
పిడుగురాళ్లలో టీడీపీ గుండాగిరి(ఫైల్ ఫోటో)
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో టీడీపీ నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. బరితెగించిన ఆ పార్టీ నేతలతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యారు. రేపు(సోమవారం) మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పది రోజులుగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మునీరా దంపతుల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దగ్గరుండి మరి.. మునీరా దంపతుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చివేయించారు.
కాగా, ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.
తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment