Palnadu District News
-
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
అమరావతి: గిట్టుబాటు ధర మాట దేవుడెరుగు అసలు కొనే నాథుడు లేక కంది రైతులు నిరాశలో కూరుకుపోయారు. అప్పులకు వడ్డీలు కట్టలేక, అయిన కాడికి పంటను తెగనమ్ముకుంటున్నారు. కూటమి సర్కారు ఘనంగా మద్దతు ధర రూ.7550 ప్రకటించి చేతులు దులుపుకుంది. ఈ మేరకు రైతుల నుంచి పంటను కొనుగోలు చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టలేదు. రైతు సేవా కేంద్రాల్లో మద్దతు ధరకు ఇదుగో కొంటున్నాం.. అదిగో కొంటున్నాం అంటూ అధికారులు కూడా కాలయాపన చేస్తున్నారే తప్పా ఇంతవరకు కొన్న దాఖలాలు లేవు. ప్రభుత్వ మాయమాటలతో విసుగెత్తిన రైతులు బహిరంగ మార్కెట్లో దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకుని నష్టాలు మూట కట్టుకుంటున్నారు. ప్రభుత్వం రంగంలోకి దిగి కొనుగోలు చేయకపోతే మొత్తం దళారుల పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం ఈ ఏడాది కంది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లావ్యాప్తంగా 67,500 ఎకరాలలో 50వేలమంది రైతులు సాగు చేశారు. ఎకరాకు మూడు నుంచి మూడున్నర క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద 2.36 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. అయితే, రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనే పరిస్థితి కనిపించడం లేదు. రైతు సేవా కేంద్రాలలో అక్కడక్కడా కొనుగోలు చేసి అధికారులు మమ అనిపించారు. బయటి మార్కెట్లో క్వింటాలు కంది రూ.6,200 నుంచి రూ.6,300లోపే పలుకుతోంది. ధర పెరుగుతుందనే ఆశతో కొందరు రైతులు ఇళ్లలోనే పంటను నిలువ చేశారు. జిల్లాలో ఇంకా రైతుల వద్ద లక్ష టన్నులకు పైగా కందులు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూస్‌రీల్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరాశలో కంది రైతులు ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.7550 బహిరంగ మార్కెట్లో రూ. 6,200 మించి కొనని దళారులు గతేడాది ఇదే సీజన్లో క్వింటా రూ.10వేలు కళ్ల ముందు అప్పులు చేసేది లేక దళారులకు అమ్ముకుంటున్న రైతులు వారం రోజుల్లో కొనుగోలు అన్ని రైతు సేవాకేంద్రాలలో కంది పంటను రికార్డు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. కొన్ని గ్రామాల్లో శాంపిల్స్ కూడా పంపగా మార్క్‌ఫెడ్ అధికారులు కూడా చూశారు. మరో వారం రోజుల్లో గ్రామాల్లో రైతుల దగ్గర కంది పంటను కొనుగోలు చేస్తాం –షేక్ అహ్మద్, మండల వ్యవసాయశాఖాధికారి అమరావతి దళారులకు లాభం.. రైతుకు నష్టం గతేడాది ఇదే సీజన్లో కంది క్వింటాలును రూ. 10వేలకు పైగా రైతులపై ఎటువంటి అంక్షలు లేకుండా కొనుగోలు చేశారు.ఈ ఏడాది ఇంతవరకు కొనుగోలు చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో మార్కెట్లో తక్కువ రేటుకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఆదనుగా దళారులు రైతుల్ని దోచుకుంటున్నారు. క్వింటాలు రూ. 6200 మధ్య కొనుగోలు చేసినా పలు ఆంక్షలు పెడుతున్నారు. జల్లెడ పట్టి, రవాణా ఖర్చుల పెట్టుకుంటేనే కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో రైతుకి అదనంగా మరో రూ. 300 నుంచి రూ. 400 ఖర్చు అవుతోంది. దీనివల్ల క్వింటాలు కందులు అమ్మితే రైతులకు రూ. 5,800 నుంచి రూ. 6,000 మాత్రమే చేతికొస్తున్నాయి. ప్రస్తుత ఖర్చులు పోనూ నష్టం తప్పా లాభం లేక అప్పులపాలవుతున్నాడు రైతులకు మిగిలేది నష్టమే ! వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ధరలు ‘ఆశా’జనకం ఈ ఏడాది పంట బాగానే పండింది. అయితే మార్కెట్లో ధర లేక నష్టం వచ్చే పరిస్థితి ఉంది. రైతు సేవా కేంద్రాలలో ఇప్పటి వరకు కందులు కొనుగోలు చేయడం లేదు. దళారులు క్వింటా రూ. 6300 అడుగుతున్నారు గానీ జల్లెడపట్టి వారి గోడౌన్‌కు తరలించే రవాణా ఖర్చులు కూడా భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన క్వింటా రూ. 6వేలకు మించి రేటు రావడం లేదు –ఈ. సుధాకరరెడ్డి, కంది రైతు, మునగోడు, అమరావతి మండలం గత ప్రభుత్వ హయాంలో కంది పంట ధర ఆశాజనకంగా ఉండడంతో జిల్లాలో ఎక్కువ మంది రైతులు సాగుపై మొగ్గు చూపారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రధాన వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా గతంలో కంటే జిల్లాలో అంచనాలకు మించి రైతులు కంది సాగు చేశారు.ఈ ఏడాది దిగుబడి ఫర్వాలేదనిపించినా మార్కెట్లో పడిపోయిన ధరలు మాత్రం రైతుల నడ్డి విరుస్తున్నాయి. జిల్లాలోని 28 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో కంది పంటను మద్దతు ధరకు కొంటామని ప్రభుత్వం చెబుతున్నా గ్రామస్థాయిలో నెల రోజుల నుంచి కాలయాపన చేయడం తప్పా కొనే నాథుడు కరువయ్యాడు. తేమ ఉందని, ఈ–పంటలో నమోదు చేసుకోలేదని తదితర కుంటి సాకులు చెబుతూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. -
వక్ఫ్ బిల్లుపై ముస్లింల మండిపాటు
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ శాంతియుతంగా నిర్వహించారు. ప్రకాష్‌నగర్‌లోని ఈద్గా మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమై ప్లైఓవర్ మీదుగా మల్లమ్మ సెంటర్, గాంధీ చౌక్, గడియారం స్తంభం సెంటర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. దారి పొడవునా రాజ్యాంగం, హక్కులు, మతసామరస్యాన్ని కాపాడాలని, అన్ని మతాలను సమానంగా చూడాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని, వక్ఫ్ బిల్లు వెనక్కు తీసుకోవాలని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ముస్లింలు నినాదాలు చేశారు. ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కె.మధులతకు ముస్లిం జేఏసీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ర్యాలీలో మౌలానా షాహిద్ రాజా, ముఫ్తీ రైస్ అహమ్మద్, రఫీ మౌలానా, మౌలానా బాసిత్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ మీరావలి, మాజీ కౌన్సిలర్లు షేక్ మస్తాన్‌వలి, అబ్దుల్ గఫార్, సమైక్యా ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ జిలాని మాలిక్, ఎంఐఎం మస్తాన్, కరిముల్లా, గోల్డ్ గఫార్, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, సీఐటీయూ జిల్లా నాయకురాలు డి.శివకుమారి, సిలార్ మసూద్, న్యాయవాదులు షరీఫ్, రజాక్‌తో పాటు నియోజకవర్గంలోని ఆయా మసీదుల పేష్ మామ్‌లు, మౌజన్లు, ముఫ్తీలు, మౌలాలు, మత పెద్దలు, ముస్లిం యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ సంఘీభావం తెలిపిన సీపీఎం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజాసంఘాల నాయకులు -
దివ్యాంగులకు ‘సదరం’ శిక్ష
నరసరావుపేట: నిండు వేసవి కాలం..కళ్లు కనపడవు..కాళ్లు నడవనీయవు..ఈ పరిస్థితుల్లో సదరం క్యాంపులకు రావడానికి దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. 100 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ ప్రభుత్వాసుపత్రిని చేరుకోలేని దయనీయమైన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సాధారణ పింఛన్‌దార్లకు నెలకు రూ.4వేలు ఇస్తుండగా, దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు పింఛన్లు తగ్గించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. పునఃపరిశీలన పేరుతో దివ్యాంగులను ఇబ్బంది పెడుతోంది. చాలా కాలం నుంచి పింఛన్లు పొందుతున్న వారికి మళ్లీ పరీక్షలు అంటూ సదరం క్యాంపులు నిర్వహిస్తోంది. వేసవిలో అవస్థలు జిల్లా మొత్తం ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందే దివ్యాంగులు 35,369మంది ఉన్నారు. వీరిలో చూపు సక్రమంగా లేనివారు 3,339 మంది, అంగవైకల్యంతో పొందేవారు మరో 2,135మంది ఉన్నారు. చెవిటివారు 4111మంది, మెంటల్ రిటార్టేషన్తో 3,707మంది, మెంటల్ ఇల్‌నెస్‌తో పింఛన్ పొందేవారు 611మంది ఉన్నారు. వీరిలో కళ్ల సమస్యలతో పింఛన్ పొందేవారికి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రిలో బుధ, గురు, శుక్రవారాల్లో పునఃపరిశీలన క్యాంపులు ఏర్పాటు చేశారు. వినుకొండకు అవతల 25కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు చెందిన దివ్యాంగులతో పాటు మాచర్లకు సుదూరంగా ఉన్న విజయపురిసౌత్ నుంచి కూడా హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. మండు వేసవిలో వీరంతా చెమటలు కక్కుతూ తోబుట్టువులు, బంధువుల సహాయంతో ఉదయాన్నే పది గంటలకల్లా క్యాంపుకు చేరుకుంటున్నారు. డాక్టర్లు అంతా సెలవులు తీసుకోకుండా క్యాంపునకు హాజరైతే రెండు గంటల్లో పని ముగించుకొని తిరుగు ప్రయాణమవుతారు. వీరిని పరీక్షించి సర్టిఫికెట్ ఓకే చేయాల్సిన డాక్టర్లు సెలవు తీసుకుంటే మరో రెండు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఖర్చులతో సతమతం శిబిరానికి వచ్చిపోయేందుకు కనీసం రూ.1000 వరకు ఖర్చు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వాహనాల ద్వారా వస్తే వేల రూపాయలు చెల్లించాల్సిందే. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపుకు 110మందికి గానూ 84మంది హాజరయ్యారు. జిల్లా మొత్తంపై ముగ్గురు కంటి డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఏలూరుకు బదిలీ కావడంతో వైద్యశాల సూపరిండెండ్ సురేష్‌కుమార్, మరో కంటి డాక్టర్ పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వారానికి మూడు రోజులు మాత్రమే క్యాంపు వంద కిలోమీటర్ల దూరం నుంచి అవస్థలు పడుతూ వస్తున్న దివ్యాంగులు జిల్లాలోని 3,339మంది పరీక్షలకు పేట రావాల్సిందే.. రాకపోకలకు వ్యయ ప్రయాసలు -
సంఘ సంస్కరణలకు ఆద్యుడు జ్యోతీరావు పూలే
నరసరావుపేట: సంఘ సంస్కరణలకు ఆద్యుడు జ్యోతీరావు పూలే అని జిల్లా కలెక్టర్ పి.అరుణబాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతీరావు పూలే జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రూ.51కోట్ల సబ్సిడీతో రుణాల మంజూరు లక్ష్యం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో 2107 మందికి సుమారు రూ.51కోట్ల సబ్సిడీతో రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో బీసీలకు 1136 మందికి రూ.22.99కోట్లు, 461మంది కాపులకు రూ.15.48కోట్లు, 63 మంది ఈబీసీలకు రూ.1.66కోట్లు, 204మంది కమ్మకులానికి రూ.5.35కోట్లు, 142మంది రెడ్డి కులానికి చెందిన వారికి రూ.3.71కోట్లు, ఆర్యవైశ్యులు 66 మందికి రూ.1.71కోట్లు, క్షత్రియ కులానికి సంబంధించి ముగ్గురికి రూ.7లక్షలు, బ్రాహ్మణ కులానికి సంబంధించి 32 మందికి రూ.93 లక్షలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ మహాత్ముల జీవిత చరిత్రలు అంతా చదివి స్ఫూర్తి పొందాలని సూచించారు. 400 మందికి 50శాతం సబ్సిడీతో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.13 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందచేశారు. జిల్లా రెవెన్యూ అధ్యికారి ఏకా మురళి, డివిజినల్ అధికారి కె.మధులత, వెనుకబడిన తరగతుల శాఖాధికారి శివనాగేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు బాదుగున్నల శ్రీను, మల్లికార్జునరావు, చంద్రశేఖర్, నరసింహారావు, షేక్ మాబు పాల్గొన్నారు. తొలుత పల్నాడు రోడ్డులోని మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కలసి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కార్యాలయంలో నివాళులు అర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే బీసీలకు రూ.13కోట్ల మెగా రుణ చెక్కు పంపిణీ -
అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే జగన్‌పై ఎంపీ ఆరోపణలు
పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల రూరల్: ఎన్నికల్లో ఓట్లు, సీట్లు కోసం ఇచ్చిన హామీలను అమలు చేయక కూటమి నేతలు కుట్రలు పన్నుతూ, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాజీ సీఎం వైఎస్. జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అలవిగాని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక, ప్రజల సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్‌పై ప్రశ్నిస్తున్న జగన్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ విద్యా సంస్థలకు చెందిన లావు కృష్ణదేవరాయలుకు రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేకపోయినా, యువకులను పోత్రహించాలన్న ఉద్దేశంతో తమ నాయకుడు జగన్ ఆ రోజు మొదటి సారిగా ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చి భారీ మెజార్టీతో గెలిపించినట్లు గుర్తు చేశారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కే కృష్ణదేవరాయల దుర్బుద్ధి ఇప్పుడు బయట పడిందిని తెలిపారు. కృష్ణ దేవరాయలు ఎంపీగా గెలిచారంటే అది జగన్, పల్నాడు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల గొప్పతనమేనని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్‌పై ఉన్న కేసుల గురించి అమిత్‌షా వద్ద కృష్ణదేవరాయలు ప్రస్తావించటమంటే అది ఆయన అజ్ఞానమని చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్లో కృష్ణదేవరాయలు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అప్పులపాలవుతుంటే వారిని ఆదుకోవడంలో ఎంపీగా విఫలమైన కృష్ణదేవరాయలు వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన అసమర్థత తెలుపుతుందని పిన్నెల్లి విమర్శించారు. -
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింల ర్యాలీ
క్రోసూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ క్రోసూరులో శుక్రవారం ముస్లింలు భారీగా ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. అమరావతి బస్టాండ్ సెంటర్ నుంచి నాలుగు రోడ్ల వరకు ముస్లిం మహిళలు, పురుషులు కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలైనా అర్పిస్తాం– వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తాం, మాకొద్దు, మాకొద్దు – వక్ఫ్ సవరణ బిల్లు మాకొద్దు, రద్దు చేయాలి వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉందని తెలిపారు. దేశంలో బీజేపీ పాలన చూస్తే మైనార్టీలపై అణచివేత ధోరణి కనిపిస్తోందని, హిందువుల పరిరక్షణ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో క్రైస్తవుల ఎండోమెంట్ ఆస్తులపై స్వాధీన చట్టాలు చేసే అవకాశం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమం హిందూ, ముస్లింల వివాదం కాదని మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసమని అంతా తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముఫ్తిఖలీల్, ముఫ్తి జమాలుద్దీన్, ఫ్యాన్సీ ఖాదర్, షేక్ అబ్దుల్ ఖాదర్, గఫూర్, కమాల్ బాషా, షేక్ సత్తార్, షేక్ మూసా పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు సమాధానాలు
నరసరావుపేట: ఇక నుంచి జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల అర్జీలకు వాట్సాప్‌లో సమాధానాలు పంపనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు వెల్లడించారు. వాట్సాప్కే పరిమితం కాకుండా అధికారులు తీసుకున్న చర్యల వివరాలను పోస్టు ద్వారా అర్జీదారుడి ఇంటికే పంపుతామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా సైతం ఒక కాపీ నేరుగా ఫిర్యాదుదారుడికి అందిస్తామని పేర్కొన్నారు. సాంకేతికతతో పాటూ సంప్రదాయ సమాచార మార్గాలను సమర్థంగా వినియోగించుకుని పీజేఆర్ఎస్ను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. పీజీఆర్ఎస్ను పటిష్టపరచాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్య మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో మండల స్పెషల్ ఆఫీసర్లు భాగస్వామ్యం కావాలని ఆదేశించామని తెలియజేశారు. మండల స్పెషల్ ఆఫీసర్లు నేరుగా అర్జీదారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదులపై అధికారుల స్పందన, పరిష్కారాల్లో నాణ్యత, ప్రజలతో అధికారులు వ్యవహరించే తీరును సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రారంభించి సమీక్షలు నిర్వహించారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టిన కలెక్టర్ అరుణ్ బాబు -
కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయండి
మంగళగిరి: నేటి విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణించి కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయాలని బెర్హంపూర్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(బసర్) యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ కుమార్ గంగూలీ కోరారు. మండలంలోని నీరుకొండ గ్రామంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం 9వ రీసెర్చ్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గంగూలీ మాట్లాడుతూ బోధనతో పాటు పరిశోధనా రంగంలో రాణించేలా ప్రొఫెసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌తోపాటు పరిశ్రమల సందర్శన ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రీసెర్చ్ డీన్ డాక్టర్ రంజిత్ థాఫా మాట్లాడుతూ రీసెర్చ్ డేను పురస్కరించుకుని కిండబేజాద్ మాదిరిగా నలుగురు ప్రొఫెసర్లుకు ఉత్తమ పరిశోధనా పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ ప్రయోగాత్మక పరిశోధన పురస్కారాన్ని డాక్టర్ మాసం పార్థసారథి,ఉత్తమ థియోలాటికల్ రీసెర్చ్ అవార్డును డాక్టర్ ఎండూరి మురళీకృష్ణ, ఉత్తమ పారిశ్రామిక రంగ పరిశోధనా పురస్కారాన్ని డాక్టర్ దినేష్‌రెడ్డి, ఉత్తమ యువ పరిశోధన పురస్కారం డాక్టర్ హరీష్ పుప్పాలలకు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారికి రూ.50 వేలు నగదు, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్‌కుమార్, రీసెర్చ్ డే కన్యీనర్ డాక్టర్ సునీల్ చిన్నదురై, డాక్టర్ ఆయాషా తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలలో పరిశోధనలు పెరగాలి బెర్హంపూర్ బసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ కుమార్ గంగూలి -
ఆరోగ్య సంరక్షణలో ఫార్మా కీలకం
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గుంటూరు మెడికల్: ఆరోగ్య సంరక్షణలో ఫార్మా రంగం ఎంతో కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గుంటూరు కాపిటల్ హోటల్లో బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఫార్మాటెక్ కన్వర్ట్ –2025 కార్యక్రమానికి వీరపాండియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగం విశిష్టతను వివరించారు. గౌరవ అతిథి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ట్రస్టు సీఈఓ పి.రవి సుభాష్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మా పాత్ర ఎంతో ఉందన్నారు. ఇంకా పలువురు వక్తలు ప్రసంగించారు. విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ బాబు, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ, కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, బెంగుళూరు ప్రొఫెసర్ ఉషా మంజునాథ్, ఫార్మా కంపెనీ ప్రతినిధులు ఇంద్రనీల్ సింహ, షేక్ గౌస్ షడక్, వర్మ, వీరేంద్రకుమార్, సిప్లా కంపెనీ బిజినెస్ హెడ్ ఎస్.బెనర్జి, బెంగుళూరు గవర్నింగ్ బోర్డు సభ్యుడు డాక్టర్ కేదార్ పాల్గొన్నారు. జెడ్పీ పీఎఫ్ ఖాతాలను అప్డేట్ చేయాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల వేతనాల్లో నుంచి మినహాయిస్తున్న నిధులు సకాలంలో జెడ్పీ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసుకు ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలోని సీఈవో చాంబర్లో జ్యోతిబసును కలిసి ఎస్టీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సీఈవోను కలసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్లు కమతం శ్రీనివాసరావు, ఎస్కే బాజీ, తుళ్లూరు మండల అధ్యక్షుడు దిబ్బయ్య, సీనియర్ నాయకులు సీహెచ్ శ్రీనివాస్ ఉన్నారు. -
బొబ్బర్లంక ఎస్టీ కాలనీ కుటుంబాలను ఆదుకోవాలి
రేపల్లె రూరల్: వెట్టిచాకిరికి గురైన బొబ్బర్లంక ఎస్టీ కాలనీ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, కూలీలను క్రయవిక్రయాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం, కేవీపీఎస్, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు, ఎస్టీ కాలనీవాసులు శుక్రవారం ఆర్డీఓ నేలపు రామలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సంఘాల నాయకులు మాట్లాడుతూ అమ్మకాలు, కొనుగోలు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మణిలాల్, అగస్టీన్, నాంచారమ్మ, ఆశీర్వాదం, డానియేలు తదితరులు పాల్గొన్నారు. -
ధూళ్లిపాళ్ల వాగులో గుర్తు తెలియని మృతదేహం
సత్తెనపల్లి: గుర్తు తెలియని యువకుడి మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల సమీపంలోని వాగులో శుక్రవారం వెలుగు చూసింది. సుమారు 40–45 సంవత్సరాలు వయసు కలిగిన యువకుడు శరీరంపై వంకాయ రంగు తెలుపు నలుపు చారల టీ షర్టు, దానిపై నీలం రంగు నిండు చేతులు చొక్కా ధరించి, నిక్కర్‌తో ఉన్నాడు. మృతుడి కుడి చేతిపై శిలువ గుర్తు పచ్చబొట్టు ఉంది. కుడి చేతికి నల్లని దారం, తెల్ల పూసలతో కాశీ దారం వలే కట్టి ఉంది. మృతుడు ఎత్తు 5.6తో చామనఛాయ రంగు కలిగి ఉన్నాడు. స్థానికుల నుంచి సమాచారం రావడంతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వాగులో నుంచి బయటికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. గుర్తు పట్టని విధంగా ఎవరైనా హత్య చేసి పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ 9440796231, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ 801999643 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు -
ఇంటర్ ఫెయిల్ అవుతామనే భయంతో ఇల్లు వదిలి వెళ్లిన విద్యార్థినులు
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని పెదవడ్లపూడి, తాడేపల్లిలో నివాసముండే ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఇంట ర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇల్లు వదిలి పారిపోయారు. తాడేపల్లిలో ఉన్న విద్యార్థిని తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి శుక్రవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తమ పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి సిఐ కల్యాణ్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి 24 గంటల్లో వారి ఆచూకీ కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. 24 గంటల్లో తల్లిదండ్రులకు అప్పగింత -
బల్లికురవ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
అద్దంకి రూరల్: పక్షపాత ధోరణితో టీడీపీకి కొమ్ముకాస్తున్న బల్లికురవ ఎస్ఐ నాగరాజును సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చినహనిమిరెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. బల్లికురవ మండలంలోని ప్రజలంతా ఐకమత్యంగా, కులమతాలకు, పార్టీలకతీతంగా నిర్వహించుకునే ఈర్ల గంగమ్మ తిరునాళ్లలో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ వారికి ప్రభలు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వకపోవటం ఎస్ఐ పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. తిరునాళ్లకు కాని, దేవాలయం వైపు కాని వైఎస్సార్ సీపీ నాయకులు రాకుండా చేస్తానని చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా టీడీపీ వారికి తిరునాళ్లలో ప్రభలు కట్టేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కూటమి నాయకులు ప్రజల్లోని వెళ్లే ధైర్యం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడించటం చంద్రబాబునాయుడు నైతికంగా దిగజారడన్నారు. ప్రశాంతంగా ఉండే బల్లికురవ మండలంలో గత వారం ప్రభలు కట్టేందుకు అప్పటి ఎస్ఐ జీవీ చౌదరి అనుమతులు ఇస్తే కొత్తగా వచ్చిన ఎస్ఐ అనుమతులు వైఎస్సార్సీపీ ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే అద్దంకి నియోజకవర్గ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న నాగరాజు లాంటి ఎస్సైని ఉన్నతాధికారులు కల్పించుకుని సస్పెండ్ చేయాలన్నారు. వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చినహనిమిరెడ్డి -
పూలే గొప్ప సంఘ సంస్కర్త
నివాళులు అర్పించిన అదనపు ఎస్పీ సంతోష్ నరసరావుపేట: మహాత్మా జ్యోతీరావు పూలే 18వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్తని జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఏఆర్ ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఆర్ఐలు పాల్గొన్నారు. వ్యక్తిపై కత్తితో దాడి క్రోసూరు: మండలంలోని హసనాబాద్‌లో ఇంటి ఎదురుగా ఉంటున్న వ్యక్తిపై దాడి చేసి, దుర్భాషలాడాడన్న ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసినట్లు క్రోసూరు సీఐ పి.సురేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యర్రంశెట్టి గోపాలకృష్ణ అలియాస్ కిట్టు మద్యం తాగి ఇంటి ఎదురుగా ఉంటున్న మాతంగి వెంకటేశ్వరరావు కసువు ఊడుస్తున్న క్రమంలో గొడవ పడి, దుర్భాషలాడాడు. కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో వెంకటేశ్వరరావు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అట్రాసిటీస్ కేసు నమోదు చేశామని, సత్తెనపల్లి డీఎస్పీ దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. పసుపు ధరలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 589 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మినట్టు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 423 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10,225, గరిష్ట ధర రూ.12,225, మోడల్ ధర రూ.11,550 పలికింది. కాయలు 166,బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10.400, గరిష్ట ధర రూ.11,800, మోడల్ ధర రూ.11,550 పలికింది. మొత్తం 441.750 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. యార్డులో 1,27,104 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,15,943 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,104 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,600 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 54,603 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
పర్చూరు(చినగంజాం): ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలురాదా ఎడ్ల బలప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇసుక బస్తాలతో ఉన్న చక్రాలు తిరగని ఎడ్ల బండిని నిర్ణీత సమయంలో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. విజయం సాధించిన ఎడ్ల జతలకు వరుసగా రూ 50 వేలు, రూ 40 వేలు, రూ 30 వేలు, రూ 20 వేలు బహుమతులుంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి రోజు సీనియర్స్ విభాగంలో తొమ్మిది ఎడ్ల జతలు పోటీ పడుతున్నాయని తెలిపారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
‘హ్యాకింగ్’ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: జిల్లా ప్రజలకు సైబర్ మోసాలపై విసృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం హ్యాకింగ్ సినిమా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. హ్యాకర్ల సైబర్ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకులు నరేష్ దోనె, మణివరన్ తెలిపారు. ఇటీవల వచ్చిన ఏఐ ద్వారా ఫొటో ద్వారా కూడా సరికొత్త సైబర్ నేరాలను హ్యాకర్లు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు వీటి బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలను చిత్రం ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు. అంజలి సమర్పణలో అనుపమ ఆర్ట్స్ పతాకంపై రావూరి సురేష్‌బాబు చిత్రం నిర్మిస్తున్నారని చెప్పారు. కొన్ని సన్నివేశాలను కొండవీడులో చిత్రీకరించామని, నటిగా ముంబైకు చెందిన కావ్య దేశాయ్ నటిస్తున్నట్లు వారు తెలిపారు. -
మెరుగ్గా ‘చెత్త నుంచి సంపద సృష్టి’
సత్తెనపల్లి: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.అర్జునరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలోని ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అర్జునరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, క్లాప్ మిత్రాలు పారిశుద్ధ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కూడా ఇంటి వద్దనే తడి, పొడి చెత్తలను వేరు చేసి అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత కలిగి ఉండాలని కోరారు. అనంతరం నందిగామ క్లాప్ మిత్రాలతో సమావేశమై, పలు సూచనలు చేశారు. గ్రామంలోని ఏడు అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాలకు చెందిన స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్లతో ఈడీ భేటీ అయ్యారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం, నిర్వహణ అంశాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో బండి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల విస్తరణాధికారి ఆర్.శ్రీనివాసరెడ్డి, నందిగామ సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఐటీసీ రీసోర్స్‌పర్సన్ చెంబేటి బొల్లయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భావన, ఏపీఎం సమాధానం, పంచాయతీ కార్యదర్శులు కుంభా వెంకటేశ్వర్లు, కృష్ణ ప్రసాద్, సచివాలయం సిబ్బంది, క్లాప్ మిత్రాలు తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ పాఠశాలలో ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష
జెట్టిపాలెం (రెంటచింతల): జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్)లో 2025–26 విద్యాసంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న వారికి ఈ నెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కె. పాపయ్య తెలిపారు. గురువారం ఆయన పాఠశాలలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారన్నారు. ఏప్రిల్ 20న జరగవలసిన ప్రవేశ పరీక్ష ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానిక పాఠశాలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు సెల్ నంబర్ 91829 58496 ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. జాతీయ అవార్డుకు విద్యాశాఖాధికారి ఎంపిక పెదకూరపాడు: పెదకూరపాడు అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న ఏకుల ప్రసాదరావు ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు’కు ఎంపికై నట్లు సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య గురువారం తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రసాదరావు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు. ఈ నెల 13వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావును పలువురు ఉపాధ్యాయులు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు అభినందించారు. బావిలో పడి మహిళ మృతి నకరికల్లు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడడంతో వివాహిత మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని చల్లగుండ్ల గ్రామం సమీపంలో చీరాల ఓడరేవు రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల గ్రామానికి చెందిన షేక్ నాగుల్‌మీరా, షేక్ రమీజా (25) దంపతులు. వీరు తమ ఏడు నెలల పాపను తీసుకొని రమీజా పుట్టిల్లు అయిన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శుభకార్యానికి వచ్చారు. బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ముప్పాళ్లకు తిరుగు పయనమయ్యారు. చల్లగుండ్ల సమీపంలో రోడ్డుపై అడ్డంగా పాము రావడంతో బెదిరిపోయిన రమీజా తన భర్త నాగుల్‌మీరా చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ముగ్గురూ రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. వారి కేకలకు రోడ్డుపై వెళ్లేవారు గమనించి ముగ్గురిని వెలికితీశారు. అప్పటికే రమీజా ఊపిరాడక మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
కంప్యూటరీకరణ విప్లవాత్మక మార్పు
నరసరావుపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కంప్యూటరైజేషన్ అనేది ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాదని, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన పురోగతి అని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా స్థానిక ప్రకాష్‌నగర్‌లోని సహకార బ్యాంకు ఆవరణలో గురువారం పీఏసీఎస్‌లో కంప్యూటరీకరణ అనే అంశంపై పీఏసీఎస్ సీఇవోలు, బాంక్ మేనేజర్లు, సూపర్వైజర్లు, ఆడిటర్లకు నిర్వహించిన జిల్లా స్థాయి సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో గ్రామీణ రైతుల ఆర్థిక జీవన విధానానికి బలమైన మద్దతుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిలుస్తున్నాయని చెప్పారు. ఇవి రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, ఇతర సదుపాయాలు అందించే విధంగా పనిచేస్తున్నాయని అన్నారు. భారత ప్రభుత్వం సహకార రంగ అభివృద్దికి రూ.2,516కోట్ల నిధులు కేటాయించి 63,000 పీఏసీలను కంప్యూటరైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం, నెట్వర్కింగ్ ద్వారా రాష్ట్ర, జాతీయ బ్యాంకులతో అనుసంధానం కల్పించడం జరుగుతాయని అన్నారు. జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ మాట్లాడుతూ కంప్యూటరీకరణ వారికి మేలు చేస్తుందన్నారు. గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు జీఎం అజయ్‌కిషోర్, జిల్లా ఆడిట్ అధికారి డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలు
తెనాలి రూరల్: కుక్కలను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా 10 మంది గాయాలపాలయ్యారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో గురువారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన ధర్మ, యాకోబు, బెంజమిన్, మరియమ్మ, శ్యామల, వెంకటరత్నం, అమ్మారావు, సుశీల, సైమాన్ రాయి పని కోసం తెనాలి మండలం కొలకలూరుకు కొద్ది రోజులుగా వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మూల్పూరుకే చెందిన ఆటో డ్రైవర్ మూల్పూరి నరేష్ ఆటోలో వీరు వస్తున్నారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో రహదారిపై మూడు కుక్కలు అడ్డు వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా కొట్టడంతో అందులోని 10 మంది గాయపడ్డారు. 108లో వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో యాకోబు పరిస్థితి విషమంగా ఉండంతో గుంటూరు పంపారు. ఘటనపై త్రీ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. -
భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ పాత్ర కీలకం
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవంలో భాగంగా ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్‌చార్జ్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ భూమిపై మమకారం ఉంటుందని తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 10న జాతీయ సర్వే దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, 53 మంది సర్వే శాఖ ఉద్యోగులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన సర్వేయర్లకు ఇన్చార్జి కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మల్లికార్జునరావు, కార్యదర్శి ఆర్.మల్లికార్జునరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, పి.వి. భావన్నారాయణ, సాంబశివరావు పాల్గొన్నారు. -
వసూళ్ల పేరిట వేధింపులకు గురి చేస్తే చర్యలు
బాపట్లటౌన్: ఫైనాన్స్ సొమ్ము వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని పట్టణ సీఐ రాంబాబు హెచ్చరించారు. బాపట్ల పట్టణం, రూరల్ పరిధిలోని మైక్రో ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ వ్యాపారాల నిర్వాహుకులు, రికవరీ ఏజెంట్లతో పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. సీఐ రాంబాబు మాట్లాడుతూ రుణగ్రహీతలు తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించకపోతే నిబంధనల మేరకే వ్యవహరించాలన్నారు. రుణగ్రహీతలను ఎలాంటి వేధింపులకు గురి చేయరాదన్నారు. కంపెనీ ద్వారా లీగల్‌గా నోటీసులు అందజేసి కోర్టు జారీచేసే ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించి రుణగ్రహీతలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, సర్కిల్ సీఐ హరికృష్ణ పాల్గొన్నారు. బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ప్రైవేటు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లతో సమావేశం -
సమాజ హితమే సాహిత్యం పరమావధి
తాడేపల్లి రూరల్: మాతృ భాషలు మృత భాషలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ఏ ప్రాంత సంస్కృతి పరిరక్షించబడాలన్నా ఆ ప్రాంత భాష ముందుగా రక్షింపబడాలని తెలిపారు. వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో బీఏ (ఐఎఎస్) విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు, వాదాలు – సమాలోచన’’ అనే అంశంపై ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ హితమే సాహిత్యం పరమావధి అని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారుల భద్రతా విభాగం డీఐజీ సీహెచ్. విజయారావు మాట్లాడుతూ మాతృభాషలో సివిల్ సర్వీసెస్ రాసి లక్ష్యాన్ని సాధించడం సులువని తెలిపారు. అనంతరం యూనివర్సిటీ ప్రచురించిన 11 సంవత్సరాల యూపీఎస్సీ పాత ప్రశ్నపత్రాలు – సమాధానాలు, విశ్లేషణతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించి, ఉచితంగా విద్యార్థులకు అందజేశారు. వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ డి. రాంబాబు మాట్లాడుతూ తెలుగు ప్రధాన అంశంగా తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత మార్గ నిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర లయోలా విశ్రాంత వైస్ ప్రిన్సిపాల్ గుమ్మా సాంబశివరావు, రచయిత్రి నైనాల వాణిశ్రీ , బీఏ విభాగాధిపతి బి. శివనాగయ్య, సహాయ ఆచార్యులు అద్దంకి ప్రజాపతి, వర్సిటీ వీసీ జి. పార్థసారథివర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, కె. రాజశేఖరరావు, ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ కె. సుబ్బారావు, బీఏ ఉప విభాగాధిపతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధి చేకూర్చిన వారిపై నిందలు సరికాదు
పిడుగురాళ్ల: రాజకీయ లబ్ధి చేకూర్చిన వారిపై నిందలు మోపటం సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పిటల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర మంత్రి అమిత్ షాకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు లేఖ రాస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయనటం సరికాదన్నారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచి ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వారిని, వారి ద్వారా లబ్ధి పొంది ఇలా చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో నడిరోడ్డుపై హత్యా రాజకీయాలు చేస్తున్న తీరుపై, బార్ షాపు యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపై నిలదీశారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ -
బాల్య వివాహం నిలిపివేత
నాదెండ్ల: బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చిన సంఘటన ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసింది. చిలకలూరిపేట మండలం చినరాజాపేట గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరేంద్రతో ఈ నెల 13న బాలిక వివాహాన్ని పెద్దలు నిర్ణయించారు. బాలిక తండ్రి చనిపోగా, తల్లి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. బాలిక వివాహ సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో స్వరూపారాణి, డీసీటీవో ప్రశాంత్, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ, సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గర్భిణులు, బాలింతలు సేవలను ఉపయోగించుకోవాలి నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం ప్రవేశపెట్టిన కిల్కారి సేవలను ఉపయోగించుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కిల్కారి కాల్ నెంబర్ 012444 51660 అని, కాల్ వచ్చినపుడు ఎత్తి పూర్తిగా సమాచారాన్ని వినగలుగుతారన్నారు. తిరిగి ఆ సమాచారాన్ని వినాలి అంటే 14423 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు. -
లింగారావుపాలెంలో ‘నాటికల’ పండుగ
యడ్లపాడు: ఆ పల్లె కళలకు నిలయం. కళలతోనే సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమని అక్కడి ప్రజలు నమ్మారు. అందుకే కళలకు జీవం పోశారు. రెండున్నర దశాబ్దాల కిందటే కొండవీడు కళా పరిషత్‌ను నెలకొల్పారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెం వాసుల ప్రత్యేకత ఇది. పరిషత్‌కు గౌరవ అధ్యక్షుడిగా సినీనటులు పోసాని కృష్ణమురళి, అధ్యక్షుడిగా కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులుగా తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, కార్యదర్శిగా మండెపూడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కోశాధికారులుగా కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు ఉల్లయ్య, జరుగుల రామారావు ఉన్నారు. 1997లో స్థాపించిన ఈ పరిషత్ ఏటా మూడు రోజులపాటు సామూహిక కళా ఉత్సవాలను నిర్వహిస్తోంది. కరోనా కాలంలో మినహా ఇవి కొనసాగాయి. ప్రస్తుతం 26వ జాతీయ స్థాయి నాటికల పోటీలు ఏప్రిల్ 12,13,14వ తేదీల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది 9 నాటికలు ప్రదర్శితం కానున్నాయి. ఎందరో రాజులు, రారాజులు పరిపాలించిన తెలుగు వారి వైభవానికి నిలువెత్తు సాక్ష్యమైన అద్దంకి రెడ్డి రాజుల రెండో రాజధాని ‘కొండవీటి గిరిదుర్గం’ ఈ గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉంది. తమ కలాన్ని హలంగా చేసి సాహితీ క్షేత్ర స్థానాన్ని సస్యశ్యామలం చేసిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు, ప్రజాకవి వేమన, శ్రీకృష్ణదేవరాయలు ఈనేలపై నడయాడినవారే. కాకతీయులు, రెడ్డిరాజుల పాలనలో సంగీత, సాహిత్య, శిల్పకళల్లో తెలుగు తేజాన్ని అంబరానికి చేర్చిన అవని కొండవీడు. కాబట్టే ఈ పరిషత్‌కు ఆ పేరును పెట్టారు. నాటికల పోటీలతోపాటు కొండవీడు కీర్తిని వ్యాపింపజేస్తున్నారు. రేపటి నుంచి జాతీయ స్థాయి పోటీలు అభిమానులకు 3 రోజులపాటు కళావిందు -
స్టాంప్ వెండార్లపై కత్తి
పల్నాడుగురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025అడ్మిషన్ల పెంపునకు చర్యలు తీసుకోండి సదరం క్యాంప్ పునఃప్రారంభం తెనాలిఅర్బన్: దివ్యాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 515.60 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి వినుకొండకు చెందిన కె.వెంకటమాధవ్, లక్ష్మీప్రియ దంపతులు రూ.1,00,116లు విరాళంగా అందజేశారు.పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : ఆలయాల్లో కూటమి నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. పూజా కార్యక్రమాల పేరుతో భక్తులను దోచుకోవడమేకాక ఖర్చులకు అధిక బిల్లులు పెట్టి ఇష్టారాజ్యంగా దిగమింగుతున్నారు. తాజాగా ఆలయ కమిటీల నామినేటెడ్ పదవుల పేరుతో ఆశావహుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. గుంటూరు నగరంలో కొన్ని ఆలయాలకు కమిటీలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి కూటమి నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు. గుంటూరు నగ రంలోని పట్నంబజారు కన్యకాపరమేశ్వరి ఆలయంలో కమిటీకి చైర్మన్ సభ్యులు ఉన్నా.. వారికి విలువ ఇవ్వడం లేదు. ఓ టీడీపీ కార్పొరేటరే అంతా తానై పెత్తనం చేస్తున్నారు. ఉత్సవాల సమయంలోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డారు. రూ.90లక్షలకు మించి ఖర్చు చేయకుండా రూ.కోటి 25 లక్షల వరకు ఖర్చయిందని చెప్పి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లెక్కలు చూపమంటే చల్లగా జారుకుంటున్నారని సమాచారం. దీనిపై ఆర్యవైశ్య సంఘాలు భగ్గుమంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ● పాతగుంటూరలోని గంగపార్వతీ సమే అగస్తేశ్వరస్వామి ఆలయంలో జనసేనలో చేరిన ఓ కార్పొరేటర్ కుమారుడు రాజ్యమేలుతున్నాడని తెలుస్తోంది. కమిటీలో తాను చెప్పిన వారికే ప్రాధాన్యం ఉంటుందని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ● కొత్తపేటలోని గంగాపార్వతి సమేత మల్లికార్జున స్వామి గుడిలో కూడా ఒక జనసేన కార్పొరేటర్ ఓవరాక్షన్ చేస్తున్నారు. తానే తర్వాతి ఛైర్మన్నని ప్రకటించుకుంటూ అధికారులు, అర్చకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం. ● చౌత్రా సెంటర్లోని కోదండ రామాలయంలో టీడీపీ నేత వసూళ్ళ పర్వానికే తెరదీశాడు. పూజా కార్యక్రమాల పేరుతో భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ● రైలుపేటలోని ఆంజనేయస్వామి దేవస్థానంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ● లాలాపేట వేంకటేశ్వరస్వామి గుడికి ప్రస్తుతం ఉన్న కమిటీని ఎలాగైనా రద్దు చేయాలే ఉద్దేశంతో సమావేశాల పేరుతో కూటమి నేతలు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కుట్రలు పన్నుతున్నారు. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోవతే కమిటీ రద్దవుతుందని చెబుతున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లోనూ కమిటీ సభ్యులకు ప్రాధాన్యం లేకుండా చేశారు. టీడీపీ నేతలే కీలకపాత్ర పోషిస్తున్నారు. కోల్డ్‌వార్ నామినేటడ్ పదవులపై కూటమి నేతల్లోనే కోల్డ్‌వార్ నడుస్తోంది. పదవుల కోసం ఎవరికి వారు పైరవీలు నడుపుతున్నారు. అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి తమకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. అయితే టీడీపీ ప్రజాప్రతినిధులు వారి పార్టీ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పదవుల అమ్మకం 7న్యూస్రీల్ఈఓల నుంచి వివరాలు తెలుసుకుంటాం ఆలయాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మా దృష్టికి రాలేదు. కమిటీల ఏర్పాటుకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రాలేదు. లాలాపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో, చౌత్రా రామాలయం ఈవోలు సెలవులో ఉన్నారు. మిగతా ఆలయాల గురించి పూర్తి వివరాలు ఈవోలను అడిగి తెలుసుకుంటాం. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, లాలాపేట గ్రూప్ టెంపుల్స్ ఆలయాల కమిటీలు ఉన్నాయి. మిగతా గుడుల వివరాలు అడిగి తెలుసుకుంటాం. – కేబీ శ్రీనివాస్, డెప్యూటీ కమిషనర్, దేవదాయశాఖ ఆలయాల్లో కూటమి నేతల కాసుల కక్కుర్తి కమిటీల పేరుతో ఆశావహుల నుంచి భారీగా వసూళ్లు దోపిడీకి దేవదాయ శాఖ అధికారుల వత్తాసు కూటమి అధినాయకత్వం ఆశీస్సులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆలయాల్లోని కమిటీ పదవుల అమ్మకం వ్యాపారం జరుగుతోందని తెలుస్తోంది. 6ఏ, 6బీ, 6సీ ప్రామాణికంగా రేట్లు ఫిక్స్ చేస్తున్నారని చెబుతున్నారు. రూ 5 లక్షల మొదలుకొని, రూ 15 లక్షల వరకు కమిటీల ఏర్పాటు కోసం.. ఒకటికి నలుగురి దగ్గర వసూళ్ళకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. -
మే 10న జాతీయ లోక్ అదాలత్
సత్తెనపల్లి: ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల మేరకు మే 10న మండల న్యాయ సేవా కమిటీ సత్తెనపల్లి ఆధ్వర్యంలో సత్తెనపల్లిలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందని సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లో సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి, చెక్కుబౌన్స్, రెవెన్యూ, బ్యాంకు, ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమవుతాయన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్తెనపల్లి కోర్టులలో పెండింగ్ ఉన్న వారి కేసులను రాజీ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ‘పాక్ జలసంధి’ ఈతయాత్ర పరిశీలకుడిగా సురేష్ నరసరావుపేట ఈస్ట్: భారత్ నుంచి శ్రీలంక వరకు ఈనెల 10వ తేదీన ప్రారంభం కానున్న సాహసోపేతమైన ఈత యాత్రకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన స్విమ్మింగ్ కోచ్ జి.సురేష్‌ను పరిశీలకుడిగా నియమిస్తూ భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపే పాక్ జలసంధి గుండా సాగే 29 కిలోమీటర్ల ఈత యాత్రలో 10 మంది స్విమ్మర్లు పాల్గొంటారని సురేష్ తెలిపారు. ఈమేరకు రెండు దేశాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్టు వివరించారు. రెండు దేశాలను కలుపుతున్న పాక్ జలసంధి దాటడం కఠినతరమైన యాత్రగా పేర్కొన్నారు. ధనుష్కోటి వద్ద హిందూ మహాసముద్రం, అరేబియా, బంగాళాఖాతం కలుస్తుండటంతో బలమైన అలలు, అంతర్ ప్రవాహాలు అధికంగా ఉంటాయన్నారు. కాగా, సురేష్‌ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.మోహన వెంకట్రావు, పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం, పలువురు స్విమ్మర్లు అభినందించారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు మాచర్ల: పల్నాడు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మాచర్ల శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి 7గంటలకు అంకురార్పణ పూజలతో ప్రారంభం కానున్నాయి. 11వ తేదీ శుక్రవారం ఉదయం 10గంటలకు పౌర్ణమి, 12న కల్యాణ మహోత్సవం, 13వ తేదీ రాత్రి 10గంటలకు హనుమత్వాహనం, 14న శేషవాహనం, 15న గరుడవాహనం, 16వ తేదీ రాత్రి 12గంటలకు రవిపొన్నవాహనం, 17న రథోత్సవం, 18న అశ్వవాహనం, 19న సుఖ వాహనం, 20న పుష్పయాగం, సోమవారం రాత్రి ద్వాదశ ప్రదక్షిణలు, 22న ఏక స్థితి కలశ స్థాపన, 23న పవళింపు సేవతో పదహారు రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ ఎం పూర్ణచంద్రరావు, అర్చకులు కొండవీటి రాజగోపాలచార్యులు బుధవారం తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గురజాల డీఎస్పీ జగదీష్, పట్టణ సీఐ ప్రభాకర్‌రావుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభయాంజనేయ స్వామి ఆలయానికి విరాళం పర్చూరు(చినగంజాం): పర్చూరులో వేంచేసియున్న అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో గది నిర్మాణం కోసం దాతలు రూ. 5,25,116 విరాళంగా అందజేశారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రావి రంగనాథ బాబు, నాగవర్ధని దంపతులు తమ కుమారుడు రావి శ్రీధర్ జ్ఞాపకార్థం బుధవారం కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోట హరిబాబు, కటారి సురేంద్రబాబు, రంగిశెట్టి ఆంజనేయులు, తులసి శివనాగేశ్వరరావు, కృష్ణంశెట్టి శ్రీనివాసరావు, నర్రా రామయ్య, రంగిశెట్టి రామాంజనేయులు, మంగళగిరి కోటేశ్వరరావు, ఒగ్గిశెట్టి నరసింహారావు, దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.150కోట్లు
నరసరావుపేట రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు రుణాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరక్టర్ పి.ఝాన్సీరాణి తెలిపారు. కోటప్పకొండలోని డీఆర్డీఏ కార్యాలయంలో బుధవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఝాన్సీరాణి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సీ్త్రనిధి రుణాల లక్ష్యం రూ.120కోట్లు కాగా రూ.47కోట్లు రుణాలు మాత్రమే అందించినట్టు తెలిపారు. సీ్త్రనిధి రుణాలు అందించడంలో బెల్లంకొండ, శావల్యాపురం, చిలకలూరిపేట, నకరికల్లు, రొంపిచర్ల, నాదెండ్ల, ముప్పాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి, నూజెండ్ల మండలాలు మందు వరుసలో ఉన్నాయన్నారు. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు అవసరమైన జీవనోపాధి రుణాలను స్వల్పకాలిక, మైక్రో, ట్రైనీగా వర్గీకరణ చేసి అందిస్తున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 48 గంటల్లో జీవనోపాధి రుణాలను సాంకేతిక పరిజ్ఞానంతో అందజేస్తున్నట్టు వివరించారు. నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలు.. సీ్త్రనిధి జీవనోపాధి రుణాలను గరిష్టంగా రూ.లక్ష వరకు 36నెలల వాయిదాలతో 11శాతం వడ్డీ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘానికి రూ.5లక్షల వరకు గ్రూపులోని సభ్యులు మైక్రో రుణాలు పొందవచ్చని లేదా ఐదు మంది సభ్యుల వరకు రూ.5లక్షల వరకు ట్రైనీ రుణాలు పొందవచ్చని తెలిపారు. ఏ గ్రేడ్ ఉన్న గ్రూపునకు రూ.75లక్షలు, బి గ్రేడ్‌కు రూ.65లక్షలు, సి గ్రేడ్‌కు రూ.55లక్షలు, డి గ్రేడ్ గ్రూపునకు రూ.45లక్షలు రుణాలు కేటాయించినట్టు తెలిపారు. సీ్త్రనిధి రుణాల రికవరిపై సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి -
రూ.5కోట్ల వసూలే లక్ష్యం!
నరసరావుపేట: పురపాలకసంఘ పరిధిలో నివాసం ఉంటున్న గృహ, వాణిజ్య సముదాయాల యజమానుల నుంచి రూ.5కోట్ల అడ్వాన్స్డ్ ఆస్తిపన్ను వసూలును పురపాలక అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది రూ.3.5కోట్లు మాత్రమే వసూలయింది. ఈ మేరకు పన్నుల సేకరణకు పురపాలక కార్యాలయంలో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రెండు వాహనాల ద్వారా పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెలాఖరులోపు వచ్చే ఏడాదికి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఈ ఏడాది కూడా యజమానులు 15 శాతం అధికంగా ఆస్తిపన్ను పెంచి చెల్లించాల్సి ఉంటుందని పురపాలక రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా గత మార్చి 31నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.12కోట్ల పన్నులు వసూలు కావాల్సివుండగా అందులో 85శాతం రూ.10.2కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. మరో రూ.7కోట్లు పెండింగ్ పన్నులు ఉండగా, వాటిలో రూ.1.5కోట్లవరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ముందస్తు ఆస్తి పన్నుపై అధికారుల దృష్టి పురపాలక సంఘంలో మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు -
బలి చేసుకోవద్దు
డ్రగ్స్‌తో జీవితాలు ఈగల్ టీమ్ ఎస్పీ నగేష్ ఏఎన్‌యూ(గుంటూరు): డ్రగ్స్‌తో జీవితాలు బలి చేసుకోవద్దని యువతకు పోలీస్ విభాగ ఈగల్ టీమ్ ఎస్పీ కె.నగేష్ సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్న ఏఎన్‌యూ మహోత్సవ్ 2కే25 కార్యక్రమంలో భాగంగా బుధవారం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ‘ఎరాడికేషన్ ఆన్ డ్రగ్స్’ అనే అంశంపై విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగేష్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ జోలికి పోరాదని సూచించారు. ఈగల్ ఎస్పీతో కలిసి వర్సిటీ అధికారులు, విద్యార్థులు అధ్యాపకులు డ్రగ్స్ ఎరాడికేషన్పై ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామలపై స్కిట్ ప్రదర్శించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి, ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం.గోపికృష్ణ, డి. చంద్రమౌళి, కన్వీనర్ డాక్టర్ సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటీపీ ఎలా చెబుతాం
గుంటూరు వెస్ట్: ఉపాధి మార్గాలు సృష్టించడం సంగతి దేవుడెరుగు ఉన్న కాస్త జీవనోపాధిని హరించే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. దాదాపు 150 ఏళ్ల నుంచి నడుస్తున్న నాన్ జుడీషియల్ స్టాంపుల విక్రయాలు మందగించాయి. ప్రభుత్వ కొత్త విధానాలతో అమ్మబోతే అడివి కొనబోతే కొరివిలాగా ఉంది జిల్లాలోని స్టాంపు వెండార్ల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపుల విక్రయాలకు తెచ్చిన నూతన విధానం అటు స్టాంపు వెండార్లతోపాటు ప్రజలకు కూడా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గతంలో స్టాంపు కావాలంటే నేరుగా వెండార్ వద్దకు వెళ్ళి, లేదా ఎవరినైనా పంపి స్టాంపులు కొనుగోలు చేసుకోవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరికై తే స్టాంపు కావాలో వారే వెళ్లాలి. వారి ఆధార్ కార్డు ఇవ్వాలి. వారి ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలి. అప్పుడు దానిని కంప్యూటర్లో నమోదు చేసి స్టాంపు ప్రింట్ తీసి ఇస్తారు. ఈ ప్రక్రియ జరగాలంటే అరగంట పడుతుంది. ఇక్కడ మరో విషయమేమిటంటే ఆన్లైన్లో ఆధార్ ఓపెన్ కాకపోతే స్టాంపు లభించదు. ఇలా అయితే ఒక్క స్టాంపు వెండార్ రోజుకు ఎన్ని స్టాంపులు విక్రయించగలరు. ఓటీపీతోనే అసలు తంటా రూ. 10 నుంచి రూ.100 వరకు ఉండే నాన్ జుడీషియల్ స్టాంపులు కొనాలంటే వెండార్‌కు ఆధార్ కార్డు ఇవ్వాలి. అందులో ఉన్న పేరు, చిరునామాకు మాత్రమే స్టాంపు లభిస్తుంది. అడ్రస్ మారినా స్టాంపు ఇవ్వడం కుదరదు. ప్రతి స్టాంపు వెండార్ స్టాంపులు విక్రయించేందుకు ఒక దుకాణంతోపాటు కంప్యూటర్, ప్రింటర్, డిస్ప్లే ఏర్పాటు చేసుకోవాలి. ఈ వృత్తిలో చాలా మంది వయోధికులు ఉన్నారు. వారికి ఇంత సెటప్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. కంప్యూటర్ పరిజ్జానం లేదు. పైగా స్టాంపుల సరఫరా అరకొరగానే ఉంటుంది. వచ్చే కమీషన్ దుకాణం అద్దెకూ సరిపోదు. రోజూ సంపాదించే మూడు, నాలుగొందలతోనే జీవించే వెండార్లే చాలామంది. వీరంతా ఇప్పుడు వృత్తికి దూరం కావాల్సిందే. నెల రోజుల నుంచి కనీసం తీసుకున్న స్టాకులో 5 శాతం కూడా స్టాంపు వెండార్లు విక్రయించలేదు. కారణం ఇంత తతంగం భరించలేక. ఐజీ కార్యాలయం ఏకపక్ష నిర్ణయం ఈ కొత్త విధానం రూపకల్పనలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖాధికారుల పాత్రే కీలకం. ఈ విధానాన్ని ముందుగా కనీసం జిల్లా రిజిస్ట్రార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు స్టాంపు వెండార్లకు తెలియజేయకుండానే అమలు చేస్తున్నారు. వెండార్ స్టాంపులు విక్రయించాలన్నా ముందుగా కంప్యూటర్లో లాగిన్ అవ్వాలి. దీనికి ఓటీపీ నమోదుకు పావుగంట పడుతుంది. ఈలోపు ఓటీపీ రాకపోతే మళ్లీ ప్రక్రియ మొదటికే వస్తుంది. దీంతో వెండార్లు ఇబ్బందులు పడుతున్నారు. స్టాంపుల విక్రయాలకు కొత్తగా వచ్చిన నిబంధనలు అమలు చేయడం సాధ్యం కావడంలేదు. ఆధార్ కార్డు నంబర్, ఓటీపీ చెప్పమంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ విధానం మార్చాలని మనవి.రోజుకు రూ.300 కూడా లాభం రాని వెండార్లు షాపు, కంప్యూటర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం ఇబ్బందే. వచ్చే కమీషన్ కూడా అంతంత మాత్రమే. – షేక్ రషీద్, స్టాంపు వెండార్ల అసోసియేషన్ జిల్లా జేఏసీ చైర్మన్సమస్యలు పరిష్కరించండి పాత తేదీల్లో స్టాంపులు విక్రయించకుండా ఉండేందుకు ఈ విధానం తెచ్చామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే పాత తేదీల్లో స్టాంపులు కొనుగోలు దాదాపుగా ఆగిపోయింది. పాత తేదీల్లో అగ్రిమెంట్లు రాసుకున్నా అవి పనికిరావు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారమే ఫీజులు చెల్లించాలి. తమను సాగనంపేందుకే ఈ నూతన విధానం అమలు చేస్తున్నారని వెండార్లు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రక్రియలో లోపాలు సవరించాలని కోరుతున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి నాన్ జుడీషియల్ స్టాంప్స్ విక్రయాల్లో ఇబ్బందులు నూతన విధానంతో మందగించిన అమ్మకాలు దుకాణం, కంప్యూటర్ సిస్టమ్స్ ఉండాల్సిందేనంటూ హకుం ఆధార్ ఇచ్చి, ఓటీపీ చెబితేనే స్టాంప్ పేపర్ మనుగడ కష్టమేనంటున్న స్టాంప్ వెండార్లు రూ.10 స్టాంపు కొనాలన్నా ఆధార్ కార్డు వెండార్‌కు ఇవ్వడంతోపాటు నా ఫోన్ వచ్చే ఓటీపీ కూడా చెప్పాలంట. ఒక పక్క ప్రభుత్వమే ఓటీపీలు చెప్పవద్దని ప్రచారం చేస్తుంది. నిజానికి నాన్ జుడీషియల్ స్టాంపు కావాలంటే ఈ విధానం ఫాలో అవ్వాలని అధికారులూ చెబుతున్నారు. అందుకే చాలా వరకు స్టాంపుల విక్రయాలు జరగడంలేదు. – షేక్ హుస్సేన్, గుంటూరు . -
రైతు కష్టం.. బూడిద పాలు
● 13 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం ● ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ఘటన ● సుమారు రూ.13లక్షల నష్టం ● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధిత రైతులు ముప్పాళ్ళ: మండలంలోని గోళ్లపాడు గ్రామంలోని ఆక్రాన్ ఫార్మా కంపెనీ ఎదురుగా పంట పొలాల్లో బుధవారం మంటలు వ్యాపించి సుమారు 13 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామంలో మొక్కజొన్న కోతలు ఊపందుకున్నాయి. పంట కోసిన రైతులు వ్యర్థాలకు నిప్పు పెడుతుంటారు. ఈ క్రమంలోనే నిప్పు పెట్టడంతో ఈదురుగాలులు అధికంగా ఉండటంతో పక్కనే ఉన్న కోత కోయని పొలాలకు మంటలు వ్యాపించాయి. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో మంటలు పక్క పొలాలకు వ్యాపించాయి. ఈ మంటల్లో మండలంలోని కుందురువారిపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు చెందిన సుమారు 13 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన బత్తినేని అచ్చయ్య మూడు ఎకరాలు, కందుల సుబ్బారావు మూడు ఎకరాలు, బొడ్డపాటి చినకోటయ్య ఆరు ఎకరాలు, పుల్లెం వెంకటేశ్వర్లు అర ఎకరం, పుల్లెం భూలక్ష్మి అర ఎకరం కలిపి మొత్తం 13 ఎకరాల్లోని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఎకరం రూ.లక్ష చొప్పున రూ.13 లక్షల నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. ఎకరాకు సుమారు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టాం. పంట చేతికందే సమయానికి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియటం లేదు. ప్రభుత్వమే ఎకరాకు రూ.లక్ష చొప్పున అందించి ఆదుకోవాలి. లేకుంటే మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది. –అచ్చయ్య, సుబ్బారావు, చినకోటయ్య, బాధిత రైతులు -
జిల్లా వైద్యశాలలో పర్యటించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్భన్: తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం కాయకల్ప బృందం పర్యటించింది. మంగళగిరిలోని నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు డాక్టర్ నిర్మలగ్లోరి, డాక్టర్ స్టెఫిగ్రేస్లు తల్లీపిల్లల వైద్యశాలలోని పలు వార్డులు, ఆపరేషన్ ఽథియేటర్, జిల్లా వైద్యశాలలోని పలు వార్డులు, ల్యాబ్‌లను పరిశీలించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. డాక్టర్ నిర్మల గ్లోరి మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా తెనాలి రావటం జరిగిందన్నారు. ఆస్పత్రిలో నిబంధనలకు అనుగుణంగా రోగులకు సేవలు అందింస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో శానిటేషన్ బాగోకపోతే ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉంటుందన్నారు. దానిపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నట్లు వివరించారు. జిల్లా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. రోగులకు అందించే సేవలు సంతృప్తికరంగా ఉన్నట్లు రోగులు తెలిపారన్నారు. వారి వెంట వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఆర్ఎంవో డాక్టర్ మల్లికార్జునరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, పలువురు వైద్యులు, సిబ్బంది ఉన్నారు. -
గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం
సీపీఎం ఆధ్వర్యంలో నిరసననరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వంట గ్యాస్ రూ.50, పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులునాయక్ డిమాండ్ చేశారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఆంజనేయనాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు సిలిండర్‌పై రూ.200, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఓట్లు వేయించుకొని మూడవసారి అధికారం చేపట్టి, అనంతరం ఇచ్చిన మాట తప్పారన్నారు. దశల వారీగా గ్యాస్ ధరలు పెంచుతూ రాయితీలు ఎత్తివేశారని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్న నరేంద్రమోదీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత గ్యాస్ అంటూ ఊదరగొట్టినా అనేక షరతులు విధిస్తోందన్నారు. దీంతో ఉచిత గ్యాస్ అందకుండా పోతుందన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, టి.పెద్దిరాజు, నాయకులు కామినేని రామారావు, సయ్యద్ రబ్బాని, షేక్ మస్తాన్‌వలీ, డి.సుభాష్‌చంద్రబోస్, షేక్ ఖాసీం, మిరపకాయల రాంబాబు పాల్గొన్నారు. -
నేటి నుంచి కృపా మహాసభలు
గుంటూరురూరల్: క్రీస్తు నామాన్ని ఘనపరిస్తే ఆయన మనలను ఘనపరుస్తాడని కృపా మినిస్ట్రీస్ అధ్యక్షుడు బ్రదర్ మాథ్యూస్ తెలిపారు. బుధవారం నల్లపాడు రోడ్డులో ప్రతిఏటా నిర్వహించే కృపా మహాసభల ప్రాంగణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 19వ కృపా మహాసభలను గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఎదురు రోడ్డులో నల్లపాడు రోడ్డునందు ఈ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేదీ ఆదివారం సాయంత్రం వరకూ ఈ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీస్తుని భక్తులు లక్షలాదిగా పాల్గొంటారన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు పగటిపూట ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. వేసవి కాలం కావున విశ్వాసులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చినవారికి భోజన వసతి, మరుగుదొడ్లు, ప్రత్యేకంగా మినిస్ట్రీస్ వలంటీర్ల రక్షణలో భద్రత ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమవుతాయని, రాత్రి ప్రార్థనలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మినిస్ట్రీస్ సేవకులు, బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు లక్షలాదిగా హాజరుకానున్న విశ్వాసులు -
తలసేమియా ట్రాన్స్‌ప్యూజన్ సెంటర్‌కు స్థలం కేటాయించండి
కలెక్టర్‌ను కోరిన రెడ్‌క్రాస్ కార్యవర్గ సభ్యులు నరసరావుపేట: రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ‘మీ డాక్టర్ మీ ఇంటికి’ అనే ప్రాజెక్టు దేశం మొత్తంలో 33 జిల్లాలకు మంజూరు కాగా అందులో పల్నాడు జిల్లా ఒకటని రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.అరుణ్‌బాబును కలిసి రెడ్‌క్రాస్ జిల్లా కార్యకలాపాలను గురించి వివరించారు. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించి జిల్లాలో ఉన్న గిరిజన తండాలు, మత్స్యకారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యాన్ని అందజేస్తామని తెలియజేశారు. అలాగే జిల్లాకు రెడ్ క్రాస్ ద్వారా తలసేమియా ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ మంజూరైందని, సుమారు రూ.6లక్షల విలువ చేసే సామగ్రి కూడా మంజూరు చేశారని, ఈ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 10 పడకల స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ కోరారు. ఆర్డీఓ కాంపౌండ్‌లో ఉన్న 15 సెంట్ల రెడ్‌క్రాస్ స్థలాన్ని సర్వే చేయించి రెడ్‌క్రాస్‌కు కేటాయిస్తే అందులో నూతన భవన నిర్మాణం చేసి ఓల్డ్ ఏజ్ హోమ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, ఉచిత వైద్యశాల, అనాథ శరణాలయం, జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు డాక్టర్ కంజుల తెలిపారు. రెడ్‌క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలలో డీఎంహెచ్ఓ తనిఖీలు
అచ్చంపేట(క్రోసూరు): పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. మాదిపాడు పీహెచ్సీ పరిధిలోని చింతపల్లి, మాదిపాడు సబ్ సెంటర్స్‌లో జరిగే సాధారణ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ పలు సూచనలు చేశారు. చిన్న పిల్లల వాక్సినేషన్‌ను వేసవి దృష్ట్యా ఉదయం 11 గంటల లోపు ముగించాలని తెలిపారు. అనంతరం పీహెచ్సీ కార్యకలాపాలపై వైద్యాధికారి డాక్టర్ ఎం.ఇన్నారావును అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో జిల్లా ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ డి.హనుమకుమార్ పాల్గొన్నారు. అచ్చంపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ స్రవంతి, మాదిపాడు సీహెచ్ఓ హర్ష వర్ధన్, శివ నాగేశ్వరి, ఆరోగ్య విస్తరణ అధికారి పి.వెంకటరావు, హెల్త్ ఎడ్యుకేటర్ పార్వతి, సూపర్వైజర్ పి.రాధాకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
ఐక్య పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం
ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ చిలకలూరిపేట: ఐక్యపోరాటాలతోనే రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ కాలువకు రూ. 5 వేల కోట్ల నిధులు కేటాయించి ఆధునికీకరించాలని కోరారు. వ్యవసాయానికి సాగునీటిని కల్పించడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. మిర్చి క్వింటా రూ. 20 వేలకు తగ్గకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ● నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు మాట్లాడుతూ నల్లబర్లీ పొగాకును టుబాకో బోర్డు పరిధిలో చేర్చి గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ప్రస్తుతం రైతాంగం వద్ద ఉన్న బర్లీ పొగాకును ప్రభుత్వ సంస్థల ద్వారా గత ఏడాది ధరకు తగ్గకుండా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.రాధాకృష్ణ మాట్లాడుతూ నాగార్జున సాగర్ కాల్వలైన మేజర్లను పొడిగించి నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట, బల్లికురవ, యద్దనపూడి, పర్చూరు, పెదనందిపాడు మండల్లోని గ్రామాల్లో ప్రజానీకానికి తాగునీరు, సాగునీరు అందించవచ్చన్నారు. ● సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రవహించే కుప్పగంజి, నక్కవాగు, ఓగేరు వాగులను శుభ్రం చేయించి, ఆధునికీకరించాలని, కరకట్టలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, ఏపీ మహిళా సమఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, వీసీకే పార్టీ నాయకులు వంజా ముత్తయ్య, నాయకులు కందిమళ్ల వెంకటేశ్వర్లు,నాగేశ్వరావు,మల్లికార్జున్, సృజన్ , కొండల్ రావు, తుబాటి సుభాని తదితరులు పాల్గొన్నారు. -
అటల్ టింకరింగ్ ల్యాబ్ పరిశీలన
పెదకూరపాడు: 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ హైస్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో సంభాషించి, వారు చేస్తున్న ప్రాజెక్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టేట్ ఆఫీసర్, యునిసెఫ్ కన్సల్టెంట్ సుదర్శన్ మాట్లాడుతూ రానున్న కాలం అంతా రోబోటిక్, డిజిటల్ టెక్నాలజీదేనని, విద్యార్థులు నూతన టెక్నాలజీని ఉపయోగించి తాము తయారుచేసిన నమూనాలకు స్టార్టప్ ప్రోగ్రాం కింద ప్రోత్సాహక నగదు, పేటెంట్ పొందవచ్చన్నారు. ఇన్నోవేటివ్ స్పిరిట్‌తో విద్యార్థులు ముందడుగు వేయాలని అన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విన్నూతనమైన ప్రాజెక్టులను తయారు చేయడానికి విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించాలన్నారు. హెచ్ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, అటల్ ల్యాబ్ ఇన్చార్జి కె.వి.సుబ్బారావు, ఈఆర్డీసీకి చెందిన అమర్, మెంటర్ సుస్మిత, సీఆర్పీ శివ, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మనోళ్లే.. ఆర్పీగా పెట్టుకోండి
● ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ● నియమించిన మెప్మా సిబ్బంది నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ‘మనోళ్లే.. నేను చెప్తున్న కదా.. ఆ అమ్మాయిని రిసోర్స్ పర్సన్(ఆర్పీ)గా పెట్టుకోవాలి’ అంటూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతో మెప్మా సీఎంఎం పావని, సీఓ సరోజిని కొత్తగా ఓ ఆర్పీని నియమించారు. అంతేగాక ఆమెకు వేరే ఆర్పీ వద్ద నుంచి 22 గ్రూపులను తీసుకుని కేటాయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఎంలు(సిటీ మిషన్ మేనేజర్), సీఓలు(కమ్యూనిటీ ఆర్గనైజర్)ల కంటే ఆర్పీలు ఎక్కువగా ఉన్నారని.. వీరికి జీతాలు చెల్లించేందుకు కూడా అవస్థలు పడాల్సిన దుస్థితి ఉందని, కొత్తవారిని తీసుకోవద్దని మెప్మా ఎండీ స్పష్టంగా ఆదేశించినా సిబ్బంది పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే లేటర్ ఇచ్చారని కొత్త ఆర్పీని నియమించారు. బుధవారం రామిరెడ్డితోటలోని బంగ్లా మున్సిపల్ స్కూల్లో సమావేశమై కొత్త ఆర్పీని గ్రూపు సభ్యులకు పరిచయం చేశారు. లాగిన్ ఇవ్వడం లేదు కొత్త ఆర్పీ కోసం సమైక్యలో గ్రూపు సభ్యులంతా కలిసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం మేరకే కొత్త ఆర్పీని నియమించాం. కానీ లాగిన్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం వేరే ఆర్పీల వద్ద ఉన్న గ్రూపుల నుంచి 22 గ్రూపులను కొత్త ఆర్పీకి కేటాయించాం. – పావని, సీఎంఎం -
మిర్చి వ్యాపారి అదృశ్యంపై కేసు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన ఓ మిర్చి వ్యాపారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్ల పాడు, అబ్బూరు, ఫిరంగిపురం మండలం 113త్యాళ్లూరు, యర్రగుంట్లపాడు తదితర గ్రామాల్లో రైతుల అంగీకారంతో మిర్చి వ్యాపారి తిరుములరావు ఏటా మిర్చి తూకాలు వేసి, వాహనాల్లో లోడు చేసుకుని తరలించేవాడు. గుంటూరులో బడా వ్యాపారులకు విక్రయించి రైతులకు నగదు చెల్లించేవారు. ప్రస్తుత సీజనులో సుమారు 50 మంది రైతుల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన మిర్చి సేకరించి గుంటూరులోని ఓ గోదాములో నిల్వ చేశారని, సోదరుడి సహాయంతో కొన్ని దుకాణాలకు నమూనాలు పంపి విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు. నగదు కోసం రైతులు వ్యాపారి ఇంటికి వెళితే సుమారు పది రోజులుగా కనిపించడం లేదని చెబుతున్నారన్నారు. ఈ క్రమంలో లక్కరాజుగార్లపాడుకు చెందిన కొందరు రైతులు సత్తెనపల్లి రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం తాళ్ళయపాలెం(తాడికొండ): అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఘటన తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తాళ్ళాయపాలెం గ్రామంలో నల్లబజారుకు తరలించేందుకు 20 సంచుల్లో సిద్ధంగా ఉంచిన 10 కిలోల రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఎస్ఐ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో రేషన్ బియ్యంతో పాటు వాటిని తరలిస్తున్న ఉగ్గం అజయ్ కుమార్, మొగిలి వెంకట్రావులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తుళ్ళూరు ఎస్ఐ బాబురావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి తాడేపల్లి రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి ముగ్గురోడ్డుకు చెందిన బూదాల దాస్ (43) మంగళగిరి విజయవాడ పాత జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వస్తుండగా ప్రకాష్‌నగర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో దాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దాస్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య కేసు నిందితుల అరెస్ట్
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ హిల్‌కాలనీలో వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల వద్ద హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. హత్య చేసిన వారితో పాటు హత్యతో సంబంధం కలిగిన పది మందిలో 9మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. కారు, బైకులు, కత్తులు, 10సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. బుధవారం నాగార్జునసాగర్ పోలీస్టేషన్లో డీఎప్పీ వివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ -
స్ఫూర్తిదాయకం.. కేఎస్ సామాజిక దృక్పథం
పట్నంబజారు: సామాజిక స్ఫూర్తితో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలు, పలువురు మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు కలిసి బుధవారం బృందావన్ గార్డెన్స్‌లోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సత్కార సభ నిర్వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యావేత్త.. అనేక కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు అందించిన మేధావిగా కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన సామాజిక ఉద్యమకారుడు అని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ నిరాడంబరత, సమయపాలనకు ఆయన పెట్టింది పేరని, సామాజిక ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషిని వీడియోల రూపంలో భద్రపరిస్తే భావితరాలకు అది ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు వి.లక్ష్మణరెడ్డి, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ఆయన సేవలను కొనియాడారు. స్పందించిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ముందుకు సాగుతూ సమస్యలపై పోరాడేందుకు ముందు నిలబడడం తనకు అలవాటుగా మారిందని వివరించారు. ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన అన్ని ప్రజోపయోగ పోరాటాల్లో తన వంతు పాత్ర పోషించినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి గోరంట్ల వెంకట్రావు, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనుంజయరెడ్డి, సీపీఎం నేత భారవి, విశ్రాంత ప్రధాన అధ్యాపకులు డీఏఆర్ సుబ్రహ్మణ్యం, ముత్యం పాల్గొన్నారు. -
కుక్కకాటు..ప్రాణాలకు చేటు
గుంటూరు మెడికల్: జిల్లాలోని కాకుమానులో ఆరేళ్ల చిన్నారి కౌసర్ 2016లో కుక్కలదాడిలో మృతిచెందగా, 2017 సెప్టెంబర్ 21న గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడులో నాలుగేళ్ల ధూపాటి ప్రేమ్‌కుమార్ కుక్కలు కరిచి మృతిచెందాడు. తాజాగా స్వర్ణభారతినగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఐజాక్ ఈనెల 6వ తేదీన కుక్కల దాడిలో చనిపోయాడు. కేవలం పిల్లలే కాకుండా పెద్దవారు సైతం కుక్కకాటు బారిన పడి మరణిస్తున్నారు. ప్రతి ఏడాది జిల్లాల్లో కుక్కకాటు ద్వారా 10 మందికి పైగా మరణిస్తున్నారు. కుక్కకాటు ద్వారా సంభవించే రేబిస్ వ్యాధి 2011లో ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికించివేసింది. ప్రతి కుక్కలోనూ రేబిస్ వైరస్ ఉండదు. కానీ వైరస్ ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్కకాటును సీరియస్‌గానే పరిగణించాలి. పిచ్చికుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మనుషులు రేబిస్‌కు గురైతే.. మనుషులు రేబిస్ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాల్లో రోగి నీటిని చూసినా, నీటి శబ్ధం విన్నా భయకంపితులవుతారు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి ఊపిరి పీల్చుకోలేక మనుషులు కూడా మరణిస్తారు. కుక్కకాటు బాధితులు.... గుంటూరు జీజీహెచ్‌లో 2023లో 34,931 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 40,262 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2025 జనవరిలో 3157 మంది, ఫిబ్రవరి 2877 మంది, మార్చిలో 2728 మంది ఇంజక్షన్లు చేయించుకున్నారు. ఏప్రిల్ 1న 66 మంది, ఏప్రిల్ 2న 95 మంది, ఏప్రిల్ 3న 117, ఏప్రిల్ 4న 87 మంది, ఏప్రిల్ 5న 93, ఏప్రిల్ 7న 137 మంది కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి పిచ్చికుక్క కరిచిన వెంటనే గాయాన్ని చల్లటి నీటితో, సబ్బుతో కడగాలి. గాయంపై నీరు ధారగా పడే విధంగా చేయాలి. గాయంపై టింక్చర్ అయోడిన్ వేయాలి. గాయానికి కుట్లు వేయటం, ఆయింట్మెంట్ పూయటం, గాయాన్ని నిప్పుపెట్టి కాల్చటం, కోయటం వంటివి చేయకూడదు. కుక్క కరిచిన వెంటనే సాధ్యమైనంత మేరకు త్వరగా వైద్యులను సంప్రదించి టీకాలు వేయించకోవటం ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి. – డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరుప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్లు... గుంటూరు జీజీహెచ్‌లోనూ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కుక్కకాటు బాధితులకు ర్యాబీపూర్ వ్యాక్సిన్లు చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి రోజూ సుమారు 70 నుంచి 80 మంది కుక్కకాటు వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉచితంగా ర్యాబీపూర్ వ్యాక్సిన్‌ను చేస్తున్నారు. అత్యవసర విభాగంలో అన్ని వేళలా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. – డాక్టర్ యశశ్వి రమణ, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్● రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు జిల్లాలో ప్రతి ఏడాది 10 మందికిపైగా మృత్యువాత ఇటీవల కుక్కలదాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ర్యాబీపూర్ వ్యాక్సిన్లు కుక్కకాటు మరణాలుకుక్కకాటుకు సకాలంలో ఇంజెక్షన్లు చేయించకపోవటంతో గుంటూరు గోరంట్లలోని ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి (జ్వరాల ఆస్పత్రి)లో చికిత్స పొందుతూ 2020లో ఏడుగురు, 2021లో 13 మంది మరణించారు. 2022లో తొమ్మిది మంది, 2023లో 13 మంది, 2024 తొమ్మిది మంది చనిపోయారు. -
వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు మల్లేశ్వర ప్రాంగణంలో పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించి, పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు జరిపించారు. 6 గంటలకు స్వామి వార్ల ఉత్సవమూర్తులను వెండి పల్లకీపై ఉంచి నగరోత్సవ సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి వెండి పల్లకీ సేవ ప్రారంభం కాగా, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, భజన బృంద సభ్యులతో ఊరేగింపు కనుల పండువగా సాగింది. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్ మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంది. వేడుకగా మంగళ స్నానాలు వెండి పల్లకీపై ఊరేగిన ఆదిదంపతులు -
పల్నాడు
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దరఖాస్తు ఇలా.. వేసవిలో నీటి తొట్టెలు ఉపయుక్తం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సత్తెనపల్లి: వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చడానికి నీటి తొట్టెలు దోహదపడతాయని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న నీటి తొట్టెల నిర్మాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వేసవిలో మూగజీవాలు మేతకు వెళితే తిరిగి ఇంటికి వచ్చేవరకు వాటికి దాహం తీర్చుకునే అవకాశం ఉండదని గుర్తించి సిమెంటుతో మంచినీటి తొట్టెలు ఏర్పాటు చేసి వాటిని నీటితో నింపడం జరుగుతుందన్నారు. వేసవిలో మేతకు వెళ్లిన మూగజీవాలు మధ్యలో ఈ తొట్టెల వద్ద దాహార్తిని తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. సత్తెనపల్లి మండలంలో తొమ్మిది గ్రామాల్లో, తొమ్మిది నీటి తొట్ల నిర్మాణం ప్రస్తుతం జరుగుతుందని రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఏపీడీ పీవీ నారాయణ తెలిపారు. డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, సత్తెనపల్లి మండల విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు ఉన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 516.00 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్ – 2025 ఆన్లైన్ దరఖాస్తు గడువు మరో 15 రోజుల్లో ముగియనుంది. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2025కు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets. apsche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ధ్రువపత్రాల వివరాలు తప్పనిసరి ● ఏపీ ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్ కేటగిరీల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్లో క్లిక్ చేయాలి. అదేవిధంగా సంబంధిత ధ్రువపత్రానికి సంబంధించిన నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటో తేదీ తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. ● విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏ విద్యాసంస్థల్లో, ఏ ఊరిలో చదివారనే వివరాలను ఆయా విద్యాసంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివర్లో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్ చేయాలి. ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి తన సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంపిక చేసుకున్నప్పటికీ, అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతరత్రా కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ● ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్ టిక్కెట్‌తో పాటు ఆన్లైన్ ప్రింటవుట్ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. 7న్యూస్‌రీల్ దరఖాస్తు చేసేందుకు ఈనెల 24 చివరి తేదీ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష మే 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27వరకు ఇంజినీరింగ్‌కు సంబంధించి టెస్ట్ దరఖాస్తు సమయంలో జాగ్రత్తలతో కౌన్సెలింగ్‌లో తొలగనున్న ఇబ్బందులుఏపీఈఏపీసెట్–2025 సైట్‌కు లాగిన్ అయిన తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాలి. స్టెప్–1 మొదలు స్టెప్–5 వరకు ఐదు దశల్లో కనిపించే ట్యాబ్‌లను వరుస క్రమంలో క్లిక్ చేస్తూ, పొందుపర్చిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టెప్1: ‘ఎలిజిబులిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్’కు లాగిన్ అయ్యి సీనియర్ ఇంటర్ హాల్‌టికెట్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ నమోదు చేయాలి. దీంతో పాటు ఇంజినీరింగ్–ఫార్మసీ, అగ్రికల్చర్–ఫార్మసీ, బోత్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని, క్లిక్ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్ చేసి, ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి. క్రెడిట్, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంది. స్టెప్–2: నో యువర్ పేమెంట్ స్టేట్స్పై క్లిక్ చేసి, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. తదుపరి చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్ చేయడంతో స్టెప్–2 దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. స్టెప్–3: ఫిల్ అప్లికేషన్లో పేమెంట్ చేసిన ఐడీతో పాటు సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. స్టెప్–4: ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్‌పై క్లిక్ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు. స్టెప్–5: ఇక్కడ క్లిక్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్, పుట్టినతేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్ హాల్ టిక్కెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి. -
జై చెన్నకేశవ.. జైజై చెన్న కేశవా!
మాచర్ల: మాచర్ల పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్లకు సర్వం సిద్ధమైంది. చంద్రవంక నదీ తీరాన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఈనెల 10 నుంచి జరగనున్న చెన్నకేశవుని ఉత్సవాలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. కల్యాణం, రథోత్సవం రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. చెన్నకేశవ విగ్రహ స్వరూపం స్వామి వారు శిరస్సున శిఖయును, నాలుగు హస్తములు, శంఖుచక్రాలు ధరించి, తిరుమణితో మీసాలు మెలితిప్పి పల్నాటి వీరగాథ గుర్తు చేసేలా దర్శనమిస్తారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి మకరతోరణం మధ్య భాగం ఎంతో అందంగా ఉంటుంది. కీర్తిముఖుడైన స్వామిగా శ్రీలక్ష్మీ చెన్నకేశవుడుగా విరాజిల్లుతున్నాడు. ఏటా రెండుసార్లు.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామికి ఏటా రెండు పర్యాయాలు కల్యాణమహోత్సవం జరుగుతుంది. ఒకసారి చైత్ర మాసంలో, రెండోసారి మకర సంక్రాంతి రోజున అంగరంగ వైభవంగా కల్యాణం జరుపుతారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా చైత్ర పున్నమి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో కల్యాణం నేత్రపర్వంగా జరుగుతుంది. వేలాది మంది కల్యాణం జరిగే రోజు రాత్రి తరలివస్తారు. ఈనెల 10 నుంచి 17వరకు.. శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి వారిని 60 అడుగుల రథంపై ఊరేగిస్తారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి జై చెన్నకేశవ అంటూ రథోత్సవం జరపనున్నారు. మాచర్ల పురవీధులు జన సంద్రం కానున్నాయి. కాంచనపల్లి వంశస్థులు పూజా కార్యక్రమాలు నిర్వహించి కలశాన్ని రథంపై ఉంచి ఉత్సవమూర్తులను అలంకరించి ఊరేగిస్తారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చెన్నుని ఉత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు జరుగుతాయి. కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. చెన్నకేశవ తిరునాళ్లకు సర్వం సిద్ధం రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు -
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
నరసరావుపేట రూరల్: ఈదురు గాలులు కారణంగా జిల్లాలోని 25.2 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు జిల్లా ఉద్యాన అధికారి సీహెచ్‌వీ రమణారెడ్డి మంగళవారం తెలిపారు. పంటలు దెబ్బతినడం వలన 40 మంది రైతులు నష్టపోయినట్టు వివరించారు. ఉద్యాన సహాయకులు మంగళవారం గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నట్టు తెలిపారు. నరసరావుపేట మండలంలో మునగ, బొప్పాయి, రాజుపాలెం మండలంలో బొప్పాయి, అరటి, మాచవరం, పెదకూరపాడు, అమరావతి మండలాల్లో అరటి, సత్తెనపల్లి మండలంలో అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పెదగార్లపాడులో వైభవంగా రథోత్సవం దాచేపల్లి : పెదగార్లపాడులో రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పండుగ ముగిసిన తరువాత మూడవ రోజున ఈ గ్రామంలో రథోత్సవం జరుపుతారు. రామాలయంలో ఉన్న రథాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించి , అర్చకులు పూజలు చేసిన అనంతరం రథోత్సవ కార్యక్రమం చేపట్టారు. రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. భక్తులు ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్‌కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు జంపని(వేమూరు): ఏకాదశి పర్వదినం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ చెన్నకేశవున్ని సూర్య కిరణాలు తాకాయని దేవస్థానం అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. మండలంలోని జంపని గ్రామంలో చెన్న కేశవాలయంలో మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవున్ని సూర్యకిరణాలు తాకాయి పాదాల నుంచి కిరీటం వరకు స్వామి వారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవాసుడు కేశవున్ని స్పృశించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు తెలిపారు. నృసింహుడిని దర్శించుకున్న శృంగేరి ప్రతినిధులు అద్దంకి రూరల్: పుణ్యక్షేత్రమైన శింగరకొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం శృంగేరి ప్రతినిధులు సందర్శించారు. మేనెల 19వ తేదిన నిర్వహించనున్న మహా కుంభాభిషేకం సందర్భంగా పిఠాధిపతులు విచ్చేయుచున్నందున ముందుగా వారి ప్రతినిధులు లక్ష్మీ నరసింహాస్వామిని సందర్శించారు. వారిని కార్యనిర్వాహణాధికారి, అర్చకులు ఆలయ సంప్రదాయాలు ప్రకారం ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సమన్వయంతోనే నియోజకవర్గ అభివృద్ధి
పెదకూరపాడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి అమరావతి: పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం అమరావతిలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధ్యక్షతన నియోజకవర్గంలోని అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి పారుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పులిచింతలలో మత్స్యకారుల ఉపాధికోసం చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. పేదలకు ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అర్హులందరికీ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ కింద జరిగే పనులను సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయని చెప్పి నిలిపివేస్తున్నారని, ఎంపీ ఫండ్స్‌తో జరిగే పనులపై సమీక్ష చేయాలన్నారు. మండలానికి రెండు కొత్త హాస్టళ్లు ఏర్పాటు చేసేలా అధికారులు పని చేయాలన్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులను ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారని అన్ని గ్రామాల్లో చెరువులను సర్వే చేసి చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 2025–26 జాబ్‌మేళా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ మురళి, సత్తెనపల్లి ఆర్డీఓ రమణా కాంత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో జూనియర్ లైన్మెన్ మృతి
బెల్లంకొండ: నూతన వీధిలైట్లు అమర్చేందుకు విద్యుత్ స్తంభంపై ఎక్కగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో జూనియర్ లైన్మెన్ మృతి చెందిన ఘటన మండలంలోని నందిరాజుపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పాపాయపాలెం గ్రామానికి చెందిన మర్రి నరసింహారెడ్డి (35) మండలంలోని మాచయపాలెం గ్రామంలో గ్రేడ్–2 జూనియర్ లైన్మెన్గా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా నందిరాజుపాలెం గ్రామంలో నూతన వీధిలైట్లు వేసేందుకు తోటి సిబ్బంది రమ్మని కోరడంతో వారితో కలిసి వెళ్లాడు. కాగా విద్యుత్ లైట్లు అమర్చేక్రమంలో చేతిలో ఉన్న ఇనుప రాడ్డు విద్యుత్ స్తంభంపై 11కేవీ విద్యుత్ వైర్‌కు తగలడంతో షాక్ కొట్టింది. విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలుకాగా, విద్యుత్ స్తంభంపై నుంచి నరసింహారెడ్డి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి మృతితో పాపాయిపాలెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ఈ–బైక్ డిజైన్ పోటీల్లో ఆర్వీఆర్జేసీ ప్రతిభ
గుంటూరు రూరల్: తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ బైక్‌కు జాతీయస్థాయిలో అవార్డులతోపాటు, నగదు బహుమతులను సాధించటం సంతోషకరమని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. మంగళవారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇటీవల గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ యూనివర్సిటీలో ఐఎస్‌ఐఈ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఈపి ఈబైక్ డిజైన్ ఛాలెంజ్ (సీజన్ 5.0) జాతీయ స్థాయి పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఈ బైక్ ద్వితీయ స్థానంలో నిలిచి రన్నరప్ అవార్డు (రూ.30,000 నగదు బహుమతి), ఫ్యూచర్ అవార్డు (రూ.5,000 నగదు బహుమతి)లను గెలుచుకున్నారన్నారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్‌లు మాట్లాడుతూ ఇంధన కాలుష్యం నివారించేందుకు, ఐఎస్‌ఐఈ నిర్వహించిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, తమ కళాశాల విద్యార్ధులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం గర్వకారణమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాల అధ్యాపక నిపుణుల నేతత్వంలో ఈ–బైక్ వాహన తయారీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి 25 మంది విద్యార్థులతో కూడిన జట్టు పాల్గొన్నారన్నారు. ఈ–బైక్ ద్విచక్ర వాహన తయారీలో 60వి, 40 ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 60వి, 2కెడబ్ల్యూ బీఎల్డీసీ మోటార్‌ను, 4 కెడబ్ల్యూ కంట్రోలర్‌ను అమర్చడం జరిగిందన్నారు. ఒకసారి ఛార్జ్ చేసిన అనంతరం ఇది 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో సుమారు 90 నుండి 100 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక,ఆర్థిక సహాయాలను అందించడానికి కళాశాల యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. అవార్డులను పొందిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, డాక్టర్ కె చంద్రశేఖర్, డాక్టర్ డివివి కృష్ణప్రసాద్, పీ వెంకటప్రసాద్, పీ వెంకటమహేష్, ఆర్ మారుతీవరప్రసాద్, తదితరులు అభినందించారు. -
జీవ నియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలి
గుంటూరు రూరల్: రైతులు విచక్షణ రహితంగా వినియోగిస్తున్న ఎరువులు, పురుగు మందుల వల్ల సాగు ఖర్చు పెరుగుతుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదాజయలక్ష్మిదేవి అన్నారు. రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలు, జీవనియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలని తెలిపారు. నగర శివారులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతు రక్షణ వేదిక ఆధ్వర్యాన మంగళవారం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎందుకు? ఎలా అనే అంశంపై చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ అధిక రేటు, అధిక ఆదాయం ఇచ్చే పంటలను పండించాలని సూచించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరగాలని, విత్తన సాధికారత సాధించాలని, కౌలురైతులకు ప్రోత్సాహాలను కల్పించాలని, బయో డైవర్సిటీ, కమ్యూనిటీ సీడ్ డెవలప్మెంట్, పాతతరం విత్తనాలను సంరక్షించుకోవాలని, సుస్థిర వినియోగం, సాంప్రదాయ వ్యవసాయ విధానలు చేపట్టాలని సూచించారు. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్‌లు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు రైతులకు వెన్నంటి ఉండి సుస్థిర దిగుబడులకు దోహదం చేయాలని కోరారు. రైతులను సంఘటితం చేయాలని, యువతను వ్యవసాయంవైపు ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎలా? ఎందుకు అనే అశంపై డాక్టర్ వేణుగోపాలరెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతు రక్షణ వేదిక ప్రతినిధి డాక్టర్ కె రాజమోహన్‌రావు, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ప్రొపెసర్ డాక్టర్ డి నరసింహారెడ్డి, సెంటర్ ఫర్ స్టెయినబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, ఎస్బీపీజీఆర్ ప్రతినిధి డాక్టర్ బి శరత్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదాజయలక్ష్మీదేవి -
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి
ఏపీఈజీఏ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గుంటూరు వెస్ట్: ప్రభుత్వ, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్‌బాషా మంగళవారం జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని కోరారు. చాంద్ బాషా మాట్లాడుతూ 2025 మార్చి నుంచి కన్వేయెన్స్ అలవెన్సులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు. ఎస్టిఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన కంప్యూటర్లు చాలా కాలం నుంచి పనిచేయక ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం చాంద్ బాషా ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి డీటీఓకు పుష్పగుచ్ఛం అందజేశారు. అభినందనలు తెలిపిన రిటైర్డ్ ఉద్యోగులు జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రెజరీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వర్లు, నాగరాజు పేర్కొన్నారు. -
‘విద్యామిత్ర’ స్టాక్ పాయింట్ల పరిశీలన
● వివిధ పాఠశాలలు పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు వనజ ● జిల్లాలో 6 పాయింట్ల గుర్తింపు నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లా పరిధిలోని 1,46,044 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా అందించనున్న వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని పథకం రాష్ట్ర పరిశీలనాధికారి వనజ తెలిపారు. విద్యా మిత్ర ద్వారా అందించే వస్తువులను భద్రపరిచే స్టాక్ పాయింట్లను మంగళవారం జిల్లా సీఎంఓ పద్మారావు, ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. జిల్లాలో శంకర భారతీపురం జెడ్పీ హైస్కూల్ (నరసరావుపేట), జెడ్పీ హైస్కూల్ (రొంపిచర్ల), జెడ్పీ హైస్కూల్ (నకరికల్లు), జెడ్పీ హైస్కూల్ (నాదెండ్ల), సెయింటాన్స్ స్కూల్ (యడ్లపాడు), శారదా హైస్కూల్ (చిలకలూరిపేట) స్టాక్ పాయింట్లుగా గుర్తించారు. రాష్ట్ర పరిశీలకులు వనజ మాట్లాడుతూ, విద్యామిత్ర ద్వారా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్, బెల్ట్, డిక్షనరీలను అందిస్తున్నట్టు వివరించారు. వాటి భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షానికి తడవకుండా, చెదలు పట్టకుండా చూడాలన్నారు. విద్యా మిత్ర మెటీరియల్ సరఫరాకు రహదారి పరంగా ఇబ్బందులు లేకుండా స్టాక్ పాయింట్లను గుర్తించటంపై విద్యాశాఖాధికారులను అభినందించారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలి
బాపట్లటౌన్ పర్చూరు మండలం, చెరుకూరు ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మాకు గడిచిన 15 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఉపాధ్యాయులు మంగళవారం డీఈవో పురుషోత్తమ్‌కు వినతిపత్రం అందజేశారు. చెరుకూరు ఆంధ్ర కేసరి మెమోరియల్ రెసిడెన్సి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, తెలుగు పండిట్ కె పద్మావతమ్మలకు పాఠశాల యాజమాన్యం వలంటరీ రిటైర్మెంట్ ఇవ్వలేదని 2024 ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ 2025 వరకు వారి జీతాల బిల్లులు యాజమాన్యం మండల విద్యాశాఖ అధికారికి పంపలేదన్నారు. ఈ విషయంపై డీఈవో ప్రత్యేక అధికారాలను ఉపయోగించి మాకు రావలసిన 15 నెలల జీతాలు చెల్లించాలన్నారు. దీనిపై స్పందించిన డీఈవో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కానిస్టేబుల్ ప్రతిభ బాపట్లటౌన్: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల జిల్లా ఖ్యాతి ఇనుమడింపచేయటం హర్షనీయమని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా, చందోలు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగ బ్రహ్మారెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించి స్విమ్మింగ్‌లో సాధించిన మెడల్స్‌తో సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ నాగ బ్రహ్మారెడ్డి 2025 ఫిబ్రవరి 2న విజయవాడలో జరిగిన 25వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటారన్నారు. దుర్గా ఘాట్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాలలో ఈది పూర్తిచేసి విజేతగా నిలిచాడు. 2025 మార్చి 24 నుండి 28వ తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో జరిగిన 72వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్స్ క్లస్టర్ చాంపియన్ షిప్ 2024–2025 పోటీలలో పాల్గొని సత్తా చాటారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుజరాత్ లోని గాంధీనగర్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలవడంతోపాటు గతంలో జాతీయ స్థాయిలో మరో 4 అవార్డులు అందుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో క్రీడా పోటీలలో పాల్గొని సత్తా చాటాలన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బంది బ్రహ్మారెడ్డి స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచే పోలీస్ అధికారులను సిబ్బందిని ప్రోత్సహిస్తామన్నారు. కానిస్టేబుల్‌కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ప్రసాద్‌నగర్‌లో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ బిల్లా రమేష్ భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో రూరల్ ఐఈ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు సారథ్యంలో స్థానిక శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా రూరల్ సీఐ, ఎస్సై కానిస్టేబుల్ భౌతికకాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ మృతి పట్ల ఎస్పీ తుషార్ డూడీ తన సంతాపం వ్యక్తం చేశారు. -
‘యువికా–2025’కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపిక
విజయపురిసౌత్: పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) యువికా–2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 350 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఏపీలో 10 మంది ఎంపిక కాగా పల్నాడు జిల్లానుంచి విజయపురిసౌత్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి పి.వెంకట నాగార్జున ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ మంగళవారం విద్యార్థి వెంకట నాగార్జునను తన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందించారు. ఎంపికై న విద్యార్థులకు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్, దేశంలోని వివిధ స్పేస్ సెంటర్లలో మే 19 నుంచి 30 వరకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్‌పై, స్పేస్‌పై ఆసక్తి కలిగించటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశమని డీఈఓ తెలిపారు. విద్యార్థి పి.వెంకట నాగార్జునను పాఠశాల హెచ్ఎం యు.లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థి తండ్రి పి.వంశీకృష్ణ స్థానిక ఏపీఆర్ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: ఈ నెల 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని తాడికొండలో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజ, ఆర్డీఓ శ్రీనివాసులు పరిశీలించారు. జయభారత్ కాలనీ, పొన్నెకల్లు ఎస్సీ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను సందర్శించారు. పొన్నెకల్లులో కార్యక్రమ నిర్వహణకు అనువుగా ఉందని నిర్థారించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న ఎస్సీ కుటుంబాలను పీ4 విధానంలో భాగంగా ఉన్నత కుటుంబాలకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ కాలనీలో పలువురితో ముచ్చటించి, పొన్నెకల్లు బైపాస్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికకు సీఎం చేరుకుని ప్రసంగిస్తారు. జేసీ వెంట తహసీల్దారు మెహర్‌బాబు, ఎంపీడీవో సమతావాణి ఉన్నారు. ‘శిశిరం’ మరింత గుర్తింపునిస్తుంది చైల్డ్ సూపర్ స్టార్ లిటిల్ భాను తెనాలి: శ్రీకృష్ణ ఆర్ట్స్ పతాకంపై తెనాలి, పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకొంటున్న బాలల సినిమా ‘శిశిరం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న తనకు, ఈ చిత్రంలో మరింత గుర్తింపు లభిస్తుందని బాల నటుడు, తండేల్ ఫేమ్ భానుప్రకాష్ అన్నాడు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాను మాట్లాడారు. కళల కాణాచి తెనాలిలో షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి 11 వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందన్నారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటనకు గాను తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఏంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, వన్‌టౌన్ సీఐ మల్లికార్జున రావు, కొరియా గ్రాఫర్ ‘అమ్మ’ సుధీర్ అభినందించారు. సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం.శ్రీకాంత్, పీఆర్ఓ అంబటి శ్యామ్‌సాగర్, బాలనటులు పాల్గొన్నారు. రేపు గుంటూరులో జాబ్ మేళా గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్ల సర్కిల్లోని గుంటూరుజిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి ఆంధ్ర కో–ఆపరేటివ్ బ్యాంక్, సీఐఐ–ఎంసీసీ, పేటీఎం, అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫెయిర్ డీల్ క్యాపిటల్, క్యాప్స్టన్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకై ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వృద్ధుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు గుంటూరు రూరల్: ఆరేళ్ల చిన్నారిపై యాభై ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌడవరం గ్రామం దాసరిపాలెంకు చెందిన శ్రీనివాసరెడ్డి స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలికపై తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక అరవటంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
తీరప్రాంత పరిరక్షణే సాగర్ కవచ్ ధ్యేయం
బాపట్లటౌన్: తీర ప్రాంత పరిరక్షణే సాగర్ కవచ్ ధ్యేయమని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. మంగళవారం సూర్యలంక తీరంలోని మైరెన్ పోలీస్‌స్టేషన్‌లో సాగర్ కవచ్‌పై సిబ్బందికి మాక్‌డ్రిల్ నిర్వహించారు. కవచ్ నోడల్ ఆఫీసర్, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు మాట్లాడుతూ తీరప్రాంత పరిరక్షణలో భాగంగా ఈనెల 9,10 తేదీల్లో సముద్ర తీరప్రాంతాల్లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏడాదిలో రెండుసార్లు సాగర్ కవచ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సముద్రమార్గం గుండా ఎవరైనా చొరబాటుదారులు మన ప్రాంతానికి చేరుకుంటే వారిని ముందస్తుగా గుర్తించి వారిని సముద్రంలోనే ఏ విధంగా అడ్డుకోవాలనే అంశాలపై ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, మైరెన్ పోలీసులతోపాటు తీరప్రాంతానికి చేరుకొని జనసంచారంలో అనుమానాస్పదంగా సంచిరిస్తుంటే వారిని ఏ విధంగా గుర్తించాలనే అంశాలపై సివిల్ పోలీసులకు పలు సూచనలు చేశారు. మారువేషాల్లో వచ్చే సిబ్బందిని ముందస్తుగా పసిగట్టి వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా లేని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మాక్‌డ్రిల్‌లో మైరెన్, కోస్ట్‌గార్డు, సివిల్ పోలీసులు 90 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, మైరెన్ సీఐ పి.లక్ష్మారెడ్డి, మైరెన్ ఎస్ఐలు పి.నాగశివారెడ్డి, ఎ.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. మాక్‌డ్రిల్‌లో సిబ్బందికి సూచనలిచ్చిన డీఎస్పీ -
సాగర్‌డ్యాంపై తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ పహారా ఉపసంహరణ
విశాఖపట్నం 234 బెటాలియన్‌కు చార్జ్ అప్పగింత విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న ములుగు 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ దళాలు సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు పహారా విధులు ఉపసంహరించుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంధ్రవైపు పహారా కాస్తున్న విశాఖపట్నం 234 బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావుకు 39 ములుగు బెటాలియన్ కమాండెంట్ రాఘవ చార్జ్ అప్పగించారు. ఆంధ్రా వైపు నుంచి సీఆర్పీఎఫ్ దళాలు తెలంగాణ వైపు గల డ్యాంమీదకు వెళ్లారు. వీరు జూన్ 23వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. గత 16 నెలలుగా తెలంగాణ వైపు తెలంగాణ దళాలు, మన రాష్ట్రం నుంచి ఆంధ్ర బెటాలియన్ పహారాలో సాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రాజెక్టు భద్రత విశాఖపట్నం బెటాలియన్ పహారాలోకి వెళ్లింది. -
రియల్..ఢమాల్
● కొత్త ప్రభుత్వంలో నూతన వెంచర్ల జోలికి వెళ్లని వ్యాపారులు ● పాత వెంచర్లకు కప్పం కట్టాలంటున్న కూటమి నేతలు ● రిజిస్ట్రేషన్ వేల్యూ పెంపు, చార్జీల మోతతో వెనుకడుగు వేస్తున్న రియల్టర్లు, ప్రజలు ● జిల్లాలో 60 శాతం కూడా సమకూరని రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ● రూ.664.18 కోట్ల లక్ష్యానికి వచ్చింది రూ.396.98 కోట్లే ● నరసరావుపేట, పిడుగురాళ్లలో సగానికి పైగా పడిపోయిన రిజిస్ట్రేషన్లు సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్: జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ రంగం పూర్తిగా చితికలపడింది. కొనుగోలు, అమ్మ కాలు భారీగా తగ్గిపోయి, మార్కెట్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ మార్పు తర్వాత రియల్ ఎస్టేట్‌లో భారీ ఊపు వస్తుందని కూటమి నేతలు చేసిన అభూతకల్పన వీగిపోయింది. వారి మాటలు నమ్మి వ్యాపారాలు బాగుంటాయని భావించిన ఇన్వెస్టర్లు, డెవలపర్లు ఇప్పుడు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి, ఖరీదైన ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి కనపడటం లేదు. ఉన్న వెంచర్లలో డెవలప్ చేసిన స్థలాలను సైతం అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. 60 శాతం కూడా సమకూరని ఆదాయం... రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పడిపోయింది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూటమి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో పాటు కూటమి పార్టీల నేతల భూ ఆక్రమణలు, బెదిరింపుల నేపథ్యంలో స్థిరాస్తుల క్రయ విక్రయాలు మందగించాయని అధికారిక లెక్కల ద్వారా తేటతెల్లమవుతోంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కప్పం కట్టనిదే నూతన వెంచర్లకు అనుమతులు ఇప్పించకపోవడంతో రియల్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు గతంలో వేసిన వాటికి సైతం బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇది ఇలా ఉండగా రెవెన్యూ కార్యాలయాల్లో కన్వర్షన్లు చేయించుకునేందుకు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పాల్సి వస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను పల్నాడు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యం రూ.664.18 కోట్లు కాగా కేవలం రూ.396.98 కోట్లు మాత్రమే సమకూరింది. లక్ష్యంలో కేవలం 60 శాతం మాత్రమే వచ్చిందటే జిల్లాలో రియల్ ఎస్టేట్ ఏవిధంగా పడిపోయిందో జరిగిందో ఆర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఆదాయ పరంగా మొదటి వరుసలో ఉండే పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెనుకబడ్డాయి. నరసరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, వినుకొండ లాంటి చోట్ల దాదాపు సగం లక్ష్యమే సాధించింది. మరోవైపు గత సంవత్సరంతో పోల్చి చూస్తే భూమి విలువ పెరిగిన కారణంగా రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం వచ్చింది తప్ప క్రయవిక్రయాలు చాలా తగ్గుముఖం పట్టాయి. అభివృద్ధిచెందుతున్న ఈ పట్టణాల్లోనే భూముల కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడమే దీనికి ప్రధాన కారణం. కూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ కొత్త వెంచర్ల ఊసేది?పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట విద్యా, వాణిజ్య, ఆరోగ్య కేంద్రంగా పేరొందింది. అటువంటి నరసరావుపేటలో గత ప్రభుత్వం హయాంలో రియల్ ఎస్టేట్ ఓ వెలుగు వెలిగింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నూతన వెంచర్లు ఏర్పాటు, అపార్ట్మెంట్ల నిర్మాణం, బ్రోచర్ల ఆవిష్కరణలతో రియల్ ఎస్టేట్ మార్కెట్ సందడిగా ఉండేది. గడిచిన 10 నెలల్లో ఒక్క కొత్త వెంచర్ కూడా రాలేదు. భూములు కొని ప్లాట్లు వేద్దామన్న ఇన్వెస్టర్లే లేరు. అంతెందుకూ గతంలో వెంచర్లలలో కట్టిన ఇళ్ల కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి. నరసరావుపేట పట్టణ, శివారు పరిధిలో ఏటా అపార్ట్మెంట్లలో వందల సంఖ్యలో ఫ్లాట్ల అమ్మకాలు జరిగేవి. కానీ గడిచిన పది నెలల్లో కనీసం 50 ఫ్లాట్లు కూడా అమ్ముడుపోలేదు. దీంతో పాటు జిల్లాలో ఇతర పట్టణాల్లో కూడా స్థిరాస్తి క్రయవిక్రయాలు మరింత దిగజారినట్టు రియల్ఎస్టేట్ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. -
108 మందికి రెండే మరుగుదొడ్లా?
నరసరావుపేట: 108 మంది విద్యార్థినులు ఉండే హాస్టల్లో రెండే మరుగుదొడ్లు ఉండటం, అవికూడా దుర్గంధం వెదజల్లటంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె పట్టణంలోని మొదటి రైల్వేగేటు సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కన్పించిన అపరిశుభ్రతను చూసి మండిపడ్డారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, సోషల్ వెల్ఫేర్ ప్రస్తుత ఇన్చార్జి పిలిపించి వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ వేణుగోపాలరావు, సీడీపీఓ సూపర్వైజర్ పాల్గొన్నారు. సేఫ్టీవాల్ నిర్మించాలి నరసరావుపేట రూరల్: రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 15రోజుల్లో సేఫ్టీవాల్ నిర్మించి పిల్లల భద్రత చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. లింగంగుంట్ల రాజుపాలెం వాటర్‌ట్యాంక్ పక్కనే ఉన్న ఎంపీపీ స్కూల్‌ను సోమవారం ఆమె సందర్శించి, పాఠశాల రికార్డులను పరిశీలించారు. పాఠశాల మరుగు దొడ్లకు 20 అడుగుల దూరంలోనే రైల్వే ట్రాక్ ఉండటాన్ని గమనించారు. పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు గుర్తించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సేఫ్టీవాల్ నిర్మించాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌ను పరిశీలించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి -
నాటికలు పరిషత్‌లకే పరిమితం కాకూడదు
యడ్లపాడు: నాటికలు కేవలం పరిషత్ ప్రదర్శనలకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజాచైతన్యానికి పాటు పడేలా చేయాలని సినీనటుడు అజయ్‌ఘోష్ చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో మూడు రోజులు నిర్వహించిన 22వ జాతీయస్థాయి పోటీల ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక రుగ్మతలపై మరిన్ని నాటికలు రచించి, గ్రామాల్లో ప్రదర్శించాలని కోరారు. ఇక్కడి నాటికల పోటీల నిర్వహణ, నిబద్ధత, వాటి ఆదరణ తీరు తెలుగురాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ విషయంలో డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు అభినందనీయుడన్నారు. ఏటా పోటీల సమయంలో యడ్లపాడు వస్తానని, తనకు ఓ నాటిక వేసే అవకాశం ఇవ్వాలని కమిటీని కోరారు. దేశాన్ని కాపాడేందుకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని ఒకరితో అంటే నీకు అడిగే అర్హత ఉందా అంటూ తనను ప్రశ్నించారని, ఓ అభిమానిగా ఽధైర్యంగా ప్రశ్నించే హక్కు ఆ ఎర్రజెండానే ఇచ్చిందని వేదిక ద్వారా స్పష్టం చేశారు. నేటి యువత కమ్యూనిస్టు పోరాట యోధుడు సుందరయ్య గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల దుస్థితిపై నాటకాలు రావాలి.. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో పేదరికం, కనీస అవసరాలు, తాగునీరు అందని అవస్థలు, కిడ్నీలు అమ్ముకునే దుస్థితిపై స్పందించి రచయితలు నాటకాలు రాయాలని కోరారు. తెలుగురాష్ట్రాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అత్యధిక నాటక పరిషత్‌లు వెలుగొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ టీవీ, సినిమా, ఓటీటీల ప్రభావం అత్యధికంగా ఉన్నా నాటక రంగాన్ని దాతలు, పరిషత్ నిర్వాహకులు, ముఖ్యంగా ప్రజలు బతికిస్తున్నారన్నారు. ఏఎన్‌యూ వైస్ చాన్స్‌లర్ కె.గంగాధరరావు మాట్లాడుతూ నాటకరంగానికి ఇంతటి ఆదరణ ఉందన్న విషయాన్ని తాను తొలిసారి చూశానని తెలిపారు. హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత పోపూరి రవిమారుతీ, సినీనటుడు నాయుడుగోపీ, వేదిక కార్యదర్శి జేవీ మోహన్‌రావు మాట్లాడిన వారిలో ఉన్నారు. సినీ నటుడు అజయ్‌ఘోష్ యడ్లపాడులో నాటకోత్సవాల ముగింపు సభ -
మోసపోయాం.. న్యాయం చేయండి
నరసరావుపేట: వివిధ రకాల కాయిన్ క్రిఫ్టో కరెన్సీ పేర్లతో తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమ డబ్బు తిరిగి ఇప్పించాలని పట్టణానికి చెందిన పలువురు బాధితులు జిల్లా ఎస్పీని కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా నలుమూలల నుంచి హాజరైన బాధితులు కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం, చోరీల సమస్యలకు సంబంధించి 88 ఫిర్యాదులు అందజేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2.50లక్షలు మోసం విజయవాడలో నాగరాజు అనే వ్యక్తి ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్ నడుపుతున్నాడు. అతని దగ్గర పని చేసే లతా ఇద్దరు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి రూ.2.50లక్షలు తీసుకున్నారు. డబ్బులు అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారించి, న్యాయం చేయండి. –వలేరు హనుమ, అచ్చంపేట తక్కువ ధరకు బంగారం అంటూ మోసం మాకు చేపూరి పూర్ణచంద్రరావు పరిచయమై తను నడికుడి ఎస్బీఐ బ్రాంచ్‌లో గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్నట్లు నమ్మబలికి బ్యాంకులో బంగారం వేలం వచ్చిందని, తక్కువ రేటుకు ఇప్పిస్తానంటూ మా వద్ద నుంచి చెరో రూ.2లక్షలు తీసుకున్నాడు. బంగారం గురించి అడిగితే వాయిదాలు వేస్తుండగా అనుమానం వచ్చి అతని గురించి విచారించామన్నారు. గతంలో నరసరావుపేటలో చీటీలు వేసి జనాన్ని మోసం చేసినట్లు, నడికుడి ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగం మానివేసినట్లు తెలిసింది. మోసం చేసిన పూర్ణచంద్రరావుపై చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి. – కొప్పుల ఉపేంద్ర, షేక్ హసన్‌వలి, కేసానుపల్లి, దాచేపల్లి మండలం మమ్మల్ని కొట్టి మాపైనే తప్పుడు కేసు మేము వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో మా ట్రాక్టర్‌ను ఉద్దేశపూర్వకంగా కొర్రా లక్ష్మణనాయక్ తన ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. గాయాలైన మేము గతేడాది సెప్టెంబరు 10న స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాం. దీంతో నాయక్, అతనికి చెందిన పదిమంది మాపై దాడిచేసి మమ్మల్ని తరిమివేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిందితుల ఫిర్యాదుతీసుకొని మాపై తప్పుడు కేసు నమోదుచేశారు. నకరికల్లు పోలీసులను పదే పదే కలవగా మా ఫిర్యాదును అప్పుడు కేసుగా ఫైల్‌చేశారు. దీనివల్ల మాకు తీరని అన్యాయం జరిగింది. ఈ రెండు ఎఫ్ఐఆర్లపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయండి. – ముడావత్ లఘుపతినాయక్, లలీత్బాయ్, శివాపురం తండా, నకరికల్లు ఆస్తికోసం మద్యం తాగి వచ్చి తిడుతున్నాడు నా మనవడు గణేష్ అతని భార్య జయలక్ష్మిలు ఆస్తి వారిపేరిట రాయమని ప్రతిరోజు అసభ్య పదజాలంతో తిడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మనవడు ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తిడుతున్నాడు. దీనిపై ఇప్పటికే గతనెల 13వ తేదీన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ రక్షణ కల్పించండి. –ముక్తవరపు పిచ్చయ్య, పాతురు, నరసరావుపేట అదనపు ఎస్పీకి ఫిర్యాదుచేసిన బాధితులు పీజీఆర్ఎస్కు 88 ఫిర్యాదులు క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.40లక్షలు మోసం హైదరాబాదు కేంద్రంగా పైతాన్ కాయిన్ క్రిప్టో రెన్స్ ఆన్లైన్ నెట్వర్క్ నిర్వహిస్తున్న నాగేశ్వర్‌కు ఏజెంట్ రవికుమార్ మాటలు విని రూ.40లక్షలు పెట్టుబడి పెట్టాం. సంస్థను ఈగల్ కాయిన్ క్రిప్టో కరెన్సీ నెట్‌వర్క్‌గా పేరు మార్చారు. మాకు అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. మమ్మల్ని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకొని మా డబ్బులు ఇప్పించాలని మనవిచేస్తున్నాం. – జి.వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సతీష్, బాలశ్రీనివాస్ తదితరులు -
ప్రాణ సంకటం
● కుక్కల స్వైరవిహారం ● గుంటూరు ప్రజలు బెంబేలు ● గాలిలో పసిప్రాణాలు ● 2017లో కుక్కల దాడిలో ఓ బాలుడి మృతి ● కొద్దినెలల క్రితం బాలికపై దాడి ● తాజా ఘటనలో మరో బాలుడు బలి ● శునకాల బారిన పడుతున్న నగరవాసులు ● జీజీహెచ్‌కు వస్తున్న కేసులు ● చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ అధికారులు నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు కుక్కకాట్లకు బలవుతున్నారు. అయినా నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి తాజాగా ఆదివారం స్వర్ణ భారతినగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ఐజక్ బలయ్యాడు. కుక్క గొంతుకరుచుకుని తీసుకుపోవడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 2017 డిసెంబర్‌లోనూ ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి కుక్క కరవడంతో చనిపోయాడు. కొద్ది నెలల క్రితం సంపత్‌నగర్‌లో ఓ బాలికపై కుక్క దాడి చేసింది. స్థానికులు కుక్కను తరిమివేయడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఏడేళ్ల క్రితం హుస్సేన్‌నగర్, ఆంజనేయ కాలనీలో 9 మందిపై వీధి కుక్కలు దాడి చేసి కండలు పీకేశాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గుంటూరులో రోజూ ఏదోచోట కుక్కకాటుకు ప్రజలు బలవుతున్నారు. జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనవరి 9 నుంచి ఆగిపోయిన ఏబీసీ ఆపరేషన్లు గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణ కోసం నగరపాలక సంస్థ గతంలో చర్యలు చేపట్టింది. ఏటుకూరు రోడ్డులో స్నేహ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ (ఏబీసీ) ఆపరేషన్లు చేయించేది. ఈ ఆపరేషన్లు చేసినందుకు గాను ఒక కుక్కకు రూ.రెండు వేల వరకూ స్నేహ సంస్థకు చెల్లించేంది. అయితే నిబంధనలు పాటించకుండా ఆపరేషన్లు జరుగుతున్నాయని, స్టేరిలైజేషన్ సక్రమంగా ఉండటం లేదని, ఆపరేషన్ ద్వారా కుట్లు కూడా సక్రమంగా వేయడం లేదని, రికార్డ్స్ సక్రమంగా నిర్వహించడం లేదని కొందరు జంతుప్రేమికులు యానిమాల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో గత ఏడాది అక్టోబర్ 18న గుంటూరుకు విచ్చేసిన యానిమల్ బోర్డ్ సభ్యులు స్నేహ సొసైటీ చేస్తున్న ఆపరేషన్లలో లోపాలున్నాయని గుర్తించి ఆపరేషన్లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో జనవరి 9 నుంచి ఏబీసీ ఆపరేషన్లు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ స్నేహ సంస్థ ఏబీసీ ఆపరేషన్లు చేసేందుకు అప్పీలు చేసుకోవడంతో జనవరి 24న యానిమల్ బోర్డ్ సభ్యులు గుంటూరు వచ్చి స్నేహ సంస్థ ఏబీసీ సెంటర్‌ను పరిశీలించారు. ఇంకా ఆపరేషన్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయని సభ్యులు తేల్చారు. నగరపాలక సంస్థ తరుఫునే ఆపరేషన్ల చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ఆపరేషన్లు చేయకుండానే బిల్లులు అధికారుల లెక్కల ప్రకారం గుంటూరు నగరంలో 31,400 కుక్కలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో సుమారు 4,500 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసినట్లు చెబుతున్నారు. వీటి కోసం రూ.37,48,500 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అయితే వీటిలో కూడా చాలా కుక్కలకు ఆపరేషన్లు చేయకుండానే చేసినట్లుగా బిల్లులు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ఇక్కడ ఇన్చార్జ్ ఎంహెచ్‌ఓగా పనిచేసిన ఓ అధికారి ఆధ్వర్యంలో ఏబీసీ ఆపరేషన్ల విషయంలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. -
ఎరువుల వ్యాపారి ఉడాయింపు
50 మంది దగ్గర రూ.2.50 కోట్లు అప్పులు చేసిన టీడీపీ నేత మాచర్ల రూరల్: ఫర్టిలైజర్ వ్యాపారి అప్పులు చేసి పరార వడం స్థానికంగా కల కలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాళం అమర నాగేశ్వరరావు ఎరువులు, పురుగు మందుల వ్యాపారం చేస్తూ గ్రామంలో సుమారు 50 మందికి పైగా రైతుల వద్ద రూ. 2.50 కోట్ల మేర అప్పులు తీసుకున్నాడు. కొందరి వద్ద పంట కొనుగోలు చేసి, మరికొందరి వద్ద ప్రామిసరీ నోట్లు, స్థలాలు, పొలాలు, అమ్మకం అగ్రిమెంట్లు రాసి నగదు తీసుకొని పరారయ్యాడు. సోమవారం గ్రామానికి చెందిన రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ బి.కిరణ్ కుమార్‌ను వినతి పత్రం అందించారు. తనకు చెందిన పొలం, ఇళ్లు, స్ధలాలు విక్రయిస్తానని అగ్రిమెంట్ రాసి రెండు రోజుల నుంచి కనిపించకుండా వెళ్లాడని, ఇంటికి తాళం వేసి సెల్‌ఫోన్ స్విచ్ ఆపి కుటుంబ సభ్యులు మొత్తం కన్పించటం లేదని వారు తహసీల్దార్‌కు తెలిపారు. అమర నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను ఇతరులకు అమ్మకుండా వచ్చే నగదును రైతులమైన మాకు చెందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీని పై స్పందించిన కిరణ్ కుమార్ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం, రూరల్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. దీంతో వారు ఆయా కార్యాలయాలకు వెళ్ళి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. ● ఇదిలా ఉండగా గత ఆరు నెలల కాలంలో సుమారు రూ. 100 కోట్ల వరకు వివిధ వ్యాపారులు ఐపీ నోటీసులు దాఖలు చేయటం మాచర్ల పట్టణంలో సంచలనం రేకెత్తిస్తుంది. అప్పులిచ్చిన వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య నకరికల్లు: తండ్రి మందలించాడనే కోపంతో బాలిక ఆత్మహత్యాయత్నాకి పాల్పడి చికిత్సపొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. మండలంలోని కుంకలగుంట గ్రామంలోని సుగాలితండాకు చెందిన రమావత్ అనూషభాయి (16) 7వ తరగతి చదువుతూ చదువు సక్రమంగా రావడం లేదని మానేసి పొలంపనులకు వెళ్తుంది. పొలంపనులకు వెళ్లవద్దని కుట్టు మిషన్ పని నేర్చుకోవాలని తండ్రి మందలించినందుకు మార్చి 31న ఎలుకల పేస్టు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యకోసం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీన మృతిచెందింది. తండ్రి హనుమా నాయక్ ఫిర్యాదు మేరకు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
మసకబారింది!
మూడో కన్ను నకరికల్లు: 2023 జూలైలో స్థానిక ఇందిరమ్మకాలనీలోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.7లక్షల నగదు, కొంత బంగారం చోరీకి గురైంది. చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు వారంరోజుల్లోనే కేసును ఛేదించగలిగారు. సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. – అదే ఏడాది ఆగస్టులో హైవే పక్కన ఉన్న ఏటీఎం ధ్వంసం చేసిన ఘటనలోను నిందితుడిని ఒక్కరోజులోనే పట్టుకోగలిగారు. అంత త్వరగా కేసులు ఛేదించడానికి పోలీసులకు ఉపయోగం పడిన ఆయుధం సీసీ కెమెరా.. ఇలా ఎన్నో కేసులను అతితక్కువ సమయంలో పోలీసులు ఛేదించగలిగారంటే అది కేవలం సీసీ కెమెరాలు అందించిన ఆధారాలే. 2023లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో 2023 సంవత్సరంలో నకరికల్లు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, అలాగే అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రూ.4 లక్షలు వెచ్చించి 28 పెద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా పోలీస్ కంట్రోల్ రూంలో రికార్డయి తెలిసిపోయేది. చోరీలు అరికట్టేందుకు, చోరీ కేసుల్లోని, రోడ్డు ప్రమాదాల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి. సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రమాదానికి కారణమై తప్పించుకుపోయిన నిందితులను వాహనాలతో సహా గుర్తించారు. ఇలాంటి ఎన్నో ఘటనలకు కారణమైన ఆధారాలను అందించిన సీసీ కెమెరాలు గత కొన్నిరోజులుగా ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. దీంతో గ్రామస్తులు మళ్లీ భయం నీడన బతకాల్సి వస్తుంది. అలంకారప్రాయంగా అద్దంకి – నార్కెట్‌పల్లి రహదారిపై ఉన్న సీసీ కెమెరా నకరికల్లులో మొరాయించిన సీసీ కెమెరాలు 2023లో రూ.4లక్షలు వెచ్చించి 28 కెమెరాలు ఏర్పాటు సీసీ కెమెరాల సాయంతో ఎన్నో కేసులు సత్వరమే ఛేదించిన పోలీసులు గత కొన్నిరోజులుగాఏ ఒక్కటీ పనిచేయని వైనం ప్రశ్నార్థకంగా మారిన భద్రత సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మళ్లీ ఇటీవల కాలంలో ఘర్షణలు, చోరీలు జరుగుతున్నాయని రోడ్డుపక్కన గృహాల వారు, శివారు ప్రాంతంలో నివాసముంటున్న వారు, దుకాణదారులు వాపోతున్నారు. వేసవి కావడంతో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుంటాయి. అందునా సెలవుల కాలంలో ఇళ్లకు తాళాలు వేసి కుటుంబసమేతంగా ప్రజలు ఊళ్లకు, యాత్రలకు వెళ్తుంటారు. ఈ నేపధ్యంలో ఆస్తుల భధ్రత ప్రశ్నార్ధకంగా మారింది. అందునా అద్దంకి – నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన గ్రామం కావడంతో చోరీలతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో జరిగిన చోరీల నేపధ్యంలో సీసీకె మెరాలు పనిచేయడం లేదన్న సమాచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతుకు గురైన సీసీ కెమెరాలు సత్వరమే వినియోగం తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రత్యేక కలెక్టర్ గాయత్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ కుముదిని, ఏఓ లీలా సంజీవకుమారి ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 152 అర్జీలను స్వీకరించారు. వచ్చిన ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పదేళ్ల నుంచి పింఛను కోసం తిరుగుతున్నాను.. నేను పుట్టుకతో దివ్యాంగురాలిని. నాకు వివాహమైంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. భర్త చనిపోయాడు. సొంత ఇల్లులేదు, గజం స్థలం లేదు. నివాసం ఉండేందుకు ఇల్లులేక పట్టలతో గూడు ఏర్పాటుచేసుకొని ఉంటున్నా. 2014లో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సదరన్ క్యాంపులో డాక్టర్లు నన్ను పరీక్షించి 73శాతం వికలాంగత్వం ఉన్నట్లుగా నిర్ధారిస్తూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ద్వారా దివ్వాంగ పింఛన్‌కోసం పలుమార్లు దరఖాస్తు చేశా. కలెక్టరేట్‌కు ఆరేడుసార్లు వచ్చా. ఇప్పటివరకు పింఛన్ మంజూరు చేయలేదు. దయచేసి ఇప్పటికై నా నాకు పింఛన్ మంజూరు చేయండి. – ముద్దా అప్పమ్మ, పెదగార్లపాడు, దాచేపల్లి మండలం పీజీఆర్ఎస్కు 152 అర్జీలు స్వీకరించిన ప్రత్యేక కలెక్టర్గాయత్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ కుముదిని పరిష్కరించకుండానే సంతకాలు చేయమంటున్నారు స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని ఆవులసత్రం పక్కనే ఉన్న కత్తవ కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాం. దీనిపై ఆక్రమణలు తొలగించాలంటూ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే అధికారులు ఆక్రమణలు తొలగించకుండానే ఆ సమస్య పరిష్కారమైనట్లుగా సంతకాలు చేయాలంటూ మాపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికై నా ఆక్రమణలు తొలగించి కత్తవ కాలువను కాపాడండి. – పీడీఎం నాయకులు, నరసరావుపేట -
ఉత్తమ ప్రదర్శన నాన్న నేనొచ్చేస్తా
● ముగిసిన జాతీయస్థాయి నాటికల పోటీలు ● ఈనెల 4వ తేదీ నుంచి 6వరకు పది నాటికలు ప్రదర్శన యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం నిర్వహించిన 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎంవీ చౌదరి కళావేదిక ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు 10 నాటికలు ప్రదర్శించారు. ప్రతిరోజూ పండుగలా నిర్వహించిన ఈ పోటీలకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. కళాభిమానులు మూడు రోజులు అర్థరాత్రి వరకు ఉంటూ కళారూపాల్ని ఆద్యంతం తిలకించి ఆస్వాదించారు. నిత్యం ప్రేక్షకులకు వెయ్యి మందికి అల్పాహారం అందించడం, ప్రతిరోజూ 30 మంది చొప్పున 90 మందికి లక్కీడ్రా తీసి బహుమతుల్ని అందించారు. 15 మంది న్యాయనిర్ణేతలు, దాతలు, కళాకారులు, అతిథులు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు జ్ఞాపికలు అందించి సత్కరించారు. ముత్తవరపు సురేష్‌బాబు సతీమణి ముత్తవరపు అరుణకుమారి లేడీ ఆర్టిస్టులను ఆడపడుచు లాంఛనాలిచ్చి సత్కరించారు. ● జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో అమృతలహరి థియేటర్ (గుంటూరు)వారి ‘‘నాన్న నేనొచ్చేస్తా’’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా యువభేరి థియేటర్స్(హైదరాబాద్) వారి ‘నా శత్రువు’ నాటిక, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్(కొలకలూరి) వారి ‘జనరల్ బోగీలు’ నాటిక నిలిచాయి. వ్యక్తిగత అవార్డులు ఉత్తమ రచయిత తాకాబత్తుని వెంకటేశ్వరరావు, ఉత్తమ దర్శకులు అమృత, లహరి, ఉత్తమ ఆహార్యం (నాన్న నేనొచ్చేస్తా), ఉత్తమ సంగీత దర్శకులు (నా శత్రువు), ఉత్తమ రంగాలంకరణ (చిరుగు మేఘం), ఉత్తమ నటీనటులు..సోమిశెట్టి అమృతవర్షిణి( నాన్న నేనొచ్చేస్తా), కావూరి సత్యనారాయణ(చిగురు మేఘం), సురభి ప్రభావతి(జనరల్ బోగీలు), గంగోత్రి సాయి (విడాకులు కావాలి), జ్యోతిరాణి (నాశత్రువు), ఉత్తమ సహాయనటులు...ఎన్.వెంకటేశ్వర్లు (కిడ్నాప్), వసంత యామిని(విడాకులు కావాలి), నాగరాణి (చిగురు మేఘం), సునయన (నా శత్రువు), వడ్దా సత్యనారాయణ(నా శత్రువు), జ్యూరీ అవార్డ్స్ మాస్టర్ మదన్(కిడ్నాప్), బేబి వర్షిణి (నా శత్రువు)లు అందుకున్నారు. కార్యక్రమంలో నాటక పరిషత్ ఉపాధ్యక్షుడు జరుగుల శంకరరావు, కార్యదర్శి ముత్తవరపు రామారావు, కోశాధికారి నూతలపాటి మాధవరావు, కాళిదాసు, ఎం.పద్మారావు పాల్గొన్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం
● జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ● పీజీఆర్ఎస్లో 300 అర్జీలు స్వీకరణ చిలకలూరిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు చెప్పారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వివిధ సమస్యలకు సంబంధించి వచ్చిన 300 అర్జీలను స్వీకరించారు. న్యాయమైన పరిహారం ఇప్పించాలి చీరాల వాడరేవు నుంచి నకరికల్లుకు రోడ్డు వేస్తున్నారు. ఇందులో మా కుటుంబానికి సంబంధించి ఐదు ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణానికి తీసుకున్నారు. బొప్పూడి వద్ద రోడ్డుకు పడమట ఉన్న పొలం ఎకరాకు రూ.1.30కోట్ల చొప్పున పరిహారం చెల్లించారు. తూర్పు వైపు పొలానికి ఎకరాకు కేవలం రూ. 33లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇది అన్యాయమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నాం. మాకు న్యాయం చేయాలి. – షేక్ అమీర్‌జానీ, బొప్పూడి దేవాలయ మాన్యం ఆక్రమించారు అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామంలో నివాసం ఉండే గుర్రం ఇంటిపేరు కలవారి కుల దేవత రేణుకమ్మతల్లి గుడికి మా పూర్వీకులు 12.5 ఎకరాల భూమి ఇచ్చారు. దేవాలయ నిర్వహణ కోసం ఈ భూమిపై వచ్చే ఆదాయం ఉపయోగిస్తాం. ఇదే గ్రామానికి చెందిన ఒకరు ఈ భూమిలో 1.59 ఎకరాలు ఆక్రమించి పట్టా పుట్టించుకున్నాడు. ఈ విషయమై పూర్తి విచారణచేసి ఆక్రమణకు గురైన భూమిని దేవాలయానికి అప్పగించాలి. – గుర్రం ఉపేంద్ర, గుర్రం సత్యనారాయణ, అమీన్‌సాహెబ్‌పాలెం శ్మశానం అభివృద్ధి చేయాలి పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో 2.62 ఎకరాల్లో హిందూ, క్రైస్తవులకు కలిపి ఉమ్మడిగా శ్మశానవాటిక ఉంది. ఇందులో ఇప్పటికే 62 సెంట్లు అక్రమణలకు గురైంది. మిగిలిన రెండు ఎకరాల్లో ఒక ఎకరంలో హిందువులు, మరో ఎకరంలో క్రైస్తవులు ఉపయోగించుకుంటున్నారు. దీనిని అధికారికంగా రెండు వర్గాల వారికి పంచిపెడితే అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉంటుంది. – కందా భాస్కరరావు, చిలకలూరిపేట ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొర్రపాటి ఆదినారాయణ అనే వ్యక్తి నా వద్ద నుంచి రూ.2లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడు. పెద్ద మనషులతో అనేక పర్యాయాలు అడగ్గా రూ.1.20 లక్షలు చెల్లించాడు. ఇంకా రూ. 80 వేలు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఇప్పటికే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలి. – గాలం సదాశివ బ్రహ్మం, చిలకలూరిపేట పెంచుకున్న వాడే మోసం చేశాడు ఎవరూ లేని అనాఽథ అని చెప్పి నక్కా వెంకటేశ్వరరావును పెంచి పెద్ద చేశాం. ఇల్లు కూడా కట్టించి ఇచ్చి వివాహం చేశాం. క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి ఆస్తి మొత్తం పోగొట్టాడు. వాడి పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదని నా వద్దకు వచ్చి బాధపడితే ఆరు సవర్ల బంగారు గాజులు తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు అడిగితే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. వృద్ధురాలిలైన నేను పక్షవాతంతో బాధపడుతున్నాను. అధికారులు నాకు న్యాయం చేయాలి. – నగరి లక్ష్మి, చిలకలూరిపేట -
ఇంటర్ అడ్మిషన్లు చేపట్టండి
నరసరావుపేట ఈస్ట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలను చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. ఈమేరకు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు తెలియచేసినట్టు వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల కళాశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, గిరిజన సంక్షేమ కళాశాలలు తదితర ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థుల ప్రవేశాలను పెంచేలా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలను విద్యార్థుల దృష్టికి తీసుకవెళ్లాలన్నారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టినట్టు వివరించారు. కాగా, ఇంటర్ ఫలితాలను రెండవ వారంలో విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తుందని తెలిపారు. ముప్పాళ్లలో భారీ వర్షం ముప్పాళ్ళ: ముప్పాళ్లలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమవడంతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడితో అల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ ఈదురుగాలులతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కళ్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిరప, పసుపు పంట దిగుబడులు తడవకుండా కాపాడుకునేందుకు పట్టలు కప్పేందుకు పరుగులు పెట్టారు. ఇప్పటికే పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని, తడిస్తే కొనేవారు ఉండరని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సాయి కల్యాణ చక్రవర్తి గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బి.సాయి కల్యాణ్‌చక్రవర్తి నియమితులయ్యారు. రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న కొందరికి పదోన్నతి, మరికొందరికి స్థాన చలనం కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న బి సాయి కళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వై.వి.ఎస్.బి.జి.పార్థసారథిని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా నియమించారు. గుంటూరు నగరంలో పర్యటించిన ఐజీ పట్నంబజారు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం గుటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆనందపేటలో జరిగిన వృద్ధురాలు పఠాన్ ఖాజాబీ హత్య, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో సంబంధిత కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ఆనందపేట 2వలైనులో హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ఐజీ వెంట ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య తదితరులు ఉన్నారు. యార్డుకు 1,53,787 మిర్చి బస్తాలు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,53,787 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,37,288 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,276 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రైవేటీకరణ మానుకోవాలి
పిడుగురాళ్ల: ఆరోగ్యశ్రీ ట్రస్టును ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీకి సంబంధించి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలలకు రూ.3500 కోట్ల బకాయిలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్టును ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగించి వారికి అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందన్నారు. కార్పొరేటు వైద్యులు అడ్వాన్స్‌లు అడగటం లేదని, ముందుగా వైద్యం చేసి ఆ తర్వాత అడుగుతున్నారని, కానీ అవి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. నిర్వీర్యం చేసే కుట్ర ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మాన్ భారత్ ద్వారా పల్లెలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2019 వరకు 1800 రోగాలకు ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందించే పరిస్థితి ఉండేదని, 2019 తర్వాత మహానేత తనయడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 వేల రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి మరింత బలోపేతం చేశారన్నారు. సంవత్సరానికి రూ.7500 కోట్లు ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ముందస్తుగా ఇచ్చే కంటే రూ. 4 వేల కోట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టుకి ఇస్తే మెరుగైన వైద్యం రాష్ట్రంలోని పేదలకు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రను కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందకుండాచేసేందుకు కూటమి కుట్ర ఇప్పటివరకు రూ.3,500 కోట్ల బకాయిలు బీమా కంపెనీలకు ఏడాదికి రూ.7500 కోట్లు ముందుగా చెల్లిస్తామనటంలో మర్మమేంటి? వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ -
సత్వరమే బాగు చేయించాలి
సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉన్నప్పుడు గ్రామంలో ఏ చోరీ జరిగినా నిందితులను కొద్దిరోజుల్లోనే పోలీసులు పట్టుకున్న ఘటనలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో సైతం చోరీలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా నిలువరించగలిగారు. ఇప్పుడు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చోరీల బెడద అధికంగా ఉంటుంది. హైవేపై కూడా నిఘా పెట్టాలి. చోరీలు అరికట్టాలంటే ఉన్న కెమెరాలనే సత్వరమే మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలి. – ఈవూరి లక్ష్మారెడ్డి, నకరికల్లు -
తామరపూల కోసం చెరువులో దిగి విద్యార్థి మృతి
వినుకొండ: శ్రీరామనవమి పర్వదినం రోజున వినుకొండ రూరల్ మండలం నడిగడ్డ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట కోటయ్య, మంగమ్మల కుమారుడైన తోట లక్ష్మణరావు (16) ఇటీవల టెన్త్ క్లాసు పరీక్షలు రాసి ఇంటి దగ్గర ఉంటున్నాడు. పండుగ కావడంతో గ్రామ సమీపంలో చెరువులో తామర పుష్పాలు తీసుకొచ్చి పూజ చేద్దామని చెరువులోకి దిగాడు. ఈ క్రమంలోనే కాలుజారి చెరువులో పడి నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనతో కుటుంబం, గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. పండుగ పూట విషాదం జరగడంతో గ్రామస్తులు కుటుంబసభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. -
సందేశాత్మకం.. హాస్యభరితం
యడ్లపాడు: స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం మూడు సందేశాత్మక నాటికలు ఎంవీ కళావేదికపై ప్రదర్శితం అయ్యాయి. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, అరుణకుమారి దంపతులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళానిలయం ప్రతినిధులు ముత్తవరపు రామారావు, పద్మారావు, నూతలపాటి కాళిదాసు, జరుగుల రామారావు, శంకరరావు తదితరులు పర్యవేక్షించారు. ఆడ పిల్లలకు సందేశం ‘నాన్న నేనొచ్చేస్తా’ పెళ్లంటే సర్దుబాటు.. సంసారం అంటే దిద్దుబాటు అనే విషయాన్ని మహిళలు తెలుసుకోవాలనే సందేశాన్ని గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన నాన్న నేనొచ్చేస్తా నాటిక ద్వారా ఇచ్చారు. ప్రతి తల్లితండ్రి మనసులో ఉండే పరమశక్తి ప్రేమ. పిల్లలు ఎదగాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, తాము పొందలేనిది వారికి ఇవ్వాలన్న తపన తల్లిదండ్రుల్లో ఉండటం సహజం. కానీ వివాహం తర్వాత వచ్చిన సమస్యల్లో, తల్లిదండ్రుల అభిమానం వల్ల ఆడపిల్లలకు సహనశక్తి తక్కువైపోతుంది. బాధ్యతను విడిచిపెట్టి, భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు, సమాజంలో వేళ్లూనుకున్న ‘అత్యధిక అనురాగం’ అనే కొత్త వ్యాధికి నిదర్శనమని ప్రదర్శన ద్వారా హెచ్చరిక చేశారు. తాకబత్తుల వెంకటేశ్వరరావు రచన చేయగా, అమృత లహరి దర్శకత్వం వహించారు. అందరిలోనూ కనిపించే మంచితనం ‘బ్రహ్మ స్వరూపం’ స్వచ్ఛమైన దృష్టితో చూస్తే ప్రతి వ్యక్తిలోనూ మంచితనం కనిపించి ప్రపంచం మమకారాల నిలయంగా అనిపిస్తోందనే విజయవాడ మైత్రి కళానిలయం వారు తమ కళారూపం ద్వారా చూపే ప్రయత్నం చేశారు. శాంతియుత జీవితంలోకి ఊహించని కష్టాలు వస్తే, ప్రతికూల శక్తుల రూపంలో విధి విఘాతం కలిగిస్తే, నిరాశ నిస్పృహాలతో ఉన్న ఆ క్షణాన ధర్మస్థాపనకై సాక్షాత్తూ బ్రహ్మస్వరూపం ప్రత్యక్షమై, తుదితీర్పును ప్రసాదిస్తాడని సందేశాన్నిచ్చే కథాంశమే ఈ నాటిక. శ్రీ స్నిగ్ధ రచించగా, టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు. సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో జాతీయస్థాయి నాటికల ప్రదర్శన యడ్లపాడులో ఎంవీ చౌదరి వేదికపై ప్రదర్శనలు మూడోరోజు అలరించిన మూడు నాటికలు కడుపుబ్బ నవ్వించిన ‘బావా ఎప్పుడు వచ్చితివి’ కుటుంబ సంబంధాలు మరింత బలపడాలంటే అమ్మ, నాన్న, అక్క, బావ వంటి ప్రేమతో నిండిన పిలుపులే రుజువులు. అవి అనురాగాలకు మూలస్తంభాలుగా నిలుస్తాయి. వీటిని హృద్యంగా, హాస్యరసంతో హత్తుకునేలా వినోదాన్ని అందించిన యడ్లపాడు మానవతా సంస్థ నాటిక ‘బావా ఎప్పుడు వచ్చితివి’. ఈ నాటికలో కుటుంబ పిలుపులు అర్థభేదాలకూ, అపోహలకూ దారితీయగలవని, కొన్నిసార్లు మహిళల మనోభావాల్ని గాయపరచగలవని, భర్తకు అవమానం గానీ, అనుమానం గానీ కలిగించగలవని ఆద్యంతం హాస్యాన్ని మేళవించి కడుపుబ్బ నవ్వించారు. స్వర్గీయ పీవీ భవానీప్రసాద్ రచించగా, సినీదర్శకుడు జరుగుల రామారావు దర్శకత్వం వహించిన ఈ నాటికలో యడ్లపాడుకు చెందిన కళాకారులు ప్రదర్శించిన ప్రత్యేక ప్రదర్శన ఆహుతుల్ని ఎంతో ఆకట్టుకుంది. -
నటనకు మూలం రంగస్థలమే!
యడ్లపాడు: టీవీ, సినిమా, వెబ్‌సిరీస్, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి సాధించినా అన్నింటికీ మూలం రంగస్థలం అన్నది నిజం. అది అనంతమైనది.. అజరామరమైనదని ప్రముఖ సినీ నటుడు అజయ్‌ఘోష్ పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయంలో మూడోరోజు ఆదివారం జరిగిన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబుతో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. సామాన్య ప్రేక్షకుడిగానే వచ్చాను.. వెండితెర, బుల్లితెర, ఓటీటీ వంటి విభాగాలెన్ని ఉన్నా అందులో నిలదొక్కుకోవాలంటే నాటకరంగం నుంచి వచ్చిన కళాకారులకే సాధ్యమవుతుందని అజయ్‌ఘోష్ తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు తమ ప్రతిభను చాటి ఆయా పరిశ్రమల్లో రాణించగలుగుతారన్నారు. సుందరయ్య కళానిలయం వారు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినా, తాను మాత్రం వినోదంతో పాటు సందేశాల్ని అందించే పరిషత్ నాటికలను వీక్షించేందుకు వచ్చిన ఓ సామాన్య ప్రేక్షకుడినే వచ్చానని తెలిపారు. నాటక రంగం అంటే తనకెంతో ఇష్టమని, నిరంతరం దానినుంచి చాలా విషయాలను నేర్చుకునేందుకే ఎక్కువగా ఇష్టపడతానని తెలిపారు. ముఖ్యంగా నాటక రచన, అందులోని మాటలు, కళాకారుల నటనా చాతుర్యం తనకెంతో స్ఫూర్తినిస్తాయన్నారు. తాను రంగస్థలంలో నిత్య విద్యార్థినేనని తెలిపారు. సమాజ మార్పుకోసం కృషి అభినందనీయం.. యడ్లపాడు అభ్యుదయ, కమ్యూనిజం భావజాలం కలిగిన గ్రామమని, సంస్కృతికి కళలే ఆయువు పట్టన్నారు. సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో గత 22 సంవత్సరాలుగా నాటకోత్సవాలను నిర్వహించడం అద్భుతమని కొనియాడారు. వీటి నిర్వహణ కోసం అందరూ సమష్టిగా కృషి చేయడం అభినందనీయమన్నారు. కళాకారులు, రచయితలు, దర్శకులను తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించడం, కళాసేవల్ని అందించిన ప్రముఖుల్ని పురస్కారంతో సత్కరించడం, మహిళా ఆర్టిస్టులకు ఆడపడుచు లాంఛనాలతో సారెనిచ్చి సత్కరించడం పల్లె సంస్కృతికి నిదర్శనమన్నారు. సుదీర్ఘ కాలంగా కళల్ని, కళాకారుల్ని ఇతోధికంగా ప్రోత్సహిస్తూ కళామతల్లి సేవలో తరలిస్తున్న గ్రామస్తులు ప్రశంసనీయులని తెలిపారు. స్ఫూర్తినిచ్చేవి నాటకాలే... నేర్చుకోవాల్సింది అక్కడే సినీ నటుడు అజయ్‌ఘోష్ యడ్లపాడు జాతీయస్థాయి నాటకోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరు -
పాస్టర్ మృతిపై విచారణకు డిమాండ్
వేటపాలెం: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ చార్లెస్ ఫీన్నీ డిమాండ్ చేశారు. ఆదివారం వేటపాలెం క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆధ్వర్యంలో వందల మందితో దేశాయిపేట నుంచి వేటపాలెం గడియార స్తంభం సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాలను హత్య చేశారనే నమ్ముతున్నామని, ఒక దైవజనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఒక్క ప్రవీణ్‌ను చంపితే వందలాది మంది ప్రవీణ్‌లు పుట్టుకొస్తారని పేర్కొన్నారు. అన్నాలదాసు భాస్కర్‌రావు, పాస్టర్ సత్యంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రగోరి, మండల దైవసేవకులు, మహిళలు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ పదవి రాక తమ్ముళ్ల నైరాశ్యం పర్చూరు(చినగంజాం): పర్చూరు ఏఎంసీ చైర్మన్ పదవి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలను ఊరించి ఉసూరుమనిపించింది. ఇది పర్చూరు నియోజకవర్గ పరిధిలో అతి పెద్ద నామినేటెడ్ పదవి. శాసన సభ్యుడి తరువాత నియోజకవర్గంలో అంతటి హోదా కలిగిన పదవి కావడంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇటీవల పలువురు టీడీపీ నేతలు దీనిని ఆశించి భంగపడ్డారు. ఆశావహులు నుంచి స్థానిక శాసనసభ్యుడిపై ఒత్తిడి తీవ్రమైంది. పర్చూరు నుంచి తొలుత ఏఎంసీ చైర్మన్ పదవి జనరల్ మహిళ కావడంతో బోడవాడ, నూతలపాడు, కొల్లావారిపాలెం, జాగర్లమూడి, స్వర్ణ, చినగంజాం గ్రామాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని రిజర్వేషన్ కేటగిరీని మార్చి బీసీలకు వచ్చేలా చేశారు. కష్టపడి పార్టీ గెలుపు కోసం ఖర్చుపెట్టి పని చేస్తే తమకు చైర్మన్ పదవి దక్కలేదని పలువురు టీడీపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారు. తమ ఆవేదనను సన్నిహితుల వద్ద వెలిబుచ్చారని సమచారం.భారీ ర్యాలీకి తరలివచ్చిన వందల మంది క్రైస్తవులు -
వైభవంగా ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల
నాదెండ్ల: మండలంలోని ఎండుగుంపాలెం గ్రామంలో కొలువైయున్న అక్కాయగుంట సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం, నూజెండ్లపల్లి అమ్మవారి దేవస్థానం తిరునాళ్ల మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. దేవస్థాన కమిటీ చైర్మన్ సాగి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆలయ పూజారి వివేక్‌వర్మ ఉదయాన్నే స్వామివారిని అలంకరించి పూజాభిషేకాలు, గోత్రనామ పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇర్లపాడు, ఎండుగుంపాలెం గ్రామం, రాజుపాలెం, బుక్కాపురం, గంగన్నపాలెం మొక్కుబడుల ప్రభలు తరలివచ్చాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఆలయం గ్రామ శివారులో ఉండటంతో దారి పొడవునా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రెండు భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు మజ్జిగ, మంచినీరు, పానకం, వడపప్పుతో పాటూ భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలను గ్రామ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పొట్టేళ్లతో బండి కట్టి గ్రామ ప్రభను తరలించటం భక్తులను ఆకట్టుకుంది. -
ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్ : కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నుంచి వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాజావలి కథనం ప్రకారం కుంచనపల్లి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 8వ ఫ్లోర్లో తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన పాటిబండ్ల సదాశివరావు (53) ఆయన భార్య మాధవి, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం బాల్కనీలో వాకింగ్ చేస్తుండగా సదాశివరావు కళ్లుతిరిగి 8వ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు.ప్రయాణికుడికి బ్యాగు అప్పగింతఇంకొల్లు(చినగంజాం): ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగును ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండులోని కంట్రోలర్ తిరిగి అప్పగించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పంచాయతీ గుమస్తా జితేంద్రరెడ్డి ఆదివారం పని నిమిత్తం ఒంగోలు నుంచి ఇంకొల్లుకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. బస్సులో బ్యాగును మరచిపోయారు. కంట్రోలర్ బాబుకు చెప్పడంతో వెంటనే ఆయన సదరు బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేసి బ్యాగు తిరిగి తెప్పించి యజమానికి అప్పగించారు. -
పోరాట యోధుడు పాపిరెడ్డి
గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ సోషలిస్ట్ ఫ్రంట్ యోధుడు మోదుగుల పాపిరెడ్డి (88) ఆదివారం కన్నుమూశారు. ఈయన వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తండ్రి. పాపిరెడ్డి పౌర హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. పాపిరెడ్డి ప్రస్థానం మోదుగుల పాపిరెడ్డి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో 1937 అక్టోబర్ 9న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన ఎంఏ, ఎల్ఎల్బీ వరకూ చదివారు. 1961లో గుంటూరులో న్యాయవాది వృత్తిలో కొనసాగారు. విద్యార్థి దశలోనే ఆయన సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. సోషలిస్ట్ పార్టీకి తన జీవితాన్ని అంకితం చేశారు. 1955లో రామ్మనోహర్ లోహియా గుంటూరుకు వచ్చినపుడు ఆయన ప్రసంగాలతో పాపిరెడ్డి ప్రభావితమయ్యారు. లోహియాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. సోషలిస్ట్ ఉద్యమ నేతలైన మధుమిమాయో, రాజ్‌నారాయణ్, మధుదండావతే, జార్జి ఫెర్నాండేజ్ తదితరులతో కలిసి జాతీయస్థాయిలో పనిచేశారు. 1975లో లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని ఐదు నెలలు అజ్ఞాత జీవితం గడిపారు. 1975 నవంబర్ 14న అరెస్టు అయ్యారు. 1977 జనవరి వరకు రాజమండ్రి, సికింద్రాబాద్ జైళ్లలో ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. పాపిరెడ్డితోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకులు జూపూడి యజ్ఞనారాయణ, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాతా జనార్దనరావు తదితరులు జైల్లో కలిసి ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని కాండ్లరేవు సత్యాగ్రహంలో జార్జిఫెర్నాండేజ్తో కలిసి పాపిరెడ్డి పాల్గొన్నారు. ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. కార్మికుల ఆకలిచావులను నిరసిస్తూ 1989లో గుంటూరు కలెక్టరేట్ వద్ద పాపిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపిరెడ్డి తెలుగు భాషాభిమాని. తమిళనాడులో హోనూరు, కృష్ణగిరి జిల్లాల్లో పాదయాత్రలు జరిపి తెలుగు భాషాభివృద్ధి కోసం పోరాడారు. బరంపురంలో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభల విజయానికి చీఫ్ పాట్రన్‌గా ఎంతో కృషిచేశారు. అఖిల భారత తెలుగు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై భాష కోసం పాటుపడ్డారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పాపిరెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రజల స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ హరిస్తుందంటూ గళమెత్తారు. పాపిరెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందించింది. వందలాది పురస్కారాలు పాపిరెడ్డిని వరించాయి. ఆయన సేవా కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. పెదపరిమి గ్రామంలో ఆర్సీఎం స్కూలు కమిటీ కన్వీనర్‌గా పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తాడికొండలో సత్యసాయిబాబా కళాశాల పాలకవర్గ సభ్యుడిగా పనిచేశారు. పెదపరిమి గ్రామంలో వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు. పలువురి సంతాపం మోదుగుల పాపిరెడ్డి మృతి వార్త తెలిసి గుంటూరు జిల్లాతోపాటు పలు జిల్లాల్లో ఆయన ఆత్మీయులు, అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వణుకూరి శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఇన్చార్జ్ సుధీర్ భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, మోపిదేవి వెంకటరమణ, కోవెలమూడి రవీంద్ర, రాయపాటి శ్రీనివాస్, రావెల కిషోర్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, బీజేపీ నేత జూపూడి రంగరాజు ఉన్నారు. ఒకే జైలులో ఉన్నాం : యలమంచిలి శివాజీ పాపిరెడ్డి మృతికి రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో పాపిరెడ్డి తాను ఒకే జైలులో ఉన్నామని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్‌కుమార్ కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. అంబటి నివాళి పాపిరెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాళి అర్పించారు. పాపిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. జీవితమంతా ప్రజల కోసం తపించిన నేత సేవా కార్యక్రమాల్లోనూ ముందు ప్రముఖుల సంతాపం -
సాగర్ కాల్వలో దూకిన వృద్ధుడు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మునగాల సుబ్బారావు(63) అనే వృద్ధుడిని విజయపురిసౌత్ ఎస్ఐ మహమ్మద్ షఫీ తన సిబ్బందితో కలిసి కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సుబ్బారావు ఆదివారం సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్ఐ షఫీ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయంతో కొట్టు మిట్టాడుతున్న సుబ్బారావును తాళ్లు వేసి బయటకు తీశారు. సుబ్బారావు సురక్షితంగా బయటపడటంతో ఎస్ఐ షఫీ, ఏఎస్ఐ సోమలా నాయక్, కానిస్టేబుల్ సురేష్, గోపి, హనుమా నాయక్‌లను స్థానికులు అభినందించారు. కాపాడి ఒడ్డుకు చేర్చిన పోలీసులు -
క్రికెట్ పోటీల్లో సత్తెనపల్లి పోలీసుల సత్తా
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో సబ్ డివిజన్ పోలీసులు సత్తా చాటారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శరభయ్య గుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో న్యాయవాదులకు, సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులకు(సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు) ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జరిగాయి. సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ్‌కుమార్‌రెడ్డి టాస్ వేయగా టాస్ గెలిచిన న్యాయవాదులు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ పోటీల్లో పోలీసు జట్టు 16 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు 69 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 50 పరుగులు తేడాతో సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీసులు గెలుపొందారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను వేలిముద్రల విభాగం ఇన్స్పెక్టర్ రహీమ్ కై వసం చేసుకున్నారు. పోలీసుల జట్టుకు పట్టణ సీఐ బి.బ్రహ్మయ్య కెప్టెన్‌గా వ్యవహరించగా న్యాయవాదుల జట్టుకు న్యాయవాది పొత్తూరి హరి మణికంఠ కెప్టెన్‌గా వ్యవహరించారు. విజేతలకు సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ్ కుమార్ రెడ్డి కప్పు అందించి అభినందించారు. ఆయనతోపాటు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ మహమ్మద్ గౌస్ ఉన్నారు. క్రికెట్ పోటీల్లో ప్రతిభ చాటిన సబ్ డివిజన్ పోలీస్ జట్టును సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు. కాగా తొలుత పోటీలను సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం రెండు జట్లను పరిచయం చేసుకొని కరచాలనం చేశారు. బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభింపజేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు ఎం.సంధ్యారాణి, పవన్ కుమార్, పాల్ రవీంద్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు చిన్నం.మణిబాబు, న్యాయవాదులు, సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు, తదితరులు ఉన్నారు. -
రైతుకు కష్టం
అకాల వర్షం..నాదెండ్ల: అకాల వర్షం రైతుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో నాదెండ్ల, గణపవరం, తూబాడు తదితర ప్రాంతాల్లో సుమారు అర్ధగంట సేపు వాన కురిసింది. కళ్లాల్లో ఆరబోసిన మిర్చిని రైతులు పట్టలు కప్పుకుని కాపాడుకున్నారు. పొగాకు ఆకులను రైతులు కట్టి పొలాల్లోనే ఆరబెట్టుకోగా వర్షానికి తడిచాయి. దీంతో నాణ్యత లోపిస్తుందని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు మాత్రమే కుట్టిన ఆకులై పట్టలు కప్పుకున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచ్చిన మిర్చి తడిచింది. మార్కెట్లో మిర్చి పొగాకు ధరలు పతనం కావడంతో ఈ అకాల వర్షం మరింత నష్టపరుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిలకలూరిపేట టౌన్: చిలకలూరిపేటలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అప్పటివరకు ఎండగా ఉండగా, ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని, కొద్ది సేపట్లోనే చల్లని గాలులు వీస్తూ మోస్తరు వర్షం మొదలైంది. తర్వాత అది భారీవర్షంగా మారి గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షపు నీటితో పట్టణంలోని పలుచోట్ల కాలువలు నిండి మురుగునీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి హైవే పైకి కొంత నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గొట్టిపాడులో పిడుగుపాటు.. మండల పరిధిలోని గొట్టిపాడు గ్రామంలో వర్షం మధ్య పిడుగుపాటు కలకలం రేపింది. గ్రామంలో ఉన్న తాటిచెట్టు పై ఒక్కసారిగా పిడుగు పడింది. క్షణాల్లో మంటలు చెలరేగి తాడిచెట్టుతో పాటు చుట్టు ఉన్న చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
కూటమి కాదిది.. కుట్రల ప్రభుత్వం
మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ భార్య సురేఖ మాచర్ల రూరల్: ఇది కూటమి ప్రభుత్వం కాదని.. కక్షల, కుట్రల ప్రభుత్వమని సెలవులో ఉన్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ సతీమణి తురక సురేఖ ఆరోపించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన భర్త తురక కిషోర్‌ను ఒక కేసులో ఇరికించి నిందితుడిగా అదుపులోకి తీసుకొని బెయిల్ పై బయటకు వచ్చే సమయంలో అనేక కేసులు బనాయిస్తూ 90 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉంచటం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా పనిచేస్తున్న రాజకీయ నాయకుడిపై పీడీ యాక్టు ఎలా నమోదు చేస్తారని ఆమె ప్రశ్నించారు. బెయిల్‌పై బయటకు వస్తాడేమోనని కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ కక్ష పూరిత ధోరణితో అనేక కేసులు పెట్టిందని, నాగార్జున సాగర్ కేసులో అక్రమంగా ఇరికించి తమ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు. కూటమి నేతలు తన భర్త కిషోర్‌తో పాటు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న, జర్నలిస్టుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఇరువురు సోదరులపై కూడా అక్రమంగా కేసులు పెట్టారన్నారు. మూడు సంవత్సరాల చిన్నారి, ఆరు నెలల పాపతో తాను భర్త కోసం నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి జైళ్ల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రిళ్లు ఇంటిపై దాడులు చేస్తున్నారు.. కుటుంబం చిన్నాభిన్నమైన పరిస్థితిలో వేరే చోట తలదాచుకుంటుంటే ఆ ఇంటిపై కూడా అర్థరాళ్లు గడ్డపారతో కిటికీలు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. రాజకీయంగా రాగ ద్వేషాలుంటే అంతవరకే చూసుకోవాలని, తమ కుటుంబంపై దాడులు చేస్తూ, కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా కూటమి నేతలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నకరికల్లు: రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చల్లగుండ్ల సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై శనివారం జరిగింది. సంఘనటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురజాల మండలం గోగులపాడు గ్రామానికి చెందిన గోవిందరాజు(40) రోడ్డుపక్కన తన ద్విచక్ర వాహనాన్ని పెట్టి రోడ్డు దాటేందుకు నడిచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పిడుగురాళ్ల వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలయ్యాడు. 108లో నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. విద్యుత్‌షాక్‌తో వ్యక్తి.. చిలకలూరిపేట టౌన్: విద్యుత్ షాక్‌కు వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన బాణావత్ భీమానాయక్ (52) గడియారస్థంభం సెంటర్లోని పలు షాపుల్లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. అబ్దుల్లా షాపులో పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గీతామందిరం ఎదుట వైన్‌షాపు ఏర్పాట్లు దుర్మార్గం
సత్తెనపల్లి: పట్టణంలోని గార్లపాడు సెంటర్లో గల గీతామందిరం ఎదురు వైన్‌షాపు పెట్టాలనుకోవడం దుర్మార్గమని వాసవీ క్లబ్ వైస్ గవర్నర్, ఆర్యవైశ్య సంఘ పట్టణ మాజీ అధ్యక్షుడు ఆత్మకూరి హరేరామ చెంచయ్య అన్నారు. పట్టణంలోని కట్టమూరివారి వీధిలోని ఆర్యవైశ్యులు శనివారం గీతామందిర్ దేవాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరేరామ చెంచయ్య మాట్లాడుతూ పట్టణంలోని పాత గ్రంథాలయం పక్కనే ఎప్పటినుంచో గీతా మందిరం దేవాలయం ఉందని దానికి ఎదురుగా నూతన మద్యం దుకాణం ఏర్పాటుకి పనులు చేస్తున్నారన్నారు. అక్కడ మద్యందుకాణం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆర్డీఓ, ఎకై ్సజ్ సీఐ, తహసీల్దార్లకు మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరాదంటూ వినతి పత్రం ఇచ్చామన్నారు. వైన్‌షాపు ఏర్పాటును మానుకోవాలని హితవు పలికారు. ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షుడు అన్నం సుబ్రహ్మణ్యం, నాయకులు శ్రీను, రాధ కృష్ణ, గోపాల్, రాము, ఆర్కె, మహిళలు ఉన్నారు. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీయొద్దు వాసవీ క్లబ్ వైస్ గవర్నర్ ఆత్మకూరి హరేరామ చెంచయ్య -
సమతావాది బాబూ జగ్జీవన్ రామ్
మాచర్ల: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మాచర్ల పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన ఎస్సీ, గిరిజన సంఘాల నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకుల తో కలిసి పీఆర్కే జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాతావాది బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు ఎనలేనివన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన పాటు పడ్డారన్నారు. ఆయన అడుగుజాడల్లో వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. జగ్జీవన్‌రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాచర్ల ఎంపీపీ కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాచర్ల సుందరరావు, బి.మరియమ్మ, కౌన్సిలర్లు సంతోష్, అల్లి జీవన్, ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.చంద్రశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర సభ్యుడు వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు -
అలరిస్తూ.. ఆలోచింపజేస్తూ..
కొనసాగుతున్న సుందరయ్య కళానిలయం జాతీయస్థాయి నాటికల పోటీలు యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు రెండోరోజైన శనివారం కొనసాగాయి. రెండు రోజులు జరిగిన ఆరు ప్రదర్శనలు బంధాలు, వాటి విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి గురించి వివరించాయి. నాటికలోని ప్రతి సంఘటన సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఆలోచనలను రేకిస్తుంది. ఈ కళారూపాల్ని తిలకించేందుకు కళాభిమానులు అధిక సంఖ్యలో తరలి రావడం, అర్థరాత్రి వరకు అన్ని ప్రదర్శనల్ని ఎంతో ఆసక్తిగా తిలకించడం విశేషం. మానవ సంబంధాల్లో శూన్యతను ప్రశ్నించే ‘నా శత్రువు’.. ఆధునిక జీవనశైలిలో టెక్నాలజీ ఆధిపత్యాన్ని కేంద్రంగా తీసుకుని, మానవ సంబంధాల్లో ఎదురవుతున్న శూన్యతను బహిర్గతం చేస్తున్న ఇతివృత్తం ‘నా శత్రువు’ నాటిక. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, సోషల్ మీడియా వంటివి సమయాన్ని మింగేస్తూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని ఈ నాటిక స్పష్టంగా చూపిస్తుంది. కుటుంబ సంబంధాలు, అనుబంధాల విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ నాటిక ఒక హెచ్చరికగా నిలుస్తుంది. జయభేరీ థియేటర్స్ హైదరాబాద్ వారు సమర్పించిన ఈ నాటికను అక్కల తామేశ్వరయ్య రచించగా వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ●అదేవిధంగా ఆధునిక ఆడపిల్లల స్వతంత్ర భావనలు వివరిస్తూ.. ఆడపిల్లలు భారం అన్నట్టుగా నమ్మే వక్ర భావజాలాన్ని సూటిగా విమర్శించిన ‘రుతువు లేని కాలం’, ఓ సామాన్య మహిళ రైల్వే శాఖపై సంధించిన అస్త్రంగా సాగిన ‘జనరల్ బోగీలు’ నాటికలు ఆలోచింపజేశాయి. -
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ వినుకొండ: వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు, జమైత్ – ఉల్ – ఉలేమా, జమైత్ ఇస్లాం–ఎ–హింద్ సహా పలు మైనార్టీ సంస్థలు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాయన్నారు. దేశంలో 14.6 శాతం ఉన్న ముస్లింల అభ్యంతరాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్‌బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్లుగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం భూములను వితరణ చేయాలనడం.. ఇవన్నీ ముస్లింల మనోభావాలను దెబ్బతిసే వ్యతిరేక చర్యలు అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఈ బిల్లును వ్యతిరేకించిందని గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. కౌన్సిలర్లు గౌస్‌బాషా, షేక్ రఫీ, మైనార్టీ నాయకులు హఫీజ్, గౌస్‌బాషా, హిప్పీ, జానీ, అయాజ్, అమీర్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. -
సేవా దృక్పథం అలవరచుకోవాలి
అమరావతి: విశ్రాంత ఉద్యోగులు సేవాదృక్పథం అలవరచుకోవాలని పల్నాడు జిల్లా పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు మానం సుబ్బారావు అన్నారు. శనివారం అమరావతి యోగాశ్రమంలో నిర్వహించిన అమరావతి, పెరుకూరపాడు మండలాల యూనిట్ ప్రభుత్వ పెన్షనర్ల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈసమావేశానికి స్థానిక పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు అధ్య క్షత వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ ఉద్యోగంలో ఉన్నంతకాలం సర్వీసు చేయటమే కాకుండా రిటైర్ అయిన తరువాత కూడా సమాజం పట్ల బాధ్యతతో మెలగాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సి.ఆదెయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అదనపు క్వాంటుకు పెన్షన్‌ను పెంపుదల చేయాలన్నారు. సైబరు నేరాలు, మోసాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కోశాధికారి ఎంఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. వెంటనే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండు చేశారు. ప్రధానకార్యదర్శి కె.సిహెచ్. తిమ్మయ్య, వై.సుబ్బారావు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఎన్.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
కంది రైతులకు సౌభాగ్యం
కారెంపూడి: గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (లాంఫాం) శాస్త్రవేత్తలు రూపొందించిన నూతన కంది రకం ఎల్‌ఆర్‌జీ 133–33 సౌభాగ్య మంచి దిగుబడుల నిస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో శాస్త్రవేత్తలు డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మోహన్‌రెడ్డి, డాక్టర్ కేవి శివారెడ్డిలు ప్రతి మండలాన్ని దర్శించి సౌభాగ్య నూతన కంది విత్తనాలను ఇచ్చి సాగు చేయాలని రైతులను ప్రోత్సహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చర్లగుడిపాడు, కారెంపూడి, దొనకొండ మండలాల్లో 43 మంది రైతులకు ప్రథమశ్రేణి విత్తన కిట్లను పంపిణీ చేశారు. ఆ విత్తనాన్ని నీటి పారుదల కింద సాగు చేసిన రైతులకు పది నుంచి గరిష్టంగా 17 క్వింటాళ్ల దాకా దిగుబడులు వచ్చాయి. రైతులు చాలా కాలం తర్వాత ప్రైవేటు కంపెనీలకు దీటైన విత్తన దిగుబడులు సౌభాగ్య ద్వారా సాధించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విత్తనం రూపకల్పన పూర్వాపరాలపై కథనం. దక్షిణ భారతానికి అనువైన రకం ఈ రకాన్ని అప్పటి లాంఫాం అపరాల శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.రాజమణి, డాక్టర్ ఎంవీ రమణ, డాక్టర్ ఎం.శ్రీకాంత్‌లు 2020లో రూపొందించారు. ఈ విత్తనాన్ని క్షేత్ర పరిశీలన చేసిన కాన్పూర్‌లోని జాతీయ కంది పరిశోధనా స్థానం ఈ రకం విత్తనం దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు అనువైనదిగా గుర్తించింది. ఆ తర్వాత నుంచి మన లాంఫాం శాస్త్రవేత్తలు ఈ రకాన్ని తమ పర్యవేక్షణలో సాగు చేస్తూ దిగుబడులు పరిశీలిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత 2023 నుంచి తమ భూముల్లో విత్తేవిధంగా శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో సైతం గత ఖరీఫ్‌లో మండలానికి పది మంది రైతులకు ఉచితంగా విత్తనాలిచ్చి పురుగు మందులు కూడా ఇచ్చిసాగుచేయాలని డాక్టర్ సాంబశివరావు తదితరులు ప్రోత్సహించారు. నీటి పారుదల ఉన్న చోట పంట వేసిన వారికి అంతకు ముందున్న ఫేమస్ వైరెటీల కన్నా అధిక దిగుబడులు రావడం క్షేత్రస్థాయిలో గుర్తించడం జరిగింది. మంచి దిగుబడులు ఇస్తున్న సౌభాగ్యం రకం కంది విత్తనం నూతన వంగడాన్ని రూపొందించిన లాం ఫాం శాస్త్రవేత్తలు ఇప్పటికే సాగుచేసి అధిక దిగుబడులు సాధించిన రైతులు తెగుళ్లను పూర్తిస్థాయిలో తట్టుకునే రకంగా ప్రసిద్ధితెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది ఈ రకం ఎండు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. వెర్రి తెగులును పాక్షికంగా తట్టుకుంటుంది. ఖరీఫ్, రబీ రెండు కాలాల్లో దీనిని సాగు చేయవచ్చు, ఖరీఫ్‌లో అయితే జూన్, జూలైలో రబీలో అక్టోబరులో వేసుకోవచ్చు. ఖరీఫ్‌లో అయితే పెద్ద అచ్చు పెట్టుకోవాలి. రబీలో పత్తి సాగు అచ్చు పెట్టుకోవచ్చు. కాయలు జడలుగా గుత్తులుగా కాస్తాయి. గింజ నాణ్యత బాగుంటుంది. ఆకులు కాయలు ఒకే రంగులో ఉండి కాపు పైకి పెద్దగా కన్పించదు. అయినా దిగుబడి మాత్రం నీటి పారుదల ఉంటే ఎకరాకు పది క్వింటాళ్ల పైనే వస్తుంది. – డాక్టర్ ఎస్.రాజమణి, విత్తనం ప్రధాన రూపకర్త -
● బాబూజీకి ఘననివాళి
నరసరావుపేట: పల్నాడురోడ్డులోని పాత ప్రభుత్వ వైద్యశాలకు ఎదురుగా ఉన్న దేశ మాజీ ఉపప్రధాని, సమతావాది డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జయంతిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్వో ఏకా మురళి, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్‌పాల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వనమా సాంబశివరావు పాల్గొన్నారు. మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ నరసరావుపేట: అణగారిన వర్గాల అభ్యున్నతికి, పీడిత, తాడిత ప్రజల ఆశాజ్యోతిగా మెలి గిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ మహనీయు డని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కొనియాడారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, అదనపు ఏఆర్ ఎస్పీ వి.సత్తిబాబు, ఎస్పీ సీఐలు ఘన నివాళులర్పించారు. -
అందాల రాముడు
మా ఊరి దేవుడు..సత్తెనపల్లి: సకల సద్గుణాలకు మారు రూపుగా.. మానవాళికి ఆదర్శంగా..అపురూపమైన బంధాలకు ఆలవాలంగా నిలిచిన శ్రీరాముడు జన్మించిన శుభదినం.. ఆయన సీతారాముడు అయ్యే శుభలగ్నం వెరసి ఆదివారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా అంతటా రామాలయాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. సీతారాముల కల్యాణ వేళ రానే వచ్చింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సవాల నిర్వహణలో సందడి కనిపిస్తోంది. సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమ్మేళన ప్రతీకను చూడగానే కుటుంబ బాంధవ్యాలు కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయి. భార్యాభర్తల అన్యోన్యత, అన్నదమ్ముల ఆప్యాయత ఆదర్శ మూర్తిపై విధేయత .. ఇలా కుటుంబంలోని అనేక కోణాలు మానవ జీవిత పరమార్ధాన్ని తెలియజేస్తాయి. పుణ్య దంపతులకు ప్రతీకగా కొలిచే సీతారాముల వారి కల్యాణం కనువిందుగా నిర్వహించడం ఆచారంగా వస్తుంది. కేవలం రామాలయాలు కాకుండా దాదాపు అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక వేదికలు సిద్ధం వేసవిలో వచ్చే శ్రీరామనవమి వేడుకలకు ప్రత్యేకత ఉంది. సీతారాముల కల్యాణం పేరిట ఓ శుభకార్యాన్ని బంధుమిత్రులు, ఇరుగుపొరుగులతో కలిసి రెండు గంటలపాటు ఒకే చోట కలిసి ఉండే అపురూపమైన ఈ అవకాశం శ్రీరామనవమి ఇస్తోంది. జిల్లాలో చిన్న, పెద్ద రామాలయాలు, వైష్ణవాలయాలు అన్నిటిల్లోనూ ఉదయం 9 నుంచి 12:30 గంటల లోపు కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆయా ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. ఆలయాల్లో కల్యాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులందరికీ కల్యాణ విందు ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం జిల్లాలో కల్యాణోత్సవాలకు ఆలయాలు ముస్తాబు గ్రామాలు, పట్టణాల్లో పండుగ శోభ శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీక్షేత్రస్థాయిలో ఐక్యతకు ప్రతీక ఉత్సవాలు నిర్వహణ తరతరాలుగా గ్రామాల ప్రజానీకం మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఆలయాలకు సమీపంలోని గ్రామస్తులంతా కులాలకతీతంగా ఉత్సవ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక గీతాలాపన, భజన, ఏకాహ కళాకారులంతా ఉత్సవ చలువ పందిళ్లలో తమ కళను ప్రదర్శిస్తుంటారు. బెల్లం పానకం, వడపప్పును ప్రసాదంగా పంచుతూ తోటి వారితో ఆప్యాయంగా వ్యవహరిస్తారు. -
పానకం.. ప్రీతికరం
శ్రీరాముని ఇష్టమైన బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యమనే ఆధ్యాత్మిక అంశంతో పాటు వాటిలో మిళితమైన పదార్థాలు ఆయుర్వేద గుణాలు ఉండడంతో ఆరోగ్యాన్నిస్తాయి. వేసవి ఆరంభ కాలంలో వచ్చే శ్రీరామనవమి ఉత్సవంలో ప్రసాదంగా బెల్లం పానకం, వడపప్పును భక్తులకు ప్రసాదంగా అంద జేస్తారు. బెల్లం, మిరియాలు, యాలకులతో తయారు చేసిన పానకంలో ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. సీజన్లో వచ్చే గొంతు సంబంధిత సమస్యలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. పెసరపప్పు శరీర వేడిని తగ్గించి చలువ చేస్తుంది. హిందూ వివాహ వేడుకల్లో ఎదిరింపు సన్నాహాల నేపథ్యంలో పానకాల కావిడితో వియ్యాల వారికి స్వాగతం పలకడమనే ఆనవాయితీ శ్రీరామనవమి వేడుకల నుంచే వచ్చిందని అర్చకులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే శనివారం అడపా దడపా వర్షం కారణంగా అక్కడక్కడ కాస్త ఇబ్బంది నెలకొన్నప్పటికీ ఉత్సవాలు కొనసాగించనున్నారు. -
రేపు చిలకలూరిపేటలో ‘పీజీఆర్ఎస్’
నరసరావుపేట: వచ్చే సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను చిలకలూరిపేట పట్టణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 10గంటలకు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందన్నారు. ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గాల స్థాయిలో కార్యక్రమం నిర్వహించదలిచామన్నారు. అందులో భాగంగా తొలిసారిగా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ అవకాశాన్ని నియోజక ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులతో కలిసి చిలకలూరిపేటలో ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని, అదే సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సైతం ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. మే 10న జాతీయ లోక్ అదాలత్ నరసరావుపేటటౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 10న జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ శనివారం తెలిపారు. అదాలత్‌లో అన్ని సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంక్, రెవెన్యూ, మోటారు వాహన ప్రమాద, చెక్కు బౌన్స్, భరణం, కుటుంబ తగాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కారం అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని తమ సమయం, డబ్బును ఆదా చేసుకోవాలన్నారు. హంస వాహనంపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి నగరంపాలెం: గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీరాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం స్వామికి హంస వాహనంపై పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమాలను ఈఓ ఎస్.ఆంజనేయాచార్యులు పర్యవేక్షించారు. రేపు పోలీసు పాత వాహనాల విడిభాగాల వేలం నరసరావుపేట: పల్నాడు పోలీసు కార్యాలయంలో పోలీసు వాహనాలకు సంబంధించి వాడి తీసివేసిన సామగ్రిని ఈనెల ఏడవతేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు ఎస్పీ కార్యాలయంలోని మోటారు వాహన కార్యాలయంలో వేలం వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని కోరారు. 8 నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి చైత్రమాస బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 8వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల నిర్వ హణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీ వెండి పల్లకిపై, 9న వెండి రథోత్సవం, 10న రావణ వాహనంపై, 11న నంది వాహనంపై, 12న సింహ వాహనంపై, 13 సాయంత్రం కృష్ణానదిలో నదీ విహారం ఉంటుంది. ఉత్సవాల్లో తొలిరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద రాయబార ఉత్సవం(ఎదుర్కోలు ఉత్సవం) జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు ఆది దంపతుల దివ్య కల్యాణోత్సవం చేస్తారు. 12వ తేదీ సదస్యం, వేదస్వస్తి, వేదాశీస్సుల కార్యక్రమాన్ని మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, వసంతోత్సవం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. 14వ తేదీ ద్వాదశ ప్రదక్షిణలు, 15, 16 తేదీల్లో పవళింపు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
ఫ్యాక్టరీలు మూసివేయించారు
కప్పం కట్టలేదని దాచేపల్లి: తనకు కప్పం కట్టలేదనే దురుద్దేశంతో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెట్టినాడ్, భవ్య సిమెంట్ ఫ్యాక్టరీలను మూసివేయించాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేకి ముడుపులు చెల్లించలేదని ఫ్యాక్టరీలను మూసివేయటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదని, యరపతినేని చేస్తున్న దుశ్చర్యలతో వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తంగెడలోని భవ్య సిమెంట్స్ గత రెండు నెలలుగా, పెదగార్లపాడులోని చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ గత 20 రోజులుగా మూతపడటం, ట్రాన్స్పోర్ట్ పూర్తిగా నిలిచిపోవటంపై శనివారం ఆయన మాట్లాడారు. చెట్టినాడ్, భవ్య సిమెంట్ ఫ్యాక్టరీలు మూతపడటంపై తాను ఆరా తీశానని, వ్యాపారంలో నష్టాలు రావటం ద్వారా ఫ్యాక్టరీలను మూసివేశారా అనే కోణంలో ప్రభుత్వ అధికారులు, కార్మికులను ఆరాతీస్తే టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకి కప్పం కట్టలేదని ఫ్యాక్టరీలు మూసివేయించారని తనతో చెప్పారని మాజీ ఎమ్మెల్యే కాసు పేర్కొన్నారు. బస్తాకు రూ.5 నుంచి 20 కప్పం రెండు ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల వేలాదిమంది కార్మికులు కష్టాలు పడుతున్నారని, ఫ్యాక్టరీలను మూసివేయించటం ఎంత వరకు న్యాయమో ఆలోచన చేయాలని ఆయన కోరారు. బస్తాకి రూ.5 నుంచి రూ.20 కప్పం కట్టాలని సిమెంట్ కంపెనీలకు అల్టిమేటం ఇవ్వడం చరిత్రలో లేదన్నారు. వర్తమానంలో కూడా ఈ సంస్కృతి రాకూడదన్నారు. ఈ రోజు సిమెంట్ ఫ్యాక్టరీలను బెదిరించారని, రేపు సున్నంతో పాటుగా ఇతర వ్యాపారాలు చేసుకునే వ్యాపారులను బెదిరించి కప్పం కట్టమని డిమాండ్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ విష సంస్కృతిని కూకటి వేళ్లతో తీసేయాలని, దీనికి ప్రభుత్వంలోని సీఎం నుంచి సీఎస్, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కంకణం కట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు చెప్పారు. ఫ్యాక్టరీల యజమానులతో తక్షణమే చర్చలు జరిపి యథావిధిగా కార్యకలపాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గురజాల టీడీపీఎమ్మెల్యే యరపతినేని దుశ్చర్యతో రోడ్డున పడిన కార్మిక కుటుంబాలు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్చలు జరపాలి భవ్య, చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీల మూతపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి -
చికెన్ వల్ల ఎవరికీ బర్డ్‌ఫ్లూ సోకలేదు
నెక్ అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి నరసరావుపేట: రాష్ట్రంలో కోళ్ల వల్ల బర్డ్‌ప్లూ సోకి మనుషులు మృతి చెందిన సంఘటనలు లేవని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్ ) అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి పేర్కొన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ చికెన్, గుడ్లు తిని దేశాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ప్లూతో మృతి చెందిన చిన్నారి ఆరాధ్య ఉదంతంపై కేంద్ర బృందం శుక్రవారం ఇక్కడకు వచ్చిన సమయంలో బాలస్వామి కూడా వచ్చారు. జరిగిన విషయం తల్లిదండ్రులు, స్థానిక వైద్యులు, పశుసంవర్ధకశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత 25 ఏళ్ల నుంచి బర్డ్‌ప్లూ కోళ్లకు వస్తున్నా మనుషులకు సంక్రమించిన దాఖలాలు లేవని అన్నారు. ఆరాధ్య మృతికి సంబంధించి పౌల్ట్రీ రంగంపై నిందలు వేయటం తగదన్నారు. బర్డ్‌ఫ్లూతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోళ్లు మృతి చెందినా, మనుషులకు ఈ వ్యాధి ఇప్పటివరకు సోకలేదని చెప్పారు. ఇటీవలనే తణుకులో రెండు లక్షల కోళ్లు, తెలంగాణలోని చౌటుప్పల్‌లో భారీగా కోళ్లు చనిపోయాయని గుర్తుచేశారు. వాటిని తొలగించి ఖననం చేసే కూలీలకు కూడా ఈ వ్యాధి సోకలేదని అన్నారు. చికెన్ తింటున్న వారికి సంక్రమించలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తకు బెయిల్ క్రోసూరు: క్రోసూరుకు చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఎంపీటీసీ చిలకా ప్రసన్న భర్త చిలకా రవికి శుక్రవారం బెయిల్ లభించింది. గత శనివారం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై టీడీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ కేసు పెట్టగా... పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సహకారంతో న్యాయవాది సుబ్బారెడ్డి వాదించారు. దీంతో బెయిల్ వచ్చినట్లు రవి తెలిపారు. -
సరైన శిక్షణతో మెండుగా ఉపాధి అవకాశాలు
నరసరావుపేట: సరైన శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా రవాణాశాఖ అధికారి కె.సంజీవ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌కు నరసరావుపేట ఆఫీస్ పరిధిలోని అన్ని డ్రైవింగ్ స్కూల్స్ తనిఖీలలో భాగంగా విచ్చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.మధు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్.శివనాగేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.పసుపు ధరలుదుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో శుక్రవారం 635 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 464 బస్తాలు వచ్చాయని, కనిష్ట ధర రూ.10,225, గరిష్ట ధర రూ.13,150, మోడల్ ధర రూ.12,811 పలికినట్టు వివరించారు. కాయలు 171 బస్తాలు వచ్చాయని, కనిష్ట ధర రూ.10,225, గరిష్ట ధర రూ.12,850, మోడల్ ధర రూ.12,811 పలికినట్టు వెల్లడించారు. మొత్తం 476.250 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.1,23,485 బస్తాల మిర్చి విక్రయంకొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,13,955 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,23,485 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 47,777 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
దారి మళ్లిన పేదల బియ్యం
బొల్లాపల్లి: పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ బియ్యం మార్గమధ్యలోనే పక్కదారి పడుతున్నాయి. గోదాము నుంచే నేరుగా అక్రమార్కుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులకు తెలిసినప్పటికీ, పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం అక్రమ వ్యాపారం దందా లోగుట్టు అధికారులకే ఎరుక అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం గోదాము నుంచి చౌకధరల దుకాణానికి చేరుకోవలసిన రేషన్ బియ్యం వినుకొండ పట్టణానికి దగ్గరగా ఉన్న ఒక రైస్ మిల్లుకు చేరాయని సమాచారం. ప్రజా పంపిణీ బియ్యం బొల్లాపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన చౌక ధరల డిపోనకు తరలించాల్సి ఉంది. కానీ ఈ బియ్యం మార్గమధ్యలోనే దారి మళ్లించి సమీపంలోని రైస్ మిల్లులకు తరలించారు. గోదాము నుంచి సుమారు 40 క్వింటాళ్లు తరలి వెళ్తున్న రేషన్ బియ్యం కలిసిన టాటా ఏస్ వాహనాన్ని కొందరు వెంబడించారు. పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అక్రమ వ్యాపారులు వారి కన్నుగప్పి వాహనాన్ని దారి మళ్లించి రైస్ మిల్లుకు చేర్చారు. గ్రామానికి చేరుకోవాల్సిన బియ్యం రాకపోవడంతో గమనించిన పలువురు ఈ విషయంపై అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లేదు. అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి అండదండలతో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటుకు తరలి వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘రంగస్థలం’.. ఓ జీవన విధానం
యడ్లపాడు: ఓపిక, పట్టుదల, కళపై ప్రేమ ఉంటే రంగస్థలం ఎంత గొప్ప వేదికో తెలుస్తుందని ప్రముఖ నాటక కళాకారిణి లహరి చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య నాటికల పోటీల నిమిత్తం ఆమె యడ్లపాడు విచ్చేశారు. ఎన్నో అవాంతరాలు దాటి రంగస్థలంపై నటనతో తనదైన ముద్ర వేసిన లహరి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నాటకాలు ఆడే వారిపై సమాజంలో చిన్నచూపు తగదని పేర్కొన్నారు. మహిళలు కూడా రాణించే అవకాశం ఉందన్నారు. ప్రతిభ చాటొచ్చు... సీ్త్ర పాత్రలకు ఒకప్పుడు పారితోషికాలు సరిగ్గా ఇవ్వలేని స్థితి ఉండేదన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రతిభను చాటి నటనకు మరిన్ని మెరుగులు దిద్దుకునే గొప్ప వేదిక రంగస్థలం అన్నారు. దర్శకత్వం కూడా చేసినట్లు చెప్పారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత రంగస్థలాన్ని ఎంచుకున్నట్లు వివరించారు. అదేస్థాయిలో సంపాదన ఆర్జించటమే కాకుండా ప్రజలను చైతన్యపరిచే గొప్ప అవకాశం, అనుభూతి లభించాయన్నారు. కుటుంబ సభ్యుల్లా అందరూ మెలుగుతున్నారని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కళలకు గొప్ప భవిష్యత్తు ఉందని ఆమె చెప్పారు. ‘ఇప్పుడు రూ.కోట్లు వెచ్చించి సినిమాలు తీసినా, ప్రేక్షకులు ఇది ఏఐతో చేశారేమో అని అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. రంగస్థలంపై నటన మాత్రం నవరసాలతో నిండినదన్నారు. ఎలాంటి ఎఫెక్టులు ఉండనందున నేరుగా ప్రేక్షకుల మనసుకు తాకే అవకాశం ఉంటుందని తెలిపారు. నాటకరంగం పట్ల సమాజాన్ని మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత రచయితలు, మీడియా, ప్రభుత్వంపై ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ రంగంపై ఆసక్తి కలిగిన పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. అపోహలు వీడి వాస్తవాల్ని కనండి ప్రముఖ నాటక కళాకారిణి లహరి -
దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలి
గుంటూరు జేసీ భార్గవ్‌తేజ గుంటూరు వెస్ట్: దివ్యాంగుల సమస్యలపై అధికారులు దృష్టి సారించి వారి ఇబ్బందులను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వికలాంగుల కమిటి సమావేశంలో జేసీ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈసందర్భంగా వివిధ దివ్యాంగ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్సులు, మున్సిపల్ కాంప్లెక్సుల్లో దుకాణాలు, స్టాల్స్ కేటాయింపులో దివ్యాంగులకు అవకాశాలు కల్పించాలన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వంద శాతం వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా బస్సు పాస్ ఇవ్వాలన్నారు. దివ్యాంగుల ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వారి కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. అవసరం మేరకు ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని కోరారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగి సూరిటీ అడుగుతున్నారని, దీన్ని కొంత ఆలోచించాలని పేర్కొన్నారు. సమావేశంలో వికలాంగుల సంక్షేమ అధికారి సువార్త, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి
వినుకొండ: మిరపకాయల కూలీల ఆటో తిరబడి ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏనుగుపాలెం సమీపంలో జరిగింది. ఉమ్మడివరం నుంచి నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ప్రతిరోజు కూలీలు వెళ్తూ ఉంటారు. ఉదయం ఏనుగుపాలెం సమీపంలో ఆటో తిరగబడింది. ఈ ప్రమాదంలో జోజమ్మ (60) మృతి చెందింది. మార్తమ్మ, వెంకాయమ్మ, అంకమ్మ, కోటమ్మ, మరియమ్మ, ఆదెమ్మ తదితర ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో వారిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.మరో ఏడుగురికి తీవ్రగాయాలు -
పల్నాడు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వినియోగం
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో గంజాయి సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. యువతను లక్ష్యంగా చేసుకొని విక్రయాలకు సాగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి సారి పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ వద్ద బడ్డీకొట్టులో విక్రయిస్తున్న గంజాయి చాక్లెట్లు రెండు నెలల క్రితం పట్టుబడ్డాయి. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది మరువకముందే సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో నిమ్మతోట ముసుగులో గంజాయి సాగు వెలుగుచూసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిమితమైన గంజాయి సాగును పల్నాడు ప్రాంతానికి కూడా తేవటం కలకలం రేపుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని అవకాశంగా మార్చుకున్న టీడీపీ నేతలు మాదక ద్రవ్యాల అక్రమ సాగుకు తెరలేపుతున్నారు. గత టీడీపీ హయాంలో చిలకలూరిపేట నియోజకవర్గం గొరిజవోలు గ్రామంలో టీడీపీకు చెందిన ఓ వ్యక్తి మిర్చి సాగు ముసుగులో గంజాయి పంట పండించాడు. అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. తర్వాత తాజాగా అదే మాదిరి కార్యకలాపాలు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రాంతంలో పునరావృతం అయ్యాయి. టీడీపీ నేత ఆధ్వర్యంలో.. రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో బుధవారం గంజాయి ఆకులు కలిగి ఉన్న ముగ్గురిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చెందిన టీడీపీ నేత పొలంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ నిమ్మతోట ముసుగులో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం వాటిని ల్యాబ్‌కు పంపించారు. పొలాల్లో సాధారణ పంటల మాదిరిగా గత కొన్ని నెలలుగా సాగు చేస్తున్న ఈ గంజాయి మొక్కల వ్యవహారాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. వ్యవసాయ పర్యవేక్షణ శాఖ అధికారులు సైతం మౌనంగా ఉన్నారు. అధికారుల తీరు వల్లే.... రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయాల్సిన వ్యవసాయ, పోలీస్ శాఖలు మౌనం వహించడంపై పలు విమర్శలకు తావిస్తోంది. అధికారుల మద్దతు లేకుండా ఇలా సాగు సాధ్యపడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి పొలం కావటంతో అధికారులు మాట్లాండేందుకు కూడా సాహసించటం లేదు. గంజాయి సాగు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో గంజాయి సాగు విషయం వెలుగు చూసిన తర్వాత జిల్లాలోని అన్ని ఎకై ్సజ్ పోలీస్ అధికారులను అప్రమత్తం చేశాం. తనిఖీలు చేపట్టాలని ఆదేశించామని పేర్కొన్నారు. – కె. మణికంఠ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విద్యార్థులుగంజాయి సాగు చేస్తే చర్యలు గతంలో రాష్ట్రంలో తొలిసారి నరసరావుపేటలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు గత ప్రభుత్వంలో సెబ్ ద్వారా మత్తు పదార్థాల వినియోగం కట్టడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్‌కు మంగళం ఏకంగా టీడీపీ నేత పొలంలోనే నిమ్మతోట ముసుగులో గంజాయి సాగు జిల్లాలో కొన్ని నెలలుగా ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెబ్‌ను తొలగించి, ఎకై ్సజ్ శాఖలో విలీనం చేసింది. కూటమి ప్రభుత్వం ఈగల్ అనే పేరుతో టీమ్‌ను సిద్ధం చేసినా సిబ్బందిని కేటాయించలేదు. ఆశించిన మేర ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో అక్కడక్కడ గంజాయి పట్టుకొని కేసులు నమోదు చేసిన పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. మూలాలపై దృష్టి సారించటంలేదు. నరసరావుపేట కేంద్రంగా గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా పట్టణం నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిర్మానుష్య ప్రాంతాల్లో, పట్టణ శివారు రియల్ ఎస్టేట్ వెంచర్లలో యువత గుంపులుగా చేరి గంజాయి తీసుకుంటున్నారు. మత్తుకు బానిసలుగా మారి అనేక మంది నేరాలకు పాల్పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని నివేదికలు సైతం చెబుతున్నాయి. -
భారీ దొంగతనం
ఇంకొల్లులో ఇంకొల్లు (చినగంజాం): బాపట్ల జిల్లా ఇంకొల్లులో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన రూ.55.50 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన బంగారు నగలు అపహరించుకుని తీసుకెళ్లారు. ఎస్ఐ జీ సురేష్ అందించిన సమాచారం ప్రకారం... ఇంకొల్లు గ్రామంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఇంటిలో జాగర్లమూడి శివప్రసాద్ నివాసం ఉంటున్నారు. ఆయన రెండో అంతస్తులో నిద్రిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటిలోని మూడో అంతస్తులోకి ప్రవేశించి గది తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.55.50 లక్షల నగదు, 24 సవర్ల బంగారు వస్తువులను అపహరించి తీసుకెళ్లారు. ఉదయం నిద్ర లేచిన ఆయన దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్ఐ జీ సురేష్‌లు క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. తాను డైరెక్టర్‌గా ఉన్న ఎంఆర్ఆర్ ప్రకాశం హైస్కూల్ విద్యార్థుల ఫీజులు రూ.20 లక్షలు, పంట అమ్మిన డబ్బు రూ.30 లక్షలు, హోటల్ వ్యాపారం ద్వారా తన సోదరులు సంపాదించిన మరో రూ.5.50 లక్షల నగదుతో పాటు మరో రూ.20 లక్షల విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్లు శివప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మిర్చి ఘాటు చూపిస్తాం
కొరిటెపాడు(గుంటూరు): మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు మిర్చి యార్డులో ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన క్వింటా మిర్చి ధర రూ.11,781లు మోసపూరితంగా ఉందని ధ్వజమెత్తారు. రైతులు క్వింటా మిర్చి పండించడానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలకు పైగా ఖర్చు అవుతుండగా, దీనిలో సగం మద్దతు ధర కల్పించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల నుంచి మిర్చిని నేరుగా కొనుగోలు చేస్తే రైతులు, కౌలు రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 2019 నుంచి 2023 వరకు క్వింటా మిర్చి రూ.18 వేలు నుంచి రూ.27 వేల వరకు ధర వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కేవలం రూ.7 వేలు నుంచి రూ.13 వేలు లోపు ధర పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే ధరలు కొనసాగితే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ధరల స్థిరీకరణ కింద కేవలం రూ.300 కోట్లు కేటాయించడం చూస్తే రైతులంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదని స్పష్టమవుతోందని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.ఐదువేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముందుగా నరసరావుపేట రోడ్ వైపు ప్రధాన గేటు నుంచి నినాదాలు చేస్తూ మిర్చి యార్డు కార్యదర్శి చాంబర్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యార్డు కార్యదర్శి ఎ.చంద్రికకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన యార్డు కార్యదర్శి చంద్రిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలు రాలేదని చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులను ఆదుకోకపోతే త్వరలో మిర్చి యార్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల గుంటూరు, పల్నాడు జిల్లాల నాయకులు బైరగాని శ్రీనివాసరావు, కె.రామారావు, జి.బాలకృష్ణ, బి.రామకృష్ణ, బిక్కి శ్రీనివాస్, జి.పిచ్చారావు, ఈవూరి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదుకోకుంటే త్వరలో యార్డు ముట్టడి ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల హెచ్చరిక -
‘బర్డ్‌ఫ్లూ మృతి’ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే
నరసరావుపేట: బర్డ్‌ఫ్లూ వ్యాధితో రెండేళ్ల చిన్నారి ఆరాధ్య మృతి నేపథ్యంలో వెంటనే పల్నాడు జిల్లాను బర్డ్‌ప్లూ ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ప్రకటించాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్య ఫలితమేనని అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలయ్యనగర్ ఒకటో లైనులో ఉండే ఆరాధ్య కుటుంబాన్ని కేంద్ర బృందం పరిశీలించే సమయంలో ఆయన కూడా అక్కడకు వచ్చారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు పెండ్యాల గోపీ, జ్యోతిలను అడిగి తెలుసుకున్నారు. వారికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలిక బర్డ్‌ప్లూతో చనిపోవటం బాధాకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అవయవాలు పనిచేయక పోవడం వల్ల బాలిక చనిపోయిందని నిర్ధారించారన్నారు. మొదటి బర్డ్‌ప్లూ కేసు 2021లో మహారాష్ట్రలో నమోదుకాగా, తిరిగి రెండో కేసు నరసరావుపేటలో నమోదు కావడం బాధాకరమైన విషయమన్నారు. ఈ పాపకు బర్డ్‌ప్లూ సోకిందనే విషయాన్ని దేశంలోని వైరాలజీ సంస్థ ఐసీఎంఆర్ నిర్ధారించగా, ఇది బర్డ్‌ప్లూ మరణం కాదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాను బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ ఏరియాలో 10 కోళ్లు కూడా బర్డ్‌ఫ్లూ వ్యాధితో చనిపోయాయని చెబుతున్నారని, దీని మీద కూడా విచారణ చేయాలని అన్నారు. వలంటీర్లు ఉంటే మేలు జరిగేది గతంలో కరోనా సమయంలో వలంటీర్లు ప్రతి ఇంటికి సర్వే నిర్వహించి ఏ ఇంట్లోనైనా జ్వరం, ఇతర వ్యాధి బాధితులు ఉంటే గుర్తించి వెంటనే చికిత్స పొందే ఏర్పాటు చేసేవారన్నారు. నరసరావుపేటలో చిన్నారి బర్డ్‌ప్లూ వ్యాధితో చనిపోతే ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, ఈ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి,, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాను బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ప్రకటించాలి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు పర్యటించలేదు? చిన్నారి కుటుంబానికి తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి పాప మృతికి కారణం బర్డ్‌ఫ్లూ కాదని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత -
పోయిన డబ్బులు దొరికాయోచ్..!
ముప్పాళ్ళ: పింఛన్ డబ్బులు పోయాయి... మరలా దొరికాయోచ్...! అవును ఇది నిజమే. డబ్బులు కట్టకట్టి మరీ గ్రామసచివాలయంలోనే ఉంచడం మరింత ఆశ్చర్యకరం. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామ సచివాలయంలో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్ పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్ములో రూ.50 వేలు ఈ నెల 1వ తేదీన గ్రామ సచివాలయంలోనే పంపిణీకి ముందు కనిపించకుండా పోయాయి. సహచర సిబ్బంది, మిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకొని పింఛన్ పంపిణీని సజావుగా పూర్తి చేశారు. మూడు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే శుక్రవారం ఉదయం సచివాలయం తెరవగానే రూ.50 వేల నగదును ఒక కవర్లో పెట్టి నేలపై కనిపించాయి. ఇదంతా ఇంటి దొంగల పనే అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా సచివాలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. బోయపాలెం డైట్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: ప్రత్తిపాడు మండలం బోయపాలెం జిల్లా వృత్తి విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల్లో డెప్యూటేషన్‌పై పని చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎంఈఓలు, హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఈనెల 16,17వ తేదీల్లో పరీక్షలు, ఈనెల 19న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డైట్బోయపాలెం.కామ్ సందర్శించాలని, సందేహాల నివృత్తికి 94408 46046 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తును ప్రతి సబ్జెక్టుకు వేర్వేరుగా చేయాలని, దరఖాస్తుల స్వీకరణకు గుంటూరు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీజీహెచ్‌లో మీకోసం మేము గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో 7వ వారం మీకోసం మేము పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ పేషెంట్లకు హాస్పిటల్ నియమావళి గురించి సూచనలు చేశారు. ల్యాబ్ పరీక్షలు, మరేదైనా ఎవరైనా ఎటువంటి ప్రలోభాలకు మోసపోవద్దని తెలిపారు. ఎలాంటి సమస్యనైనా ఎవరికీ డబ్బు చెల్లించవద్దని, ఒకవేళ ఎవరైనా డబ్బు అడిగితే రశీదు అడగాలని, ఇవ్వని పక్షంలో సూపరింటెండెంట్, సీఎస్ఆర్ఓంకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సింగ్గ్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మూల్యాంకన కేంద్రంలో పరిశీలన నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. కేబీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న మూల్యాంకన కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా మార్కులు కేటాయించాలన్నారు. సకాలంలో మూల్యాంకనం పూర్తి చేయాలని సూచించారు. కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్, మూల్యాంకనం గదులు, వైద్య సదుపాయం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.ఎం.ఎ.హుస్సేన్, డిప్యూటీ డీఈఓలు ఎస్ఎం సుభాని, ఏసుబాబు పాల్గొన్నారు. -
రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి సంఘటన శుక్రవారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో హుబ్లి ఎక్స్‌ప్రెస్ కింద పడి పెద్దచెరువు ప్రాంతానికి చెందిన గాలి థామస్(70) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పైలెట్ సమాచారాన్ని నరసరావుపేట రైల్వే పోలీసులకు అందించారు. ఎస్ఐ శ్రీనివాసనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
కేంద్రియ విద్యాలయాలు ఏర్పాటు చేయండి
నరసరావుపేట: పల్నాడు జిల్లాకు సంబంధించి రొంపిచర్ల, మాచర్లలో మంజూరైన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలోని తన చాంబర్లో రెవెన్యూ అధికారులు, కేంద్రియ విద్యాలయ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాచర్లలో అనువైన ప్రదేశాన్ని గుర్తించి తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై మాచర్ల రెవెన్యూ అధికారి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీ, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో రూములు కేటాయించడానికి అనువుగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పీడబ్ల్యూడీ కాలనీలో ఐదెకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. రొంపిచర్లలో విద్యాలయ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని రీ వెరిఫై చేయాలని ఎమ్మార్యోకు సూచించారు. గురజాల, నరసరావుపేట ఆర్డీవోలు మురళీకృష్ణ, మధులత, రొంపిచర్ల మండల రెవెన్యూ అధికారి నిర్మల, కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీకమిషనర్ పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
రాజుపాలెం: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ సూచించారు. మండలంలోని కొండమోడు విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఎస్ఈ మాట్లాడుతూ.. బిల్లుల వసూలులో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవిలో టాన్స్‌ఫార్మర్ వద్ద లోడ్ బ్యాలెన్సు చేసుకోవాలని సూచించారు. 50 శాతం అదనపు లోడు సబ్సిడీ స్కీమును గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకుని వెంటనే బిల్లులు చెల్లించాలని తెలిపారు. గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువగా ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా మండలంలోని రాజుపాలెం, గణపవరం, అనుపాలెం సబ్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ డీఈఈ బి.నాగసురేష్బాబు, మాచర్ల ఈఈ ఎన్. సింగయ్య, ఏఈఈ కోట పెదమస్తాన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సుందరయ్య పురస్కారం అందుకోవడం అదృష్టం
యడ్లపాడు: తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని కమ్యూనిస్టు నాయకులు పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 22వ జాతీయస్థాయి నాటిక పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభం అయ్యాయి. ముందుగా సుందరయ్య చిత్రపటానికి కమ్యూనిస్టులు, పరిషత్ నిర్వహకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తొలిరోజు ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రంగస్థలానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించిన గుంటూరు సంస్కృతి వ్యవస్థాపకులు సఱాజు బాలచందర్‌కు పుచ్చలపల్లి సుందరయ్య పురస్కారం ప్రదానం చేశారు. కళానిలయం ప్రతినిధులు ఆయనకు సత్కార పత్రాన్ని అందించి, ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అజో, విభో కందాళం ఫౌండేషన్ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ‘బాలచందర్ జీవిత గ్రంథాన్ని’ ఆవిష్కరించారు. డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, అరుణకుమారి దంపతులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రచయితలు పి.మృత్యుంజయరావు, జరుగుల రామారావు, కమ్యూనిస్టు నాయకులు వై. రాధాకృష్ణ, పీవీ రమణ, పోపూరి సుబ్బారావు, టి. కోటేశ్వరరావు, నూతలపాటి కాళిదాసు, జరుగుల శంకరరావు, టీవీ మల్లికార్జునరావు, ప్రజాగాయకులు తదితరులు పాల్గొన్నారు. వైవిధ్య అంశాలపై ప్రదర్శనలు ●వైద్యవిద్యలో చేసిన ప్రతిజ్ఞను మరవద్దని తెలియజేసేలా ‘చిగురుమేఘం’ నాటిక ప్రదర్శన కొనసాగింది. అమరావతి ఆర్ట్స్(గుంటూరు) ప్రదర్శించిన ఈ నాటికను కావూరి సత్యనారాయణ రచించగా, ఏపూరి హరిబాబు దర్శకత్వం వహించారు. ●ఉన్నత విద్యకంటే కుటుంబ పెద్దల జ్ఞానం గొప్పదని చెప్పిన ‘కిడ్నాప్’ నాటిక ఆలోచింపజేసింది. తల్లిదండ్రుల ప్రేమ, విలువల్ని, అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా సాగింది. ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు) వారి ఈ నాటికకు రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. ●కుటుంబ వ్యవస్థ నైతిక విలువలకు పునాది అని చెప్పేలా ‘విడాకులు కావాలి’ నాటిక సాగింది. వల్లూరి శివప్రసాద్ రచించిన దీనికి గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు. అరవింద ఆర్ట్స్ (తాడేపల్లి) వారు ఈ నాటికను సమర్పించారు. సంస్కృతి సంస్థ అధినేత సఱాజు బాలచందర్ ప్రారంభమైన సుందరయ్య కళానిలయం నాటిక పోటీలు తొలిరోజు ముచ్చటగా మూడు ప్రదర్శనలు -
పల్నాడు
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వైభవంగా మహా కుంభాభిషేకం పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలగ పాలెంలో ఉన్న కోదండ రామాలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రిఫ్రిజిరేటర్ బహూకరణ పిడుగురాళ్ల: పట్టణ పోలీస్ స్టేషన్‌కు రిఫ్రిజిరేటర్‌ను తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల తరఫున శుక్రవారం అందించారు. డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. 7 -
కన్నకొడుకే కాలయముడు
● మతి స్థిమితం లేని తల్లిని చంపిన కొడుకు ● మంచంపై నిద్రిస్తుండగా రోకలి బండతో మోది హత్య బొల్లాపల్లి: కన్న కొడుకు చేతిలో జన్మనిచ్చిన తల్లి దారుణంగా హత్యకు గురైన సంఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో గురువారం జరిగింది. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్, బండ్లమోటు ఎస్ఐ ఎ.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వెల్లటూరు గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య, గజ్జ సోమమ్మ (67) దంపతులకు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ సంతానం. చిన్న కుమారుడు బాదరయ్య అవివాహితుడు కావడంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మిగిలిన సంతానంలో అందరికీ వివాహాలై వేర్వేరుగా ఉంటున్నారు. మతిస్థిమితం లేని తల్లి ఎప్పుడు గొణుగుతుండడం, తనకు వివాహం కాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న నిందితుడు బాదరయ్య తెల్లవారుజామున మంచం మీద పడుకుని నిద్రిస్తున్న తల్లిని రోకలిబండతో కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు గజ్జ శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అందజేశారు. -
వేధింపులకు గురైన బాలిక ఆస్పత్రికి తరలింపు
చిలకలూరిపేటటౌన్: బాలికపై కన్నతల్లే కర్కశంగా వేధించిన కేసులో బాలల హక్కుల పరిరక్షణ అధికారులు స్పందించారు. పట్టణంలోని ఈనెల 31వ తేదీన ఏడాది కిందట భర్తతో విడిపోయి ప్రియుడితో సహజీవనం చేస్తున్న దీప్తి తన కుమార్తెను వేధింపులకు గురిచేసిన విషయం విధితమే. బాధిత బాలికను పరామర్శించి ఐసీడీఎస్ సీడీపీఓ, మహిళ పోలీస్, డీసీపీఓ వివరాలను సేకరించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్, మహిళ పోలీస్ ఆధ్వర్యంలో బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం నరసరావుపేట బాలల సదన్‌లో చేర్పించనున్నట్లు వారు వెల్లడించారు. పంపిణీ చేసే ఇళ్ల స్థలాల పరిశీలన మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు వద్ద శుక్రవారం పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్థల పట్టాల పంపిణీని ప్రారంభించనున్న నేపధ్యంలో ఎస్పీ పరిశీలన జరిపారు. అధికారులకు భద్రతా సూచనలు చేశారు. ట్రాఫిక్, , వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ వై. శ్రీనివాసరావు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ వేమూరు: మండలంలోని చంపాడు ఇరిగేషన్ కాలువ వంతెన వద్ద ఇసుక ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. వివరాలు మేరకు... కొల్లూరు మండలంలోని గాజులంక నుంచి తెనాలికి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసు స్టేషన్లో ముడుపులు చెల్లించడంతో రాత్రి వేళ తిరిగే లారీలు, ట్రాక్టర్ల యజమానులపై పోలీసులు కేసు నమోదు లేదు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాజులంక గ్రామం నుంచి ఇసుక లోడుతో ట్రాక్టర్, లారీ బయలుదేరాయి. చుంపాడు ఇరిగేషన్ కాలువ వంతెన వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొని పడిపోయింది. వంతెన వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అక్రమ ఇసుక విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని ఇసుక లారీని తొలగించారు. సీఐ మాట్లాడుతూ దీనిపై స్టేషన్లో ఫిర్యాదు అందలేదన్నారు. -
అన్నదాతకు అకాల కష్టం
● కోతకొచ్చిన రబీ వరి పంట ● కళ్లాల్లోనే మిర్చి, కంది ● ధాన్యం కాపాడుకునేందుకు రైతుల తంటాలు ● వర్షం దెబ్బకి ధాన్యాన్ని నష్టానికి అమ్ముకున్న కొందరు రైతులు పలుచోట్ల వర్షంతో అవస్థలుకారెంపూడి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కర్షకులు నానా అవస్థలు పడ్డారు. నోటి దగ్గరకొచ్చిన పంటను కాపాడుకోడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. కారెంపూడి మండలంలో కళ్లాల్లో ఉన్న మిర్చి, ధాన్యం, కందులు తడిసి పోకుండా వాటిని కుప్పలుగా చేసి పట్టలు కప్పడంలో రైతులు తలమునకలయ్యారు. పట్టలు తీసుకుని పొలాలకు ఉరుకులు పరుగులు పెట్టి పొలాలలో కళ్లాలలో ఉన్న పంట ఉత్పత్తులు తడిసిపోకుండా పట్టలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. మబ్బులు పట్టగానే కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని, మిర్చిని చాలా మంది వచ్చిన ధరకు తెగనమ్మేశారు. కొందరు ఇప్పటికే కళ్లాల్లో ఆరిన పంటలను గోతాలకు పట్టి ఇళ్లు చేర్చుకున్నారు. మాచర్లలో భారీ వర్షం మాచర్ల: అత్యధిక ఎండతో ఇబ్బంది పడుతున్న మాచర్ల వాసులకు మారిన వాతావరణం కాస్తంత ఉపశమనం కలిగించింది. గురువారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మికంగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు సేద తీరారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పారింది. -
న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య పారా వలంటీర్లు వారధులు
13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ నరసరావుపేటటౌన్: న్యాయవ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ పేర్కొన్నారు. గురువారం అదనపు జిల్లా కోర్డు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. పారా లీగల్ వలంటీర్ల విధులు, నైతికత, రాతపూర్వక నైపుణ్యం, రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను, చట్టపరమైన సలహాలు ఇచ్చే విధివిధానాలను గురించి వివరించారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 10వేల మెట్రిక్ టన్నులు నరసరావుపేట: రబీ సీజన్లో ధాన్యం సేకరణ 10వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణ సమావేశం వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. రబీలో 2024–25 సంవత్సరానికి 234 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 20,561 హెక్టార్లలో వరిసాగు చేశారన్నారు. దీనిలో 1,32,773 ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటా రూ.2320లు, సాధారణ రకం క్వింటా రూ.2300లుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే ఈ–పంట ద్వారా పంటను నమోదుచేయించి 100శాతం ఈకేవైసీ చేయించాలన్నారు. మాయిశ్చర్ మీటర్లను త్వరగా కాలిబ్రేషన్ చేయించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నారదమునిని ఆదేశించారు. రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లు సామర్ధ్యం, ఇతర వివరాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలన్నారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులు కొనుగోలుకేంద్రాల ద్వారా తాము పండించిన పంటను విక్రయించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి, జిల్లా సప్లయీస్ మేనేజర్, ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రతినిధులు, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. ‘పది’ మూల్యాంకనం ప్రారంభం నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వారం రోజుల పాటు దాదాపు 1.75లక్షల పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. దాదాపు 1050మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గదుల్లో అదనపు వెలుతురు, గాలి వచ్చేలా లైట్లు, స్టాండ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, 108 అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఏర్పాట్లు పర్యవేక్షించారు. 5, 6 తేదీల్లో ఇంటర్ దూరవిద్య మూల్యాంకనం సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 5, 6తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం తెలిపారు. కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రెండు రోజుల పాటు 11 సబ్జెక్ట్‌లకు సంబంధించిన 16,215 పేపర్లు మూల్యాంకనం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకుగాను 191 మంది ఎగ్జామినర్లు, 38 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 39 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించినట్టు తెలిపారు. 7 నుంచి దూరవిద్య ప్రాక్టికల్స్.. ఇంటర్మీడియెట్ దూరవిద్య ప్రాక్టీకల్ పరీక్షలు ఈనెల 7వతేదీ నుంచి 11వరకు నిర్వహిస్తున్నట్టు డీఈఓ తెలిపారు. ఆయా తేదీలలో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. ఇందుకుగాను నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండలో 6 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
కోతకు రబీ వరి.. కళ్లాల్లో మిర్చి, కంది
ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో రైతుల గుండెలు ఝల్లుమన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎక్కడ తడిసిపోతాయోనని వాటిని కాపాడుకోడానికి అష్టకష్టాలు పడ్డారు. మరో వైపు కంది కళ్లాలు జరుగుతున్నాయి. కళ్లాలను త్వరగా పూర్తి చేసేందుకు రైతు కూలీలు కష్టపడ్డారు. వర్షం రాకతో కళ్లం చేసిన గింజలతో కూడిన పొట్టును మిషన్‌లో పోసే అవకాశం కూడా లేకుండా పోయింది. మిరప కాయల కోతలు కూడా జరుగుతున్నాయి. దీంతో కోసిన కాయలు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో వైపు రబీ వరి చేలన్నీ కోతకు వచ్చాయి. ఈ దశలో వర్షం పడితే గింజ పాడైపోతుందని, గింజలు నేలపాలు అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఎరువుల కొట్లలో బాకీలున్న చిన్న సన్నకారు రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని జిలకర సన్నాలు 75 కిలోల బస్తా రూ.1540కే తెగనమ్మారు. అమ్ముదామంటే ధరలేదు.. కొనేనాథుడు లేడని వర్షం వల్ల బతిమాలి మరీ పంటను అమ్మాల్సిన దుస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జాబ్ కార్డులను తొలగించడం అన్యాయం
అమరావతి: యాక్టివ్‌గా లేవనే సాకుతో జాబ్ కార్డులను తొలగించడం అన్యాయమని జాబ్ కార్డుతో సంబంధం లేకుండా అడిగిన ప్రతి ఒక్కరికీ పని చూపాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రవిబాబు అన్నారు. గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు తెలుసుకోవటం కోసం నిర్వహించిన ఉపాధి హామీ బైక్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాలలోఉపాధి హామీకూలీలు తమ సమస్యలను బైక్‌యాత్రలో వ్యవసాయ కార్మికసంఘ ప్రతినిధులకు వివరించారు. రవిబాబు మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పనులుచేసిన కూలీలు కూడా ప్రస్తుతం జాబ్ కార్డులు యాక్టివ్‌గా లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. జాబ్‌కార్డులు లేక, పనులకు వెళ్లలేక అనేకమంది కూలీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆధార్‌కార్డుకు బ్యాంకు ఎకౌంటుకి ఫోన్ నెంబర్లకు లింకులు లేకపోవటం కూడా పెద్ద సమస్యగా మారిందన్నారు. నిరక్ష్యరాశ్యులైన కూలీలకు ఫోన్‌నంబరు లింక్చేయటంపై అవగాహన లేక చేసిన పనికి వేతనాలు అందక కూలీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించి, కూలీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం నాయకులు జమ్మలమూడి భగత్, ఏపూరి వెంకటేశ్వర్లు యేసయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘వక్ఫ్’ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
● ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచేది వైఎస్సార్ సీపీనే ● బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం మైనార్టీలకు వెన్నుపోటు పొడవటమే ● మాజీ సీఎం జగన్‌పై వర్లరామయ్య ఆరోపణలు సిగ్గుచేటు ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట: కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘించి ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వటమంటే మైనార్టీలకు వెన్నుపోటు పొడవటమేనన్నారు. ఈ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని, మైనార్టీలకు అండగా ఉండేది, వారికోసం నిలబడేది తమ పార్టీనేనని గోపిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ మైనార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిమేతర వ్యక్తిని వక్ఫ్‌బోర్డు కమిటీలోకి తీసుకురావటం 26వ ఆర్టికల్‌ను ఉల్లంఘించటమేనన్నారు. ఇప్పటివరకు ముస్లిం వ్యక్తులే కమిటీలో ఉంటున్నారన్నారు. దీంతో ఆస్తులు అన్యా క్రాంతమవుతాయనే భయాందోళన ముస్లిం వర్గాల్లో వ్యక్తమవుతుందన్నారు. మైనార్టీలను వంచించిన టీడీపీ, జనసేన.. వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆర్నెల్లులో సెంట్రల్ డేటా బేస్‌లోకి తీసుకురావటం సాధ్యమయ్యే పనికాదన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఏవిధంగా పనిచేస్తున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక అధికారిని కమిటీలో నియమిస్తున్నారని, ఆ అధికారిని రాష్ట్రమే నిర్ణయించటం వలన రాష్ట్రంవైపే ఆ అధికారి మొగ్గుచూపే అవకాశం ఉంటుందన్నారు. ఈ సవరణకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వటంపై రాష్ట్రంలోని ప్రతి మైనార్టీసోదరుడు ఆవేదన చెందుతున్నాడన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖరీదైన వక్ఫ్ ఆస్తులను ఏంచేయనున్నారోననే ఆందోళన ప్రతి ముస్లింకి ఉందన్నారు. దేశంలో సుమారు 20 కోట్లమంది ముస్లింలు ఉండగా వారికి ఆల్ఇండియా ముస్లిం లా బోర్డు, జమాయిత్ హిందూ ఉల్ అనే సంస్థలు ఉండగా వాటిని చర్చలకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఒక మతానికి చెందిన అంశాలను మార్చుతున్నప్పుడు ఆ మత పెద్దల అభిప్రాయాలు, సూచనలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్‌ను ముస్లిం లా బోర్డు బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముస్లింల హక్కులు కాలరాయకుండా వారితో ముందుగానే చర్చలు ఎందుకు జరపలేదని వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. వర్ల రామయ్య వ్యాఖ్యలు సిగ్గుచేటు వర్లరామయ్య నరసరావుపేటకు వచ్చి బిల్లు విషయంలో తమ పార్టీ టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నాడని, దీనిపై తాము ఆయనతో చర్చించేందుకు సిద్ధమేన్నారు. దీంతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటన్నారు. టీడీపీ మద్దతు ఇవ్వకపోయినా బిల్లు పాస్అయ్యేదన్న వర్లరామయ్య మాటను ప్రస్తావిస్తూ మద్దతు ఇవ్వకపోయినా పాస్ అయినా మద్దతు ఇవ్వటమే ఇక్కడ ముఖ్యమైన అంశమన్నారు. ఇమామ్, మౌజమ్‌లకు రూ.10వేలు, రూ.5వేలు పారితోషికం అందజేసింది జగన్మోహన్రెడ్డి మాత్రమే అన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ అవకాశాన్ని రద్దుచేసింద న్నారు. దివంగత వైఎస్సార్ ఇచ్చిన 4శాతం రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్మెంట్ వలన ఎంతో మంది మైనార్టీలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని, నరసరావుపేట మండలంలోని చినతురకపాలెంలో పేద బడుగు ముస్లిం కుటుంబాలకు చెందిన 32మంది యువతీయువకులు ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్లు అయ్యారని, వారిలో ఎనిమిదిమంది పీజీలు చదువుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. -
బాకీ డబ్బులు ఎగ్గొట్టేందుకే తప్పుడు కేసు
నరసరావుపేటటౌన్: బాకీ డబ్బులు ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఏలూరి ప్రసాద్ విమర్శించారు. గురువారం ప్రకాష్‌నగర్ సిరి అపార్ట్మెంట్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అమరా వెంకటేశ్వరరావు బాధితులతో కలిసి మాట్లాడారు. పట్టణానికి చెందిన అమరా వెంకటేశ్వరరావు అమరా ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహిస్తూ ఆర్థిక సమస్యలతో 2023లో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అతనికి సన్నిహితంగా ఉండే వారి వద్ద సుమారు రూ.10 కోట్లు అప్పుగా తీసుకొని ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించాడన్నారు. కాలేజీని కోర్టు వేలం వేసి బ్యాంకుకు చెల్లించవలసిన పైకం పోనూ మిగిలిన మొత్తాన్ని సొసైటీ పేరిట సుమారు రూ.4 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారన్నారు. వెంకటేశ్వరరావు మృతి అనంతరం ఆయన భార్య అమరా సుధారాణి, వారి పిల్లలు బాకీదారులతో సన్నిహితంగా ఉంటూ ఉన్న ఆస్తిని అమ్మి బాకీలు తీరుస్తామని నమ్మబలుకుతూ వచ్చారన్నారు. ఇటీవల నరసరావుపేటలో ఐపీ పెట్టే వారి సంఖ్య పెరగటంతో వీళ్లు కూడా డబ్బులు ఎగ్గొట్టాలని దురాలోచన చేశారన్నారు. అందులో భాగంగానే బుధవారం సుధారాణి తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి నిజానిజాలు తెలుసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా కోరారు. సమావేశంలో కండె హనుమంతరావు, కూరపాటి శ్రీనివాస గుప్తా, కొత్తూరు సురేషు, పెనుగొండ ప్రతాపు, పెనుగొండ ప్రభాకర్, సీతారామయ్య, చీరాల నారాయణ, ఇక్కుర్తి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం తగదు
నాదెండ్ల: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘనవ్యర్థాల నిర్వహణపై కార్యదర్శులు అలసత్వం వహించకుండా పనిచేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్‌రెడ్డి చెప్పారు. పలు గ్రామాల్లో గురువారం ఆయన పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘనవ్యర్థాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుక్కాపురంలో రోడ్ల వెంబడి చెత్త కుప్పలు ఉండటం, పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామస్తులు పలు ఫిర్యాదులు ఆయన దృష్టికి తేవటంతో కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. ఎండుగుంపాలెం గ్రామంలో ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యదర్శికి మెమో జారీ చేశారు. జంగాలపల్లెలో స్వామిత్వ సర్వే చివరి దశలో ఉండటంతో కార్యదర్శికి పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామాల కార్యదర్శులతో ఇంటి పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇకనుంచి అన్ని గ్రామాల్లో 22 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ నిర్మలా లక్ష్మీకుమారి పాల్గొన్నారు. డీపీఓ విజయభాస్కర్‌రెడ్డి ఇద్దరు కార్యదర్శులకు మెమోలు -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
పిడుగురాళ్ల: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ సూచించారు. పిడుగురాళ్ల పట్టణ, గ్రామీణ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో రూరల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో గురవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ... విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కరెంట్ బిల్లుల వసూళ్లలో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పరిధిలోని జానపాడు, రూరల్ పరిధిలోని జూలకల్లు సబ్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. వేసవిలో లోడ్ పెరుగుతున్న కారణంగా దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ను అందించాలని ఆదేశించారు. 50 శాతం అదనపు లోడ్ సబ్సిడీ స్కిమ్‌ను గృహ వినియోగదారులందరు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.నాగసురేష్బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.సింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ -
పైపులైన్ పనులు ఆగవు
ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా నకరికల్లు: ఒప్పుకున్నా లేకున్నా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పైపులైన్ చేపడతామని అధికారులు రైతులను హెచ్చరించారు. బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటులో భాగంగా మండలంలోని చల్లగుండ్ల, నకరికల్లు, నర్శింగపాడు గ్రామాల రైతులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి మాట్లాడుతూ బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటుకు భూములు తీసుకునేది భూసేకరణ కిందకు రాదని భూ వినియోగం మాత్రమేనన్నారు. గుర్తించిన భూమిలో ఆరుమీటర్ల లోతులో ఒకటిన్నర మీటరు వెడల్పులో పైపులైను ఏర్పాటు ఉంటుందన్నారు. పైపులైను పనులు చేపట్టేందుకు 18 ఇంటు 18మీటర్ల వెడల్పులో భూమిని వినియోగించుకొని పైపులైన్ పూర్తయ్యాక భూమిని యథావిధిగా బాగు చేసి ఇస్తామన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంట పూర్తయ్యాకే పనులు చేపతామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న భూముల విలువను బట్టి రెండున్నర రెట్లు కలిపి మొత్తం సెంటుకు రూ12వేలు చొప్పున రైతులకు చెల్లిస్తామని తెలిపారు. దీనికిగాను రైతులు అంగీకారపత్రం ఇవ్వాలని ఒకవేళ ఒప్పుకోకుంటే ఇది కేంద్రప్రభుత్వం ప్రాజెక్టు అని పోలీస్ బందోబస్తు నడుమ అయినా పూర్తిచేసి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు. డిమాండ్లకు ఒప్పుకొంటేనే భూములిస్తాం.. పైపులైను వేసిన భూముల్లో గోడౌన్లు కట్టుకోవాలన్నా... ప్లాట్లు వేసుకోవాలన్నా... అమ్ముకోవాలన్నా, భూమిలో పైపులైన్లు ఉండడం మూలంగా ఇబ్బందులు తలెత్తుతాయని, పనులు చేపట్టే క్రమంలో భూమిని పంటకు పనికిరాకుండా చేస్తారని, హద్దురాళ్లు చెల్లాచెదరు చేస్తారని రైతులు వాపోయారు. హామీలు నెరవేరుస్తామని రాతపూర్వకంగా ఇవ్వాలని, అలాగే సెంటుకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే భూములు ఇచ్చేందుకు ఒప్పుకోమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆర్డీఓ రమణాకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పనులు చేపట్టిన 105 గ్రామాల్లో సెంటుకు రూ 2వేలు చొప్పున మాత్రమే ఇచ్చారని, ఇక్కడి రైతుల కోసం రూ 12వేలు ఇస్తున్నార న్నారు. తహశీల్దార్ కె.పుల్లారావు, బీపీసీఎల్ ప్రాజెక్టు లీడర్ భగవాన్ శుక్లా, సైట్ ఆఫీసర్ అమిత్ కాంబ్లో, సైట్ ఇన్చార్జి పవన్, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. పోలీసుల భద్రతలో పూర్తిచేస్తాం బీపీసీఎల్ పైప్‌లైన్ ఏర్పాటుపై రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మూడు గ్రామాల రైతులు -
15 శాతం వృద్ధిరేటే లక్ష్యం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబునరసరావుపేట: జిల్లాలో 2025–26 ఆర్థిక ఏడాదిలో 15 శాతం వృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. ప్రధానంగా ఉద్యాన పంటలు, పశు పోషణ, పర్యాటక రంగాలలో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారిస్తామన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా అభివృద్ధి, ఉపాధి హామీ ప్రణాళికపై మాట్లాడారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం 20వేలు హెక్టార్లకు పెంచనున్నామన్నారు. పంచ ప్రాధాన్యత కార్యక్రమాలు.. అన్ని అనుమతులు పొంది వివిధ కారణాల చేత నిలిచిపోయిన పరిశ్రమలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవటం ద్వారా ఉపాధి అవకాశాలతో పాటూ పారిశ్రామిక వృద్ధి సాధించగలమన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక నూతన హోటల్ ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉపాధిహామీ పథకంలో పంచ ప్రాధాన్యతా కార్యక్రమాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్ని చెరువులలో కనీస అవసరాలకు తగ్గట్టు నీరు నింపడం, కాల్వల పూడికతీత పనులు చేపడతామన్నారు. మొత్తం 6500 ఫామ్ పాండ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో మురళి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి పాల్గొన్నారు. రెండు హాస్పిటళ్లకు జరిమానా.. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై రోగుల నుంచి డబ్బులు వసూలుచేసిన రెండు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు సుమారు 30 ఫిర్యాదులను పరిశీలించారు. రోగులకు నగదు రహిత వైద్యసేవలు అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ బీవీ రంగారావు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణకు దరఖాస్తులు.. నరసరావుపేట: జిల్లాలో ఈ ఏడాది జనవరి ఆరు నుంచి ఏప్రిల్ మూడవ తేదీవరకు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అన్ని రకాల ఫారాల క్లెయిములు 2995 ఉన్నాయని, అందులో నూతన ఓటర్లు 296 మంది, తొలగింపులు 2280 ఉండగా, మార్పులుకు 416 అందాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. గురువారం ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం చేపడుతున్న పలు విధానాలను ఎప్పటికప్పుడు తెలియచేసే విధంగా ప్రతి నెల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందన్నారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే దాడులు
వినుకొండ: దేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాత్రమే ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆళ్ల సాంబిరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎం.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ కూటమి నేతలు నేరపూరిత, ఘర్షణ వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టే తాము రెడ్‌బుక్ రాజ్యాంగం అంటున్నామన్నారు. ఇటీవల బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామంలో ఆళ్ల సాంబిరెడ్డి, ఆళ్ల పాపిరెడ్డిలపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారని, వారి ఇళ్లపై కూడా దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనను స్థానిక టీడీపీ నేతలు కూడా ఖండించారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏ రాజ్యాంగంలో ఉందని, గ్రామాల్లో భావప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా మోటారు సైకిళ్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్రం కనిపిస్తే ఆ బళ్లు ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడం కూటమి నేతలకు పరిపాటిగా మారిందన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను గుర్తించి కేసులు నమోదు చేయడం, వేధించడంతో పాటు ఇరువర్గాల ఘర్షణలో కూడా ఒక వర్గం వారికి స్టేషన్ బెయిల్, మరో వర్గం వారిపై 307కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇది రెడ్‌బుక్ రాజ్యాంగం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అన్నారు. గ్రామాల్లో ఘర్షణలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు అమ్మిరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కక్షాపూరిత వాతావరణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, చిన్నచిన్న ఘర్షణల్లో కూడా పోలీసులు తలదూర్చి కేసులు నమోదు చేయడం తాము ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలు పట్టించుకోకుండా గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బాధితుడు సాంబిరెడ్డి మాట్లాడుతూ అకారణంగా తమ కుటుంబంపై దాడి చేసి తన జేబులో సెల్‌ఫోన్ లాక్కొన్నారన్నారు. అదేమని ప్రశ్నించినందుకు తమ కుటుంబంపై మూకుమ్మడిగా దాడికి తన కన్నతల్లిపై కూడా దాడి చేశారన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన గెలుపు కోసం పనిచేశానని, తనపై జరిగిన దాడిని టీడీపీ నాయకులు వక్రీకరించడం బాధాకరమని అన్నారు. పార్టీ బొల్లాపల్లి మండల అధ్యక్షుడు బత్తి గురవయ్య, వినుకొండ అధ్యక్షులు దండు చెన్నయ్య, మన్నెయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోటారు సైకిళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ పెట్టుకున్నా తట్టుకోలేక పోతున్నారు ఉద్దేశపూర్వకంగా దాడులు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్ -
నేటి నుంచి యడ్లపాడు ‘కళా సంబరం’
యడ్లపాడు: కళల పండుగకు వేళయింది. యడ్లపాడు గ్రామం ఇందుకు వేదికై ంది. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 4,5,6 తేదీలలో జరిగే ఈ సంబరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రంగస్థల కళాకారులు తమ ప్రదర్శనలతో కళాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నారు. మూడు రోజులు జరిగే ఈ పోటీలకు 10 నాటికలను ప్రదర్శించి కళావిందు చేయమన్నారు. 4,5,6 తేదీల్లో నిర్వహణ.. ప్రదర్శనకు రానున్న 10 నాటికలు పండుగ వాతావరణంలో పల్లె వీధులు -
పల్నాడు
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి: వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి నిత్యన్నదానానికి కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్ష విరాళాన్ని గురువారం అందజేశారు.కొనసాగుతున్న సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురు వారం కొనసాగింది. పలు విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. 7 -
కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!
● జిల్లావ్యాప్తంగా 24 పాఠశాలల్లో నోటిఫికేషన్ విడుదల ● 6వ తరగతి, ఇంటర్మీడియెట్‌లో దరఖాస్తుల ఆహ్వానం ● ఏప్రిల్ 11వరకు స్వీకరణ బెల్లంకొండ: బాలిక విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకు వేళయింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన బాలికలు ఆరవ తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం పొందవచ్చు. ● జిల్లావ్యాప్తంగా 24 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధించే ఈ విద్యాలయాల్లో ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఒక్కో పాఠశాలలో 40 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన ఈ విద్యా సంవత్సరం 960 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో పాఠశాలలో ఒక ఇంటర్మీడియెట్ కోర్సు కేటాయించి బాలికలతో విద్యాభ్యాసం చేయిస్తున్నారు. ఒక్కొక్క కేజీబీవీలో 40 మంది చొప్పున ఇంటర్మీడియట్లో కూడా 960 సీట్లను భర్తీ చేస్తారు. అదేవిధంగా 7, 8, 9, 10 తరగతులతోపాటు, ఇంటర్ సెకండియర్ ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. ● అనాథ పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, డ్రాప్ అవుట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదివిన బాలికలై ఉండాలి. అదేవిధంగా ఇంటర్లో ప్రవేశాలకు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. ● కేజీబీవీలలో ఆన్లైన్లో https:/ apkgbv. apcfss. in/వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో సందేహాలు సమస్యల నివృత్తి కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 అందుబాటులో ఉంచింది. బాలికలకు మంచి అవకాశం కస్తూర్బా పాఠశాలల్లో బాలికలు చదువుకోవడానికి గొప్ప అవకాశం. ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు. ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తూ నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందజేస్తుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పాఠశాలలు ఎంతో తోడ్పడతాయి. ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. – టి.వెంకట సుబ్బారావు, అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్, పల్నాడు జిల్లా -
రంగస్థల ప్రియులకు పండుగ
ఈసారి నాటికల పోటీలు రంగస్థల ప్రియులకు పర్వదినాలుగా మారనుంది. దాతలు, అతిథులు, కళాకారులకే కాదు గ్రామంలోని గడపగడకు ఆహ్వాన పత్రాలు, కూపన్లు ఇస్తున్నాం. ప్రదర్శనలకు వచ్చే ప్రతి ప్రేక్షకుడికి రోజుకో వైరెటీ అల్పాహారం, రోజు 30 మంది చొప్పున 3 రోజులు లక్కీడ్రా తీసి 90 మందికి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వనున్నాం. ప్రతి నాటికను యూట్యూబ్, షోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం. దీని ప్రత్యేక లింకును ప్రదర్శనకు 2గంటల ముందు అందరికీ చేరుస్తాం. నటీమణులకు సారెతో ఆడుపడుచు సత్కారం ఇస్తాం. – డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం అధ్యక్షుడు -
మొరాయిస్తున్న సాగర్ కుడికాలువ గేట్లు
విజయపురిసౌత్: సుమారుగా 10.50లక్షల ఎకరాలకు సాగునీరందించే కుడి కాలువ గేట్లు మూడేళ్లకే మరమ్మతులకు లోనయ్యాయి. ఎనిమిదో గేటు కిందికి దిగకపోవడంతో గురువారం ఎమర్జెన్సీ గేటు ద్వారా దానిని మూసివేసి రెండో గేటు ద్వారా కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు మూడు గేట్లు ఉండగా, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు 9 గేట్లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కుడి కాల్వ తొమ్మిదో గేటు కిందికి, పైకి జరుగకపోవడంతో బలవంతగా కిందికి దింపేందుకు ప్రయత్నం చేయగా ఊడిపోయి కాలువలోకి కొట్టుకు పోయింది. ఆ గేటును అమర్చకపోవటంతో చాలా రోజులు వరకు నీటి విడుదల కొనసాగింది. ఆ సమయంలోనే కుడి, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దగల తూములకు కొత్తగేట్లకు టెండర్లు పిలిచారు. తొమ్మిదో గేటు మరమ్మతులు చేశాక అదే కంపెనీకి పనులు అప్పగించారు. కుడి హెడ్ రెగ్యులేటర్ గేట్లకు తొమ్మిదింటికిగాను రూ.3.30కోట్లు, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ మూడు గేట్లకు రూ.2.50కోట్లు, సూట్ గేటుకు రూ.1.50కోట్లకు 2022లో టెండర్లు పిలిచి పనులు చేయించారు. అవికాస్త అప్పుడే మరమ్మతులకు గురైనట్లు సమాచారం. విద్యుదుత్పాదన కేంఽద్రం ద్వారా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో హెడ్‌రెగ్యులేటర్ గేట్లు అంతగా వినియోగించ లేదు. నీటి అవసరాల మేరకు ఎక్కువగా 2,9వ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇటీవలే ఈ రెండు గేట్లు మూసివేసి ఎనిమిదో గేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం దానిని మూసేందుకు ప్రయ త్నించగా కిందికి దిగలేదు. దీంతో ఇంజినీర్లంత శ్రమించి ఎట్టకేలకు మూసివేశారు. ప్రస్తుతం రెండో గేటు ద్వారా 3,031 క్యూసెక్కులు కుడి కాలు వకు విడుదల చేస్తున్నారు. బుధవారం వరకు 4050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూడేళ్లకే మరమ్మతులకు లోనైన ఎనిమిదో గేటు -
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య
బొల్లాపల్లి: పురుగుమందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామానికి చెందిన బైలడుగు రమణ(45) మద్యానికి బానిసైన భర్తను బెదిరించేందుకు గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగింది. వెంటనే బంధువులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. భర్త చిన్న బాదరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ జె.భాస్కరరావు తెలిపారు. -
హ్యూమన్ రైట్స్, ఏసీబీ ఫోర్స్ లీగల్ కమిటీ ఎంపిక
మాచర్ల: రాష్ట్రంలో అవినీతి నిరోధక మానవ హక్కుల పరిరక్షణ, హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థకు మాచర్ల పట్టణానికి చెందిన ఇరువురు న్యాయవాదులను రాష్ట్ర, జిల్లా లీగల్ ఇన్చార్జిలుగా నియమిస్తూ బుధవారం ఫౌండర్ దేవానంద్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది భవనం వెంకట నరసింహారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్‌గా ఆర్జీఎన్, ఏసీబీ తరఫున ఎంపిక చేసి ఉత్తర్వులు అందించారు. మరో న్యాయవాది చల్లా వెంకటేశ్వరరావును పల్నాడు జిల్లా సంస్థ ఇన్ఛార్జిగా, జిల్లా లీగల్ అడ్వైజర్‌గా నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మానవ హక్కుల పరిరక్షణకు సంస్థ తరఫున కృషి చేస్తామన్నారు. వీరిని పలువురు అభినందించారు. -
కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
నకరికల్లు: ప్రమాదవశాత్తూ కాలువలో జారిపడి గల్లంతైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన దూదేకుల హర్షదుల్లా (21) మార్చి 31న తన మిత్రులతో కలసి మండలంలోని శ్రీరాంపురం సమీపంలోని బెల్లంకొండ బ్రాంచి కెనాల్లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. మిత్రులందరూ ఈత కొడుతుండగా హర్షదుల్లా కాలువ ఒడ్డున కూర్చొని నీళ్లు తాగుతుండగా ఒడ్డు విరిగి జారిపడి కాలువలో గల్లంతయ్యాడు. ఎంత వెదికినా ఫలితం లేకపోయింది. బుధవారం హర్షదుల్లా మృతదేహం నీటిపైకి తేలడంతో వెలికితీశారు. మృతుడు వెటర్నరీ డిప్లమో కోర్సు పూర్తి చేశాడు. తండ్రి హాసన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. చేతికొచ్చిన కొడుకు అకాలమృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నదిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం అమరావతి: నదిలో చేపలు పట్టడానికి వెళ్లి మంగళవారం గల్లంతైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. కృష్ణానదిలో అమరేశ్వరస్వామి గుడి సమీపంలో గల్లంతైన స్థానిక బీసీ కాలనీకి చెందిన నల్లకొట్ల రాజేష్(19) మృతదేహం బుధవారం మధ్యాహ్నం లభ్యమైంది. నదిలో గజ ఈతగాళ్లు బుధవారం ఉదయం నుంచి గాలిస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజేష్ మృతదేహాన్ని కనుగొని ఒడ్డుకు చేర్చారు. అమరావతి పోలీసులు రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రాజేష్ కుటుంబసభ్యులకు అప్పగించారు. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ పరిచయం గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ పరిచయ కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తితోపాటు పలు జడ్జిలు అభినందనలు తెలిపారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారి కాసు వెంకటరెడ్డిని పలువురు న్యాయవాదులు, బార్ కౌన్సిల్ మెంబర్ వట్టి జొన్నల బ్రహ్మారెడ్డి అభినందించారు. బార్ కొత్త అధ్యక్షుడు వెంగళ శెట్టి శివ సూర్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదుల ప్రయోజనాల కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. -
ప్రకృతి వ్యవసాయంతో సమృద్ధిగా సూక్ష్మపోషకాలు
బెల్లంకొండ: ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పంటలను సాగు చేయడం, అంతర పంటలను పండించడం ద్వారా అధిక దిగుబడి ఆదాయంతో పాటు భూమికి కావలసిన సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందుతాయని ప్రకృతి వ్యవసాయం అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్ తెలిపారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపాలెం, పాపాయపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ విధానంపై గ్రామ సభలు నిర్వహించారు. అడిషనల్ డీపీఎం మాట్లాడుతూ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025– 26 సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు భూమి విస్తీర్ణం, పండించే పంటలు, పాడి పశువుల వివరాలను సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఏ సైదయ్య, పవన్ కుమార్, అనంతలక్ష్మి, మాధవి, మహాలక్ష్మి, వీఏఏలు అయ్యప్ప, వంశీ, నాయకులు వెన్న వెంకటరెడ్డి, తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి, ఓర్చు ప్రసాదరావు, రైతులు పాల్గొన్నారు. అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్ -
జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా చిలువూరి కిరణ్మయి బుధవారం విధుల్లో చేరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. ప్రస్తుతం మంగళగిరి టీబీ శానిటోరియం హాస్పిటల్లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతి పొంది గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరారు. గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్మయి సికింద్రాబాద్ గాంధీలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సు 2000లో పూర్తి చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట పీహెచ్సీలో స్టాఫ్ నర్సుగా 2001 జనవరిలో చేరి ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. హెడ్‌నర్సుగా 2007లో ఉద్యోగోన్నతి పొంది నిజామాబాద్ పీచ్పల్లికి బదిలీ అయ్యారు. అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక బదిలీ అయి 2008లో గోరంట్లలోని జ్వరాల ఆస్పత్రిలో చేరారు. 2018 వరకు అక్కడే పనిచేసి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం మంగళగిరి బదిలీ అయ్యారు. ఇప్పుడు గ్రేడ్ –1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరిన కిరణ్మయికి పలువురు నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ యూనియన్ అధికారులు, వైద్య సిబ్బంది, వైద్యులు అభినందనలు తెలిపారు. -
మతాల మధ్య ఘర్షణలకే వక్ఫ్ సవరణ బిల్లు
బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నరసరావుపేట: వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని ముస్లిం నాయకుడు షేక్ మస్తాన్‌వలి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం నరసరావుపేట మార్కెట్‌సెంటర్‌లో ముస్లిం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మస్తాన్‌వలి మాట్లాడుతూ ఇతరులకు ముస్లింల వక్ఫ్ ఆస్తులను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశంలో ఇలాంటి బిల్లు తీసుకొని వచ్చి మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ బిల్లును ఆపేవరకు తమ పోరాటం సాగుతుందన్నారు. లౌకిక వాదులు, ప్రజా, కుల సంఘనాయకులను కలుపుకొని, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. మైనారిటీ నాయకుడు రఫీ మౌలానా, ఆదివాసీ నాయకుడు నాయక్, సీపీఐ నాయకుడు ఉప్పలపాటి రంగయ్య, పీడీఎం నాయకులు నలపాటి రామారావు, జి.రామకృష్ణ పాల్గొన్నారు. -
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ
క్రోసూరు: ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం క్రోసూరు ప్రభుత్వ పాలిటిక్నిక్ కళాశాలలో ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహిసున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బీవీ రమాదేవీ బుధవారం తెలిపారు. పదవతరగతి పాసైన వారు, పదవతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఉచిత శిక్షణా తరగతులకు హాజరుకావచ్చునన్నారు. శిక్షణా తరగతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, ఈనెల 4వ తేదీ నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు తరగతులుంటాయన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు హైకోర్టులో ఊరట గురజాల: పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన 8 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గతంలో జరగని గొడవను జరిగినట్లు సృష్టించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే చింతపల్లి పెద్ద సైదా, అల్లాభక్షులను అరెస్టు చేసి సబ్ జైల్లో రిమాండ్‌లో ఉంచారు. మిగిలిన ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చింతపల్లి చిన మస్తాన్, పెద జానీబాషా, దస్తగిరి, చిన సైదా, జానీబాషా, జాన్ వలీలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వీరి తరఫున న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ రెడ్డి వాదించారు. బుధవారం న్యాయమూర్తి ఈ ఆరుగురిపై ఎటువంటి చర్యలు చేపట్టరాదని, అరెస్టు చేయవద్దని వారిని ఇబ్బందులు గురిచేయవద్దని తీర్పునిచ్చినట్లు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి తెలిపారు. గ్రానైట్ తరలింపు లారీ పట్టివేత ముప్పాళ్ళ: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని ముప్పాళ్ళ దర్గా సమీపంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె.చంద్రశేఖర్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీని గుర్తించారు. లోడ్‌కు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని గుర్తించి తదుపరి చర్యలు నిమిత్తం లారీని పోలీసులకు అప్పగించారు. కోచ్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేసుకోండి జిల్లా స్పోర్ట్స్ అధికారి నరసింహారెడ్డి నరసరావుపేట ఈస్ట్: క్రీడా శిక్షకుల ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు పటియాల నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పి.ఎస్.గిరిషా, జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశాల మేరకు మాస్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా మే 6వ తేదీ నుంచి జూలై 2 వరకు స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. అభ్యర్థులు తమ ధ్రువ పత్రాలతో http:// www.6wcc.nsnis.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
బ్లేడ్‌తో ఇరువురిపై దాడి
సత్తెనపల్లి: బ్లేడుతో ఇరువురిపై యువకుడు దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన గింజుపల్లి అశోక్ కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం పూటుగా మద్యం సేవించాడు. ఇంటి సమీపంలోని ఎనిమిదో తరగతి చదువుతున్న మేడూరు చాణిక్యతో ఏంటి రా నా వైపు చూస్తున్నావ్ అంటూ దూషించి దాడి చేసి బెదిరించడంతో చాణిక్య వెంటనే తల్లి మేడూరు జ్యోతికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఎయిర్టెల్ కార్యాలయంలో పనిచేస్తున్న జ్యోతి తన బిడ్డ చాణిక్యపై దాడి చేస్తున్నారంట చూసి రమ్మని తన వద్ద పనిచేసే ఏల్పూరి నవీన్, తూమాటి శ్రీకాంత్‌లను పంపింది. వారు ఇరువురు ఘటన స్థలానికి చేరుకొని ఎందుకు దాడి చేసి, బెదిరిస్తున్నావు అంటూ ప్రశ్నించగా బ్లేడ్ తీసుకొని ఏల్పురి నవీన్ మెడ, చెవి పైన, తూమాటి శ్రీకాంత్ చేతులపై అశోక్‌కుమార్ దాడి చేశాడు. ఎవరైనా దగ్గరకు వస్తే దాడి తప్పదు అంటూ బ్లేడు చూపిస్తూ హల్చల్ చేయగా స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పట్టణ ఏఎస్ఐ సుబ్బారావు పరారైన అశోక్ కుమార్‌ను క్రిస్టియన్ పేటలో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన క్షతగాత్రుడు ఏల్పూరి నవీన్‌ను ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు 10 కుట్లు వేశారు. అలాగే తూమాటి శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఏల్పూరి నవీన్ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సహజీవనానికి అడ్డు వస్తుందని చిన్నారికి చిత్రహింసలు
మంగళగిరి: సహజీవనానికి అడ్డు వస్తుదన్న అక్కసుతో తల్లి, పెద్దనాన్న చిన్నారిని చిత్రహింసలు పెట్టి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మరియమ్మకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నకుమార్తె ప్రీతి అక్క భర్త నాగేంద్రబాబుతో ప్రేమలో పడి సహజీనం చేస్తోంది. దీనిని గమనించిన ప్రీతి భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రీతికి మూడేళ్ల పాప ఉంది. దీంతో పాపతో సహా ప్రీతి, నాగేంద్రబాబు చినకాకానిలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని మూడునెలలుగా నివాసం ఉంటున్నారు. తమ బంధానికి అడ్డు వస్తుందన్న అక్కసుతో కొద్ది రోజులుగా నాగేంద్రబాబు పాపను కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడు. పాపను అమ్మమ్మతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నాడు. మంగళవారం రాత్రి నాగేంద్రబాబు ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండడంతో కోపంతో ఊగిపోయాడు. దారుణంగా కొట్టాడు. ప్రీతి కూడా అడ్డు చెప్పలేదు. సమాచారం తెలుసుకున్న అమ్మమ్మ మరియమ్మ పాపను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించింది. బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక స్వావలంబనతో మహిళల్లో ఆత్మవిశ్వాసం
బాపట్ల: ఆర్థిక స్వావలంబనతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ పి.ప్రసూనారాణి అన్నారు. ఐసీఏర్ ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా వ్యవసాయ కళాశాల జీవ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఈపూరుపాలెంలో స్వయం ఉపాధి కల్పన నైపుణ్యాలపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసూనారాణి మాట్లాడుతూ మహిళలంతా చేతివృత్తుల్లో నైపుణ్యం పెంచుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు వ్యాపారవేత్తలుగా రాణించాలని తెలిపారు. ఈపూరుపాలేనికి చెందిన కార్యంపూడి సుబ్బారావు హ్యాండ్ పెయింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్‌పై అవగాహన కల్పించారు. -
యార్డుకు 1,30,848 బస్తాలు మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,30,848 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,28,132 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,600 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 56,061 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
ఆకట్టుకున్న కరెన్సీ ఎగ్జిబిషన్
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో బుధవారం కరెన్సీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కో–ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ స్వర్ణ చినరామిరెడ్డి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాలకు చెందిన కరెన్సీనోట్లు, నాణేలను ప్రదర్శనలో ఉంచారు. రాజుల కాలం నుంచి బ్రిటిష్ వారి హయాం వరకు, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి నేటివరకు వినియోగించిన కరెన్సీ, నాణేలను ప్రదర్శించారు. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆమెరికా ఖండాలకు చెందిన 78 దేశాల 489 నాణేలు, 76 దేశాలకు చెందిన 188 కరెన్సీ నోట్లు ఇక్కడ ఉంచారు. వివిద పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కరెన్సీ, నాణేల వివరాలను ఆసక్తిగా ఆడిగి తెలుసుకున్నారు. రిటైర్డ్ స్కౌట్ టీచర్ కృష్ణయ్య, లింగాల తిరుపతయ్యలు నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథి స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ఇన్ని దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం అభినందనీయమన్నారు. 30 సంవత్సరాలుగా కరెన్సీ సేకరణను కృష్ణయ్య హాబీగా చేసుకోవడం వలన ఇది సాధ్యమయిందని తెలిపారు. పాఠశాల స్కౌట్ మాస్టర్ పమ్మి వెంకటరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 3వతేదీ నుంచి ప్రారంభం కానుంది. పట్టణంలోని కేబీఆర్ కళాశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పల్నాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండేలా కేబీఆర్‌ను అధికారులు ఎంపిక చేశారు. ఈనెల 3 నుంచి 9వతేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగనున్న కేంద్రంలో దాదాపు 1.75 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఇందుకు గాను 121 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 726 మంది ఎగ్జామినర్లు, 242 మంది స్పెషల్ అసిస్టెంట్లు విధుల్లో పాల్గొంటున్నారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈఓ, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా డిప్యూటీ డీఈఓలు వ్యవహరించనున్నారు. ఎగ్జామినర్లు ప్రతిరోజు 40 పేపర్లు మూల్యాంకనం చేయనుండగా, వాటిని స్పెషల్ అసిస్టెంట్లు పరిశీలించిన అనంతరం వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలిస్తారు. అలాగే డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు రోజుకు 45 చొప్పున, క్యాంప్ ఆఫీసర్ 20 చొప్పున మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తారు. కాగా, మూల్యాంకన కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మూల్యాంకనం పూర్తయ్యే వరకు వైద్య సిబ్బందితో పాటు 108 అంబులెన్స్ కేంద్రం వద్ద ఉండేలా చర్యలు తీసుకున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 518.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,050 క్యూసెక్కులు విడుదలవుతోంది. విధుల్లో 1089 మంది సిబ్బంది -
అమ్మ.. బాబోయ్!
అమ్మతనం మాయంయడ్లపాడు: మానవత్వాన్ని కోల్పోయిన కొందరు తల్లులు స్వార్థం, సౌఖ్యం కోసం కుటుంబ సభ్యులు, వారి పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. చివరకు కటకటాలపాలై తమ జీవితాలను చేజేతులా చీకట్లోకి నెట్టేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జన్మనిచ్చిన తల్లే కర్కశంగా మారి తన బిడ్డను చిత్రహింసలకు గురిచేస్తే, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తల్లిస్థానంలో ప్రేమను పంచాల్సిన పినతల్లి బాధ్యతను విస్మరించి అమానుషానికి పాల్పడడం రెండు జిల్లాల్లో కలకలం రేపింది. కవలలపై పినతల్లి కిరాతకం యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన రాడ్‌బెండింగ్ పనులు చేసే కంచర్ల సాగర్, కృష్ణాజిల్లా జనగాం ప్రాంతానికి చెందిన అనూష 8 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలికాన్పులో కార్తీక్(6), ఆకాష్ అనే కవలలు జన్మించారు. రెండో కాన్పు లో పాపకు జన్మనివ్వగానే తల్లి మృత్యువాత పడింది. పాపను యనమదల గ్రామస్తులకు దత్తత ఇచ్చారు. సాగర్ ఫిరంగిపురం ప్రకాశం పంతులు నగర్‌కు చెందిన జి.లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కొత్త జీవితంలో అడుగుపెట్టిన లక్ష్మి పాపకు జన్మినిచ్చింది. సాగర్ భార్యకు దాసోహం కావడంతో మొదటి భార్య పిల్లల్ని పినతల్లి లక్ష్మి వేధించడం ప్రారంభించింది. గతనెల 29వ తేదీన లక్ష్మి కార్తీక్, ఆకాశ్‌లను బెల్టు, కర్రతో విచక్షణ రహితంగా కొట్టింది. కార్తీక్‌కు తీవ్రంగా గాయమైంది. కసితీరక గొంతునులిమి చంపేసింది. ఇక చిన్నవాడైన ఆకాష్‌ను నిక్కర ఊడదీసి కాల్చిన పెనంపై కూర్చోబెట్టింది. తట్టుకోలేక, ఆ పసిహృదయం బాధతో చేసిన ఆర్తనాదాలు విన్న వీధిలోని వారందరూ పరుగున వచ్చారు. విషయం తెలిసిన సాగర్ చెల్లెలు విజయ ఫిరంగిపురం స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని లక్ష్మి, ఆమె భర్త సాగర్‌ను అదుపులోకి తీసుకోగా, వీరికి కోర్టు రిమాండ్ విధించింది. తల్లిఒడిలో ప్రేమను ఆస్వాదించాల్సిన పసిబిడ్డలు, తండ్రుల ఆలనలో పెరగాల్సిన చిన్నారులు అమానుషత్వానికి బలవుతున్నారు. కొందరు చిన్నారులు తెలిసీ తెలియని వయసులో అమ్మల కర్కశత్వం చవిచూస్తున్నారు.. ఎవరికీ చెప్పుకోలేక.. ప్రతిరోజూ తల్లి లేదా పిన తల్లి పెట్టే వికృత చర్యలను తట్టుకోలేక.. ఆ చిన్నారులు పడిన వేదన అంతాఇంతా కాదు. ఏడ్చి, ఏడ్చి.. ఏడ్చే ఓపిక సైతం లేక, మూలుగుతూ కర్కశత్వం భరించారా చిన్నారులు. మరొక చిన్నారి తనువు చాలించాడు. వీపుపై దెబ్బల చారలు, తేలిన వాతలు, తమ కంటికింద ఏర్పడిన ఆరని కన్నీటి చారలు కసాయి అమ్మల కర్కశత్వానికి రుజువులుగా మారాయి. అమ్మ తనానికి మచ్చ తెచ్చేలా చేసిన రెండు సంఘటనలు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెలుగుచూడటం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బాలిక వీపుపై తల్లిపెట్టిన వాతలు మారుతల్లి క్రూరత్వానికి బలైన కొండవీడుకు చెందిన బాలుడు చిలకలూరిపేటలో కన్నబిడ్డను చిత్రవధ చేసిన కన్నతల్లి రెండు రోజుల వ్యవధిలో రెండు అమానుష ఘటనలు రోజురోజుకు తగ్గిపోతున్న కుటుంబ విలువలు చిలకలూరిపేటకు చెందిన కొణతం మెతూషాల, గోరోజనపు దీప్తిలు ఏడేళ్ల కిందట ఒక్కటయ్యారు. కానీ వారి వివాహబంధం ఎంతో కాలం నిలవలేదు. ఏడాది కిందట విడాకులతో ముగిసింది. పిల్లలు తండ్రి వద్ద ఉంటూనే, అప్పుడప్పుడు తల్లి వద్దకు వెళ్లేవారు. భర్త నుంచి విడిపోయాక మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తున్న దీప్తి, తన కన్నబిడ్డకు ప్రేమను పంచాల్సింది పోయి పాశవికంగా ప్రవర్తించింది. గతేడాది డిసెంబర్లో అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పాపను తీసుకెళ్లింది. కొన్నిరోజులుగా తల్లి వేధింపులు భరించలేక బాలిక గతనెల 31వ తేదీ ఇంటి నుంచి పారిపోయే క్రమంలో వీధి మలుపులో స్పృహతప్పి పడిపోయింది. ఇది గమనించిన బాలిక నాయనమ్మ ఏసమ్మ ఆసుపత్రికి తరలించి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో తల్లి దీప్తి, ఆమె సహజీవనం చేస్తున్న ప్రియుడు చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. వెంటనే పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పోలీసులే కాకుండా బాలల హక్కుల పరిరక్షణ అధికారులు సైతం స్పందించి చికిత్స నిమిత్తం బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ భవన్‌కు అప్పగించనున్నారు. -
నేడు కేతవరంలోప్రతిష్టా మహోత్సవం
బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన కేతవరంలో కొండపై వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహుని ఆలయంలో గురువారం ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నట్లు మండల దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొండ దిగువన గల స్వామివారి ఆలయం వద్ద జీవ ధ్వజస్తంభం, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరగనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అభాగ్య శిశువుల కోసం ఊయల నరసరావుపేట: అభాగ్యులైన శిశువులను అక్కున చేర్చుకునేందుకు బుధవారం జిల్లా శిశు సంక్షేమం, సాధికారిత అధికారి ఆధ్వర్యంలో పెద్దచెరువులోని శిశుగృహంలో క్రెడిల్ బేబీ రెడెప్షంన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అభాగ్యులైన శిశువులను చెత్తకుప్పలు, కాలువల్లో వేయకుండా బతకనిచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని పీడీ ఉమాదేవి కోరారు. సూపరింటెండెంట్ లోకనాథం, నోడల్ అధికారి అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. కోళ్లఫారాలను పరిశీలించిన అధికారులు వినుకొండ: మండలంలోని వెంకుపాలెం, కోటప్పనగర్, ఈపూరు మండలలోని చిట్టాపురం, శ్రీనగర్ గ్రామాల్లోని బ్రాయిలర్ కోళ్ల ఫారాలను జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ కె.కాంతారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఫారంలోని కోళ్లు ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్థారించారు. పౌల్ట్రీ ఫారం రైతులు కాళంగి శ్రీనివాసరావు, దావూలూరి రంగారావులను ఫారంలో తీసుకుటున్న బయో సెక్యూరిటీ పద్ధతులను గురించి అడిగి తెలుసుకున్నారు. బర్డ్ ఫ్లూ కలకలం నేపధ్యంలో ఫారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలిపారు. అదేవిధంగా బ్రాయిలర్ కోళ్లకు మేత పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలిపారు. వినుకొండ సహాయ సంచాలకులు డాక్టర్ బి.సరోజాదేవి, ఈపూరు సహాయ సంచాలకులు డాక్టర్ పయ్యావుల శ్రీనివాసమూర్తి కొండ్రముట్ల పశువైద్య అధికారి డాక్టర్ వి.గోపాల్ నాయక్, పశుసంవర్థక సిబ్బంది నాగరాజు, శివశంకర్, శిరిష తదితరులు పాల్గొన్నారు. ‘98’ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి మంగళగిరి టౌన్: 1998 డిఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళగిరి ఐబీఎన్ భవన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఉద్యోగం రాని వారికి వయోపరిమితి నెలల వ్యవధి మాత్రమే ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ రిమైనింగ్ కాండిడేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు డీఎస్సీపై ఎటువంటి స్పందన లేదని, పలుమార్లు విజ్ఞాపనలు సమర్పించామని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో దాదాపు 1500 మంది అభ్యర్ధులు ఉన్నారని, 600 శాంక్షన్డ్ పోస్టులు మిగిలి ఉన్నాయని మానవతా దృక్పథంతో మరో 900 పోస్టులు కలిపి తక్షణం ఎస్జీటీలుగా అపాంయింట్మెంట్లు ఇవ్వాలని కోరారు. అనంతరం ప్రెస్‌క్లబ్ నుంచి మంగళగిరి అంబేడ్కర్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. 98 డిఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
సజావుగా జేఈఈ మెయిన్స్
గుంటూరు ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) లకు విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీబీటీ విధానంలో ఆన్లైన్ పరీక్షల కోసం గుంటూరులో రెండు, పల్నాడు జిల్లాలో రెండు చొప్పున వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అయాన్ డిజిటల్ జోన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు హడావుడి పడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈనెల 3, 4, 7, 8వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, 9వ తేదీన పేపర్–2ఏ బీఆర్క్,పేపర్–2బీ బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడులోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు -
12వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుచేసి 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై నిరసన చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఎల్వీ రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ బి.సంపత్ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో కారుణ్యనియామకాలు వెంటనే చేపట్టాలని, కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. మూడు పెండింగ్ డీఏలను చెల్లించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ 57వ మెమో ద్వారా పాత పెన్షన్ విధానం అమలుచేయాలన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవు బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్, జీపీఎస్‌లను రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలుచేయాలని, 70ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75ఏళ్లు నిండిన వారికి 15శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలుచేయాలని కోరారు. కమిటీ సభ్యులు ఎం.మోహనరావు, ఆర్.గోవిందరాజులు, వి.అశోక్‌కుమార్, మొహిద్దీన్ బేగ్, ఉస్మాన్ పాల్గొన్నారు. ఏపీ ఫ్యాప్టో నాయకుల డిమాండ్ -
తోడు దొంగలు చిక్కరు..దొరకరు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఇద్దరూ తోడు దొంగలు.. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో నేర్పరులు. సీసీ కెమెరాలకు చిక్కరు.. దొరకరు.. మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు చేసినా ఏ పీఎస్ పరిధిలోనూ వీరిపై కేసుల్లేవు. ఎట్టకేలకు నల్లపాడు పోలీసులు వీరి ఆట కట్టించారు. ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెలలో నల్లపాడు పీఎస్ పరిధిలోని లింగయ్యపాలెంలో, గుంటూరు క్లబ్ దగ్గర్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. దీనిపై సీఐ వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. ఏటుకూరురోడ్ డీఎస్ నగర్ తొమ్మిదో వీధిలో ఉంటున్న టైలర్ వల్లెపు శ్రీనును అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతనిచ్చిన సమాచారంతో వసంతరాయపురం నాలుగో వీధికి చెందిన అన్నపురెడ్డి శివ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి బంగారు గొలుసుల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చోరీలు చేసినట్టు తేల్చారు. ఇప్పటివరకు 13కుపైగా చోరీలకు పాల్పడినా వీరిపై కేసులు లేవని గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.32 లక్షల ఖరీదు చేసే 390 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును దర్యాప్తు చేసిన సీఐ వంశీధర్, ఎస్ఐ జనార్దన్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, మస్తాన్‌వలి, బిక్షనాయక్, వెంకటేశ్వర్లును ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి.. శివసుబ్రహ్మణ్యం 2009లో చీరాల నుంచి గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు. తొలినాళ్లలో ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2018లో ఓ సినిమా ఽథియేటర్‌లో టైలర్ శ్రీను పరిచయమయ్యాడు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 2022 నుంచి చోరీలకు శ్రీకారం చుట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడం ప్రారంభించారు. స్కూటీపై వెళ్తూ గొలుసులు తెంచుకెళ్లేవారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఆధారాల్లేకుండా జాగ్రత్తపడటంలో వీరు నేర్పరులు. ధనవంతులు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా చోరీలు చేశారు. దొంగలించిన సొత్తును తెలిసిన వారి ద్వారా బంగారు దుకాణాల్లో విక్రయించేవారు. ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకుని జల్సాలు చేసేవారు. వీరు పట్టాభిపురం పీఎస్ పరిధిలో 2, నల్లపాడు పీఎస్ పరిధిలో 4, తెనాలి వన్‌టౌన్ పరిధిలో 2, అరండల్ పేట పీఎస్, తెనాలి త్రీటౌన్ పీఎస్, చీరాల టూ టౌన్, చీరాల త్రీ టౌన్ పీఎస్ పరిధిలో ఒక్కొక్క చోరీ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు. గొలుసుల చోరీల్లో దిట్టలు మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు ఏ పీఎస్‌లోనూ కేసుల్లేవు ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం -
పింఛన్లు తుంచేస్తున్నారు
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం పింఛను లబ్ధిదారుల సంఖ్యను క్రమేపీ తుంచేస్తోంది. జిల్లాలో క్రమంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందే వారి సంఖ్య తగ్గిపోతుంది. గత తొమ్మిది నెలల కాలంలో 10,161మంది లబ్ధిదారులు తగ్గారు. తాజాగా పదో నెల ఏప్రిల్‌లో మరో 397మంది తగ్గారు. ఈనెల 2,71,568 మందికి అందజేయాల్సివుంది. ఒకటో తేదీ మంగళవారం నుంచి జిల్లాలో పంపిణీ మొదలు పెట్టగా సాయంత్రం 5.30నిమిషాలకు 2,45,715 (90.48శాతం) మందికి అందజేశారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు దుర్గి మండలంలో స్వయంగా పర్యటించి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ముగిసి నూతన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జిల్లా వ్యాప్తంగా 2,82,126మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గతేడాది జూలై మొదటి తేదీన కూటమి ప్రభుత్వం పింఛన్లు అందజేయటం మొదలు పెట్టింది. ఈ పది నెలల్లో 10,558 మంది లబ్ధిదారులు తగ్గటం గమనార్హం. దుర్గిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన దుర్గి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించటం కోసం పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు మంగళవారం దుర్గి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. కలెక్టర్ అరుణ్‌బాబు మండల కేంద్రమైన దుర్గిలో మొత్తం 1102 పెన్షన్లకు గాను వాటి వివరాలు తెలుసుకొని, స్థానిక ఎస్సీ కాలనీకి వెళ్లి పలువురికి ఆయన చేతుల మీదుగా పెన్షన్‌ను పంపిణీ చేశారు. వివిధ శాఖల అధికారులకు ప్రభుత్వ పథకాల గురించి వివరించి వారికి దిశానిర్దేశం చేశారు. ఎటువంటి అలసత్వం లేకుండా పథకాల అమలుకు తోడ్పాడాలని ఆదేశించారు. అనంతరం ఓబులేశునిపల్లె, గజాపురం గ్రామా ల మధ్యలో పశువుల కోసం నీటి తొట్టెల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పశువులకు ఏర్పాటు చేస్తున్న నీటి తొట్టెలను ఉపయోగించుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్మవరంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులను అభినందించారు. ఆయనవెంట ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ ఐ.ఫణీంద్ర కుమార్, డీఎల్డీఓ డి.గబ్రూ నాయక్, పీడీ ఎం.సిద్ధలింగమూర్తి, ఏపీడీ మల్లిఖార్జున, ఎంపీడీఓ శివప్రసాద్ ఉన్నారు. జిల్లాలో క్రమంగా తగ్గుతున్న పింఛన్లు పది నెలల్లో 10,558 పింఛన్లు తగ్గుదల ఈనెల 397 మందికి కోత -
ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెంచాలి
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెంచాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. రావిపాడు రోడ్డులోని బృందావనంలో మంగళవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 28 మండలాల్లో 222 వీఓ సంఘాల పరిధిలో 132 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయ విధానం కొనసాగుతుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సాగు చేపట్టాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో భాగంగా మొదటగా 56 గ్రామాలు, రెండవ విడతలో 64 గ్రామాలు మొత్తం 120 గ్రామాల్లో నూతనంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను పండించడం వలన జీవకోటికి ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుందనితెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజు, జిల్లా ఎన్ఎఫ్ఏలు నందకుమార్, సౌజన్య, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
నకరికల్లు: ఉపాధిహామీ పథకంలో తమను ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేర్చుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ విధుల్లోకి తీసుకోవడం లేదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసిన కె.శివగోపి, ఆవుల సుకన్య, ఎన్.మేరీ వసంతకుమారి, పల్నాటి చెన్నకేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు నకరికల్లు ఎంపీడీఓ జి.కాశయ్యను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని అకారణంగా అధికారులు తమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించినా తీసుకోకపోవడంతో రిజిస్టర్ పోస్టుద్వారా పంపామని అయినా విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో తమకు అన్యాయం జరిగిందని ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించగా తమను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ తమను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీడీఓ జి.కాశయ్యను వివరణ కోరగా డిపార్ట్మెంట్ లీగల్ అడ్వయిజర్‌ను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోని అధికారులు