సాక్షి, పల్నాడు: మాచర్ల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించి కారకులను పట్టుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు పల్నాడు ఎస్పీ రవిశంకర్. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. మాచర్ల దాడుల వెనుక ఫ్యాక్షనిస్టులు ఉన్నారని, వారు రాజకీయ పార్టీల అండతో రెచ్చిపోతున్నారని స్పష్టం చేశారు. టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మాచర్లకు చేరుకోవాలని టీడీపీ పిలుపునిచ్చినట్లు సమాచారం అందిన నేపథ్యంలో హెచ్చరించారు. ఎవరైనా వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
‘ఈ గొడవలో పాల్గొన్న వారందరి బ్యాగ్రౌండ్ ఫ్యాక్షన్‌కు చెందిన వారిగా గుర్తించాం. వెల్దుర్తి మండలంలో జరిగిన కొన్ని హత్యల్లో పాల్గొన్న వారు మాచర్లలో ఒక చోట చేరి మకాం వేశారు. వీరికి ఏదో ఒక పొలిటికల్ పార్టీ అండ కావాలి కాబట్టి, వారి సాయంతోనే చేసిన గొడవ ఇది. ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. అందరిని అరెస్ట్ చేస్తాం. రాడ్లు, బండలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవరూ మాచర్ల వైపు రాకుండా ఉండటమే మంచిది. రెండువైపుల అందిన ఫర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తున్నాం. ఈ గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.’ అని తెలిపారు ఎస్పీ రవిశంకర్.
ఇవీ చదవండి:
‘బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారు’
Comments
Please login to add a commentAdd a comment