Updates
సీఎం జగన్ మాట్లాడుతూ.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం.
►రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోత ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం.
►ఎలాంటి అనుమతులు లేకుండా గల పాలకులు ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయబోతే.. ప్రస్తుతం అన్ని అనుమతులు పొంది ప్రాజెక్ట్‌ను చేపట్టాం.
►నవంబర్ 6న అటవీశాఖ నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. ఏదైనా పనిచేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి.
►ఈ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో సాగునీరు అందుతుంది.
►ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం.
►ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు, తాగునీరు అందించబోతున్నాం.
►పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం.
►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళా సాధికారతకు కృషి చేశాం. రూ.2లక్షల 40వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి.
►డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4లక్షల 10వేల కోట్లు అందించాం.
►కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపలేదు.
►చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు.
►చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్దాలే.
►14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు.
►కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా?.
►కన్నతల్లికి అన్నం పెట్టని వాడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా?.
►కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని చంద్రబాబు ఆఫర్లతో వస్తాడు.
►రాష్ట్రంలోని గ్రామగ్రామాన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. పల్నాడును జిల్లా చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే.
►సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటారా?.
►చంద్రబాబు మారానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
►ఎస్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా అన్నది చంద్రబాబే.
►బీసీల తోకలు కట్ చేస్తానని అహంకారంగా మాట్లాడిందీ చంద్రబాబే.
►చంద్రబాబు ఇప్పటి గురించి చెప్పడు కానీ.. రాబోయే 50 ఏళ్లలో ఏం చేస్తాడో చెబుతాడు.
►అప్పటి వరకు బ్రతికి ఉండేది ఎవరు?.
►చంద్రబాబు మానవత్వంలేని మనిషి.
►ప్రజల సంక్షేమం చంద్రబాబుకు పట్టదు.
►చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని.. మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నారు.
►చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం మాకు తెలియదు.
►నాకు ఎల్లో మీడియా సపోర్ట్ లేదు. కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను.
►చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు.
►రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఇస్తున్నాం.
►మీకు మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాది.
►అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం.
రాబోయే 30 ఏళ్లు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
►పల్నాడు ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దే
►వైఎస్సార్ వరికపూడిశెల ప్రాజెక్టుగా నామకరణం చేయాలి
►అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు
►ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు
పల్నాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చినే సీఎం జగన్
►రూ.320.26 కోట్లతో ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
►తొలి దశలో 24 వేల ఎకరాలకు సాగునీరు
►ఆరు దశాబ్దాల తర్వాత పర్యావరణ అనుమతులు
►సీఎం జగన్ కృషితో కేంద్ర అటవీ శాఖ అనుమతి
►పల్నాడు ప్రాంతానికి వరికపుడిశెలతో పాటు గోదావరి జలాలు
►పల్నాడు ప్రజల ఆకాంక్ష తీర్చేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ
►పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
మాచర్ల చేరుకున్న సీఎం వైఎస్ జగన్
►సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమాలపు సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు ఎమ్మెల్యేలు
మాచర్లలో పోటెత్తిన జనం
►రైతులతో కిటకిటలాడుతున్న మాచర్ల
►సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు రోడ్లకు ఇరువైపులా ఎదురుచూపు
►అరవై ఏళ్ల కల నెరవేరుతుండటంతో పల్నాడు వాసుల్లో ఆనందం
►సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు బారులు తీరిన రైతులు
►ఉదయం నుండే కిటకిటలాడుతున్న సభావేదిక గ్యాలరీలు
►మాచర్ల బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►కాసేపట్లో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించనున్న సీఎం
సాక్షి, అమరావతి: పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుడుతున్నారు.
పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. ‘వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించిన తక్షణమే సీఎం జగన్ పనులను ప్రారంభించనున్నారు.
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.
పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే
రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా అయ్యేలా 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీనికి రూపకల్పన చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment