సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ శివపై దాడి చేశారు. మా ప్రభుత్వ హయాంలో మీరు బయట తిరగడమేంటి అంటూ ఈర్ల శివపై టీడీపీ నేత ఇంతియాజ్ అనుచరులు చెలరేగిపోయారు. టీడీపీ శ్రేణుల దాడిలో శివ తీవ్రంగా గాయపడ్డారు.
ఎంపీటీసీపై టీడీపీ నేత దాడి
శ్రీకాకుళం జిల్లా: గ్రామ సభలో ఎంపీటీసీపై టీడీపీ నేత దాడి చేశారు. సంత బొమ్మాలి మండలం నౌపాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ సభలో మాట్లాడుతున్న ఎంపీటీసీ సుధాకర్‌పై టిడిపి నేత వాడపల్లి కృష్ణారావు దాడికి దిగారు.
బాధితుడు ఎంపీటీసీ సుధాకర్ మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీ గ్రామసభకు ఆహ్వానించడంతోనే తాను అక్కడికి వెళ్లానని.. సభలో సమస్యలపై మాట్లాడుతుండగా కృష్ణారావు దాడి చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీవి కనుక తనకు సభలోకి వచ్చే అర్హత లేదంటూ టీడీపీ నేత హెచ్చరించారని.. నా చొక్కా చింపేసి... ఇక్కడ కూర్చునేందుకు కూడా అర్హత లేదంటూ దుర్భాషలాడారని సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment