
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కమిటీలను రద్దు చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న అన్ని లీగల్ సెల్ కమిటీలను రద్దు చేసింది. వారి స్థానంలో కొత్త కమిటీలను నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తాజా నియమాకాల ప్రకారం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్. మనోహర్‌రెడ్డి నియమితులైయ్యారు. ఆయనతో పాటు మరో నలుగురు (పి.వెంకట్ రెడ్డి, జి.వాసుదేవరెడ్డి, టి.శంభుప్రసాద్, కే.రవికుమార్) సభ్యులకు రాష్ట్ర కమిటీలో చోటుకల్పించారు. (పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment