సాక్షి, మాచర్ల: ఆధ్యాత్మిక భావన కలిగిన ఓ వృద్ధుడు సజీవ సమాధి అయ్యేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల తాతిరెడ్డి లచ్చిరెడ్డి తాను సజీవ సమాధికిలో వెళ్లాలని దేవుడు ఆజ్ఞాపించాడని అంటూ స్వయంగా సమాధి నిర్మాణ పనులు చేపట్టాడు. పది అడుగుల లోతులో దాన్ని నిర్మించి ఇనుప తలుపులు కూడా ఏర్పాటు చేశాడు.
బుధవారం మంచి రోజని, తనకు సమాధిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో లచ్చిరెడ్డిని సమాధిలోకి వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. మాచర్ల రూరల్ సీఐ దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఎస్‌ఐ లోకేశ్వరరావు గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకొని సమాధిలోకి వెళ్లటం నేరమని కౌన్సెలింగ్ చేశారు. ఆధ్యాత్మిక భావనలతో పదేళ్లుగా లచ్చిరెడ్డి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment