మాచర్ల: గుంటూరు జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేతను చీటింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడి ఫిర్యాదుతో బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్లితే.. మాచర్ల నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కాశీపతి గుంటూరుకు చెందిన ముత్తయ్య అనే వ్యక్తి నుంచి కొన్ని రోజుల క్రితం రూ.1.50 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి కాశీపతిని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై జయకుమార్ తెలిపారు. అతని అరెస్టును పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.