
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గుండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత నర్రెడ్డి లక్ష్మా రెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్డులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మా రెడ్డిని అంతమొందించాలనే పథకంతో టీడీపీ నాయకులు ఊరి చివర మాటు వేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment