Andhra Prabha
-
ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, పేపర్–4 పరీక్షలో కొన్ని ప్రశ్నలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేవని, కేవలం సమాచారం కోణంలో మాత్రమే ఉన్నాయని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆంధ్రా నిర్మాణ రంగ సంస్థలు, 1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చేసిన వాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం, విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించిన అంతర్జాతీయ సంస్థ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు తదితర ప్రశ్నలు రావడం పట్ల అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నల్లో వాస్తవాధారిత ప్రశ్నలు వచ్చాయని మరికొందరు అభ్యర్థులు చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రశ్న వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన కొత్త విగ్రహానికి సంబంధించినది కాకుండా పాత రూపురేఖల గురించి ఇవ్వడంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు. తెలంగాణ పోరాటయోధుడు వెలిచాల జగపతిరావుకు సంబంధించి రెండు ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ కోసం త్యాగం చేసిన మరికొందరికి సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చాయి. మొత్తంగా పేపర్–4 ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు మినహాయిస్తే మధ్యస్తంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. పేపర్–3 లో ప్రశ్నలు కష్టతరంగా...: ఎకానమీ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన ప్రశ్నల్లో చాలావరకు కష్టతరంగానే ఉన్నట్టు పరీక్ష రాసిన అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు చాలా లోతుగా ఉండడంతో వాటికి సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని, దీంతో చివరి వరకు సమయం చాలక ఆందోళనకు గురైనట్టు వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రశ్నల్లో నాణ్యత పెరిగిందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండ్రోజులపాటు నాలుగు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలిరోజు(ఆదివారం) జరిగిన రెండు పరీక్షలకు కేవలం 2,55,490(46.30%) మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పేపర్–3 పరీక్షకు 2,51,738 (45.62%) మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్–4 పరీక్షకు 2,51,486(45.57%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ గణాంకాలు ప్రాథమికంగా మాత్రమే నని, ఓఎంఆర్ షీట్లు పూర్తిస్థాయిలో అందిన తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్ తెలిపారు. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
విశాఖ డ్రగ్స్ కేసుపై పచ్చ మంద కిక్కురు మనదేం?
నిజం నిలకడ మీద కానీ తెలియదంటారు. రాజకీయ నాయకులు కొంతమందికి ఈ విషయం బాగా తెలిసినట్టు ఉంది. ఈ ధైర్యంతోనే వాళ్లు వదంతులు, అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి సఫలం అవుతుంటారు. ఎక్కువసార్లు జరిగేది ఇదే. అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సరితూగ గలిగే వాళ్లు ఇంకొకరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతోనే పోటీపడుతున్నారు. ఏ ఘటనలోనైనా తమవారి తప్పుందని తెలిస్తే దాన్ని వెంటనే ప్రత్యర్దిపైకి నెట్టేయడం వీరి శైలి. అనుకూల మీడియా ఒకటి వీరికి అండగా నిలుస్తోది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే చందమీ పచ్చ మీడియా. వందల అబద్దాలు వ్యాప్తి చేయడంలో వీరిదో రికార్డు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అబద్దాల విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని కూడా ఆయన అసత్యాల ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా తీర్చిదిద్దినట్లున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీ బ్రెజిల్ నుంచి వీటిని దిగుమతి చేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది కూడా. ఈ వార్త వచ్చిందో లేదో.. టీడీపీ వెంటనే రంగంలో దిగిపోయింది ఆ డ్రగ్స్ వైసీపీ వారివేనని ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ చేసిన ట్వీట్లు చూస్తే... ఇంత నీచంగా కూడా ప్రచారం చేయవచ్చా? అనిపించకతప్పదు. వైసీపీ పేరును వక్రీకరిస్తూ ‘యువజన కొకైన్ పార్టీ’ రాసింది. అక్కడితో ఆగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది. ‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి’’ అని, ‘‘నాడు తాలిబన్ టు తాడేపల్లి. 2021 విజయవాడలో రూ.21 వేల కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ తాడేపల్లి.. 2024విశాఖలో రూ.1.60 లక్ష కోట్ల కొకెన్’’ అంటూ ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవమని టీడీపీకి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా తెలుసు. రాజకీయం కోసం ఏమైనా చేయాలన్నది వారి థియరీ. ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చన్నది వారి అభిమతం. అదే ప్రకారం వారితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని ఎల్లో మీడియాగా మార్చేసి, ఎలాంటి నీతి,విలువలు లేకుండా తెలుగుదేశం పక్షాన పని చేయించారు. పచ్చి అబద్దాలైనా, ఏమో నిజం ఉందేమో! అన్నట్లుగా వీరు కథలు ఇచ్చేస్తుంటారు. ఇవి చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుంటారు.ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా వీరి ట్రెండ్ ఇదే. విశాఖ డ్రగ్స్ పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా పోటీ పడి అబద్దపు ప్రసంగాలు చేశారు. పవన్ కళ్యాణ్ దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి విశాఖకు హెరాయిన్ వచ్చిందని ఉపన్యాసం చేస్తే, బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పేశారు. తీరా సీబీఐ విచారణలో తేలింది ఏమిటంటే సంబంధిత కంటైనర్‌లో డ్రగ్స్ లేవని!! దీనిపై టీడీపీ ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ కిక్కురుమంటే ఒట్టు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సీబీఐ కూడా ఎన్నికలకు ముందు మౌనం పాటించి, ఎన్నికలైన ఆరు నెలలకు తాపీగా విశాఖ పోర్టులోకి వచ్చింది డ్రగ్స్ కాదని తెలిపింది. ఈ విషయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి కుట్రలు చేసి ఉండవచ్చన్న డౌట్ చాలా మందిలో ఉంది. అదే క్రమంలో సీబీఐ కూడా పని చేసిందేమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చాక అయినా, ఇంత నీచమైన ఆరోపణలు చేశాం కదా..వాటిని ఉపసంహరించుకుంటున్నాం..అని కూటమి నేతలు ఎక్కడా చెప్పరు.అప్పట్లో ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంస్థ టీడీపీకి సంబంధించిన వారిదని వార్తలు వచ్చాయి. దాన్ని తోసిపుచ్చడానికి ఆ కంపెనీ యజమాని సోదరుడు వైసీపీ వాడంటూ మరో వాదనను టీడీపీ మీడియా వారు తెరపైకి తెచ్చారు. అంతేకాదు. సీబీఐ కోరిక మేరకు వారికి సహకరించడానికి అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు వెళ్లారు. వెంటనే ఎల్లో మీడియా డ్రగ్స్ కేసును మేనేజ్ చేయడానికే వెళ్లారని కల్పిత కథనాలు వండేశారు. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో అబద్దపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిపై పెడుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో టీడీపీ, జనసేనలు చేసిన దారుణమైన అసత్యాలపై ఎంత తీవ్రమైన కేసులు పెట్టి ఉండాలో! కాని అప్పట్లో అలా చేయలేదు. మరీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎవరిపైన అయినా ఒకటి, అరా కేసులు పెడితే, వెంటనే మీడియాపై దాడి అంటూ విపరీతమైన ప్రచారం చేసేవారు. అదే ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న దాడిని సమర్థిస్తూ, వారిని సైకోలుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఘోరమైన పోస్టులు పెట్టిందని వైసీపీ వారు ఆధార సహితంగా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు తాము కోర్టులలో ప్రైవేటు కేసులు వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలలో అసత్యాలే ప్రామాణికంగా పని చేసుకుంటూ రాజకీయ నేతలు వెళితే సమాజం కూడా అలాగే తయారవుతుంది. ప్రస్తుతం ఏపీలో సమాజం అటువైపు పయనిస్తోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(బుధవారం) 67,626 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 22,231 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లుగా లెక్క తేలింది. -
‘నేను వైఎస్సార్సీపీని వీడేది లేదు’
సాక్షి, తాడేపల్లి: పార్టీ మారుతున్నట్టు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. ఈ సందర్భంగా తాను వైఎస్సార్సీపీని వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై మండిపడ్డారు...వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి పార్టీ మారుతున్నారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎంపీ రఘునాథ్ రెడ్డి స్పందిస్తూ..‘ఇదంతా తప్పుడు ప్రచారం. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నేనే వైఎస్సార్సీపీని వీడేది లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తాను. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం కొనసాగుతుంది. నాపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అచ్యుతాపురం ఘటన: మళ్లీ మొదటికొచ్చిన రూ.కోటి పరిహారం వ్యవహారం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్నుసూపరింటెండెంట్ మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చేవరకు మృతదేహాలను తీసుకువెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరీ వీడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఇదిలా ఉంటే.. కోటి రూపాయల పరిహారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే రూ. కోటి చెక్కు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు వెళ్లిన తర్వాత అధికారులు మాట మర్చారు. డెడ్‌బాడీలను ఇంటికి తీసుకెళ్లే సమయంలో దారి ఖర్చులకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తామని అధికారులు అంటున్నారు. రూ కోటి పరిహారం ఇస్తేనేగాని ఇంటికి తీసుకెళ్లమంటున్న బంధువులు.. రూ.10 వేల కోసం కుక్కర్తి పడేవాళ్లలా కనిపిస్తున్నామా అంటూ నిలదీశారు.మరీ ఇంత నిర్లక్ష్యమా!?