సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.
203, 204, 206 పోలింగ్ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్‌లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్‌లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్‌లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.
ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది.
Comments
Please login to add a commentAdd a comment