నరసరావుపేట: బార్‌లో వీరంగం.. టీడీపీ నేత కక్ష సాధింపు | TDP Leaders Destroys The Furniture In The Bar In Narasaraopet | Sakshi
Sakshi News home page

నరసరావుపేట: బార్‌లో వీరంగం.. టీడీపీ నేత కక్ష సాధింపు

Published Fri, Nov 1 2024 10:10 AM | Last Updated on Fri, Nov 1 2024 3:55 PM

TDP Leaders Destroys The Furniture In The Bar In Narasaraopet

సాక్షి, పల్నాడు: నరసరావుపేటలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మద్యం షాపులో వాటా ఇవ్వలేదని కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు బార్‌లో వీరంగం సృష్టించారు. అనుచరులతో కలిసి బార్‌లోని ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. టీడీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని బార్‌ నిర్వాహకులు అంటున్నారు.

బార్ అండ్ రెస్టారెంట్‌ యజమాని పోక శ్రీనివాసరావు మాట్లాడుతూ, 26 ఏళ్లగా బార్ నడుపుతున్నామని.. ఎప్పుడూ తమ​​కు ఇంత ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. మొన్న మద్యం టెండర్లలో మొత్తం 145 షాపులకు దరఖాస్తు చేసుకున్నాం. నరసరావుపేట టౌన్‌లో 7 మద్యం షాపులకు 5 మద్యం షాపులు  మాకు వచ్చాయి. టెండర్‌లో మేము గెలుచుకున్న మద్యం షాపులన్ని మాకు అప్పగించాలంటూ టీడీపీ నాయకులు తమపై ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు.

టీడీపీ నాయకులు కోరినట్టే మేము టెండర్‌లో గెలుచుకున్న షాపులు వాళ్లకు అప్పజెప్పాము. అయినా సరే మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. టీడీపీ నాయకులు పిలిచినప్పుడు మేము వెళ్లలేదని ఇవాళ మా బార్ అండ్ రెస్టారెంట్‌పైన దాడి చేశారు. నరసరావుపేటలో అరాచక శక్తుల నుంచి మమ్మల్ని కాపాడాలి’’ అని శ్రీనివాసరావు వేడుకుంటున్నారు.

మద్యం షాపులు అప్పగించాలంటూ బార్‌లో టీడీపీ నేత వీరంగం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement