
గుంటూరుకు ఏమైంది ?
అంతం కాని డయేరియా భూతం అదుపులోకి రాని వ్యాధి ప్రతిరోజూ జీజీహెచ్‌లో బాధితుల చేరిక రాత్రి సమయాల్లో ఎక్కువగా అడ్మిషన్లు 165 మందికి పైగా బాధితులకు చికిత్స కట్టడి చేయడంలో విఫలమవుతున్న అధికారులు
గుంటూరుమెడికల్: డయేరియా భూతం గుంటూ రు నగరాన్ని పట్టి పీడిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజులుగా నగరంలో వాంతులు, విరేచనాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కి వస్తున్నారు. వ్యాధిని కట్టడి చేయడంలో అధికా ర యంత్రాంగం విఫలమైందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
కలరా భయంతో వణుకు
ఓ పక్క డయేరియాతో వణికిపోతున్న నగర ప్రజానీకానికి మరోపక్క కలరా భయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారులు గణాంకాల ప్రకారం గుంటూరుకి చెందిన ముగ్గురు కలరాతో జీజీహెచ్‌లో చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యారు. పూర్తిస్థాయిలో నివేదికలు బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను కూడా అధికారులు దాస్తున్నారు. డయేరియా, కలరా బాధితుల గణాంకాలు వివరించేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే కారణాలతో సాధ్యమైనంత మేరకు గణాంకాలను దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలు చెబితే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయనే భయంతో అన్ని శాఖల వారు మౌనంగా ఉంటున్నారు.
వ్యాధి కట్టడిలో కీలకం
సాధారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేయాలి. వ్యక్తిగతంతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఈ వ్యాధుల కట్టడిలో కీలకం. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. మురుగు కాలువల్లో తాగునీటి పైప్‌లైన్లు ఇంకా మునిగే ఉన్నాయి. గతంలో జరిగిన ప్రాణ నష్టం నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. విధుల నిర్వహణలో నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.
ఏ మాత్రం తగ్గని డయేరియా
ఈనెల 15న గుంటూరు జీజీహెచ్‌లో మొట్టమొదటిసారిగా డయేరియా బాధితులు అడ్మిట్ అయ్యా రు. నాటి నుంచి ప్రతిరోజూ చికిత్స కోసం వస్తూనే ఉన్నారు. ఇటీవల కలరా కలకలం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవైపు డయేరియా, మరోవైపు కలరాతో ఈ నగరానికి ఏమైందంటూ మేధావులు సైతం పెదవి విరుస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఇప్పటి వరకు 165 మందికి పైగా డయేరియా తో చికిత్స పొందారు. వీరిలో ఆరోగ్యం కుదుటపడిన సుమారు 80 మందిని డిశ్చార్జి చేశారు. వాంతు లు, విరేచనాలు ఎక్కువగా అవడంతో కిడ్నీల సమ స్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న ముగ్గురిని ఐసీయూలో అడ్మిషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తొలుత డయేరియా బాధితుల కోసం ఇన్‌పేషెంట్ విభాగంలోని జనరల్ సర్జరీ విభాగం 333 నంబరును కేటాయించారు.