
కరుణించవమ్మా...
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. జిల్లాలోని వివిధ దేవస్థానాలలో శనివారం ప్రత్యేక అలంకరణలో అమ్మవారు కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కరుణించవమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరాలయంలో అమ్మవారిని లలితాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. దసరా వేడుకలలో ఆరవరోజు అమ్మవారు భక్తుల ప్రత్యేక పూజలు అందుకున్నారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవీఖడ్గమాల, లలిత సహస్రనామార్చన, శ్రీచక్రార్చన తదితర పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసుర మర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా బోయపాలెం పార్వతీదేవి ఆలయంలో కాత్యాయని అలంకరణలో అమ్మవారు కొలువు దీరారు. ఆలయ ధర్మకర్తలు, దాతలు ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. మహిళలు సామూహిక పూజల్లో పాల్గొన్నారు. – అమరావతి/ యడ్లపాడు
కాత్యాయని అలంకరణలో
బోయపాలెం పార్వతీదేవి
కారెంపూడిలో ధనలక్ష్మీదేవిగా
కొలువుదీరిన వాసవి అమ్మవారు
అమరావతిలో లలితాత్రిపుర సుందరి
అలంకారంలో బాల చాముండేశ్వరీ దేవి

కరుణించవమ్మా...

కరుణించవమ్మా...