సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో పచ్చమూకలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారు. గ్రామాలు వీడకుంటే పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలుచోట్ల హింస, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ మాజీ జడ్పీటీసీకి చెందిన బార్‌ను ధ్వంసం చేశారు. తాళాలు పగలగొట్టి మద్యం,నగదును టీడీపీ శ్రేణులు ఎత్తుకెళ్లారు.
చంద్రగిరిలో 11 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ మూకల దాడి
తిరుపతి: గత రెండు రోజులుగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో 11 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ పార్టీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారికి చంద్రగిరి మాజీ శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధైర్యం చెప్పారు."
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఆపదొచ్చిన ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఏక పక్షంగా వ్యవహరించే పోలీసులకు కోర్టు ద్వారానే సమాధానం ఇద్దామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.
గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా దాడులు చేయలేదని, తమకు ఆ సంస్కృతి లేదన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవ చేసామన్నారు. ఆపద అంటూ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్నామే తప్ప గత ఐదు సంవత్సరాలలో ఒక్క టీడీపీ కార్యకర్తకు కూడా హాని తలపెట్ట లేదన్నారు. గత ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం వారిపై దాడులు చేసుంటే ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ ఉండేవారు కాదన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment