాలు తగ్గినా, కోవిడ్ ఖర్చుల పెరిగినా, బాబు చేసిన అప్పుల కుంపటి ఎంతగా ఇబ్బంది పెట్టినా ఎవరిమీదా నేరం మోపలేదు. సాకులు వెతకలేదు, చెప్పలేదు. మీ అవసరాలు మీ కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు ఖర్చులకన్నా మిన్నగా భావించి... ప్రతి ఒక్కరికీ మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా నిలబడగలిగింది. ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదు. అభివృద్ధి ఆపలేదు. మరోవైపు చంద్రబాబు గారి గత పాలన ఎలా జరిగింది. ఎందుకంటే రాబోయో రోజుల్లో మహా సంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఆ మహాసంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ? గతంలో పాలన ఎలా జరిగింది ? అందులో ఆ పెద్దలు, పాలకులు ఎలా పని చేశారు? మనకు మంచి చేయగలుగుతారా? లేదా అన్నది ఆలోచన చేయాలి. గతానికీ– నేటికీ తేడా చూడండి. గత పాలనకు, మీ బిడ్డ పాలనకు బేరీజు వేయాల్సిన సమయం వచ్చింది. మరోవైపు మన ప్రతిపక్ష నాయకుడ్ని చూడండి. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు మంచి చేస్తూ కనీసం ఒక్క పథకమైనా పెట్టిన చరిత్ర గతంతో చంద్రబాబుకు ఉందా? గతం మోసాల చరిత్ర.. గతంలో మనం ఏం చూశామంటే... మోసాల చరిత్రను చూశాం. వెన్నుపోట్ల చరిత్రను చూశాం. అబద్ధాల చరిత్రే మనకు చంద్రబాబు పాలనలో కనిపించింది. ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కనీసం ఒక మంచి చేశానని గానీ, కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చానని గానీ, కనీసం ఒక మంచి కార్యక్రమం అమలు చేశానని కానీ ఈ పెద్దమనిషి ఓటు అడగడు. కారణం ఈ పెద్దమనిషి చేసిందేం లేదు కాబట్టి. కానీ ఈయన ఎన్నికలు రాగానే అది చేస్తాను, ఇది చేస్తానని చెబుతాడు. మాయ మాటలతో ఓట్లు అడుగుతాడు. ఆలోచన చేయండి.. మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే మీరు అండగా నిలబడాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఫలానా మంచి చేశాను, నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. మంచి చేసానని ఓటు అడగడం లేదు... మోసం చేసేందుకు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచేందుకు.. మీకు కేజీ బంగారం ఇస్తాను, మీ ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబును నమ్మగలమా ? ఇదే పెద్దమనిషి చంద్రబాబు చివరికి సొంత నియోజకవర్గం అయిన కుప్పానికి కూడా 34 ఎమ్మెల్యేగా ఉన్నా ... అక్కడ కూడా నీరిచ్చిన చరిత్ర లేదు. కుప్పానికే నీళ్లు ఇవ్వని చంద్రబాబు.. మన మాచర్లకు, మన పల్నాడుకు లేదా మరో ప్రాంతానికి ఈ పెద్దమనిషి నీరు ఇస్తానని చెబితే నమ్మగలమా? నమ్మగలుగుతామా? కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని ఒకడు అన్నాడట. ఈ పెద్దమనిషి చంద్రబాబు మాటలు చూస్తే అవే కదా గుర్తుకొస్తాయి. కుప్పానికేం చేయలేని బాబు... 14 యేళ్లు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గం కుప్పానికి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేపోయాడు. అలాంటి ఈ పెద్ద మనిషి... ఇక మన పల్నాడుకు గానీ, మరోప్రాంతానికి గానీ, మన గ్రామానికి గానీ, మన కుటుంబాలకు గానీ, మన సామాజిక వర్గాలకు గానీ మంచి చేస్తాడని నమ్మగలమా?. చివరికి కుప్పానికి నీళ్లు కావాలన్నా ? చివరికి కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలన్నా ? చేసేది మీ బిడ్డే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని ఈ పెద్ద మనిషి చెప్పాడు. చివరికి పొదుపు సంఘాల రుణాలు మాఫీ కాకపోగా ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలుగా ఉన్న నా అక్కచెల్లెమ్మల సీ గ్రేడ్ గా, డీ గ్రేడ్ గా వారి పరపతి దిగజారిన పరిస్థితులు చూశాం. చివరకు నా అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేసిన ఇలాంటి బాబు.. ఒక జగనన్న అమ్మ ఒడిగానీ, జగనన్న వైయస్సార్ ఆసరా గానీ, వైయస్సార్ చేయూత గానీ, సున్నా వడ్డీ గానీ, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ ఏనాడైనా చేయగలిగాడా? చేస్తానంటే నమ్మగలమా?.. బాబు విజన్ – ప్రజల్లో చెవిలో పువ్వులు... ఈయన్ను చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది. ఒకాయన ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటాడట. ఎప్పుడూ లేస్తే మనిషిని కాదంటాడట. కానీ మంచంలోంచి లేవడు. చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతే. తాను చేసిన మంచి ఏమిటనేది ఎప్పుడూ చెప్పడు. ఆయన 2000 సంవత్సరంలో ఉంటే 2047 గురించి చెబుతాడు. 2000 సంవత్సరంలో నువ్వు ఉన్నావ్.. ఇప్పుడేం చేస్తావంటే చెప్పడు. 50 ఏళ్ల విజన్ అంటాడు. 50 ఏళ్ల తర్వా ఏం జరగబోతోందనేది చెబుతాడు. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో ? ఎవడు పోతాడో ? ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టడం ఈజీ కదా అని ఆలోచిస్తాడు. మీ బిడ్డ 53 నెలల పాలనలో.. అదే మీ బిడ్డ పాలనలో 53 నెలల కాలంలో పల్నాడును జిల్లా చేసింది మనందరి ప్రభుత్వం. పల్నాడుకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. పల్నాడులోగానీ, రాష్ట్రంలో ఏ జిల్లా అయినా, గ్రామ గ్రామాన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరంటే మనం, మనందరి ప్రభుత్వం. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికీ జల్లెడ పట్టి ఆరోగ్య సురక్ష జరుగుతోంది.ఇంగ్లీష్ మీడియం బడులొచ్చాయి. గ్రామ గ్రామాన రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది కూడా మనం, మనందరి ప్రభుత్వమే. అది కూడా ఈ 53 నెలల కాలంలోనే చేశాం. వెన్ను పోటు వీరుడు.. కుటుంబంలో సొంత కూతురును ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, ఇక రాష్ట్రంలోని కోటీ 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్ లో ఆయన నేను మారాను అంటే మనం నమ్మగలమా? అని అడుగుతున్నాను.సొంత కూతురుని ఇచ్చిన మామ... ఎన్టీ రామారావు పరిస్థితే అది అయితే, నువ్వు, నీలాంటోడు, నాలాంటోడి పరిస్థితి ఏంటి?.. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానని చెప్పి అహంకారంతో మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ముస్లింలకు, ఎస్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వని మనిషి ఈ పెద్దమనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా ఏనాడైనా న్యాయం చేశాడా? మరి ఇలాంటి వ్యక్తి భవిష్యత్ లో నేను మారాను అంటే నమ్మగలమా? తన కొడుకు, తన మనవడు.. వీళ్లు వెళ్లే బడులు మాత్రం ఇంగ్లీషు మీడియమే. ఆ కొడుక్కు తెలుగు మాట్లాడటం కూడా సరిగా రాదు. పోనీ ఇంగ్లీష్ అన్నా వస్తుందంటే అదీ రాదు. అది వేరే విషయం. కానీ తన కొడుకు, మనవడు వీళ్లను చదివించింది ఇంగ్లీష్ మీడియంలోనే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనార్టీలు, మన బీసీలు, మన నిరుపేద వర్గాలు వెళ్లే మన గవర్నమెంట్ బడులు మాత్రం ఇంగ్లీష్ మీడియంకు మారకూడదట. అవి తెలుగుమీడియంలోనే ఉండాలట. ఒకవేళ అవి ఇంగ్లిషు మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుందని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి హయాంలో ఏ పేదవాడికైనా కూడా, ఏ సామాజిక వర్గానికైనా కూడా భవిష్యత్ మారుతుందనే నమ్మకం ఉందా? అని అడుగుతున్నాను. ఇలాంటి పెద్ద మనిషి రేపు మీ దగ్గరకి వచ్చి.. నేను మారాను అంటే నమ్మగలమా?. గతంలో ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ 2 వేల నిరుద్యోగ భృతి.. ఈ మాటలన్నీ గుర్తున్నాయా ? జాబు రావాలంటే బాబు రావాలి అని ఊదరగొట్టి మోసం చేసాడు. స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా మన ప్రభుత్వం వచ్చిన దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మరో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మనందరి, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగితే... ఈ పెద్ద మనిషి చంద్రబాబును నమ్ముకుంటే ఇలా 2.07 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలడా? రేప్పొద్దున మీ దగ్గరకు వచ్చి నేను మారాను అంటే నమ్మగలమా?. మన అదృష్టం కొద్దీ ఈయన దిగాడు గానీ, దిగకపోయి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదు, కరెంటు కంపెనీలు ఉండేవి కాదు. ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీలు ఉండేవి కావు. అన్నీ కూడా నీట్ గా అమ్మేసి గవర్నమెంట్ ను మూసేసేవాడు. ప్రభుత్వ రంగంలో హాస్పిటళ్లు కూడా ఉండేవి కాదు. దేవుడి దయతో ఆయన పోయాడు కాబట్టి వీటికి కొత్తరూపు వచ్చింది. ఆస్పత్రులు స్కూళ్లు మారాయి. ఆర్టీసీని కూడా గవర్నమెంట్ లో కలిసి రూపురేఖలు మారిన పరిస్థితులు మన ప్రభుత్వంలో వచ్చాయి. ఈ పెద్ద మనిషి తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా హైదరాబాద్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్దమనిషి వైద్య ఆరోగ్య రంగంలో... మనందరి ప్రభుత్వంలో... విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా?. పేదవాడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపుతాను అని భవిష్యత్ లో ఈ పెద్దమనిషి అంటే నమ్మగలమా? ఆలోచన చేయండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయన్న ఈ పెద్దమనిషి... ఉచిత విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేస్తే ఆ రైతుల గుండెల మీద కాల్చి చంపిన ఈ పెద్దమనిషి, రుణాల మాఫీ దగ్గర నుంచి రైతన్నకిచ్చిన ఏ హామీ అయినా ఏనాడైనా నిలబెట్టుకున్నాడా?. అలా రైతును మోసం చేసి గాలికి వదిలేసిన ఈ బాబు ఇప్పుడు రైతులకు ఏదేదో చేస్తానంటాడు. రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తానన్న పెద్దమనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని టీవీల్లో అడ్వరై్డజ్మెంట్లు ఊదరగొట్టిన ఈ పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చాక రైతులను అడ్డగోలుగా మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టుకొని అది చేస్తా ఇది చేస్తాఅంటే నమ్మగలమా ?. చంద్రబాబు వాలకం ఎలా ఉంటుందంటే... నరమాంసం రుచి మరిగిన పులి బంగారం కడియాన్ని చూపుతూ ఫ్రీ గిఫ్ట్ ఇస్తా అని ఆశ పెడితే, ఎవరైనా ఆ బంగారు కడియం కోసం పులి దగ్గరకు వెళ్లే ధైర్యం చేయగలుగుతారా? ఈపెద్ద మనిషి చంద్రబాబు మాటలు నమ్మితే కూడా అదే మాదిరిగా ఉంటుంది. తన బినామీ భూములు బాగా పెరగాలన్న దుర్భుద్ధితో ఈ పెద్దమనిషి అమరావతిని ఒక రాజధానిగా భ్రమ కల్పించాడు. మరి ఇలాంటి వ్యక్తి మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే సమన్యాయం జరుగుతుందని ఎవరికైనా నమ్మకం ఉందా?. ఈ మనిషి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా? తన హయాంలో చంద్రబాబు పేదలకు కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. తన హయాంలో పేదలకు సెంటు స్ధలం కూడా ఇవ్వకపోగా... మనం 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపేందుకు కేసులు వేశారు. అంతే కాకుండా... కులాల మధ్య సముతుల్యం దెబ్బతింటుందని, ఏకంగా ఎదురు దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా మంచి జరుగుతుందా? ఇలాంటి వ్యక్తి నేను మారాను, భవిష్యత్ లో ఇవన్నీ చేస్తానంటే నమ్మగలమా? బాబు– లంచాల పాలన... తన పాలనలో పేదలకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా, లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ, గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిప్పిన ఈ పెద్దమనిషి మనసు మారాలంటే, గుండె కరగాలంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు, గుండె కరిగే ఇంజెక్షన్లు ఎన్ని ఇస్తే ఈ పెద్ద మనిషిలో మానవత్వం వస్తుందో ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి కాబట్టి ఒకడే చెబితే నమ్మరని, తనకు తోడు ఇంకో నలుగురిని కలుపుకుంటున్నాడు. వాళ్లు అందరూ.. ప్రతి ఇంటికీ బెంజ్ కారు, కేజీ బంగారం ఇస్తామంటున్నారు. మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెబితే... నేను దత్తపుత్రుడుని కలిశాను కాబట్టి మరో 6 హామీలు ఇస్తున్నాము. మొత్తం 11 హామీలిస్తున్నామంటున్నారు బాబు– దత్త పుత్రుడి మోసం... 2014లో ఇదే దత్తపుత్రుడు చంద్రబాబుతో కలిసే పోటీ చేశాడు. ఇదే చంద్రబాబుతో కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టోకు నేను పూచీ అన్నాడు. వీళ్లద్దరూ అయితే సరిపోరని వీరికి తోడు మోదీ వీళ్లిద్దరికి తోడు మోడీ గారి పేరు కూడా తెచ్చుకున్నారు. ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది గత చరిత్ర. అలాంటి గత చరిత్ర ఉన్నవాళ్లు ఇవాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే.. 5 హామీలు ఒకరు, 6 హామీలు ఇంకొకరు కలిసి 11 హామీల మేనిఫెస్టో ఇది. ఇది రిహార్సల్ అట, మేనిఫెస్టో ఇంకా ఎక్కువ ఇస్తారట. నిజంగా వీళ్లు మనుషులేనా? వీళ్లకు సిగ్గుందా?. అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నా... ఇటువంటి దారుణాలను సమర్థించేందుకు చంద్రబాబుకు ఒక వర్గం ఉంది. ఒక ఎల్లో మీడియా ఉంది. ఒక దొంగల ముఠా తోడుంది. వీళ్లందరిదీ ఒక పెద్ద లాబీ. బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకొనేందుకు, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి బాబు తరపున పనిచేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులు, అనేక పార్టీల్లో తన కోవర్టులు కూడా ఉన్నారు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది? ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారు? ఏ పేద వాడి కోసం చేస్తున్నారు?. కేవలం ప్రజల్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం కోసం దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి చూస్తే రాజకీయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు. ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డ చేతకాదు. ఒక వైయస్సార్‌కు గానీ, ఒక జగన్‌కు గానీ తెలిసిందల్లా ఒక్కటే. ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినడం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఒక్కటే ఒక్కటి చెబుతాను. నేను విన్నాను– ఉన్నాను.. మీ జగన్.. నేను విన్నాను, నేను ఉన్నానని మాత్రమే మీ బిడ్డ జగన్ చెబుతాడు. ఆ తర్వత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలను ఒక బైబిల్‌గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి, అక్కచెల్లెమ్మల బతుకుల్లో మార్పు తీసుకురావడానికి తపిస్తూ అడుగులు వేశాడు మీ బిడ్డ. మీ బిడ్డ ఈ పొత్తుల్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి తోడు లేదు. కారణం మీ బిడ్డ వీళ్లనెప్పుడూ నమ్ముకోలేదు. పైనున్న దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ దళారులను పెట్టుకోలేదు. చేసిన మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముతాడు. నా ధైర్యం ఇంటింటికీ, అన్ని సామాజిక వర్గాలకూ, అన్ని ప్రాంతాలకు చేసిన మంచి. మనందరి ప్రభుత్వం ఇంటింటికీ అన్ని సామాజిక వర్గాలకు చేసిన మంచే నా ధైర్యం. బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన రూ. 2.40 లక్షల కోట్లు నా ధైర్యం. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టడం మీ బిడ్డకు మీరిచ్చిన ధైర్యం. ఎన్నికల మేనిఫెస్టో చూపించి 99 శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి అక్కచెల్లెమ్మ ఇంటికి వెళ్లి మేనిఫెస్టోను చూపి అక్కా.. మీ బిడ్డ ఇవన్నీ ఎన్నికలకు మందు చెప్పాడు. ఇవన్నీ జరిగాయా లేదా మీరే చూడండి.. జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని నిజాయితీ అడిగే చిత్తశుద్ధి. నా ధైర్యం.. నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ.. మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్ లు. ఆగ్రామంలో మార్చిన వ్యవసాయ తీరు ఆర్బీకే కేంద్రాలు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం. నాడు నేడుతో బడులు రూపు రేఖలు మార్చడం నా ధైర్యం. మన అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా ఇవ్వడం నా ధైర్యం. అమ్మ ఒడి ఇవ్వడం, వైయస్సార్ చేయూత ఇవ్వడం నా ధైర్యం. దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయించి, అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ షేక్ చేసినా, ఎస్ వోఎస్ నొక్కినా 10 నిమిషాల్లో పోలీసు అన్నదమ్ములు వచ్చే వ్యవస్థను తీసుకురావడం నా ధైర్యం. నా పొత్తు ప్రజలతోనే.. ప్రజలతోనే నా పొత్తు. పేద ప్రజల కోసమే నా పార్టీ, మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టిందనే చిత్తశుద్ధి నా ధైర్యం. అందుకే దళారులతో పొత్తు పెట్టుకోలేదు. రాబోయే రోజుల్లో ఎన్నికల సంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మోసాలకు మోసపోవద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా ? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి చేసే మనందరి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. చివరగా.. కాసేపటి క్రితం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి కొన్ని అభివృద్ధి పనులు అడిగాడు. ఇవాళ జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులే కాకుండా.. మరికొన్ని పనులు అడిగాడు. అందులో ఒకటి ఇక్కడున్న సీహెచ్సిని 100 పడకల ఆసుపత్రి కింద మార్చే కార్యక్రమం చేయమన్నాడు. దాన్ని మంజూరు చేస్తున్నాను. వీటితో పాటు మిగిలినవన్నీ చేస్తాను అని హామీ ఇస్తూ... తన ప్రసంగం ముగించారాయన. చదవండి: అదేపనిగా అసత్యాల ‘ఎత్తిపోతలు’ -
Palnadu Voice:జగనన్నకు మేమిచ్చే గిఫ్ట్ ఇదే
-
బాబుపై అదిరిపోయే కౌంటర్..
-
పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం: సీఎం జగన్
Updates సీఎం జగన్ మాట్లాడుతూ.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం. ►రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోత ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. ►ఎలాంటి అనుమతులు లేకుండా గల పాలకులు ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయబోతే.. ప్రస్తుతం అన్ని అనుమతులు పొంది ప్రాజెక్ట్‌ను చేపట్టాం. ►నవంబర్ 6న అటవీశాఖ నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. ఏదైనా పనిచేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ►ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో సాగునీరు అందుతుంది. ►ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ►ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు, తాగునీరు అందించబోతున్నాం. ►పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళా సాధికారతకు కృషి చేశాం. రూ.2లక్షల 40వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. ►డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4లక్షల 10వేల కోట్లు అందించాం. ►కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపలేదు. ►చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. ►చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్దాలే. ►14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు. ►కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా?. ►కన్నతల్లికి అన్నం పెట్టని వాడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా?. ►కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని చంద్రబాబు ఆఫర్లతో వస్తాడు. ►రాష్ట్రంలోని గ్రామగ్రామాన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. పల్నాడును జిల్లా చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ►సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటారా?. ►చంద్రబాబు మారానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా అన్నది చంద్రబాబే. ►బీసీల తోకలు కట్ చేస్తానని అహంకారంగా మాట్లాడిందీ చంద్రబాబే. ►చంద్రబాబు ఇప్పటి గురించి చెప్పడు కానీ.. రాబోయే 50 ఏళ్లలో ఏం చేస్తాడో చెబుతాడు. ►అప్పటి వరకు బ్రతికి ఉండేది ఎవరు?. ►చంద్రబాబు మానవత్వంలేని మనిషి. ►ప్రజల సంక్షేమం చంద్రబాబుకు పట్టదు. ►చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని.. మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నారు. ►చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం మాకు తెలియదు. ►నాకు ఎల్లో మీడియా సపోర్ట్ లేదు. కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. ►చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ►రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఇస్తున్నాం. ►మీకు మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాది. ►అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం. రాబోయే 30 ఏళ్లు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►పల్నాడు ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దే ►వైఎస్సార్ వరికపూడిశెల ప్రాజెక్టుగా నామకరణం చేయాలి ►అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు ►ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు పల్నాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చినే సీఎం జగన్ ►రూ.320.26 కోట్లతో ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►తొలి దశలో 24 వేల ఎకరాలకు సాగునీరు ►ఆరు దశాబ్దాల తర్వాత పర్యావరణ అనుమతులు ►సీఎం జగన్ కృషితో కేంద్ర అటవీ శాఖ అనుమతి ►పల్నాడు ప్రాంతానికి వరికపుడిశెలతో పాటు గోదావరి జలాలు ►పల్నాడు ప్రజల ఆకాంక్ష తీర్చేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ ►పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాచర్ల చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమాలపు సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ఎమ్మెల్యేలు మాచర్లలో పోటెత్తిన జనం ►రైతులతో కిటకిటలాడుతున్న మాచర్ల ►సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు రోడ్లకు ఇరువైపులా ఎదురుచూపు ►అరవై ఏళ్ల కల నెరవేరుతుండటంతో పల్నాడు వాసుల్లో ఆనందం ►సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు బారులు తీరిన రైతులు ►ఉదయం నుండే కిటకిటలాడుతున్న సభావేదిక గ్యాలరీలు ►మాచర్ల బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►కాసేపట్లో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించనున్న సీఎం సాక్షి, అమరావతి: పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుడుతున్నారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. ‘వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సీఎం జగన్ పనులను ప్రారంభించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా అయ్యేలా 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. -
రేపు మాచర్లకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందుకోసం బుధవారం మాచర్లలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరికపుడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ మాచర్ల షెడ్యూల్ ప్రకారం.. ఉదయం పది గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. మాచర్లలో చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు. పులుల అభయారణ్యం (టైగర్ ఫారెస్ట్)లో వరికపుడిశెల ఎత్తిపోతల, పైపులైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను లైన్ క్లియర్ అయ్యింది. దాదాపు రూ.340.26 కోట్లతో జరగబోయే పనులకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్ ఇరిగేషన్(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తోంది జగనన్న ప్రభుత్వం. చదవండి: పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల -
పల్నాడు ప్రజల ఆకాంక్ష తీర్చేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ
-
మాచర్లలో సామాజిక జైత్రయాత్ర
-
డాక్టర్ రాధా హత్య కేసులో బిగ్ ట్విస్ట్
ఎన్టీఆర్: జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య కేసులో మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడని పోలీసులు తేల్చి చెప్పారు. రాధను హతమార్చటంలో నిందితుడు కారు డ్రైవర్ సహాయం పొందినట్లు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఆర్ధిక వివాదాలే హత్యకు గల కారణాలుగా నిర్ధరించారు. జిల్లా ఎస్పీ పి.జాషువా శుక్రవారం తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మూడు నెలల ముందే పథక రచన.. డాక్టర్ లోక్‌నాథ్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాధ భార్యభర్తలు. మచిలీపట్నం జవ్వారుపేటలో శ్రీ వెంకటేశ్వర తల్లిపిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. రాధ కొంత కాలంగా ప్రాక్టీస్ ఆపేసింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిరువురూ వివాహితులే. కుమారుడికి ఇటీవలే వివాహం కావటంతో గత నెలలో అత్తారింటికి వెళ్లాడు. ఇదిలా ఉండగా లోక్నాధ్, రాధల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. వ్యక్తిగత కలహాలతో పాటు ఆర్ధికపరమైన విషయాల్లోనూ మనస్పర్ధలు ఉన్నాయి. విబేధాలు తారస్థాయికి చేరుకోవటంతో ఉమామహేశ్వరరావు భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పథకం రచించి సమయం కోసం వేచి చూస్తున్నాడు. తన వద్ద సుమారు 15 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ స్ఫూర్తి జానార్ధన్ అలియాస్ మధును ఈ పనిలో సహాయం కోరాడు. సహకరిస్తే 30 లక్షల నగదుతో పాటు రాధ సంబంధించిన బంగారం మొత్తం ఇచ్చి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇందుకు మధు ఒప్పుకున్నాడు. ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేసేందుకు మూడు నెలల ముందుగానే సీసీ కెమెరాలను ఉపయోగంలో లేకుండా చేశారు. ఆభరణాలు తీసి.. సీలింగ్‌లో దాచి.. అదును కోసం చూస్తున్న ఉమామహేశ్వరరావు కొడుకు అత్తగారింటికి వెళ్లటంతో డ్రైవర్‌తో చర్చలు జరిపాడు. ఆక్సిజన్ సిలిండర్లు బిగించేందుకు ఉపయోగించే రెంచీని ఆయుధంగా ఎంచుకున్నారు. గత నెల 25వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ లోక్‌నాథ్ రెంచీని మధుకు అందజేశాడు. సాయంత్రం రెండో అంతస్తులో అనుమానం కలుగకుండా నక్కి ఉండమని చెప్పాడు. అతడు డాక్టర్ చెప్పిన విధంగా చేశాడు. అదును చూసుకుని ఉమామహేశ్వరావు, మధు ఇద్దరూ రాధపై ఒక్కసారిగా దాడి చేశారు. మధు ఆమెను బలంగా పట్టుకోగా భర్త ఆమె తలపై రెంచీతో బలమైన దెబ్బలు కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అయిన రాధ స్పృహ కోల్పోయింది. మృతి చెందిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు మరలా రెంచీతో బలంగా ఆమె తలపై కొట్టారు. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఉమామహేశ్వరరావు ఇంటి వెనుక వైపు నుంచి కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌లో వెళ్లిపోయాడు. మధు ఆమె ఒంటిపై ఆభరణాలు ఒలిచి సీలింగ్‌లో దాచాడు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు డాక్టర్ సలహా మేరకు కారం తెచ్చి మృతురాలి ఒంటిపై చల్లాడు. గదిలో అక్కడక్కడా కారం చల్లటంతో పాటు రెంచీని ఇంటి వెనుకభాగంలో దాచి పెట్టాడు. అదే రోజు రాత్రి 10.30 సమయంలో డాక్టర్ ఉమామహేశ్వరావు ఏం ఎరుగనట్టు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ సమాచారం ఇచ్చాడు. ఆభరణాలు స్వాధీనం.. రాధ హత్య సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మాధవరెడ్డి, సంబంధిత ఏరియా సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త నుంచి వివరాలు తీసుకున్నారు. అతని ఫిర్యాదుపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో హత్య కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు చిక్కకపోవటంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాధను హత్య చేసింది ఆమె భర్తేనని నిర్ధారించారు. అతడికి డ్రైవర్ సహకరించినట్లు నిర్ణయానికి వచ్చారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును చేధించటంలో ప్రతిభ కనబరచిన బందరు డీఎస్పీ మాధవరెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వర్తించి హంతకులను అదుపులోకి తీసుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించేందుకు రాష్ట్ర డీజీపీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ హరిబాబు, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐలు ఉమామహేశ్వరరావు, రవికుమార్ పాల్గొన్నారు.