కాగా, ఎక్కడో మదనపల్లిలో ఓ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఫైళ్లు దగ్ధమైతేనే ఏదో భారీ ఉపద్రవం ముంచుకొచ్చినట్లు హడావిడి చేసి, ఆగమేఘాల మీద హెలికాఫ్టర్‌లో డీజీపీని పంపి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. విశాఖలో ఇంత పెద్ద ప్రమాదం సంభవిస్తే, ఇంత మంది ప్రాణాలు పోతే స్పందించకుండా తాపీగా ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేస్తూ కూర్చోవడం విమర్శలకు తావిస్తోంది.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ, తనను మించిన విజనరీ, సమర్థుడు ఈ దేశంలోనే లేడని తనకు తానే డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రియాక్టర్ ప్రమాద ఘటనలో మాత్రం చతికిలబడ్డారు. చంద్రబాబు పరిపాలనలో బేలతనం ఈ దుర్ఘటనతో స్పష్టంగా బయటపడింది.మధ్యాహ్నం 2 గంటల సమయంలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలోనే హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా సహాయక చర్యలపై వారితో సీఎం చంద్రబాబు సమీక్షించలేదని తెలిసింది. చంద్రబాబు సీఎం సమీక్ష అనంతరం కూడా సచివాలయంలోనే ఉన్న హోం మంత్రి అనిత.. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు.అచ్యుతాపురం ఘటనపై ఆమె కనీసం స్పందించ లేదు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రమాదంలో మృతుల వివరాలు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. అంతెందుకు రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. సచివాలయంలోనే ఉన్నా, హోం మంత్రి, డీజీపీలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అర్ధరాత్రయినా ప్రమాద స్థలానికి మంత్రులుగానీ, ఉన్నతాధికారులుగానీ చేరుకోలేదు. ప్రెస్ నోట్లు, మీడియాలో దిగ్భ్రాంతులకే పాలనా యంత్రాంగం పరిమితమైంది. -
మాధవీరెడ్డి దుందుడుకు చర్య.. కమిషనర్ తేజ్ భరత్ విముఖత
సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో సరికొత్త సంప్రదాయం కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో సాధింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. ప్రజాస్వామ్యం స్థానంలో నియంత పాలన నడుస్తోంది. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రజలంతా ఒక్కటే అన్న స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. మీరు మాకు ఓటేశారా? మీరు ఫలానా పార్టీ కదా? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా కడపకు అధికారులు విధుల్లో చేరాలంటే వెనుకంజ వేస్తున్నారు. ఆమేరకు రెండు వారాలైనా కమిషనర్‌గా నియమితులైన తేజ్ భరత్ బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.⇒ కడప కమిషనర్‌గా సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సమర్థవంత అధికారిగా తక్కువ కాలంలో గుర్తింపు పొందారు. అనంతరం తనదైన శైలిలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర పాలకమండలిని సమన్వయం చేసుకుంటూ ప్రధాన సర్కిల్స్ విస్తరణ, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రహదారుల వృద్ధి, డ్రైనేజీ వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టేందుకు కృషి చేశారు. కాగా టీడీపీ సర్కార్ జూలై 20న అమరావతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్థానంలో ఐఏఎస్ అధికారి తేజ్ భరత్‌ను నియమించారు. రెండు వారాలు గడిచినా ఆయన బాధ్యతలు చేపట్టేలేదు. నూతన కమిషనర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక కడప నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రాతినిథ్యంలో పాలకమండలి ఉండడం ఒకే ఒక్క కార్పోరేటర్ మాత్రమే టీడీపీ పరిమితం కావడం, పైగా స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి దుందుడుకు చర్యలు వెనుకంజకు ప్రధాన కారణంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రొటోకాల్‌కు విరుద్ధ నిర్ణయాలు ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఆయన కడపకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని సహచర సన్నిహితులతో వెల్లడించినట్లు తెలుస్తోంది.అధికారుల్లో విస్మయంఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్ష చర్యలతో అనతికాలంలోనే కడప నగరంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాల్లో అనవసర జోక్యమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ప్రథమ పౌరుడు అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యులే అన్న స్పృహ అసలే లేదు. ఈపరిస్థితులను పరిశీలిస్తున్న అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష చర్యలతో ఎంతోకాలం మనుగడ సాధించలేమని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్‌గా విధుల్లో చేరేందుకు తేజ్ భరత్ విముఖత వ్యక్తం చేయడంపై స్థానికంగా అధికారులు సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ విముఖత విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఆర్డీఓ ఒకర్ని సంప్రదించినట్లు సమాచారం. తొలుత సుమఖత చూపిన ఆర్డీఓ విషయాలు తెలుసుకున్న తర్వాత వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమిషనర్ అన్వేషణలో టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. -
కలెక్టర్ సీసీ లైంగికంగా వేధిస్తున్నాడు
నరసరావుపేట: కలెక్టర్ బంగ్లాలో పనిచేస్తున్న తనపై క్యాంపు క్లర్క్ (సీసీ)గా వ్యవహరిస్తున్న జానీబాషా లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని ముద్దా నాగమణి ఆరోపించింది. ఈ మేరకు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావులకు ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడింది. తాను పెద్దచెరువులోని కలెక్టర్ బంగ్లాలో రెండేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్నానని, సీసీగా జానీబాషా వచ్చిన దగ్గర నుంచి తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. తాను నాలుగైదు నెలలుగా జీతాలు లేకుండా పనిచేశానని, గత కలెక్టర్ ఎల్.శివశంకర్ తనను అప్కాస్‌లో ఉద్యోగిగా చేర్చారన్నారు. ఏడాది క్రితం కలెక్టర్ బంగ్లాకు సీసీగా వచ్చిన జానీబాషా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించాడన్నారు. గత ఆరు నెలల నుంచి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, ఒక నెల నుంచి తనను ఉద్యోగం చేయకుండా ఆపేశారన్నారు. టీ ఇచ్చే సమయంలో తన చేయి పట్టుకొని లాగటం చేసేవాడన్నారు. తానంటే ఇష్టమని చెబుతూ.. రూం బుక్ చేశాను రమ్మంటూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.అయినా అతనికి లొంగనందువల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించాడని చెప్పారు. అదే బంగ్లాలో తన సోదరుడు కూడా పనిచేస్తున్నాడని, సీసీ చేస్తున్న పనులను గురించి అతనికి చెప్పానని, దీనిపై సీసీని అడిగితే నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటానని, జరిగిన విషయం ఎవరికై నా చెబితే మీ ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించాడన్నారు. వారం రోజుల క్రితం కలెక్టరేట్లో డీఆర్ఓకు తాను ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదన్నారు. ఇప్పటికై నా తనకు లొంగితే నీకు, నీ తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడన్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలకు విన్నవించేందుకు వచ్చానని ఆమె తెలిపారు. -
బ్యాంక్‌కు బురిడీ.. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రెడీ
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇండియన్ బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేయడానికి ఆ బ్యాంక్ సిద్ధమైంది.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 409 కోట్లు రుణం తీసుకున్న గంటా అండ్ కో ఎగ్గొట్టింది.తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగష్టు 8న సంబంధిత ఆస్తులు వేలం వేస్తామని పత్రిక ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. లోన్‌కు టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా మరో 8 మంది హామీదారులు ఉండగా, రుణాలు తీసుకోవడం.. తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడాన్ని టీడీపీ నేతలు అలవాటుగా చేసుకున్నారు. -
కట్టుకున్నవాడే కడతేర్చాడు..
గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేటలో ఇటీవల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అది ఆత్మహత్య కాదు...హత్య అని తేల్చారు. కట్టుకున్న భర్తే భార్యను అమానుషంగా చంపడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు శనివారం స్థానిక గజపతినగరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగారమ్మపేటకు చెందిన నక్కా జగదీష్‌కు అదే గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (తనూజ)తో మూడు నెలల కిందట వివాహం జరిగింది. మొదట్లో వీరి కాపురం సజావుగా సాగినా, జగదీష్‌కు అనుమానం ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. అక్కడకు కొద్ది రోజుల తర్వాత అనూషను కన్నవారింటిలో ఉంచి జగదీష్ ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ నెల 16న గ్రామానికి వచ్చిన జగదీష్ అనూషకు ఫోన్ చేసి ఇంటి సమీపంలో ఉన్న పశువుల శాల వద్దకు రమ్మన్నాడు. దీంతో ఆరోజు (ఆదివారం) రాత్రి అనూష తన ఇంటి సమీపంలోని పశువులశాల వద్దకు రాగా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన జగదీష్ భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి వేశాడు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బోని ప్రసాద్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అనూష సెల్ నుంచి ఆమె తండ్రి, సోదరుడు, స్నేహితురాళ్లతో పాటు తన సెల్‌కు కూడా జగదీష్ మెసేజ్‌లు పంపించాడు. దీంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బోని ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. అతను నేరం చేయలేదని తేలింది. ఈ పరిస్థితుల్లో భర్త జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు విషయం బయట పడింది. భార్యను తనే హత్య చేసినట్లు జగదీష్ ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.బోని ప్రసాద్ ఇంటిపై దాడితన కుమార్తె మృతికి కారణమనే అపోహతో అనూష తండ్రి, కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడి చేసి అతని తండ్రి గోవిందరావుపై దాడి చేశారు. దీంతో గోవిందరావు ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో స్థానిక సీఐ ఎన్వీ ప్రభాకరరావు, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘మంత్రి’ దండం దక్కేనా!
సాక్షి, నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగియడంతో ప్రస్తుతం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాజకీయాల్లో మంత్రి పదవులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. వాటి కోసం పోటీ పడే ఆశావహుల లిస్ట్ కూడా పెద్దదే. మంత్రి పదవుల కోసం వేయి కళ్లతో ఎదురు చూసే నాయకులతోపాటు నియోజకవర్గాలు ఉంటాయండోయ్.. నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమాత్యయోగం లేని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఇప్పటి వరకు గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు మంత్రి పదవులు దక్కలేదు. ప్రస్తుతం కొత్త క్యాబినెట్ ఏర్పడనున్న నేపథ్యంలో ఈ దఫాలోనైనా ఆ నియోజకవర్గంలో నెగ్గిన ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందేమోనన్న చర్చ జరుగుతోంది. 👉గురజాల నియోజకవర్గం 1955లో ఏర్పడింది, అంతకుముందు ఈప్రాంతం బెల్లంకొండ నియోజకవర్గం పేరుతో ఉండేది. 1955లో కేఎల్పీ(కృకార్ లోక్‌పార్టీ) తరఫున గెలిచిన ఎంబీ చౌదరీ మొదలు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఒక్కరూ మంత్రి పదవి పొందలేదు. ఈ నియోజకవర్గంలో కొత్త వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి రెండు సార్లు, యరపతినేని శ్రీనివాసరావు మూడుసార్లు గెలిచినా మంత్రి పదవి రాలేదు. తాజా ఎన్నికల్లో యరపతినేని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందేమోనన్న చర్చ గురజాలలో జరుగుతోంది. అయితే గురజాల వాసి డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాత్రం తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు. 👉పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఎవరూ మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. 1955 నుంచి 2009 ఎన్నికల వరకు ఏ నాయకుడూ రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. ఈ కారణం వల్లే మాచర్ల నుంచి మంత్రి లేరన్న వాదన ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. 2019లో వరుసగా నాలుగోసారి విజయం సాధించడం, వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో పిన్నెల్లికి, మాచర్లకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల నేప«థ్యంలో అది సాధ్యం కాలేదు. ప్రభుత్వ విప్‌గా పిన్నెల్లి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో జూలకంటి బ్రహా్మరెడ్డి అధికార పార్టీ టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టు సమాచారం. మరి అమాత్య పదవి వస్తుందేమో వేచి చూడాలి. ఆ నియోజకవర్గాల నుంచి మంత్రులుసత్తెనపల్లిది మాత్రం విచిత్రమైన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకష్ణయ్యకూ మంత్రి పదవి దక్కలేదు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నన్నపనేని రాజకుమారి మాత్రం 1984లో నెలరోజులపాటు నాదెండ్ల భాస్కరరావు క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచినా టీడీపీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవితో సరిపెట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ క్యాబినెట్లో సత్తెనపల్లి నుంచి ప్రాతినథ్యం వహించిన అంబటి రాంబాబు జలవనరులశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు గెలిచిన ఏ అభ్యరి్థకీ మంత్రి పదవి దక్కలేదు. 2014లో నూతన రాష్ట్ర తొలి క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావును మంత్రి పదవి వరించింది. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విడదల రజిని మంత్రిగా చేశారు. వినుకొండ నుంచి 1967, 72 ఎన్నికల్లో గెలిచిన భవనం జయప్రద పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పెదకూరపాడు నుంచి గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట నుంచి కాసు బ్రహా్మనందరెడ్డి, కృష్ణారెడ్డి, కోడెల శివప్రసాద్ మంత్రులుగా పనిచేశారు. -
నరసరావుపేటలో పేట్రేగిపోయిన పచ్చమూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో పచ్చమూకలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారు. గ్రామాలు వీడకుంటే పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలుచోట్ల హింస, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. నరసరావుపేటలో వైఎస్సార్సీపీ మాజీ జడ్పీటీసీకి చెందిన బార్‌ను ధ్వంసం చేశారు. తాళాలు పగలగొట్టి మద్యం,నగదును టీడీపీ శ్రేణులు ఎత్తుకెళ్లారు.చంద్రగిరిలో 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ మూకల దాడి తిరుపతి: గత రెండు రోజులుగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ పార్టీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారికి చంద్రగిరి మాజీ శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధైర్యం చెప్పారు."ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఆపదొచ్చిన ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఏక పక్షంగా వ్యవహరించే పోలీసులకు కోర్టు ద్వారానే సమాధానం ఇద్దామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా దాడులు చేయలేదని, తమకు ఆ సంస్కృతి లేదన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవ చేసామన్నారు. ఆపద అంటూ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్నామే తప్ప గత ఐదు సంవత్సరాలలో ఒక్క టీడీపీ కార్యకర్తకు కూడా హాని తలపెట్ట లేదన్నారు. గత ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం వారిపై దాడులు చేసుంటే ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ ఉండేవారు కాదన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. -
కౌంటింగ్ రోజున అల్లర్లకు టీడీపీ కుట్రలు: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నవరత్నాల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి కోరారు. అనంతరం మీడియాతో మల్లాది విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.కౌంటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజాతీర్పును మార్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని మల్లాది విష్ణు హెచ్చరించారు. సజ్జలపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్‌డ్రా చేసుకోవాలన్నారు. -
సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వై ఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ పేర్కొంది.అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని.. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. -
వసూళ్లు ‘కాలువై’ పారాయి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీకి తీరని శాపంలా పరిణమించిన అంతర్గత విభేదాలు ఒక వైపు..కీలక నేత వసూళ్ల పర్వం మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత..జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకుల నుంచి చేపడుతున్న వసూళ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ‘మీకు టికెట్ ఇప్పిస్తాను, ముందు కొంత సొమ్ము తీసుకురండి’ అంటూ చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల నుంచి కోటి రూపా యల వరకూ ఇచ్చిన వారు కొందరు, మరి కొంత మంది దగ్గర ‘కోటి రూపాయలుంటే ఇవ్వు తర్వాత చూద్దాం’ అంటూ చేబదుళ్ల రూపంలో ఇచ్చిన వాళ్లు కొందరు..ఇలా పలువురు డబ్బులిచ్చి ఇప్పుడు టికెట్ వచ్చే అవకాశమూ లేక, డబ్బులూ వెనక్కు రాక ఆందోళనలో ఉండిపోయారు. డబ్బు అడిగితే.. టూమెన్ కమిటీ శింగనమలకు చెందిన ఓ మహిళా నేత ముఖ్యనేతకు అప్పు అనుకుని కోటి రూపాయలు ఇచ్చారు. కొద్దిరోజులకు తిరిగి డబ్బు అడగ్గానే సదరు నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీని వేశారు. దీంతో ఆ మహిళా నేత తన వర్గం నాయకుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను అప్పుగా ఇచ్చానని, తిరిగి డబ్బు అడిగినందుకు తనను నియోజకవర్గంలో టికెట్‌కు దూరం చేశారని చెబుతున్నారు. టూమెన్ కమిటీ ఎవర్ని ఎంపిక చేస్తే వారినుంచి తిరిగి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని శింగనమల టీడీపీ నాయకులు చెబుతున్నారు. టూమెన్ కమిటీలో ఉన్న ఒకరు రియల్ ఎస్టేట్‌లో చాలామందికి డబ్బు ఎగ్గొట్టినట్టు మహిళా నేత వర్గానికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో భారీగా దందా.. ఒక్క శింగనమల నియోజకవర్గమే కాదు..పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని పలు నియోజకవర్గాల్లో వసూళ్లు చేసినట్టు తెలుగుదేశం నాయకులే వాపోతున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో కొంతమంది నుంచి రూ.30 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో పాటు పలువురికి ఎంపీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వసూళ్లు చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ఒప్పించి మీకు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పిస్తానని సుమారు ఏడెనిమిది మందికి హామీ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది. మాకు టికెట్ ఇప్పించకపోతే అసలు విషయం బయటకు చెబుతామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తూ భారీ నష్టం చేకూరుస్తున్న నేతకు చాలామంది వ్యతిరేక వర్గం తయారైంది. టికెట్లు ప్రకటించే సమయంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నంటూ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
వైయస్ఆర్ కాపు నేస్తం, పింఛనుతోనే నేను, మా అమ్మ బ్రతుకుతున్నాం
-
ఈ సభా సాక్షిగా..అయ్యన్న పని అయిపాయె
-
లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగనుందని ప్రముఖ వార్తా చానల్ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగనుందని, కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ విజయం ఖాయమని సర్వే తేల్చింది. బీజేపీ కూటమికి 292 నుంచి 338 స్థానాలు రావచ్చని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 వరకు, ఇతరులకు 66 నుంచి 96 దాకా సీట్లు లభిస్తాయని తెలిపింది. బీజేపీ కూటమికి 38.2 శాతం, కాంగ్రెస్ కూటమికి 28.7, ఇతరులకు 33.1 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీ నిస్సందేహంగా 300 పై చిలుకు స్థానాలు గెలుస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది, కష్టమని 26 శాతం, ఎన్నికల నాటికే దీనిపై స్పష్టత వస్తుందని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. 13 శాతం ఏమీ చెప్పలేమన్నారు. మోదీ 2.0 పాలన తీరు అత్యంత సంతృప్తికరంగా ఉందని ఏకంగా 51 శాతం మంది చెప్పారు! చాలావరకు సంతృప్తికరమేనని 16 శాతం, ఓ మాదిరిగా ఉందని 12 శాతం చెప్పగా, బాలేదని 21 శాతం బదులిచ్చారు. మోదీ సర్కారు అతి పెద్ద వైఫల్యం ద్రవ్యోల్బణమని 34 శాతం, నిరుద్యోగమని 46 శాతం మంది పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తేలేకపోవడమని 13 శాతం, చైనా దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యమని 7 శాతం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో పడ్డాయా అన్న ప్రశ్నకు 41 శాతం మంది లేదని బదులిచ్చారు. చాలాసార్లు అలా అన్పించిందని 21 శాతం, అది విపక్షాల దృక్కోణమని 14 శాతం, ఏమీ చెప్పలేదని 24 శాతం అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 20 నుంచి 22 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 నుంచి 13 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ‘ప్రధాని’గా మోదీకి పోటీయే లేదు అత్యంత శక్తిమంతుడైన ప్రధాని అభ్యర్థిగా మోదీకి 64 శాతం మంది ఓటేశారు. రాహుల్‌కు 13, కేజ్రీవాల్‌కు 12, నితీశ్‌కు 6, కేసీఆర్‌కు 5 శాతం ఓట్లొచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో విపక్షాల సారథిగా రాహుల్‌కు 29 శాతం, కేజ్రీవాల్‌కు 19, మమతకు 13, నితీశ్‌కు 8, కేసీఆర్‌కు 7 శాతం ఓట్లొచ్చాయి. 2024 ఎన్నికలకు ముందే విపక్షాలు ఒక్కటవుతాయని 31 శాతం, లేదని 26 శాతం, ఎన్నికల అనంతర పొత్తులుండొచ్చని 26 శాతం అన్నారు. రాహుల్‌పై వేటు కాంగ్రెస్‌కు లాభించదు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు కాంగ్రెస్‌కు ఎన్నికల్లో పెద్దగా లాభించదని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. అది కేవలం న్యాయపరమైన అంశమని వారన్నారు. ఈ అంశానికి జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతేమీ ఉండదని మరో 11 శాతం మంది అన్నారు. 23 శాతం మంది ఇది రాహుల్‌కు సానుభూతి తెస్తుందని చెప్పగా 27 శాతం ఏమీ చెప్పలేమన్నారు. దొంగలందరికీ ఇంటిపేరు మోదీయే ఎందుకు ఉంటుందంటూ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేసినందుకు పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, తర్వాత 24 గంటల్లోపే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, ఇది కక్షసాధింపని కాంగ్రెస్, విపక్షాలు దుయ్యబట్టడం తెలిసిందే. ఇదీ చదవండి : పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1.. గుజరాత్ అధిగమించి సత్తా! ఇదీ చదవండి : బాబు దయనీయ స్థితికి అద్దం పడుతున్న ఉపన్యాసాలు! -
చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
ఏపీలో కొత్తగా 1,501 కరోనా కేసులు..
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,501 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 10 మంది మృతి చెందారు. తాజాగా 1,697మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,69,169మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం రాష్ట్రంలో 13,696మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,03,366 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
నంబర్ 1 ధర: మసూరి బువ్వ.. నేటికీ వారెవ్వ!
ఆ రోజుల్లో తెల్లబువ్వ అపురూపం. వరి అన్నాన్ని ‘ఆబువ్వ’గా.. బెల్లపు అన్నాన్ని ‘సాంబువ్వ’గా పరిగణిస్తున్న రోజులవి. బియ్యం వండుకునే అవకాశం కొందరికే పరిమితమైన ఆ రోజుల్లో వరి సాగును విస్తృతం చేయాల్సిన, అధిక దిగుబడి ఇచ్చే వంగడాల్ని రపొందించాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై పడింది. ఆ కృషి ఫలించి వచ్చిందే సాంబ మసూరి (బీపీటీ–5204). సాక్షి, అమరావతి: సంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడుల్చిన వంగడం సాంబ మసరి (బీపీటీ–5204). వరి చరిత్రలో ఇదో సంచలనమే. ఈ వంగడం పురుడు పోసుకున్నది గుంటరు జిల్లా బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే అయినా.. దాని సృష్టికర్త మాత్రం అనంతపురం జిల్లా కదిరి తాలకా ఎద్దులవారి పాలెం గ్రావనికి చెందిన డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (డాక్టర్ ఎంవీ రెడ్డి). 1921లో విడుదల చేసిన కిలీ సాంబగా పిలిచే జీఈబీ–24, తైచుంగ్ (నేటివ్)–1, మసరి రకాలను సంకరం చేసి ప్రతిష్టాత్మక వరి వంగడం బీపీటీ–5204ను అభివృద్ధి చేశారు. 1986లో సాంబ మసరి పేరిట విడుదలైన ఈ రకం వరి రైతుల విశేష ఆదరణ పొందింది. ఎలా రూపొందించారంటే.. ► తొలుత జీఈబీ 24, తైచుంగ్ నేటివ్–1 వరి వంగడాలను సంకరపరిచారు. ► వీటినుంచి వచ్చిన రెండో సంతతి (ఎఫ్–2 జనరేషన్)లో మంచి మొక్కలను ఎంపిక చేసి.. వాటిని మసూరి వంగడంతో సంకరం చేశారు. ► వీటినుంచి వచ్చిన సంతతిని జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ పద్ధతిలో పరీక్షించి వాటిలో మేలైన వేలాది మొక్కల్ని మరో చేలో నాటి ప్రతి మొక్కకూ పరీక్ష జరిపారు. ► లక్ష్యానికి దగ్గర్లో ఉన్న మొక్కల్ని మరో చేలో నాటి తుది వంగడం తయారు చేశారు. మొత్తంగా ఈ వంగడం అభివృద్ధి చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. ► ఈ వంగడం తయారీలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి (ఎంవీ రెడ్డి) కాగా.. ప్రొఫెసర్ నందేల శ్రీరామ్‌రెడ్డి, ఎల్వీ సత్యనారాయణ, డాక్టర్ డి.సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్డీవీ ప్రసాద్ పాలుపంచుకున్నారు. ఆ బృందానికి వ్యవసాయాధికారి బుచ్చయ్య చౌదరి సహకారం అందించారు. ► ఈ విత్తనాలు 1986 ఖరీఫ్ సీజన్లో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ► సాంబ మసరి రకానికి ఆయా ప్రాంతాలను బాపట్ల మసరి, ఆంధ్రా మసరి, కర్నలు సోనా, జీలకర్ర మసరి, సీరగ పొన్ని వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడి.. దేశవ్యాప్తంగా బీపీటీ–5204 వంగడం పేరు మార్మోగింది. నాణ్యత, అధిక దిగుబడి, అద్భుతమైన రుకరమైన ఆహారంగా పేరొందింది. దేశవ్యాప్తంగా 40 లక్షల హెక్టార్లలో బీపీటీ–5204 రకం సాగు కావడం విశేషం. ఎకరానికి 15, 20 బస్తాల మిం పండని దశలో సాంబ మసరి ఎకరానికి 35, 40 బస్తాల దిగుబడిన్చింది. ఈ వంగడం నాణ్యత దృష్ట్యా రైతులకు లాభదాయకమైన ధర కూడా లభింంది. ఈ వంగడంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఐసీఏఆర్, ఐఆర్ఆర్ఐ (మనీలా) సంస్థలు సాంబ మసూరిని విటమిన్–ఏతో కలిపి పోర్టిఫైడ్ చేసి గోల్డెన్ రైస్ పేరిట విడుదల చేసేందుకు సహకరించాయి. బీపీటీ 5204 వంగడాన్ని ఉపయోగించుకునే ఆ తర్వాత చాలా యూనివర్శిటీలు, అంతర్జాతీయ సంస్థలు పరిశోధనలు చేయడం గమనార్హం. ప్రపంచ దేశాల్లోనూ ఖ్యాతి బియ్యాన్ని తినే ఏ ప్రాంతానికి.. ఏ దేశానికి వెళ్లినా ముందు వినిపించే పేరు సాంబ మసరి. ఈ బియ్యం ఎగుమతితో భారత దేశానికి విదేశీ మారక ద్రవ్యం పెరిగింది. దేశీయంగా రైతుల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇప్పటికీ మార్కెట్లో నంబర్ వన్ ధర దేనికైనా లభిస్తుందంటే అది సాంబ మసరి వత్రమే. మార్కెట్లోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా బీపీటీ–5204 రకం పేరు ప్రతిష్టలు పెరిగాయే తప్ప తరిగిపోలేదు. -
విజిలెన్స్ దాడులు.. ఆరు ఆస్పత్రులపై కేసులు
విజయవాడ: ఏపీలో వరుసగా పలు ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులలో పలు ఆసుపత్రులపై కేసులను నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 6 ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఒక ఆస్పత్రిపై అధిక ఫీజులు వసూలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పుత్తూరు సుభాషిణి ఆస్పత్రిపై ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి నిరాకరించినందుకు కేసును నమోదు చేశారు. విజయవాడలోని వేదాంత ఆస్పత్రి , శ్రీకాకుళం లోని సూర్యముఖి ఆస్పత్రులు పేషెంట్లు స్వంతంగా రెమిడిసివర్ తెచ్చుకోవాలని పట్టుబట్టడంతో వాటిపై కూడా కేసులను బుక్ చేశారు. కాగా కడప జిల్లా సిటీ కేర్ ఆస్పత్రి కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసింది. పైగా వాటికి బిల్లులు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రతి ఆస్పత్రులపై కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
ఏపీలో కొత్తగా 8,987 కరోనా కేసులు..
అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 37,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన 35 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 3,116 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 9 లక్షల 15వేల 626 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 53,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,57,53,679 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. -
ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు!
అమరావతి: ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 35,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,582 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన 22 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 2,343 మంది క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 9 లక్షల 7వేల 598 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 44,686 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,56,77,992 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. చదవండి: కనీసం 15 రోజులు లాక్డౌన్! -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీలు రద్దు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీలను రద్దు చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న అన్ని లీగల్ సెల్ కమిటీలను రద్దు చేసింది. వారి స్థానంలో కొత్త కమిటీలను నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తాజా నియమాకాల ప్రకారం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్. మనోహర్‌రెడ్డి నియమితులైయ్యారు. ఆయనతో పాటు మరో నలుగురు (పి.వెంకట్ రెడ్డి, జి.వాసుదేవరెడ్డి, టి.శంభుప్రసాద్, కే.రవికుమార్) సభ్యులకు రాష్ట్ర కమిటీలో చోటుకల్పించారు. (పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి)